సెకనుకో చిన్నారిపై కీచకం | Every second child in Maharashtra, Madhya Pradesh, Gujarat victim of sexual abuse: NGO report | Sakshi
Sakshi News home page

సెకనుకో చిన్నారిపై కీచకం

Published Thu, Nov 24 2016 10:05 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM

సెకనుకో చిన్నారిపై కీచకం - Sakshi

సెకనుకో చిన్నారిపై కీచకం

మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఎంపీల్లో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ: భయంకర వాతావరణంలో బాల్యం బిక్కుబిక్కుమంటోంది. చిన్నారులు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారు. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. సెకనుకో చిన్నారి వేధింపుల బారిన పడుతోంది.

ప్లాన్‌ ఇండియా అనే ఒక ఎన్జీవో నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ‘క్లిష్ట పరిస్థితుల్లో చిన్నారులు’పేరిట ఎన్జీవో ఒక నివేదికను వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడు నెలలపాటు 2 వేల సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి 1500 మంది సర్వే నిర్వహించారు. మొత్తం మానవ అక్రమ రవాణా నేరాల్లో అండమాన్‌, నికోబార్‌ దీవులు, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ల్లో 61 శాతం నేరాలు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో అదృశ్యమైన చిన్నారుల్లో 48 శాతం మంది ఆచూకీ లభించడంలేదు.

రాజస్థాన్‌లో బాల్య వివాహాలు తీవ్రంగా ఉన్నాయి. 20–24 ఏళ్ల మహిళలను సర్వే చేయగా వారిలో 57.6 శాతం మంది వివాహాలు 18 ఏళ్ల కంటే ముందే జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో 54.9, హర్యానాలో 28 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో బాలకార్మికులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 43 లక్షల మంది బాలకార్మికుల్లో 18 లక్షల మంది ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement