CHERUKU Sudhakar
-
వారంతా కాంగ్రెస్ నిరంకుశంపై పోరాడిన వాళ్లే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నిరంకుశ విధానాలపై పోరాడిన వాళ్లంతా ఇప్పుడు బీఆర్ఎస్లో చేరుతు న్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వాఖ్యానించారు. బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులై వారంతా పార్టీలో చేరుతున్నారన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో చెరుకు సుధాకర్‌తోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరే కంగా 46 రోజులు పోరాటం చేసి జైలు శిక్ష అనుభ వించిన నాయకులు చెరుకు సుధాకర్ బీఆర్ఎస్లో చేరడం శుభ పరిణామమన్నారు. జిట్టా బాలకృష్ణ, ఏపూరి సోమన్న, హర్దీప్రెడ్డి లాంటి వాళ్లు బీఆర్ ఎస్‌లో చేరడం గొప్ప విషయమని, ఇది తనకెంతో సంతోషం కలిగించిందని చెప్పారు. ‘అదృష్టం ఉంటేనే ఇంట్లో ఆడపిల్లలు పుడతారు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం. మనింటి అమ్మాయిని వేరే వాళ్లకు ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తామో, రాష్ట్రాన్ని ఒకరి చేతిలో పెట్టాలంటే కూడా ఎంతో ఆలోచించాలి. ఇంత గొప్పగా సాధించుకున్న రాష్ట్రాన్ని, అభివృద్ధి చేసుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతిలో ఉంచాలో ప్రజలు కూడా ఆలోచించాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కేసీఆర్‌కు హ్యాట్రిక్ సీఎంగా అవకాశమివ్వాలని విన్నవించారు. ‘ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండుకు 12 అసెంబ్లీ స్థానాల్లో మళ్లీ గెలవాలి. ఈ చేరికలతో నకిరేకల్‌లో లింగయ్య, ఆలేరులో సునీత గెలుపు ఖాయమ య్యాయి. అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. ఈసారి దసరాకు ఊళ్లలో అభివృద్ధిపైనే చర్చ జరగాలి’ అని కేటీఆర్ చెప్పారు. దూకుడుగా పని చేస్తాను: చెరుకు సుధాకర్ ‘తెలంగాణ ఉద్యమాన్ని గరిష్ట స్థాయిలో నడిపాను. జైలు జీవితాన్ని కూడా గడిపాను. నా ఆలోచన విధానానికి పదును పెట్టింది తెలంగాణ భవన్. పార్లమెంటరీ రాజకీయాలను అవగాహన చేయించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా బీఆర్ఎస్ కొనసాగాలి. తెలంగాణ ప్రజలకు అనేక పాఠాలు, వ్యతిరేకులకు గుణపాఠాలు చెప్పిన వ్యక్తి కేసీఆర్. భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ ప్రజల ఆయువు పట్టుగా పార్టీ నిలవాలి. ప్రజలకు మరింత చేరువై అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. తెలంగాణ ప్రజల ఆశయా లు, ఆకాంక్షల సాధన కోసం గతంలో మాదిరిగానే దూకుడుగా పని చేస్తాను’ అని చెరుకు సుధాకర్ చెప్పారు. రాహుల్, రేవంత్ డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదు: మంత్రి హరీశ్‌రావు చెరుకు సుధాకర్ కరుడుగట్టిన ఉద్యమవాది అని, తెలంగాణ ఉద్యమంలో మొదటగా జైలుకెళ్లిన వ్యక్తి ఆయనే అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి ఒకవైపు, తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయని కిషన్‌రెడ్డి మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. బీజేపీతో పోరాటం తమ డీఎన్ఏలో ఉందని రాహుల్ గాంధీ అన్నారని, మరి రేవంత్ రెడ్డి డీఎన్ఏలో ఏముందో చెప్పాలన్నారు. రాహుల్, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు సరిపోలడం లేదని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు 35–40 స్థానాల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని, సోనియమ్మ ను బలి దేవత అన్న రేవంత్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. రాహుల్ కుటుంబ పాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటని, కాంగ్రెస్‌కు లెహర్ లేదని జహర్ మాత్రమే ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరాకు 13 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొంటున్నారని, కానీ రాష్ట్రంలో ప్రతి గింజనూ సీఎం కేసీఆర్ కొనుగోలు చేశారని చెప్పారు. పనితనం తప్ప, పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని, కేసీఆర్‌కు ఎప్పుడూ పని మీదే ధ్యాస ఉంటుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని, కాంగ్రెస్ అంటే మాటలు, మంటలు, ముఠాలు అని అభివర్ణించారు. -
బీఆర్ఎస్ గూటికి చెరుకు సుధాకర్
సాక్షి, హైదరాబాద్: మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సమక్షంలో తెలంగాణ ఉద్యమ కారుడు చెరుకు సుధాకర్ బీఆర్ఎస్లోకి చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపై రేవంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. ‘‘రాహుల్ గాంధీ తన పేరును రాంగ్ గాంధీగా మార్చుకోవాలి. బీఆర్ఎస్ మేనిఫెస్టోనే కాంగ్రెస్ కాపీ కొట్టింది. రాష్ట్రాన్ని మళ్లీ కాంగ్రెస్ చేతిలో పెడితే ఇక ఆగమే. కాంగ్రెస్‌లో పైసలకే టికెట్లు అమ్ముకుంటున్నారు’’ అని హరీష్‌రావు ధ్వజమెత్తారు. చదవండి: కాంగ్రెస్ నాకు టికెట్ ఇవ్వాల్సిందే.. గద్దర్ కూతురు వెన్నెల -
ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనమని టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. నల్లగొండ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. దొరల తెలంగాణ కోసం బీఆర్ఎస్, ప్రజల తెలంగాణ కోసం కాంగ్రెస్ అని పైకి చెబుతున్నప్పటికీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న భూస్వామ్య పోకడలకు ఇటీవలి పరిణామాలు అద్దం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చి గౌరవం ఇచ్చినప్పటికీ నల్లగొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విపరీత ప్రవర్తనను నిలువరించడంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని తెలిపారు. ఉత్తమ్, జానారెడ్డి కూడా ఈ ప్రయత్నం చేయకపోవడంతో కోమటిరెడ్డి మరింత చెలరేగిపోయారని ఇలాంటి పరిస్థితుల్లో మెరుగ్గా ఉన్న రాజకీయ వేదిక వెతుకులాటలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న దాడిని నిలువరించకపోగా నల్లగొండలో జరిగిన సభలో కోమటిరెడ్డిని కొండా లక్ష్మణ్ బాపూజీ వారసుడిగా పోల్చడం ద్వారా తమను అవమానపరిచారని పేర్కొన్నారు. వెక్కిరించినట్లు మాట్లాడారు: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 55 మంది అభ్యర్థుల్లో 12 బీసీలకు కేటాయించారని, అయినా కోమటిరెడ్డి 12 సీట్లు ఇచ్చామంటూ వెక్కిరించినట్లుగా మాట్లాడు తున్నారని సుధాకర్ తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి మాట్లాడిన తీరు యావత్ తెలంగాణను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. తనతో కలిసి ప్రయాణించిన వారికి ఈ లేఖలో కృతజ్ఞతలు తెలిపారు. కాగా, చెరకు సుధాకర్‌తో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డిలు చర్చలు జరిపారని, శని, ఆది వారాల్లో ఆయన బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. -
కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. చెరుకు సుధాకర్, ఆయన తనయుడిని ఫోన్లో బెదిరించిన వ్యవహారానికి సంబంధించి ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నల్లగొండ వన్ టౌన్లో సుధాకర్ తనయుడు సుహాన్ నిన్న(సోమవారమే) ఫిర్యాదు చేశారు.దీంతో ఐపీసీ 506(నేరపూరిత బెదిరింపులు)తో పటు పలు సెక్షన్ల కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడైన డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన తనయుడు డాక్టర్ సుహాస్‌ను.. తన(కోమటిరెడ్డి) వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్‌కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు తాను భావోద్వేగంతో చేసినవేనని, తనపై విమర్శలు చేయొద్దని మాత్రమే సుధాకర్ కొడుక్కి చెప్పానని కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు.. సంభాషణల్లో కొన్ని మాటలనే కట్ చేసి.. ఆడియోను లీక్ చేశారని, కాల్ రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఈ ఫోన్ సంభాషణను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపించారు చెరుకు సుధాకర్. అలాగే.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారాయన. -
అందుకే అలా మాట్లాడా.. నాకు వేరే ఉద్దేశం లేదు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్‌ను తన వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్‌కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. వెంకట్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే.. వేరే ఉద్దేశం లేదు. నా 33 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరినీ దూషించలేదు. శత్రువును కూడా దగ్గరకు తీసే తత్వం నాది. చెరుకు సుధాకర్‌పై పీడీ యాక్ట్ పెడితే నేనే కొట్లాడాను. నాపై విమర్శలు వద్దనే సుధాకర్ కుమారుడికి చెప్పాను. నా మాటలను కట్ చేశారు. కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేశారు. ఫోన్ రికార్డు చేస్తున్న విషయం నాకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి చెరుకు సుధాకర్ నన్ను తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నావని అడిగాను. నన్ను తిట్టొదు అని మాత్రమే సుహాస్‌కు చెప్పాను. నన్ను సస్పెండ్ చేయాలి అనడం, తిట్టడం వల్లే బాధతో అలా మాట్లాడాను’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి ఆడియో క్లిప్‌లో ‘మీ నాన్న వీడియో చూసినవా? ఇప్పటికే నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజుల నుంచి ఓపిక పడుతున్నా. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి నన్ను విమర్శిస్తాడా? వాడిని వదిలేది లేదు. వాడు (చెరుకు సుధాకర్) క్షమాపణ చెప్పకపోతే మా వాళ్లు చంపుతరు. నా అభిమానులు వంద కార్లల్లో బయల్దేరారు. ఇంటి పార్టీ ఏందిరా? వాడు పీడీ యాక్ట్ కేసులో జైల్లో పడితే నేను ఒక్కడినే వెళ్లి పరామర్శించిన. కౌన్సిలర్‌గా గెలవనోడు నన్ను విమర్శిస్తాడా? 25 ఏండ్ల నా రాజకీయ జీవితంలో లక్షల మందిని బతికించిన. వారిలో చాలామంది ఇప్పటికే వాడి మీద కోపంతో చంపుతామంటూ బయల్దేరారు. నేను ఎంతమందినని ఆపుతా. నిన్ను కూడా చంపేస్తరు. నీ హాస్పిటల్ ఉండదు. వారంలో వాడిని చంపేస్తారు’ అని సీరియస్ అయ్యారు. చెరుకు సుధాకర్ సీరియస్.. ఈ ఆడియోను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపించానని సుధాకర్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. ఎంపీ కోమటిరెడ్డి.. తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై అధిష్టానమే చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. కోమటిరెడ్డిపై సుహాస్ నల్లగొండ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు కోమటిరెడ్డి నుంచి ప్రాణభయం ఉన్నదని, రక్షణ కల్పించి ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. -
చంపుతమని తిరుగుతున్నరు.. కోమటిరెడ్డి ఆడియో కలకలం!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్‌ను తన అభిమానులు చంపుతారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బెదిరించినట్లుగా ఉన్న ఆడియో లీక్ అయ్యింది. అసభ్యంగా వారిద్దరినీ దూషించినట్లున్న ఆ ఆడియో ఆదివారం కలకలం రేపింది. అసలు ఆడియోలో ఏముందంటే.. ‘చూసినవా స్టేట్మెంట్.. (అంకుల్ అది వాట్సప్‌లో అట్ల ఇచ్చిండు కానీ ఆ వీడియో ఒకసారి మీరు పూర్తిగా చూడండి–ఎదుటి వ్యక్తి వాయిస్) ఏం చూసుడు. వాన్ని చంపుతమని తిరుగుతున్నరు. వంద మంది వెహికిల్ వేసుకొని తిరుగుతున్నరు. ఈ వీడియో కాదు నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజులు ఓపిక పట్టి ఇప్పుడు వంద కార్లలో వాణ్ని చంపుతమని తిరుగుతున్నరు. నిన్ను కూడా చంపుతరు. నీ హాస్పిటల్‌ను కూడా కూలగొడుతరు. లక్షల మందిని బతికించిన నేను. వానికెంత ధైర్యం నిన్న మొన్న పార్టీలకొచ్చి.. వాణ్ని వదిలిపెట్టర్రా.. నేను చెబుతున్న నీకు, వార్నింగ్ ఇస్తున్న. నేను ఆపలేను .. క్షమించమని చెప్పి, నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్లు ఇచ్చిండు ఓపిక పట్టిండ్రు. సార్ మాతో ని కాదిగ, నువ్వేమో ఏమనొద్దంటున్నవ్ సార్.. మేము వెళ్లినం బయటికి, యాడ దొరికితే ఆడ చంపేస్తం అంటుండ్రు వాళ్లు. నా తోని కాదు.. వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తరు... అసోంటి వంద వీడియోలు, డైరెక్టు పేరు పెట్టి వందసార్లు తిట్టిండు వాడు. ఇప్పుడొక బ్యాచ్ వెళ్లింది. నిన్ను కూడా చంపుతరు చెబుతున్న అరేయ్... నీ హాస్పిటల్ నడువదు. 25 ఏళ్లలో లక్షల మందిని బతికించిన నేను. వారందరిని కంట్రోల్ చేస్తానా నేను. అతనికి ఫోన్ చేసి చెప్పు.. అరేయ్ నీకు పార్టీ ఉన్నదారా.. ఇంటిపార్టీ ఏందిరా.. నువ్వు కౌన్సిలర్‌గా గెల వవు.. ఆయన అంతపెద్ద లీడరు అని చెప్పు. వాడు జైళ్ల పడితే నేను ఒక్కడినే పోయిన. ఎవరూ పోలే అప్పుడు. చెప్పు.. వారంకంటే ఎక్కువుండడాడు’. కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం డాక్టర్ చెరుకు సుధాకర్‌ను, ఆయన కుమారుడిని చంపుతామంటూ బెదిరించినట్లుగా ఆడియో లీక్ నేపథ్యంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ గడియారం సెంటర్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేశారు. కాగా, ఎంపీ కోమటిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని బీసీ యువజన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దరిద్రుడు, చీడపురుగంటూ నన్ను తిట్టుడేంది: కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటినుంచి చెరుకు సుధాకర్ నాపై కామెంట్స్ చేస్తుండు. ఒకసారి దరిద్రుడని, మరోసారి చీడపురుగని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నడు. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నరని ఆయన కొడుకును అడిగితే పెడితేఏంది అంటూ వంకర టింకర మాట్లాడుతుండు. ఇది ఎంతవరకు కరెక్టు. పార్టీకి పని చేయాలి. నన్ను తిట్టుడేంది? నా కొడుకుకు ఫోన్ చేసి నన్ను తిట్టడం ఆశ్చర్యం కలిగించింది: చెరుకు సుధాకర్ వెంకట్‌రెడ్డి అసభ్యంగా నన్ను తిట్టడం అశ్చర్యం కలిగించింది. నేను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా, అతను స్టార్ క్యాంపెయినర్‌గా ఉండి ఒకే పారీ్టలో పని చేస్తున్నా నాపై అత్యంత నేరపూరితమైన, టెర్రరిస్టు భాష మాట్లాడారు. ఆయనకు మతి ఉండి మాట్లాడుతుండో.. మతి లేక మాట్లాడుతుండో అర్థం కావడంలేదు. ఆడియో టేపును తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపించా. కోమటిరెడ్డిని నేను వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు లేవు. నయీం లాంటి కరుడు గట్టిన తీవ్రవాదే నన్నేమీ చేయలేకయాడు. కోమటిరెడ్డి ఏం చేస్తాడు? ఈ వ్యాఖ్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. -
Munugode Politics: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. రాజగోపాల్‌రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరస్పర విమర్శలతో రెచ్చిపోయారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చేసిన వ్యాఖ్యలపట్ల వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. రేవంత్ పెద్ద తప్పు చేశారు తాజాగా జరిగిన పరిణామాలు సైతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అసహనం కలిగించాయి. చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. తనను ఎన్నికల్లో ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పెద్ద తప్పు చేశారని వ్యాఖ్యానించారు. ఇకపై రేవంత్‌రెడ్డి ముఖం కూడా చూడనని వెంకట్‌రెడ్డి అన్నారు. (చదవండి: మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా?) పార్లమెంట్ సమావేశాల తర్వాత మునుగోడు వెళ్తానని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలో శుక్రవారం ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. చెరుకు సుధాకర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. (చదవండి: పావులు కదుపుతున్న హస్తం నేతలు.. రేవంత్‌పై ఢిల్లీ పెద్దలు సీరియస్!) -
సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?
ద్రౌపది ముర్ము 64 ఏండ్ల ఆదివాసీ విద్యాధికురాలు. రాష్ట్రపతి రేస్‌లో అకస్మాత్తుగా ఎన్డీయే అభ్యర్థిగా తెర మీదికి వచ్చారు. ఆమె పేరు ప్రకటించడమే ప్రతిపక్షాలను ఎందుకు అంతగా కలవరపరిచిందో ఆశ్చర్యం వేసింది. భారతీయ జనతా పార్టీ ఇటువంటి ప్రయోగాలు అనేకం చేసి రాటు తేలిపోయింది. 2014లో ప్రధానిగా రేసులో ఉన్న నరేంద్ర మోదీ తాను ఒక బీసీ బిడ్డననీ, రాజకీయ అణచివేత, అస్పృశ్యతను అనుభవించినవాడిననీ చెప్పుకున్నారు. తరాలుగా ప్రజాప్రతినిధులుగా ఎదిగే అవకాశాల్లో తీవ్ర అణచివేతనూ, అవకాశ లేమినీ అనుభవిస్తున్న ఒక పెద్ద వర్గం నరేంద్రమోదీని మోసిన ఫలితం అందరం కళ్ళతో చూసినం. ప్రతిపక్షాలు రాష్ట్రపతి స్వతంత్రత పెరగాలని... విస్తృత ప్రజా సంబంధాలు, దేశం శక్తిమంతం అయ్యే రాజ్యాంగ వ్యవస్థల కోసం నిలబడి, కలబడే వ్యక్తిని ముందే వెతికి ప్రకటిస్తే చర్చ ముర్ము చుట్టు కాకుండా మరోలా ఉండేది. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఎక్కువ ఓట్లు తమకు ఉన్నప్పుడు విస్తృత ఆమోదంతో అభ్యర్థిని ముందే ప్రకటించడంతో పాటు మద్దతును కూడగడితే బాగుండేది. వాజ్‌పేయి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్, బీజేపీతో సుదీర్ఘ అనుబంధం, ప్రయాణం ఉన్న యశ్వంత్ సిన్హా పేరును ప్రతిపక్షాలు ప్రకటించాయి. ద్రౌపది ముర్ము పేరు ప్రకటనతో మర్మం ఏదైనా ధర్మమేనేమో అనే సాఫ్ట్‌కార్నర్ అప్పుడే ఏర్పడడం మనం గమనిస్తున్నాం. ముర్మును బ్రాండింగ్ చేయడం మోదీ వెంటనే మొదలు పెట్టినారు. ఆదివాసీని ప్రకటించి ఏం లాభం...? ఆమె రబ్బర్ స్టాంప్ మాత్రమే కదా అన్నవాళ్లు వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అభ్యర్థి కావాలని ఎందుకు అంగలార్చారు? మాయావతి రాష్ట్రపతి కోసమే బీజేపీతో సఖ్యంగా ఉంటోందని ప్రచారం కొంత మంది ఎందుకు చేశారు? గోపాలకృష్ణ గాంధీని, శరద్‌పవార్‌ను అడిగినవాళ్లు మాయావతిని ఎందుకు అడగలేదు? ప్రధానమంత్రి కావాలని కోరుకున్న చమార్ ఆడబిడ్డ రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటే చర్చవేరే తీరుగా ఉండేది కదా? గత అనుభవం ప్రకారం ఏ గవర్నర్, రాష్ట్రపతి అభ్యర్థీ... తమ వర్గాల, లేదా వ్యవస్థల కోసం ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని నిలదీస్తారని ఎవరూ ఆశించడం లేదు. అది వర్తమానంలో ఒక విషాదం. ఆదివాసీలకు ముర్ము ఏంచేశారు? అని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రశ్నించడం గురువిందగింజ సామెతకు పదిరెట్లు అపహాస్యంగా ఉంటుంది. బీజేపీలో అన్ని పదవులూ అనుభవించి కొడుకుకు ప్రాతినిధ్యం కోసం బయటకు వచ్చి, తన పదవీ కాలంలో ఒక రాజ్యాంగ విలువ గురించీ, ఏ ఒక్క వ్యవస్థల పతనం, అమ్మకాల గురించీ మాట్లాడని సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం? (క్లిక్: ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?) దేశ స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుగుతున్నవేళ మునుపెన్నడూ లేనంత అణచివేత, దోపిడీ ఆదివాసీలపై కొనసాగుతోంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై మొదటి సాయుధ తిరుగుబాటు చేసిన సంతాల్ తెగ వారసురాలు ద్రౌపది ముర్ము... ఇప్పుడు ఆదివాసీల సమస్యలకు కనీసం పునఃసమీక్ష అవసరమని ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుందని కూడా ఎవరూ ఆశించకున్నా... ఆమే ఒడిషాలోని మయూర్భంజ్ నుండి 280 కిలోమీటర్లు రోడ్డు వెంట భువనేవ్వర్ చేరినప్పుడు వెల్లివెరిసిన ఆనందాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రాతినిధ్యం కనీస సవ్య పొందికను కలిగి ఉండాలని అణగారిన వర్గాలు కోరుకుంటున్నాయని గుర్తించమంటున్నాం. భవిష్యత్తులో ఏ రాజకీయ పదవికైనా పోటీ వచ్చినప్పుడు ‘గేమ్ చేంజర్’ నిర్ణయాలు ఉంటాయని గమనించమంటున్నాం. - డా. చెరుకు సుధాకర్ వ్యాసకర్త తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు -
కాలం చెల్లిన చట్టాలు ఇంకానా?
రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో 160 సంవత్స రాలకు పైగా చర్చ జరుగుతున్న ఈ చట్టం అమలు తీరు, దాని పర్యవసానాలపై పౌర సమాజం ఆసక్తితో ఉంది. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం వెలుగులో జీవిస్తున్న సమాజం మనది. మానవ సమాజ పరిణామ క్రమంలో మనుషులకు అవసరం లేనివి కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ విధంగానే నల్ల చట్టాలు కూడా మిగలొద్దని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఎన్నో దేశాలు వాటిని రద్దు చేసుకున్నాయి. మరి మనది 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం. రాజుల కాలం పోయింది. సంస్థానాలు కూలిపోయి నాయి. కానీ రాజులేని కాలంలో రాజద్రోహ చట్టాన్ని ఇంకా కాపాడుతున్నది ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్య దేశంలో ఒక అవమానకరమైన పరిస్థితిని సూచిస్తుంది. అందుకేనేమో తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే రాజద్రోహానికి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. భారత స్వతంత్ర ఆకాంక్షను అణచివేయడానికి బ్రిటిష్ వారు 1860లో ఇండియన్ పీనల్ కోడ్‌లో రాజద్రోహాన్ని పొందుపరిచారు. మహాత్మాగాంధీ, బాలగంగాధర తిలక్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి స్వతంత్ర సమరయోధులు రాజద్రోహం కింద ఆనాడు శిక్ష అనుభవించారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం గురించి ఉద్యమిస్తున్న వారిని ఈనాడు అదే చట్టం కింద నిర్బంధించడం సిగ్గుచేటు. ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ ఈ చట్టం ఎత్తివేతకు అన్ని పార్టీలతో కార్యాచరణను ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇందులో కలిసి రావాలని రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మాతో జరిగిన చర్చల్లో ప్రతిపాదించడం జరిగింది. మావోయిస్టులే చర్చలకు సిద్ధమ వుతున్నప్పుడు ఈ చట్టం మరింత కాలం చెల్లినది అని చెప్పక తప్పదు. (చదవండి: కార్మిక హక్కులకు అసలు ప్రమాదం) చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, ఈనాటి ప్రమాదాన్ని ముందే ఊహించిన కె.ఎం. మున్షీ లాంటివారు దీన్ని అత్యంత క్రూరమైన చట్టంగా అభివర్ణించారు. వ్యక్తి హక్కులను నిర్దాక్షిణ్యంగా అణిచివేసే ఈ చట్టం ప్రజా స్వామ్య మనుగడకు ప్రమాదకరమని రాజ్యాంగ సభలో మాట్లాడారు. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్య మనుగడ ఉండదు. ప్రశ్న ప్రజాస్వామ్య ఉనికికి జీవగర్ర లాంటిది. పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల అణచివేతకు కారణమవుతున్న రాజద్రోహాన్ని భారత శిక్షా స్మృతి నుండి తొలగించాలని ఇప్పటికే అనేక కేసులు దాఖలయ్యాయి. ఈ ప్రయత్నంలో న్యాయవ్యవస్థ సఫలీకృతం అయితే భారత ప్రజలకు ఒక భరోసా లభించినట్లే. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా గొంతు విప్పవలసిన సమయం ఇది. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకొనే ప్రజా ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ సత్యం గ్రహించాలి. ప్రజాస్వామ్యం అంతిమసారం అదే. రాజ్యంగ స్ఫూర్తి కూడా అదే. (చదవండి: అసమ్మతి గళాలపై అసహనం) - డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణా ఇంటి పార్టీ అధ్యక్షులు -
ఆయన జీవితంలో ఎన్ని సింగిడీలో!
కొందరి జీవితాన్ని బయోపిక్‌గా రీల్‌కు ఎక్కించాలన్నా, బయోగ్రఫీగా అక్షరబద్దం చేయాలన్నా సులువు కాదు. సూర్యాపేటలో 1922 ఫిబ్రవరి15న కల్లు గీసే ముత్తిలింగం –గోపమ్మలకు పుట్టిన బొమ్మగాని భిక్షం సమాజ సేవ బహుముఖీనం. జీవించిన 90 ఏండ్లూ ఆయన ఆరడుగుల ఎర్రజెండా... బడుగు జనుల విముక్తి ఎజెండా. ఆయన అనుభ వాల్ని కొంపెల్లి వెంకట్ మాట–ముచ్చటగా తీసు కొచ్చిండు. ‘‘ఇంత ఉద్యమ చరిత్రలో ఎన్నడూ కంట కన్నీరు కార్చి నోణ్ణి కాదు. నేను ఆ రోజుల్లో అన్క్వశ్చన్డ్ లీడర్ని రా నాయనా! ప్రజా ఉద్యమాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వాళ్ళలో లీనం గావాలే, అన్ని థాట్స్ హ్యుమాన్ బీయింగ్‌కు అవ సరం...’’ ఇవన్నీ జీవన చరమాంకంలో ఆయన వలపోత, కలబోత. ఇందులో ఎన్ని సింగిడీలో! ఆయన పార్లమెంట్ ఎన్నికలకు మా నాయన, సుద్దాల హన్మంతుతో పాటు గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థులుగా మేమూ పాల్గొన్నాం. హిమాయత్‌నగర్‌లో మఖ్దూమ్ భవన్‌కు ముగ్గుబోయక ముందు మా ఇంట్లో ఎన్నోసార్లు సేద తీరినప్పుడూ, ఉపన్యాసం ఇచ్చినప్పుడూ అట్లా తదేకంగా చూడడం నా జీవితంలో కలి గిన గొప్ప అవకాశం. ఆయన నల్ల గొండ పార్లమెంట్‌కు మళ్ళీ 1996లో పోటీ చేసినప్పుడు... జల సాధన కోసం జలఖడ్గం విసిరినట్లుగా తెలంగాణ ఆర్తి చెప్పడానికి 480 మంది అభ్యర్థుల్ని దుశర్ల సత్యనారాయణ, మేము నిలబెట్టినం. 89 ఏళ్ల వయస్సులో తొంటి విరిగి ఇన్ఫెక్షన్తో పోరా డుతూ 2011 మార్చి 26న ఆయన చని పోయిండ్రు. అదే రోజు నల్లగొండ జిల్లా సంగెంలో రాత్రి తెలంగాణ ఆట–పాట– మాట సభ నిర్వహించుకొని నేను, సాంబ శివుడు తిరిగి వస్తూ పొద్దున అంత్యక్రియలకు హాజరవుదామని అనుకున్నాం. దారిలో సాంబశివుడు హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న సాంబశివుణ్ణి ఆసుపత్రికి, ఇంటికి తరలించే పనిలో ధర్మభిక్షం చివరి చూపు కరువయింది. 15 ఫిబ్రవరి 2021లో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రారంభమయిన శత జయంతి వార్షికోత్సవాలు, 2022లో నేడు రవీంద్ర భారతిలో ముగుస్తాయి. -చెరుకు సుధాకర్ వ్యాసకర్త ఇంటిపార్టీ అధ్యక్షుడు -
మౌలిక అభివృద్ధికి ఖర్చు పెట్టిందెంతో కేటీఆర్ చెప్పాలి?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూములను అమ్మి సేకరించిన నిధుల్లో రాష్ట్ర మౌలిక అభివృద్ధికి ఖర్చు పెట్టిందెంతో మంత్రి కేటీఆర్ వివరించాలని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్డిమాండ్చేశారు. హైదరబాద్చుట్టూ 344 క.మీ రీజినల్రింగ్రోడ్అలైన్మెంట్లో రింగు తిప్పుతున్నది భూ మాఫియా పెద్దలేనని ఆదివారం ఒక ప్రకనటలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ఇచ్చిన ప్రాజెక్టులు, రింగ్‌రోడ్డుకు అవసరమైన భూమి కంటే ఎన్నో రెట్లు రైతుల నుండి ఎందుకు సేకరించారని నిలదీశారు. తాము కొన్న భూముల జోలికి పోకుండా చూసుకుంటూ, రైతుల నుండి ఎక్కువ భూమి తమ అధీనంలోకి తీసుకోవడానికి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మల్లన్నసాగర్, కాళేశ్వరం కాలువ పనుల్లో వేల ఎకరాల భూమి కోల్పోయిన ప్రజలకు పరిహారం అందలేదని, ఆందోళన చేస్తున్న రైతులను కేసీఆర్ ప్రభుత్వం నిర్భందంతో అణిచివేస్తున్నదని చెరుకు సుధాకర్ఆరోపించారు. -
ఎవరు అడ్డొస్తే హామీలు అమలు చేయడం లేదు?
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఉచిత ఎరువులు, రూ.లక్ష లోపు రుణమాఫీ, దళితబంధు హామీలకు ఎవరు అడ్డొస్తే అమలు చేయడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ జీవో 317తో ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. బీజేపీకి సవాల్ విసిరే బదులు ఢిల్లీలో లోపాయికారిగా చర్చలు జరుపుతూ, ఇక్కడ కోవర్టు ఆపరేషన్లతో రాష్ట్ర అధ్యక్షుడిని కించపరుస్తూ మాట్లాడటం మీకే చెల్లుతుందని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించార. -
బయోపిక్‌లు ‘భయో’ పిక్‌లు, కాకూడదు
ఈ మధ్యకాలంలో అనేక మంది బయోగ్రఫీని సినిమాల్లో ‘భయోపిక్’గా తెరకు ఎక్కిస్తున్నారు. ఇందులో చాలా బయోపిక్‌లలో వివాదాంశాలు ఉండడం, వివాదాలు, అల్లర్లు చెలరేగడం ఒక ఎత్తయితే, దాము బాలాజీ నిర్మించి విడుదల చేసిన ‘నయీం డైరీస్’ బయోపిక్ దారుణంగా ఉంది. ఈ వికృత ప్రయోగంలో తెలంగాణ పాటల కోయిల త్యాగశీలి బెల్లి లలిత పాత్రను వక్రీకరించి, ఆమె నయీమ్ జైళ్ళో ఉన్నప్పుడు నిత్యం వచ్చిపోతూ, అతని ప్రేమలో, నియంత్రణలో ఉన్నట్లు, నాటి నల్లగొండ మావోయిస్టు పార్టీ సెక్రటరీ ధర్మన్నను పట్టించడానికి ఒప్పుకున్నట్లు తరువాత నిరాకరించడంతోనే నయీమ్ కుటుంబ సభ్యులు బెల్లి లలితను హత్య చేసినట్లు చిత్రీకరించారు. నిత్యం సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లులో చెమటోడ్చి పిల్లలను పెంచి, కుటుంబ బాధ్యతతోపాటు తెలంగాణ ఉద్యమంలో, ప్రజా పోరాటాల్లో జీవితాన్ని కొనసాగించిన తెలంగాణ ఆడబిడ్డ ప్రేమలో పడిన రహస్యం దాము బాలాజీకి ఎవరు చెప్పారు? ఒకరిని పట్టించమని ఒత్తిడి చేస్తే, నిరాకరించినంత మాత్రాన ముక్కలు ముక్కలుగా నరకడానికి వాళ్ళ కుటుంబానికి చేతులు ఎట్లా వచ్చాయి? రాజ్యం, పోలీసుల మిలాఖత్‌ను గొప్పగా చిత్రీకరించాననుకునే రామ్‌గోపాల్ వర్మ శిష్యుడికి బెల్లి లలితను తప్పుడుగా చిత్రీకరించడంలోను రాజ్యం పాత్ర లేదని ఎందుకనుకోవాలి? ఇప్పటికే ఈ చిత్రంలో బెల్లి లలిత వ్యక్తిగత జీవితాన్ని మలినం చేసిన దాము బాలాజీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘నయీమ్ డైరీస్’ సినిమా నిలిపివేయాలని హైదరాబాద్, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేటలో సినిమా హాళ్ళ ముందు నిరసనలతో అడ్డుకోవడాలు జరిగాయి. కదిరే కృష్ణ తదితరులు హైకోర్టు నుండి సినిమా నిలిపివేయవలసిందిగా ‘స్టే’ తెచ్చారు. (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) దాము బాలాజీ ఉద్దేశం ఏదైనా సరే, తెలంగాణ సమాజమంతా కూడా బెల్లి లలిత జీవితాన్ని మలినం చేసే ఏ ప్రయత్నాన్నైనా తిప్పికొడతారు. మా చేతుల మీద ఎదిగిన ఆడపిల్ల బెల్లి లలిత. బెల్లి లలిత చెల్లెలు సరితకు ముక్క కరుణాకర్‌తో దగ్గరుండి నా చేతుల మీదిగా పెళ్ళి జరిపించాను. నయీమ్ భయానికి, కర్కశత్వానికి పదుల సంఖ్యలో గొల్ల, కుర్మ సోదరులు బలయిపోయారు. (చదవండి: ‘జై భీమ్’ సినిమాలో చూపింది సత్యమేనా?) సాంబశివుడు, రాములు అంతకు ముందు పురుషోత్తం, ఆజమ్ అలీ ఈ హత్యల పరంపర, నయీమ్ సీరియల్ కిల్లర్ కావడానికి విప్లవ పార్టీల తీరు కూడా కారణమయినట్లు అన్యాపదేశ సందేశం ఇవ్వడం దారుణం. నయీమ్ కత్తుల వేటలో బలయిన అనేక మందికి పాడె మోసినవాణ్ణి... నేనింకా బతికే ఉన్నాను. నయీమ్‌ను గ్లోరిఫై చేయలేదని చెప్పుకున్న దాము బాలాజీ మరి ఎవరిని టార్గెట్ చేసినట్లు? ‘బయోపిక్’ సరదా ‘భయోపిక్’గా మారితే సహించడానికి బెల్లి లలిత త్యాగాల చరిత్ర చిన్నది కాదు. సినిమా నుంచి ఆ అంశాలను తొలగించి, తెలంగాణ సమాజానికి దాము బహిరంగ క్షమాపణ చెప్పాలి. – డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు -
Pegasus: భయపెడుతున్న గూఢచార గుర్రం
నిన్న, మొన్న పార్లమెంట్ దద్దరిల్లింది కరోనా, కరువు గురించిన వాగ్బాణాల వల్ల కాదు. కరోనాకు మించిన రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ కాపీయింగ్, స్వేచ్ఛను కరువు చేసే కొత్త గూఢచార సాఫ్ట్వేర్ పెగసస్ గురించి. వ్యక్తుల సమాచారం, కదలికలు, ఫొటోలు, మాట్లాడే కాల్స్ రికార్డు చేసే ఇజ్రాయిల్‌కు చెందిన ఈ పెగసస్ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం కొన్నది. దాంతో వందలాదిమంది జర్నలిస్టులు, ఉద్యమకారులు, పార్లమెంట్ సభ్యులు, అధికారుల స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం అంతా ఇంటలిజెన్స్ వ్యవస్థకు చేరిపోతుంది. ఈ ఉచ్చులో ప్రతి పక్షాలే కాదు, ప్రభుత్వ మంత్రులు, ఎంపీలూ ఉండటం విశేషం. ఇజ్రాయిలీ నిఘా వ్యవస్థ పేరు మొస్సాద్ (మృత్యువు). మృత్యుముఖంలోకి అనేక దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలను నెట్టివేసే స్పైవేర్ ఇజ్రాయిల్ నుంచే ఇతర దేశాలకు వచ్చింది. పెగసస్ అంటే గ్రీకు ఇతిహాసాల్లో రెక్కల గుర్రం. డ్రోన్‌తో ఎట్లా అయితే, ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చో, అంతకంటే సునా యాసంగా స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆ వ్యక్తికి తెలియకుండా ఆ ప్రాంతంలోని ఫొటోలు, మాటలు రికార్డు చేసి పంపగలదు ఈ పెగసస్. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేశాడని విన్నాంగానీ, జైశ్రీరామ్ వారసులు ఇట్లా ఎగిరే అశ్వంతో వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు తెస్తారని అనుకోలేదు. కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ఫోన్ హ్యాక్ చేయడం భార తీయ చట్టాలు అంగీకరించని తప్పుడు పద్ధతి అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా పెగసస్‌తో బీజేపీ భార తీయ జాసూస్ పార్టీ అయిందన్నారు. బీజేపీ నాయకుడు రవి శంకర్ ప్రసాద్ మాత్రం, ఫోన్ ట్యాపింగ్‌కు పెట్టింది పేరయిన కాంగ్రెస్ తమ మీద స్నూపింగ్ అభియోగం చేయడం హాస్యా స్పదం అన్నారు. రాహుల్ గాంధీ అన్ని ఫోన్ నంబర్లు, రాజకీయా లతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా సంభాషించేవి కూడా స్నూప్ అవుతున్నట్లు రూఢీ అయ్యింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, గుజరాత్ ఎన్నికల తీరుపై విమర్శలు చేసిన అశోక్ లవాస, జర్నలిస్టు సుశాంత్ సింగ్‌తో పాటు నిఫావైరస్పై గొప్ప పరిశోధనలు చేసిన వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్ కూడా ఈ జాబి తాలో ఉన్నారు. నాపై నిఘానా అని వాపోయారు కాంగ్. ఈ సాఫ్ట్వేర్ బట్టబయలుకు ముందే, భీమ్–కోరేగావ్ కేసులో అరెస్టయిన అంబేడ్కర్ మనుమడు ఆనంద్ తేల్తుంబ్డే తన ఫోన్ హ్యాక్ అవుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇదే కేసులో మూడేళ్ల నుండి జైళ్ళో ఉన్న రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్లలోకి మాల్వేర్ చొప్పించినట్లు ఆర్సనాల్ కన్సల్టెన్సీ అనే అమెరికా డిజిటల్ ఫోరెన్సిక్ సంస్థ బహిర్గతం చేసింది. పెగసస్ ఆమ్నెస్టీ సంస్థ ఫోన్ నంబర్లను కూడా స్నూపింగ్ చేసింది. అంతర్గత ఎన్‌స్క్రిప్షన్‌ను పెగసస్ హ్యాక్ చేసిందని వాట్సాప్ మండిపడింది. వంద మంది నేరస్థులు తప్పించు కున్నా ఒక్క నిరపరాధికి శిక్ష పడవద్దన్న స్ఫూర్తికి భిన్నంగా, ఎవరిని జైళ్ళో వేయాలనుకుంటే వారి కంప్యూటర్లోకి తప్పుడు సమాచారం చొప్పిస్తే సామాన్యుల పరి స్థితి ఏమిటి? ఇంకా రాజద్రోహం కేసులు అవసరమా, 70 యేండ్ల స్వాతంత్య్రం తరువాత కూడా బ్రిటిస్ వలసకాలం చట్టాలతో కాలం వెళ్ళదీద్దామా అన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పెగసన్ గూఢచర్యంపై కూడా స్పందిం చాలి. రానున్న కాలంలో ప్రజాస్వామిక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బలోపేతం కాకుండా ఎగిరే గూఢాచారి గుర్రం అధికా రంలో ఉన్న పార్టీకి ఉపయోగ పడితే, అందుకు ప్రతిచర్య దేశ వ్యాపిత ఆందోళనగా రూపుదిద్దుకోవలసిందే. - డా. చెరుకు సుధాకర్ వ్యాసకర్త తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు పార్లమెంటరీ కమిటీ వేయండి! ‘పెగసస్’ సెగతో వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు మొదటి రోజే హీటెక్కాయి. దేశ పౌరుల వ్యక్తిగత గోప్యత అంగట్లో సరుకైందనే వార్తతో యావ ద్దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోదీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం యథేచ్ఛగా పౌరుల జీవితాలలోకి తొంగిచూస్తున్నాయి. ఇజ్రాయిల్‌కి చెందిన ఎన్.ఎస్.ఓ అనే సంస్థ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన పెగసస్ అనే సాఫ్ట్‌వేర్‌ను వాడి దేశంలోని ప్రతిపక్ష నాయకుల, ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్, సుప్రీం కోర్టు చీఫ్‌జస్టిస్ కుటుంబ సభ్యుల, సీనియర్ జర్నలిస్టుల, అనేక సామాజిక ఉద్యమకారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారనీ, వారి వ్యక్తిగత విషయాలను తస్కరిస్తున్నారని ఆమ్నెస్టీ, ఫొర్బిడెన్ స్టోరీస్ పరిశోధనా సారాంశం. కాంగ్రెసు పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, తన టీంలోని 5 మంది నేతల ఫోన్లు, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీల నాయకుల ఫోన్లు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తదితరుల ఫోన్లు పెగసస్ అనే మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసి, కీలకమైన సమాచారం దొంగిలిస్తున్నారనే అంశంపై వరుసగా రెండవ రోజూ పార్లమెంట్ స్తంభించిపోవటం చూశాం. తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తోటి శాసన సభ్యులతో సాధారణ ఫోన్‌కాల్‌లో మనసువిప్పి మాట్లాడటానికి వణుకుతున్నారంటే పరిస్థితి అర్థమౌతుంది. సొంత పార్టీ నేతలనే వదిలిపెట్టడం లేదంటే ఇక ప్రతిపక్షంలో ఉన్న కీలక నాయకులు, కీలక శాఖల ఉన్నతాధికారుల పరిస్థితి మనం ఊహించవచ్చు. 2020లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగం ఆర్టికల్–21 ప్రకారం, భారత పౌరులందరికీ జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫోన్ హ్యాకింగ్/ట్యాపింగ్ ఆర్టికల్–21కు విరుద్ధం. కానీ, నిబంధనలను తుంగలో తొక్కి, ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వాలే వారి వ్యక్తిగత ఫోన్లు హ్యాక్ చేసి, సమాచారం తస్కరిస్తే ఎలా? ఈ అంశంపై నిజాలు నిగ్గుతేల్చటానికి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ, పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయాలి. - కొనగాల మహేష్ వ్యాసకర్త: ఏఐసీసీ సభ్యులు, తెలంగాణ మొబైల్ : 9866776999 (మోదీ ప్రభుత్వపు ‘పెగసస్’ కుట్రకు నిరసనగా, నేడు కాంగ్రెస్ పార్టీ ‘చలో రాజ్‌భవన్’ చేపట్టింది) -
రాజకీయ గోదాలో... ఓటర్లే ఈటెలు
తెలంగాణ ఏర్పడగానే ఇక ధర్నాచౌక్‌ల అవసరమే రాదని కేసీఆర్ అంటే, ధర్మగంట మోగగానే సెక్రటేరియట్ తలుపులు తెరుచుకొని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని ఉద్యమ సంఘాలు ఆశించినాయి. కానీ ఎన్కౌంటర్లు, లాకప్‌డెత్‌లు, సకల రంగాల్లో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే ధర్నాచౌక్‌లో ధర్నాలకు అనుమతి నిరాకరించింది తెలంగాణ ప్రభుత్వం. కొంత షాక్‌కు గురయినా అందరం కోర్టు మెట్లెక్కి ప్రభుత్వానికి మొట్టికాయలు కొట్టిస్తే చాలా నెలల తరువాత అనుమతిని సాధించాం. అయినా ఒక్క నిరసన నినాదం మీడియా కంట కనబడకుండా ఆంక్షలు సాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ విద్యార్థి సంఘం, పౌరహక్కుల సంఘం, తదితర 16 సంఘాలు మార్చి 30న జీవో 73 జారీతో నిషేధానికి గురైనాయి. తెలంగాణ ప్రజా భద్రతా చట్టం 1992 ఉమ్మడి రాష్ట్రంలోని చట్టం. నిర్బంధాలు పోయి ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని తెచ్చుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ సాధన సంఘాలే నిషేధానికి గురైనాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనెదుర్కొంటున్న స్టాన్ స్వామి మరణానికి దారి తీసిన పరిస్థితుల్లో ప్రధానమైనది కుట్రపూరితంగా భీమ్ కోరేగామ్ కేసులో ఆయనను ఇరికించడం. స్టాన్ స్వామితో పాటు వరవరరావు, ప్రొఫెసర్ సాయి బాబా, రోనా విల్సన్ తదితరులను విడుదల చేయాలని ఈ 16 ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయనీ, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నామనీ ప్రభుత్వం చెప్పింది. ఈ జీవో 73ను సవాలు చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పౌర హక్కుల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం పిటిషన్ వేయడం, కోర్టులు నోటీసు జారీ చేయడం జరిగింది. ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ ఇంటి పార్టీ 25 ఏప్రిల్ 2021 నాడు బహిరంగ లేఖ రాసింది. తెలంగాణలో మేధావులు, రచయితలు ఎంతో మంది ఇలా లేఖలు రాసినా కేసీఆర్ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలు, కోర్టు మెట్లు నిషేధాన్ని ఎత్తివేయించగలిగాయి. ప్రజా సంఘాలపై నిషేధం ఇప్పట్లో ఎత్తివేయాలని కేసీఆర్ అనుకోలేదు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్నే టీఆర్ఎస్లో కలపడం, ఏ ప్రతిపక్షాన్నీ ప్రగతి భవన్ రానివ్వకపోవడం గమనించిందే. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ప్రజా క్షేత్రంలో వ్యతిరేకతను వేగులు సరిగానే సమాచారం చేరవేసిండ్రు. దాని ఫలితమే ప్రగతి భవన్ నుండి భట్టి విక్రమార్క తదితరులకు ఫోన్, ఆహ్వానం, మరియమ్మ ఘటనపై విచారణ, ఆర్థిక సహాయం, మరునాడు దళిత సాధికారతపై చర్చ, అనేక తాయిలాల ప్రకటన. ఎవరేమి అను కున్నా ఇవన్నీ తరుముకొస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఓటర్లు విసిరే ఈటెల ముప్పుగానే భావిం చాలి. ఎన్నో రాస్తారోకోలు, బంద్‌లు చేసినా మరింత నిర్బంధం తప్ప ముందుకుపోని స్థితి నుండి, ఒక ఉప ఎన్నికతో ఎన్నో సానుకూల ఫలితాలు వచ్చాయి. నిషేధించిన 16 సంస్థల్లో ఒకటైన పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల్లో కేసీఆర్ తనను సంఘం అధ్యక్షుడిని చేస్తే పౌర హక్కుల కోసం పోరాడుతాన న్నారు. ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు భావ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛపై ఉపన్యాసాలు ఇచ్చినవాళ్లు, అధికారంలోకి రాగానే నియంతలుగా అవతారమెత్తితే ఓటరు విసిరే ఈటెలకు గాయాల పాలుకాక తప్పదు. ఓపికగా ఉద్యమాలను కొనసాగించడమంటే అది మితవాద వైఖరిగా, జావగారిపోయిన తీరుగా, జబ్బలు జారవేసిన తీరుగా భావించడం, ముద్ర వేయడం ప్రజలకు ఎంతో నష్టం కలిగించింది. ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల్లో ఒకటైన మన దేశం పత్రికా స్వేచ్ఛలో 142వ స్థానంలో ఉండడం యాదృచ్ఛికం ఏమీ కాదు. స్టాన్ స్వామిలాంటి ఆక్టోజె నేరియన్ను మన వ్యవస్థల నిష్క్రియాపరత్వంతో ఆక్టో పస్లా చుట్టుముట్టి అంతం చేస్తే మూల్యం భవిష్యత్తు తరాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూల్యం ఎన్ని కల్లో ఓటర్లు విసిరే ఈటెల కంటే పెద్దది. వ్యాసకర్త డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు మొబైల్ : 98484 72329 -
Krishnapatnam Medicine: ఎంత ఆనందమయ్యా ఈ నిర్ణయం!
కరోనాకు మా పతంజలి మందు తయారు చేసిందని రామ్‌దేవ్ బాబా అట్టహాసంగా కొరోనిల్ మాత్రలను కేంద్ర ఆరోగ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేశాడు. ఎంత పని చేస్తుందో తెలియని మందు కరోనాను నిల్ ఎట్లా చేస్తుందని కోర్టుకెక్కితే అల్లోపతి మీద, ఆధునిక డాక్టర్ల మీద అడ్డగోలు కామెంట్లు చేశాడు. ఈ దుర్మార్గ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెయ్యి కోట్ల జరిమానా కట్టమని ఆందోళన చేస్తున్నారు డాక్టర్లు. కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వందల మంది డాక్టర్లు చనిపోతుంటే వాళ్ళనే కాపాడుకోలేని దద్దమ్మ అల్లోపతి అదో హంతకపతి అన్నాడు రామ్‌దేవ్. ఉత్తర భారతాన పెద్ద దుమారం రేగుతున్నా ఉలుకూ పలుకూ లేని కొన్ని తెలుగు మాధ్యమాలు... పెరటి మొక్కల్ని, సాధారణ మూలికల్ని మందుగా నూరి, కరోనాకు చెక్ పెట్టే అవకాశం ఉందని కృష్ణపట్నంలో ఆనందయ్య చెబుతుంటే మాత్రం ఏవేవో ప్రచారాలు, ఫిర్యాదులు, నానా రభస. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నీ ఏదో ఓ నిర్ణయం తీసుకో వాల్సిన ఒత్తిడి. వేలమంది మందు కోసం బారులు కట్టి ఎదురు చూస్తుండగా బలవంతంగా ఆపి వేయాల్సిన పరిస్థితి. ఒక నిర్ణయం కోసం ఆయుష్ డైరెక్టర్ రాములు కృష్ణపట్నం వెళ్ళి మందులో మూలికలు, పరిమాణం, తయారీ విధానం తెలుసుకుని, రోగుల నుండి అభిప్రాయాలు తీసుకుని, ఆయుర్వేద పరిశోధన కేంద్ర సంస్థలో మూలికల శాస్త్రీయ విశ్లేషణ జరిగి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వడం చకచకా జరిగింది. కోర్టు తీర్పులకు ముందే తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపి ఏ మందులు అనుమతి ఇవ్వాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టం చేస్తూ, ఆనందయ్య చెప్పిన పి.ఎల్.ఎఫ్. అనే మూడు మందులకు అనుమతి ఇచ్చారు. ఆయుష్ రాములు మాట్లాడుతూ దీన్ని ఆయుర్వేదంగా గుర్తించడం లేదు, నాటుమందుగానే పరిగణించాలన్నారు. సన్నాయినొక్కు మెరుగైన సమాజాలు నిన్న చనిపోయిన కోటయ్య హెడ్మాస్టర్ను ఎన్నోసార్లు చంపేశారు. ఇప్పుడు కూడా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది కనుక ఎంత ఆనందమయ్యా ఈ నిర్ణయం అని చాలామంది అనుకుంటు న్నారు. ప్రభుత్వం ప్రజల్ని భ్రమల్లో ముంచడం కోసం, తమ వైఫ ల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం అనుమతి ఇచ్చిందని అనేవాళ్లూ ఉన్నారు. చికిత్స ఇంత చవకగా దొరికితే ఎట్లా? రెండు రాళ్ళు వేద్దామని కొందరు ఏవేవో విషయాలు ముందుకు తెస్తారు. ఆయుర్వేద వాత, కఫ, పిత్త సిద్ధాంతం, శుద్ధీకరణకు ముందే దేశవాళి మూలవాసు లది మూలికా వైద్యం. గ్రంథస్తం కాకున్నా కంఠస్తంగా, అనువం శికంగా కొనసాగుతున్నది. కరోనాకు అడ్డుకట్ట వేసిన చైనా ఆధునిక వైద్యంతో పాటు మూలికా వైద్యానికి కూడా పెద్దపీట వేసింది. హోమియోలోనూ మెటీరియా మెడికాకు మూలికలే సృజన. మూలికల నుండి చురుకైన మందును అల్లోపతికి ముందే సంగ్రహిం చడం మొదలుపెట్టారు. చెట్ల ఆల్కలాయిడ్స్‌ను ఇప్పటికీ సంగ్రహి స్తూనే ఉన్నారు. ఇన్ని తెలిసి మూలికా వైద్యాన్ని ఆయుర్వేదం కంటే, అల్లోపతి కంటే తక్కువ చేయడం హేతుబద్ధత ఎట్లవుతుంది? అన్ని శాస్త్రాల కంటే ముందు ఈ నాటువైద్యమే మేటి వైద్యమై మనుషుల్ని, జంతువుల్ని అనేక రోగాల నుండి కాపాడుకున్నది. కరోనా కష్టకాలంలో గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన ఆనందయ్య మందు తప్పకుండా అన్ని కరోనా కేసులకు పని చేస్తుందని చెప్పలేకపోయినా, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఇమ్యూనిటీ బూస్టర్ల కంటే బాగా పని చేస్తుందేమో. ఇప్పటికీ కామెర్లకు ఇచ్చే మూలికా వైద్యం, గాయాలు మాన్పడానికి ఇచ్చే పూత మందు అద్భుతంగా పనిచేస్తాయి. శరీర ప్రకృతిలో రోగ వికృతిని సృష్టిలో భాగమైన ఆకులు, అలములు సరి చేసినంత ప్రభావశీలంగా ఇతర పదార్థాలు చేయవని మనకు అర్థమ వ్వాలి. ఒక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, దేశవాళీ వైద్యానికి ఆధునిక పరిశోధన తోడై గొప్ప ఫలితాలు సాధించాలి. చండీగడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్లో బెటాడిన్ బదులుగా వేపరసం వాడి అద్భుత ఫలితాలు రాబట్టినారు. లక్షల సంవత్సరాల మనిషి నాగరిక క్రమంలో తినే పంట చెట్లు, శరీర ధర్మాన్ని వ్యాధిని ఎదుర్కోవడానికి సిద్ధం చేసే మందుచెట్లను గుర్తించడంతో ఆధునికయుగం సారవంతం అయింది. నడమంత్రపు పెట్టుబడి శాస్త్రాలు తిమ్మిని బమ్మి చేయాలని చూసినా, ప్రతి దేశంలో తమకు అందుబాటులోని మూలికా వైద్యాన్ని ఆధునీకరించడం, వందల ఆనందయ్యలకు ప్రభుత్వాలే ప్రోత్సాహాన్నివ్వడం ఇప్పుడు అవసరం. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం దాక, చెట్లలో, పుట్లలో, నదీజలాల్లో, దూసర క్షేత్రాల్లో సంజీవనీ పర్వతాలు అడుగడుగునా ఉంటాయి. అందుకే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందమయ్యా! పక్క రాష్ట్రాలకైనా తన మందు సరఫరా చేస్తానంటున్నాడు ఆనందయ్య. తెలంగాణలోనూ కృష్ణపట్నం మందుతో కుదుట పడినవాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. నిన్నటి జగన్ నిర్ణయం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం కావాలి. - డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు. 9848472329 -
Krishnapatnam: చెట్లక్రియ కమాల్... కరోనా ఢమాల్?
కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపి, రెమ్‌డెసివిర్, ఐవర్‌మెక్టిన్, హెచ్‌సీక్యూ అంతా ఒడిసిన ముచ్చట. కొత్త ప్రొటోకాల్ వేరే వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేల్చిన బాంబు కరోనా రోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నది. ఆక్సిజన్ లేక, వెంటిలేటర్లు లేక వణుకుతున్న జనానికి అనుభవంతో కొందరు, అత్యుత్సా హంతో కొందరు చిత్రమైన వైద్యం చెబుతున్నారు. హైదరాబాద్ డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ (2డి ఆక్సీ గ్లూకోజ్) ఎప్పుడు చేతికి వస్తుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో... ఎక్కడో నెల్లూరు జిల్లా కృష్ణపట్టణంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు కలలోనో, నేరుగానో ఒక సాధువు సూచించిన ఫార్ములా ఇది అని పెరట్లో మొలిచే మొక్కలతో తయారు చేసిన మందు కరోనా రోగులకు ఇవ్వడం, కొంత మందికి కంట్లో చుక్కలుగా వేయడంతో వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతున్నా యనీ, ఆయాసం తగ్గుతుందనీ వచ్చిన వార్త కొత్త ఆశలు రేపింది. సామాజిక మాధ్యమాల ప్రచారం ఊపందుకుని అరలక్ష మంది ప్రజలు బారులు తీరి చికిత్స చేయించుకుంటున్నప్పుడు ఎవరో ఫిర్యాదు చేస్తే జిల్లా వైద్యాధికారి, ఇతరులు మందుకు శాస్త్రీయత, కోవిడ్ నిబంధనల పేరుతో ఆపివేసినారు. వెంటనే వైసీపీ స్థానిక ఎంఎల్ఏ చొరవ తీసు కొని ఉచితంగా ఇస్తున్న ప్రభావవంతమైన మందును ఎట్లా ఆపుతారని అధికారులను ప్రశ్నించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రికి కూడా తెలియజేయడంతో అధికార యంత్రాంగం కదిలి, కొంత విచారణ చేసి, అనుకూల అభిప్రాయాలను చెప్పింది. ఇప్పుడే అందిన వార్త, మందు పనితీరు, శాస్త్రీయత, సురక్షత గురించి ఐసీఎంఆర్ కదిలినట్లు. బహుళ జాతి కంపెనీలే ఏమీ చేయలేకపోతున్నాయని పెదవి విరుస్తున్న వాళ్ళకు ఒక విషయం తెలియాలి. కరోనా కాలంలో ఇన్ని మందులను జనానికి అంటగట్టి ఇప్పుడు పనికి రావని ఎలా అంటున్నారు? ప్రపంచంలో ఫార్మా స్యూటికల్స్‌తో పోటీ పడుతూ ఫైటోస్యూటికల్స్ ఎదుగుతోందని, మనం అల్లోపతిలో వాడుతున్న డిగాగ్జిన్ గుండె మందు, విషం విరుగుడుకు అట్రోపిన్ , క్యాన్సర్‌కు వాడే విన్ క్రిస్టిన్ మన పెరటిచెట్ల నుండి సంగ్రహించినవే అని తెలియాలి. హోమియోపతిలో కూడా చెట్టు క్రియను ఆల్కహాల్‌తో పోటెన్సీ పెంచి ఔషధంగా వాడుతారు. చైనాలో హెర్బల్ మెడిసిన్ తారస్థాయిలో ఉంది. మలేరియాకు క్లోరోక్విన్, క్వినైన్ , ఆర్టిమెస్మన్, శారీరక బలహీనతకు జిన్ సెంగ్, పక్షవాతం, ఇతర నరాల జబ్బులకు జింకోబా చేనా, ఇతర దేశాలు అందించిన చెట్టు ఉత్పత్తులే. ఆనందయ్య మందులోని మూలకాలను, మూలికలను స్పష్టంగా బహిర్గతం చేయడం గొప్ప విషయం. సాధారణంగా ఉచితంగా మందులు ఇచ్చినా ఫార్ములా చెప్పేది లేదంటారు. సీదా సాదా ఆనందయ్య పదిమందికి ఈ ఫలితం అందాలని ఉవిళ్ళూరుతున్నారు. ఏఏ మూలికలతో ఈ మందు తయారయ్యిందో వాటి నిష్పత్తి తెలియజేస్తే ఆయుష్ విభాగాలు వాటిని ప్రయోగ ప్రాతిపది కన కరోనా రోగులకు అంద జేయాలి. ఫలితాలను శాస్త్రీయంగా రికార్డు చేయాలి. అంతర్జాతీయ ఎపిడెమాలజిస్టు శ్రీనాథ్‌రెడ్డిని వైద్య, ఆరోగ్య సలహాదారుడిగా సేవలందించమని అడిగి, చేర్చుకొని ఫలితాలు రాబడుతున్న జగన్ మోహన్‌రెడ్డి యుద్ధప్రాతిపదికన ఆనందయ్య మందు మీద దృష్టి సారించి కేంద్రానికి కూడా నివేదిక అందించాలని కోరుకుందాం. బ్లాక్ ఫంగస్‌కు యునానీ వైద్యం పనిచేస్తుందని ఆ డాక్టర్లు ప్రకటించారు. కరోనా నయమైతే బ్లాక్, వైట్ ఏ ఫంగస్ సమస్య ఉండదు. 2డీజీతో సంచలనమైన తెలుగు రాష్ట్రాల పరిశోధన ఈ కరోనా కాక్ టెయిల్‌తో విశ్వవ్యాపితమవ్వాలని ఆశిద్దాం. - డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు మొబైల్ : 98484 72329 -
తెలంగాణ ఇంటి పార్టీలో చేరిన వెదిరె చల్మారెడ్డి
సాక్షి, నల్గొండ: టీజేఏసీ వ్యవస్థాపకుడు కోదండరాం నాయకులను చేయగలరు కానీ.. ఆయన మాత్రం నాయకుడు కాలేరని వెదిరె చల్మారెడ్డి విమర్శించారు. టీజేఎస్ రైతు విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఆయన తన అనుచరులతో కలిసి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం వెదిరె మీడియాతో మాట్లాడుతూ... ఏదైనా పార్టీలో సమష్టి నిర్ణయం ఉంటుందని కానీ, జన సమితిలో మాత్రం అభిప్రాయాలు అందరివీ తీసుకుని ఆఖరుకు నిర్ణయం మాత్రం కోదండరాం ఒక్కరిదే ఉంటుందని ఆరోపించారు. ఆయన నియంత పోకడలతో పార్టీని నాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుతం పార్టీలో వంద మందితో సమావేశం ఏర్పాటు చేసే శక్తి పార్టీ నేతలలో ఒక్కరు కూడా లేరని, కేవలం భజనపరులే ఉన్నారని ఆయన ఎద్దేవ చేశారు. అలాగే చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తాను నల్లగొండ జిల్లా వాసిగా వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో కలసి పనిచేద్దామని కూడా చెప్పానని, కానీ కోదండరాం తానే స్వయంగా నిలబడుతున్నానని తనకు మద్దతు ఇవ్వాలని కోరారని వెల్లడించారు. ఓ అభ్యర్థి ఇలా మద్దతు అడగటం చరిత్రలో ఇదే మొదటిసారని సుధాకర్ పేర్కొన్నారు. -
దమ్మున్న వారిని శాసనమండలికి పంపాలి
హన్మకొండ: ప్రభుత్వంతో కొట్లాడే దమ్ము.. సమస్యలపై మాట్లాడే సత్తా, ధైర్యం ఉన్నవారిని శాసన మండలికి పంపాలని, ఇవన్నీ తనకు ఉన్నాయని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం ఆయన హన్మకొండ విద్యానగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1.2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని భర్తీ చేస్తానన్న సీఎం కేసీఆర్ తన హామీ విస్మరించారని విమర్శించారు. విద్యావ్యాపారం చేసే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే ఆయన స్థాయి పెరిగిందని, విద్యా వ్యాపారులు ప్రైవేట్ వర్సిటీలకు అధిపతులయ్యారని ఎద్దేవా చేశారు. కాగా, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మహాకూటమి నాయకులతో చర్చించి తనకు మద్దతు ఇచ్చేలా అందులోని పార్టీలను ఒప్పించి గౌరవం నిలుపుకోవాలని ఆయనను కోరారు. -
చెరుకు సుధాకర్ కొడుకు హాస్పిటల్ సీజ్
సాక్షి, నల్గొండ : తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుమారుడు నిర్వహిస్తున్న జిల్లా కేంద్రంలోని నవ్య ఆస్పత్రిపై అక్రమంగా కేసులను పెట్టి సీజ్ చేశారని ఆయా సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక నవ్య హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, విద్యావంతుల వేదిక నాయకులు పందుల సైదులు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి మాట్లాడారు. అతితక్కువ ఫీజులతో నిరుపేదలకు వైద్యం అందిస్తున్న నవ్య ఆస్పత్రి నిర్వాహకులు, డాక్టర్ చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ సుహాస్‌పై పోలీసులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి అత్యుత్సాహంతో వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి సీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఏకపక్షంగా ఎలా సీజ్ చేస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటుగా జిల్లాకేంద్రంలోని పలు ఆస్పత్రులపై ఫిర్యాదులు వందల సంఖ్యలో వచ్చినప్పటికీ ఎందుకు ఆయా ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తక్కువ ఫీజులతో పేదలకు వైద్యం చేయడం నేరమా అన్నారు. కేవలం నవ్య హాస్పిటల్ బడుగు, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిది కావడంతో పాటుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్‌పై రాజకీయంగా అణిచివేతలో భాగమే అక్రమ కేసులు, ఆస్పత్రిని సీజ్ చేయడమన్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి డాక్టర్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవడంతో పాటుగా హాస్పిటల్ సీజ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కుట్రలో భాగమే : చెరుకు ఆస్పత్రిలో తక్కువ ఫీజులతో పేదలకు వైద్యం అందిస్తున్న డాక్టర్‌పై అక్రమంగా కేసులను పెట్టి అరెస్టు చేయడంతో పాటుగా ఆస్పత్రిని సీజ్ చేయడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదని డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు. రాజకీయంగా తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గమైన చర్యలు ఉంటాయని ఆనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసులను ఎత్తివేసి సీజ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షం, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్, ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్‌మాదిగ, కట్టెల శివకుమార్, ఏర్పుల శ్రవన్‌కుమార్, జనార్దన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కుట్రతోనే నా కొడుకును అరెస్ట్ చేశారు
నల్లగొండ టౌన్: ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారన్న కారణంతో డాక్టర్‌ను అరెస్ట్ చేసిన చరిత్ర ఇంతవరకు ఎక్కడా లేదని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం నల్లగొండలో ప్రజా సంఘాల నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఫీజులు ఎక్కువ వసూలు చేస్తే అందుకు సంబంధించి నోటీసులు ఇవ్వాలి. స్పందించని పక్షంలో చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎలాంటి నోటీసులు లేకుండా డీఎంహెచ్ఓను అడ్డం పెట్టుకుని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి నా కుమారుడు డాక్టర్ సుహాస్‌ను అరెస్ట్ చేయడం, ఆస్పత్రిని సీజ్ చేయడం ఎంతవరకు సమంజసం’అని ప్రశ్నించారు. ఐసీయూలో పేషెంట్లు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ఆస్పత్రిని సీజ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజకీయంగా కుట్ర పన్ని సుహాస్‌ను అరెస్ట్ చేయించిందని ఆయన ఆరోపించారు. ఇది నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి సొంతంగా వచ్చిన ఆలోచన కాదని, పైనుంచి కింది వరకు రాజకీయ కుట్రతోనే జరిగిందని ఆరోపించారు. తానూ ఉద్యమంలో పనిచేశానని.. దేనికీ భయపడనన్నారు. ‘చావు నాకు బోనస్.. నా కొడుకుకు నేను పిరికి మందు తాపలేదు.. నా కొడుకు దగ్గర పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటా.. కానీ నువ్వెవరు మమ్మల్ని అనడానికి’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుహాస్‌పై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేసి ఆస్పత్రి సీజ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర స్థాయిలో ప్రజా సంఘాలను కలుపుకొని ప్రభుత్వ తీరును ఎండగడతామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆదివారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతున్న చెరుకు సుధాకర్ -
మన కోసం జ్వలించినవాళ్లను గౌరవిద్దాం
ఆకలితో ఉన్నవాళ్ళను భూగోళం ఎట్లా కనపడుతుందని అడిగితే విసిరిన అన్నం ముద్దల్లా ఆరు ఖండాలు సముద్రమంత ఆకలితో మధ్య మధ్యలో నేనే అన్నాడట... ఇప్పటికీ కరుణ లేని కరోనా, మృత్యు కోవిదురాలై ప్రతి వాకిట మృత్యుపేటిక పేర్చి నిజంగానే భూగోళం ఎట్లా కనపడుతుందంటే ప్రతి ఖండమూ దహన వాటిక తీరు తగలబడుతుందని అనక తప్పదు. కరోనా గురించి వార్త రాస్తున్న వాళ్ళు చచ్చిపోతున్నారు.. కరోనాను నిలువరించే ముందు వరుస యోధులు డాక్టర్లు, నర్సులు చచ్చిపోతున్నారు. ఈ మహమ్మారిపై పాటల ఖడ్గాన్ని ఝళిపిస్తున్న పాటగాళ్లు, కళాకారులు చచ్చిపోతున్నారు. ఊరు, పేరు లేని నిరుపేదలు, మట్టిమనుషుల చావులు సర్కారు లెక్కల్లోకి రానే రావడం లేదు. బహుశా మునుపెన్నడూ లేని ఒక భయానక మృత్యుధూళి మన కాళ్ళకింది భూమిని సునామీగా పెకిలించి ఎంతో మంది అద్భుత మానవతా మూర్తుల్ని, యోధుల్ని, మన కోసం జీవితమంతా జ్వలించిన వాళ్ళను దహన వాటికకు తరలిస్తున్నది. దిక్కుతోచక, భయ విహ్వలతతో అంతిమ సంస్కారంలోనూ పాల్గొనక వారి జీవిత కాల సేవాతత్పరతను, స్ఫూర్తిని, ఎత్తిపట్టే చివరి నివాళి కరువు అవుతుందని మన కాలపు యోధుడు ఉప్పుమావులూరి సాంబశివరావు (ఉ.సా) అకాలమరణం గుర్తు చేస్తున్నది. ఎక్కడో గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో పుట్టిన డెబ్బయి ఏళ్ళ ఉ.సా అనేక విప్లవ, బహుజన ఉద్యమాల సాధికారత, సార్వత్రికత.. నిరంతర సన్నద్ధత.. ఆ మొన్నటి అర్ధరాత్రి ఉద్యమాల ఉపాధ్యాయుడి ఊపిరిని కరోనా కబళించేదాక ఆయన విశ్రమించిన జీవన ఘడియలు లేవు. మంగలి కత్తికి, పోరాటపు కొడవలికి ఎంత పదునో చీకొండ మొదలు గిరిజన పోరాటం నడిపిన ఉసానే చెప్పగలడు. కామందు కాఠిన్యం, ఆకలితో ఉన్న పాపను జోకొట్టిన జోలపాట మార్ధవం, కవులు, కళాకారులు ఏంచెయ్యాలో చెప్పే ప్రబోధం, పాటగా అలవోకగా రాస్తూ కాలానికి తాళం వేస్తూ కరువును, కులం బరువును, ఆధిపత్యకులాల దరువును తెలుగు నేల మీద సరిగా అంచనా వేసి దేశీ – దిశ కోసం కారంచేడులో రొమ్ము విరుచుకొని రుదిర క్షేత్రంలో నిలబడడం ఆయనకే సాధ్యమయ్యింది. కరోనా మహమ్మారి కాలంలో మనుషుల విపరీత ప్రవర్తన ఎవరిని వదలడం లేదు. చెన్నైలో, ఇంకా చాలా చోట్ల డాక్టర్లు చనిపోతే శ్మశాన వాటికలో ఖననానికి, దహనానికి అడ్డుపడ్డ అమానవీయ సంఘటనలు ఎన్ని? సేవా మూర్తులకు మనమిచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించింది ఇందుకనే. చెరుకు సుధాకర్ ముందలపడి అంత్యక్రియలు చేస్తే ఆహాహా అంటున్న మిత్రులారా! ఉ.సాకు, జీవితమంతా జ్వలిస్తూ బతికిన ప్రతివాళ్ళకు మనమెట్లాగూ మరణాంతర పురస్కారాలు ఇవ్వలేము, కడచూపులో భాగమవ్వడం మన బాధ్యత. ఇప్పటికే కరోనాపై పలు పుకార్లు మానవ సంబంధాలను చాలా దెబ్బతీశాయి. జరగాల్సిన నష్టం జరిగింది. ఉ.సా నడిచిన ఉద్యమ దారుల్లో ఎదిగి వచ్చిన మిత్రులారా! రండి! మనం సేవాదళ్‌గా ప్రజలకు ఈ కరోనా కష్టకాలంలో మరిం తగా చేరువ కావలసి ఉన్నది. ఏ ఒక్క చావు అగౌరవంగా మట్టిలో కలవకుండా మనం సహకరిద్దాం. మనవాళ్ళ అంత్యక్రియలను కరోనా కాలంలో గౌరవం తగ్గకుండా కొనసాగిద్దాము. ఐసోలేషన్ సెంటర్లలో, హాస్పిటల్స్‌లో సేవలకు స్వచ్ఛందంగా ముందుకు వద్దాం, ఉ.సా కరోనా కాలంలో చనిపోయి మనకు కొత్త బాధ్యతను అప్పజెప్పి వెళ్ళిండు. ఆ బాధ్యతను పూర్తి చేస్తే ఉ.సా.ను సంపూర్ణంగా గౌరవించినట్లే. వ్యాసకర్త: తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు మొబైల్ : 98484 72329 -
చీకటి ఎమర్జెన్సీకి 45 యేళ్లు
ఎమర్జెన్సీ ప్రకటించిన అర్ధరాత్రి తెల్లారే, ఇవ్వాళ అధికారంలో ఉన్న పార్టీ ముఖ్య నాయకులంతా జైళ్ళలోనే ఉన్నారు. మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్ నారాయణ్, ఎల్.కె.అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇలా ‘అంతర్గత భద్రత’కు ముప్పు అను కున్న వారినందరినీ నాటి ప్రధాని ఇందిరా గాంధీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌తో ‘రబ్బర్ ముద్ర’ కొట్టించి చీకటి కొట్టాలకు తరలించింది. లక్షమందికి పైబడిన ఆరెస్సెస్ సైన్యం ‘అభివృద్ధి నిరోధకులు’గా ముద్రపడి నిర్భందానికి గురయినారు. విప్లవ కమ్యూనిస్టుల అరెస్టులు, చిత్ర హింసల, ఎన్కౌంటర్లకు అదుపే లేదు. సిక్కుల హక్కులు, అకాలీ కార్యకర్తలు అపర ‘కాళీమాత’ ఇందిరాగాంధీ కంటి వేడికి దగ్ధమయిన తీరు ‘శిరోమణి గురు ద్వారా’ల్లో ఇప్పటికీ చర్చిస్తూనే ఉంటారు. భూమయ్య, కిష్టాగౌడ్‌ను ఉరి తీయవద్దని, రైట్–లెఫ్ట్, వాజ్‌పేయి, జయప్రకాశ్ నారాయణ్, శ్రీశ్రీ, జార్జ్ ఫెర్నాండెజ్, జైపాల్‌రెడ్డి, భూపేష్ గుప్తా, కన్నాభిరాన్, చండ్ర రాజేశ్వర్రావ్, ఇంకెందరో 1975లో ఢిల్లీలో ఆందోళన నిర్వహించిన వారే. అయితే సరిగ్గా 45 యేండ్ల తరువాత ఉరిశిక్షలు, ఎన్కౌంటర్లు వద్దన్న వాళ్ళు ఇప్పుడు మోదీ ప్రభుత్వ మార్గదర్శకులుగా ఉన్నారు. మరోవైపు ఇతరులంతా తుకుడే తుకుడే గ్యాంగ్‌గా ముద్రపడి ప్రతి పక్షంలో ఉన్నారు. పైగా, ఈ దేశంలో అత్యంత దారుణ పరిస్థితు లలో తప్పుడు కేసుల్లో భీమ్ కోరేగావ్ అల్లర్ల పేర ప్రొఫెసర్ సాయి బాబా, వరవరరావు, సోమా సేన్, గౌతమ్ నవలాభా, ఆనంద్ తేల్ తుంబ్డే, సుధా భరద్వాజ్, విల్సన్ ఇంకా ఎందరో నెలల తరబడి జైళ్ళలో ఉండటాన్ని ఎట్లా చూడాలి? ఎన్కౌంటర్లు రాజకీయ హత్యలన్నది ఒక అంశమయితే, ఎన్కౌంటర్లు లేకుండా చీకటి గుహల్లో రాజకీయ ఖైదీలకు ఉండే సౌకర్యాలు కూడా లేకుండా చేసి బ్రతికి ఉన్నన్నాళ్లు అందులోనే మగ్గి చచ్చి పోవాలని చూస్తున్న తీరు మరో అంశం. లక్షల మందిని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడగట్టి, ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టడం కోసం అన్ని రాజకీయ పక్షాలతో ఫ్రంట్ కట్టి, ఇందిరకు చుక్కలు చూపెట్టిన నాగ్‌పూర్‌లోని కార్యాలయం ‘నాగ్, నాగ్’ అంటూ ఇప్పుడు బుసలు కొట్టడం ఒక సాంస్కృతిక సేనాని సంస్థ చేసే పనేనా? నాకు బాగా గుర్తున్నది ఒకసారి కుల్దీప్ నయ్యర్ ఎమర్జెన్సీ అనంతరం రాజకీయ సమరశీలత, నిబద్ధత, గొప్ప యువతరం వనరు ఉన్నది ఆరెస్సెస్, నక్సలైట్లలోనేనని అన్నారు. ఎమర్జెన్సీకి పదిరెట్లు హక్కులు కుంచించుకుపోయిన దేశంలో ఈ ఇద్దరికీ దేశ రాజకీయాల్లో ఉన్న ప్రాభవమెంత? అంగీకారమెంత? అన్నది వేరే చర్చగానీ ఎమర్జెన్సీని తెచ్చిన కాంగ్రెస్‌ను ఇప్పుడు లిబరల్ పార్టీగా ఎక్కువ మంది గుర్తించటం ఆశ్చర్యమే! ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాల హక్కులు, ప్రజల హక్కులు కాపాడతామని మాట్లాడే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి ఇలాఖాలో ఇష్టారాజ్యం, హక్కుల హననం కొనసాగిస్తూనే ఉన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, స్థానిక పోలీసులకు ‘చట్ట బద్ద కొమ్ములు’ ఇచ్చి అన్ని రాష్ట్రాల్లో స్థానిక నల్ల చట్టాలతో అణచివేత కొనసాగించేలా చూసే వివిధ రాష్ట్రాల నేతలు నిన్నటి తమ గొప్ప ప్రజాస్వామ్య ప్రాభవాన్ని, స్ఫూర్తిని మరిచి జాతికి ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తు చేస్తున్నారు. ఎన్కౌంటర్లు లేకుండా పాలకులు బతుకలేరు. అధీకృత హింస లేకుండా నక్సలైట్లు బతుకలేరు. యుద్ధ ప్రభువులు రాష్ట్రాలు, ప్రాంతాల్లో అధికారంతో పాటు వనరులు కొల్లగొట్టి, సంపదను, శ్రమను కొల్లగొట్టే వాళ్ళకు సహకరిస్తూ– వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలకు వాటాదారులయి, విపరీతమైన ఎన్నికల పెట్టు బడితో, సాంకేతిక లబ్ధితో అనుకూల ఫలితాలు సాధిస్తూ, ఇదే ప్రజాస్వామ్యమని ఊరేగుతున్నప్పుడు జూన్ 25న జడలు విర బోసుకున్న నాటి అత్యవసర పరిస్థితి ‘వేయి నాలుకల భద్రకాళి’ నేటికీ వెంటాడినట్లే అనిపిస్తుంది. స్వాతంత్య్రం తొలినాటి ప్రజా తంత్ర వైభవాలు కాల గర్భంలో కలిసినట్లే అనిపిస్తుంది. మన కళ్ళ ముందు యాభై యేండ్ల చరిత్రలో ఎన్నో అధిగ మించలేని సవాళ్ళు. గింగిరులు కొడుతున్న సుడి గుండాలు. గుండె దిటవుతో పోరాడే దివిటీలు. రాజ్యాంగం పీఠికపై మొలుస్తున్న కొత్త సింగిడీలు. ఏ కాన్వాసు మీద చిత్రీకరించలేని రఫ్ పెయింటింగ్ వర్తమాన భారతం. ఏ కవీ, తత్వవేత్త ఏకవేదంగా కూర్చి, విడ మర్చి, య«థా లాపంగా చెప్పలేని సమకాలీన భారత రాజకీయంలో ఏ సోయి, ఏ గాయం గమ్యంలో, గమనంలో లేని ఒక సౌకర్యవంతమైన ధారావాహికకు... చీకటి రోజు... ఉజ్వల ఉత్తానం– ఉదాత్త మానవ పునరుత్తానం... అన్నీ ఉట్టి మాటలే. చీకటిని చీల్చి గుండెను ఎదురునిల్చి సమాధుల్లో వొరిగి పోయిన వాళ్ళ బంధువులకు, రక్త సంబంధీకులకు తమ వాళ్ళు వదిలి పెట్టిన బాధ్యత గుర్తు రావాలని ఆశించడం అత్యాశ ఏమి కాదు. అట్లా మిగిలి ఉన్న అమరుల స్మృతి చిహ్నాలను కూడా ధ్వంసం చేస్తూనే ఉన్నారు. దర్శించుకుంటే నేరమని అంటారు అందరు పాలకులు. సిక్కుల ఊచకోతలో కాంగ్రెస్ భాగస్వామ్యమయిన సంఘ టనలు దురదృష్టకరమని, విచారకరమన్న సోనియాజీ అట్లనే అత్యవసర పరిస్థితుల పర్యవసానాలకు నాటి కాంగ్రెస్‌కు రాజకీయ వారసులు అయినందున విచారం వ్యక్తం చేస్తే ఎంత బాగుండు? అట్లాంటిది పునరావృతం కాదని అనే పాలకులు ఎవ్వరో వొడిసి పట్టుదాం. డాక్టర్ చెరుకు సుధాకర్ , వ్యాసకర్త, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు మొబైల్ : 98484 72329 -
‘కేసీఆర్‌కు కరోనా కన్నా పెద్ద వైరస్ సోకాలి’
సాక్షి, గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): తెలంగాణ అమరవీరుల, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా కన్నా పెద్ద వైరస్ సోకాలని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. మంగళవారం ఆదర్శ్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, తెలంగాణ ఇంటి పార్టీ 3వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. (సందిగ్ధంలో టీడీపీ అధ్యక్షుడి ఎంపిక) ఈ సందర్భంగా జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. సుధాకర్ మాట్లాడుతూ జై తెలంగాణ అని రక్తం చిందించిన ఉద్యమకారులు నేడు జైలులో ఉంటే తెలంగాణ రద్దు అన్న ద్రోహులు నేడు కేసీఆర్ చుట్టూ అధికారంలో ఉన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని తెలిపారు. సమావేశంలో 1969 ఉద్యమ కారులు, రామరాజు, శ్రీహరి, కొండస్వామి, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, సందీప్, హరీశ్‌యాదవ్ పాల్గొన్నారు. (కోడికి చారానా.. మసాలాకు బారానా) -
మిమ్మల్ని మించిన సైకోలు ఉండరు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ హాస్పిటల్లో వైద్య సేవలపై, సెక్రటేరియట్‌ను కోవిడ్ హాస్పిటల్‌గా మార్చడంపై ప్రతిపక్షాలు చేసిన సూచనలపై ఆయన అహంకారపూరితం గా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వేల మందికి ఎమర్జెన్సీ వైద్య సేవలందించే గాంధీ హాస్పిటల్‌ను పూర్తి స్థాయి కరోనా హాస్పిటల్‌గా మారుస్తున్నామని ప్రకటించి, లక్ష ల మందిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతిపక్షాల సూచనలను విమర్శించడం సరికాదని అన్నారు. కరోనా పారాసిటమాల్‌తో తగ్గుతుందని, మాస్కులు మా అందరికీ ఉన్నా యా అని వెకిలి నవ్వు నవ్వి, సైకో వైఖరి ని అవలంబించింది సీఎం కేసీఆర్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఖాళీగా ఉన్న సెక్రటేరియట్‌ను ఐసోలేషన్ వార్డు కింద మార్చి, దగ్గర్లో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి చాంబర్ నుంచి పర్యవేక్షించడం వివేకమైన పని అన్నారు. కొత్త హాస్పిటల్స్‌ను కోవిడ్ స్పెషాలిటీగా మార్చి, ఉస్మాని యా, గాంధీ, నిమ్స్‌లో ఆధునిక, ఎమర్జెన్సీ వైద్యసేవలు నిరాటంకంగా జరగాలన్న తమ సూచన వారికి శాడిస్టు తీరుగా కనపడిందా? అని చెరుకు సుధాకర్ ప్రశ్నించారు.