మనుషుల అక్రమ రవాణా కేసు, కేసీఆర్, హరీశ్‌రావు, చెరుకు సుధాకర్
హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో కీలక పాత్రధారులుగా ఉన్న కేసీఆర్, హరీశ్‌రావు, కాశీపేట లింగయ్యలపై చర్యలేవని తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. పద్నాలుగేళ్ల నాటి కేసును వెలికితీసి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం హర్షించదగ్గ అంశమేనని, కేసీఆర్‌పై ఉన్న అభియోగాలపై చట్టం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి కేసీఆర్ లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బుధవారం ఇక్కడి తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కొండగట్టు ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఇంటిపార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment