చిన్నారులపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పుడుతున్న ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. బాలికలపై అత్యాచారం, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఇప్పటికే జీవిత ఖైతు అనుభవిస్తున్న పీటర్ గెరార్డ్ స్కల్లీ అనే ఆస్ట్రేలియా వ్యక్తికి ఇది రెండో నేరం. అతను 18 నెలలు వయసు ఉన్న చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో స్కల్లీకి ఈ శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు.
ఈ తీర్పు ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడేవారికి, మానవ అక్రమ రవాణాదారులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ చిన్నారులపై లైంగిక వేదింపులకు అడ్డగా మారిందన్నారు. దేశంలోని పేదరికం, ఆగ్లంలో మంచి పట్టు, హైస్పీడ్ ఇంటర్నెట్ వెసులుబాటు తదితరాలు ఈ దారుణమైన ఘటనలకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు.
నిందితుడు స్కల్లీ చిన్నారులపై అత్యాచారాలు, మానవ అక్రమ రవాణాతో సహా సుమారు 60 నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు ఆస్ట్రేలియా కగాయన్ డి ఓరో కోర్టు నిందితుడు స్కల్లీ అతని ముగ్గురు సహచరులకు 129 ఏళ్ల జైలు శిక్ష విధించగా అతడి స్నేహితురాలికి 126 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
(చదవండి: ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు’.. బందీగా మారిన భారత నావికుడు)
Comments
Please login to add a commentAdd a comment