chek
-
ఆ తర్వాత నా బలం మొత్తం పోయినట్లనిపించింది
‘‘భిన్నమైన పాత్రలు చేయాలని ఆలోచించి స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకోను. నేను సెట్‌కి వెళ్లే ప్రతిరోజూ ఎగ్జయిటింగ్‌గా ఉండాలి. ఆ ఎగ్జయిట్మెంట్ లేకపోతే సరిగ్గా పని చేయలేం. కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి. కొన్ని వర్కౌట్ కావు. కానీ జర్నీ ఎప్పుడూ ఎగ్జయిటింగ్‌గా ఉండాలి’’ అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. నితిన్, రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా రకుల్ చెప్పిన విశేషాలు. ► ‘చెక్’లో మానస అనే లాయర్ పాత్ర చేశాను. మొదట భయపడే మనస్తత్వం ఉన్నా చివర్లో ధైర్యంగా మారుతుంది నా పాత్ర. ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేశాను. చంద్రశేఖర్ యేలేటిగారి సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన డైరెక్షన్లో నటించడం సంతోషంగా ఉంది. క్యారెక్టర్స్ ఎలా ఉండాలి? ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలని చాలా వర్క్ చేస్తారు. సెట్లో తెలుగులో మాట్లాడేవాళ్లం. ఓ రోజు చందూగారు సీ¯Œ ని ఇంగ్లీష్‌లో చెబుతుంటే ‘ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారెందుకు’ అని నవ్వుకున్నాం. ఈ మధ్య హిందీ సినిమా చిత్రీకరణలో అర్జు¯Œ కపూర్ అయితే ‘నీ పేరులో ప్రీత్ సింగ్ తీసేస్తే నువ్వు తెలుగమ్మాయివే’ అని అన్నారు. ► కోవిడ్ ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందరికీ చెప్పింది. ఫిట్నెస్ చాలా అవసరం అని తెలియజేసింది. నాకూ కోవిడ్ వచ్చింది. అయితే నన్ను పెద్ద ఇబ్బంది పెట్టలేదు. రెండు వారాల తర్వాత మళ్లీ నా పని చేసుకోవడం మొదలుపెట్టాను. కానీ కోవిడ్ వచ్చి వెళ్లిన తర్వాత నా బలం మొత్తం పోయినట్టు అనిపించింది. కోవిడ్ మనకు రాకుండా ఉండటమే కాదు.. మనం వేరే వాళ్లకు అంటించకూడదు అనే బా«ధ్యతతో అందరూ ఉండాలి. ► క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేశాను. అందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. మేకప్ లేకుండా నటించాను. హిందీలో అర్జు¯Œ కపూర్‌తో ‘సర్దార్ గ్రాండ్స¯Œ ’లో సౌతిండియ¯Œ అమ్మాయిగా, ఆయుష్మా¯Œ ఖురానాతో ‘డాక్టర్ జీ’లో గైనకాలజిస్ట్‌గా, అజయ్ దేవగణ్‌తో ‘మే డే’లో పైలెట్ పాత్ర చేస్తున్నాను. తమిళంలో ‘అయలా¯Œ ’ సినిమా చేశాను. -
‘చెక్’ పెట్టేందుకు నితిన్ రెడీ..
‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ అని ప్రియా ప్రకాశ్ వారియర్ పాట అందుకుంటే ‘మార్నింగ్ అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను. ఫుల్‌మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను’ అని నితిన్ అన్నారు. నితిన్ , ప్రియా ప్రకాశ్‌ల ఈ ప్రేమ పాట ‘చెక్’ సినిమా కోసమే. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ లీడ్ రోల్స్‌లో వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. ఈ సినిమాలోని ‘నిన్ను చూడకుండా’ అనే పాటను గోవాలో చిత్రీకరించారు. ‘‘నితిన్ , ప్రియా ప్రకాశ్ వారియర్లపై చిత్రీకరించిన ఈ పాటతో సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ పాటకు కల్యాణీ మాలిక్ సంగీతం అందించారు. శ్రీమణి లిరిక్స్ ఇచ్చారు. కథ ప్రకారం సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉంటుంది. ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. -
లైంగిక వేధింపులకు చెక్ పెట్టేందుకు ప్రణాళిక
న్యూఢిల్లీ: చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు చెక్ పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలతో చర్చించి ఓ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్ఆర్డీ) శాఖ వెల్లడించింది. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై సహచర విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చెడు స్పర్శకు, ఆత్మీయ స్పర్శకు మధ్య ఉన్న భేదం గురించి పిల్లలకు పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలని భావిస్తున్నట్లు హెచ్ఆర్డీ అధికారి ఒకరు తెలిపారు. -
5 పైసలకు చెక్కు ఇచ్చాడు
మైసూరు: కోట్ల రూపాయల ఎగవేసే బడాబాబులతో మహా మర్యాదగా ప్రవర్తించే బ్యాంకులు సామాన్యులతో మాత్రం రూల్స్ రూల్సే అంటాయి. అణా పైసలతో సహా చెల్లిస్తే గానీ పనులు చేయవు. ఇలాంటిదే ఈ విడ్డూరపు ఘటన. క్రెడిట్‌కార్డు సేవలను నిలిపివేయడానికి ఎస్బీఐ ఖాతాదారు నుంచి ఐదు పైసలు చెక్‌ను తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మైసూరు నగరంలోని విజయనగర్‌కు చెందిన సతీష్ ఐదేళ్ల క్రితం రూ.25 వేలు డిపాజిట్ కట్టి ఎస్బీఐ నుంచి క్రెడిట్ కార్డు పొందారు. అయితే కార్డు బిల్లులు భరించలేక ఆయన కార్డును బ్లాక్ చేయడానికి నిర్ణయించుకున్నారు. దీంతో బ్యాంకు అధికారులకు విషయం తెలపడంతో కార్డు లావాదేవీలను పరిశీలించిన వారు కార్డు బిల్లుకు సంబంధించి ఇంకా ఐదు పైసలు బాకీ ఉన్నారని ఐదు పైసలు చెల్లిస్తేనే క్రెడిట్‌కార్డు సేవలను స్తంభింపచేస్తామని చెప్పారు. అయితే మొదట్లో బ్యాంకు అధికారులు తనను ఆటపట్టిస్తున్నారనుకున్న సతీష్ మరోసారి కార్డును బ్లాక్ చేయాలని కోరినా అదే సమాధానం ఎదురైంది. అయితే ఎప్పుడో చలామణిలో లేకుండా పోయిన ఐదు పైసలను ఎక్కడి నుంచి తేవాలో తెలియక సతమతమవుతున్న సతీష్‌కు చెక్ ద్వారా ఆ బకాయిని చెల్లించవచ్చని బ్యాంకు అధికారులు సూచించారు. దీంతో ఐదు పైసలకు చెక్ రాసిచ్చారు. ఇందుకు తనకు రూ.3 ఖర్చయినట్లు సతీష్ తెలిపారు. -
ప్రధానమంత్రి బీమాయోజన చెక్కు అందజేత
మల్యాల: మల్యాల మండలంలోని మ్యాడంపల్లికి చెందిన అల్లె మల్లయ్య ప్రమాద వశాత్తు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్‌మూర్తి, తహపీల్దార్ శ్రీహరిరెడ్డి రూ. 2లక్షల చెక్కును అందజేశారు. మల్లయ్య తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణం తీసుకున్నాడు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రూ. 12 బీమా చెల్లించాడు. ఈ ఏడాది జనవరిలో మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, బీమా మొత్తం రూ. 2లక్షల అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఖాతాదారులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ. 12 వందలు ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం కింద రూ. 330 చెల్లించాలని అన్నారు. బీమాతో ఖాతాదారుడి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని, ఖాతాదారులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌మూర్తి, తహసీల్దార్ శ్రీహరిరెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాజేంద్రప్రసాద్, సీహెచ్.గోపాల్ పాల్గొన్నారు.