సాక్షి, హైదరాబాద్: ఫోన్ కాల్ రికార్డ్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయ్యింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెంకట్‌రెడ్డి ఆడియో లీక్‌పై క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదుతో వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం మునుగోడు ఓటర్‌తో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరిన వెంకట్‌రెడ్డి ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
చదవండి: మునుగోడులో పోస్టర్ వార్
కాగా, మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ఓడితే.. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ అవుతానంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment