Child sexual abuse
-
ఆ కంటెంట్ తొలగించకుంటే చర్యలే
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్ వ్యాప్తిపై కేంద్రం కన్నెర్రజేసింది. దాన్ని తక్షణం తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికలు ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రాంలకు ఈ మేరకు శుక్రవారం నోటీసులిచి్చంది. ‘భారత ఇంటర్నెట్ పరిధిలో వాటిని తక్షణం శాశ్వతంగా తొలగించండి. లేదా డిజెబుల్ చేయండి‘ అని ఆదేశించింది. లేదంటే ఐటీ చట్టంలో 79వ సెక్షన్ కింద వారికి కలిగించిన రక్షణను తొలగిస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరించారు. నిబంధనల మేరకు పౌరులకు నమ్మకమూ, సురక్షితమైన ఇంటర్నెట్ను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష
చిన్నారులపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పుడుతున్న ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. బాలికలపై అత్యాచారం, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఇప్పటికే జీవిత ఖైతు అనుభవిస్తున్న పీటర్ గెరార్డ్ స్కల్లీ అనే ఆస్ట్రేలియా వ్యక్తికి ఇది రెండో నేరం. అతను 18 నెలలు వయసు ఉన్న చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో స్కల్లీకి ఈ శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ తీర్పు ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడేవారికి, మానవ అక్రమ రవాణాదారులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ చిన్నారులపై లైంగిక వేదింపులకు అడ్డగా మారిందన్నారు. దేశంలోని పేదరికం, ఆగ్లంలో మంచి పట్టు, హైస్పీడ్ ఇంటర్నెట్ వెసులుబాటు తదితరాలు ఈ దారుణమైన ఘటనలకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. నిందితుడు స్కల్లీ చిన్నారులపై అత్యాచారాలు, మానవ అక్రమ రవాణాతో సహా సుమారు 60 నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు ఆస్ట్రేలియా కగాయన్ డి ఓరో కోర్టు నిందితుడు స్కల్లీ అతని ముగ్గురు సహచరులకు 129 ఏళ్ల జైలు శిక్ష విధించగా అతడి స్నేహితురాలికి 126 ఏళ్లు జైలు శిక్ష విధించింది. (చదవండి: ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు’.. బందీగా మారిన భారత నావికుడు) -
లైంగిక వేధింపులకు చెక్ పెట్టేందుకు ప్రణాళిక
న్యూఢిల్లీ: చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు చెక్ పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలతో చర్చించి ఓ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్ఆర్డీ) శాఖ వెల్లడించింది. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై సహచర విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చెడు స్పర్శకు, ఆత్మీయ స్పర్శకు మధ్య ఉన్న భేదం గురించి పిల్లలకు పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలని భావిస్తున్నట్లు హెచ్ఆర్డీ అధికారి ఒకరు తెలిపారు. -
లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం ఈ-బాక్స్
న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు ఆన్లైన్ ఫిర్యాదు బాక్స్‌ను కేంద్ర మంత్రి మేనకా గాంధీ ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులకు వీలు కల్పించే పోస్కో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్) ఈ-బాక్స్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. అయితే గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 70 శాతం పిల్లలకు ఈ అవకాశం లభిస్తుందా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. ఎన్సీపీసీఆర్ వెబ్సైట్ ద్వారా బాధితులైనా, పెద్దలెవరైనా ఫిర్యాదులు చేయొచ్చు. చిన్న పిల్లలకు అర్థమయ్యే రీతిలో బొమ్మల రూపంలో దీంట్లో వివరణ ఉంది. -
కీచక టీచర్
చిన్నారితో అసభ్య ప్రవర్తన పోలీసుల అదుపులో నిందితుడు విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉపాధ్యాయుడు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మాదన్నపేట డీ ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం... సంతోష్‌నగర్ డివిజన్ నెహ్రూనగర్‌కు చెందిన చిన్నారి (7) స్థానిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. సైదాబాద్‌లోని ఓ మద ర్సాలో అరబిక్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఇర్ఫాన్ అహ్మద్ సిద్ధిఖీ (37) దరబ్జంగ్ కాలనీలోని తన ఇంట్లో అరబిక్ తరగతులు నిర్వహిస్తున్నాడు. అరబిక్ నేర్చుకునేందుకు చిన్నారిని తల్లిదండ్రులు ఇతని వద్దకు పంపుతున్నారు. ఇదిలా ఉండగా.. నాలుగు రోజులుగా చిన్నారి ముభావంగా ఉండటంతో గమనించిన పాఠశాల ఉపాధ్యాయురాలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు శుక్రవారం కుమార్తెను ఏమైందని అడుగగా ఉపాధ్యాయుడు ఇర్ఫాన్ నాలుగు రోజుల కిందట తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఆరేళ్ల చిన్నారిపై టీచర్ లైంగికదాడి