human trafficking
-
‘సెర్చ్’ ఇంజన్లీ అమ్మలు
‘ఈ పిల్లల ఆచూకీ మీరు కనిపెట్టాలి’ అని పై అధికారి ఆదేశించారు. ‘అలాగే సార్’ అనడమే కాదు ‘ఎలాగైనా సరే’ అనుకున్నారు మనసులో. దిల్లీలోని యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ సీమా దేవి, సుమన్ హుడా ఒక్కరు కాదు... ఇద్దరు కాదు రకరకాల కారణాలతో కనిపించకుండా పోయిన 104 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.ఒకప్రాంతంలో... ‘అయ్యా... నా కొడుకు వారం రోజుల నుంచి కనిపించడం లేదు...’‘ఫోటో ఉందా?‘లేదయ్యా’మరోప్రాంతంలో...‘మా అమ్మాయి కనిపించడం లేదు సారూ... ఎక్కడెక్కడో వెదికాం...’దిల్లీ, దిల్లీ చుట్టుపక్కలప్రాంతాలలో కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 104 ఆ పేద తల్లిదండ్రులలో చాలామంది దగ్గర కనీసం తమ పిల్లల ఫొటోలు కూడా లేవు. కొందరు ‘మా పిల్లలు ఇలా ఉంటారు’ అని పోలికలు చెప్పేవారు.కొందరి దగ్గర ఫొటోలు ఉన్నా అవి అవుట్‌డేటెడ్ ఫొటోలు.. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ‘ఆపరేషన్ మిలాప్’ తెర మీదికి వచ్చింది. ఈ ఆపరేషన్‌ను సీమా దేవి, సుమన్ హుడా సవాలుగా తీసుకున్నారు. దిల్లీలో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్స్ ఎలాగైనా సరే కనిపించకుండా పోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నారు. అదెంత కష్టమో వారికి తెలియనిది కాదు. అయినా సరే, రంగంలోకి దిగారు. ప్రతి కేసును సవాలుగా తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, హరియాణాలో ఊరూ వాడా వెదికారు.కొన్ని సందర్భాలలో బాధితులకు పోలీసులు మాట్లాడే భాష అర్థం కాకపోయేది. పిల్లలను చివరిసారిగా గుర్తించిన ప్రాంతాల్లోని స్థానికులు పోలీసులతో మాట్లాడేందుకు నిరాకరించేవారు. ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదురైనా వెనకడుగు వేయలేదు. సైబర్ టీమ్ సహాయం కూడా తీసుకున్నారు.ఎట్టకేలకు వారి కష్టం ఫలించింది. తప్పిపోయిన 104 మంది పిల్లలను తొమ్మిది నెలల కాల వ్యవధిలో వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో సీమాదేవి, సుమన్ హూడాలు విజయం సాధించారు. ఈ పిల్లలు కనిపించకుండా పోవడానికి ఇంట్లో నుంచి పారిపోవడం నుంచి సోషల్ మీడియాలో పరిచయం అయిన వారి మాటలు నమ్మి వెళ్లిపోవడం వరకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కొత్తప్రాంతాలకు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లినప్పుడు స్థానికులు సీమాదేవి, సుమన్‌లను అనుమానంగా చూసేవాళ్లు. ‘మీరు నిజంగా పోలీసులేనా?’ అని అడిగేవారు. వారిలో నమ్మకం రావడానికి కాస్త టైమ్ పట్టేది. అయినా ఓపికగా ఎదురు చూసేవారు. స్థానికులలో నమ్మకం వచ్చాక... ఇంటింటికి వెళ్లి వెదికేవారు.చెత్త ఏరే పిల్లల నుంచి మొదలు రైల్వేస్టేషన్లో పనిచేసే సిబ్బంది వరకు ఎంతోమంది నుంచి ఎన్నో రకాల క్లూలు సేకరించేవారు.‘ఇంతమంది పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మాకు ఫిక్స్డ్ డ్యూటీ టైమింగ్స్ ఉండేవి కావు. తప్పిపోయిన పిల్లల గురించి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే ఇంటి నుంచి బయలుదేరేవాళ్లం. కనిపించకుండా పోయిన పిల్లల్ని వెదకడంలో మా పిల్లల్ని చూసుకోవడం కుదిరేది కాదు. అయినా బాధ పడలేదు’ అంటుంది సీమాదేవి.‘రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. బాగా అలిసిపోయేవాళ్లం’ అంటుంది సుమన్ హుడా.తొమ్మిది నెలల కాలంలో వారు ఇళ్లు విడిచి, కుటుంబాన్ని విడిచి ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే... కృతజ్ఞతతో నిండిన పిల్లల తల్లిదండ్రుల కళ్ల నుంచి వచ్చిన ఆనంద బాష్పాలను చూసిన తరువాత ఆ కష్టాలేవీ ఇప్పుడు వారికి గుర్తుకు రావడం లేదు. -
పవన్ కల్యాణ్ లెక్క తప్పింది!.. శాసనసభ సాక్షిగా బయటపడ్డ నిజం ఇదే
అమరావతి, సాక్షి: కూటమి పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన సంచలన ఆరోపణలపై.. అసెంబ్లీ సాక్షిగా నిజం నిగ్గు తేలింది. మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన లెక్కలపై ఓ స్పష్టత ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో..గత ఐదేళ్లలో మహిళల అక్రమ రవాణా కేసులు 34 మాత్రమే నమోదుకాగా.. వీటిల్లో 46 మందిని బాధితులుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ హోం శాఖ. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు.. గణాంకాలతో సహా అసెంబ్లీలో ప్రకటించింది. అసెంబ్లీలో వెల్లడైన ఈ సమాధానంతో.. గతంలో పవన్, చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధమని తేలిపోయింది.గతేడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో వలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, ఇందుకు వలంటీర్ వ్యవస్థ కారణమైందని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు, టీడీపీ కూడా ఇదే ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు వేసిన ప్రశ్నతో ఆ లెక్క తేలింది. -
మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి జీవిత ఖైదు
సాక్షి, హైదరాబాద్: మానవ అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఉపాధి పేరిట బంగ్లాదేశ్ నుంచి మహిళలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించినట్లు కోర్టు నిర్థారించింది.2019లో పాతబస్తీలోని చత్రినాక ఠాణాలో నమోదైన కేసు ఆధారంగా.. ఎన్ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఒక బంగ్లాదేశ్ మహిళతో పాటు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. -
అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు యువతీ యువకుల అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమెరికాలో అమ్మాయిల అక్రమ రవాణాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్
ట్రెంటన్: అమెరికా న్యూజెర్సీ స్టేట్‌లో హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించడం గమనార్హం.ప్రిన్స్టన్ పోలీసుల వివరాల ప్రకారం.. గిన్స్బర్గ్ లేన్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. 2024 మార్చి 13న ప్రిన్స్టన్ పోలీసు సీఐడీ విభాగం సంతోష్ కట్కూరి ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక పని చేయిస్తున్నట్లు తేలింది. వీరంతా బలవంతంగా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారినుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రిన్స్టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. సంతోష్, ద్వారకతో పాటు చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలె సైతం వీరికి సహకరించినట్లు తెలిసింది. ఈ నలుగురిపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.గిన్స్బర్గ్ ప్రాంతంలో పనిచేసే ఓ శ్రామికుడు అపార్ట్మెంట్లో చాలామంది పని చేస్తుండడం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా.. డాలస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీలో నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పని చేయించుకుంటున్నారని వెల్లడించారు. -
భారతీయులను నిర్భంధించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న చైనీస్ గ్యాంగ్
-
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: వైజాగ్ చేరుకున్న బాధితులు
విశాఖపట్నం: కంబోడియా కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని విశాఖపట్నం పోలీసు కమిషనర్ రవి శంకర్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో ఈ కేసు సంబంధించిన విషయాలు తెలిపారు. ‘‘మొత్తం 68 మంది బాధితులను రక్షించాము. ఇంకా 90 మంది కంబోడియాలో ఉన్నారు. 68 మందిలో 25 మంది వైజాగ్ వాళ్ళూ. దేశ వ్యాప్తంగా 25 మంది ఏజెంట్లు ఉన్నారు. 12 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశాం. ఆరుగురు ఏజెంట్లుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాము. ఈ మొత్తం స్కాంలో సిమ్ సప్లయార్స్ ముగ్గురుని గుర్తించాం. ... ఒక సిమ్ కార్డు భారత్ నుంచి తీసుకొని వెళ్లి ఇస్తే 10 నుంచి 15 వేలు కమిషన్ ఇస్తారు. నకిలీ బ్యాంక్ అకౌంట్స్.. తయారు చేస్తున్న ముఠాపై కూడా నిఘా పెట్టము. ఎమర్జెన్సీ పాస్ పోర్టు కూడా ఇండియా ఎంబసీ అధికారులు జారీ చేస్తున్నారు’’ అని తెలిపారు.కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. -
కంబోడియా గ్యాంగ్ చేతిలో తెలంగాణ యువకుడి నరకం
-
మానవ అక్రమ రవాణా కేసును చేధించిన విశాఖ పోలీసులు
-
ఆపరేషన్ కంబోడియాపై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: దేశంలో సంచలన రేపిన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి సాధించామని విశాఖ సీపీ రవిశంకర్ అన్నారు. ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, కంబోడియా నుంచి విశాఖకి చెందిన 58 మందిని మేము భారత్ కి తీసుకొని వచ్చామని వెల్లడించారు.ఇప్పటికే వారు ఢిల్లీకి వచ్చి ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 5:15 నిమిషాలకు విశాఖకి బాధితులు వస్తారు. ఎన్.ఐ.ఎలో నాకున్న అనుభవంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నా. ఈ ముఠా వెనుక ఉన్న చైనా గ్యాంగ్‌ను పట్టుకుంటామని సీపీ తెలిపారు.కాగా, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేపట్టింది.ఇది జరిగింది..గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్‌దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి, కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్‌ను కోరాడు. ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్‌గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్ వారిని కాంబోడియా ఏజెంట్ సంతోష్‌కు అప్పగించాడు.ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్‌కు ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది.సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది. చైనా ముఠా చెరలో 5వేల మంది..చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్‌కత్తాకు చెందిన వారూ ఉన్నారు. -
ఆపరేషన్ కాంబోడియా సక్సెస్ 420 మందిని కాపాడిన పోలీసులు
-
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజాగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. మరోవైపు.. ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. 360 మంది భారతీయులను ఎంబసీ అఫ్ ఇండియా కాపాడింది. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: + 855 10642777 సంప్రదించాలని అధికారులు కోరారు. అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు.అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
విశాఖ సిటీ: విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించారు.దీంతో బాధితులను తీసుకువచ్చేందుకు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టు విశాఖ పోలీసులు మూడు రోజుల కిందట బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గాజువాక ప్రాంతానికి చెందిన ముగ్గురు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణావిదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. సైబర్ నేరాలు చేయాలంటూ బలవంతంచైనా ముఠా నిరుద్యోగులకు టైపింగ్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించింది. తర్వాత టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చింది. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కోసం ఏడాది పాటు పనిచేసేలా అగ్రిమెంట్ రాయించుకుంది. మధ్యలో వెళ్లిపోతే 400 డాలర్లు చెల్లించాలని ఒప్పందం చేయించుకుని పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుంది. ఒప్పందం అనంతరం వారిని కంబోడియాలోనే ఒక చీకటి గదిలో బంధించారు. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు ఇతర సైబర్ నేరాలు చేయాలని బలవంతం చేశారు.అలా చేయని వారికి ఆహారం పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేశారు. ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమీషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకొనేది. వీరు అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల ఎంటర్టైన్మెంట్లు పబ్, క్యాసినో గేమ్స్, మద్యపానం, జూదంతో పాటు వ్యభిచారం సదుపాయాలు కల్పించారు.ఒక వ్యక్తి ఫిర్యాదుతోఅక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. రాకెట్‌కు ప్రధాన ఏజెంట్ అయిన చుక్క రాజేష్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు, మన్నేన జ్ఞానేశ్వరరావులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు.బాధితుల తిరుగుబాటు.. అరెస్టుకంబోడియాలో చైనా గ్యాంగ్ హింసలను భరించలేని బాధితులు అక్కడి పరిస్థితులను వివరిస్తూ విశాఖ పోలీసులకు వీడియోలు పంపించారు. అలాగే చైనా ముఠాకు వ్యతిరేకంగా మంగళవారం సుమారు 300 మంది బాధితులు కంబోడియాని సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్ అయిన సిహనౌక్విల్లోని జిన్బీ కాంపౌండ్‌లో తిరుగుబాటు చేశారు. తమను వెంటనే భారత్‌కు పంపించాలని డిమాండ్ చేశారు. దీంతో వీరిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విశాఖ సీపీ ఎ.రవిశంకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వ్యవహారాన్ని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీరిని బయటకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటుఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మానవ అక్రమ రవాణా రాకెట్‌ను వెలికితీసేందుకు విస్తృతంగా పనిచేస్తున్నాయి. విశాఖకు చెందిన బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం కోసం సైబర్ క్రైమ్ సీఐ 94906 17917, సీపీ వాట్సాప్ నెంబర్ 94933 36633, కంట్రోల్ రూమ్ నెంబర్ 0891–2565454 సంప్రదించాలని సీపీ సూచించారు. -
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో విశాఖవాసి అరెస్ట్
-
మానవ అక్రమ రవాణా గుట్టు రట్టు
-
Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
విశాఖ సిటీ: ఉద్యోగాల పేరుతో విదేశాలకు జరుగుతున్న మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. విదేశాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను చైనా గ్యాంగ్‌కు అమ్మేస్తున్న ముగ్గురు ఏజెంట్లను శనివారం అరెస్టు చేశారు. దీనిపై విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ శనివారం సాయంత్రం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు.అక్కడ పని చేసి చైనా ముఠా చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ సైబర్ హెల్ప్‌లైన్ 1930 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవాని ప్రసాద్ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రధాన ఏజెంట్ చుక్క రాజేష్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు (37), మన్నేన జ్ఞానేశ్వరరావు (29)లను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీపీ రవిశంకర్ మానవ వనరుల అక్రమ రవాణా గురించి వెల్లడించిన వివరాలివి...నిరుద్యోగులకు వల...గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్‌దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి, కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్‌ను కోరాడు. ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్‌గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్ వారిని కాంబోడియా ఏజెంట్ సంతోష్‌కు అప్పగించాడు. ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్‌కు ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.చీకటి గదిలో బంధించి..ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది. సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది. చైనా ముఠా చెరలో 5వేల మంది..చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్‌కత్తాకు చెందిన వారూ ఉన్నట్లు సీపీ రవిశంకర్ తెలిపారు. ఈ నెట్వర్క్ వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. కాంబోడియాలో భారత ఎంబసీకీ దీనిపై సమాచారం అందిస్తామన్నారు. విశాఖ నుంచి ఎవరైనా కాంబోడియాకు వెళ్లి ఇబ్బందులు పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. భారతదేశం నుంచి కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు రెండేళ్లుగా మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు. ఇలా వెళ్లిన భారతీయుల ద్వారా సైబర్ నేరాల రూపంలో మన దేశీయుల నుంచే సుమారు రూ.100 కోట్ల వరకు దోచుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని ఆయన వివరించారు.అది కుటుంబాల మధ్య తగాదాలో దాడి...కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య తగాదా కారణంగా మహిళపై దాడి జరిగిందని సీపీ రవిశంకర్ స్పష్టం చేశారు. దీనికి రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దాడి ఘటన వీడియోలు ఉన్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చైనా ముఠాకు భారత యువత విక్రయం...నిరుద్యోగులను ముందు బ్యాంకాక్ పంపించి, అక్కడ రెండో ఏజెంట్‌కు అప్పగించారు. వీరు నిరుద్యోగులను కాంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకువెళ్లి ఒక నెలకు టూరిస్ట్ వీసా తీసుకున్నారు. అలా తీసుకువెళ్లిన నిరుద్యోగులను ఏజెంట్లు వారికున్న నైపుణ్యం ఆధారంగా వారికి రూ.2500 నుంచి రూ.4 వేల అమెరికన్ డాలర్ల రేటు కట్టి చైనా కంపెనీలకు అమ్మేశారు. తమ వద్ద ఏడాది పాటు పనిచేసేలా చైనా ముఠా అగ్రిమెంట్ రాయించుకుంది. సెక్యూరిటీ కింద 400 డాలర్ల పూచీకత్తును కట్టించుకుంది. ఒకవేళ కంపెనీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఆ మొత్తం చెల్లించాలని ఒప్పందంలో ఈ ముఠా షరతులు విధించింది. -
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
హైదరాబాద్: అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ముగ్గురు మయన్మార్ దేశస్తులుపై చార్జిషీట్ దాఖలు చేసింది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి మయన్మార్ దేశస్తులు చొరబడ్డారు. మయన్మార్‌కు చెందిన నిందితులు.. రబి ఇస్లామ్, షఫీ అలం, మహమ్మద్ ఉస్మాన్.. రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల వేశారు. నకిలీ పత్రాలతో ఇక్కడ ఆధార్ కార్డులను సైతం నిందితులు పొందారు. ఆధార్ కార్డులతో తమ పేరుతో సిమ్ కార్డులు విక్రయించారు. నిందితులు బ్యాంకు ఖాతాలను సైతం తెరవటం గమనార్హం. గత ఏడాది నవంబర్ 7న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. పలువురు ట్రాఫికర్లు, రోహింగ్యలతో కలిసి మయన్మార్ నిందితులు అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారు. బంగ్లాదేశీ రెఫ్యుజీ క్యాంపులో ఉన్న మహిళలను భారత్‌లోకి దింపిందీ ముఠా. తెలంగాణ, యూపీ, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల విసిరింది. -
World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్‌తో జాగ్రత్త!
ఇటీవల మానవ అక్రమ రవాణాలో ఆధునికత చోటు చేసుకుంది. సాంకేతిక యుగంలో మనం ఉపయోగించే రకరకాల మాధ్యమాలు ఇందుకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఈ నవీన కాలంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ విధంగా జరుగుతుందో అవగాహన పెంచుకుంటే, జాగ్రత్త పడటం సులువు అవుతుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న శ్రీజ (పేరుమార్చడమైంది) తన తల్లి ఫోన్‌ని ఉపయోగిస్తుండేది. శ్రీజకు తోడబుట్టిన అక్కచెల్లెళ్లు ముగ్గురు ఉన్నారు. తండ్రి మరణించడంతో తల్లి నాలుగిళ్లలో పాచి పని చేస్తూ పిల్లలను పోషిస్తుంది. ఒక రోజు మొత్తం శ్రీజ కనిపించకపోవడంతో కంగారుపడి పోలీసులను సంప్రదించారు. రెండు రోజులు వెతకగా శ్రీజ కలకత్తాలో ఉన్నట్టు తెలిసింది. అపరిచిత వ్యక్తి ప్రేమ పేరుతో ఫోన్ ద్వారా నమ్మబలికి, శ్రీజ ను రప్పించినట్టుగా, అటు నుంచి ఆమెను మరో చోటుకి తరలించే ప్రయత్నం చేసినట్టు గుర్తించి, తిరిగి తీసుకొచ్చి, తల్లికి అప్పజెప్పారు. ఆడపిల్లలు/మహిళలను తప్పుదోవ పట్టించే నేర ప్రక్రియలో ఇంటర్నెట్ ఒక మాధ్యమంగా మారింది. సామాజిక మాధ్యమాలలో కనిపించిన ‘కిడ్నీ కావలెను’ అనే ప్రకటన చూసిన రమేష్ (పేరు మార్చడమైనది) అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్‌ను సంప్రదించాడు. అవతలి వ్యక్తులు చెప్పిన విషయాలు విని, ఒక కిడ్నీ ఇస్తే తనకు ఆర్థిక బాధలు తొలగిపోతాయని భావించాడు. చెప్పిన చోటికి వెళ్లిన అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు. లైంగిక అత్యాచారం, శ్రమ దోపిడి, శిశువుల అమ్మకాలు, అవయవాలు, వధువుల అక్రమ రవాణాలో ఇప్పటి వరకు ఒక దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ట్రాఫికర్లు సైబర్ స్పేస్‌ను కూడా ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఈ సమస్య ప్రభుత్వం, పోలీసులు, న్యాయవ్యవస్థకు పెద్ద సవాల్‌గా నిలిచింది. ► సైబర్ ట్రాఫికింగ్‌లో లైంగిక దోపిడీ ప్రాబల్యం రకరకాల రూపాలను చూపుతుంది. యుఎన్ డాట్ జిఎఫ్టి గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం సైబర్ ట్రాఫికింగ్‌లో లైంగిక దోపిడీకి, మానవ అక్రమ రవాణా 79 శాతం ఉన్నట్టు గుర్తించింది. బాలికలు 13 శాతం, పురుషులు 12 శాతం, బాలురు 9 శాతం అక్రమ రవాణాకు గురైనట్టు పేర్కొంది. సైబర్ ఫేక్... ► ట్రాఫికర్లు మహిళలపై హింసకు సోషల్ మీడియా ద్వారా కొత్త మార్గాలను తెరిచారు. నేరస్తులు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షించడం, మోసగించడం, ట్రాప్ చేయడం ఈ విధానంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యంగా అమ్మాయిలను /మహిళలను ట్రాప్ చేయడానికి నేరస్తులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫేక్ ఐడీలను సృష్టించి స్కూల్, కాలేజీ యువతుల భావోద్వేగాలపైన తమ ప్రభావం చూపుతుంటారు. ప్రేమ పేరుతో చాటింగ్ చేస్తూ, కానుకల ద్వారా ఆకర్షిస్తూ, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల ద్వారా బెదిరిస్తూ ఇల్లు దాటేలా చేస్తుంటారు. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో బాధితులను తమకు అనుకూలంగా మార్చడం, నియంత్రించడం వంటివి జరుగుతున్నాయి. ► ఉద్యోగాల పేరుతో యువకులను ఆకర్షించి, వారు సైబర్ నేరాలకు పాల్పడేలా వేధింపులకు లోను చేయడం. ► అద్దె గర్భం (సరోగసీ విధానం) కూడా ఇప్పుడు ఆన్లైన్ వేదికగా కొత్త పుంతలు తొక్కుతోంది. నమ్మి వెళ్లిన వాళ్లు కొత్త సమస్యలలో చిక్కుకునే పరిస్థితి ఎదురైంది. ► పోర్నోగ్రఫీ అక్రమ రవాణాకు ప్రతి క్షణం ఆజ్యం పోస్తూనే ఉంది. ఈ విష చట్రంలోకి ప్రపంచ వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలు చేరుతున్నట్టు, ఈ అక్రమ రవాణాకు గురవుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. డిజిటల్ వేగం వాడుకలో సౌలభ్యంతో పాటు వేగం ఉండటం వల్ల కూడా నేరస్థులు తమ సామర్థ్యాలను మెరుగుపరచుకుని ఇంటర్నెట్ మాధ్యమాల్లో వాటిని చూపుతున్నారు. దీని వల్ల డిజిటల్ జాడలు కనిపెట్టి, మనవారిని రక్షించడం అనేది పెద్ద ప్రయాసగా మారింది. అప్రమత్తతే అడ్డుకట్ట ఇంటర్నెట్ వాడకం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నట్టే, సరిహద్దులు దాటి సుదూర దేశాల నుండి మనల్ని మరో మార్గంలో ప్రయాణించేలా చేయడానికి సైబర్ ట్రాఫికర్స్ పొంచి ఉన్నారు. అందుకే, సోషల్ మీడియా వాడకంలో తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీలు ఇంటర్నెట్ వాడకం ద్వారా జరిగే నష్టాలు, మానవ అక్రమ రవాణాకు జరుగుతున్న ప్రయత్నాల గురించి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. డార్క్ టీమ్స్ ఉంటాయి జాగ్రత్త సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఈ మధ్య కొత్త పదం వచ్చింది. మన దేశం నుంచి విదేశాలకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్లి, సైబర్ క్రైమ్ చేయిస్తుంటారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక అధికంగా ఉన్నవారిని గుర్తించి ఈ విధానానికి ఎంచుకుంటారు. తాము చెప్పినట్టుగా ఒప్పుకోనివారిని వేధిస్తారు. లేదంటే, వారి ఆర్థిక స్థితిని బట్టి డబ్బు వసూలు చేసి, వదిలేస్తారు. ఆ తర్వాత సైబర్ ట్రాఫికింగ్‌లో ఆర్గాన్ ట్రేడింగ్, సరోగసి కూడా ప్రధానంగా ఉన్నాయి. నేరస్థులు సైబర్ డార్క్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తారు. వీరి ద్వారా అమాయకులను ట్రాప్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు. అందుకని అపరిచితులతో పరిచయాలను పెంచుకోవద్దు. ఒంటరి మహిళలను ట్రాప్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ శోధిస్తూనే ఉంటారు. మన వివరాలను ఆన్లైన్లో బహిరంగ పరచకూడదు. ఆన్లైన్ అగ్రిమెంట్లాంటివి చేయకూడదు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే ప్రకటనలు చూసి మోసపోకూడదు. – అనీల్ రాచమల్ల, సైబర్ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు
ఫ్రాన్స్‌లో ఇటీవల నిలిపివేసిన భారతీయులు ప్రయాణిస్తున్న విమానంలో పది మంది ఎవరూ తోడు లేని మైనర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా నలుగురు ఎయిర్ ఇండియా సిబ్బంది, ఒక భారతీయ ప్రయాణికుడిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు యూకే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఆ సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ అధికారులకు దిల్జోత్సింగ్ అనే ప్రయాణికుడి డాక్యుమెంట్లపై కొంత అనుమానం రావడంతో వివరాలు సేకరించారు. దాంతో ఆయన ఎయిర్‌లైన్ సిబ్బందిని సంప్రదించడానికి బదులుగా ఎయిర్ ఇండియా సాట్స్ సిబ్బంది సహాయం కోరాడు. వెంటనే అధికారులకు అనుమానం రెట్టింపైంది. సీఐఎస్ఎఫ్ బృందం అప్రమత్తమై దిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ సహకారంతో విచారణ చేపట్టింది. అయితే సింగ్‌కు సహకరించిన మరో నలుగురు ఎయిర్ ఇండియా స్టాఫర్లను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విమానంలో మైనర్లు ఉన్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. మానవ అక్రమ రవాణా కోణంలో ఈ కేసును విచారిస్తున్నట్లు తెలిసింది. ఎయిర్ ఇండియా సాట్స్ సీఈఓ సంజయ్‌గుప్తా స్పందిస్తూ నిందితుడికి సహకరించిన సంస్థ సిబ్బందిని విధుల్లో నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. మానవ అక్రమ రవాణాపై కంపెనీ పకడ్బందీ చర్యలు చేపడుతుందని తెలిపారు. -
ఇది ఎవరి తప్పు?
ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ చిత్రం ‘డంకీ’ గత గురువారం విడుదలైనప్పుడు, సరిగ్గా అలాంటి కథే కళ్ళ ముందుకొస్తుందని ఆయనా ఊహించి ఉండరు. సరైన విద్యార్హతలు లేకున్నా, సంపాదనకై లండన్‌కు అక్రమంగా వలసపోవాలనుకొనే నలుగురు పంజాబీల చుట్టూ తిరిగే షారుఖ్ ఖాన్ సినిమా అది. ఈ రోజుల్లో అలాంటి కథ ఏ మేరకు ప్రాసంగికమంటూ కొందరు స్తనశల్య పరీక్ష చేస్తున్నవేళ, యాదృచ్ఛికంగా అచ్చంగా ఆ సినిమాలో లానే, ఇంకా చెప్పాలంటే అంతకు మించిన రీతిలో భారతీయ అక్రమ వలసల ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నికరాగ్వా వెళ్ళాల్సిన ప్రత్యేక విమానం ఇంధనం నింపుకోవడానికి ఫ్రాన్స్‌లో ప్యారిస్‌కు 150 కి.మీ.ల దూరంలోని వాత్రీ విమానాశ్రయంలో ఆగినప్పుడు ఊహించని విషయం బయటపడింది. విమానంలో మనుషుల అక్రమ రవాణా సాగుతున్నట్టు ఉప్పందడంతో ఫ్రాన్స్ పోలీసులు బరిలోకి దిగేసరికి, అమెరికాకు అక్రమంగా పోవాలనుకున్నవారి ఆశ అడియాస అయింది. పక్కన తోడెవరూ లేని 11 మంది మైనర్లతో సహా మొత్తం 303 మంది విమాన ప్రయాణికుల్లో అత్యధికులు భారతీయులే. భారత్ నుంచి నేటికీ భారీగా సాగుతున్న అక్రమ వలసలకు ఇది మచ్చుతునక. వివిధ దేశాలకు అక్రమ వలసలు కొత్త కాదు. కానీ ఈ పద్ధతిలో, ఇంత భారీ సంఖ్యలో జరగడం మాత్రం కొత్తే. నికరాగ్వా వీసా మాత్రమే ఉన్నప్పటికీ వారిని అక్రమంగా అమెరికా పంపాలనేది పథకమనీ, ఈ వ్యవహారం నడిపిన ఇద్దరు అనుమానితుల్ని ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకు న్నారనీ, ప్రయాణికుల్లో పాతిక మంది శరణార్థులుగా ఆశ్రయం కోరారనీ వార్త. ఇక, మిగిలిన 276 మంది మంగళవారం ముంబయ్‌కి విమానంలో సురక్షితంగా తిరిగొచ్చారు. వ్యవహారం ఇంతటితో ముగిసినట్టనిపిస్తున్నా, అసలు కథ ఇప్పుడే ఉంది. రొమేనియా దేశపు ప్రైవేట్ కంపెనీ నడుపుతున్న విమానంలో ఈ అక్రమ వలస యానం వెనుక అసలు ఉన్నదెవరు? అమెరికా ఆశ చూపి అమాయకు లకు టికెట్లు, వీసాలు ఏర్పాటు చేసిన ప్రయాణ ఏజెన్సీలేమిటి? ఈ ‘డాంకీ/ డంకీ రూట్’ (అక్రమ ప్రయాణమార్గం), ప్రత్యేక విమానాలను ఖరారు చేసిందెవరు? ఇలాంటి అనేక విషయాల దర్యాప్తు మిగిలే ఉంది. నికరాగ్వా చేరకముందే, ఫ్రాన్స్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొనేసరికి కొందరు శరణార్థులుగా ఆశ్రయం కోరడం అచ్చంగా ‘డంకీ’ సినిమాలోని సన్నివేశాలను గుర్తు చేస్తుంది. నిజానికి, అమెరికాలోని అక్రమ వలస జనాభా విషయంలో మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత మూడో స్థానం భారత్‌దే. 2021 నాటి ప్యూ రిసెర్చ్ సెంటర్ నివేదిక ఈ వాస్తవం వెల్లడించింది. భారతీయ అమెరికన్లలో దాదాపు 7.25 లక్షల మంది అక్రమ వలసదారులే! మరో మాటలో – అమెరికాలోని ప్రతి ఆరుగురు భారతీయ అమెరికన్లలో ఒకరు సరైన పత్రాలు లేకుండా ఆ దేశంలో ఉంటున్నవారే! గమనిస్తే, ఒక్క 2022– 23లోనే 96,917 మంది భారతీయులు అక్రమ వలసదారులుగా అమెరికాలో ప్రవేశించే ప్రయత్నం చేశారు. అంతకు మునుపటి ఏడాదితో పోలిస్తే, అది 51.61 శాతం ఎక్కువ. వీరిలో దాదాపు 41 వేల మందికి పైగా మెక్సికన్ సరిహద్దు మార్గం గుండా అమెరికాలోకి వెళ్ళాలని చూశారు. ఎలాగైనా సరే అగ్రరాజ్యపు సందిట్లోకి చేరాలనుకొనే వారికి ప్రయాణ పత్రాలు సులభంగా పుట్టే నికరాగ్వా వాటమైన మజిలీ. మధ్య అమెరికాలోని ఆ అతి పెద్ద దేశం మీదుగా వలస పోతున్నారు. మెక్సికో, కెనడాల నుంచి అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన వార్తలు ఇటీవల అనేకం వచ్చాయి. అసలింతమంది భారతీయులు విదేశాలకు వలస పోవాలని ఎందుకనుకుంటున్నట్టు? భార తీయ అమెరికన్ కుటుంబ సగటు ఆదాయం లక్షా 30 వేల డాలర్లు. స్వదేశంలో సరైన ఉపాధి, ఉద్యోగాలు లేక అధిక శాతం మంది విదేశాల వైపు చూస్తున్నారు. అమెరికా, కెనడా లాంటి చోట్ల మెరుగైన ఆదాయం, ఆనందమయ జీవితాలను వెతుక్కుంటూ, ‘డాంకీ/ డంకీ రూట్’లోనైనా సరే అక్కడకు చేరిపోవాలని ఆరాటపడుతున్నారు. చిత్రమేమిటంటే, తాజాగా దొరికిన లెజెండ్ ఎయిర్ లైన్స్ విమానంలో అధిక శాతం మంది పాశ్చాత్య సమాజంతో దీర్ఘకాలిక సంబంధమున్న సంపన్న రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్ల వారే! ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డవారు సొంత భాష, ప్రాంతానికి చెందిన ఈ అక్రమ వలసదారులకు అండగా, సురక్షిత ఆశ్రయంగా మారడం సహజమే. సంపన్న దేశాల్లో శ్రామికశక్తి లోటును భర్తీ చేయడానికి మనుషులు కావాలి కానీ, సాంస్కృతిక అంతరాల రీత్యా అక్కడ వలసదారులకు లభించే గౌరవం ఎంత అన్నది చర్చనీయాంశమే. దేశాల సరిహద్దులు చెరిపేసిన ప్రపంచీకరణ వ్యాపారంలో జరిగిందే తప్ప, ఇప్పటికీ వ్యక్తులను అనుమతించడంలో, ఆదరించడంలో కాలేదన్నది నిష్ఠురసత్యం. ఏ దేశానికి ఆ దేశం తనవైన నియమ నిబంధనలు పెట్టుకోవడం సహజమే. అయితే, ఉన్న ఊరినీ, కన్నతల్లినీ వదిలేసి, మెరుగైన జీతం, జీవితం కోసం మనవాళ్ళు గల్ఫ్ నుంచి అమెరికా దాకా వివిధదేశాలకు వలసపోతున్న తీరుకు కారణాలపై సమాజం, సర్కారు పెద్దలు ఇప్పటికైనా దృష్టి సారించాలి. భవిష్యత్తు అనిశ్చితమని తెలిసినా సరే, ఎండమావుల వెంటపడి ప్రాణాల్ని పణంగా పెడుతున్న భారతీయ శ్రామికశక్తికి ఇక్కడే ఎందుకు సలక్షణ జీవనమార్గం చూపించలేకపోతున్నామో ఆలోచించాలి. దూరపుకొండల వైపు ఆశగా చూస్తున్న అమాయకులను బుట్టలో వేసుకొని, కళ్ళ ముందు గాలి మేడలు చూపెడుతున్న ఏజెంట్ల వ్యవస్థను పసిగట్టాలి. ప్రాణాంతక అక్రమ వలసలకు ప్రోత్సహిస్తున్న వారి పనిపట్టాలి. ప్రాచీన కాలపు బానిస వ్యాపార వ్యవస్థకు ఆధునిక రూపాంతరమైన మానవ అక్రమ రవాణా వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలి. తాజా విమానయాన ఉదంతం అందుకు ఓ మేలుకొలుపు. -
అది ‘డంకీ’ విమానమేనా?.. ఆ పాతిక మంది పరిస్థితి ఏంటో?
ముంబై, సాక్షి: ఎట్టకేలకు.. ఉత్కంఠకు తెరపడింది. భారతీయులతో ఉన్న విమానం స్వదేశానికే తిరిగి చేరుకుంది. మానవ అక్రమ రవాణా అనుమానాల నేపథ్యంలో రొమేనియన్ ఎయిర్సర్వీస్కు చెందిన ఈ విమానాన్ని ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజులపాటు విచారణ తర్వాత క్లియరెన్స్ లభించడంతో.. మంగళవారం వేకువ ఝామున ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది ఆ విమానం. ఉదయం 4గం. సమయంలో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. మొత్తం ప్రయాణికుల్లో.. 276 మంది స్వదేశానికి చేరారు. అయితే.. పాతిక మంది ఫ్రాన్స్‌లోనే ఉండిపోయారు. ఇందులో 20 మంది పెద్దలు, ఐదుగురు మైనర్లు ఉన్నట్లు సమాచారం. వాళ్ల పౌరసత్వ గుర్తింపు తేలకపోవడంతోనే నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. వీళ్లను శరణార్థులుగా పరిగణిస్తామని.. ఫ్రాన్స్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాళ్లను వెనక్కి పంపడం కుదరని చెబుతున్నారు వాళ్లు. Maharashtra | Visuals of the passengers who arrived in Mumbai today, after the plane they were travelling in was grounded in France for four days over suspected human trafficking pic.twitter.com/IKOKiJUeYN — ANI (@ANI) December 26, 2023 అది డంకీ విమానమేనా? ఏదైనా సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించే వారిని డంకీ అని పిలుస్తారు. ఈమధ్యే షారూఖ్ ఖాన్ డంకీ సినిమా అదే కాన్సెప్ట్‌తో వచ్చింది. ప్రస్తుతం ఆ పదం ట్రెండింగ్‌లో ఉండడంతో.. ఆ విమానం డంకీ విమానమేనంటూ చర్చ నడుస్తోంది. వాళ్ల పరిస్థితి ఏంటి? ఫ్రాన్స్ మీడియా చానెల్స్ కథనం ప్రకారం.. మొత్తం 303 భారతీయ ప్రయాణికుల్లో 11 మంది మైనర్లు ఎవరి సాయం లేకుండానే ప్రయాణిస్తున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారట. వీళ్లలో భారతీయ పౌరసత్వం గుర్తింపు ఉన్నవాళ్లను మాత్రమే వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. వీళ్లను తరలిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితుల్ని సైతం అక్కడి దర్యాప్తు ఏజెన్సీలు విచారిస్తున్నాయి. ఈ ఘటనపై అటు ఫ్రాన్స్.. ఇటు భారత అధికార వర్గాలు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. #WATCH | Maharashtra | Plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today (Outside visuals from Chhatrapati Shivaji Maharaj International Airport) pic.twitter.com/OIMPO0c4Hx — ANI (@ANI) December 26, 2023 ఏం జరిగిందంటే.. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ ఏ340 ఛార్టర్ విమానం 303 మంది ప్రయాణికులతో డిసెంబర్ 23వ తేదీన యూఏఈ(దుబాయ్) నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉండే వ్యాట్రి(Vatry) ఎయిర్‌పోర్ట్‌లో ఆగింది. అయితే అప్పటికే మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో.. ఫ్రాన్స్ పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఎయిర్‌పోర్టులోనే ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంకోవైపు ఈ నాలుగు రోజులపాటు ప్రయాణికులందరికీ అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ఈ తరలింపు వెనుక.. మనుషుల్ని అక్రమంగా పలు దేశాలకు పంపించే కరడుగట్టిన ముఠా హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఫ్రాన్స్ నేర పరిశోధన నిఘా సంస్థ జునాల్కో దర్యాప్తు చేస్తోంది. భారత్ నుంచి వీళ్ల ప్రయాణం అసలు ఎలా మొదలైంది? ఎలా దుబాయ్‌కి చేరారు? అనే విషయాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. నేరం గనుక రుజువు అయితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇన్నిరోజులు అదుపులోనా? ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. అక్కడి నేలపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల పాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. అక్కడి కోర్టులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు, అసాధారణ పరిస్థితుల్లో ఇంకో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టవచ్చు. అక్రమంగా వెళ్లే క్రమంలో? అక్రమంగా దేశాల్ని తరలించే ఉద్దేశంతోనే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణం ఈ కేసులో బలపడుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో భారతీయులు ఎంతమంది అనేదానిపై కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆందోళన కలిగించే అంశమే! ఇదసలు అక్రమంగా మనుషుల్ని తరలించడమేనా?. ఒకవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి అక్రమ చొరబాట్లు.. శరణార్థుల సంఖ్య పెరిగిపోతున్న వేళ ఈ విమానం మధ్య అమెరికా దేశం నికరాగువాకు వెళ్తుండడం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. అమెరికా కస్టమ్స్ & బార్డర్ ప్యాట్రోల్(CBP) గణాంకాల ప్రకారం.. అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 2023 సంవత్సరానికిగానూ ఆ సంఖ్య 96,917 మందిగా నమోదు అయ్యింది. గతేడాదితో పోలిస్తే ఇది 52 శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. -
ఆ విమానం ఎట్టకేలకు టేకాఫ్ !
పారిస్: మానవ అక్రమ రవాణా అనుమానంతో మూడ్రోజులపాటు తమ అ«దీనంలో ఉంచుకున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. 303 మందికిపైగా ప్రయాణికులతో దుబాయ్ నుంచి బయల్దేరిన ఆ విమానం ఇంధనం నింపుకునేందుకు ఫ్రాన్స్‌లోని పారిస్ దగ్గర్లోని వ్యాట్రీ విమానాశ్రయంలో గురువారం దిగింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది భారతీయులే. ఈ విమానం ద్వారా మానవ అక్రమ రవాణా జరుగుతోందంటూ వచ్చిన సమాచారంతో ఫ్రాన్స్ అధికారులు దాన్ని తమ అ«దీనంలోకి తీసుకుని దర్యాప్తు మొదలెట్టడం తెల్సిందే. 303 మందిని విడివిడిగా విచారించాలని భావించిన నలుగురు జడ్జీలు, అసలు ఈ ప్రక్రియే అస్తవ్యస్తంగా ఉందంటూ మొత్తం కేసు విచారణనే రద్దుచేశారు. దాంతో విమానం టేకాఫ్‌కు అడ్డంకులు తొలిగాయి. వాస్తవానికి ఈ విమానం నికరాగువాకు వెళ్లాలి. తాజా ఉదంతం నేపథ్యంలో అది నికరాగువా వెళ్తుందా, లేక భారత్కో, దుబాయ్‌కో తిరిగొస్తుందా అన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు. -
ఫ్రాన్స్‌లో నిలిపివేసిన భారత విమానంలో పది మంది ఒంటరి మైనర్లు
ప్యారిస్: ఫ్రాన్స్ నిలిపివేసిన భారతీయులు ప్రయాణిస్తున్న విమానంలో పది మంది ఎవరూ తోడు లేని మైనర్లు ఉన్నట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఇందులో ఆశ్రయం కోరుతూ ఆరుగురు మైనర్లు ధరఖాస్తు చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే.. ప్రయాణికుల నిర్బంధాన్ని మరో ఎనిమిది రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఈ కేసుపై నేడు విచారణ కొనసాగనుంది. మానవ అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఫ్రాన్స్‌లో 303 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు నిలిపివేశారు. విమానం నిలిపివేతపై స్పందించిన ఫ్రాన్స్ లోని భారత్ ఎంబసీ.. దౌత్య బృందానికి కాన్సులర్ యాక్సిస్ లభించిందని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. French authorities informed us of a plane w/ 303 people, mostly Indian origin, from Dubai to Nicaragua detained on a technical halt at a French airport. Embassy team has reached & obtained consular access. We are investigating the situation, also ensuring wellbeing of passengers. — India in France (@IndiaembFrance) December 22, 2023 రొమేనియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న A340 విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి బయలుదేరింది. 303 మంది భారతీయులతో ఉన్న ఈ విమానం నికరాగ్వాకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని వాట్రి విమానాశ్రయానికి చేరుకోగానే ఫ్రాన్స్ అధికారులు విమానాన్ని నిలిపివేశారు. మానవ అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం వచ్చిన కారణంతో విమానాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. "ఫ్రెంచ్ విమానాశ్రయంలో సాంకేతిక నిలిపివేత సమయంలో దుబాయ్ నుండి నికరాగ్వాకు బయలుదేరిన విమానాన్ని నిలిపివేశారు. ఇందులో దాదాపు 303 మంది భారతీయ మూలాలు కలిగినవారే ఉన్నారు. విమానం నిలిపివేత గురించి ఫ్రెంచ్ అధికారులు మాకు సమాచారం అందించారు. పరిస్థితిని పరిశీస్తున్నాం" అని భారత ఎంబసీ అధికారులు ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులను ప్రత్యేక వసతి గృహాలకు తరలించారు. ఒక్కొక్కరిని అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల నుంచే నిజానిజాలను కనుక్కునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదీ చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
300 మంది భారతీయుల అక్రమరవాణా?.. ఫ్రాన్స్‌లో విమానం నిలిపివేత
ప్యారిస్: మానవ అక్రమరవాణా జరుగుతుందన్న అనుమానాల నేపథ్యంతో.. ఓ విమానం ఫ్రాన్స్‌లో నిలిచిపోయింది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. వీళ్లంతా మధ్య అమెరికా దేశం నికరాగువా వెళ్తున్నట్లు తేలింది. గుర్తు తెలియని వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. విమానాన్ని తాము అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. ప్యారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎయిర్‌బస్ ఏ340 యూఏఈ నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్ వ్యాట్రి(Vatry) ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. అయితే అప్పటికే సమాచారం అందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇంకోవైపు ప్రయాణికులకు అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇది మానవ అక్రమరవాణేనా అనేది తేలాల్సి ఉంది. అక్రమ చొరబాటు కోసమే? అక్రమ చొరబాట్ల కోసమే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణంలోనూ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులంతా క్షేమం: ఇండియన్ ఎంబసీ ఫ్రాన్స్‌లోని భారత దౌత్య కార్యాలయం ఈ పరిణామంపై స్పందించింది. ఫ్రెంచ్ అధికారులు తమకు సమాచారం అందించారని, తాము దర్యాప్తు జరుపుతున్నామని, ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే వీళ్ల ప్రయాణ ఏర్పాట్లపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. French authorities informed us of a plane w/ 303 people, mostly Indian origin, from Dubai to Nicaragua detained on a technical halt at a French airport. Embassy team has reached & obtained consular access. We are investigating the situation, also ensuring wellbeing of passengers. — India in France (@IndiaembFrance) December 22, 2023 ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. అక్కడి చట్టాల ప్రకారం.. ఫ్రాన్స్ గడ్డపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల దాకా ఎటూ కదలనీయకుండా చేయొచ్చు. అక్కడి న్యాయమూర్తులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు, అసాధారణ పరిస్థితుల్లో మరో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. -
అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: టీడీపీకి వైఎస్సార్సీపీ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికాలో మిస్సోరిలో కొన్ని నెలలుగా ఒక తెలుగు యువకుడిని బంధించి వేధించిన కేసు కలకలం రేపింది. అయితే ఈ కేసులో నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నిందితులపై సత్తారు వెంకటేష్ రెడ్డి (35), శ్రావణ్ వర్మ (23), నిఖిల్ (27)పై విచారణ, చట్టపరమైన చర్యలకు తీసుకునేందుకు అక్కడి అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే ఇక్కడే మరోసారి టీడీపీ తన వక్రబుద్ధిని చాటుకుంది. ప్రధాన నిందితుడు వైఎస్సార్సీపీకి చెందిన నాయకుడు అంటూ టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. ఈ ఆరోపణలను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ఖండించారు. "మన రాష్ట్రం, మనదేశం కానీ ఒక ప్రాంతంలో జరిగిన నేరాన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ, ప్రభుత్వం పై టీడీపీ విమర్శలు చేయడం టీడీపీ దిగజారుడుతానానికి నిదర్శనమన్నారు. మోకాలికి బొడిగుండుకు ముడిపెట్టి లబ్ధిపొందాలన్న ఆలోచనతో టీడీపీ దిగజారి వ్యవహరిస్తోంది. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ అని, నిందితులు ఎవరైనా సరే నేరం నిరూపణ అయిన పక్షంలో శిక్షార్హులని" ఆయన వెల్లడించారు. "టీడీపీ కార్యకర్తలు, అభిమానుల్లో నేరప్రవృత్తి ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితాల్లో చేసే నేరాలకు టీడీపీ బాధ్యత తీసుకుంటుందా? టీడీపీ నేతలు మహిళలపై చేసే అఘాయిత్యాలకు చంద్రబాబు, లోకేష్ బాధ్యత తీసుకుంటారా? అని రత్నాకర్ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ సత్తారును అడ్డంపెట్టుకుని ఈ నేరాన్ని వైఎస్సార్సీపీకి ముడిపెట్టాలని, తద్వారా లబ్ధిపొందాలని చూసే టీడీపీ.. ముందుగా ఏపీలో టీడీపీ నేతలు నడిపే కాల్ మనీ సెక్స్ రాకెట్లపై సమాధానం చెప్పాలి. ఎక్కడో విదేశాల్లో జరిగే నేరాలను మాకు ముడిపెట్టడం కాదు.. ఏపీలో టీడీపీ నేతలు చేసే దుర్మార్గాలకు టీడీపీ బాధ్యత వహించాలన్నారు" రత్నాకర్. "కాల్ మనీ దందాలు, సెక్స్ రాకెట్లు నడిపి వేలాది మహిళల జీవితాలను చీకట్లోకి నెట్టిన నీచమైన చరిత్ర టీడీపీ నేతలది. వీరి సెక్స్ రాకెట్ దందా ఏపీ నుండి అమెరికా వరకు విస్తరించింది. గతంలో ఎన్నారై టీడీపీ నేతలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. టీడీపీ నేరప్రవృత్తి కలిగిన పార్టీ..అందుకే ఏపీ ప్రజలు టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారు. ఇలాంటి అనైతిక ప్రచారం తో 2024 ఎన్నికల్లో తెదేపా తెలంగాణ లో మాదిరి గానే తుడిచి పెట్టుకు పోతుందని" పేర్కొన్నారు. ఇదే తెదేపా సంస్కారం ? మీరు చేస్తే సంసారం ... ఇంకోళ్ళు చేస్తే .....చారం .. రాష్ట్రం ఐనా , దేశం ఐనా ... విదేశం ఐనా ... చట్టానికి ఎవరు చుట్టం కాదు .. తన పని చట్టం చేసుకుంటది ..#ENDOFTDP pic.twitter.com/qqLE1LaOSM — Kadapa Rathnakar (@KadapaRathnakar) December 1, 2023 మరోవైపు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ NRI మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్ డాక్టర్. వాసుదేవరెడ్డి స్పందించారు. 'అమెరికాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నారై సత్తారు వెంకటేష్ రెడ్డికి, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనను వైఎస్సార్సీపీతో పాటు ప్రతి ఒక్క ఎన్నారై తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడ తప్పుడు పనులు తెరపైకి వచ్చినా, అది వైఎస్సార్సీపీకి అంటగట్టేలా చేయడమే టీడీపీతో పాటు కొన్ని ఛానళ్లు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. -
తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్: తెలంగాణతో సహా దేశంలో 10 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. National Investigation Agency (NIA) is conducting raids across 10 states in connection with Human Trafficking cases. More details awaited. — ANI (@ANI) November 8, 2023 తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్ము కాశ్మీర్లో సోదాలు జరుగుతున్నాయి. Tripura, Assam, West Bengal, Karnataka, Tamil Nadu, Telangana, Haryana, Puducherry, Rajasthan and Jammu & Kashmir are among the states being searched by the NIA in the human trafficking case. — ANI (@ANI) November 8, 2023 మరోవైపు టెర్రర్ ఫండింగ్ కేసులో జమ్మూ కశ్మీర్లో రాష్ట్ర దర్యాప్తు సంస్థ(ఎస్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. అనంతనాగ్, పుల్వామా జిల్లాలతో సహా దక్షిణ కశ్మీర్లో ఎస్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. #WATCH | J&K: State Investigation Agency (SIA) is conducting raids at several places in the Anantnag & Pulwama districts of South Kashmir. The raids are being conducted in connection with a terror funding case. (Visuals from Panzgam village of Kokernag area in Anantnag district) pic.twitter.com/ZWbxDUwryy — ANI (@ANI) November 8, 2023 -
పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బాలకార్మికులుగా మార్చేందుకు తరలిస్తున్న పిల్లలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కాపాడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వే పోలీస్), ఆర్పీఎఫ్, బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీఓతో కలసి చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 26 మంది చిన్నారులను కాపాడినట్టు రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలను ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ పిల్లలను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టారు. వీరందరినీ హైదరాబాద్‌లోని వివిధ కర్మాగారాల్లో పనిచేయించేందుకు తీసుకువస్తున్నట్టు అధికారులకు తెలిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాటు వేసిన పోలీసులు మొత్తం ఎనిమిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 374, 341ల కింద సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిందితులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన రంజాన్ మోల్లా, షేక్ సైదులు, ప్రియారుల్‌షేక్, జాకీర్ అలీ, సురోజిత్ సంత్రా, జార్ఖండ్‌కు చెందిన పింటుదాస్, హైదరాబాద్ చార్మినార్‌కు చెందిన సుసేన్ తుడు, అబ్దుల్ అల్మాని మోండేల్‌గా గుర్తించారు. కాపాడిన 26 మంది పిల్లలను సైదాబాద్‌లోని ప్రభుత్వ హోమ్‌కు పంపినట్టు అధికారులు తెలిపారు. పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పట్టుకున్న సిబ్బందిని అదనపు డీజీ శిఖాగోయల్ అభినందించారు. -
బాలల అక్రమ రవాణాకు చెక్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): బిహార్ రాష్ట్రం నుంచి విజయవాడ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు తరలిస్తున్న మైనర్ల అక్రమ రవాణాను విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకుని వారిని రక్షించారు. విజయవాడ డివిజన్ సీనియర్ డీఎస్సీ(డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్) వల్లేశ్వర బీటీ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన మైనర్ (బాలురు)లను ఎక్స్‌ప్రెస్ రైల్లో ముజఫర్‌పూర్ స్టేషన్ నుంచి బెంగళూరు, చెన్నైలకు తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందింది. దీనిపై జీఆర్పీ పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, బచ్పన్ బచావో ఆందోళన్(బీబీఏ) సంస్థ, చైల్డ్‌లైన్ ప్రతినిధుల సహకారంతో మంగళవారం రాత్రి రైలు విజయవాడ చేరుకోగానే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి సుమారు 12 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న 18 మంది బాలలను గుర్తించి సంరక్షించారు. అనంతరం వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి, వారి ఆదేశాల మేరకు తాత్కాలిక వసతి కోసం ఎస్కేసీవీ చిల్డన్స్ ట్రస్ట్ వసతి గృహానికి తరలించారు. బాలల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి తగిన ఆధారాలతో వన తల్లిదండ్రులకు వారిని అప్పగిస్తామని తెలిపారు. బాలల అక్రమ రవాణా చట్ట వ్యతిరేకమని, దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్‌లో ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐ మకత్‌లాల్‌నాయక్, జీఆర్పీ ఎస్ఐ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
‘మానవ రవాణా’.. ఆగేనా? అవయవాలు మాయం, బలవంతపు పెళ్లిళ్లు, భిక్షాటన
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : మావన అక్రమ రవాణా..భారత్‌తో పాటు యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఓ పెద్ద సమస్య. మహిళలు, యువతులు, పిల్లలే కాదు.. పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారు. తమ వలలో చిక్కుతున్న వారిని మాఫియా ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైతే, వీలైతే దేశాలను సైతం దాటించేస్తోంది. మహిళలు, యువతులను బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతోంది. లొంగని వారిపై భౌతిక దాడులు చేస్తోంది. పలు రకాలుగా హింసిస్తోంది. పురుషులు, పిల్లలకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ బానిసలుగా మార్చేస్తోంది. కూలీలుగా పని చేయించడం, వ్యభిచారం చేయించడం, ఈ రెండింటికీ వినియోగించడం లాంటి వాటికి ఈ మాఫియా తెగబడుతోంది. బలవంతపు పెళ్లిళ్లు చేయడంతో పాటు భిక్షాటన కూడా చేయిస్తోంది. బాధితుల అవయవాలు వారికి తెలియకుండా దొంగిలించడం వంటి దురాగతాలకు పాల్పడుతోంది. మోసాలు, ఆర్థిక అసమానతలు.. ఎక్కువగా.. చదువు, అవగాహన లేకపోవడం వల్ల మోసాలకు గురవుతున్నవారు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు, ఉద్యోగాలు, ఉత్తమ జీవన ప్రమాణాల పేరిట మాఫియా ప్రలోభాలకు లొంగిపోతున్నవారు మానవ అక్రమ రవాణా బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక అసమానతలు దీనికి కారణమవుతున్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన మాదకద్రవ్యాలు, నేరాల సంబంధిత కార్యాలయం (యూఎన్ఓడీసీ) నివేదిక స్పష్టం చేసింది. 95 శాతం ప్రపంచ జనాభా ఉండే 141 దేశాల నుంచి సేకరించిన డేటా ప్రకారం యూఎన్ఓడీసీ ఈ నివేదిక రూపొందించింది. శిక్షల శాతం తగ్గుతోంది.. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదని అందుకే అక్రమ రవాణా చేసే మాఫియాకు పడే శిక్షలు తగ్గుతున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. 2017 నుంచి ఈ శిక్షలు పడే శాతం తగ్గుతూ వచ్చిందని వెల్లడించింది. గత సంవత్సరంలో న్యాయస్థానాలు విధించే శిక్షలు ఏకంగా 27% తగ్గినట్లు పేర్కొంది. అంతర్జాతీయంగా 27% తగ్గుదల ఉంటే.. దక్షిణాసియాలో 56 శాతం, మధ్య అమెరికాలో 54 శాతం, దక్షిణ అమెరికాలో 46 శాతం తగ్గినట్లు పేర్కొంది. ఒక్కసారి చిక్కితే జీవితాలు నాశనమే ప్రపంచ జనాభాలో 95 శాతం ఉండే 141 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా యూఎన్ఓడీసీ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం చూస్తే...మానవ అక్రమ రవాణాలో ఇప్పటికీ మహిళలు, యువతుల శాతమే అధికంగా ఉంటోంది. మాఫియా చేతుల్లో ఎక్కువ హింసకు గురవుతున్నదీ వీరే కావడం గమనార్హం. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది. భారతదేశంలోనూ మానవ అక్రమ రవాణా పెద్ద సంఖ్యలో జరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ముఠాలకు ఒక్కసారి చిక్కితే బయటపడడం అంత సులువు కాదు. తప్పించుకుని పోవడానికి వీల్లేకుండా భౌతిక, మానసిక హింసకు గురి చేస్తారు. ఇది తీవ్రమైన సమస్య అయినా భారత ప్రభుత్వం స్పందన ఆశించిన స్థాయిలో లేదన్న విమర్శలున్నాయి. 2021లో 6,533 కేసులు దేశంలో మానవ అక్రమ రవాణా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 2020తో పోలిస్తే 2021లో 27.7% పెరిగినట్లు ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్రమ రవాణా ఆరోపణలతో మహిళలు 2020లో 1,714 ఫిర్యాదులు చేస్తే, 2021లో 2,189 నమోదయ్యాయని ఎన్సీఆర్బీ పేర్కొంది. పిల్లలు, పెద్దల అక్రమ రవాణాకు సంబంధించి 6,533 కేసులు నమోదు కాగా.. అందులో 18 సంవత్సరాల వయస్సులోపు వారు 2,877 కాగా, 3,656 మంది పెద్దవారు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కూలీలుగా 38.8 శాతం మానవ అక్రమ రవాణాలో బలవంతంగా కూలీలు మారేవారి సంఖ్య 38.8 శాతం ఉండగా, వ్యభిచారంలోకి 38.7 శాతం మంది నెట్టబడుతున్నారు. ఈ రెండింటికీ వినియోగించేలా 10.3 శాతం, బలవంతపు పెళ్లిళ్లు 0.9 శాతం, యాచకవృత్తిలోకి 0.7, దత్తత కోసం 0.3 శాతం, అవయవాల దొంగతనం 0.2 శాతం ఉన్నట్లు యూఎన్ఓడీసీ స్పష్టం చేస్తోంది. వాతావరణ మార్పులూ పరోక్షంగా దోహదం వాతావరణ మార్పులూ పరోక్షంగా మానవ అక్రమ రవాణాకు దోహదపడుతున్నట్టు యూఎన్ఓడీసీ తన నివేదికలో పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే భారీ వరదల్లో సర్వం కోల్పోయిన వారు, కరువు కాటకాల్లో చిక్కుకున్న వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో ఈ ముఠాలకు చిక్కుతున్నారు. ప్రభుత్వాలు దీనిపై దృష్టి కేంద్రీకరించని కారణంగానే ఈ దందా కొనసాగుతున్నట్లు నివేదిక తేల్చింది. కోర్టుల్లోనూ ఈ మాఫియాకు పెద్దగా శిక్షలు పడుతున్న దాఖలాల్లేవని, పడుతున్న శిక్షలే తక్కువ అంటే.. 2020లో ఈ శిక్షల సంఖ్య ఏకంగా 27% తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. విద్య, మహిళా సాధికారతతో చెక్ విద్య, మహిళా సాధికారతతో మానవ అక్రమ రవాణకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. లింగ భేదం లేకుండా మహిళలు ఆర్థిక సాధికారత సాధించే విధంగా ప్రభుత్వ విధానాలు, కార్యాచరణ ఉంటే దీనికి అడ్డుకట్ట పడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. చట్టాలను, న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, చట్టాలు అమలు చేసే యంత్రాంగానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని అంటున్నారు. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంచాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు సైతం సంయుక్తంగా కృషి చేస్తేనే ఈ అమానవీయ పరిస్థితి నుంచి బయట పడడానికి వీలుంటుందని చెబుతున్నారు. -
కిడ్నాపర్లకు సింహస్వప్నం
మానవ అక్రమ రవాణనుఒంటి చేత్తో అడ్డుకుంటోంది పల్లవి ఘోష్ .తను స్థాపించిన ‘ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్’ద్వారా పది వేల మంది బాల బాలికలను, స్త్రీలను అక్రమ రవాణ నుంచి కా పాడగలిగింది.అస్సాంకు చెందిన పల్లవి ఘోష్ ఈశాన్య రాష్ట్రాల పో లీసులకు, సరిహద్దు భద్రతా దళాలకు సుపరిచితం.వారి సహాయంతో పల్లవి చేస్తున్న కృషికి ఎన్నో ప్రశంసలు లభిస్తున్నాయి. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కల ప్రకారం భారత్‌లో 2021లో 77,535 మంది బాల బాలికలు ‘మిస్’ అయ్యారు. వీరిలో 59,544 మంది ఆడపిల్లలు. వీరంతా ఏమయ్యారు? అంతులేని అక్రమం ‘మన దేశంలో పేదరికం, వలసలు, వరదలు, అధిక సంతానం, ఇంటి సభ్యుల మధ్య సఖ్యతా, ప్రేమా లేకపోవడం... ఇవి ఉన్నంత కాలం మానవ అక్రమ రవాణా ఉంటుంది. ఆడపిల్లలను వ్యభిచారం కోసం, బలవంతపు పెళ్లిళ్ల కోసం కిడ్నాప్ చేస్తున్నారు. అబ్బాయిలను వెట్టి కార్మికులుగా మార్చడానికి తీసుకెళుతున్నారు. ఇవి ఆగాలంటే సమాజంలో చైతన్యం రావాలి’ అంటోంది పల్లవి ఘోష్. 2013 నుంచి 2023 మధ్య కాలంలో పల్లవి ఘోష్ యాంటీ ట్రాఫికింగ్ యాక్టివిస్ట్‌గా దాదాపు 10 వేల మంది బాల బాలికలను, స్త్రీలను కా పాడింది. ఈమె కార్యరంగం అంతా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది. అక్కడి ట్రాఫికర్లకు పల్లవి పేరు చెబితే హడల్. బాల్యంలో పడిన తొలిముద్ర పల్లవి ఘోష్‌ది అస్సామ్‌లోని లుమ్డింగ్. ఏడవ క్లాస్‌లో ఉండగా వేసవి సెలవుల్లో బెంగాల్‌లోని మేనమామ ఇంటికి వెళ్లింది. ‘అప్పుడు ఆ పల్లెటూళ్లో ఒకాయన తన కూతురి కోసం వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరో అపరిచితుడు బైక్ మీద వచ్చి మాట కలిపి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడని ఊళ్లో చెప్పుకున్నారు. ఆ వయసులో ఆ ఘటన నా మీద చాలా ముద్ర వేసింది’ అంటుంది పల్లవి. ఢిల్లీలో డిగ్రీ చేసిన పల్లవి చెన్నై నుంచి ‘జెండర్ ఇష్యూస్’ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికై పని చేసే ఢిల్లీ స్వచ్చంద సంస్థ ‘శక్తివాహిని’లో 2013లో చేరింది. ఎన్నో అనుభవాలు యాంటీ ట్రాఫికింగ్ యాక్టివిస్ట్‌గా పల్లవి ఎన్నో అనుభవాలు చూసింది. ‘ఈశాన్య రాష్ట్రాల నుంచి తెచ్చి ఢిల్లీలో పని మనుషులుగా స్త్రీలను అమ్మేస్తారు. ఆ స్త్రీలను ఇంటి యజమానులు దారుణంగా హింసిస్తారు. అలాంటి వారిని ఎందరినో విడిపించాను. హర్యానాలో పెళ్లికూతుళ్లది పెద్ద సమస్య. అందుకని బెంగాల్, అస్సాం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల నుంచి మహిళలను ఎత్తుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసి ఇళ్ల లోపల ఉంచేస్తారు. పల్లెల్లో ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరూ నోరు మెదపరు. అడ్డుకోరు. ఆశ్చర్యం ఏమంటే వయసు కూడా పట్టించుకోరు. 50 ఏళ్ల మహిళను కూడా ఎత్తుకొచ్చి హర్యానాలో పెళ్లి చేశారు’ అంటుంది పల్లవి. డ్రైవర్లను చైతన్యవంతం చేయాలి ఈశాన్య రాష్ట్రాల్లో పల్లవి ఊరూరు తిరిగి అక్కడి కార్మికులతో, కూలి మహిళలతో, స్కూలు విద్యార్థినులతో మాట్లాడుతుంది. తన సంస్థ వాలంటీర్ల ద్వారా పెద్ద సంఖ్యలో మహిళలను కలిసి మానవ అక్రమ రవాణా గురించి చెబుతుంది. ‘అన్నింటి కంటే ముఖ్యం రిక్షావాళ్లను, క్యాబ్ డ్రైవర్లను, ఆటోవాళ్లను చైతన్యవంతం చేయాలి. ఎందుకంటే ఆడవాళ్లను ఎత్తుకుపోవాలంటే వీరి ద్వారానే పోవాలి. వీరు ఆపగలిగితే సగం కేసులు ఆగిపోతాయి’ అంటుంది పల్లవి. ఆడపిల్లల అక్రమ రవాణాను నిరోధించడం ఒకెత్తయితే తిరిగి పట్టుకొచ్చాక వారికి కొత్త జీవితాలు ఇవ్వడం ఒకెత్తు. ‘తీసుకొచ్చిన వారిని షెల్టర్ హోమ్స్‌లో పడేయడం సరి కాదు. ఆ హోమ్స్‌లో రకరకాల అనుభవాల పిల్లలు ఉంటారు. వారందరూ కలిసి ఉండటం వల్ల ప్లిలలు ఆరోగ్యకరమైన మానసిక స్థితితో ఎదగలేరు’ అంటుంది పల్లవి. ప్రాణాలకు ప్రమాదమైనా శక్తివాహినిలో ఏడేళ్లు పని చేశాక 2020లో సొంతగా ‘ఇం పాక్ట్ అండ్ డైలాగ్’ అనే ఎన్.జి.ఓ స్థాపించి యాంటీ ట్రాఫికింగ్ మీద పని చేస్తున్న పల్లవి ఈ పనిలో చాలా రిస్క్ ఉందని చెబుతుంది. ‘ఆడపిల్లలను/స్త్రీలను ఇళ్ల నుంచి వ్యభిచార గృహాల నుంచి విడిపించడానికి వెళ్లినప్పుడు దారుణంగా ఎదురుదాడి చేస్తారు. చం పాలని చూస్తారు. అయితే పోలీసుల సహాయం లేకుండా నేను వెళ్లను. కొంతమంది బ్రోకర్లు నాకు నేరుగా ఫోన్ చేసి ఈ దాడులు మానేస్తే ఇల్లు కొనిస్తాం అని బేరానికి వచ్చారు. కోర్టులో ఒకడు నాకు కత్తి చూపించాడు’ అంటుంది పల్లవి. అయినా సరే ఆమె తన కృషి మానలేదు. -
‘హైటెక్ సెక్స్‌రాకెట్’లో అసిస్టెంట్ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన హైటెక్ సెక్స్‌రాకెట్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరు నిందితులను సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీయూ) అరెస్టు చేసింది. ఈ కేసులో సురేశ్ బోయిన అనే టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పోలీసులకు చిక్కాడు. ఈ ముఠా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను అక్రమంగా తరలించి వాట్సాప్ గ్రూప్‌లు, వెబ్సైట్లలో వారి ఫొటోలను పెట్టి, కాల్‌సెంటర్ల ద్వారా విటులను ఆకర్షిస్తూ స్టార్ హోటళ్లు, ఓయో రూమ్‌లలో వ్యభిచారదందా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు 33 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. వీరిలో బాలీవుడ్లో కథారచయిత ముంబైకి చెందిన మోహిత్ సత్పాల్ అలియాస్ గార్గ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మేకల అఖిల్‌కుమార్, నెల్లూరు జిల్లా కావలిలోని వెంగళ్‌రావునగర్‌కు చెందిన సురేశ్ బోయిన అలియాస్ కుమార్ శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై మాదాపూర్, పంజగుట్ట ఠాణాలో ఇప్పటికే నాలుగు కేసులున్నాయి. నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, స్వైపింగ్ మెషీన్, పాస్‌పోర్ట్, ఆధార్, పాన్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ►బంజారాహిల్స్‌లోని హయత్ హైట్స్‌లో ఉండే సురేశ్ బోయిన ఓ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. సినీపరిశ్రమకే చెందిన నందు అనే వ్యక్తితో కలిసి సురేశ్ ఫ్లాట్ అద్దెకు తీసుకొని వ్యభిచారదందా మొదలుపెట్టాడు. ►పశ్చిమ బెంగాల్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సురేశ్ నమ్మించి మోడల్స్, సినీతారలను అక్రమంగా తరలించి హైదరాబాద్‌లోని పెద్దలకు పరిచయం చేసేవాడు. లొకాంటో, స్కోక్కా, బ్లాక్‌పేజ్ వంటి వెబ్సైట్లలో అమ్మాయిల ఫొటోలు పెట్టి విటులను ఆకర్షించేవాడు. 35–40 శాతం కమీషన్ తీసుకొని మహిళలను సరఫరా చేసేవాడు. సురేశ్ ఈ దందాను కొంతకాలం గోవాలో కూడా నిర్వహించాడు. ఇప్పటివరకు 450–500 మంది బాధితులను వ్యభిచారకూపంలోకి దింపాడు. ►2019లో గచ్చిబౌలిలోని క్లబ్‌రోగ్ పబ్‌లో వ్యభిచారగృహాన్ని నిర్వహిస్తున్న దీపక్ రాయ్‌తో అఖిల్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అఖిల్ మాదాపూర్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని దందా మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే పోలీసులు దాడి చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి 400–500 మంది మహిళలను తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దింపి, హైదరాబాద్‌లో కాల్ సెంటర్ నిర్వహిస్తూ విటులను ఆకర్షించేవాడు. -
ఆడ శిశువుల్ని సాకి.. వ్యభిచార రొంపిలోకి దింపి
యాదగిరిగుట్ట: బాలికలను అక్రమ రవాణా చేస్తూ వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ చాలా ఏళ్ల క్రితం ఇద్దరు ఆడ శిశువులను కొనుగోలు చేసి యుక్త వయస్సు వచ్చే వరకు పెంచి పోషించింది. సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు ఇద్దరు బాలికలతో వ్యభిచారం చేయించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తన బంధువైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో ఉన్న కంసాని శ్రీనివాస్ వద్దకు బాలికలను పంపించింది. శ్రీనివాస్ అక్కడ ఆ బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తుండేవాడు. అదే క్రమంలో యాదగిరిపల్లికి కూడా పంపిస్తుండేవాడు. వ్యభిచారం చేయించేందుకు అనసూయ వారిని కొడుతూ ఉండేది. అనసూయ, శ్రీనివాస్‌కు మరికొంతమంది సహకరించేవారు. తప్పించుకుపోయి.. పోలీసుల కంటపడి.. అనసూయ చిత్రహింసలకు తట్టుకోలేక ఇద్దరిలో ఓ బాలిక ఇటీవల ఇంటి నుంచి పారిపోయింది. జనగామ జిల్లా బస్టాండ్‌లో తిరుగుతూ పోలీసుల కంట పడింది. వారి విచారణలో యాదగిరిపల్లికి చెందిన అనసూయ, తంగళపల్లికి చెందిన శ్రీనివాస్ వ్యభిచారం చేయిస్తున్న విషయం వెలుగు చూసింది. దీంతో అక్కడి పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులుతో పాటు ఇక్కడి పోలీసులకు సమాచారం అందజేశారు. మెరుపుదాడి చేసి.. ఈ నెల 3న సైదులు ఫిర్యాదు మేరకు యాదగిరిగుట్ట పోలీసులు, షీటీమ్స్, చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు కలిసి యాదగిరిపల్లిలోని కంసాని అనసూయ ఇంటిపై దాడి చేశారు. అనసూయను అదుపులోకి తీసుకుని విచారించగా సెక్స్ రాకెట్ డొంక కదిలింది. ఆమె ఇచ్చిన సమాచారంతో తంగళపల్లికి చెందిన కంసాని శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చంద భాస్కర్, చంద కార్తీక్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని టీచర్ కాలనీకి చెందిన కంసాని లక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. యాదగిరిపల్లికి చెందిన కంసాని ప్రవీణ్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కంసాని స్వప్న, కంసాని అశోక్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చందా సరోజనమ్మ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఇద్దరు బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. దాడుల్లో పాల్గొన్న డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, టౌన్ సీఐ సైదయ్య, యాదగిరిగుట్ట పోలీసు బృందానికి సీపీ మహేష్ భగవత్ అభినందనలు తెలిపారు. -
Photojournalist Smita Sharma: ఉయ్ క్రై ఇన్ సైలెన్స్
ఈ పరిశోధనాత్మక ఛాయాచిత్ర పుస్తకంలో ‘అయ్యో!’ అనిపించే జీవితాలు ఉన్నాయి. కన్నీటి సముద్రాలు ఉన్నాయి. ఏడు సంవత్సరాల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగి, పరిశోధించి దిల్లీకి చెందిన ఫొటో జర్నలిస్ట్ రూపొందించిన ఈ పుస్తకం బాధిత హృదయానికి నిలువుటద్దం... దిల్లీలోని ఒక వ్యభిచార గృహం నుంచి పదిహేడు సంవత్సరాల యువతిని కాపాడారు పోలీసులు. ఆ అమ్మాయితో మాట్లాడిన ఫొటో జర్నలిస్ట్ స్మితాశర్మకు ‘తెలుసుకోవాల్సి విషయాలు చాలా ఉన్నాయి’ అనిపించింది. అలా తన పరిశోధన మొదలైంది. ఏడు సంవత్సరాలు ఎన్నెన్నో కష్టాలు పడి, ఎంతో పరిశోధించి ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ అనే ఫొటోబుక్ తీసుకువచ్చింది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషలలో ఈ పుస్తకం ప్రచురితం అయింది. తన పరిశోధనలో భాగంగా స్మిత తెలుసుకున్న ముఖ్యవిషయం ఏమిటంటే, చాలా కేసుల్లో మానవ అక్రమ రవాణా అనేది బెదిరింపులతో బలవంతంగా జరగడం లేదు. అమ్మాయిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రకరకాల మోసాలతో ఉచ్చులోకి దించుతున్నారు. ఉదాహరణకు మీనా(పేరు మార్చడమైనది) ఒక రోజు మీనాకు ఒక యువకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకసారి కలవాలనుకుంటున్నాను’ అన్నాడు. రెండోరోజు మీనా దగ్గరకు వచ్చి ‘ వీరు మా అమ్మా,నాన్నలు’ అంటూ ఇద్దరిని పరిచయం చేసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ అద్దె తల్లిదండ్రులు కూడా తమ నటనతో రెచ్చిపోయారు. ‘నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం’ అని నమ్మించారు. తన సోదరికి దిల్లీలో వస్త్రవ్యాపారం ఉందని, ఇద్దరం అక్కడే పనిచేద్దాం అన్నాడు యువకుడు. వీరి మాయమాటలు నమ్మి దిల్లీకి చేరిన మీనా దుర్మార్గుల బారిన పడింది. బంగ్లాదేశ్‌కు చెందిన 12 సంవత్సరాల బాలికకు కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయడం అనివార్యం అయింది. తమ కుటుంబంతో కాస్త పరిచయం ఉన్న ఒక వ్యక్తి ‘ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తాను’ అంటూ తీసుకెళ్లి బ్రోతల్ హౌస్‌కు అమ్మేశాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ అమ్మాయి పోలీసుల సహాయంతో విముక్తి అయింది. ఒక ఆశ్రయంలో చేరింది. కొద్దిరోజులకు ఆమెకు ఒక మహిళ పరిచయం అయింది. ‘మీ దేశం తీసుకెళతాను’ అని నమ్మించి పశ్చిమ బెంగాల్‌లోని నమ్‌ఖానా అనే ఊరిలోని బ్రోతల్కు అమ్మేసింది... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ఎందరో బాధితులు ఉన్నారు. యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్స్, లాయర్లు, పోలీస్ అధికారుల సహాయంతో మీనాలాంటి ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది స్మిత. దీనివల్ల అమ్మాయిల అమాయకత్వం, నేరగాళ్లు ఎన్ని రకాలుగా నమ్మిస్తారు? ఆ తరువాత ఎలా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు? ఎలా మోసం చేస్తారు? మానవ అక్రమ రవాణా నేరవ్యవస్థ మూలాలు ఏమిటి?... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది స్మిత. కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలు ఇల్లు ఎందుకు విడిచి పెట్టాలనుకుంటున్నారనే విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తేవడం, వంట వండడం, బట్టలు ఉతకడం, పొలానికి వెళ్లి పనులు చేయడం... పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ అంతులేని బండచాకిరీతో తమకు తెలియకుండానే ఇల్లు, ఊరు దాటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే మోసగాళ్ల బారిన పడుతున్నారు. ‘సున్నితమైన అంశంపై పనిచేస్తున్నాను’ అనే ఎరుకతో కెమెరాను చాలా జాగ్రత్తగా ఉపయోగించింది స్మిత. బాధితుల ముఖాలు కనిపించకుండా స్పాట్లైట్లు, షాడోస్... ఇతరత్రా క్రియేటివ్ మెథడ్స్‌ను ఉపయోగించింది. ‘లైట్లు, షాడోస్ నా ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించాయి’ అంటుంది స్మితా శర్మ. హైదరాబాద్‌లో జరిగిన ‘ఇండియన్ ఫొటో ఫెస్టివల్–2022’లో పరిశోధనాత్మక ఫొటోబుక్ ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ ఆవిష్కరణ జరిగింది. -
చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష
చిన్నారులపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పుడుతున్న ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. బాలికలపై అత్యాచారం, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఇప్పటికే జీవిత ఖైతు అనుభవిస్తున్న పీటర్ గెరార్డ్ స్కల్లీ అనే ఆస్ట్రేలియా వ్యక్తికి ఇది రెండో నేరం. అతను 18 నెలలు వయసు ఉన్న చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో స్కల్లీకి ఈ శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ తీర్పు ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడేవారికి, మానవ అక్రమ రవాణాదారులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ చిన్నారులపై లైంగిక వేదింపులకు అడ్డగా మారిందన్నారు. దేశంలోని పేదరికం, ఆగ్లంలో మంచి పట్టు, హైస్పీడ్ ఇంటర్నెట్ వెసులుబాటు తదితరాలు ఈ దారుణమైన ఘటనలకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. నిందితుడు స్కల్లీ చిన్నారులపై అత్యాచారాలు, మానవ అక్రమ రవాణాతో సహా సుమారు 60 నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు ఆస్ట్రేలియా కగాయన్ డి ఓరో కోర్టు నిందితుడు స్కల్లీ అతని ముగ్గురు సహచరులకు 129 ఏళ్ల జైలు శిక్ష విధించగా అతడి స్నేహితురాలికి 126 ఏళ్లు జైలు శిక్ష విధించింది. (చదవండి: ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు’.. బందీగా మారిన భారత నావికుడు) -
మానవ అక్రమ రవాణా తగ్గడం శుభపరిణామం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా తగ్గుముఖం పట్టడం శుభపరిణామం అని, గతేడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అనేందుకు ఇదే సంకేతమని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కార్యదర్శి రామమోహన్ నిమ్మరాజు స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్నేళ్లుగా కృషి చేస్తున్న రామమోహన్ జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ)–2021 నివేదికపై ఆదివారం స్పందించారు. ఇందుకు సంబంధించిన సమీక్షను ‘సాక్షి’కి వెల్లడించారు. ప్రభుత్వం దిశ బిల్లుతో, ఇతర చర్యలతో రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణకు భరోసా ఇచ్చినట్లు అయిందన్నారు. గతేడాది ప్రతి జిల్లాకు ఒక మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఏర్పాటు చేసి అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో 2020లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021లో ఐదో స్థానానికి తగ్గిందన్నారు. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం మానవ అక్రమ రవాణాలో మొదటి స్థానంలో తెలంగాణ, రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నాయన్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో 99.3 శాతం కేసుల్లో పోలీసులు చార్జిషీట్ వేయడం, 757 మందిని అరెస్టు చేయడం ఒక రికార్డు అని రామమోహన్ వివరించారు. -
Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు
ఉదయం అమ్మకు ఇంట్లో టాటా చెప్పి, బడిలో పాఠాలు వింటూ.. స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ తిరిగిన అమ్మాయి సాయంత్రం అయ్యేసరికి తనకు తెలియని చీకటి లోకంలో ఉంటే ఎంత భయం... చుట్టూ ఏం జరుగుతోందో... తనకేం జరిగిందో తనకే సరిగా తెలియని ఆ ‘చీకటి లోకం’లో తెగువ చూపి, అది మిగిల్చిన చేదు సంఘటనల నుంచి బయటపడి ఇంటికి వచ్చేసింది 14 ఏళ్ల ఆ అమ్మాయి. ఊళ్లో అంతా విచిత్రంగా చూశారు ఆమెను. ‘బిజినెస్ గర్ల్’ అని అంతా అంటుంటే కుంగిపోయింది. కానీ, అదే అమ్మాయి 21 ఏళ్ల వయసు వచ్చేనాటికి మానవ అక్రమ రవాణాకు గురైన బాలికల జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోంది. ఆమె పేరు పీహూ మోండల్. పశ్చిమ బెంగాల్‌లోని ఓ మారుమూల గ్రామం. ‘హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన ఆడపిల్లల బాధను పంచుకుని, వారిని నరకపు నీడ నుంచి బయటికి తీసుకొచ్చి, వెలుగు చూపగలిగినప్పుడు ఇంకా నా గుర్తింపును నేను ఎందుకు దాచుకోవాలి?!’ అని ప్రశ్నిస్తున్న ఈ అమ్మాయి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ‘‘మేడమ్ సాహెబ్’ కావాలని నా చిన్ననాటి నుంచి నాతో పెరిగిన కల. పరగాణాలోని చిన్నూరు మాది. మా నాన్న రోజు కూలీ. అమ్మ గృహిణి. మాకంటూ సెంటు భూమి లేదు. ఉన్నదల్లా తలదాచుకునేందుకు చిన్న ఇల్లు. మా ఊళ్లో ఆడపిల్లలు చదువుకోవడానికి బడికి వెళ్లరు. కానీ, నాకు చదువుకోవాలని ఉండేది. నేను మేడమ్ సాహెబ్‌గా ఎదగాలని కలలు కంటూ, పుస్తకాలనే ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఇదే విషయాన్ని మా అమ్మానాన్నలతో చెబితే వాళ్లూ ‘సరే’ అన్నారు. ఊళ్లో చాలా మంది వ్యతిరేకించారు అమ్మాయిలకు చదువెందుకని. కానీ, వాళ్లతో గొడవపడి మరీ నన్ను స్కూల్లో చేర్పించారు నాన్న. నాకు చదువు మీద ఉన్న ఇష్టం చూసి, ఇంటి పనిలో కూడా సాయం చేయమని అడిగేది కాదు అమ్మ. అప్పుడప్పుడు మా ఊరి వాళ్లు కొందరు వెక్కిరించినా వాటిని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. నొప్పి ఉంది, ప్రాణం లేదు పద్నాలుగేళ్ల వయసు. పదవతరగతిలోకి అడుగు పెట్టాను. నేనూ, మా స్నేహితురాలు కలిసి ఇంటికి తిరిగి వస్తున్నాము. చాలా ఎండ, గొంతెండుకుపోతోంది. దారిలో ఒకరి దగ్గర నీళ్లు ఉంటే అడిగి, తీసుకొని తాగాం. ఆ తర్వాత ఇంటివైపు బయల్దేరాం. కొంచెం దూరం నడిచాక అడుగులు తడబడటం మొదలెట్టాయి. తల అంతా తిరుగుతున్నట్టు అనిపించింది... కళ్లు తెరిచి చూసేసరికి నేనూ, నా ఫ్రెండ్ రైలులో ఉన్నాం. ఒళ్లంతా విపరీతమైన నొప్పి. కూర్చోవడానికి ఒళ్లు సహకరించడం లేదు. మా దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మా పరిస్థితి చూశాక మేమెలాంటి దారుణానికి గురయ్యామో కొంత మేరకు అర్థమయ్యింది. అక్కడ మమ్మల్ని ఇంకెవరికో అమ్మేందుకు తీసుకువెళుతున్నారని, ఇప్పటికే రెండుసార్లు అమ్ముడు పోయామన్న మాటలు విన్నాం. ఒకరినొకరం చూసుకున్నాం. చైన్ లాగితే రైలు ఆగింది. వెంటనే, రైల్వే పోలీసులు వచ్చారు. తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు ఒకసారి మానవ అక్రమరవాణాపై వర్క్‌షాప్‌కి హాజరయ్యాం. అందుకే, మాకు వెంటనే రైలును ఆపాలనే ఆలోచన వచ్చింది. విచారణ తర్వాత మేం ఇంటికి వచ్చాం. అవగాహనే ప్రధానం ఇవన్నీ మా ఇంట్లో... నా ఒంట్లో ఒకలాంటి నిస్తేజాన్ని నింపాయి. దాంతో డిప్రెషన్లోకి వెళ్లాను. నాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో తిరిగి స్కూల్‌కి వెళ్లి, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని నిరూపించాను. దీని తర్వాత బంధన్ ముక్తి, ఇల్ఫత్లో చేరాను. అక్కడ, మానవ అక్రమ రవాణా, పిల్లల అక్రమ రవాణా, అత్యాచార ఘటనలలో ప్రాణాలతో బయటపడిన అమ్మాయిలను చాలా దారుణమైన స్థితిలో చూశాను. వారి గురించి ఆలోచిస్తే నా వెన్నులో వణుకు వచ్చేస్తుంది. నేను తప్పించుకున్నది అదృష్టంగా భావించాను. నాలా మరే ఆడపిల్లా ఆ నరకంలోకి చిక్కుకోకుండా ఉండేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి మానవ అక్రమ రవాణా గురించి బాలికలకు అవగాహన కల్పిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడా ఏ అమ్మాయీ మానవ అక్రమ రవాణాకు గురికాకూడదు. ఇదే ఆలోచనతో నా లక్ష్యం వైపుగా సాగుతున్నాను. సంస్కృతం ప్రధాన సబ్జెక్ట్‌గా బి.ఎ. పూర్తిచేశాను. ఇప్పుడు ఎం.ఎ. చేయాలనుకుంటున్నాను. సొంతంగా హ్యాండ్‌మేడ్ ఆభరణాలను తయారు చేస్తుంటాను. పెయింటింగ్స్ వేస్తుంటాను. పర్వతారోహణ చేయాలన్నది నా మరో కల. ఎల్తైన శిఖరం అంచున నిలబడి, చేతులు చాచి అక్కడి గాలిని ఆస్వాదించాలి. అందుకు కూడా అడుగులు వేస్తున్నాను’’ అని చెబుతున్న రేపటి ఈ ఆశాజ్యోతి ఆశయాలు నెరవేరాలని ఆశిద్దాం. అంతటా దూరం దూరం.. స్కూల్‌కు రావద్దని అక్కడి టీచర్లు చెప్పేశారు. ఏడుస్తూ ఇంటికి వస్తే మా అమ్మానాన్నలు దీనస్థితిలో ఉన్నారు. ఊళ్లో అంతా ‘చదువుకునే అమ్మాయిలు పారిపోతారు’ అంటూ మమ్మల్ని నీచ పదాలతో తిట్టారు. కలెక్టివ్ గ్రూప్ సాయంతో స్కూల్లో చదువుకోవడానికి అనుమతి లభించింది. అయితే, అక్కడి టీచర్లు మాతో సరిగా ప్రవర్తించలేదు. ఇతర పిల్లలతో కలిసి కూర్చోనివ్వలేదు. మొదటి సీట్లో కూర్చొనేదాన్ని, చివర సీట్లోకి పంపించారు. ఇక ఇతర పిల్లల తల్లిదండ్రులు ‘మా అబ్బాయిలకు దూరంగా ఉండాలి. అయినా, చదువుకుని ఏం చేస్తావు, చేసేది అదే వ్యాపారం కదా!’ అని హేళనగా మాట్లాడేవారు. -
పదేళ్ల అన్వేషణకు తెర
నెల్లూరు (క్రైమ్): పదేళ్ల కిందట అదృశ్యమైన ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లల కేసును యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) పోలీసులు ఛేదించారు. వారిని తీసుకొచ్చి ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అల్తుర్తికి చెందిన జయంతి తన ఇద్దరు పిల్లలతో కలిసి 2012లో కనిపించకుండా పోయింది. అప్పట్లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం ఎంత గాలించినా ఎలాంటి సమాచారం లభించకపోవటంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఎస్పీ సీహెచ్ విజయారావు ఇటీవల ఏహెచ్‌టీయూను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏహెచ్‌టీయూ ఎస్ఐ విజయశ్రీనివాస్ ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. తప్పిపోయిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారం లేకపోవడంతో పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. సదరు మహిళపై రేషన్‌కార్డు ఉండటాన్ని గుర్తించి, దాని ఆధారంగా ఆమె గుంటూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. శనివారం రాత్రి ఎస్ఐ తన సిబ్బందితో గుంటూరుకు చేరుకుని జయంతి, ఆమె ఇద్దరు పిల్లలను తమ సంరక్షణలోకి తీసుకుని నెల్లూరుకు తీసుకువచ్చారు. ఆదివారం పొదలకూరు పోలీసుస్టేషన్లో వారిని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. -
బాలల అక్రమ రవాణా చాలా తీవ్రమైన విషయం
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా.. ముఖ్యంగా చిన్న పిల్లల అక్రమ రవాణా చాలా తీవ్రమైన వ్యవహారమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ విషయంలో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాంను కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా నియమిస్తున్నట్లు తెలిపింది. మానవ అక్రమ రవాణా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, మార్గదర్శకాలను తెలియజేయాలని శ్రీరఘురాంను కోరింది. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు చిన్నారుల అక్రమ రవాణాపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టులో సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇద్దరు చిన్నారులను విక్రయించిన ఘటనలో క్రిమినల్ చర్యల గురించి ధర్మాసనం ఆరా తీసింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ, ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, 11 మందిని నిందితులుగా చేర్చారని తెలిపారు. వారంతా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని, బెయిల్ ఇచ్చేందుకు కింది కోర్టు నిరాకరించిందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ అక్రమ రవాణాను ఆపేందుకు ఏం చేయాలని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కోర్టుకు సహకరించాలని సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాంను ధర్మాసనం కోరింది. మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా చిన్నారుల అక్రమ రవాణా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తెలిపింది. ఈ వ్యాజ్యాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను శ్రీరఘురాంకు అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 2021లో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ప్రస్తుత సుమోటో వ్యాజ్యాలను వాటితో కలిపి విచారించాలని సుమన్ కోరారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందిస్తూ తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. గతంలో దాఖలైన వ్యాజ్యాలతో ఈ వ్యాజ్యాలను కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
‘ఆ స్థాయి’ కేసులే దర్యాప్తు చేస్తాం
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణాకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యవసానాలు ఎదురయ్యే కేసులను మాత్రమే తాము దర్యాప్తు చేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైకోర్టుకు నివేదించింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మూడునెలల ఆడ శిశువును రెండునెలల్లో ఏడుసార్లు విక్రయించిన ఘటనపై మంగళగిరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యవసానాలు ఎదురయ్యేంత కేసు కాదని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత కేసులో ఆదేశాలు జారీచేయాలని కోరింది. ఈ మేరకు ఎన్ఐఏ ఎస్పీ వి.విక్రమన్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. శిశు విక్రయాలపై స్పందించిన హైకోర్టు మంగళగిరికి చెందిన మేడబలిమి మనోజ్ తన మూడునెలల ఆడ శిశువును, ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన జి.చిలకమ్మ అనే మహిళకు పుట్టిన శిశువును పలువురికి విక్రయించారు. వీటికి సంబంధించి పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యాలపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్ఐఏ, సీబీఐలకు నోటీసులు జారీచేసింది. బుధవారం మరోసారి విచారణకు రాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ కౌంటర్ దాఖలుకు గడువు కోరారు. ధర్మాసనం అంగీకరిçస్తూ విచారణను మే 4కు వాయిదా వేసింది. -
కుక్కల కంటే హీనంగా ఆమెను.. సంచలనం సృష్టించిన వీడియో
ఓపెన్ చేయగానే.. హుషారెత్తించే సంగీతం. ఆ మరుసటి క్షణాల్లోనే.. ఒక గ్రామీణ ప్రాంతం. ఫోన్ కెమెరాలు ఓ మహిళ వైపు వెళ్తుంటాయి. కనీసం తలుపు కూడా లేని గుడిసె అది. అందులో గోడకు కట్టిన గొలుసు.. ఆమె మెడకు వేలాడదీసి ఉంది. పేదల కోసం డబ్బు సేకరించే ఓ వ్లోగర్ సరదాగా తీసిన ఆ వీడియోను 1.92 బిలియన్ల మంది చూశారంటే.. నమ్మగలరా? జియాన్గ్సు ప్రావిన్స్‌లో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తొలుత జనవరి 28వ తేదీన వీడియో షేరింగ్ యాప్ డౌయిన్(చైనా వెర్షన్ టిక్‌టాక్).. ద్వారా వైరల్ అయ్యింది. విడుదల కావడమే విపరీతమైన చర్చకు దారితీసింది కూడా. కుక్కల కంటే హీనంగా ఒక నిస్సహాయురాలిని కట్టేసి.. ఆమెపై లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న ఈ కథనంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ఉలిక్కిపడింది. చైనాలో పేరుకుపోయిన హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణగా ఈ ఘటన దొరికిందంటూ పలువురు చర్చించారు. అయితే పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో.. అదే రోజు సాయంత్రం ఆ వీడియోపైన ఫెంగ్ కౌంటీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమెకు మతిస్థిమితం లేదు! యంగ్ కుటుంబానికి చెందిన ఆ మహిళకు మతిస్థిమితం లేదని, దాడులకు పాల్పడుతుండడంతో అలా కట్టేశారని, భర్త ఎనిమిది మంది పిల్లలతో ఆమె జీవిస్తోందని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడే అధికారులు అడ్డంగా నెటిజన్స్‌కు దొరికిపోయారు. పిల్లల్ని కనే విషయంలో కఠినమైన చట్టాల్ని పాటించే(2016 వరకు ఒకే బిడ్డ అనే నినాదం ఉండేది) చైనాలో.. ఎనిమిది మంది పిల్లల్ని కనేందుకు ఒక మహిళకు ఎలా అవకాశం ఉంటుందని నిలదీశారు. దీంతో అదంతా కట్టుకథగా తేలింది. ఆ ఇద్దరితో మొదలై.. జియాంగ్సు, అన్హుయి ప్రావిన్స్‌లోని ఇద్దరు స్నేహితురాళ్ల జోక్యంతో ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ‘ఈ ప్రపంచం నిన్ను ఒంటరిని చెయ్యనివ్వదు. నీ కోసం నీ అక్కాచెల్లెళ్లం వస్తున్నాం’ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు వీళ్లిద్దరూ. అంతేకాదు ఫెంగ్ కౌంటీ మొత్తం తిరుగుతూ.. యాంగ్‌కు సంబంధించిన కథనాలను ప్రచురిస్తూ జనాలకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ పోయారు. దీంతో ఈ వ్యవహారం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. యాంగ్‌కు మద్దుతగా లక్షల మంది సైన్ పిటిషన్ చేపట్టారు. అధికారుల అంతరిక్ష పల్టీలు ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వం ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసబెట్టి స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తూ పోతోంది. ఆమె పేరు, ఆ వ్యక్తితో సంబంధం, ఆమె మానసిక స్థితి.. ఇలా ఒకదానికి మరొకటి పొంతన లేకుండా పోతోంది. అయినప్పటికీ ఆ ప్రతీ ప్రకటనను జనాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రతీదాంట్లోనూ ఆమె, ఆమె నిస్సహాయ స్థితి కనిపిస్తోంది కాబట్టి. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. నిస్సహాయస్థితిలో ఉన్న ఆడవాళ్లను, ఆఖరికి మానసిక స్థితి బాగోలేని.. వాళ్ల పరిస్థితులను ఆసరాగా తీసుకుని సైతం గ్రామీణ ప్రాంతాలు అక్రమంగా తరలిస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో చచ్చినట్లు నిజాన్ని సగం ఒప్పేసుకుంది అక్కడి ప్రభుత్వం. కానీ, అసలు ఆమె ఎవరు? ఏంటనే వివరాల్ని మాత్రం వెల్లడించడం లేదు. అదే టైంలో ఆమెను వీడియో తీసిన వ్లోగర్, ఆమె గొలుసులు విప్పాలని ప్రయత్నించిన ఇద్దరు అమ్మాయిలు జాడ లేకుండా పోయారు. దీంతో మీడియా హౌజ్‌లు వణికిపోతుండగా.. కేవలం సోషల్ మీడియాకే ఈ క్యాంపెయిన్ అంకితమవుతోంది. అదే సమయంలో యంగ్ ఫొటోను సెన్సార్షిప్ చేసింది చైనా ప్రభుత్వం. ఎవరైనా ఆమె ముఖం ప్రచురిస్తే.. కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తోంది. బంగారు రాణులు మాకెందుకు? చైనా స్నో క్వీన్ ఎయిలీన్ గూ వింటర్ ఒలింపిక్స్‌లో హాఫ్ పైప్ స్కయింగ్ విభాగంలో స్వర్ణాలతో మెరిసిన 18 ఏళ్ల చిన్నది. అమెరికాలో శిక్షణ పొంది.. చైనా తరపున వింటర్ ఒలింపిక్స్‌లో చైనా తరపున పాల్గొంటోంది. దీని వెనుక చైనా ఒత్తిడి ఉందనుకోండి.. అది వేరే విషయం అనుకోండి. బంగారు పతకాలు వేసుకున్న ఎయిలీన్ గూ లాంటి వాళ్లు తమకు అక్కర్లేదని, మెడలో ఇనుప గొలుసులతో ఉన్న యాంగ్ లాంటి వాళ్ల గాథలే తమకు చెప్పాలంటూ చైనా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు పలువురు. చైనాలో ఒకే బిడ్డను కనాలనే నిబంధన చాలామంది మగవాళ్లకు ఒక సమస్యగా మారింది. దీంతో హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా ఆడవాళ్లను ఎత్తుకెళ్లి.. మారుమూల పల్లెల్లో దాచేవి కొన్ని ముఠాలు. వాళ్ల ద్వారా పిల్లల్ని కని.. తమ కోరికలను తీర్చుకునేవాళ్లు కొందరు. ఆ తర్వాత ఒక్క బిడ్డ నిబంధన మాయమైపోవడంతో.. ఆ మహిళలు పూర్థిస్తాయి సె* బానిసలుగా మారిపోయారు. గొలుసులతో బంధించి మృగాలకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పైశాచికత్వం ఏళ్ల తరబడి కొనసాగుతున్నా.. ప్రభుత్వాలకు తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. అంతర్జాతీయ సమాజం నిలదీస్తే.. ఇంకెన్ని అబద్ధాలు పుట్టుకొస్తాయో చూడాలి మరి. -
ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం: భారతీయుల మృతిపై కెనడా ప్రధాని
కెనడా అమెరికా సరిహద్దు ప్రాంతంలోని తీవ్రమైన గడ్డకట్టే చలి కారణంగా శిశువుతో సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. ఈ సంఘటన మనసుని కదిలించే" విషాదంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూడో శుక్రవారం మాట్లాడుతూ... "అమెరికా సరిహద్దుల గుండా ప్రజల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తోంది. ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం. మానవ అక్రమ రవాణాదారుల బాధితులు...మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవాలనే కోరిక నెరవేరకుండానే ఆ కుటుంబం అలా చనిపోవడం చాలా విషాదకరం. ప్రజలు అక్రమంగా సరిహద్దులు దాటకుండా కట్టడిచేసేలా తాము చేయగలిగినదంతా చేస్తున్నాం." అని అన్నారు. పైగా కెనడా స్మగ్లింగ్‌ను ఆపడానికి , ప్రజలకు సహాయం చేయడానికి యునైటెడ్ స్టేట్స్తో కలిసిపనిచేస్తోందని ట్రుడో చెప్పారు. అక్రమ వలసదారులు సాధారణంగా అమెరికా నుండి కెనడాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారని కెనడియన్ అధికారులు వెల్లడించారు. అయితే 2016లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత నుంచే కెనడాలోకి కాలినడకన సరిహద్దు దాటడం పెరిగిందని తెలిపారు. ఈ మేరకు గురువారం మానిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్సీఎంపీ) నలుగురి మృతదేహాలను దక్షిణ మధ్య మానిటోబాలోని ఎమర్సన్ ప్రాంతానికి సమీపంలో యుఎస్ కెనడా సరిహద్దులోని కెనడియన్ వైపు కనుగొన్నాం అని చెప్పారు. అయితే మృతులంతా గుజరాత్‌కి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు అని, తీవ్రమైన చలికి గురికావడం వల్లే మరణించారని తెలిపారు. ఈ మేరకు ఆర్సీఎంపీ నాలుగు మృతదేహాలను కనుగొన్న వెంటనే అసిస్టెంట్ కమిషనర్ జేన్ మాక్‌లాచీ దీనిని హృదయ విదారక విషాదంగా పేర్కొన్నారు. పైగా మంచుతుఫానులో ఈ కుటుంబం చిక్కుకున్నట్లు తాము గుర్తించాం అని చెప్పారు. ఈ మేరకు కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా మరణించిన వారి జాతీయతను ధృవీకరించడమే కాక, ఈ సంఘటనను తీవ్ర విషాదంగా అభివర్ణించారు. అంతేకాదు బిసారియా మాట్లాడుతూ...ఇది ఘోరమైన విషాదం. సమన్వయ సహాయం కోసం భారత కాన్సులర్ బృందం మానిటోబాకు వెళ్లనుంది. ఈ ఆందోళనకరమైన సంఘటనలను పరిశోధించడానికి మేము కెనడియన్ అధికారులతో కలిసి పని చేస్తాము" అని బిసారియా ట్వీట్ చేశారు. (చదవండి: ఎమర్జెన్సీ ల్యాడింగ్ తర్వాత ప్రయాణికులకు ఝలక్ ఇచ్చిన పైలెట్..) -
మోసం చేసిన ఏజెంట్! ఒమన్‌లో చిక్కుల్లో పడ్డ భారతీయ మహిళ !
ట్రావెల్ ఏజెంట్లు చేసిన మోసంతో ఓ మహిళ దేశం కాని దేశంలో ఇక్కట్ల పాలైంది. చేతిలో డబ్బులు లేక అక్కడ యజమాని పెట్టే కష్టాలు భరించలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూసింది. చివరకు విదేశాంగ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆ మహిళకు అండగా నిలిచారు. మారుమూల ప్రాంతానికి మస్కట్‌లో ఉద్యోగం ఉందంటూ మాయమాటలు చెప్పిన ఓ ట్రావెల్ ఏజెంట్ రంగారెడ్డి జిల్లాలోని షహీన్ నగర్‌కి చెందిన ఓ మహిళను విమానం ఎక్కించాడు. మస్కట్‌కి కాకుండా ఒమన్‌లోని మారుమూల ప్రాంతమైన సిర్కి ఆ మహిళను పంపాడు. అక్కడ ఉద్యోగం బదులు ఒకరి ఇంట్లో పని మనిషిగా కుదిర్చాడు. ఈ ఘటన 2021 నవంబరులో జరిగింది. నిత్యం హింసే రోజుకు 18 గంటల పాటు పని చేసినా యజమాని సంతృప్తి చెందకపోవడంతో నిత్యం ఆమెను హింస పెట్టేవాడు. దీంతో తనను ఇండియా పంపివ్వాలంటూ ఆ మహిళ వేడుకోగా.. తనకు రెండు లక్షలు నష్ట పరిహారం చెల్లిస్తే తప్ప విముక్తి లేదంటూ ఖరాఖండీగా ఆ యజమాని చెప్పాడు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఫోన్ ద్వారా జరిగిన మోసం కుటుంబ సభ్యులకు తెలిపింది. నిఘా పెట్టాలి ఆ మహిళ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న స్వచ్ఛంధ సంస్థల ద్వారా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. మస్కట్, ఒమన్లలో ఉన్న భారత అధికారులు.. సదరు యజమానితో మాట్లాడి సమస్యకి పరిష్కారం చూపారు. చివరకు 2022 జనవరి 18న ఆ మహిళ సురక్షితంగా ఇండియా చేరుకుంది. ట్రావెల్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతీసారి సరైన సమయంలో సహాయం అందకపోవచ్చని.. కాబట్టి చిక్కుల్లో పడవద్దంటూ సూచించారు. ట్రావెల్ ఏజెంట్ల ముసుగులో హుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: అబుదాబి ఎయిర్‌పోర్టు డ్రోన్ ఎటాక్.. యూఏఈ స్పందన -
మానవ అక్రమ రవాణా కట్టడి
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా మాఫియాకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసుల నమోదు, అరెస్టుతోపాటు బాధితులను రక్షించడంలోనూ ఏపీ ముందుంటోంది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి వారిపై చార్జిషీటు వేయడం దేశంలో సగటున 85.2 శాతం ఉంటే ఏపీలో 99.2 శాతం ఉండటం విశేషం. గడిచిన ఏడాదిలో ఈ తరహా కేసుల్లో ఏకంగా 619 మంది నిందితులను అరెస్టు చేయడం మరో రికార్డు. అలాగే 257 మంది బాధితులను కాపాడారు. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) కొద్ది రోజుల కిందట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2020లో మొత్తం 1,714 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు అయ్యాయి. కేసుల నమోదులో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ వరుస స్థానాల్లో నిలిచాయి. గడిచిన మూడేళ్ల గణాంకాలను గమనిస్తే ఏపీలో గతేడాది మానవ అక్రమ రవాణా కేసులు తగ్గుముఖం పట్టినట్టు తేటతెల్లమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయం ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టడం అభినందనీయం. ప్రధానంగా మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే మూడు ఏహెచ్‌టీయూలు ఉన్నాయి. మరో పది ఏర్పాటు చేస్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్లతో వీటిని అనుసంధానం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం మంచి పరిణామం. కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులతో మానవ అక్రమ రవాణా మరింత పెరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బాధితులను కాపాడి, వారి పునరావాసంపై దృష్టి సారిస్తోంది. – ఎన్.రామ్మోహన్, హెల్ప్ సంస్థ డైరెక్టర్ -
మానవ అక్రమరవాణాకు చెక్
సాక్షి, అమరావతి: మానవ అక్రమరవాణా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. జిల్లాకు ఒక మానవ అక్రమరవాణా నిరోధక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికి ఉన్న మూడు స్టేషన్లకు అదనంగా కొత్తగా పదింటిని ఏర్పాటు చేస్తారు. ఈమేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. దేశంలో మానవ అక్రమరవాణా నిరోధానికి కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం కింద గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది. జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. కానీ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏలూరు, గుంటూరు, అనంతపురంలలో మాత్రమే ఏర్పాటు చేసింది. వాటికి పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించలేదు. మౌలిక వసతులు కల్పించలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మానవ అక్రమరవాణాను పూర్తిగా అరికట్టటంపై దృష్టి సారించింది. పేదరికాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మహిళలు, చిన్నపిల్లలను అక్రమంగా తరలిస్తూ బలవంతంగా అసాంఘిక కార్యకలాపాల కూపంలోకి నెడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని నిరోధించి మహిళలు, చిన్నారుల హక్కులను కాపాడేందుకు వెంటనే జిల్లాకు ఒకటి చొప్పున మానవ అక్రమరవాణా నిరోధక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న మూడు స్టేషన్లకు అదనంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఒక్కో పోలీస్ స్టేషన్‌కు ఒక సీఐ, ఇద్దరు ఎస్.ఐ.లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఐదుగురు కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. వీలైనంతవరకు మహిళా పోలీసు అధికారులు, సిబ్బందినే ఈ స్టేషన్లకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలపై దాడులు, వేధింపుల నిరోధానికి ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లతో వీటిని అనుసంధానించాలని కూడా సూత్రప్రాయంగా నిర్ణయించింది. మానవ అక్రమరవాణాను అరికట్టేందుకు అవసరమైన మౌలిక వసతులను కూడా సమకూరుస్తారు. దీనిపై పోలీసుశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. -
ట్రాఫికింగ్‌పై ‘ధ్రువా’స్త్రం
సాక్షి, హైదరాబాద్: మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్) ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. రాష్ట్రంలో దీన్ని నిరోధించేందుకు తెలంగాణ పోలీసులు నడుం బిగించారు. కలకలం రేపుతున్న ట్రాఫికింగ్‌ను కట్టడి చేయడానికి మరో వినూత్న ప్రయోగం చేశారు. పిల్లలు, మహిళలకు ప్రమాదకరంగా మారిన మానవ అక్రమ రవాణా నిరోధకానికి దేశంలోనే తొలి వెబ్సైట్ ధ్రువహెచ్‌టీ (http://dhruvaht.orf/) (డీహెచ్‌ఆర్‌యూవీఏహెచ్‌టీ.ఓఆర్జీ)ను ఇటీవల ప్రారంభించారు. విమెన్‌సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ హైకమిషన్, తరుణి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మనుషుల అక్రమ రవాణా కేసులు తరచుగా వెలుగుచూస్తున్నాయి. మహిళలు, బాలికలను ఎత్తుకెళ్లి వ్యభిచార గృహాలకు విక్రయించడం, పిల్లల చేత బలవంతంగా పనిచేయించడం, భిక్షాటన, వారి అవయవాల మార్కెటింగ్ తదితర మాఫియా ముఠాల ఆట కట్టించడం ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం. అలాగే దీనిపై ఆన్లైన్లో పోలీసులకు, సాధారణ పౌరులకు సైతం శిక్షణ ఇస్తారు. ఈ వెబ్సైట్లో ఏముంటుంది? ‘ధ్రువ’వెబ్సైట్ ట్రాఫికింగ్‌కు సంబంధించిన సమస్త సమాచారంతో భాండాగారంలా పనిచేస్తుంది. ఈ వెబ్సైట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నప్పటికీ.. త్వరలోనే పూర్తి స్థాయిలో సేవలు అందించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉంచారు. ► హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా ఉంటుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది. ఈ సమస్య దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది? ట్రాఫికింగ్‌ను ఎలా కనిపెట్టవచ్చు? ఎలా బయటపడవచ్చో వివరిస్తుంది. ► బాధితులు ఎవరిని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలో తెలియజేసే ఈ–మెయిల్, ఫోన్, వాట్సాప్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ► భారత న్యాయవ్యవస్థలో ట్రాఫికింగ్ బాధితులకు అనుకూలంగా ఉండే చట్టాలు, తీర్పులు, వారి హక్కులు, పరిహారం తదితర వివరాలుంటాయి. ► ఈ–లెర్నింగ్ అనే ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా సాధారణ పౌరులు, పోలీసులకు శిక్షణ ఇస్తారు. ఆన్లైన్ కోర్సులు నిర్వహించి అప్పటికప్పుడు సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తారు. ► రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాకు సంబంధించి వివిధ భాషల్లో ప్రచురితమైన వ్యాసాలు ఉంటాయి. మనవద్ద సైతం.. అంతర్జాతీయ ట్రాఫికింగ్ ముఠాలు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ తదితర దేశాల నుంచి పలువురు మహిళలను దొడ్డిదారిలో దేశం దాటించి దేశంలోని పలు నగరాలతోపాటు హైదరాబాద్‌లోనూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల పలుమార్లు రాచకొండ పోలీసులు ఈ తరహా కేసులను పట్టుకున్నారు. 2019లోనూ నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన పిల్లలు పట్టుబడ్డారు. కిడ్నాపింగ్, బెగ్గింగ్ మాఫియా, ఆర్గాన్ మాఫియాల ఆటకట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 31 మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ విమెన్‌సేఫ్టీ వింగ్ పర్యవేక్షణలో పనిచేస్తాయి. టెక్నాలజీతో అరికడతాం మానవ అక్రమ రవాణా కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నాం. వీటిని ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు బృందాలను కూడా ఏర్పాటు చేశాం. ఆయా బృందాలకు టెక్నాలజీని జోడించి హీనమైన నేరాలకు పాల్పడేవారి ఆట కట్టిస్తాం. – మహేందర్‌రెడ్డి, డీజీపీ సంపూర్ణ సహకారం ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా చాలా ఘోరమైన నేరం. వీటిని అరికట్టేందుకు నడుం బిగించిన తెలంగాణ పోలీసులకు సాంకేతికంగా, సమాచారపరంగా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. – ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ నిబంధనావళి.. శిక్షణ ట్రాఫికింగ్ కేసుల్లో వేగంగా ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక నిబంధనావళి రూపొందించాం. దీనిపై ప్రత్యేకంగా నియమించిన బృందాలకు శిక్షణ ఇచ్చాం. సిబ్బందికి సాంకేతిక మెళకువల కోసం నిరంతర శిక్షణ కూడా ఇస్తున్నాం. – స్వాతి లక్రా,ఏడీజీ, విమెన్‌సేఫ్టీ వింగ్ -
మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, బాధితులను తక్షణమే ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మానవ అక్రమ రవాణా నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ పోలీస్, ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో శుక్రవారం వర్చువల్ సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన డీజీపీ ప్రారంభోపన్యాసం చేశారు. మానవ అక్రమ రవాణా నివారణ చర్యల్లో భాగంగా బాధితుల గుర్తింపు, వారు తక్షణ న్యాయం, సహాయం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో నంబర్ 47ను తెచ్చిందని డీజీపీ తెలిపారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో రాష్ట్ర శాంతి భద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, దిశ ప్రత్యేక అధికారి బి.రాజకుమారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ పీఎం నాయర్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రమేష్ కన్నెగంటి, హెల్ప్ సంస్థ ఆర్గనైజేషన్ కన్వీనర్ ఎన్వీఎస్ రామ్మోహన్, బచపన్ బచావో ఆందోళన్ ప్రతినిధి తిరుపతి, రెడ్ రోప్ తదితర స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ.. అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు దాని బారి నుంచి బయట పడిన బాధితులకు తక్షణ న్యాయం అందించడంపై మరింత దృష్టి పెట్టాలన్నారు. పలువురు డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని మాట్లాడారు. -
మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
సాక్షి, న్యూఢిల్లీ: మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం నూతన చట్టాన్ని తీసుకురానుంది. ఈ బిల్లుపై ముసాయిదా విడుదల చేసిన కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ భాగస్వాముల నుంచి సూచనలు సలహాలు కోరింది. 2018లో ముసాయిదా బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ప్రవేశపెట్టలేదు. ఆ సమయంలో లేవనెత్తిన ఆందోళనలకు నూతన ముసాయిదాలో పరిష్కారం చూపారని నిపుణులు చెబుతున్నారు. భాగస్వాముల నుంచి సూచనలు సలహాలు వచ్చిన అనంతరం కేంద్ర మంత్రివర్గానికి ఆపై పార్లమెంటులోనూ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. మానవ అక్రమ రవాణా చేసే వారికి పదేళ్ల వరకూ జైలు శిక్ష పడేలా కేంద్రం ఈ చట్టాన్ని రూపొందించింది. బాధితులకు పునరావాస చర్యలు ఏ విధంగా తీసుకోవాలో కూడా చట్టం స్పష్టత ఇచ్చింది. చట్టం ప్రకారం నిందితులను దర్యాప్తు చేయడానికిప్రత్యేక ఏజెన్సీనికేంద్రం ఏర్పాటు చేయాలని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రతి జిల్లాలోనూ సెషన్స్ కోర్టులను ప్రత్యేక కోర్టుగా పరిగణించాలి. గెజిటెడ్ అధికారి స్థాయి పోలీసు అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలి. చట్టం అమలుకు ప్రభుత్వాలు యాంటీ ట్రాఫికింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలి. దీన్ని బాధితుల పునరావాసానికి వినియోగించాలి. బాధితులు వేరే జిల్లా,రాష్ట్రానికి చెందిన వారైతే మెరుగైన భద్రత కోసం జిల్లా కమిటీ వారిని అవసరమైతే సొంత ప్రాంతానికి పంపొచ్చు. బాధితులు ఇతర దేశానికి చెందిన వారైతే ఆ సమయంలో ఉన్న చట్టాలు అనుసరించి రాష్ట్ర కమిటీ వారిని వారి దేశానికి పంపొచ్చు. చట్టం అమలుకు సంబంధించి చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ ద్వారా నిబంధనలు పేర్కొనాలి. అనంతరం రాష్ట్రంలోని ఉభయసభల్లోనూ ఆమోదం పొందాలి. డిస్ట్రిక్ట్ యాంటీ ట్రాఫికింగ్ కమిటీ చైర్పర్సన్: జిల్లా కలెక్టర్ సభ్యుడు/సభ్యురాలు: ముగ్గురిలో ఇద్దరు సామాజిక కార్యకర్తలు. వీరిలో మహిళ సభ్యురాలిని జిల్లా న్యాయమూర్తి నియమించాలి. జిల్లా న్యాయ సేవల అథారిటీ నుంచి ఒకరిని జిల్లా న్యాయమూర్తి నామినేట్ చేయాలి. సామాజిక న్యాయ లేదా మహిళ శిశు అభివృద్ధి విభాగం నుంచి జిల్లా అధికారి సభ్య కార్యదర్శిగా ఉంటారు. ప్రతి నెలా కమిటీ సమావేశం కావాలి. స్టేట్ యాంటీ ట్రాఫికింగ్ కమిటీ చైర్పర్సన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులు: ఎనిమిది మంది. మహిళ, శిశు అభివృద్ధి, హోం, కార్మిక, ఆరోగ్య విభాగాల కార్యదర్శులు డీజీపీ, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ కార్యదర్శిలతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సెంట్రల్ యాంటీ ట్రాఫికింగ్ అడ్వైజరీ బోర్డు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ బోర్డు ఏర్పాటు చేయాలి. చట్టం అమలును ఈ బోర్డు పర్యవేక్షించాలి. రక్షణ గృహాలు: బాధితులకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వం నేరుగా లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా రక్షణ గృహాలు ఏర్పాటు చేయాలి. బాధితులకు నివాసం, ఆహారం, దుస్తులు, కౌన్సిలింగ్, ఆరోగ్య రక్షణ ఈ గృహాల్లో కల్పించాలి. ప్రత్యేక గృహాలు: దీర్ఘకాలంగా బాధితులకు పునరావాసం కల్పించడానికి జిల్లాకి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యేక గృహాలు వీరి కోసం ఏర్పాటు చేయాలి. రక్షణ, ప్రత్యేక గృహాలను చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలి. బాధితులకు ప్రత్యేంగా లైంగిక దాడులకు గురైన మహిళలకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకురావాలి. నేరం.. శిక్ష ► బాధితులకు ఆశ్రయంకల్పించే విషయంలో రక్షణ, ప్రత్యేక గృహాల ఇన్‌ఛార్జి నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడాదిపాటు జైలు, రూ.లక్ష తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. ► చట్టం ప్రకారం బాధితులు, సాక్షుల పేర్లు, ఫొటోలు ఏ మాధ్యమం ద్వారానైనా ప్రచురించిన ప్రసారం చేసినా చర్యలు తీసుకుంటారు. బాధ్యులకు ఆరు నెలల వరకూ జైలు లేదా రూ.లక్షల వరకు జరిమానా లేదా రెండింటిని విధిస్తారు. ► అక్రమ రవాణా చేయడానికి మాదకద్రవ్యాలు, మద్యం, సైకోట్రోపిక్ పదార్ధాలను నిందితులు వినియోగించినట్లు రుజువైతే పదేళ్లు వరకూ జైలు, రూ.లక్ష తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. రసాయనాలు, హర్మోన్ల ఇంజక్షన్లు నిందితులు ఉపయోగించినట్లు తేలితే పదేళ్ల వరకూ జైలు, రూ.లక్ష తక్కువకాకుండా జరిమానా విధిస్తారు. ► ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లైతే వారికి మూడు నెలల వరకూ జైలు, రూ.20 వేల వరకూ జరిమానా లేదారెండు విధించొచ్చు. ► నిందితులు బెయిల్ లేదా సొంత పూచీకత్తుపై విడుదల అవుతుంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని అడ్డుకోవచ్చు. ఈ సమయంలో బెయిలు ఇస్తే నిందితుడు ఎలాంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని కోర్టు నమ్మితే బెయిలు ఇవ్వొచ్చు. -
టిక్ టాక్ స్టార్‌కు జైలు శిక్ష.. కాపాడమంటూ వేడుకోలు
టిక్ టాక్ స్టార్ హనీన్ హోసం'కు ఈజిప్టు కోర్ట్ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మానవ అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష ఖరారు కావడంతో తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ శిక్ష నుంచి తనని కాపాడాలంటూ ప్రెసిడెంట్ అబ్ధుల్‌ను వేడుకుంది. ‘‘ప్రెసిడెంట్ సాబ్ మీ కూతురు ఏ పాపం చేసింది. చచ్చిపోతుంది. చచ్చిపోతున్న మీ కూతుర్ని మీరే కాపాడాలి. దయ చూపించండి. నేను జైలుకెళితే నా తల్లి గుండె ఆగి చచ్చిపోతుంది. నావైపు తప్పు లేదు కాబట్టే మాట్లాడుతున్నాను కేసును పునఃవిచారణ చేసి తనకు న్యాయం చేయాలని వీడియోలో కన్నీటి పర్యంతరమైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే హనీన్‌కు కోర్ట్ జైలు శిక్ష విధించడంతో ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రెసిడెంట్ అబ్ధుల్ తన కోరికను మన్నించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా,ఈజిప్ట్ దేశాల్లో సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు ఉంటాయి. దేశ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడవు. అందుకే హనీన్ హోసంను ఆ దేశ ప్రభుత్వం ఈ శిక్ష విధించిందనే వాదానలు వినిపిస్తున్నాయి. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ డేటా చైనా సర్వర్లలోకి! -
మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక యూనిట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ పోలీస్స్టేషన్ల తరహాలోనే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ)లకు పోలీస్‌స్టేషన్ హోదా కల్పించింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏహెచ్‌టీయూల ఏర్పాటుకు నిర్ణయించడం మరో విశేషం. అక్రమ రవాణాకు గురైన బాధితులను రక్షించేందుకు, అక్రమ రవాణాకు పాల్పడే ముఠాల ఆట కట్టించేందుకు హద్దులు, అడ్డంకులు లేకుండా ఎక్కడికైనా వెళ్లేలా ఏహెచ్‌టీయూ బృందాలకు అధికారం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఏహెచ్‌టీయూలు ఉండగా.. కొత్తగా చిత్తూరు, తూర్పుగోదావరి, వైఎస్సార్, కర్నూలు, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో పనిచేసే యూనిట్లను ఎస్పీలు, విజయవాడ, విశాఖలలో నగర పోలీస్ కమిషనర్లు నోడల్ ఆఫీసర్లుగా ఉండి పర్యవేక్షిస్తారు. అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక శిక్షణ ప్రతి యూనిట్‌కు ఒక సీఐ, ఇద్దరు చొప్పున ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. వీరికి మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ టీమ్‌లు స్థానిక దిశ పోలీస్‌స్టేషన్, సివిల్ పోలీసులను సమన్వయం చేసుకుని మానవ అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకుంటాయి. అంతేకాకుండా బాధితులకు పునరావాసం, సహాయం తదితర చర్యలు చేపట్టేందుకు మిగిలిన శాఖలను కూడా సమన్వయం చేసుకుంటారు. బాధితులకు తక్షణ న్యాయం దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో ఏహెచ్‌టీయూలు ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. వీటికి పోలీస్‌స్టేషన్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల కేసుల నమోదు, దర్యాప్తు వేగంగా జరిగి దోషులకు శిక్షలు పడతాయి. బాధితులకు తక్షణ న్యాయం, వారికి పునరావాసం, పరిహారం అందుతుంది. –ఎన్.రామ్మోహన్, హెల్ప్ సంస్థ -
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 10 ఏహెచ్‌టీయూ యూనిట్లు ఏర్పాటు చేస్తూ హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న వాటితో కలిపి 13 యూనిట్లకు ప్రత్యేక బృందాలు కేటాయించనున్నారు. ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా సీఐడీ అడిషనల్ డీజీని నియమించనుంది. చదవండి: రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం: సజ్జల ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు -
నకిలీ వీసాలతో మహిళలను కువైట్‌కు..
గచ్చిబౌలి: నకిలీ వీసా స్టాంపింగ్‌లతో మహిళలను కువైట్‌కు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఆర్జీఐఏ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో నకిలీ వీసా స్టాంపింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణానికి చెందిన రెల్లు కుబెందర్ రావు అలియాస్ చిన్న హమాలీగా పని చేసేవాడు. ఆ తర్వాత వెల్డింగ్ పని నేర్చుకున్న అతను 2007 నుంచి 2014 వరకు సింగపూర్, సౌతాఫ్రికాలో పని చేశాడు. 2016లో నర్సరావుపేటలో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించిన అతను కమీషన్‌పై చెన్నైకి చెందిన ఎన్బీఎస్ ట్రాÐð ల్స్‌లో ఎయిర్ టికెట్ బుకింగ్ చేసేవాడు. ఇందుకుగాను అతడికి చెన్నై, కుంభకోణం ప్రాంతానికి చెందిన షేక్ బషీర్ అహ్మద్ సహాయకుడిగా పని చేసేవాడు. తరచు శ్రీలంక వెళ్లే బషీర్ అక్కడ కుమార్ అనే వ్యక్తి నుంచి ఒరిజనల్ స్టాంపులు తెచ్చేవాడు. అనంతరం వాటి ఆధారంగా కుబెందర్‌రావు, బషీర్, కుంభకోణంకు చెందిన బాలు ప్రసాద్‌తో కలిసి శంషాబాద్‌లోని ఓ హోటల్లో నకిలీ వీసాలు తయారు చేసేవారు. నకిలీ వీసాలతో దుబాయ్‌కి.. ఈ నకిలీ స్టాంప్‌ల ఆధారంగా బాలుప్రసాద్ నకిలీ పీఓఇ, ఇసీఆర్, మెడికల్ సర్టిఫికెట్లు రూపొందించేవాడు. అనంతరం సబ్ ఏజెంట్ల ద్వారా తమను సంప్రదించిన మహిళలను విజిటింగ్ వీసాపై దుబాయ్, అక్కడి నుంచి కువైట్ పంపేవారు. కువైట్ చేరుకున్న వారికి లక్ష్మీ, శారద, శ్రీను, సారా అనే వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పించేవారు. ఇందుకు గాను ఒక్కో మహిళ నుంచి రూ. లక్ష వసూలు చేసేవారు. ఇందులో కువైట్‌లో ఉండే ఏజెంట్లకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఇచ్చేవారు. ఇదే తరహాలో 21 మందిని కువైట్ పంపినట్లు సీపీ తెలిపారు. వారు ఎక్కడ పనిచేస్తున్నారో త్వరలోనే వివరాలు సేకరిస్తామన్నారు. ఈ విషయమై ఇప్పటికే కువైట్ ఎంబసీకి సమాచారం అందించామన్నారు. ప్రధాన నిందితులు రెల్లు కుబెందర్‌రావు, షేక్ బషీర్ అహ్మద్‌తోపాటు సబ్ ఏజెంట్లుగా వ్యవహరించిన మోహన్‌రావు, అగస్టీ, రుత్తమ్మ, సునీత, వెంకటరామకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు బాలు ప్రసాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.2 లక్షల నగదు, ప్రింటర్, లాప్ ట్యాప్, 15 మీ సేవా పత్రాలు, 16 పాస్ పోర్ట్‌లు, 13 వీసా పేపర్లు, 25 ఒరిజినల్ స్టాంపులు, 6 స్టాంప్ ప్యాడ్స్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, శంషాబాద్ డీసీపీ సందీప్‌కుమార్, ఏసీపీ అశోక్‌కుమార్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్, ఎస్ఐలు రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కన్నప్రేమను గెలిచిన ధనాశ
ఒడిశా, జయపురం: ధనాశకు తలొగ్గిన తల్లిదండ్రులు సొంత కూతురినే అమ్మకానికి పెట్టారు. రూ.3 లక్షలకు కన్నపేగును తెంచుకునేందుకు సిద్ధపడ్డారు. నవరంగపూర్ జిల్లాలోని పపడహండి సమితి నివాసి అయిన ఓ యువతిని హర్యానా రాష్ట్రంలో విక్రయించినట్లు సమాచారం. ఈ విషయంపై స్వయంగా బాధితురాలే కన్నీరుమున్నీరై విలపిస్తే తప్ప విషయం బయటకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను హర్యానా నుంచి క్షేమంగా సొంత జిల్లాకు చేర్చి కాపాడారు. ప్రస్తుతం ఆమెను ఓ షార్ట్ హోమ్‌లో ఉంచారు. బాధిత యువతి విషాద గాథ ఆమె మాటల్లోనే.. ‘2019 సెప్టెంబర్ 18వ తేదీన హర్యానాకు చెందిన ఒక యువ ఇంజినీర్‌తో వివాహం చేస్తామని కుటుంబసభ్యులు నమ్మించారు. నేను హర్యానా వెళ్లనని తెగేసి చెప్పాను. హర్యానా వెళ్లకపోతే చంపేస్తామని తల్లిదండ్రులు బెదిరించారు. అదేరోజు రాత్రి 1 గంట సమయంలో బలవంతంగా ఓ ఆటోలో ఎక్కించి, నవరంగపూర్‌కు తీసుకువెళ్లారు. ఆ మరుసటి రోజు ఉదయం నవరంగపూర్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పాస్టర్ ఇంటికి తీసుకువెళ్లారు. అప్పటికే హర్యానా నుంచి వచ్చి ఉన్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, హర్యానా యువకుడు రాజేష్‌తో ఉత్తుత్తి వివాహం చేశారు. రెండు రోజులు పాస్టర్ అత్తగారింటిలో ఉంచి తరువాత 21 వ తేదీ సాయంత్రం నవరంగపూర్‌లోని పంచవటి వనానికి తీసుకువచ్చారు. అదే రోజు సాయంత్రం రాయగడ బస్సులో కూర్చుండబెట్టారు. అమ్మ, అక్క,బావ, తమ్ముడు, పాస్టర్ చిన్న తమ్ముడు, హర్యానా నుంచి వచ్చిన నలుగురు అదే బస్సులో కూర్చున్నారు. బస్సులో నోరు విప్పవద్దని ముందుగానే హెచ్చరించారు. రాయగడ నుంచి మొదట ఢిల్లీ తరువాత హర్యానా తీసుకువెళ్లారు. హర్యానాలో నా కుటుంబ సభ్యులు రెండు రోజులు ఉన్నారు. నేను ఎంత ఏడ్చినా నా గోడు వినిపించుకోకుండా అక్కడ విడిచిపెట్టి 25 వ తేదీన కుటుంబసభ్యులు నవరంగపూర్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి నాపై శారీరక, మానసిక దాడి ప్రారంభమైంది. ఆ వేధింపులను ఎదిరిస్తే నా కుటుంబానికి ఇచ్చిన మూడు లక్షల రూపాయిలు ఇచ్చి వెళ్లమని బెదిరించారు. డబ్బు ఇచ్చిన విషయం నాకు తెలియదని చెప్పినా లాభం లేకపోయింది. కన్నవారు నన్ను రూ.3 లక్షలకు అమ్మివేసినట్లు అప్పుడు అర్థమైంది. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లమని కన్నవారిని ఎంత అభ్యర్థించినా పట్టించుకోలేదు. అక్కడే ఉండు లేదంటే చావు అని జవాబిచ్చారు. మరో దారిలేక మా బంధువుకు ఫోన్లో నా బాధ చెప్పుకున్నాను. నా విషయం కటక్ మెడికల్ కళాశాలలో ఉన్న ఒక మహిళా రోగుల స్పెషలిస్టుకు నేను ఫోన్ చేసిన నా బంధువు ద్వారా తెలిసింది. ఆయన టెలిఫోన్లో నవరంగపూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ అజిత్ కుమార్ మిశ్రాకు ఫోన్లో వివరించారు. దీంతో నన్ను రక్షిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ వెంటనే పోలీసులకు తెలియ జేశారు. ఈ విషయాన్ని నవరంగపూర్ పోలీసులు వెంటనే హర్యానా పోలీసులకు తెలిపారు. హర్యానా పోలీసులు దర్యాప్తు చేసి ఎట్టకేలకు నా చిరునామా తెలుసుకుని నన్ను కనిపెట్టారు. నన్ను అక్కడి నుంచి రక్షించి నవరంగ పూర్ తీసుకు వచ్చార’ ని బాధిత యువతి కన్నీటి పర్యంతమైంది. నాకు న్యాయం చేయాలి బాధిత యువతని నవరంగపూర్ తీసుకు వచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో జడ్జి ముందు బాధిత యువతిని హాజరు పరచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తన జీవితంతో ఆటలాడిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని బాధిత యువతి డిమాండ్ చేస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పోలీసుల అదుపులోబంగ్లా దేశీయులు
విశాఖ రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం కలకలం రేగింది. ఆడ పిల్లల అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో రంగంలోకి దిగిన నగర పోలీసులు రైల్వే అధికారులను సంప్రదించి ట్రైన్ సమాచారాన్ని తెలుసుకున్నారు. స్టేషన్‌కు ఆ రైలు రాగానే పోలీసులు హుటాహుటిన ప్లాట్‌ఫారమ్‌పైకి చేరుకుని విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా బంగ్లాదేశ్‌కు చెందిన వారని నిర్థారించుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఒకే దేశానికి చెందిన వారని ప్రాథమికంగా తెలిసినా.. అందులో వాస్తవమెంత.? అసలు వీరంతా ఎవరు..? దేశంలో ఎందుకు అనధికారికంగా నివసిస్తున్నారు..? ఉగ్ర సంబంధాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. అకస్మాత్తుగా ప్లాట్‌ఫారమ్‌పై పోలీసులు ప్రత్యక్షమవ్వడం... రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం.. వారిలో చిన్నారులు, మహిళలు ఉండటంతో.. విశాఖ రైల్వే స్టేషన్లో ఒకింత ఉద్రిక్తతతో కూడిన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సాక్షి, విశాఖపట్నం : మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతం... ప్రశాంతంగా ఉన్న విశాఖ రైల్వే స్టేషన్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న 12864 నంబర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏడో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పైకి రాగానే పోలీసులు ప్లాట్‌ఫారమ్‌ను ఆక్రమించుకున్నారు. సివిల్ పోలీసులతోపాటు, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది చుట్టుముట్టారు. ట్రైన్ ఆగిన వెంటనే సోదాలు మొదలు పెట్టిన పోలీసులకు 16 మంది విదేశీయులు చిక్కారు. మొదట్లో వీరంతా ఉగ్రవాద ముఠాకు చెందిన వారుగా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఠాలో చిన్నారులు, మహిళలు కూడా ఉండటంతో మానవ అక్రమ రవాణా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. వారందరినీ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ఆర్పీఎఫ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఒక్కొక్కరి వద్ద నుంచి వివరాలు సేకరించారు. వీరంతా బంగ్లాదేశ్‌కు చెందిన వారని ముందుగా గుర్తించారు. వీరిలో మహిళలు, పిల్లలు సహా మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురికి మినహా.. మిగిలిన వారెవ్వరికీ బంగ్లాదేశ్ పౌరసత్వానికి సంబంధించిన గుర్తింపు పత్రాలుగానీ, పాస్‌పోర్టులు కానీ లేవు. దీంతో పాస్‌పోర్టు ఉన్న వారిని పూర్తిస్థాయి విచారణ చేపట్టి వివరాలు సేకరించి విడిచిపెట్టారు. మిగిలిన 9 మందిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు భార్య భర్తలమనీ, ముగ్గురు పిల్లలు వారిలో రెండు జంటలకు చెందిన వారని చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరెవ్వరికీ ఉగ్రమూకలతో సంబంధాలు లేవని నిర్థారించుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దినసరి కార్మికులా..? చొరబాటుదారులా..? పట్టుబడ్డ బంగ్లాదేశీయలు పోలీసుల విచారణలో పలు వివరాలు వెల్లడించారు. తామంతా బెంగళూరులో దినసరి కార్మికులుగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నామనీ.. మరో చోటికి వలస వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తున్నామని చెప్పినట్లు సమాచారం. అయితే వీరంతా ఎప్పుడు దేశంలోకి వచ్చారు...? ఇన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ నివసించారు...? ఆయా ప్రాంతాల్లో ఏం పనులు చేశారు..? మొదలైన విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరంతా నిజంగా బంగ్లా నుంచి పనులు కోసం వచ్చిన దినసరి కూలీలా..? లేదంటే అక్రమ చొరబాటుదారులా..? అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే అనధికారికంగా భారత్‌లో నివసిస్తున్న బంగ్లాదేశీయులు ఖాళీ చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే. 1971 తర్వాత బంగ్లాదేశ్ నుంచి అసోం తదితర ప్రాంతాల మీదుగా భారత్‌కు వచ్చిన అక్రమ చొరబాటుదారుల్ని గుర్తించి, తిరిగి పంపించి వెయ్యాలంటూ దేశ అత్యున్నత ధర్మాసనం కేంద్రాన్ని 2014లో ఆదేశించింది. అయినప్పటికీ ఇంకా చొరబాట్లు జరుగుతున్నాయన్న అనుమానాలకు తాజా సంఘటన మరింత బలాన్ని చేకూర్చింది. అయితే వీరు దేశంలోకి ఏ మార్గం గుండా ప్రవేశించారు..? ఎప్పుడు వచ్చారన్న విషయాలు విచారణలో తెలుసుకున్నాక పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అప్పగిస్తామని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న 9 మంది బంగ్లాదేశీయులను కంచరపాలెం పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
విశాఖ రైల్వే స్టేషన్లో కలకలం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ రైల్వే స్టేషన్లో మంగళవారం ఓ ఘటన కలకలం సృష్టించింది. హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ చెందిన ముఠా ప్లాట్‌ఫాం నెంబర్ 7 నుంచి హౌరా-యశ్వంత్‌పూర్ వెళ్తున్న రైల్లో ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ ముఠాను పట్టుకోడానికి సూమారు వంద మంది సివిల్, ఇంటిలిజెన్స్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు పురుషులు, ముగ్గురు స్త్రీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మానవ రవాణా కేసు ఎన్ఐఏకు బదిలీ
సాక్షి, హైదరాబాద్: ఒక దేశం నుంచి మరో దేశానికి మానవ అక్రమ రవాణా కేసును ఛత్రినాక పోలీసులు ఎన్ఐఏకు బదిలీ చేశారు. వివరాలు.. బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్‌లోకి అక్రమంగా తరలించిన యూసఫ్‌ఖాన్, బీతి బేగం, సోజీబ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు వివిధ దేశాల నుంచి యువతులను తీసుకువస్తూ హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో వ్యభిచారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నరని పోలీసులు తెలిపారు. అయితే ఏప్రిల్ 24న ఛత్రినాక పోలీసులు నగరంలోని వ్యభిచార కేంద్రాలపై రైడ్ చేసి.. యూసఫ్‌ఖాన్, బీతి బేగంలను అరెస్ట్ చేశారు. దీంతో ఈకేసును మరింత లోతుగా విచారించేందుకు ఎన్ఐఏకు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. -
ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టినప్పుడే: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రస్ఠాయి సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సహయం చేస్తామని చెప్పి మభ్యపెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని, బాధితులను రక్షించడంలో ఎన్జీఓలతో కలిసి ముందుకు వెళ్లాలని పోలీసులకు సూచించారు. మానవ అక్రమ రవాణా ఎలా చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు.. అనే అంశాన్ని పోలీసులు ముందుగానే గుర్తించి ఇలాంటివి జరగకుండా చూడాలని, అప్పుడే చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేసిన వారవుతామని డీజీపీ పేర్కొన్నారు. బాధితులను రక్షించడం, పునరావాసం కల్పించడం, ప్రాసిక్యూషన్ వంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని డీజీపీ సూచించారు. మానవ అక్రమ రవాణాలో బాధితులు ఖండాతరాలు దాటి వస్తున్నారని, నిందితులకు శిక్షపడేలా ప్రాసిక్యూషన్ జరగాలని అన్నారు. అక్రమ సంపాదన కోసమే వ్యభిచారానికి అలవాటు పడుతున్నారని, కాబట్టి అక్రమ సంపాదన, ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టినప్పుడే ఈ వ్యవస్థ ఆగుతోందని ఆయన తెలిపారు. ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, హ్యూమన్ ట్రాఫికింగ్‌పై సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టామని, నిందితులకు న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చూస్తున్నామని తెలిపారు. చిన్నారులను వెట్టి చాకరీ చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటూ, ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరుతో చాలా మంది చిన్నారులను రక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజ్వల ఫౌండేషన్ స్థాపకులు సునీత కృష్ణన్ మాట్లాడుతూ.. ముంబైలో అక్రమ రవాణా నుంచి 112 మంది అమ్మాయిలని రక్షిస్తే అందులో ఆరుగురు తెలుగు అమ్మాయిలు ఉన్నారని పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం ఈ స్వచ్ఛంద సంస్థను నగరంలో ప్రారంభించారని, దేశంలో ఎక్కడ అత్యాచార ఘటనలు జరిగినా భయమేసేదని అన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మానవ అక్రమ రవాణాను తగ్గిందని తెలిపారు. కొన్ని రోజుల క్రితం 16 ఏళ్ల బాలిక ఫేస్బుక్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు ట్రాఫికింగ్ అయిందని, ప్రస్తుతం టెక్నాలజీతో ట్రఫికింగ్ జరుగుతుందన్నారు. తెలంగాణలో జీరో ట్రాఫికింగ్ దిశగా మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పోలీసు ఉన్నతాధికారులు హాజరైయ్యారు. -
స్వేదపు పూసలు
బాల్యానికి రెక్కలుంటాయి. ఛీ..! రెక్కల కష్టం మిగిలింది. భవిష్యత్తు బంగారంలా ఉండాలి.బంగారం లాంటి పిల్లల భవిష్యత్తు ఏమవుతోంది? గిల్టుగా మారుతోంది.అవును... మన ఒంటి మీద తళతళలాడే ఈ గిల్టు ఆభరణాలు ఆ పిల్లల బాల్యానికి భరణాలే. మన మెడలో హారాలను... పిల్లలు తమ స్వేదంతో కడుతున్నారు. ‘‘బంగారం, ప్లాటినం, వెండి వంటి విలువైన లోహాలతో తయారయ్యే ఆభరణాలకు బదులు, అనుకరణ నగలే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. అయితే ఇండియన్ ఇమిటేషన్ ఆర్నమెంట్స్ మార్కెట్లో పాతిక శాతాన్ని చైనా ఆక్రమించేసింది. ఏడాదికి వెయ్యికోట్ల విలువైన ఆభరణాలు చైనా నుంచి ఇండియాకి దిగుమతి అవుతున్నాయి. మన ఇమిటేషన్ ఆభరణాలతో పోలిస్తే చైనా ఆభరణాల ధర తక్కువ. చైనాలో తయారవుతున్న ఇమిటేషన్ నగలన్నీ మెషీన్ మేడ్ ఆర్నమెంట్సే. మన దగ్గర అలా కాదు. చేత్తో తయారయ్యేవే ఎక్కువ. బంగారు, ప్లాటినం ఆభరణాలను పోలిన ఇమిటేషన్ నగలను తయారు చేసే నిపుణులు మన దగ్గరున్నారు. ఇమిటేషన్ నగల తయారీ దారులు ఇండియాలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే గుజరాత్లో ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ కూలితో పని చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీ రాజ్‌కోట్‌లో విస్తరించడానికి అదీ ఒక కారణం. మన దగ్గర వంద రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల విలువ చేసే ఇమిటేషన్ నగలు తయారవుతున్నాయి. ప్రపంచంలో ఈ నగల తయారీలో చైనా తరవాతి స్థానం ఇండియాదే. మన నగలకు జర్మనీ, అమెరికా, పాకిస్తాన్, మధ్య ఆసియా దేశాలు, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాలతోపాటు అనేక దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మన జువెలరీ తయారీ సంస్థలన్నీ వ్యవస్థీకృతం కావాలి’’ ... ఇది రాజ్‌కోట్ ఇమిటేషన్ జ్యువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ వికారియా 2013లో అన్నమాట. వినడానికి బాగున్న మాట కూడ. మరి... ఇమిటేషన్ నగల తయారీలో ఛిద్రమవుతున్న బాల్యం మాటేమిటి? ఇలా బయటపడింది గుజరాత్, రాజ్‌కోట్‌లోని ఒక కృత్రిమ ఆభరణాల తయారీ యూనిట్లో పని చేస్తున్న పిల్లలను పోలీసులు రక్షించారు. ఆ పిల్లలకు ఏ నలుగురో, ఐదుగురో కాదు... ఏకంగా డెబ్బై మంది పిల్లలు. అదీ ఒక్క కార్ఖానాలోనే. ఇక మిగిలిన వర్క్ యూనిట్ల సంగతేమిటి? ఏడు వందల కార్ఖానాలున్న రాజ్‌కోట్‌లో ఎంత మంది పిల్లల బాల్యం అందమైన రంగు రాళ్ల నీడలో మసకబారుతుండవచ్చు? ఆ సంఖ్య వందలు కాదు వేలల్లో ఉండవచ్చనే అనుమానిస్తున్నారు పోలీసులు. గత ఏడాదిలో ఒక కార్ఖానా నుంచి ఇద్దరు పిల్లలు యజమాని కళ్లు కప్పి పారిపోయారు. వాళ్ల కోసం సాగిన దర్యాప్తులో తీగ లాగితే డొంక కదిలినట్లు పిల్లలు బిలబిల మంటూ బయటికొచ్చారు. చట్టానికి దొరకని ట్రాఫికింగ్ ఇమిటేషన్ నగల తయారీలో పరిశ్రమల్లో పని చేస్తున్న పిల్లలంతా వెస్ట్ బెంగాల్ నుంచి పని కోసం గుజరాత్‌కి వచ్చిన వాళ్లే. ఇది చాలా పెద్ద నెట్వర్క్. కార్ఖానాల యజమానులకు నేరుగా ఎటువంటి సంబంధం ఉండదు. పిల్లలను సరఫరా చేసే ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్లు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి బేరం కుదుర్చుకుంటారు. నెలకు ఆరువేల జీతం ఇప్పిస్తామని చెప్పి పిల్లలను తీసుకొస్తున్నారు. ఇది చట్టం పరిధిలో ఏ సెక్షన్‌కూ దొరకని పిల్లల అక్రమరవాణా. తల్లిదండ్రుల సమ్మతితోనే జరుగుతుంది కాబట్టి, ఏజెంట్ల మీద ఎవరూ కేసు పెట్టరు. ఊపిరిసలపని పని పరిస్థితుల్లో పిల్లలు తమకు తామే బంధనాలను చేధించుకుని బయటకు రావడంతో ఈ దురాగతం అయినా బయటికొచ్చింది. పగలు – రాత్రి పని బ్రేస్లెట్లు, గాజులు, చెవి కమ్మలు, హారాలు, లాకెట్ల వంటి ఆభరణాలలో రాళ్లు పొదగడం వంటి సునిశితమైన పనుల్లో శిక్షణనిస్తారు. ఈ కార్ఖానాల్లో పగలు – రాత్రి పని జరుగుతుంటుంది. షిఫ్ట్‌ల వారీగా పిల్లల చేత పని చేయిస్తుంటారు. ఇక విశ్రాంతి సమయంలో ఒక పది– పన్నెండు మంది పిల్లలు నిద్రపోవాలి. ఇంత కష్టపడినా సరే... ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం వేతనం ఇవ్వరు, సగం ఇచ్చి సరిపెడతారు. ఇంత పెద్ద ఘోరం చాపకింద నీరులా జరిగిపోతోంది. ఇంత పెద్ద స్కామ్ బయటపడిన తర్వాత కూడా రాజ్‌కోట్ ఇమిటేషన్ నగల వ్యాపారుల సంఘం ప్రతినిధులు మాత్రం... ‘‘మా పరిశ్రమల్లో బాల కార్మికులు లేరు. మేము ఇళ్ల దగ్గర ఉండే ఆడవాళ్లకు మెటీరియల్ ఇచ్చి, వాళ్లు తయారు చేసిన ఆర్నమెంట్కి పీస్ లెక్కన వేతనం ఇస్తాం. ఇది అతి పెద్ద పరిశ్రమ. రాజ్‌కోట్‌లో ఏడాదికి ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇందులో ఎవరైనా చిన్న పిల్లల చేత పనులు చేయిస్తుంటే అది పూర్తిగా తప్పే, అలాంటి వాళ్లను తప్పకుండా శిక్షించాల్సిందే’’ అని చేతులు దులుపుకున్నారు. ఇదంతా చట్టమే స్వయంగా చూసుకోవాలి... అన్నట్లు ముక్తాయించి ఊరుకున్నారు. అందరి భాగస్వామ్యం ఉంది పిల్లలు కార్మికులుగా మారుతున్నారంటే ఆ నేరం అందరిదీ. మొదటి దోషి ప్రభుత్వం, ఆ తర్వాత సమాజం. తల్లిదండ్రులు, పని ఇచ్చిన యజమాని వరకు అందరూ దోషులే. ఒక గ్రామంలో జనాభా రికార్డులో నమోదై ఉన్న పిల్లలందరూ ఆ ఊరి స్కూళ్లలో కానీ మరేదైనా స్కూళ్లలో కానీ నమోదై ఉన్నారా లేదా అని పర్యవేక్షించాల్సింది ప్రభుత్వమే. స్కూళ్లలో నమోదు కాకపోయినా, నమోదై వరుసగా నెలల పాటు ఆబ్సెంట్ అవుతున్నా ఆ స్కూల్ టీచర్లు, అధికారులు కారణాల కోసం అన్వేషించాలి. తల్లిదండ్రులతో మాట్లాడి సమాచారం తెలుసుకోవాలి. పిల్లలను పనుల్లో పెట్టడం నేరమని తల్లిదండ్రులను హెచ్చరించాలి. పిల్లలు తప్పకుండా బడికి వచ్చేటట్లు చూడాలి. పోషణ జరగని కుటుంబాలకు పనికి ఆహార పథకంలో పని కల్పించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, పిల్లల కోసం ఇన్ని పథకాలున్నా సరే... పిల్లలు బడిలో ఉండాల్సిన వయసులో పనిలో ఉన్నారంటే సమాజం బాధ్యత కూడా ఉందని చెప్పక తప్పదు. సమాజంలో అందరమూ... ఒక హోటల్, మరేదైనా దుకాణంలో పిల్లలు పని చేస్తున్నట్లు గమనిస్తే ఆ హోటల్‌కి, దుకాణానికి వెళ్లడం మానేయాలి. బాల కార్మికుల సర్వీసులను, ఉత్పత్తులను స్వీకరించడానికి ఎవరికి వారు స్వచ్ఛందంగా వ్యతిరేకించాలి. ఈ బహిష్కరించడం అనేది విదేశీ వస్తు బహిష్కరణలాగ ఒక ఉద్యమంలా జరగాలి. అప్పుడే పసితనానికి బాల్యం మిగులుతుంది.– ప్రొఫెసర్ శాంతా సిన్హా, సామాజిక కార్యకర్త,మాజీ చైర్ పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బడి చట్టం ఏమైంది? ‘‘పువ్వుల్లా విచ్చుకోవాల్సిన బాల్యం ఆడంబరాల వెలుగు జిలుగులకు బలవుతోంది. బడిలో ఉండాల్సిన వయసులో పిల్లలు గాలి, వెలుతురు, కనీస సౌకర్యాలు లేని పరిశ్రమల్లో మగ్గిపోతున్నారు. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏమైంది, ఆ చట్టాన్ని అమలు చేస్తే అక్షరాలు దిద్దాల్సిన చేతులు పూసలు అద్దవు కదా. ఈ నేరంలో ప్రత్యక్ష దోషులు కంపెనీ నిర్వహకులు, ఏజెంట్లు అయితే... మూల దోషి ప్రభుత్వమేనన్నారు పిల్లల హక్కుల కార్యకర్త శాంతాసిన్హా. మనకు చట్టాలున్నాయి, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలున్నాయి, ప్రభుత్వాలు విఫలమైనప్పుడు హెచ్చరించి బాధ్యత గుర్తు చేయడానికి న్యాయస్థానాలూ ఉన్నాయి. ఈ మూడు వ్యవస్థలకు సమస్యను ఎలుగెత్తి చాటే పత్రికలూ ఉన్నాయి, హక్కుల పరిరక్షణ కోసం పని చేసే కార్యకర్తలూ ఉన్నారు. అయినా బిగించిన పిడికిలి నుంచి జారి పోయే ఇసుకలాగ చట్టాలు నిర్వీర్యమైపోతుంటాయి. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ ఆడపిల్లల కోసం ప్రభుత్వం ఒకవైపు స్పెషల్ డ్రైవ్ చేస్తోంది. మగపిల్లల బాల్యం కూడా భద్రంగా ఏమీ లేదనడానికి రాజ్‌కోట్ పెద్ద ఉదాహరణ.– వాకా మంజులారెడ్డి -
మహిళా కమిషన్ చెంతకు యువతులు
రాజమహేంద్రవరం రూరల్: అక్రమ రవాణా అనుమానంతో ముంబాయి వెళుతున్న రైలు నుంచి దించేసిన యువతులను ఒడిశా మహిళా కమిషన్ చెంతకు పంపించారు. ఈమేరకు సోమవారం సాయంత్రం బొమ్మూరులోని మహిళాప్రాంగణంలోని స్వధారహోమ్ నుంచి 17మంది యువతులను ప్రత్యేక పోలీసుఎస్కార్ట్ వాహనంలో ఐసీడీఎస్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో పంపించారు. ఒడిశా రాష్ట్రంలో బరంపూర్‌జిల్లాకు చెందిన ముగ్గురు, గంజాజిల్లాకు చెందిన ఏడుగురు, కాండుజొరోజిల్లాకు చెందిన ఆరుగురు, బలుగర్‌జిల్లాకు చెందిన ఒక యువతి మొత్తం 17మంది యువతులు ఈనెల 27న కోణార్క్ఎక్స్ప్రెస్లో ఒడిశా నుంచి ముంబయి రైల్లో వెళుతున్నారు. చైల్డ్‌లైన్ ఫోన్ నంబర్‌కు ఒక ప్రయాణికురాలు ఫోన్ చేయడంతో సామర్లకోట రైల్వేస్టేషన్లో చైల్డ్‌లైన్‌స్టాఫ్ దించే ప్రయత్నం చేశారు. అక్కడ దిగకపోవడంతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో ఆ యువతులను జీఆర్పీ పోలీసుల సహాయంతో రైలు నుంచి దించేసి టుటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ చైల్డ్‌లైన్ ప్రతినిధులు విచారణలో చేపలసీడ్ శుభ్రం చేసే పనికి వెళుతున్నట్టు తేలింది. దీంతో ఆయువతులను బొమ్మూరులోని స్వధార్‌హోమ్‌కు తరలించారు. ఆదివారం రాష్ట్రమహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, సభ్యురాలు డాక్టర్ శిరిగినీడిరాజ్యలక్ష్మి సందర్శించి ఆ యువతులను సురక్షితంగా ఒడిశా పంపించేందుకు పోలీసు, ఐసీడీఎస్ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. సోమవారం రాష్ట్రమహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి , చైరపర్సన్ నన్నపనేని రాజ్యకుమారి ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులతో కలిసి ఒడిశా మహిళాకమిషన్‌తో చర్చించారు. అయితే ముందు ఒడిశా మహిళాకమిషన్ సభ్యులు తామే వచ్చి ఆ యువతులను తీసుకుని వెళతామని చెప్పారు. అయితే వారు వచ్చేందుకు సమయం పడుతుంది కావున, ఇక్కడి నుంచే యువతులను తీసుకుని వచ్చి అప్పగిస్తామని చెప్పారు. దీంతో అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషిబాజ్‌పాయ్ ఆ యువతులను తరలించేందుకు పోలీస్ ఎస్కార్ట్ వాహనం సమకూర్చి నలుగురుసిబ్బందిని ఏర్పాటు చేవారు. ఐ సీడీఎస్ ప్రాజెక్టు అధికారి సుఖజీవన్‌బాబు ఆదేశాల మేరకు ఏపీడీ మణెమ్మ ఒక్కొక్క యువతికి భోజనాలు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.500 అందజేశారు. ఆ యువతుల వెంట జిల్లా చైల్డ్ ప్రోగ్రాం ఆఫీసర్ వెంకట్రావు, సఖిమహిళాసభ్యులు, చైల్డ్‌లైన్ సిబ్బంది వెళ్లారు. ఈసందర్భంగా రాష్ట్ర మహిళాకమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఆయువతులను సురక్షితంగా ఒడిశా మహిళాకమిషన్‌కు అప్పగిస్తారని, అనంతరం అక్కడి నుంచి వారు ఆ యువతులను స్వస్థలాలకు పంపిస్తారని తెలిపారు. మహిళాప్రాంగణం మేనేజర్ పి.వెంకటలక్ష్మి, చైల్డ్‌లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆ యువతులను సురక్షితంగా పంపిస్తాం
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం రూరల్: అక్రమ రవాణా అనుమానంతో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి రాజమహేంద్రవరం స్టేషన్లో దించేసిన యువతులను ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి సురక్షితంగా వారి స్వస్థలాలకు పంపిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. ఆమె ఆదివారం మధ్యాహ్నం ఆ యువతులు ఆశ్రయం పొందిన బొమ్మూరు మహిళా ప్రాంగణం ఆవరణలోని స్వధారహోమ్ను సందర్శించారు. ఆ 17మంది యువతులు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతున్నారు? పనికి వెళుతున్నారా? అనే విషయాలను ట్రాన్స్‌లేటర్, రైల్వే ఉద్యోగి లాజర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు, గంజాం జిల్లాకు చెందిన ఏడుగురు, కాండుజొరో జిల్లాకు చెందిన ఆరుగురు, బలుగర్ జిల్లాకు చెందిన ఒక యువతి ఉన్నట్టు గుర్తించారు. ఒడిశా నుంచి వారు ముంబాయి రైల్లో వెళుతుండగా చైల్డ్‌లైన్ ఫోన్ నెంబరుకు ఒక ప్రయాణికురాలు ఫోన్ చేయడంతో సామర్లకోట రైల్వేస్టేషన్లో చైల్డ్‌లైన్ స్టాఫ్ సాయిలక్ష్మి, లక్ష్మి వారిని దించే ప్రయత్నం చేశారు. అయితే ఆ యువతులు అక్కడ దిగకపోవడంతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో వారిని జీఆర్పీ పోలీసుల సహాయంతో రైలు నుంచి దించేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ చైల్డ్‌లైన్ ప్రతినిధుల విచారణలో చేపలసీడ్ శుభ్రం చేసే పనికి వారు వెళుతున్నట్లు తేలింది. దాంతో ఆయువతులను బొమ్మూరులోని స్వధార్ హోమ్‌కు తరలించారు. వారిలో ఒక యువతి సోదరుడికి కాలువిరగడంతో ఆస్పత్రికి వెళుతుండగా, ఇంకో యువతి తల్లిదండ్రుల వద్దకు వెళుతోందని తేలింది. యువతులను విచారణ జరిపిన అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజకుమారి అర్బన్‌జిల్లా ఎస్పీ షీమోషిబాజ్పేయ్, ఇతర పోలీసుఅధికారులతో ఫోన్లో మాట్లాడి ఆ యువతులు సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరేవరకు పూర్తిరక్షణ కల్పించాల్సిందిగా కోరారు. అనంతరం రాజకుమారి విలేకరులతో మాట్లాడుతూ యువతులు ఏరాష్ట్రానికి చెందినవారైనా వారి మానప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వారిపై అనుమానాలు ఉన్నప్పటికీ సురక్షితంగా వారు ఇళ్లకు చేరేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌తో మాట్లాడిస్తామని తెలిపారు. ఆయువతులు ముంబాయిలోని పనికి వెళుతున్నామని చెబుతున్నారని, వారి వద్ద కనీసం రూపాయి కూడా లేదన్నారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయువతులను అప్పగిస్తామన్నారు. అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుఖజీవన్‌బాబు, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావులతో అర్బన్‌జిల్లా మహిళాపోలీస్స్టేషన్ డీఎస్పీ పి.మురళీధరన్, టూ టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై వి.వెంకటేశ్వరరావు, ధవళేశ్వరం ఎస్సై వెంకయ్య, పీఎస్సై అమీనాబేగం మాట్లాడారు. రాష్ట్ర మహిళా కమిషన్ ద్వారా ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖ రాసి ఆయువతులను పోలీస్ఎస్కార్ట్తో వారి స్వస్థలాలకు తరలించేలా చర్చించారు. ఆ యువతులను సోమవారం ఒడిశాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ రాజానగరం సీడీపీవో పి.సుశీలకుమారి, మహిళాప్రాంగణం మేనేజర్ పి.వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇస్త్రీ చేసేయ్.. వీసా మార్చేయ్!
ఉద్యోగ వీసాను కంప్యూటర్లో ఫొటోషాప్ ద్వారా సందర్శక వీసాగా మార్చి ఇమిగ్రేషన్ అధికారులను బోల్తా కొట్టించి కువైట్‌కు పలువురిని అక్రమంగా తరలిస్తున్న 15 మంది ఏజెంట్లు, వారికి సహకరించిన ఇద్దరు ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ఒక పోలీసు కానిస్టేబుల్‌ను సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏజెంట్లు ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయం ద్వారా లైసెన్స్ ఏజెంట్ స్టాంపింగ్ చేసిన పాస్‌పోర్టు తమను ఆశ్రయించిన వారి చేతికి అందిన వెంటనే .. వేడిచేసిన ఇస్త్రీపెట్టెను వినియోగించి పాస్‌పోర్టుకు అంటించి అది చిరగకుండా వీసా స్టిక్కర్‌ను తొలగించి ..ఇంక్ రిమూవర్‌తో మిగిలిన స్టాంప్‌ను తుడిచేసి ఈ అక్రమ రవాణా సాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు.ఎంప్లాయిమెంట్ వీసా మీద వెళ్లాలంటే ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ నిబంధనల ప్రకారం కువైట్‌లో ఉద్యోగం ఇచ్చే యజమాని ప్రవాసీ భారతి బీమా యోజన కింద రూ.1,50,000 వరకు ఉద్యోగిపై ఇన్సూరెన్స్ కట్టినట్లు రుజువు చూపాలి.ఉద్యోగ ఒప్పంద పత్రం తనిఖీ చేస్తారు. వీటినుంచి తప్పించుకునేందుకు ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’మార్గాన్ని ఎంచుకున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ బుధవారం మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి 250 పాస్‌పోర్టులు, నకిలీ వీసాలు, రబ్బర్ స్టాంప్‌లు, 160 పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లతో పాటు రూ.ఐదు లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్క మార్చి నెలలోనే నకిలీ వీసాలపై ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్లో పది కేసులు నమోదైనట్లు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్ గుర్తించినట్లు తెలిపారు. జనవరి నుంచి 14 కేసులు నమోదైతే 71 మందిని అరెస్టు చేశామన్నారు. – సాక్షి, హైదరాబాద్ మెడికల్ ఫిట్ ఉంటే హైదరాబాద్ నుంచే... హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ విజయనగర్ కాలనీలో ఉంటున్న నెల్లూరు జిల్లా కలువాయిమండలం వెంకటరెడ్డి పాలెం గ్రామానికి చెందిన తోట కంఠేశ్వర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ముఠా కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకొని కువైట్‌లో ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు. వీరికి విదేశాలకు పంపించే అనుమతి లేకపోవటంతో ముంబై, బెంగళూరు, శ్రీలంకలోని లీగల్ ఏజెంట్లను కలసి ఎంప్లాయిమెంట్ వీసాలు తెప్పిస్తున్నారు. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం మీ సేవలో రూ.135లు ఫీజు చెల్లించి చేవెళ్ల చిరునామాలు ఇస్తుండటంతో అక్కడి పోలీసు కానిస్టేబుల్ జి.మధు రూ.2,500లు తీసుకొని క్లియరెన్స్ ఇచ్చేవాడు.ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ నిబంధనల ప్రకారం ఎస్ఎస్సీ చదువుకోని వారు ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) క్లియరెన్స్‌ను తప్పించుకునేందుకు ఎంప్లాయిమెంట్ వీసా స్థానంలో నకిలీ విజిట్ వీసాను కంప్యూటర్లో ఫొటోషాప్ ద్వారా మారుస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయాల ద్వారా లైసెన్స్ ఏజెంట్ స్టాంపింగ్ చేసిన పాస్‌పోర్టు తీసుకొని ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’వినియోగించి నకిలీ విజిట్ వీసాను సిద్ధం చేసేవారు. నెలరోజుల విజిట్ వీసాతో పాటు నకిలీ తిరుగు ప్రయాణ టికెట్లను గల్ఫ్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి మహమ్మద్ ముజీబ్ ఖాన్, ఒమన్ ఎయిర్ ఉద్యోగి అనప్ప రెడ్డి రామలింగారెడ్డి సమకూర్చి సహకరిస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు చెందిన పలువురిని కువైట్‌కు పంపించినట్టు తేలింది. ఈ ముఠా సభ్యులైన తోట కంఠేశ్వర్, సురేందర్, నర్సింహ, అనిల్ కుమార్, యుగంధర్, వినయ్ కుమార్, వెంకటసుబ్బారాయుడులను పోలీసులు అరెస్టు చేశారు.చేవెళ్ల పోలీసు కానిస్టేబుల్ మధును కూడా అరెస్టు చేశారు. ఇతర పోలీసుల పాత్రపైనా ఆరా తీస్తున్నామని సీపీ సజ్జనార్‌తెలిపారు. మెడికల్ అన్‌ఫిట్ అయితే శ్రీలంక నుంచి... హైదరాబాద్‌లోని ఆరు ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించే ఈ ముఠా ఫిట్ ఉంటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆశ్రితులను కువైట్‌కు పంపించేవారు.ఎవరైనా అన్‌ఫిట్ అని తేలితే ట్రాన్సిట్ పాస్‌పోర్టుపై ఏడు రోజుల వీసాతో శ్రీలంకకు పంపించే బాధ్యతను 8 మంది సభ్యులతో కూడిన పుష్ప అనే ఆమె నేతృత్వంలోని మరో ముఠా చూసుకునేది. ఈ ముఠాలో ఉన్న ఏపీకి చెందిన గెడ్డం శశి, చింతల సాయిరామ్‌కుమార్, షేక్ అక్రమ్, పిల్లి శ్రీకర్, అకరం బాలకృష్ణ, షేక్ ఖాదర్ బాషా, పూసపాటి రామకృష్ణ, విజయభాస్కర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు పట్టుబడ్డ నిందితులు ఇలా చేస్తే మేలు... విదేశాల్లో పనిచేసేందుకు వెళ్లేందుకు రిజిస్టర్డ్ ఏజెంట్ల కోసం ఇమిగ్రేట్.జీవోవీ.ఇన్‌లో తెలుసుకోవాలి. నాంపల్లిలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీసులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో వివరాలు నమోదుచేసుకుంటే విదేశాలలో మెడికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.అక్కడ పనిచేసే ప్రాంతంలో వేధింపులకు గురికాకుండా అక్కడి భారత ప్రభుత్వ రాయబార కార్యాలయం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎవరైనా ఏజెంట్లు మాయమాటలు చెప్పి పాస్‌పోర్టులు, డబ్బులు తీసుకుంటే వాటిని వెనక్కి తీసుకోవాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. -
మూలాలు తాకని ‘తరలింపు బిల్లు’
ప్రజల్ని ఇబ్బందులు పెట్టే చట్టాలు, నిబంధనలు అర్ధరాత్రుళ్లు చడీచప్పుడూ లేకుండా విరుచుకు పడేచోట... వారికి మేళ్లు కలిగించే చర్యల అమలుకు ఏళ్లూ పూళ్లూ పడుతోంది. వ్యక్తుల అక్రమ తర లింపు (నిరోధం, పరిరక్షణ, పునరావాసం) బిల్లు అందుకొక ఉదాహరణ. అందుకు ఒక సమగ్ర చట్టం అవసరమని ఏళ్ల తరబడి ఎందరో అడుగుతున్నా అది నెరవేరలేదు. మొన్న జూలైలో లోక్‌సభ ఆమోదం పొంది, ఈ పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభ ముందుకు రాబోతున్న తాజా ముసా యిదా బిల్లు సైతం ఆ విషయంలో అరకొరగానే ఉంది. కావల్సింది కొత్త చట్టం కాదని, సమగ్రమైన చట్టమని నిపుణులు చెబుతున్నా వారి మాట వినేవారు లేరు. వ్యక్తుల అక్రమ తరలింపు నిరోధానికి మన దేశంలో ఇప్పటికే వేర్వేరు చట్టాలున్నాయి. సెక్స్‌వర్కర్లు, వెట్టి కార్మికులు, కాంట్రాక్టు కార్మి కులు, అంతర్రాష్ట్ర వలస కార్మికులు, బాల కార్మికులు, బాలల లైంగిక దోపిడీ వగైరా అంశాల్లో చర్యలు తీసుకోవడానికి ఈ చట్టాలు పనిచేస్తున్నాయి. ఇవిగాక భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 370ని 2013లో సవరించి వెట్టిచాకిరీకి, అవయవాల మార్పిడికి, వ్యభిచార వృత్తి చేయించ డానికి బాలలతోసహా ఎవరినైనా తరలించడం నేరంగా పరిగణించారు. ఇలా వేర్వేరు అంశాలకు వేర్వేరు చట్టాలుండటాన్ని నేరగాళ్లు న్యాయస్థానాల్లో తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సులభంగా తప్పించుకుంటున్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణులు, సంస్థలు చట్టాల్లో పునరుక్తులు, కొన్నిటి విషయంలో కొత్త నిర్వచనాలు ఉన్నాయని...ఆచరణలో ఇవి సమస్యగా మారుతున్నాయని తెలిపారు. అక్రమ తర లింపు సంబంధమైన భిన్న నేరాలను ఒకేచోట చేర్చి సమగ్రమైన చట్టం రూపొందేలా చర్యలు తీసు కోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు మొన్న ఫిబ్ర వరిలో కేంద్ర కేబినెట్ వ్యక్తుల అక్రమ తరలింపుపై ముసాయిదా బిల్లును ఆమోదించడానికి ముందు కూడా ఈ సంగతిని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. మూడేళ్లక్రితం ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సైతం ఇలాంటి సూచనే చేసింది. చట్టాల్లోని లోటుపాట్లను నిందితులు ఉపయోగించు కుంటున్నారని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖను హెచ్చరించింది. అయినా పాత చట్టాలను అలాగే ఉంచి తాజా ముసాయిదా బిల్లు తీసుకొచ్చారు. లోక్‌సభలో దీన్ని ఆమోదించినప్పుడే ఐక్య రాజ్యసమితి నిపుణులు పెదవి విరిచారు. దీనికి మానవహక్కుల ప్రాతిపదికగానీ, బాధితులకు ఆస రాగా నిలిచే తీరుగానీ లేవని వ్యాఖ్యానించారు. మనుషుల అక్రమ తరలింపు అంశంలో మన దేశం అఫ్ఘానిస్తాన్, కాంగో, పాకిస్తాన్, సోమా లియా వంటి దేశాలను కూడా తలదన్నింది. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో వెల్లడించిన గణాంకాల ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా 8,137 అక్రమ తరలింపు కేసులు బయటపడ్డాయి. ఇందులో మహిళలనూ, మైనర్ బాలికలను వ్యభిచార కూపాల్లోకి దించిన ఉదంతాలకు సంబంధించిన కేసులు 7,670. బాలల్ని బూతుచిత్రాల కోసం తరలించిన కేసులు 162. అక్రమ తరలింపు నుంచి విముక్తు లైనవారు 23,000మంది ఉన్నారంటే ఏ స్థాయిలో మాఫియా పనిచేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఈ తరలింపు బాధితులు కేవలం ఇక్కడి పౌరులు మాత్రమే కాదు. మయన్మార్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ వంటి దేశాలనుంచి కూడా తీసుకొస్తున్నారు. వారిని వ్యభిచార కూపాలకు, వెట్టిచాకిరీ చేయించే పరి శ్రమలకూ విక్రయిస్తున్నారు. కొన్ని గణాంకాల ప్రకారం సగటున రోజూ కనీసం 15మంది ఈ సాలె గూటిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వాస్తవంగా చోటుచేసుకునే ఉదంతాలతో పోలిస్తే బయటి కొస్తున్నవి చాలా తక్కువని ఈ దురాచారానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారి అభిప్రాయం. ఈ ఉదం తాల విషయంలో కేసు నమోదు, దర్యాప్తు, విచారణ, శిక్షలు వంటివి చాలా తక్కువని చెప్పాలి. మనుషుల అక్రమ తరలింపు విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయ మైనవే అయినా... అవి ఏ మూలకూ రావని ఆర్నెల్లక్రితం అమెరికా విదేశాంగ శాఖ అభిప్రాయప డింది. ప్రభుత్వ సిబ్బంది సహాయసహకారాలు లేకుండా ఈ దుర్మార్గం ఇంత యధేచ్ఛగా కొనసా గదని తెలిపింది. అక్రమ తరలింపులో చిక్కుకుంటున్నవారిలో అత్యధికులు దళితులు, ఆదివాసీలు, మైనారిటీలేనని వివరించింది. అయితే పాత చట్టాలతో పోలిస్తే కొన్ని అంశాల్లో తాజా ముసాయిదా బిల్లు నిస్సందేహంగా మెరుగైందే. ముఖ్యంగా తమను అక్రమంగా తరలిస్తున్నారని బాధితులు నిరూపిస్తేనే గతంలో నిందితుల నేరం రుజువయ్యేది. కానీ తాజా బిల్లు ప్రకారం ఇకపై నిందితులే తాము ఎలాంటి నేరా నికీ పాల్పడలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే బాధితుల రక్షణ, పునరావాసం విష యంలో పాత వైఖరే కొనసాగుతోంది. వారిని నేరం చేసినవారిగా పరిగణించి ఏదో ఒక చోట నిర్బం ధించడం వల్ల వారి మానసిక స్థితి మరింత అధ్వాన్నమవుతుంది. అలాగే ఇష్టపూర్వకంగా వ్యభిచార వృత్తిలో కొనసాగడానికి వచ్చినవారినీ, బాధితులుగా మారినవారినీ బిల్లు ఒకే గాటనకడుతోంది. అందువల్ల అందరికీ ఒకేరకమైన పునరావాస చర్యలుంటాయి. ఇవి ఏవిధంగానూ బాధితులకు తోడ్పాటునివ్వదు. పైగా ఈ రంగంలో ఇప్పటికే అనేక ప్రభుత్వ విభాగాలు పనిచేస్తుండగా, తాజా బిల్లు మరికొన్నిటిని చేర్చింది. పర్యవసానంగా చివరకు జవాబుదారీతనం ఎవరిదో తెలియని స్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యకున్న మూలాల్ని గుర్తించడంలోనూ ముసాయిదా బిల్లు విఫలమవు తోంది. పేదరికం, ఉపాధి లేకపోవడం, స్వస్థలాలనుంచి వలసపోక తప్పనిస్థితి ఏర్పడటం వంటివి ఈ తరలింపు సాలెగూటిలో చిక్కుకోవడానికి తోడ్పడుతున్నాయి. కఠిన శిక్షల విధింపువంటివి నేర గాళ్లను భయపెట్టగలవనడంలో సందేహం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగువర్గాల సమ గ్రాభివృద్ధికి తోడ్పడే చర్యలు సరిగా అమలు కాకపోతే ఈ జాడ్యం ఎప్పటికీ దుంపనాశనం కాదు. కనుక ఆ విషయంలోనూ ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపాలి. -
మానవ అక్రమ రవాణా నియంత్రణపై సమష్టి కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర పోలీస్ శాఖ–కేంద్ర హోంశాఖ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. శనివారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పోలీస్ అధికారుల మెస్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సదస్సును డీజీపీ మహేందర్‌రెడ్డి, రిటైర్డ్ డీజీపీ పీఎం నాయర్ కలిసి ప్రారంభించారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు మొత్తం 100మంది వరకు పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై గ్రూప్ డిస్కషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై సుదీర్ఘంగా శిక్షణ ఇచ్చారు. అక్రమ రవాణా కేసుల నమోదు, వాటి దర్యాప్తులో చేపట్టాల్సిన అంశాలపై మహేందర్‌రెడ్డి, పీఎం నాయర్ అధికారులకు అవగాహన కల్పించారు. చట్టపరంగా సమన్వయం చేసుకోవాల్సిన విభాగాలు, వాటి ద్వారా చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా శిక్షణ కొనసాగింది. అక్రమ రవాణా కూపాల నుంచి బయటపడ్డ బాధితులకు అందాల్సిన పరిహారం, స్వచ్ఛంద సంస్థల సహకారంపై వేగవంతంగా స్పందించాలని సూచించారు. యూనిసెఫ్ నుంచి వచ్చిన ప్రతినిధులు మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, అందుకు తగిన సహకారంపై ప్రజెంటేషన్ అందించారు. ప్రజ్వల, మై చాయిస్, దివ్యదిశ, తరుణి, బచ్పన్ బచావ్, సంకల్ప్ తదితర స్వచ్ఛంద సంస్థలతో ఈ కార్యక్రమంలో కలిసి చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మెట్రోపాలిజన్ సెషన్స్ జడ్జి వెంకట కృష్ణయ్య అవగాహన కల్పించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన భరోసా లాంటి సెంటర్లను జిల్లాల్లోనూ వేగవంతంగా విస్తరించి చర్యలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, మహిళ భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా, ఎస్పీ సుమతి, ప్రజ్వల ఎన్జీవో నిర్వాహకురాలు సునీతకృష్ణన్, మహిళ శిశుసంక్షేమ శాఖ అధికారులు, పలు స్వచ్చంద సంస్థల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే..
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ కక్షల సంస్కృతిని తీసుకొచ్చిన కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను రోడ్లపై తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా కేసులో బెయిల్‌పై వచ్చిన ఆయన కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాడు దృతరాష్ట్రుడు కళ్లు లేక పాలన చేస్తే నేడు కళ్లు ఉండి కేసీఆర్ దృతరాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా నియంత పాలన కొనసాగించిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడే వారి గొంతులు నొక్కుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ మొదలు ఆయనకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై ఉక్కుపాదం మోపుతూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆఖరికి హైకోర్టు ఆదేశించినా ఈ ప్రభుత్వం ధర్నాలకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. మీడియా యాజమాన్యాలను సైతం బ్లాక్ మెయిల్ చేస్తూ సమస్యలు పక్కదోవ పట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్‌లో కథనోత్సాహం వచ్చిందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని టీఆర్ఎస్ విమర్శించటం దారుణమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. -
అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం
-
భారతీయ అమెరికన్‌కు ప్రెసిడెన్షియల్ అవార్డు
హూస్టన్ :మానవ అక్రమ రవాణను నియంత్రించడంలో అసమాన ప్రతిభ చూపినందుకుగాను భారతీయ అమెరికన్ మహిళ మినాల్ పటేల్ డేవిస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. హూస్టన్ మేయర్ సిల్వస్టర్ టర్నర్‌కు ప్రత్యేక సలహాదారుగా పని చేస్తున్న పటేల్ గత వారం అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ అవార్డు ప్రదానోత్సవానికి హాజరయ్యారు. అమెరికాలో నాలుగో పెద్ద నగరమైన హూస్టన్‌లో లైంగిక బానిసత్వం, కార్మిక దోపిడీ, మానవ అక్రమ రవాణాలను నిరోధించడానికి పటేల్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీలో బిఏ, కనెక్టికట్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన పటేల్ 2015 జులైలో మేయర్ ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు. గతంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచ హ్యుమనిటేరియన్ సమ్మిట్‌కు స్పీకర్‌గా పని చేశారు.మానవ అక్రమ రవాణా నిరోధంపై ప్రభుత్వాధికారులతో చర్చించేందుకు పటేల్ ఇటీవల భారత దేశం వచ్చారు. భారత పర్యటనలో భాగంగా పటేల్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆమె వివరించారు. ఈ విషయంలో హూస్టన్, హైదరాబాద్‌లు తీసుకుంటున్న చర్యలను పరస్పరం తెలుసుకోవాలన్నారు. -
మార్కెట్ పీఎస్‌లో జగ్గారెడ్డి హాజరు
సనత్‌నగర్: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టై షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మార్కెట్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. 2004లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇతరులను తన భార్య, పిల్లల పేరుతో అమెరికా పంపినట్లు వచ్చిన ఆరోపణలపై సెప్టెంబర్ 9న అతడిని అదుపులోకి తీసుకున్న మార్కెట్ పోలీసులు 10న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. అయితే ఈ కేసు దర్యాపు కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ మార్కెట్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో జగ్గారెడ్డిని విచారించి తిరిగి కోర్టులో హాజరుపరచడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 25న సికింద్రాబాద్ 22వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఆదివారం మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయవాదులతో కలిసి మార్కెట్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన ఎస్ఐ అంజయ్య ఎదుట రిజిస్టర్లో సంతకం చేశారు. -
ప్రభామున్నీతో కేజ్రీవాల్ ఫోటో కలకలం..
సాక్షి, న్యూఢిల్లీ : మానవ అక్రమ రవాణా రాకెట్ నిందితురాలు ప్రభా మున్నీతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిసున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ రాజధానిలోని పంజాబి బాగ్ ప్రాంతంలో ప్రభా మున్నీని పోలీసులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఆమె పక్కన కూర్చుని ఉన్న కేజ్రీవాల్ ఫోటో నెట్టింట్లో దుమారం రేపుతోంది. ఐదేళ్లుగా పరారీలో ఉన్న ప్రభా మున్నీని సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్జీవో పేరిట ప్లేస్మెంట్ ఏజెన్సీని నిర్వహించే ప్రభామున్నీ జార్ఖండ్ యువతులకు ఉద్యోగాలను ఎరవేసి వారిని ఢిల్లీకి పిలిపించి మానవ అక్రమ రవాణా రాకెట్లో భాగంగా వారిని విక్రయిస్తుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. జార్ఖండ్‌లో ఆమెపై పలు కేసులున్నాయని పోలీసులు చెప్పారు. 2013 నుంచి పరారీలో ఉన్న ప్రభా మున్నీ ఎంతమంది యువతులను ఈ రాకెట్లో బాగంగా వంచించిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభా మున్నీ ప్రస్తుతం జార్ఖండ్ పోలీసుల రిమాండ్‌లో ఉందని విచారణలో భాగంగా ఆమెను ప్రశ్నించిన మీదట మరిన్ని వాస్తవాలు వెలుగుచూడనున్నాయి. -
రెండో రోజు కొనసాగిన జగ్గారెడ్డి విచారణ
హైదరాబాద్: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టైన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు వరుసగా రెండో రోజు విచారించారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్కెట్ ఇన్స్పెక్టర్ మట్టయ్య నేతృత్వంలోని బృందం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో జగ్గారెడ్డిని ప్రశ్నించింది. మరోవైపు విచారణ సందర్భంగా జగ్గారెడ్డి తరఫు న్యాయవాది మధ్యాహ్నం వరకు మాత్రమే ఉన్నారు. జగ్గారెడ్డిని శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు విచారించి అటు తర్వాత జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న జగ్గారెడ్డిని మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. -
మొదటి రోజు విచారణ : జగ్గారెడ్డి నోట అదే మాట
సాక్షి, హైదరాబాద్ : మానవ అక్రమ రవాణా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విచారణ మొదటి రోజుముగిసింది. మూడు రోజుల కస్టడికి తీసుకున్న పోలీసులు జగ్గారెడ్డిని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో న్యాయవాది సమక్షంలో విచారించారు. పాస్ పోర్ట్ ,ఏజెంట్ ల వివరాల కు సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లు అయన తరపు న్యాయవాది మీడియాకు వెల్లడించారు. తాను ఒక ప్రజా ప్రతినిధిని కనుక తన నియోజకవర్గం నుండి ఎంతో మంది సంతకాల కోసం వస్తుంటారని జగ్గారెడ్డి సమాధానం చెప్పినట్లు సమాచారం. 14 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసులో చాలా మంది వ్యక్తులు మారారని చెప్పారన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి జగ్గారెడ్డి పోలీసులకు చెప్పారని న్యాయవాది తెలిపారు. సోమవారం బెయిల్ పిటీషన్ పై వాదనలు ఉన్నాయన్నారు. జగ్గారెడ్డిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. పది రోజులు కస్టడీకి ఇవ్వాలని మార్కెట్ పోలీసులు కోరగా.. న్యాయమూర్తి మూడు రోజులకు అనుమతిచ్చారు. సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు విచారణకు అనుతించారు. జగ్గారెడ్డి న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. మరో రెండు రోజుల పాటు జగ్గారెడ్డిని విచారించనున్నారు. మొన్న జగ్గారెడ్డి.. నిన్న గండ్ర.. నెక్ట్స్ ‘ఓటుకు నోట్లేనా’ !? -
అక్రమ రవాణాపైనా రాజకీయ దురుద్దేశాలేనా?
అవి 2006 మార్చి మాసం చివరి రోజులు... అప్పట్లో దుబ్బాక దొమ్మాట నియోజక వర్గం కింద ఉండేది. నేను తొలి సారి దొమ్మాట నుంచే గెలిచాను. పొద్దంతా నియోజకవర్గంలో తిరిగి మా ఇంటి ముందు మామిడి చెట్టు కింద కూలబడ్డా. కార్యకర్తలుంటే వాళ్లతో మాట్లా డుతున్నా. అప్పుడే ఓ మిత్రుడు ఓ అపరిచిత వ్యక్తితో కలిసి వచ్చాడు. అప్పట్లో అతను మా పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు ఓ జాతీయ పార్టీలోకి వెళ్లిపోయాడు. ఆయనను మధుసూదన్ రావుగా పరిచయం చేశాడు. నిజామాబాద్ జిల్లా అని ‘హ్యూమన్ ట్రాఫికింగ్‘ బ్రోకర్ అని చెప్పాడు. సాదా సీదా లేబర్‌ను కాకుండా హైక్లాస్ మనుషులను అమెరికా పంపిస్తుంటాడని, గుజరాత్, మహారాష్ట్రల్లో మంచి పేరున్న వ్యక్తిగా చెప్పారు. మా ప్రజలు నా గురించి ఏమ నుకుంటున్నారు అని ఉత్సాహం కొద్ది అడిగాను. ‘నువ్వు అవినీతిపరునివి అనుకుంటున్నారు’ అని చెప్పారు. ‘ఓర్నీ... నేను ఎమ్మెల్యేను అయ్యాక నియోజకవర్గానికి ఒక రూపాయి అభివృద్ధి పనులు కూడా రాలేదు కదా! అప్పుడే ఎక్కడ అవినీతికి పాల్పడబోయిన’ అన్నాను. మధుసూదన్‌రావు వ్యాపారానికి నా సహాయం కావాలన్నారు. ప్రశ్నార్థకంగా చూశాను. ‘గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఇంగ్లండ్, అమెరికా వెళ్లిపోయిన కొందరు వ్యక్తులు అక్కడి వ్యాపారాల్లో బాగా స్థిరపడిపో యారు. ఇండియాలోని తమ భార్యాపిల్లలను అక్కడికి రప్పించుకుంటున్నారు’’ అని చెప్పారు. వాళ్ల వీసాలకు నా సిఫారసు కావాలన్నారు. ‘ఎమ్మెల్యేలకు ఇటువంటి అధి కారం కూడా ఉందా?’ అని అడిగాను. గుజరాతీలను నా బంధువుల పేరు మీద నా సిఫారసు లెటర్‌తో వీసా ఇప్పించి అమెరికా పంపించాలని కోరారు. జర్నలిస్టుగా మనుషుల అక్రమ రవాణా కేసుల గురించి నేను చది వాను. ‘ఇంతకు ముందు నన్ను మీరు అవినీతిపరుడు అన్నారు.. ఇంతకు మించిన అవినీతి ఇంకేమీ ఉండదు. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయను’ తెగేసి చెప్పాను. మరో ఆరు నెలలకు అనుకుంటా... ఇంకో మిత్రుడు ఎర్రమంజిల్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు విందుకు ఆహ్వా నించారు. అప్పటి సహచర ఎమ్మెల్యే సోయం బాపురావు నాకు కాల్ చేసి విందుకు కలిసి వెళ్దాం అన్నారు. ఇద్దరం కలిసే వెళ్లాం. మేం వెళ్లేటప్పటికే అక్కడ కాసిపేట లింగయ్య, మరి కొంతమంది రాజకీయ మిత్రులు ఉన్నారు. భోజనానికి కూర్చున్నాం. ఓ వ్యక్తి నాకు వడ్డిస్తూ ‘ఈ ఎమ్మెల్యే గారు పేదరికంలో ఉన్నట్టున్నారుగా’ అని అన్నాడు. ‘నేను ఎట్టుంటే నీకేంది.. నువ్వు వడ్డించేదో వడ్డించు’ అని కాస్త కటువుగానే అన్నాను.. నన్ను ఆహ్వా నించిన వ్యక్తి కల్పించుకుంటూ.. ‘అన్నా.. ఇతను రషీద్, మనుషులను విదేశాలకు పంపుతారు’ అని పరిచయం చేశారు. పాస్‌పోర్టు కోసం నన్ను సహాయం చేయమని అడిగారు. నన్ను ఒప్పించటానికి జగ్గారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన సమ యంలో ఆయన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్ సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన వారిని అమెరికా పంపినట్లు చెప్పారు. నకిలీ డాక్యుమెం ట్లతో వీసాలు పొందిన ముగ్గురినీ జగ్గారెడ్డి తన వెంట అమెరికాకు తీసుకెళ్లారని, వారిని అక్కడ ఉంచి తిరిగి హైదరాబాద్ వచ్చేశారని నన్ను ఒప్పించేందుకు ప్రయ త్నం చేశారు. ఇలా సహకరించినందుకు రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ వస్తాయని చెప్పారు. నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన వ్యక్తిని. నా బ్యాక్ గ్రౌండ్ జర్న లిజమే. ఏమీ లేకుండానే కేసీఆర్ నన్ను పిలిచి టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి గెలిపించారు. నేను డబ్బుకోసం ఆశపడి తప్పుడు పనిచేస్తే... భవిష్యత్తులో నాలాంటి దిగువ కుటుంబాల నుంచి వచ్చే యువతను ఎవరూ నమ్మరు. నేను ఆ పని చేయలేను అని చెప్పేసి వచ్చేశాను. అదేరోజు హరీశ్‌రావుకు ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పాను. ఇందులో మన ఎమ్మెల్యేలు కూడా ఇరుక్కున్నా రని చెప్పాను. ఒక మీడియా సంస్థను కలిస్తే వాళ్లు వరు సగా రెండు కథనాలు ప్రచురించారు. ఈలోగా హరీశ్ రావు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ దృష్టికి తీసు కువెళ్లారు. ఆ తరువాత అసలు తతంగం అంతా బయటికి వచ్చింది. ఇప్పుడు ‘హ్యూమన్ ట్రాఫికింగ్’లో జగ్గారెడ్డి నిండా ఇరుక్కుపోయారు. ఆయన కుటుంబం పేరుతో అమెరి కాకు వెళ్లిన గుజరాతీయులు 14 ఏళ్లయినా తిరిగి రాక పోవటంతో ‘అమెరికన్ కాన్సులేట్ అధికారులు’ అనుమా నించి హైదరాబాద్ సిటీ నార్త్ జోన్ పోలీసులకు సమా చారం ఇచ్చారు. జగ్గారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా తన సిఫారసుతో ఇప్పించిన పాస్‌పోర్టుల డాక్యుమెంట్లను పోలీసులు పరిశీలించారు. అందులో కొడుకు, కూతురు, భార్యపేర్లు ఉన్నా ఫొటోలు మాత్రం వేరేవారివిగా ఉన్న ట్లుగా గుర్తించారు. గుజరాత్‌కు చెందిన ఒక కుటుంబాన్ని అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు నిర్ధారణ చేశారు. ఇదీ వాస్తవంగా జరిగింది. ఇందులో రాజకీయ కక్ష సాధింపు ఎక్కడ ఉంది? రాజకీయ దురుద్దేశం ఏముంది? ఆరోపణలు ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయక ఆరో పణలు పక్కన పెట్టి వాస్తవిక దృక్పథంలో ప్రజల్లోకి రావాలి. అప్పుడే జనం మనలను విశ్వసిస్తారు.. ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయిస్తారు. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసనసభ్యులు ‘ 94403 80141 -
కేసీఆర్, హరీశ్‌రావులపై చర్యలేవి?’
హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో కీలక పాత్రధారులుగా ఉన్న కేసీఆర్, హరీశ్‌రావు, కాశీపేట లింగయ్యలపై చర్యలేవని తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. పద్నాలుగేళ్ల నాటి కేసును వెలికితీసి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం హర్షించదగ్గ అంశమేనని, కేసీఆర్‌పై ఉన్న అభియోగాలపై చట్టం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి కేసీఆర్ లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బుధవారం ఇక్కడి తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కొండగట్టు ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఇంటిపార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సిట్టింగ్ జడ్జితో విచారించాలి
సాక్షి, హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీరితో పాటు టీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు షకీల్, రామలింగారెడ్డితో పాటు కేసీఆర్ పీఏగా ఉన్న అజిత్రెడ్డిల పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ.. మనుషుల అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ రషీద్ ఇచ్చిన వాంగ్మూల కాపీలను మీడియాకు అందజేశారు. ‘రషీద్ ఇచ్చిన వాంగ్మూలంలో.. బోధన్ తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనకు పరిచయం చేయగా, పీఏ అజిత్‌రెడ్డి ద్వారా డబ్బులు తీసుకొని కేసీఆర్, హరీశ్‌లు గుజరాత్‌కు చెందిన వారిని అమెరికాకు పంపినట్లు తెలిపాడు. కేసీఆర్ లెటర్‌హెడ్ మీద 2005లో ఐదుగురు, 2006లో మరో ముగ్గురిని అమెరికా పంపేందుకు సిఫారసు లెటర్ ఇచ్చారని చెప్పాడు. హరీశ్‌రావు స్వయంగా భార్య, బిడ్డ పేరుతో రికమండ్ లెటర్ ఇచ్చి అక్రమ రవాణాకు సహకరించారని రషీద్ వాంగ్మూలంలో ఉంది. వీరితో పాటే రామలింగారెడ్డి పేరూ ఉంది. ఇందులో ఎక్కడా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు లేదు. కనీసం తనకు సహకరించినట్లు కూడా లేదు. అయినా అసలు దోషులను వదిలి జగ్గారెడ్డిని ఇరికించారు’అని రేవంత్ పేర్కొన్నారు. ఈ విషయంలో గవర్నర్ కళ్లు తెరిచి వాస్తవాలు చూసి, రషీద్ వాంగ్మూలంలో ఉన్న కేసీఆర్, హరీశ్ సహా ఇతరులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2007లో మనుషుల అక్రమ రవాణా కేసులపై ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి సిటీ కమిషనర్‌గా ఉన్నప్పుడే 2017లో చార్జిషీట్ దాఖలు చేశారని రేవంత్ తెలిపారు. కేసులో వాస్తవాలు దాచి రాజకీయ కక్షలో భాగంగా కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. శాంతి భద్రతలు గవర్నర్ పరిధిలో ఉన్నా.. ఆయన ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని ప్రశ్నించారు. కాళ్లు పట్టుకుంటున్నాడని, జరుగుతున్న అరాచకాలపై కళ్లు మూసుకోవద్దని సూచించారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, అవసరమైతే కాంగ్రెస్ నేతలను చంపేయడానికి కూడా వెనుకాడబోరని పేర్కొన్నారు. లెక్క బరాబర్ చేస్తం.. కాంగ్రెస్ నేతలను కేసులతో వేధించేందుకు కేసీఆర్ తన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను రాజధాని చుట్టు పక్కలా నియమించారని ఆరోపించారు. వీరంతా ఫోన్లు ట్యాపింగ్ చేయడం, పాత కేసులు తవ్వే పనిలో ఉన్నారు. అయితే వీరందరి పేర్లను డైరీలో రాస్తున్నం. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక లెక్క బరాబర్ చేస్తాం. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఐపీఎస్‌ల పైనా విచారణ చేయిస్తాం’అని స్పష్టం చేశారు. పోలీసులు కక్ష సాధింపు చర్యలు మానుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తనపైనా పాత కేసులు తవ్వుతున్నారని, ఆ కేసుల్లో దమ్ముంటే అరెస్ట్ చేయాలని సీఎంకు సవాల్ విసిరారు. -
జగ్గారెడ్డికి రిమాండ్
సాక్షి, హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సోమవారం రాత్రి ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది. అంతకుముందు వాదనల సందర్భంగా జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. మనుషుల అక్రమ రవాణాకు సంబంధిం చిన కేసు అయినందున హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. అలాగే పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. దీంతో పోలీసులు జగ్గారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయనకు జైలు అధికారులు యూటీ నంబర్ 6403 కేటాయించారు. పక్కా ఆధారాలతోనే అరెస్ట్: డీసీపీ సుమతి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మనుషుల అక్రమ రవాణాకు పాల్పడినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీ బి. సుమతి తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2004లో జరిగిన ఈ వ్యవహారంపై తమకు సోమవారం ఉదయం 10.30 గంటలకు సమాచారం అందిందని, ఎస్సై అంజయ్య సుమోటోగా కేసు నమోదు చేయగా మధ్యాహ్నానికి తాము ఆధారాలు సేకరించామన్నారు. ఆయన్ను సాయంత్రం అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీరించారని చెప్పారు. నేరం జరిగి ఎన్నాళ్లయినప్పటికీ సమాచారం, ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారు... జగ్గారెడ్డి 2004 సెప్టెంబర్ 24న నాటికి ఏడేళ్ల వయసున్న తన కుమార్తె స్థానంలో 17 ఏళ్ల యువతిని, నాలుగేళ్ల వయసున్న కుమారుడి స్థానంలో 15 ఏళ్ల బాలుడిని, భార్యగా మరో మహిళను చూపుతూ పాస్‌పోర్టులు పొందారని సుమతి చెప్పారు. దీనికి అవసరమైన పత్రాలను సంగారెడ్డిలోని తేజ జూనియర్ కాలేజీ, కరుణ స్కూల్స్ నుంచి సేకరించారన్నారు. పాస్‌పోర్టు దరఖాస్తుల్లో పేర్లు తన కుటుంబీకులవే పొందుపరిచినా భార్య మినహా మిగిలిన ఇద్దరి పుట్టిన తేదీలు మార్చి గుర్తుతెలియని ముగ్గురి ఫొటోలు జత చేశారన్నారు. అలాగే నాడు ఎమ్మెల్యే హోదాలో లెటర్‌హెడ్‌పై తనతోపాటు ఆ ముగ్గురికి అమెరికా వీసా కోసం అమెరికన్ కాన్సులేట్‌కు లేఖ రాశారన్నారు. అలా వీసాలు సంపాదించి ముగ్గురు వ్యక్తులతో కలసి అమెరికా వెళ్లారన్నారు. జగ్గారెడ్డితోపాటు నాటి కాంగ్రెస్ నేత కుసుమ కుమార్ కూడా అమెరికా వెళ్లారని సుమతి తెలిపారు. అక్కడ వారంపాటు ఉన్న జగ్గారెడ్డి, కుసుమ కుమార్ తిరిగి వచ్చేయగా... ఆ ముగ్గురూ నేటికీ అక్కడే ఉండిపోయారని వివరించారు. దీనిపై జగ్గారెడ్డిని ప్రశ్నించగా అప్పట్లో మధు అనే దళారి ఆ ముగ్గురినీ నాటి పీఏ ద్వారా తన వద్దకు తెచ్చాడని, ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల చొప్పున తీసుకుని సహకరించానని జగ్గారెడ్డి అంగీకరించినట్లు సుమతి పేర్కొన్నారు. 2015 ఆఖరులో ఆ పాస్‌పోర్టు ఎక్స్పైర్ కావడంతోపాటు దానిపై అమెరికా స్టాంపింగ్స్ ఉండటంతో సంగారెడ్డి చిరునామాతో మరో పాస్‌పోర్టు కోసం జగ్గారెడ్డి దరఖాస్తు చేసుకుని 2016 జనవరిలో పొందారన్నారు. 9 సెక్షన్ల కింద కేసు... ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో సొంత లెటర్‌హెడ్ ద్వారా తప్పుడు వివరాలు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ విభాగాలను మోసం చేసి మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై ఐపీసీ, పాస్‌పోర్ట్ చట్టం, ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేశారు. మొత్తం తొమ్మిది సెక్షన్లలో మూడు నాన్–బెయిలబుల్ సెక్షన్లని, వాటి కింద ఏడేళ్లు, అంతకుమించి శిక్షపడే అవకాశం ఉందని సుమతి తెలిపారు. కేసీఆర్, హరీశ్‌రావుల కుట్ర: జగ్గారెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల కుట్ర ఫలితంగానే పోలీసులు తనను అరెస్ట్ చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడాన్ని జీర్ణించుకోలేకే కేసీఆర్, హరీశ్‌రావు తనను జైల్లో పెట్టిస్తున్నారన్నారు. తద్వారా సంగారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పథకం వేశారన్నారు. -
ప్రేమిస్తున్నాను.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి
ముంబై : ఉద్యోగాల పేరుతో.. ప్రేమ పేరుతో దాదాపు 500 మంది అమ్మాయిలను, మైనర్ యువతులను బంగ్లాదేశ్ నుంచి ముంబైకి అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని, అతని ఏజేంట్లను పాల్ఘార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివారాల ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ సైదుల్ షేఖ్(38) 2010 నుంచి థానే జిల్లా దొంబివాలి మన్‌పడాలో నివాసం ఉంటున్నాడు. ఇండియాలో నివాసం ఉంటున్న షేఖ్ తన ఏజెంట్ల ద్వారా బంగ్లాదేశ్‌కు చెందిన యువతలను అక్రమంగా ఇక్కడికి తీసుకువచ్చి వారిని అసాంఘీక కార్యకలపాలకు పాల్పడే వ్యక్తులకు అమ్మేవాడు. ఈ క్రమంలో షేఖ్ ఏజెంట్లు సదరు యువతులను ప్రేమ పేరుతో.. ఉద్యోగాల పేరుతో మాయ మాటాలు చెప్పి ముంబై తీసుకు వచ్చేవారు. ఇలా తీసుకువచ్చిన అమ్మాయిలను షేఖ్‌కు అప్పగించేవారు. వీరిని షేఖ్ ఒక్కోక్కరిని లక్ష రూపాయలకు సదరు ముఠాలకు విక్రయించేవాడు. ఈ అక్రమ రవాణా దందా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ ఈ విషయం గత ఏడాది పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో పోలీసులు సంవత్సరం నుంచి షేఖ్‌ను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో షేఖ్ అనుచరుడు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలిసులు షేఖ్‌తో పాటు మరో ఏడుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీరందరి మీద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే షేఖ్ మీద పలు కేసులు నమోదయ్యాయని.. ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పిల్లల పాలిట ‘యమకూపం’
అభం శుభం ఎరుగని పసిపిల్లలపై మర్యాదస్తులు, పెద్ద మనుషులుగా సమాజంలో చెలామణీ అయ్యేవారు పెట్టే చిత్రహింసలు చెప్పనలవి కాని రీతిలో ఉంటున్నాయి. ఈ పిల్లలు అనుభవించే హింస, వర్ణనాతీతమైన కష్టాలు చూస్తే రాళ్లు సైతం విలపిస్తాయి. ఇంతటి ఘోరాలు పసి వాళ్లపై జరుగుతున్నా చలించని ప్రభుత్వాలుంటే అవి అమలు చేయాల్సిన చట్టాలు ఏం చేయగలవు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మనుషులను వేధించాల్సిన సమయం వచ్చింది. ఇంత క్రూరత్వం అనుభవించిన పసివాళ్ల బాధ, మనో వేదన నిరంతరం పచ్చిపుండే. ఈ దేశ అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో పాటు ప్రేక్షక పాత్ర వహిస్తున్న సమాజం–ఇలా అందరూ ఈ బిడ్డల విషయంలో దోషులే. ‘‘మనిషిగా తలెత్తి బతక లేను మానవత లేని లోకాన్ని స్తుతించలేను’’ అంటారు ప్రసిద్ధ తెలుగు కవి దేవరకొండ బాల గంగాధర తిలక్. నాలుగు సంవత్సరాల పాప లేత చేతులపై వాతలు. ఏడేళ్ల బిడ్డలపై... మరిగే నీళ్లు పోయడం, వాతలు పెట్టడం, కొట్టడం... తిట్టడం.. ఇలాంటివి చెప్పనక్కర లేదు. ఈ ఆడపిల్లలకు ఈడు రాలేదు! పాపం... కోరికంటే తెలియదు. బలవం తంగా చేసిన ఇంజెక్షన్ల కారణంగా ఈ పిల్లలు ‘పెద్ద వాళ్లయ్యారు’. అంతేకాదు, ఎందరి చేతుల్లోనో నలిగి పోయారు. ఎందుకంటే, ఈ చిన్న ఆడపిల్లలకే డిమాండ్. విటుల వికృత కోర్కెలకు వారు బలైపో తున్నారు. ఎంత చిన్న అమ్మాయి అయితే అంత ఎక్కువ రేటు. ఇలాంటి కోర్కెలున్న వాళ్లు నిజంగా మనుషులేనా? ప్రత్యేక జాతా? ఎవరీ పిల్లలు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరీ కూనలు? ఎక్కడి నుంచి ఈ నరకానికి చేరారు? ఎక్కడ దొరికితే అక్కడ ఎత్తుకు వచ్చిన వాళ్లు. ఆడుకుంటూ అమాయకంగా చాక్లెట్ల కోసం వచ్చి జీవితాలు కోల్పోయినవాళ్లే ఈ ఆడపిల్లలు. ప్రధానంగా పేదల పిల్లలు. వలస కూలీల పిల్లలు. వారి అమ్మానాన్నలకు పనికి వెళ్లక తప్పదు. ఇలాంటి కూలీల బిడ్డలకు కేర్ సెంటర్లు ఉండవు. రోడ్ల మీదే అలా తిరుగుతుంటారు. దుర్మార్గులకు దొరికిపో తారు. అయినా వారి విషయం ఎవరూ పట్టించు కోరు. పోలీసులతో సహా.. వీళ్లేమైనా ధనవంతుల బిడ్డలా? అధికారం ఉన్న వారి కడుపున పుట్టారా? గ్లామర్ ఉన్న ప్రముఖుల పిల్లలా? వారి ‘అదృశ్యం’ సంచలన వార్త అవుతుందా? కాదు గదా! చూద్దాంలే అంటారు చట్టాలు అమలు చేయాల్సినవాళ్లు. రోజూ 194 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు భారతదే శంలో. అందులో జాడ దొరికేది సగం మంది మాత్రమే. ఈ ముక్కుపచ్చలారని పిల్లల్లో 51 శాతం మంది అపహరణకుగురయినవారే. ఈ పిల్లలందరినీ వేరే దేశాల వ్యభిచార గృహాలకు, మన దేశంలోని వ్యభిచార కూపాలకు, బూతు సినిమాలు తీయడా నికి, వెట్టి చాకిరి చేయడానికి దుండగులు తరలిస్తు న్నారు. ఇలా మాయమవుతూ దుర్భర జీవితం గడుపుతున్న పిల్లల గురించి సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలు ప్రభుత్వాలు సహా ఎవరూ పట్టించు కున్న దాఖలాలు లేవు. ఫోన్లు, వాట్సాప్ ద్వారానే మొత్తం వ్యాపారం! ఈ అమాయక ఆడపిల్లలను ఎత్తుకొచ్చినవాళ్లు, మధ్య దళారులు, వారిని కొనేవాళ్లు–వీరందరూ చాలా తెలివిగా వ్యవహారం నడుపుతుంటారు. మొత్తం వ్యాపారం ఇప్పుడు ఫోను సంభాషణలు, వాట్సాప్ ఫొటోలతో నడుస్తోంది. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పిల్ల వయసు ఎంత? ఇప్పటికి ఎంత వ్యాపారం చేయడానికి ఉపయోగప డింది? ఇలా అన్నింటికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు వారితో వ్యాపారం చేసేవారి దగ్గర ఉంటాయి. ఈ ఆడపిల్లలతో వ్యాపారం చేసే అసలు సూత్రధారులు ఇలాంటి వివరాలతోనే బేరాలు కుదుర్చుకుంటారు. గత సంవత్సరం లక్షా పదకొండు వేల మందికి పైగా పిల్లలు కనపడకుండా పోయారు. ఇరుగు పొరుగు దేశాల నుంచి ఏటా 50 వేల మంది స్త్రీలు, పిల్లలు భారతదేశంలోకి అక్రమ రవాణా అవుతు న్నారు. దేశంలో ఈ వృత్తిలో ఉన్న రెండు కోట్ల మందిలో కోటీ అరవై లక్షల మంది అక్రమ రవాణా ద్వారా ఇతరుల బలవంతంతో వచ్చినవాళ్లే. అంటే ఎనభై శాతం మంది మహిళలు ఇలా వ్యభిచారకూపా లకు అక్రమ రవాణా కారణంగా చేరుకున్నవారే. భారీ ప్రభుత్వ వ్యవస్థ ఉన్న ఈ దేశంలో బాలల అక్రమ రవాణా అరికట్టడానికి ఇంత వరకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయలేదు. నిర్ణీత కాంట్రాక్టు పద్ధతిలో పిల్లల తరలింపు కాంట్రాక్టు పద్ధతిలో పిల్లలను వ్యభిచార గృహాలకు ఇవ్వడం, ముందే నిర్ణయించిన గడువు తీరగానే మళ్లీ మరో ప్రదేశానికి తరలించడం చాలా ఏళ్లుగా జరుగు తోంది. ఇలా పిల్లలను అనేక చోట్లకు తరలించడం వల్ల వారి జాడ తెలుసుకోవడం చాలా కష్టమౌతోంది. ఇలా తీసుకొచ్చిన పిల్లలను బడి పిల్లల్లాగే తయారు చేశాక అపార్ట్మెంట్లలో నివాసాల మధ్య ఈ దుర్మా ర్గపు వృత్తి చేయిస్తున్నారు. అవసరాన్ని బట్టి వారిని నేలమాళిగల్లో దాచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ పిల్లలపై మర్యాదస్తులు, పెద్ద మనుషులుగా సమా జంలో చెలామణీ అయ్యేవారు పెట్టే చిత్రహింసలు చెప్పనలవి కాని రీతిలో ఉంటున్నాయి. ఈ అక్రమ సెక్స్ వ్యాపారంలో ఆడపిల్లలతోపాటు మగపిల్లలకు కూడా గిరాకీ పెరిగిపోతున్నది. ఈ పిల్లలతో ఇలా ప్రవర్తించడానికి కారణాలేంటి? అసహజమైన బూతు దృశ్యాలు విపరీతంగా చూసి రెచ్చిపోవడం, వయసు మీరుతున్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మా యిలు దొరకకపోవడం మాత్రమే కారణాలా? లేక ఎవరూ తాకని పసి కన్యలు కావాలనే మోజా? ఇలాంటి పిల్లలతో శారీరక సంబంధం పెట్టుకుంటే అప్పటికే ఉన్న రోగాలు పోతాయనే మూఢనమ్మ కమా? ముక్కుపచ్చలారని ఈ పిల్లలను ఎంతగా హింసించినా, ఎలాంటి వికృత లైంగిక చర్యలకు పాల్పడినా వారు అడ్డుచెప్పలేరనే నమ్మకమా? నిస్స హాయ స్థితిలో ఉండే అమ్మాయిలపై కామం పేరుతో శాడిజానికి పాల్పడి ఆనందించే రాక్షస లక్షణమా? ఇంకే కారణాలు మనుషులను మృగాలను మించి పోయేలా చేస్తున్నాయి? ఈ పిల్లలు అనుభవించే హింస, వర్ణనా తీతమైన కష్టాలు చూస్తే రాళ్లు సైతం విలపిస్తాయి. ఇంతటి ఘోరాలు పసివాళ్లపై జరుగు తున్నా చలించని ప్రభుత్వాలుంటే అవి అమలు చేయాల్సిన చట్టాలు ఏం చేయగలవు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మనుషులను వేధించాల్సిన సమ యం వచ్చింది. బిహార్ అనాథ గృహాల కథనాలు దారుణం ఉత్తరాది రాష్ట్రమైన బిహార్‌లోని అనాథ గృహాల కథ నాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఆయన రాజ కీయ నాయకుడు. మూడు పత్రికల యజమాని. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. ఆయన ఏడేళ్ల మూగ చెవిటి అమ్మాయిని కూడా వదల్లేదు. 34 మంది చిన్న బిడ్డలకు మత్తుమందులు ఇచ్చి అత్యాచారాలు చేసిన ఘటనలు ఇక్కడే జరుగుతున్నాయి. బిహార్ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మంజూ వర్మ (ఈమె బుధ వారం పదవికి రాజీనామా చేశారు) భర్త ముజఫర్ పూర్ అనాథ బాలికల గృహంలో అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవడమేగాక తానే స్వయంగా అత్యాచారం చేశాడు. అనాథ గృహంలోని ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలపై ఎవరో ఇచ్చిన నివేదిక ఎనిమిది నెలలపాటు అతీగతీ లేకుండా మంత్రి ఆఫీసులో పడి ఉంది. ఈ పిల్లల ఆక్రందనలు ఎవరూ వినలేదు. బయటకు ఈ పిల్లల అరుపులు, ఏడుపులు వినపడుతున్నా, బాలికలను జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతున్నా చుట్టూ ఉన్న జనం మాట్లాడలేదు. ఎందుకంటే వారికి భయం. ఈ దుర్మార్గాలకు సూత్రధారి అయిన బ్రజేష్ ఠాకూర్ తనను అరెస్ట్ చేశాక భయపడలేదు. పోలీసులు తీసు కుపోతున్నప్పుడు అతను నవ్వుకుంటూ ‘ఇదంతా రాజకీయ కుట్ర’ అని మీడియాకు ధైర్యంగా చెప్పా డంటే, అతనికి రాజకీయంపై ఎంత నమ్మకం? అతని నమ్మకం వమ్ముకాలేదు. జైలు ఆస్పత్రిలో ఠాకూర్‌కు రాజభోగాలందుతున్నాయి. అనాథ పిల్ల లంతా మానసిక, శారీరక గాయాలతో కునారి ల్లుతున్నారు. బ్రజేష్ ఠాకూర్ నడిపే మరో అనాథగృ హంలో 11 మంది పిల్లల ఆచూకీ లేదు. గువాహటీ మసాజ్ సెంటర్లో... ఇలాంటి అక్రమాలకే నిలయమైన గువాహటీ మసాజ్ సెంటర్ గురించి స్థానికులు ఫిర్యాదు చేసినా చాలా కాలం పట్టించుకోలేదు. తీవ్ర ఒత్తిడి తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు 110 మంది అమ్మా యిలను రక్షించారు. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో బ్లాక్ లిస్టులో ఉండి, అనుమతి లేని షెల్టర్ హోమ్‌కు పోలీ సులు అమ్మాయిలను ఇస్తూనే ఉన్నారు. ఈ అనాథ కేంద్రాల నుంచి రోజూ వ్యాన్లలో మైనారిటీ తీరని అమ్మాయిలను విటుల దగ్గరకు పంపడం పోలీసు లకు తెలుసు. మరి ఈ విటులు అధికారులా? రాజ కీయ నాయకులా? అనే విషయంపై పోలీసులు ఆరా తీయడం లేదు. విటులందరిపైనా పోక్సో చట్టం కింద కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? ఈ ఘటనలన్నింటికీ అక్రమ రవాణా చట్టం, వ్యభిచార నిరోధక చట్టంతోపాటు పోక్సో చట్టం కూడా వర్తి స్తుంది. వ్యభిచార కూపాల్లో మాదిరే ఈ గృహాలకు చేరిన పిల్లలు వాటి నిర్వాహకుల దయాదాక్షిణ్యాలపై బతకాల్సిందే. ఈ హోమ్‌ల యజమానులకు రాజ కీయ పార్టీలు, అధికారుల అండదండలున్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా అక్రమ రవాణా బాధి తులను ఈ పునరావాస కేంద్రాలకు తరలిస్తూనే ఉన్నారు. వీటిలో పునరావాసం కల్పించేవి ఎన్ని? వ్యాపారం నడిపేవి ఎన్ని? ఎక్కడా పర్యవేక్షణ లేదు. ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు కూడా జవా బుదారీతనం లేదు. వేటిపైనా నిఘా లేదు. ‘పునరా వాసం’ మంచి లాభదాయక వ్యాపారంగా మారింది. అందుకే సుప్రీంకోర్టు ‘‘పసి పిల్లలపై అకృత్యాలు చేయడానికి ప్రభుత్వం నిధులు ఇస్తున్నదా? ఎందుకు సరైన తనిఖీ లేదు’’ అని ప్రభుత్వాన్ని నిల దీసింది. కనీసం అత్యాచార బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్నయినా ఎందుకు ఇవ్వలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇంత క్రూరత్వం అనుభవించిన పసివాళ్ల బాధ, మనోవేదన నిరంతరం పచ్చిపుండే. ఈ పిల్లలు మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు భరోసా ఇవ్వాలని ఎవరూ అనుకోవడం లేదు. వారి మానసిక కల్లోలం సమసిపోవడానికి చికిత్స అందిం చాల్సిన బాధ్యత మనపై ఉందని ఎవరూ భావిం చడం లేదు. ఒక గృహంలో అకృత్యాలు జరిగినట్టు తేలితే పిల్లలను మరో గృహానికి తరలించి అధికా రులు చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ దేశ అధి కార వ్యవస్థ, న్యాయ వ్యవస్థలతో పాటు ప్రేక్షకపాత్ర వహిస్తున్న సమాజం–ఇలా అందరూ ఈ బిడ్డల విష యంలో దోషులే. నిర్లజ్జగా, బాధ్యత తీసుకోకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు అసలు నేరస్తులు. వ్యాసకర్త : పి. దేవి, సాంస్కృతిక కార్యకర్త ఈ–మెయిల్ : pa_devi@rediffmail.com -
వ్యభిచార ఊబి!
సాక్షి, సిద్దిపేట/మెదక్: అభం శుభం తెలియని చిన్నారులను అపహరించి.. వ్యభిచార ముఠాలకు అప్పగించడం, వారిని పెద్దచేసి వ్యభిచార ఊబిలోకి దింపడం లాంటి ఘటనలు యాదగిరిగుట్టలో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బాలికల అపహరణ ముఠాల మూలాలు వెలికి తీస్తున్న రాష్ట్ర ప్రత్యేక పోలీసు బృందాలకు పలు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సిద్దిపేటతో పాటు జిల్లాలోని కొడకండ్ల (రాంచంద్రాపూర్)లో కూడా అపహరించిన ఆడపిల్లలను వ్యభిచార ఊబిలోకి దింపినట్టు సమాచారం. ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర పోలీసు ప్రత్యేక బృందాలు సిద్దిపేట జిల్లాపైనా నిఘా పెంచినట్టు తెలిసింది. ఇతర ప్రాంతాలతోనూ లింకులు.. సిద్దిపేట పట్టణం, జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో పోలీసుల దాడుల్లో వ్యభిచార ముఠాలు పట్టుబడినప్పుడు కొంతకాలం మిన్నకుండిపోయి ఆపై యథావిధిగా తమ పనులు సాగించడం పరిపాటిగా మారింది. అనేక ఏళ్లుగా పలు కుటుంబాలు ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయి. అయితే, స్థానికులే కాకుండా ఈ వ్యభిచార గృహాలకు నెల, రెండునెలలకు ఒకసారి ఇతర ప్రాంతాల అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. సిద్దిపేట, కొడకండ్లలోని వ్యభిచార గృహాల నిర్వాహకులకు యాదగిరిగుట్ట, రామాయంపేట, వంగపాడు, గీసుగొండ ప్రాంతాలు, ఏపీలోని చిలకలూరిపేట, పెద్దాపురం వంటి ప్రాంతాల వ్యభిచార రాకెట్లతోనూ సంబంధాలున్నట్టు సమాచారం. ఈ సంబంధాలతో వ్యభిచార గృహాలలో ఉండే అమ్మాయిలను ఇక్కడి వారిని అక్కడికి పంపడం.. అక్కడివారిని ఇక్కడికి తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అపహరించిన పిల్లలను సిద్దిపేటలో కూడా పెంచి పెద్ద చేస్తున్నట్టు సమాచారం. కాగా, యాదగిరిగుట్టలో పిల్లల సంఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఎప్పుడూ సందడిగా ఉండే సిద్దిపేటలోని కోమటిచెరువు సమీపంలోని వ్యభిచార గృహాలతో పాటు కొడ కండ్ల సమీపంలోని రాంచంద్రాపురం గృహాల వద్ద కొద్ది రోజులుగా స్తబ్ధత నెలకొంది. సిద్దిపేట జిల్లాలోనూ పిల్లలు.. సిద్దిపేట జిల్లాలో కూడా పలు ప్రాంతాలలో వ్యభిచార గృహాల నిర్వాహకులవద్ద 5 నుంచి 10 సంవత్సరాల వయసున్న చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. యాదగిరి గుట్టలో వెలుగు చూసిన సంఘటనతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు గుట్టలో పట్టుకున్న వారిని విచారించిన సందర్భంగా ఈ విషయం బయటపడినట్టు సమాచారం. దీంతో ప్రత్యేక బృందాలు సిద్దిపేట జిల్లాపైనా నిఘా పెంచినట్లు తెలిసింది. జప్తిశివనూరుపై నిఘా యాదగిరిగుట్టలో చిన్నారులను వ్యభిచార కూపంలోకి దించుతున్న ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని జప్తిశివనూరు (సరోజీనగర్)పై పోలీసులు దృష్టిపెట్టారు. గతంలో ఇక్కడ గుట్ట తరహా సంఘటనలు చోటు చేసుకున్న దృష్ట్యా మరోమారు అందరి దృష్టి జప్తిశివనూరుపై పడింది. తాజాగా ఇక్కడా చిన్నారులేమైనా ఉన్నారా.. అన్న అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు రహస్యంగా విచారణ సాగిస్తున్నట్టు సమాచారం. జప్తిశివనూరులో వ్యభిచార గృహాలకు యాదగిరిగుట్ట, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఏపీ నుంచి కూడా యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించేవారు. మైనర్ పిల్లలతో వ్యభిచారం చేయించిన సంఘటనలపై గతంలో పలు కేసులు నమోదు చేశారు. గత ఏడాది మార్చిలో పోలీసుల ప్రత్యేక బృందం రాత్రి వేళ ఆకస్మికంగా జప్తిశివనూరులోని పలు గృహాలపై దాడులు చేసింది. అప్పట్లో 50 మందికిపైగా యువతులను అదుపులోకి తీసుకుని స్టేట్ హోమ్‌కు తరలించారు. ఈ దాడుల అనంతరం జప్తిశివనూరు వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టారు. దీంతో వ్యభిచారం కొంతవరకు సద్దుమణిగింది. తాజాగా గుట్టలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు జరిపిన విచారణలో జప్తిశివనూరు విషయం కూడా బయటపడినట్లు తెలుస్తోంది. అక్కడ దాడులు నిర్వహించిన అధికారులు జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఎస్పీ చందనాదీప్తి స్పందిస్తూ జప్తిశివనూరుతోపాటు అనుమానం ఉన్న అన్ని ప్రాంతాలపై నిఘా వేసినట్లు తెలిపారు. -
అసలు సూత్రధారులు ఎవరు?
-
మైనర్లకు ‘ఇంజెక్షన్’ ఇస్తున్నదెవరు?
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వ్యభిచార వృత్తి నివారణకు రాచకొండ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బలవంతంగా.., బతుకుదెరువు కోసం.. ఇలా పలు రకాల్లో జరుగుతున్న వ్యభిచార వృత్తికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి. ఈ వృత్తి కోసం బాలికల అక్రమ రవాణాను ఎంచుకున్నారన్న విషయం బయటపడటంతో పోలీసు యంత్రాంగం కంగుతింది. ప్రస్తుతం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంపై పోలీసులు దృష్టిపెట్టారు. కాగా, యాదగిరిగుట్టలో తరచూ పోలీసులు కార్డన్ సెర్చ్, ఇతరత్రా తనిఖీలు చేస్తున్నా ఇలాంటి అమానుష సంఘటన వెలుగు చూడటం నిఘా సంస్థల వైఫల్యమేనని విమర్శలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం పట్టుబడిన వ్యక్తి ద్వారా బాలికల అక్రమ రవాణా విషయం వెలుగు చూసినప్పటికీ దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకపోవడం వల్లే అది కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న దందాను అరికట్టడానికి ఇప్పటికే పలువురిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. అయినా అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండటం వెనుక గల వైఫల్యాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ డాక్టర్ ఎవరు? పలు ప్రాంతాల నుంచి సుమారు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను యాదగిరిగుట్ట పట్టణానికి తీసుకువస్తున్నారు. వీరిని త్వరగా వ్యభిచార వృత్తిలో దింపడానికోసం నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ముందుగా ఇతరులకు అనుమానం రాకుండా స్థానికంగా బాలికలను చదివించి, వారికి 12 సంవత్సరాలు రాగానే శరీర పెరుగుదలకు ఇంజెక్షన్లు ఇస్తున్న విషయాన్ని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వెల్లడించారు. కాగా, వ్యభిచార గృహాలతో సంబంధం పెట్టుకున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడు రూ.20 వేల నుంచి రూ.50 వేలు తీసుకుని 12 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంజెక్షన్ ఇవ్వడంవల్ల చిన్న వయసులో ఉన్న పిల్లలు యుక్తవయసు ఉన్న అమ్మాయిల్లా కనిపించడంతో పాటు వారి శరీర ఎదుగుదలలో కూడా భారీ మార్పులు వస్తాయి. అసలు ఈ ఇంజెక్షన్ ఇస్తున్న వైద్యుడు యాదగిరిగుట్టకు చెందిన వ్యక్తా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇస్తున్నాడా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వైద్యుడిని పట్టుకుని విచారిస్తే ఇప్పటి వరకు ఎంత మందికి ఇంజెక్షన్లు ఇచ్చారనేది తేలుతుందని అంటున్నారు. అసలు సూత్రధారులు ఎవరు? చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నది ఎవరు? అనే అంశం పోలీసులను వెంటాడుతోంది. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్న వ్యభిచార నిర్మూలన ఒక్కరోజుతో అంతమయ్యేది కానప్పటికీ నివారణ కోసం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడంలేదు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి చిన్నారుల అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్లు 2015లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కేసు నమోదైంది. శంకర్‌తో పాటు కంసాని యాదగిరి అనే వ్యక్తి పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. యాదగిరి, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట శివారులో వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తుంటాడు. ఇప్పటివరకు ఇక్కడి ప్రజలకు ఈ విషయం మాత్రమే తెలుసు. కానీ శంకర్‌తో పాటు యాదగిరి సైతం చిన్నారుల అక్రమ రవాణాలో ప్రధాన వ్యక్తి అని తాజా విచారణలో తెలిసింది. ఇదిలా ఉండగా శంకర్ గత ఏడాది క్రితమే మరణించగా ఇటీవలనే పీడీ యాక్టు కింద యాదగిరి జైలులో ఉన్నాడు. చిన్నారుల అక్రమ రవాణా గుట్టు తెలియాలంటే యాదగిరిని విచారించాలని పలువురు అంటున్నారు. అంతేకాకుండా చిన్నారిని ఇబ్బందులకు గురిచేసిన కంసాని కల్యాణికి సంబంధించిన ఓ వ్యక్తికి సైతం అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మూడున్నర ఏళ్ల క్రితమే చర్యలు తీసుకుని ఉంటే.. మూడున్నర ఏళ్ల క్రితమే సికింద్రాబాద్‌లో నమోదైన కేసు నేపథ్యంలో అక్రమ రవాణా ముఠాపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత దారుణాలు జరిగేవి కాదని వివిధ స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. యాదగిరిగుట్ట కేంద్రంగా సాగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యాపారానికి చెక్ పెట్టాలంటే వ్యభిచార గృహాల నిర్వాహకులకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని ఆ సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. పోలీసుల అదుపులో ఆర్ఎంపీ డాక్టర్? వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల నిర్వాహకులపై రౌడీషీట్ సాక్షి, యాదాద్రి: బాలికలు త్వరగా యుక్త వయసులోకి రావడానికి ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు ఇచ్చాడనే అనుమానంతో యాదగిరిగుట్టకు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాలికలను కొనుగోలు చేసి వ్యభిచార వృత్తిలోకి దించుతున్న నిర్వాహకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 11మంది బాలికలను కాపాడిన నేపథ్యంలో వారికి ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో వ్యభిచారం నిర్వహిస్తున్నవారితో సంబంధాలు కలిగి ఉన్న ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని నిజానిజాలు తెలుసుకోవడానికి అతడిని విచారిస్తున్నట్లు తెలిసింది. ఎంత మంది పిల్లలకు ఇంజక్షన్లు ఇచ్చారు, ఈ దారుణం వెనుక ఎవరెవరి హస్తం ఉంది, ఏ మేరకు డబ్బులు చేతులు మారుతాయి.. వంటి పలు అంశాలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా పోలీసులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. లాడ్జీలపై నిఘా తీవ్రతరం యాదగిరిగుట్ట, వడాయిగూడెం, భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో గల లాడ్జీలు, రిసార్ట్స్లపై దాడులు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించిన కొన్ని లాడ్జీలను సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై ఇప్పటికే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. రెండు కంటే ఎక్కువసార్లు కేసులు నమోదైన వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇళ్ల మధ్య గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని కూడా గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు -
వ్యభిచార ముఠా చెర వీడిన అమ్మాయిలు
న్యూఢిల్లీ/వారణాసి: అంతర్జాతీయ వ్యభిచార ముఠా చెర నుంచి 16 మంది నేపాలీలుసహా 18 మంది అమ్మాయిలను ఢిల్లీ, వారణాసి నేర విభాగం పోలీసులు రక్షించారు. అమ్మాయిలనందరినీ గల్ఫ్ దేశాలకు అక్రమంగా తరలించి వ్యభిచార ఊబిలో దించాలని ఓ అంతర్జాతీయ ముఠా కుట్రపన్నింది. ఈ కుట్రను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టుచేసి ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలను సహాయ శిబిరాలకు, నేపాల్ రాయబార కార్యాలయానికి పంపనున్నట్లు ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమన్ చీఫ్ స్వాతి మలివాల్ మీడియాతో చెప్పారు. అమ్మాయిలను ముఠా నిర్భంధించిన ఇంటిలో 68 పాస్‌పోర్టులు దొరికాయని, వీటిలో ఏడు భారత పాస్‌పోర్టులని స్వాతి పేర్కొన్నారు. ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి కొందరు నేపాలీ అమ్మాయిలను ముఠా ముందుగా వారణాసికి తీసుకొచ్చింది. వీరిలోంచి ఇద్దరు అమ్మాయిలు జూలై మొదటివారంలో తప్పించుకుని నేపాల్ పోలీసులకు, నేపాల్ ఎంబసీకి సమాచారమిచ్చారు. ఎంబసీ ఇచ్చిన వివరాలతో పోలీసులు వారణాసిలో ఆరేడు చోట్ల సోదాలుచేసి ముఠాతో సంబంధమున్న జైసింగ్ అనే వ్యక్తిని అరెస్టుచేశారు. ఇతను ఇచ్చిన సమాచారంతో వారణాసి, ఢిల్లీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు అమ్మాయిలను రక్షించారు. -
కఠిన శిక్షలతోనే నియంత్రణ
సాక్షి, హైదరాబాద్: మానవ అక్రమ రవాణాను పోలీస్ శాఖతో పాటు అన్ని విభాగాలు సంయుక్తంగా నియంత్రించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దారుణమైన నేరంగా మానవ అక్రమ రవాణా ఆందోళన కలిగిస్తోందని, చిన్నారులు జీవితాంతం బానిసలుగా బతకాల్సిన పరిస్థితి తలెత్తుతోందని, ఇలాంటి నేరాలు సహించలేనివని పేర్కొన్నారు. రాష్ట్ర సీఐడీ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆ«ధ్వర్యంలో రూపొందించిన ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్–విక్టిమ్ సెంట్రిక్ ఇన్వెస్టిగేషన్ మ్యాన్యువల్’ను సునీతాకృష్ణన్, సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్‌తో కలసి సోమవారం రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో డీజీపీ ఆవిష్కరించారు. ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న నేరగాళ్లకు శిక్షపడేలా చేస్తేనే ఈ నేరాలపై నియంత్రణ ఉంటుందన్నారు. వ్యభిచారమే కాకుండా నిర్బంధ కార్మికులుగా వేలాది మంది యువత, చిన్నారులు నలిగిపోతున్నారని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాల్సి ఉందన్నారు. అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రాల వారీగా వ్యవస్థీకృతంగా ఈ నేరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరాల్లో కీలకమైన వారికి శిక్షలు పడేలా చేస్తేనే బాధితులకు న్యాయం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. ప్రజ్వల సంస్థ 20 ఏళ్లుగా ఈ నేరాలపై విశేషంగా కృషిచేస్తోందని, వేలాది మంది బాధితులను అక్కున చేర్చుకొని వారికి అన్ని విధాలుగా సాయం చేస్తోందని ప్రశంసించారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసి, ప్రత్యేక చట్టం వచ్చేలా చేశారని కొనియాడారు. ఇటీవల పార్లమెంట్లో కొత్త ట్రాఫికింగ్ నియంత్రణ చట్టానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు. బాధితులకు రక్షణ, పునరావాసం కల్పించేలా చట్టంలో ఉందని, దీనిపై ప్రతి రాష్ట్రంలో యాంటీ ట్రాఫికింగ్ బ్యూరోలు ఏర్పాటయ్యే అవకాశముందన్నారు. హైదరాబాద్ సౌత్జోన్లో ఇటీవల బాలకార్మిక వ్యవస్థ నుంచి 250 మందిని విముక్తి చేశామని, ఈ కేసులో 14 ఏళ్ల పాటు నిందితులకు శిక్షపడిందని డీజీపీ గుర్తుచేశారు. ముస్కాన్‌తో సత్ఫలితాలు.. సీఐడీ నేతృత్వంలో 2015 నుంచి కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 25,834 మందిని కాపాడినట్లు మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా తెలిపారు. వీరిలో 12,483 మందిని తల్లిదండ్రులకు అప్పగించామని, మిగిలిన వారిని రెస్క్యూ హోమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు మానవ అక్రమ రవాణా కింద 1,397 కేసులు నమోదు కాగా, 1,413 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శాంతి భద్రతల అదనపు డీజీపీ జితేందర్, ఆర్గనైజేషన్ అదనపు డీజీపీ రాజీవ్ రతన్ పాల్గొన్నారు. ప్రేమించి మోసం చేశాడు ‘నేను పదోతరగతిలో ఉండగా ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిసి నాకు పెళ్లి చేయాలని భావించారు. దానికి నేను ఒప్పుకోలేదు. దీంతో హైదరాబాద్‌కు వచ్చాను. ఇంటి తాళం లేకపోయే సరికి బయటే ఉన్నాను. దీంతో అతడు వచ్చి తన ఇంటికి వెళ్దామని చెప్పి అన్నంలో మత్తుమందు కలిపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడి స్నేహితులు కూడా దాడిచేసి, వ్యభిచార కూపంలో నన్ను అమ్మేశాడు. పారిపోయేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా గాయపరిచేవారు. సీఐడీ అధికారులు వచ్చి కాపాడారు. నాతో పాటు మరో 25 మందిని కాపాడారు. ఆ తర్వాత ప్రజ్వల హోంకు తరలించారు. ఇప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాను. – బాధితురాలు దివ్య ప్రేమగా మాట్లాడి అమ్మేసింది ‘నా తల్లిదండ్రులు మద్యానికి బానిసయ్యారు. ఏ రోజూ నన్ను పట్టించుకోలేదు. దీంతో ఇంటి నుంచి పారిపోయేందుకు బస్టాండ్‌కు వచ్చా. అక్కడ ఓ మహిళ నాతో ప్రేమగా మాట్లాడి కూతురిలా చూసుకుంటానని చెప్పి మోసం చేసి వ్యభిచారకూపంలో అమ్మేసింది. దీంతో నా జీవితం ముగిసిపోయిందనుకున్నా. కానీ సీఐడీ అధికారులు వచ్చి కాపాడారు. ప్రజ్వల హోంకు వచ్చాక టైలరింగ్, వెల్డింగ్ నేర్చుకున్నాను. నాలాగా మోసపోయిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాను’. – బాధితురాలు మనీషా, హైదరాబాద్ హోంమంత్రి గ్రీన్‌చాలెంజ్ స్వీకరించిన డీజీపీ సాక్షి, హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించిన గ్రీన్ చాలెంజ్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి స్వీకరించారు. ఈమేరకు రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవారం మొక్కలు నాటారు. అదనపు డీజీపీ జితేందర్‌తో కలిసి మొక్కలు నాటి ఖమ్మం, నిజామాబాద్ కమిషనర్లకు, జగిత్యాల ఎస్పీకి మహేందర్‌రెడ్డి గ్రీన్ చాలెంజ్ చేశారు. మొక్కనాటిన హీరో మహేశ్‌బాబు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపుమేరకు పోలీస్ అకాడమీలో సోమవారం హరితహారం నిర్వహించారు. అకాడమీలోనే షూటింగ్లో ఉన్న హీరో మహేశ్‌బాబును మొక్క నాటాల్సిందిగా అకాడమీ డైరెక్టర్ సంతోష్‌మెహ్రా ఆహ్వానించారు. దీనితో మహేష్‌బాబుతో పాటు శిక్షణలో ఉన్న ట్రైనీ సిబ్బంది ఒక్కొక్కరు 5 మొక్కల చొప్పున నాటారు. ఇలా మొత్తం 3వేల మొక్కలు నాటినట్టు సంతోష్‌మెహ్రా తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.