చంపుతమని  తిరుగుతున్నరు.. కోమటిరెడ్డి ఆడియో కలకలం!  | Congress MP Komatireddy Audio Leak warning To Cheruku Sudhakar | Sakshi
Sakshi News home page

నల్గొండ కాంగ్రెస్‌లో కలకలం.. కోమటిరెడ్డి ఆడియో లీక్‌!

Published Mon, Mar 6 2023 4:32 AM | Last Updated on Mon, Mar 6 2023 11:48 AM

Congress MP Komatireddy Audio Leak warning To Cheruku Sudhakar - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్‌ చెరుకు సుహాస్‌ను తన అభిమానులు చంపుతారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బెదిరించినట్లుగా ఉన్న ఆడియో లీక్‌ అయ్యింది. అసభ్యంగా వారిద్దరినీ దూషించినట్లున్న ఆ ఆడియో ఆదివారం కలకలం రేపింది. 

అసలు ఆడియోలో ఏముందంటే.. 
‘చూసినవా స్టేట్‌మెంట్‌.. (అంకుల్‌ అది వాట్సప్‌లో అట్ల ఇచ‍్చిండు కానీ ఆ వీడియో ఒకసారి మీరు పూర్తిగా చూడండి–ఎదుటి వ్యక్తి వాయిస్‌) ఏం చూసుడు. వాన్ని చంపుతమని తిరుగుతున్నరు. వంద మంది వెహికిల్‌ వేసుకొని తిరుగుతున్నరు. ఈ వీడియో కాదు నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజులు ఓపిక పట్టి ఇప్పుడు వంద కార్లలో వాణ్ని చంపుతమని తిరుగుతున్నరు. నిన్ను కూడా చంపుతరు.

నీ హాస్పిటల్‌ను కూడా కూలగొడుతరు. లక్షల మందిని బతికించిన నేను. వానికెంత ధైర్యం నిన్న మొన్న పార‍్టీలకొచ‍్చి.. వాణ్ని వదిలిపెట్టర్రా.. నేను చెబుతున్న నీకు, వార‍్నింగ్‌ ఇస్తున్న. నేను ఆపలేను .. క్షమించమని చెప్పి, నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్లు ఇచ్చిండు ఓపిక పట్టిండ్రు. సార్‌ మాతో ని కాదిగ, నువ్వేమో ఏమనొద్దంటున్నవ్‌ సార్‌.. మేము వెళ్లినం బయటికి, యాడ దొరికితే ఆడ చంపేస్తం అంటుండ్రు వాళ్లు. నా తోని కాదు.. వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తరు... అసోంటి వంద వీడియోలు, డైరెక్టు పేరు పెట్టి వందసార్లు తిట్టిండు వాడు. ఇప్పుడొక బ్యాచ్‌ వెళ్లింది. నిన్ను కూడా చంపుతరు చెబుతున్న అరేయ్‌... నీ హాస్పిటల్‌ నడువదు. 25 ఏళ్లలో లక్షల మందిని బతికించిన నేను. వారందరిని కంట్రోల్‌ చేస్తానా నేను. అతనికి ఫోన్‌ చేసి చెప్పు.. అరేయ్‌ నీకు పార్టీ ఉన్నదారా.. ఇంటిపార్టీ ఏందిరా.. నువ్వు కౌన్సిలర్‌గా గెల వవు.. ఆయన అంతపెద్ద లీడరు అని చెప్పు. వాడు జైళ్ల పడితే నేను ఒక్కడినే పోయిన. ఎవరూ పోలే అప్పుడు. చెప్పు.. వారంకంటే ఎక్కువుండడాడు’.

కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం 
డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ను, ఆయన కుమారుడిని చంపుతామంటూ బెదిరించినట్లుగా ఆడియో లీక్‌ నేపథ్యంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ గడియారం సెంటర్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేశారు. కాగా, ఎంపీ కోమటిరెడ్డిపై క్రిమినల్‌ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని బీసీ యువజన సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. 

దరిద్రుడు, చీడపురుగంటూ నన్ను తిట్టుడేంది: కోమటిరెడ్డి
కాంగ్రెస్‌ పార‍్టీలో చేరినప్పటినుంచి చెరుకు సుధాకర్‌ నాపై కామెంట్స్‌ చేస్తుండు. ఒకసారి దరిద్రుడని, మరోసారి చీడపురుగని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నడు. సోషల్‌ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నరని ఆయన కొడుకును అడిగితే పెడితేఏంది అంటూ వంకర టింకర మాట్లాడుతుండు. ఇది ఎంతవరకు కరెక్టు. పార‍్టీకి పని చేయాలి. నన్ను తిట్టుడేంది? 

నా కొడుకుకు ఫోన్‌ చేసి నన్ను తిట్టడం ఆశ్చర్యం కలిగించింది: చెరుకు సుధాకర్‌ 
వెంకట్‌రెడ్డి అసభ్యంగా నన్ను తిట్టడం అశ్చర్యం కలిగించింది. నేను కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, అతను స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉండి ఒకే పారీ్టలో పని చేస్తున్నా నాపై అత్యంత నేరపూరితమైన, టెర్రరిస్టు భాష మాట్లాడారు. ఆయనకు మతి ఉండి మాట్లాడుతుండో.. మతి లేక మాట్లాడుతుండో అర్థం కావడంలేదు. ఆడియో టేపును తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి పంపించా. కోమటిరెడ్డిని నేను వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు లేవు. నయీం లాంటి కరుడు గట్టిన తీవ్రవాదే నన్నేమీ చేయలేకయాడు. కోమటిరెడ్డి ఏం చేస్తాడు? ఈ వ్యాఖ్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement