
హైదరాబాద్: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టైన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు వరుసగా రెండో రోజు విచారించారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్కెట్ ఇన్‌స్పెక్టర్ మట్టయ్య నేతృత్వంలోని బృందం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో జగ్గారెడ్డిని ప్రశ్నించింది.
మరోవైపు విచారణ సందర్భంగా జగ్గారెడ్డి తరఫు న్యాయవాది మధ్యాహ్నం వరకు మాత్రమే ఉన్నారు. జగ్గారెడ్డిని శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు విచారించి అటు తర్వాత జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న జగ్గారెడ్డిని మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.