‌‘చెక్‌’ పెట్టేందుకు నితిన్ రెడీ.. | CHECK Movie First Glimpse is out | Sakshi
Sakshi News home page

నితిన్‌ ‘చెక్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి

Published Sat, Feb 13 2021 6:23 AM | Last Updated on Sat, Feb 13 2021 8:04 AM

CHECK Movie First Glimpse is out - Sakshi

‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ అని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ పాట అందుకుంటే ‘మార్నింగ్‌ అవ్వకముందే వెలుగుల్తో వచ్చేస్తాను. ఫుల్‌మూన్‌  లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను’ అని నితిన్‌  అన్నారు. నితిన్‌ , ప్రియా ప్రకాశ్‌ల ఈ ప్రేమ పాట ‘చెక్‌’ సినిమా కోసమే. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో నితిన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ లీడ్‌ రోల్స్‌లో వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘చెక్‌’.

ఈ సినిమాలోని ‘నిన్ను చూడకుండా’ అనే పాటను గోవాలో చిత్రీకరించారు. ‘‘నితిన్‌ , ప్రియా ప్రకాశ్‌ వారియర్‌లపై చిత్రీకరించిన ఈ పాటతో సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ పాటకు కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించారు. శ్రీమణి లిరిక్స్‌ ఇచ్చారు. కథ ప్రకారం సినిమాలో ఒక్క పాట మాత్రమే ఉంటుంది. ఈ సినిమాను ఈ నెల 26న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement