న్యూఢిల్లీ: చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు చెక్ పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలతో చర్చించి ఓ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్‌ఆర్డీ) శాఖ వెల్లడించింది. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై సహచర విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చెడు స్పర్శకు, ఆత్మీయ స్పర్శకు మధ్య ఉన్న భేదం గురించి పిల్లలకు పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలని భావిస్తున్నట్లు హెచ్‌ఆర్డీ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment