
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ రచయితలకు అవమానం జరిగిం దని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అరెస్టుకు నిరసనగా ఆదర్శనగర్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు మహాసభల్లో బ్రాహ్మణ వర్గాన్ని నెత్తికెత్తుకొని తెలంగాణలోని బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనారిటీ కవులను అవమానించారన్నారు.
మహాసభల ప్రారంభానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆహ్వానించి పత్రిక ప్రకటనలు ఇచ్చిన సీఎం కేసీఆర్ ముగిం పు సభలకు హాజరైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురించి ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేద న్నారు. కేసీఆర్ పాటించిన సాహితీ అంటరాని తనాన్ని నిరసిస్తున్నామన్నారు. మంద కృష్ణను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం గద్దర్, జయధీర్ తిరుమల రావులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దొమ్మాట వెంకటేశ్, పీఎల్ విశ్వేశ్వరరావు, విమ లక్క, ఏపూరి సోమన్న, బెల్లయ్య నాయక్, పీజీసీ ఎల్ మాజీ ప్రిన్సిపల్ గాలి వినోద్ తదితరులు పాల్గొన్నారు.