17న అమ్మకు అన్నీ చెబుతా: జేసీ | Diwakar Reddy gets showcause notice for Sonia bashing | Sakshi
Sakshi News home page

17న అమ్మకు అన్నీ చెబుతా: జేసీ

Published Thu, Jan 2 2014 4:22 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Diwakar Reddy gets showcause notice for Sonia bashing

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు షోకాజ్ నోటీసు అందిందని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై తాను ఆరోపణలు చేశానని పేర్కొంటూ, వాటికి సంబంధించి జవాబు చెప్పాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారని తెలిపారు. జవాబు ఇవ్వడానికి ఎంత గడువు ఇచ్చారన్న దానిని పెద్దగా పరిశీలించలేదని చెప్పారు. వారం రోజులు గడువు ఇచ్చి ఉండొచ్చన్నారు. ఈ నెల 17న ఢిల్లీ ఏఐసీసీ సమావేశానికి హాజరై అమ్మకు అన్నీ వివరించి చెబుతానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement