ఆ తర్వాత నా బలం మొత్తం పోయినట్లనిపించింది | Rakul Preet Sing Talking About Check movie review | Sakshi
Sakshi News home page

ఆ తర్వాత నా బలం మొత్తం పోయినట్లనిపించింది

Published Sun, Feb 28 2021 5:33 AM | Last Updated on Sun, Feb 28 2021 5:33 AM

Rakul Preet Sing Talking About Check movie review - Sakshi

‘‘భిన్నమైన పాత్రలు చేయాలని ఆలోచించి స్క్రిప్ట్స్‌ ఎంపిక చేసుకోను. నేను సెట్‌కి వెళ్లే ప్రతిరోజూ ఎగ్జయిటింగ్‌గా ఉండాలి. ఆ ఎగ్జయిట్‌మెంట్‌ లేకపోతే సరిగ్గా పని చేయలేం. కొన్ని సినిమాలు వర్కౌట్‌ అవుతాయి. కొన్ని వర్కౌట్‌ కావు. కానీ జర్నీ ఎప్పుడూ ఎగ్జయిటింగ్‌గా ఉండాలి’’ అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. నితిన్, రకుల్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోహీరోయిన్లుగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్‌’. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా రకుల్‌ చెప్పిన విశేషాలు.

► ‘చెక్‌’లో మానస అనే లాయర్‌ పాత్ర చేశాను. మొదట భయపడే మనస్తత్వం ఉన్నా చివర్లో ధైర్యంగా మారుతుంది నా పాత్ర. ఈ పాత్రను చాలా ఎంజాయ్‌ చేశాను. చంద్రశేఖర్‌ యేలేటిగారి సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన డైరెక్షన్‌లో నటించడం సంతోషంగా ఉంది. క్యారెక్టర్స్‌ ఎలా ఉండాలి? ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉండాలని చాలా వర్క్‌ చేస్తారు. సెట్లో తెలుగులో మాట్లాడేవాళ్లం. ఓ రోజు చందూగారు సీ¯Œ ని ఇంగ్లీష్‌లో చెబుతుంటే ‘ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారెందుకు’ అని నవ్వుకున్నాం. ఈ మధ్య హిందీ సినిమా చిత్రీకరణలో అర్జు¯Œ  కపూర్‌ అయితే ‘నీ పేరులో ప్రీత్‌ సింగ్‌ తీసేస్తే నువ్వు తెలుగమ్మాయివే’ అని అన్నారు.

► కోవిడ్‌ ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందరికీ చెప్పింది. ఫిట్‌నెస్‌ చాలా అవసరం అని తెలియజేసింది. నాకూ కోవిడ్‌ వచ్చింది. అయితే నన్ను పెద్ద ఇబ్బంది పెట్టలేదు. రెండు వారాల తర్వాత మళ్లీ నా పని చేసుకోవడం మొదలుపెట్టాను. కానీ కోవిడ్‌ వచ్చి వెళ్లిన తర్వాత నా బలం మొత్తం పోయినట్టు అనిపించింది. కోవిడ్‌ మనకు రాకుండా ఉండటమే కాదు.. మనం వేరే వాళ్లకు అంటించకూడదు అనే బా«ధ్యతతో అందరూ ఉండాలి.

► క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేశాను. అందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. మేకప్‌ లేకుండా నటించాను. హిందీలో అర్జు¯Œ  కపూర్‌తో ‘సర్దార్‌ గ్రాండ్‌స¯Œ ’లో సౌతిండియ¯Œ  అమ్మాయిగా, ఆయుష్మా¯Œ  ఖురానాతో ‘డాక్టర్‌ జీ’లో గైనకాలజిస్ట్‌గా, అజయ్‌ దేవగణ్‌తో ‘మే డే’లో పైలెట్‌ పాత్ర చేస్తున్నాను. తమిళంలో ‘అయలా¯Œ ’ సినిమా చేశాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement