center government
-
చిరాగ్ పాశ్వాన్‌కు జెడ్– కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ/పాట్నా: ఎన్డీయే కీలక భాగస్వామి, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆయనకు జెడ్– కేటగిరీ భద్రత కల్పించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు ఇప్పటిదాకా శశస్త్ర సీమాబల్‌కు చెందిన చిన్న బృందం రక్షణ కల్పించేది. 41 ఏళ్ల చిరాగ్ పాశ్వాన్.. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు కూడా. లోక్ జనశక్తి బిహార్‌లో బీజేపీ, జేడీయూలతో పొత్తుపెట్టుకొని పోటీచేసిన ఐదు లోక్‌సభ స్థానాలను నెగ్గిన సంగతి తెలిసిందే. -
2026 మార్చి నాటికి పోలవరం పూర్తి చేయాలని రాష్ట్రానికి చెప్పిన కేంద్రం
-
కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: వరసగా రెండేళ్లలో కేంద్రప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో వాటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ కొత్త బడ్జెట్ కాలపరిధిలో వాటిని పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో రాష్ట్రంలో మెదక్–అక్కన్నపేట, మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను రైల్వే శాఖ పూర్తి చేసి అందుబాటులోకి తెచి్చంది. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో పట్టాలెక్కించింది. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరపు పూర్తి కాల బడ్జెట్లో ఆ నిధులను కొంత సవరించే అవకాశం ఉంది. ఆ నిధులతో అవి ఈ ఆర్థిక సంవత్సరంలో తుదిదశకు చేరే అవకాశం ఉంది. కాజీపేట–బల్లార్షా మూడో లైన్ పనుల్లో వేగం ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే ప్రధాన లైన్లో ఇది కీలకం. నిత్యం 275 వరకు ప్రయాణికుల రైళ్లు, 180 వరకు సరుకు రవాణా రైళ్లు పరుగుపెట్టే ఈ మార్గంలో మూడో లైన్ అత్యవసరం. అది అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు చిక్కుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు.ఇందులో మహారాష్ట్ర– తెలంగాణల్లో కొనసాగే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. గత రెండేళ్లుగా పనుల్లో వేగం కారణంగా చాలా సెక్షన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 151కి.మీ. పనులు పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని కొంత సవరించే అవకాశం ఉంది.కాజీపేట– విజయవాడ మూడో లైన్ పనులకూ మోక్షం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు ఎట్టకేలకు 2012–13లో మంజూరైంది. కానీ, పనుల నిర్వహణ మాత్రం మందకొడిగా సాగుతూ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగారూ.647 కోట్లçను కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు ఓ రూపునకు వచి్చంది. పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీని అంచనా వ్యయం రూ.1,952 కోట్లు.’మనోహరాబాద్–కొత్తపల్లి’.. వచ్చే ఏడాదికి కొలిక్కిసిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ. కాగా ఇప్పటి వరకు 76 కి.మీ. పనులు పూర్త య్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1375 కోట్లు. గతేడాది బడ్జెట్లో దీనికి రూ.185 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు. నిధులకు కొరత లేనందున వచ్చే ఏడాది కాలంలో పనులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ’బీబీనగర్– గుంటూరు’ పనులు ఇక స్పీడే సికింద్రాబాద్–విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ లైన్ గా నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గత మధ్యంతర బడ్జెట్లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పను లు మొదలయ్యాయి. -
52 మందితో మోడీ క్యాబినెట్
-
విశాఖ ఉక్కుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి... కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వంట గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గింపు. నారీశక్తికి లబ్ధి చేకూరుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ..ఇంకా ఇతర అప్డేట్స్
-
రైతులతో కేంద్రం చర్చల్లో పురోగతి
-
సామాన్యులకు మోడీ సర్కారు ఊరట..
-
కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
-
మహిళలకు ప్రత్యేక వరాలు
-
సిమిపై మరో ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ శాంతి, మత సామరస్యానికి భంగం కలిగిస్తున్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)పై నిషేధాన్ని కేంద్ర ప్రభ్వుం మరో అయిదేళ్లు పొడిగించింది. ఈ విషయాన్ని హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం ‘ఎక్స్’లో ప్రకటించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)కింద సిమిని చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా సుమారు 10 రాష్ట్రాల వినతి మేరకు.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా మొదటిసారిగా కేంద్రం 2001లో సిమిని నిషేధించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 1977లో సిమి ఏర్పాటైంది. భారత్‌ను ముస్లిం దేశంగా మార్చాలన్న అజెండాతో పనిచేస్తున్నట్లు ఈ సంస్థపై ఆరోపణలొచ్చాయి. గత కొన్నేళ్లలో సిమి కార్యకర్తలపై ఉగ్రవాద సంబంధ 17 కేసులు నమోదు కాగా, 27 మంది సభ్యులను అరెస్ట్ చేసినట్లు హోం శాఖ తెలిపింది. -
Dr. Lasya Sai Sindhu: సమస్యను గుర్తించడమే అసలైన మందు
ఎవరికీ చెప్పుకోలేని వేదన, భావోద్వేగాల ఒత్తిడి శరీరం మీద పడుతుంది. చాలావరకు ఆరోగ్య సమస్యలు మందులతో నయం కావచ్చు. కానీ, కొన్నింటికీ ఎంతకీ పరిష్కారం దొరకకపోతే, అందుకు మూల కారణమేంటో తెలుసుకోవడానికి తగిన శోధన అవసరం. వర్టిగో (కళ్లు తిరగడం) సమస్యకు మూల కారణమేంటో తెలుసుకుంటూ చికిత్స చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ వాసి న్యూరటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధుకు కేంద్రప్రభుత్వం ఇటీవల ‘నేషనల్ అచీవర్స్ అవార్డ్ ఫర్ హెల్త్ ఎక్సలెన్స్’ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా లాస్య సాయి సింధును సాక్షి పలకరించింది. నలభైఏళ్లకు పైబడిన ఒక మహిళ... ‘మంచం మీద పడుకుంటే కళ్లు తిరుగుతున్నాయి’ అనే సమస్యతో వచ్చింది. రెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతూ మంచం మీద కాకుండా కుర్చీలో కూర్చుని నిద్రపోవడం అలవాటు చేసుకుంది. పూర్తి చికిత్స తర్వాత ఇప్పుడు మామూలుగా మం^è ం మీద నిద్రపోగలుగుతోంది. 90 శాతం మహిళలు భావోద్వేగాల ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. పదిహేనేళ్ల అబ్బాయి స్కూల్లో బెంచిమీద కూర్చున్న కాసేపటికి కళ్లు తిరిగే సమస్యతో బాధపడుతూ సరిగా చదవలేకపోతున్నాడు. చికిత్సలో అతనికి చదువుకు సంబంధించిన సమస్యనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు కూడా కారణమని తెలిసింది. పనిలో చురుకుగా ఉండే యాభైఏళ్ల వ్యక్తి రెండు నెలలుగా కళ్లు తిరుగుతున్నాయన్న సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వచ్చారు. కరోనా తర్వాత వైరల్ అటాక్ అతని మెదడు పనితీరులో సమస్యకు కారణం అయ్యిందని తేలింది. ఇలాంటివెన్నో ప్రతిరోజూ చూస్తుంటాం. నేను ఈఎన్టీ సర్జన్‌ని. వెర్టిగో అండ్ బ్యాలెన్స్ డిజార్డర్‌లో పరిశోధన చేశాను. ఈఎన్టీలోనే మరింత ఉన్నతమైన విద్యార్హత ఈ న్యూరటాలజిస్ట్. 200 మంది వర్టిగో పేషెంట్స్‌పై పరిశోధన చేసినప్పుడు నాకు ఈ విభాగంలో ఆసక్తి పెరిగింది. నాలుగేళ్లుగా న్యూరటాలజిస్ట్గా వైద్య రంగంలో సేవలందిస్తున్నాను. చేస్తున్న కృషికి గుర్తింపుతోపాటు గతంలోనూ రెండు జాతీయస్థాయి అవార్డులు అందుకున్నాను. వచ్చిన రివ్యూస్... ఈ సమస్యలో ప్రధానంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందుకని, 5–10 నిమిషాల్లో పేషెంట్ పూర్తి సమస్య అర్థం కాదు. ఈ గంట సమయంలో చేసిన చికిత్సకు రోగిలో సరైన మార్పులు రావడం, వారు ఇచ్చే రివ్యూస్.. మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. అన్ని వర్గాల్లోనూ... ఇటీవల చూస్తున్న కేసుల్లో మగవారిలోనూ సమస్య ఎక్కువ గమనిస్తున్నాం. నిజానికి ఆడవాళ్లలోనే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ, మగవారు తమ సమస్యలను బయటకు చెప్పుకోరు. భావోద్వేగాలను బయటకు వెలిబుచ్చరు. ఈ సమస్య వర్టిగోకు దారితీస్తుంది. మరో ఆందోళనకర సమస్య ఏంటంటే.. టీనేజ్ పిల్లల్లో వర్టిగో కనిపిస్తోంది. మానసికంగా వారు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. వీరిలో చదువుకు సంబంధించినవి, కుటుంబ సమస్యలు... కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఫ్యామిలీ కౌన్సెలింగ్ ముందు పేషెంట్‌కు సంబంధించిన అన్నిరకాల టెస్ట్ రిపోర్ట్స్ పరిశీలించి చూస్తాం, వారు చెప్పిన ఆరోగ్య సమస్యమీద వర్క్ చేస్తాం. ఆ తర్వాత ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వర్టిగో సమస్యలు పెరిగాయి కాబట్టి ఫిజికల్ హెల్త్ ఆ తర్వాత ఎమోషనల్ హెల్త్ కూడా చూస్తున్నాం. కుటుంబం కూడా ఈ సమస్య పట్ల అవగాహన పెంచుకొని, పేషెంట్‌కు సపోర్ట్‌గా ఉండాలి. ఆన్లైన్ అవగాహన కాన్ఫరెన్స్, సోషల్‌మీడియా ద్వారా కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. విదేశాల నుంచి కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకునేవారున్నారు. ముఖ్యంగా విదేశాలలో ఎమ్మెస్ చేసేవాళ్లు ఉంటున్నారు. జీవితంలో ఎవరికి తగ్గ సమస్య వారికి ఉంటుంది. దానినుంచి బయటకు రావడమే ముఖ్యం. అందుకోసం చేసే ప్రయత్నం ప్రతిరోజూ ఉంటుంది. డాక్టర్‌గా రోజు చివరలో నా నుంచి చికిత్స తీసుకున్నవాళ్లు ‘మా సమస్యకు సరైన పరిష్కారం దొరికింది’ అనుకుంటే చాలు. అదే పెద్ద అవార్డ్’’ అంటారు ఈ డాక్టర్. కోవిడ్ తర్వాత... ‘కళ్లు తిరుగుతున్నాయి..’ అనే సమస్యతో వచ్చే వారి సంఖ్య కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. గతంలో ఒత్తిడి, భావోద్వేగాలలో మార్పు కారణం అనుకునేవాళ్లం. ఆ తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కారణం అని తెలిసింది. వర్టిగో సమస్యకు టాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్లు. టాబ్లెట్లు వాడినప్పుడు బాగానే ఉంటుది. ఆ తర్వాత మళ్లీ మామూలే! దీనికి టాబ్లెట్స్తోపాటు కౌన్సెలింగ్, కొన్ని ఎక్సర్సైజ్లు కూడా అవసరం అని గమనించాను. ఒక పేషెంట్‌కి ఇచ్చే చికిత్స 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. వారంలో మూడుసార్లు ఈ సెషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. – డాక్టర్ లాస్య సాయి సింధు – నిర్మలారెడ్డి -
బీజేపీ ఆఫీస్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
-
నియంతృత్వ శక్తులను ఓడిద్దాం: తేజస్వీ యాదవ్
పట్నా: దేశంలోని నియంతృత్వ శక్తులను ఓడిద్దామని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పరోక్షంగా విమర్శించారు. పట్నాలో శుక్రవారం విపక్ష పార్టీల భేటీపై శనివారం బిహార్ డెప్యూటీ సీఎం అయిన తేజస్వీ స్పందించారు. ‘ కన్యాకుమారి నుంచి కశీ్మర్దాకా నేతలంతా నియంతృత్వ శక్తులను ఓడిద్దామని విపక్షాలభేటీలో ప్రతినబూనారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోదీ గురించో మరే ఇతర వ్యక్తి గురించో కాదు. ప్రజా సంక్షేమం గురించి. విపక్షాల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై వచ్చేనెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో చర్చిస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ తొలి అడుగు పడింది. గతంలో చరిత్రాత్మక చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమాలు బిహార్ నుంచే మొదలయ్యాయి ’ అని అన్నారు. ‘ సమావేశంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ప్రతీ అంశాన్ని సామరస్యపూర్వక పరిష్కారం కోసమే స్వీకరించి చర్చించాం’ అని చెప్పారు. ఢిల్లీలో పరిపాలన సేవలపై కేంద్రం తెచి్చన ఆర్డినెన్స్‌లో కాంగ్రెస్ వైఖరి వెల్లడించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ నిరాకరిస్తుండటంతో శుక్రవారం భేటీ తర్వాత సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొనకుండానే కేజ్రీవాల్ ఢిల్లీకి వెనుతిరిగారు. ఈ విషయంపైనే తేజస్వీపైవిధంగా స్పందించారు. విపక్షాల భేటీని బీజేపీ అగ్రనేత అమిత్ షా ఫొటో సెషన్‌గా పేర్కొంటూ విమర్శించడంపై తేజస్వీ స్పందించారు. ‘ ఫొటో సెషన్ అంటే ఏమిటో వారికే బాగా తెలుసునన్నారు. -
పార్లమెంట్ నూతన సౌధం ప్రారంభోత్సవం ఇలా...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 7.15 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. రెండు దశలుగా ప్రారంభోత్సవం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం 7.15 గంటలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన భవనం వద్దకు చేరుకుంటారు. 7.30: యజ్ఞం, పూజ ప్రారంభం. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 8.30: ప్రధాని మోదీ లోక్‌సభ చాంబర్లోకి ప్రవేశిస్తారు. 9.00: చరిత్రాత్మక రాజదండం సెంగోల్‌ను లోక్‌సభ స్పీకర్ స్థానం సమీపంలో ప్రతిష్టిస్తారు. 9.30: పార్లమెంట్ లాబీలో ప్రార్థనా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పార్లమెంట్ నుంచి ప్రధాని మోదీ బయటకు వెళ్తారు. 11.30: ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అతిథులు కొత్త భవనం వద్దకు చేరుకుంటారు. 12.00: ప్రధాని మోదీ రాక. జాతీయ గీతాలాపాన ప్రారంభం. 12.10: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగం. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పంపించిన సందేశాన్ని చదివి వినిపిస్తారు. 12.17: రెండు షార్ట్ ఫిలింలు ప్రదర్శిస్తారు. 12.38: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. 1.05: రూ.75 నాణెం, స్మారక పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని మోదీ విడుదల చేస్తారు. 1.10: ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభం 2.00: అధికారికంగా వేడుకుల ముగింపు -
ఏపీ చాలా మంచి పనితీరు కనబర్చినట్లు కేంద్రం కితాబు
-
నానో డీఏపీతో సాగు మరింత సులువు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నానో లిక్విడ్ డీఏపీ(డై అమ్మోనియం పాస్ఫేట్)కి ఆమోదం తెలపడం రైతుల జీవితాన్ని సులభతరం చేయడంలో కీలక ముందడుగని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నానో ద్రవీకృత డీఏపీను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేసిన ట్వీట్‌కు ప్రధాని ఈ మేరకు స్పందించారు. ఎరువులపై స్వావలంబన దిశగా ఇది పెద్ద ముందడుగుగా ప్రధాని పేర్కొన్నారు. ఎరువుల సహకార సంఘం ఇఫ్కో 2021లో నానో లిక్విడ్ యూరియాను ప్రవేశపెట్టింది. -
Census 2021: మీనమేషాలే లెక్కిస్తున్నారు
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ‘అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేది’ – కామారెడ్డి టౌన్‌ప్లానింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య అవును కదా! తరచి తరచి ఆలోచిస్తే న్యాయస్థానం వ్యాఖ్యతో ఏకీభవించక తప్పదు. వ్యక్తుల నుంచి రాజ్యం దాకా ఇదే తాత్సారం. ఏదో అనుకోవడం. ఇంకేదో అవుతుందని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోవడమే కాకుండా, వాటికి కారణాలు వెతకడం అలవాటైపోయింది. ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే ఆ దేశంలోని ప్రజలు కనీస స్థాయిలోనైనా సంతోషంగా ఉండాలి. వంద కోట్లపైగా జనాభా ఉన్న భారత్ లాంటి దేశంలో అంతమంది ప్రజల స్థితిగతులు, ఆర్థిక హెచ్చుతగ్గులు, ఉపాధి తీరుతెన్నులూ క్షుణ్నంగా తెలిసి ఉండాలి. ఒక మనిషి అతి సాధారణ జీవితం గడపాలన్నా కూడూ గూడూ కనీసావసరాలు. ఇలాంటి వివరాలు, గణాంకాలు చేతిలో ఉంటేనే ఏ ప్రభుత్వమైనా సంక్షేమ ఫలాలు ఎవరికి అత్యవసరమో, అవసరమో, అవసరం లేదో ఇదమిత్థంగా తేల్చుకోగలుగుతుంది. సరైన దిశలో సరైన చర్యలు చేపట్టగలుగుతుంది. దీనికి లెక్కలు కావాలి. అవే జనాభా లెక్కలు. ఈ లెక్కలు చేతిలో ఉంటే ప్రజల బతుకు లెక్కలు సరిచేసే వీలు చిక్కుతుంది. ఏడాది తిరిగే సరికి గ్రామాలకు గ్రామాలు వలసలతో వెలవెలబోతున్నాయి. ఆ బరువుతో పట్టణాలు ఇరుకైపోతున్నాయి. ఉపాధి వేటలో కష్టాలు తరుముకొస్తున్నాయి. గ్రామాల, పట్టణాల ముఖచిత్రాలు ఇంత వేగంగా మారుతుంటే జనగణన మరింత వేగంగా సాగాలి కదా! కానీ దేశంలో చివరిసారిగా ఈ కసరత్తు జరిగింది 2011లో. అంటే 11 ఏళ్ల కిందట! 2019లో జనగణనకు కేంద్రం ప్రణాళికలు వేసింది. 2021కల్లా ముగించాలని నిర్ణయించింది. ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. కానీ ఆ దిశగా తొలి అడుగు కూడా పడలేదు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈసరికి ఆ అనుకున్నదేదో పూర్తయిపోయి ఉండేది. ఎందుకలా జరగలేదు? ఒకసారి చూద్దాం... అంతా సిద్ధంగానే ఉన్నా... నిజానికి 2021లోగా జనభా గణన పూర్తి చేయాలని కేంద్రం 2019లోనే నిర్ణయించడమే గాక రూ.8,754.23 కోట్లు కేటాయించింది కూడా. ఈ కసరత్తుకు 33 లక్షల మంది అవసరమని అంచనా వేసింది. వారిని ఏయే రంగాల నుంచి సమీకరించాలో కూడా నిర్ణయానికి వచ్చింది. మొత్తం ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు వేసింది. 2020 ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా తొలి దశ, 2021 ఫిబ్రవరిలో రెండో దశ పూర్తి చేయాలన్నది ఆలోచన. ప్రణాళికలన్నీ కాగితం మీద భేషుగ్గా కుదిరాయి. కానీ అనూహ్యంగా కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో జన గణనను వాయిదా వేయాల్సి వచ్చింది. 2020లో కరోనా తొలి వేవ్, 2021లో రెండో వేవ్ వల్ల కార్యక్రమం అటకెక్కింది. నిజానికి కరోనా కల్లోలం నడుమే చైనా, అమెరికా, బ్రిటన్ వంటి చాలా దేశాలు 2020లోనే జనాభా లెక్కల ప్రక్రియను ముగించాయి! మన దగ్గర కనీసం 2022లో అయినా ఆ మహా కార్యాన్ని పూర్తి చేసి ఉంటే బాగుండేది. కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న సాకుతో తప్పించుకోవడం కుదరదు. ఎందుకంటే గతేడాది ఉత్తరప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రంతో పాటు గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో శాసనసభ ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు అడ్డురాని కరోనా భయం జన గణనకు మాత్రమే ఎలా అడ్డంకి అయింది? సూక్ష్మంగా చెప్పాలంటే ఎన్నికలు అనుకున్నట్టు జరిగాయి. జనాభా గణన అనుకున్నట్టు జరగలేదు. దీనిపై కేంద్రం ఈ రోజుకూ కిమ్మనకుండానే ఉంది. అంటే ఇప్పట్లో ఆ ఊసే లేదని కూడా స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది (2024) సాధారణ ఎన్నికలుండటంతో ఆ ఏడాదీ జన గణన లేనట్టే. ఒకవైపు బిహార్‌లో కుల గణనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. మరి అలాంటి చొరవ కేంద్రం ఎందుకు తీసుకోలేకపోతోంది? ఈ ఏడాది మరో 9 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. ఇలా ఎన్నికల నిర్వహణలో చూపించే చొరవ జనాభా సేకరణలో ఎందుకు చూపించలేక పోతున్నారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. దేశ ప్రజల స్థితిగతులపై ఎన్నికలకు ముందే కొత్త లెక్కలు బహిర్గతమైతే ఎన్నికల్లో సమీకరణలు మారిపోతాయనా? ప్రతిపక్షాలకు చేజేతులా గణాంకాల అస్త్రం అందించినట్టు అవుతుందనా? పదేళ్లకోసారి... పదేళ్లకోసారి జనగణన చేయడం ఆనవాయితీగా వస్తోంది. మన దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా పదేళ్లకోసారి నిర్వహిస్తూనే ఉన్నారు. 1941 (రెండో ప్రపంచ యుద్ధం), 1961 (చైనా యుద్ధం), 1971 (బంగ్లాదేశ్ విమోచన యుద్ధం)ల్లో కొన్ని ఇబ్బందులు ఎదరైనా పదేళ్ల ఆనవాయితీ తప్పలేదు. ఈసారి లెక్క తప్పింది. ఇంకోసారి తప్పదన్న గ్యారెంటీ లేదు! అయినా అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే ఈసారికి గణాంకాలన్నీ మన చేతిలో ఉండేవి. అంత ఈజీ కాదు... పోనీ, కేంద్రం తక్షణ కర్తవ్యంగా ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగి వచ్చే ఏడాదే జనాభా గణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నా అదంత సులువు కాదు. ఎందుకంటే జన గణనకు ఏడాది ముందే గృహాల జాబితా తయారు చేయాల్సి ఉంటుంది. 2011 ఫిబ్రవరిలో జనాభా సేకరణ జరగడానికి ముందే, అంటే 2010లో ఆవాసాల గుర్తింపును కేంద్రం పూర్తి చేసింది. నిజానికి గృహాలను గుర్తించడమే పెద్ద సమస్య. అయితే నేటి డిజిటల్ యుగంలో ఈ ప్రక్రియ కొంత వేగంగా జరగడానికి ఆస్కారముంది. ఆయా రాష్ట్రాలు తమ పరిపాలనా పరిధులకు జూన్ 30లోగా తుది రూపు ఇవ్వాలని భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆదేశించినట్టు సమాచారం. అంటే గృహాలను గుర్తించే కార్యక్రమానికి జూన్ తర్వాతే వీలుపడుతుంది. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడం కన్నా మొబైల్ యాప్ ద్వారా ఈ పనిని సులువుగా చేయవచ్చు. కచ్చితమైన సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నావళి రూపొందించాల్సి ఉంటుంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా 1951లో 13 ప్రశ్నలుండేవి. ఇప్పుడవి 31కి పెరిగాయి. హైటెక్ హంగులను ఉపయోగించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జనాభా గణన చేపడితే సంక్షేమ ఫలాలకు అర్హులైన ప్రజలందరికీ మేలు చేసినట్టవుతుంది. -
Covid-19: వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
గాంధీనగర్/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉండటంతో వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం చెప్పారు. వారికి ఎయిర్‌పోర్టుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. జ్వరంతో బాధపడుతూ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు తరలిస్తారు. వాళ్లు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్‌లో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ర్యాండమ్‌గా 2% ప్రయాణికులకు టెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో ఒక్కో అంతర్జాతీయ విమానంలో ర్యాండమ్‌గా రెండు శాతం చొప్పున ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేయడం శనివారం నుంచి తప్పనిసరి చేశామని మాండవీయ వెల్లడించారు. ఈ నిబంధనలతో కొత్తరకం వేరియంట్ వ్యాప్తిని కనుగొనేందుకు, ముందుగా అప్రమత్తమయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గోవా, ఇండోర్, పుణె ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ విమానాల్లో దిగిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేశారు. అంటే ఒక్కో విమానం నుంచి దిగిన ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం మందిని ర్యాండమ్‌గా ఎంపికచేసిన వారికి కోవిడ్ టెస్ట్ చేస్తారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం 29 అంతర్జాతీయ విమానాల్లో 87వేలకుపైగా ప్రయాణికులు భారత్‌లో అడుగుపెట్టారు. టెస్ట్‌కు అయ్యే ఖర్చును ప్రయాణికుడు భరించనక్కర్లేదు. శాంపిళ్లు ఇచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోవచ్చు. జ్వరంగా ఉండి పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్ తప్పదు. రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఆక్సిజన్ సిలిండర్లతోపాటు వెంటిలేటర్లు, బీఐపీఏపీ తదితరాలను సిద్దం చేసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ‘‘ద్రవ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు అవసరమైనన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఈఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి’’ అని సూచించారు. కొత్తగా 201 కేసులు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 201 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,397గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.15 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. -
ఆ చానళ్లను మూసేయండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై తప్పుడు, సంచలనాత్మక వార్తలను వ్యాప్తి చేస్తున్న మూడు చానళ్లను మూసేయాల్సిందిగా యూట్యూబ్‌ను కేంద్రం ఆదేశించింది. ఆజ్‌తక్ లైవ్, న్యూస్ హెడ్‌లైన్స్, సర్కారీ అప్డేట్స్ చానళ్లు తప్పుడు వార్తలకు వాహకాలుగా మారాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం మంగళవారం ప్రకటించింది. కేంద్ర పథకాలతో పాటు సుప్రీంకోర్టు, సీజేఐ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కూడా ఇవి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం యూట్యూబ్‌కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఆజ్‌తక్ లైవ్ చానల్‌కు ఇండియాటుడే గ్రూప్‌తో సంబంధం లేదని వెల్లడించాయి. ఈ మూడు చానళ్లకు కలిపి 33 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నాయి. వాటి వీడియోలకు 30 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. -
అంతర్జాతీయ తయారీదారులను ఆకర్షించాలి
న్యూఢిల్లీ: భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా, వనరుల సమీకరణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, కావాల్సిన విధానాలను రూపొందించాలని దేశీ పరిశ్రమను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యం రిస్క్‌లను ఎదుర్కొంటున్న వేళ అక్కడ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయో అధ్యయనం చేయాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం ఎన్నో వసతులతోపాటు, నిబంధనలను కూడా సవరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ‘‘పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మాంద్యం నేపథ్యంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అక్కడి తయారీ దారులను భారత్‌కు తీసుకొచ్చేందుకు కావాల్సిన వ్యూహాలపై పనిచేసేందుకు ఇదే సరైన సమయం. ఆయా కంపెనీల ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉన్నా కానీ.. ఎన్నో ఉత్పత్తులు, విడిభాగాలను ఇక్కడి నుంచి సమీకరించుకోవడం వాటికి సైతం సాయంగా ఉంటుంది. కొంతవరకు తయారీని ఇక్కడ చేయడం అవసరం’’అని మంత్రి శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 95వ వార్షిక సమావేశంలో భాగంగా పరిశ్రమకు సూచించారు. దీర్ఘకాలం కొనసాగే మాంద్యం వల్ల యూరప్‌పై ప్రభావం పడుతుందన్న మంత్రి.. భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చన్నారు. యూరప్ తదితర పాశ్చాత్య ప్రపంచంలో పనిచేసే కంపెనీలకు, భారత్ ప్రత్యామ్నాయ కేంద్రం కాగలదన్నారు. ఇప్పుడు ప్లస్ 2..: భారత్ చైనా ప్లస్1గా పనిచేస్తోందని, యూరప్ ప్లస్ వన్‌గా కూడా మారుతోందని మంత్రి సీతారామన్ అన్నారు. ‘‘కనుక ప్లస్ వన్ ఇప్పుడు ప్లస్ 2గా మారింది. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో వసతులు కల్పించింది. నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. భారత్‌కు తయారీ వసతులను తరలించాలనుకుంటున్న కంపెనీలతో సంప్రదింపులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కొందరు భారత్ తయారీపై దృష్టి సారించొద్దని, కేవలం సేవలపైనే దృష్టి పెట్టాలన్న సూచనలు చేస్తున్నారు. కానీ ఇదీ కుదరదు. తయారీపై, కొత్త విభాగాలపై తప్పకుండా దృష్టి పెట్టాల్సిందే’’అని మంత్రి స్పష్టత ఇచ్చారు. చైనా తయారీ నమూనాను గుడ్డిగా అనుసరించకుండా, భారత్ సేవలపైనే దృష్టి కొనసాగించాలంటూ పలువురు ఆర్థికవేత్తలు, నిపుణులు సూచిస్తున్న క్రమంలో మంత్రి దీనిపై మాట్లాడారు. ఇప్పటికే మన దేశ జీడీపీలో ఐటీ ఆధారిత సేవల రంగం వాటా 60 శాతంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వాతావరణ మార్పులు తమపై ఏవిధమైన ప్రభావం చూపిస్తున్నాయన్నది పరిశ్రమ ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. తమపై దీనికి సంబంధించి వ్యయాల భారాన్ని ఎలా తగ్గించాలో కూడా సూచనలు ఇవ్వాలని కోరారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ వచ్చే బడ్జెట్లోనూ (2023–24) పూర్వపు బడ్జెట్ స్ఫూర్తి కొనసాగుతుందని, వృద్ధికి మద్దతుగా ఉంటుందని మంత్రి సీతారామన్ సంకేతం ఇచ్చారు. భారత్‌ను వచ్చే 25 ఏళ్ల కాలానికి ముందుకు నడిపించే పునాదిగా ఉంటుందని మంత్రి చెప్పారు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ సహా అంతర్జాతీయ ఏజెన్సీలు తగ్గిస్తున్న తరుణంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మంత్రి సీతారామన్ సమర్పించే బడ్జెట్ కీలకంగా మారింది. వచ్చే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు మంత్రి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 2024–25లో 5 ట్రిలియన్ డాలర్లకు: నితిన్ గడ్కరీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని, 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.410 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఫిక్కీ నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి కోసం వృద్ధిని, ఉపాధిని పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. -
మహారాష్ట్రకు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు: మోదీ
ముంబై: మహారాష్ట్రలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల వల్ల కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సుమారు 75 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసేందుకు గురువారం ముంబైలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపించారు. మహారాష్ట్రకు రావాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎన్నికలు జరిగే గుజరాత్‌కు తరలిపోతున్నాయంటూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు తీవ్రమైన సమయంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. -
రాజకీయ విరాళాల స్వీకరణకు సరైన విధానమే
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానం లోపభూయిష్టంగా ఉందంటూ, వాటి కొనుగోళ్లను ఆపాలంటూ గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం కేంద్రప్రభుత్వం స్పందించింది. ‘ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించేందుకు వినియోగిస్తున్న ఈ బాండ్ల వ్యవస్థ అత్యంత పారదర్శకమైంది. లెక్కల్లో లేని, నల్లధనం ఎంత మాత్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు చేరబోదు’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీంకోర్టులో స్పష్టంచేశారు. ‘ ప్రతిసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాండ్ల తంతు మొదలవుతోంది. తమకు వచ్చిన విరాళాల ఖాతాల ప్రతీ లావాదేవీ సమగ్ర సమాచారాన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా వెల్లడించట్లేవు. బాండ్ల విక్రయం ఆపండి’ అని పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ ఎన్జీవో తరఫున హాజరైన లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. విస్తృత ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని మరో పిటిషనర్ తరఫున వాదిస్తున్న లాయర్ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. దీంతో బాండ్ల ద్వారా పార్టీలు విరాళాలు పొందేందుకు అనుమతిస్తున్న చట్టాలను సవాల్ చేస్తున్న అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలా వద్దా అనేది డిసెంబర్ ఆరో తేదీన ఖరారుచేస్తామని సుప్రీం బెంచ్ పేర్కొంది. దాతల పేర్ల విషయంలో గోప్యత పాటించాలని కేంద్ర ప్రభుత్వం, పేర్లు బహిర్గతం చేయాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం.. సుప్రీంకోర్టులో గతంలో భిన్న వాదనలు లేవనెత్తాయి. -
సీడీఎస్‌గా జనరల్ చౌహాన్ బాధ్యతలు
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సీనియర్ కమాండర్, ఈస్టర్న్ ఆర్మీ మాజీ కమాండర్ జనరల్ చౌహాన్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అయ్యారు. దేశ మొట్టమొదటి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ 9 నెలల క్రితం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్థానం జనరల్ చౌహాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దేశం ముందున్న భవిష్యత్ భద్రతా సవాళ్లకు త్రివిధ దళాలను సన్నద్ధం చేయడం, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన థియేటర్ ప్లాన్‌ను అమలు చేయడం జనరల్ అనిల్ చౌహాన్ ప్రధాన లక్ష్యాలు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలటరీ ఎఫైర్స్కు సెక్రటరీగాను ఆయన వ్యవహరిస్తారు. సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్ దేశంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న జనరల్ చౌహాన్‌ను అత్యున్నత హోదాలో కేంద్రం నియమించడం గమనార్హం. ‘భారత సైనిక బలగాల్లో అత్యున్నత హోదాను చేపట్టినందుకు గర్వంగా ఉంది. త్రివిధ దళాలు నాపై ఉంచిన అంచనాలను అందుకునేందుకు నా వంతు కృషి చేస్తాను. అన్ని సవాళ్లను, ఇబ్బందులను కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని ఈ సందర్భంగా జనరల్ చౌహాన్ అన్నారు. రైజినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో జనరల్ చౌహాన్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. 1961లో జన్మించిన జనరల్ చౌహాన్ 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లో చేరారు. -
PM PRANAM: రసాయన ఎరువులకు ‘పీఎం–ప్రణామ్’తో చెక్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అంతేకాకుండా రసాయన ఎరువులపై సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ (పీఎం–ప్రణామ్) యోజనను తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరగడం, వాటిపై రాయితీలు మోయలేని భారంగా మారుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీల భారం రూ.2.25 లక్షల కోట్లు! దేశంలో రసాయన ఎరువుల వాడకం ప్రతి ఏటా విపరీతంగా పెరిగిపోతోంది. 2017–18లో వినియోగం 5.28 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా, 2021–22 నాటికి 6.40 కోట్ల మెట్రిక్ టన్నులకు (21శాతం) పెరిగింది. ఇందులో యూరియా వినియోగం 2017–18లో 2.98 కోట్ల మెట్రిక్ టన్నుల నుంచి 2021–22 నాటికి ఏకంగా 3.56 కోట్ల మెట్రిక్ టన్నులకు (19.64 శాతం) చేరుకుంది. అలాగే డీఏపీ వినియోగం 98.77 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1.23 కోట్ల మెట్రిక్ టన్నులకు (25.44 శాతం) పెరిగింది. ఇతర ఎరువుల వినియోగం సైతం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దానికి అనుగుణంగానే సబ్సిడీల భారం పెరుగుతూ వస్తోంది. 2020–21లో సబ్సిడీల భారం రూ.1.27 లక్షల కోట్లు కాగా, 2021–22 నాటికి రూ.1.62 లక్షల కోట్లకు చేరింది. 2022–23 నాటికి రూ.2.25 లక్షల కోట్లు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ‘పీఎం–ప్రణామ్’ పథకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మిగిలే నిధులతో పథకం అమలు ‘పీఎం–ప్రణామ్’ కింద కేంద్ర సర్కారు ఎలాంటి ప్రత్యేక బడ్జెట్ కేటాయించదు. వివిధ కేంద్ర పథకాల కింద ఉన్న ఎరువుల సబ్సిడీలను ఆదా చేయడం ద్వారా మిగిలే నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. మిగులు నిధుల్లో 50 శాతం సొమ్మును రాష్ట్రాలకు గ్రాంట్‌గా అందిస్తుంది. ఈ గ్రాంట్‌లో 70 శాతం నిధులను గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో ప్రత్యామ్నాయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువుల ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు వినియోగించవచ్చు. మిగిలిన 30 శాతం నిధులను రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై రైతుల్లో అవగాహన కల్పించిన పంచాయతీలకు, రైతు సంఘాలకు, స్వయం సహాయక సంఘాలకు బహుమతులు ఇవ్వడానికి, ఇతర ప్రోత్సాహకాలకు ఉపయోగించుకోవచ్చు. పీఎం–ప్రణామ్ యోజనకు సంబంధించిన లక్ష్యాలపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. రాష్ట్రాల అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకున్నాక తుది ముసాయిదాను సిద్ధం చేయనుంది. -
క్వీన్ ఎలిజబెత్–2 మృతి.. కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి.. హక్కుదారు ఎవరు?
న్యూఢిల్లీ: క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 105 క్యారెట్ల అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోహినూర్‌ను ఇకనైనా స్వదేశానికి అప్పగించాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కోహినూర్ అంటే వెలుగుల కొండ అని అర్థం. 14 శతాబ్దం ఆరంభంలో దక్షిణ భారతదేశంలో తవ్వకాల్లో లభించినట్లు చరిత్రలో నమోదయ్యింది. తర్వాత పలువురు రాజులు, చక్రవర్తుల చేతులు మారుతూ వచ్చింది. చివరకు బ్రిటిష్ రాణి కిరీటంలోకి చేరింది. కోహినూర్ తమదేనంటూ భారత్, పాకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్ దేశాలు వాదిస్తున్నాయి. వజ్రానికి అసలు హక్కుదారులు ఎవరన్నదానిపై శతాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు బ్రిటన్ రాణి మృతిచెందారంటూ కాబట్టి కోహినూర్‌ను భారత్‌కు అప్పగించాలని ట్విట్టర్లో జనం డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ సింహాసనాన్ని అధిష్టించబోతున్నారు. కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని రాణి హోదాలో ఆయన భార్య కెమిల్లా పార్కర్ ధరిస్తారు. కోహినూర్ వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. -
‘కేంద్రంలో అధికార మార్పునకు అదే సంకేతం’
లక్నో: బిహార్‌లో ఎన్డీఏ కూటమి అధికార పీఠాన్ని చేజార్చుకుందని, ఈ పరిణామం హస్తినలో అధికార మార్పునకు శుభసూచక మని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించే బలమైన జాతీయస్థాయి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం అఖిలేశ్ లక్నోలో పీటీఐకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సరిసాటి అయిన ప్రత్యామ్నాయ కూటమి అవతరిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంచేశారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వీపీ సింగ్‌ల నాటి స్వల్పకాలిక కూటమి ప్రభుత్వాలకు ఇప్పుడు కాలం చెల్లింది. సుస్థిర, అభివృద్ది చోదక, ప్రభావవంతమైన నాయకత్వంలో కొనసాగే ప్రభుత్వాన్నే ప్రస్తుతం దేశం కోరుకుంటోంది’ అని అఖిలేశ్ అన్నారు. మీరు కోరింది ఇదేగా: రవిశంకర్ ప్రసాద్ ‘సుధృఢ ప్రభుత్వం కావాలనేదే మీ అభిలాష. ప్రధాని మోదీ సారథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వం అదే’ అంటూ అఖిలేశ్‌నుద్దేశిస్తూ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. -
ఈ నెల 13 బంగారం గనుల అమ్మకం!
న్యూఢిల్లీ: దేశ స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) మైనింగ్ రంగం సహకారం మరింత పెరగడానికి వ్యూహ రచన చేస్తున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 13 బంగారు గనులను ఈ నెల్లో వేలం వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటిలో 10 ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, మరో మూడు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 10 బ్లాకుల్లో ఐదు బ్లాకుల వేలం ఆగస్టు 26న జరగవచ్చని సమాచారం. మిగిలిన ఐదు బ్లాకులను ఆగస్టు 29న వేలం వేయవచ్చని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వేలం వేయనున్న బ్లాకుల్లో... రామగిరి నార్త్ బ్లాక్, బొక్సంపల్లి నార్త్ బ్లాక్, బొక్సంపల్లి సౌత్ బ్లాక్, జవాకుల–ఎ బ్లాక్, జవాకుల–బి బ్లాక్, జవాకుల–సి బ్లాక్, జవాకుల–డి బ్లాక్, జవాకుల–ఈ బ్లాక్, జవాకుల–ఎఫ్ బ్లాక్ ఉన్నాయి. వీటికి టెండర్లను ఆహ్వానిస్తూ, గత మార్చి నెల్లో నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్ బ్లాక్‌ల వేలం కూడా ఇదే నెల్లో జరిగే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. అయితే నిర్దిష్టంగా తెలియరాలేదు. ఈ రాష్ట్రంలోని మూడు పసిడి బ్లాక్స్‌లో రెండు.. సోనపహరి బ్లాక్, ధుర్వ–బియాదండ్ బ్లాక్ రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద జిల్లా సోనభద్రలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మూడు బ్లాక్‌ల వేలానికి టెండర్లను ఆహ్వానిస్తూ, మే 21న నోటీసులు జారీ అయ్యాయి. దేశాభివృద్ధికి దన్నుగా... దేశ ఎకానమీలో గనుల భాగస్వామ్యం పెరగడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు కేంద్రం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రాలు ఆగస్టు 4 నాటికి 199 మినరల్ బ్లాక్‌లను వేలం వేశాయి. 2015లో మైనింగ్ చట్టంలో సవరణ తర్వాత వేలం మార్గం ద్వారా ఖనిజ బ్లాకుల కేటాయింపు ప్రారంభమైంది. గత ఆర్థిక సంవత్సరంలో 45 మినరల్ బ్లాక్‌లను అమ్మకానికి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు వేలం ద్వారా ఆదాయంలో చాలా మంచి వాటాను పొందుతున్నాయని కేంద్రం పేర్కొంటోంది. ఈ రేసులో మొదట ఉన్న రాష్ట్రాలు ఆదాయాల వాటా విషయంలో సంతోషంగా ఉన్నాయని తెలుపుతోంది. ఖనిజాల వేలం నిబంధనలలో సవరణలు పోటీని ప్రోత్సహిస్తాయని, తద్వారా బ్లాక్‌ల విక్రయంలో మరింత భాగస్వామ్యానికి అవకాశం ఉంటుందని గనుల మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది. మినరల్స్ (ఎవిడెన్స్ ఆఫ్ మినరల్ కంటెంట్స్) రూల్స్, 2015 (ఎంఈఎంసీ రూల్స్), మినరల్స్ (ఆక్షన్) రూల్స్, 2015 (ఆక్షన్ రూల్స్)ను సవరించడానికి కేంద్ర గనుల మంత్రిత్వశాఖ పలు నిబంధనలను నోటిఫై చేసింది. వీటిలో మినరల్స్ (ఎవిడెన్స్ ఆఫ్ మినరల్స్ కంటెంట్స్) రెండవ సవరణ నిబంధనలు, 2021, మినలర్ (ఆక్షన్) నాల్గవ సవరణ నిబంధనలు, 2021 ఉన్నాయి. రాష్ట్రాలు, పారిశ్రామిక సంఘాలు, గనుల విభాగంలో నిపుణులు, ఇతర భాగస్వాములు, సాధారణ ప్రజలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ సవరణ నియమాలు రూపొందాయి. -
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది. ముందు జాగ్రత్తలు పాటిస్తూ, ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. దీంతోపాటు, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోని ఒక ప్రముఖ ప్రాంతంలో పదిహేను, నెల రోజులపాటు కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కూడా కోరింది. -
ఐదేళ్లలో కేంద్రం ప్రకటనల ఖర్చు రూ.3,339 కోట్లు
న్యూఢిల్లీ: 2017–18 నుంచి ఈ ఏడాది జూలై 12వ తేదీ దాకా.. ఐదేళ్లలో మీడియాలో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం ఈ సొమ్ము వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు, రూ. 1,756.48, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు రూ.1,583.01 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. -
సెజ్‌లకు కొత్త రూపు..
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎగుమతులకే పరిమితమవుతున్న ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్) సమగ్ర ఆర్థిక హబ్‌లుగా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక మండళ్లలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు నిబంధనలను సడలించడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం తదితర చర్యలు తీసుకునే యోచనలో ఉంది. అలాగే సెజ్‌లలోని యూనిట్లు దేశీయంగా కూడా విక్రయించుకునేందుకు అనుమతించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో రూపొందించిన ముసాయిదా చర్చా పత్రం ప్రకారం హబ్‌లను డెవలప్మెంట్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్‌లు (దేశ్)గా వ్యవహరించనున్నారు. వాటిల్లోని సంస్థలు దేశీయంగా విక్రయించుకోవడంతో పాటు జోన్‌కు వెలుపలి సంస్థల కోసం కాంట్రాక్టు తయారీ కార్యకలాపాలు కూడా చేపట్టేందుకు అనుమతించనున్నారు. కొంత మేర ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే చర్యలు కూడా తీసుకోనున్నారు. సంయుక్తంగా ఏర్పాటు.. ఇలాంటి హబ్‌లను కేంద్రం, రాష్ట్రం విడివిడిగా లేదా కలిసి నెలకొల్పవచ్చు. తయారీ లేదా సర్వీసు కార్యకలాపాల కోసం లేదా ఈ రెండింటి కోసం వ్యక్తులు కూడా ఏర్పాటు చేయవచ్చు. సెజ్‌ల వెలు పలి సంస్థలతో సమానంగా పన్ను భారం వర్తించే లా హబ్‌లలోని యూనిట్లు దేశీయంగా జరిపే విక్ర యాలపై ఈక్వలైజేషన్ లెవీ విధించే అవకాశం ఉంది. పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల తర్వాత రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలను కూడా అభివృద్ధిలో భాగం చేసే ఉద్దేశంతో సెజ్ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తేనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధన్యం సంతరించుకున్నాయి. -
ఫిర్యాదుల పరిష్కారానికి ఏం చేస్తున్నారు..
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ ఆపరేటర్లపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన వ్యవస్థను మెరుగుపర్చుకోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి 15 రోజుల్లోగా ప్రతిపాదనలను సమర్పించాలని స్విగ్గీ, జొమాటో తదితర ఆపరేటర్లను ఆదేశించింది. ప్రస్తుతం పాటిస్తున్న విధానం, అలాగే మెరుగుపర్చే ప్రతిపాదనలను ఇవ్వాలంటూ వినియోగదారుల వ్యవహారాల విభాగం బడా ఈ–కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్‌బీవో) ఆదేశించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సారథ్యంలో సోమవారం ఎఫ్‌బీవోలతో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. గడిచిన 12 నెలల వ్యవధిలో నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నంబరుకు (1915) స్విగ్గీపై 3,631, జొమాటోపై 2,828 పైచిలుకు ఫిర్యాదులు వచ్చినట్లు వివరించింది. డెలివరీ చార్జీలు, ప్యాకేజింగ్ చార్జీలు, పన్నులులాంటి ప్రతి చార్జీ గురించి వినియోగదారులకు పారదర్శకంగా చూపాలని సూచించినట్లు తెలిపింది. స్విగ్గీ, జొమాటో సహా ఎఫ్‌బీవోలు, రెస్టారెంట్ల సమాఖ్య ఎన్ఆర్ఏఐ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్ప్‌లైన్‌కి వచ్చిన ఫిర్యాదులపై ఇందులో చర్చించారు. తాము మెరుగైన సర్వీసులు అందించడానికి లేకుండా ఎఫ్‌బీవోలు కస్టమర్ల వివరాలను ఇవ్వడం లేదంటూ ఎన్ఆర్ఏఐ ఆరోపించింది. ప్రతి ఆర్డరుపై 20 శాతం కమీషన్ తీసుకోవడంతో పాటు డెలివరీ చార్జీలను కూడా ఎఫ్‌బీవోలే ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయని పేర్కొంది. మరోవైపు, తాము ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అమలు చేస్తున్నామని, దీన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉందని ఎఫ్‌బీవోలు తెలిపాయి. -
మిల్లుల్లోని ధాన్యంపై ఎఫ్‌సీఐకి అధికారం ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చిన్నచిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్‌సీఐ లేఖ రాయడంతోనే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తోందని పేర్కొన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు ఎఫ్‌సీఐ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ ఎఫ్‌సీఐ తీరును తప్పు బట్టారు. మిల్లుల్లోని వడ్లు, బియ్యంపై ఎఫ్‌సీఐ కి ఏం అధికారముందని ప్రశ్నించారు. రాష్ట్రం లోని రైస్ మిల్లుల్లో వడ్లు, బియ్యం నిల్వలపై ఎఫ్‌సీ ఐకి ఎలాంటి అధికారం లేదని మంత్రి చెప్పారు. సీఎం ఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చిన తరువాతే వారికి అధికారం వస్తుం దని పేర్కొన్నారు. తనిఖీ ల్లో తేడాలు వచ్చినా చర్యలు తీసుకో లేదని ఆరో పణలు చేస్తున్నారని, మార్చిలో ఆరు జిల్లాల్లోని 40 మిల్లులు తనిఖీ చేస్తే 4,53,896 బ్యాగులు లేవని చెప్పారని, రెండో మారు అవే మిల్లుల్లో తనిఖీ చేస్తే 10 మిల్లుల్లో మాత్రమే తేడా ఉందని అన్నారని పేర్కొన్నారు. ఒక్క గింజ తేడా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఊరుకో దని, మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమి నల్ కేసులు పెట్టిందని తెలిపారు. మరో రెండు మిల్లుల్లో మొత్తం ధాన్యాన్ని రికవరీ చేశామని, మిగతా ఐదు మిల్లులపై చర్యలు తీసుకోవా లని కలెక్టర్లకు లేఖలు రాశామని చెప్పారు. రెండో దశలో 63 మిల్లుల్లో తే డా.. అని ఎఫ్‌సీఐ అధికారులు జూన్ 4న లేఖ రాశారని, దాన్ని కలెక్టర్లకు పంపి పరిశీలించ మని ఆదేశించినట్లు వెల్లడించారు. జూన్ నుంచి నవంబర్ వరకు ఉచిత బియ్యం.. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యా న్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేయ డం లేదని ఎఫ్‌సీఐ చేసిన వ్యాఖ్యలు అర్థర హితమని మంత్రి గంగుల పేర్కొన్నారు. సాం కేతిక కార ణాల వల్ల 2 నెలలు ఉచిత బియ్యం సరఫరాలో ఆలస్యం అయిందని, ఈ జూన్ నుంచి యథాతథంగా సరఫరా చేస్తు న్నామని చెప్పారు. 2020 ఏప్రిల్ నుంచి కేంద్రంతో పాటు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చా మని, తద్వారా ప్రభుత్వంపై 8 నెలల పాటు రూ.980 కోట్ల భారం పడిందని తెలిపారు. ఇక 2021 జూన్ నుంచి ఏప్రిల్ 2022 వరకు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చామని వివరించారు. 2022 మార్చిలో.. ఏప్రిల్ నుంచి ఆరు నెలల పాటు ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం లేఖ రాసిందని, తదనుగుణంగా మూడో దశ కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించిన ప్పటికీ సేకరణ, ఇతర కారణాల వల్ల పంపిణీ ఆలస్యం అయిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 90,46,000 కార్డుల్లో కేవలం 53 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత అందరికీ ఉచితబియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ జూన్ నుంచి తెల్ల రేషన్‌కార్డు దారులందరికీ రూ.436 కోట్ల భారాన్ని భరించి నవంబర్ వరకు ఆరు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 11 కేజీల చొప్పున ఉచితబియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు చెప్పామని, స్టాక్ ఉండి కూడా ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోతే బంకులపై చర్యలు తీసుకొం టామని గంగుల హెచ్చరించారు. . -
‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో కేంద్రం ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని ఆరంభించనుంది. దేశాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మార్చే ప్రయత్నం ముమ్మరంచేసింది. ఆ ప్లాస్టిక్ వాడకాన్ని ఈ నెలాఖరుకల్లా దశల వారీగా నిర్మూలించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పట్టణ, స్థానిక సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు అడ్వైజరీని పంపింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాల మేరకు 2,591 నగర మున్సిపాలిటీలు ఆ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేశాయి. మరో 2,100 నగర మున్సిపాలిటీల్లోనూ ఈ నెల 30లోగా నిషేధం క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్న ‘హాట్ స్పాట్’లను గుర్తించి, వాటిని తొలగించాల్సిన బాధ్యత పట్టణప్రాంత స్థానిక సంస్థలదే అని కేంద్రం స్పష్టంచేసింది. ఆ ప్లాస్టిక్ వినియోగం నిషేధాలను అమలు చేయడం కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డ్‌ల సాయం తీసుకోవాలంది. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ల ఏర్పాటు, ఆకస్మిక తనిఖీలు, ఉల్లంఘనులపై భారీ జరిమానా విధించాలని కేంద్రం సూచించింది. దేశంలో 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం/ వాడి పడేసిన ప్లాస్టిక్‌తో తయారైన క్యారీ బ్యాగ్‌ల తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమల్లో ఉంది. -
నెక్ట్స్ టార్గెట్ సిసోడియానే: కేజ్రివాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని సీఎం అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. అందుకే తమ మంత్రులను టార్గెట్ చేసిందని గురువారం ఆరోపించారు. ‘‘ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టుతో యమున క్లీనింగ్, మొహల్లా క్లినిక్‌ల ప్రారంభం ఆగిపోయాయి. ఇప్పుడు విద్యారంగ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను లక్ష్యంగా చేసుకున్నారు. తప్పుడు కేసు బనాయించి ఆయన్ను త్వరలోనే అరెస్ట్ చేసే చాన్సుంది. ఈ మేరకు కొన్ని నెలల ముందే నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది’’ అని వివరించారు. ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలా ఒకరి తర్వాత మరొకరిపై కేసులు పెట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇలాగైతే ప్రభుత్వం ఎలా పని చేస్తుంది?’’ అని ప్రశ్నించారు. ‘‘నేను చేతులు జోడించి ప్రధానిని ఒక్కటే వేడుతున్నా. ఇలా ఒకరి తర్వాత మరొకరిని జైలు పాలు చేసే బదులుగా ఆప్ మంత్రులందరినీ ఒకేసారి అరెస్టు చేయండి’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. -
భారత్‌లో 16,522కు యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో సోమవారం కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,60,086కు చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది. యాక్టివ్ కేసులు 16,522కు పెరిగినట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలో మరో 30 మంది కోవిడ్ బాధితులు మృతి చెందడంతో మొత్తం మరణాలు 5,22,223గా నమోదయ్యాయని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.04%గా ఉన్నట్లు వివరించింది. అదేవిధంగా, దేశ రాజధాని ఢిల్లీలో మరో 1,022 కరోనా కేసులు సోమవారం వెలుగుచూశాయి. ఐఐటీ మద్రాస్‌లో సోమవారం మరో 18 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 78కి చేరింది. -
ఎల్ఐసీలో ఎఫ్‌డీఐలకు నిబంధనల్లో సవరణలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మార్గం సుగమం అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా)లో తగు సవరణలు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో ఆటోమేటిక్ పద్ధతిలో 20 శాతం వరకూ ఎఫ్‌డీఐలకు వీలుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐలకు సంబంధించి 20 శాతం పరిమితి ఉంది (కేంద్రం అనుమతులకు లోబడి). దీన్ని ఎల్ఐసీ, ఇతరత్రా ఆ తరహా కార్పొరేట్ సంస్థలకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మెగా పబ్లిక్ ఇష్యూలో ఎల్ఐసీలో సుమారు 5 శాతం వాటా విక్రయించి దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 18,300 కోట్ల పేటీఎం ఐపీవోనే దేశీయంగా ఇప్పటివరకూ అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా ఉంది. కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఎల్ఐసీ మెగా ఐపీవోకి సన్నాహాలు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు వేగం పుంజుకుంటున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లుగా 50–60 సంస్థలను కేంద్రం షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో బ్లాక్‌రాక్, శాండ్స్ క్యాపిటల్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, స్టాండర్డ్ లైఫ్, జేపీ మోర్గాన్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. త్వరలోనే యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాను కేంద్రం ఖరారు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదిత ఇన్వెస్టర్ల నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుందని ఒక అధికారి తెలిపారు. ఇందుకోసం నిర్దిష్ట వేల్యుయేషన్ శ్రేణిని వారి ముందు ఉంచినట్లు వివరించారు. ఆయా ఇన్వెస్టర్ల అభిప్రాయాల మేరకు ఎల్ఐసీ వేల్యుయేషన్ దాదాపు రూ. 7 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వేల్యుయేషన్ ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో మదుపు చేసేందుకు ఆసక్తి చూపే ఇన్వెస్టర్ల సంఖ్య మరింతగా పెరుగుతోందని అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో వేల్యుయేషన్‌పైనా సత్వరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 25 శాతం డ్రాపవుట్..: ఆసక్తిగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఎంత మేరకు పెట్టుబడులు పెడతాయో తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి కమిటీ.. వాటి నుంచి ప్రతిపాదనలు తీసు కున్నట్లు అధికారి చెప్పారు. ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేసిన సంస్థల్లో దాదాపు 25% ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకునే (డ్రాపవుట్) అవకాశం ఉందని భావిస్తున్నట్లు వివరించారు. మరింత మంది ఇన్వెస్టర్లను భాగస్వాములను చేసేందుకు, సెబీ నిబంధనల మేరకు .. ఐపీవోలో విక్రయించే షేర్ల సంఖ్యను కూడా కేంద్రం పెంచవచ్చని తెలిపారు. సుమారు 12 యాంకర్ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 18,000 కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ ద్వారా 31.6 కోట్ల షేర్ల (దాదాపు 5% వాటా) విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. మారిన పరిస్థితులతో 7% వరకు వాటాలను విక్రయించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మే 12 దాటితే మళ్లీ ఐపీవో ప్రతిపాదనలను సెబీకి సమర్పించాల్సి రానున్న నేపథ్యంలో ఏదేమైనా పబ్లిక్ ఇష్యూను ఏప్రిల్‌లోనే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
సామాన్యుడికి కన్నీళ్లు ? దిగులు పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: అటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో సామాన్యుడికి కన్నీళ్లు తెప్పించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ధరల బాస్కెట్ 6.07 శాతం పెరిగిందన్నమాట. 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తోంది. వరుసగా రెండవ నెలలోనూ (జనవరిలో 6.01 శాతం) ఈ స్థాయి దాటి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక టోకు ద్రవ్యోల్బణం ఏకంగా రెండంకెలపైన 13.11 శాతంగా ఉంది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... రిటైల్ ద్రవ్యోల్బణం... ఎనిమిది నెలల గరిష్టం 2021 జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.26 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్టానికి చేరడానికి ఆహార ధరలు ప్రధాన కారణమని గణాంకాలు వెల్లడించాయి. ఆహార ధరల బాస్కెట్ సమీక్షా నెల్లో 5.89 శాతంగా నమోదయ్యింది. జనవరిలో ఈ రేటు 5.43 శాతం. ఈ బాస్కెట్లో తృణధాన్యాల ధరలు 3.95 శాతం పెరిగాయి. మాంసం, చేపల ధరలు 7.45 శాతం ఎగశాయి. కాగా, గుడ్ల ధరల స్పీడ్ 4.15 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 6.13 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 6.09 శాతం ఎగశాయి. పండ్ల ధరలు మాత్రం జనవరితో పోల్చితే స్థిరంగా 2.26 శాతంగా ఉన్నాయి. ఇక ‘ఫ్యూయెల్ అండ్ లైట్’ విభాగంలో ధరా భారం తీవ్రంగా 8.73 శాతంగా ఉంది. అయితే జనవరి 9.32 శాతంతో పోల్చితే ఇది కొంచెం తగ్గడం ఊరట. క్రూడ్ ధరల తీవ్రత నేపథ్యంలో రానున్న నెలల్లో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుతుందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఆర్బీఐపై దృష్టి... ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం గమనార్హం. ద్రవ్యోల్బణం 6 శాతం పైబడిందంటే.. అది పాలసీ రేటు నిర్ణయం ప్రభావం చూపుతోంది. వరుసగా రెండవ నెలా రిటైల్ ద్రవ్యోల్బణం కట్టుతప్పడంతో రానున్న ఏప్రిల్ ఆర్బీఐ పాలసీ సమావేశాల నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో సగటున 5.7 శాతంగా ఉంటుందని, ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఫిబ్రవరి మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది. అయితే రెపో రేటు ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగించడానికి మాత్రం ఆరుగురు సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటు యథాతథంగా కొనసాగుతోంది. టోకు ద్రవ్యోల్బణానికి క్రూడ్ సెగ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 13.11 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) ఉంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణంకాగా, నాన్–ఫుడ్ ఐటమ్స్ ధరలు కూడా తీవ్రంగా ఎగశాయి. టోకు ద్రవ్యోల్బణం రెండంకెల పైన కొనసాగుతుండడం ఆందోళనకరమైన అంశం. గడచిన పదకొండు నెలల నుంచీ అంటే 2021 ఏప్రిల్ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతోంది. 2021 ఫిబ్రవరిలో ఈ రేటు 4.83 శాతం. అప్పటిలో అతి తక్కువ బేస్, తాజా ధరలు తీవ్ర స్థాయిలో కనబడ్డానికి ఒక కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ► ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ రెండూ కలిపి ధరాభారం 31.50 శాతంగా ఉంది. అయితే ఒక్క క్రూడ్ పెట్రోలియం ధరల స్పీడ్ ఫిబ్రవరిలో ఏకంగా 55.17 శాతంగా ఉంది. జనవరిలో ఈ పెరుగుదల 39.41 శాతం. ► ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 8.19 శాతంగా ఉంది. కూరగాయల ధరల స్పీడ్ 26.93 శాతం. గుడ్లు, మాంసం, చేపల ధరలు 8.14 శాతం పెరిగాయి. ఉల్లి ధర 26.37 శాతం తగ్గింది. అయితే ఆలూ ధరలు మాత్రం 14.78 శాతం పెరిగాయి. జనవరిలో ధర పెరక్కపోగా 14.45 శాతం తగ్గింది. ► సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 9.84 శాతంగా ఉంది. జనవరిలో ఈ రేటు 9.42 శాతం. -
సాగులో డ్రోన్ల వినియోగం వేగవంతం
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని మూడు విభాగాలు దీనిపై సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్, స్టోరేజ్ (డీపీపీక్యూఎస్) సీనియర్ అధికారి రవి ప్రకాశ్ ఈ విషయాలు తెలిపారు. డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు అనుమతించాలంటూ డీపీపీక్యూఎస్‌లో భాగమైన సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ (సీఐబీఅండ్‌ఆర్‌సీ)కి ఎనిమిది పంట సరక్షణ కంపెనీల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. పంట పర్యవేక్షణ, ఆగ్రో రసాయనాలు స్ప్రే చేయడం తదితర అవసరాల కోసం డ్రోన్లను వినియోగించేందుకు ఉద్దేశించిన ఈ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), వ్యవసాయ శాఖ, సీఐబీఅండ్‌ఆర్‌సీ కలిసి పని చేస్తున్నాయని ప్రకాశ్ చెప్పారు. క్రాప్‌లైఫ్ ఇండియా, థింక్‌ఏజీ సంయుక్తంగా నిర్వహించిన పరిశ్రమ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. ఎన్ఐపీహెచ్ఎం శిక్షణా కోర్సు.. డ్రోన్లను ఎగరేయడం, స్ప్రే చేయడం వంటి అంశాల్లో డ్రోన్ పైలట్లు, ఆపరేటర్లకు శిక్షణనిచ్చేందుకు పది రోజుల ట్రెయినింగ్ కోర్సును రూపొందించినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) జాయింట్ డైరెక్టర్ విధు కాంపూరథ్ తెలిపారు. దీనికి డీజీసీఏ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఈ మాడ్యూల్తో డ్రోన్ పైలట్‌కు పదేళ్లు వర్తించే లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నారు. ఫినిష్డ్ డ్రోన్ల దిగుమతిపై నిషేధం విధించడం వల్ల దేశీయ తయారీ పరిశ్రమకు ఊతం లభించగలదని డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్మిత్ షా తెలిపారు. -
బిట్‌కాయిన్ చట్ట విరుద్ధమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: బిట్ కాయిన్ చట్ట విరుద్ధమో కాదో వైఖరి చెప్పాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనపై కేసు రద్దు చేయాలంటూ గెయిన్ బిట్‌కాయిన్ కుంభకోణం నిందితుల్లో ఒకరైన అజయ్ భరద్వాజ్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బిట్‌కాయిన్‌పై కేంద్రం వైఖరి చెప్పాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. త్వరలోనే చెప్తామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి తెలిపారు. పెట్టుబడి దారులకు భారీ మొత్తం రిటర్న్‌లు ఇస్తామంటూ అజయ్ భరద్వాజ్, అతని సోదరుడు అమిత్ మల్టీలెవెల్ మార్కెటింగ్ ప్రారంభించారు. ఐఎన్‌సీ 42 సంస్థ వివరాల ప్రకారం తొలుత రూ.2వేల కోట్ల కుంభకోణం కాస్తా బిట్‌కాయిన్ విలువ పెరగడంతో అది రూ.20వేల కోట్ల కుంభకోణంగా మారింది. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని, 87వేల బిట్ కాయిన్ల వ్యవహారానికి సంబంధించిందని ఐశ్వర్యభాటి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పలు సమన్లు జారీ చేశామని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. నిందితులను అరెస్టు చేయొద్దని మధ్యంతర రక్షణ కల్పించింది. నాలుగు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
చైనాకు భారత్ మరో షాక్.. 54 చైనా యాప్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: దేశ భద్రతకు, ప్రైవసీకి ప్రమాదంగా మారుతున్నాయంటూ మరో 54 చైనా మొబైల్ యాప్‌లను సోమవారం కేంద్రం నిషేధించింది. కేంద్ర హోం శాఖ సిఫార్సు మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ‘‘ఈ యాప్స్ యూజర్ల తాలూకు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని, ఎప్పటికప్పుడు శత్రు దేశపు సర్వర్లకు పంపుతున్నాయి. తద్వారా దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి సమస్యగా మారాయి. దేశ రక్షణకు కూడా ముప్పుగా తయారయ్యాయి’’ అని వివరించాయి. గెరెనా ఫ్రీ ఫైర్–ఇల్యుమినేట్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, నైస్‌వీడియో బైదు, వివా వీడియో ఎడిటర్, బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్డీ, మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ప్లస్, వాల్యూమ్ బూస్టర్, వీడియో ప్లేయర్స్, యాప్‌లాక్, మూన్‌చాట్, బార్కోడ్ స్కానర్–క్యూఆర్ కోడ్‌స్కాన్ వంటివి ఈ జాబితాలో ఉన్నట్టు వివరించాయి. -
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయాలపై... సీబీఐ విచారణకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్18వ తేదీన ఇచ్చిన ఉపసంహరించుకోవాలని దాఖలు చేసిన రికాల్ పిటిషన్‌ను కేంద్రం సోమవారం ఉపసంహరించుకుంది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అవసరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విభేదించింది. పిటిషన్‌ను కొట్టివేస్తారన్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్ అంగీరిస్తూ, ‘డిస్మిస్డ్ విత్ విత్‌డ్రాన్’గా రూలింగ్ ఇచ్చింది. నేపథ్యం ఇదీ... గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్ క్లియర్ చేసింది. అయితే హిందుస్తాన్ జింక్ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ధర్మాసనం ఆదేశించింది. ‘మేము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నాము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యాఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణలకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్ జింక్ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటాలు ఇలా... ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్ (అనిల్ అగర్వాల్ నడుపుతున్న స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్ లిమిటెడ్) వద్ద హిందుస్తాన్ జింక్‌లో మెజారిటీ 64.92% వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5% వాటా ఉంది. ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ జింక్ షేర్ ధర 4% పైగా పెరిగి రూ.334. 05 వద్ద ముగిసింది. హిందుస్తాన్ జింక్‌పై ఎన్జీటీ రూ.25 కోట్ల జరిమానా రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యావరణ సంబంధ నియమావళిని ఉల్లంఘించినందుకుగాను వేదాంతా గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.25 కోట్ల జరిమానా విధించింది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి హిందుస్తాన్ జింక్ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణ. మూడు వారాల్లో జరిమానా మొత్తాలను జిల్లా మేజిస్ట్రేట్ వద్ద డిపాజిట్ చేయాలని ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఏకే గోయెల్ ఆదేశించారు. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించడంసహా, బాధిత గ్రామాల్లో చెట్లునాటడం తదితర చర్యలు తీసుకుంటామని హిందుస్తాన్ జింక్ ప్రకటించడం గమనార్హం. -
అలాగైతే బడులు తెరవచ్చు!
న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో బడులను తెరవచ్చని కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, కొత్త కేసులు స్థిరంగా తగ్గుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. అందుకే బడులు తెరవడంపై మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు. దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, త్రిపుర, తమిళనాడు, గోవా, మణిపూర్ సహా 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి స్వీటీ ఛాంగ్సన్ చెప్పారు. అసోం, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, కేరళ, నాగాలాండ్, గుజరాత్, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమబెంగాల్ సహా 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాక్షికంగా తెరుచుకున్నాయని, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, పుదుచ్ఛేరి, జార్ఖండ్, లద్దాఖ్, జమ్మూకశ్మీర్, ఒడిశా, దిల్లీ తదితర 9 రాష్ట్రాల్లో ఇంకా పాఠశాలలు పునఃప్రారంభం కాలేదని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో స్కూలు సిబ్బంది వ్యాక్సినేషన్ పూర్తికావచ్చిందన్నారు. ప్రస్తుతం దేశంలో 268 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉందని పాల్ చెప్పారు. కరోనా వల్ల దేశీయ చిన్నారుల విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతింటోందని అందరిలో ఆందోళన ఉందన్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు బడులు తెరిచేందుకు యత్నించాలన్నారు. పాఠశాలలకు నూతన మార్గదర్శకాలివే.. ► పిల్లల మధ్య 6 అడుగులు దూరం ఉండేలా తరగతుల్లో సీటింగ్ ఏర్పరచాలి. ► పాఠశాలలో పరిశుభ్ర వాతావరణం ఉంచుతూ, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► పాఠశాల బస్సులు/వ్యాన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► విద్యార్థులు, సిబ్బంది అంతా మాస్కులు ధరించాలి. ► పిల్లలను స్కూళ్లకు పంపేందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకొనేలా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలి. ► ఒకవేళ తల్లిదండ్రులు ఆన్లైన్ తరగతులవైపే మొగ్గుచూపితే అందుకు అనుమతించాలి. ► ఇల్లులేని, వలస కూలీల పిల్లలు, కోవిడ్ సోకిన పిల్లలపై ప్రత్యేక దృష్టిసారించాలి. -
బాలికల సాధికారతకు ప్రాధాన్యం: మోదీ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలోనూ బాలికా సాధికారతకు పెద్ద పీట వేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అమ్మాయిలకు మర్యాద దక్కేలా, అన్ని రకాల అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ట్వీట్ చేస్తూ ‘‘బాలికల సాధికారతపై మాకున్న చిత్తశుద్ధిని జాతీయ బాలికా దినోత్సవం మాకు గుర్తు చేస్తుంది. వివిధ రంగాల్లో అమ్మాయిలు సాధించిన విజయాలను నెమరువేసుకోవడానికి ఇదొక మంచి సందర్భం’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో మాటామంతీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వోకల్ ఫర్ లోకల్ ప్రచారానికి మద్దతునివ్వాలని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ గ్రహీతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని బహుమతి గ్రహీతలతో ఆన్లైన్లో ముచ్చటించిన ప్రధాని కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ యువతను దృష్టిలో పెట్టుకునే రూపొందిస్తున్నామని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహావిష్కరణ అంశాన్ని ప్రస్తావిస్తూ దేశం కోసం విధి నిర్వహణ నేతాజీ ప్రథమ కర్తవ్యమని, దాని నుంచి స్ఫూర్తి పొంది ప్రతీ ఒక్కరూ దేశాభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. సృజనాత్మక ఆలోచనలతో యువత ముందుకు వెళ్లడం దేశానికే గర్వకారణమన్నారు. -
‘ఈడబ్ల్యూఎస్’ కోటాలో ఆదాయ పరిమితి రూ.8 లక్షలు సమంజసమే
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) వారికి రిజర్వేషన్ల వర్తింపు అర్హతపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు, అంతకంటే తక్కువగా ఉండాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల్ని ఆమోదించాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈడబ్ల్యూఎస్‌ను నిర్వచించడానికి కుటుంబ ఆదాయమే సరైన ప్రమాణంగా కమిటీ సిఫారసు చేసిందని, ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలలోపు ఉండాలన్న సిఫార్సు సమంజసమైన పరిమితిగా భావిస్తున్నామని అఫిడవిట్లో పేర్కొంది. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల వరకు ఉన్న వారే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందడానికి అర్హులవుతారంది. రూ.8లక్షలు దాటితే క్రీమీలేయర్ వర్తింపజేస్తారు. ఆ కుటుంబాల వారు ఈడబ్ల్యూఎస్‌కు అనర్హులు. ఓబీసీ రిజర్వేషన్లకు గత 3 ఆర్థిక సంవత్సరాల వార్షిక ఆదాయం సరాసరిని పరిగణనలోకి తీసుకుంటుండగా ఈడబ్ల్యూఎస్‌కు గత ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్రం తరఫున సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. నీట్–పీజీ అభ్యర్థులు వేసిన పలు పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కోటా ఆదాయ అర్హత ప్రమాణాలను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాలు, నీట్–పీజీ కౌన్సిలింగ్ అర్హతకు కుటుంబ ఆదాయపరిమితిపై సిఫారసులు చేసేందుకు గత నవంబర్‌లో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి వీకే మల్హోత్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత ఏడాది డిసెంబర్ 31న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ‘ఈడబ్ల్యూఎస్ కోటా అర్హతకు అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు, అంతకంటే తక్కువగా ప్రస్తుతమున్న విధానాన్ని కొనసాగించవచ్చు. అంతకుముందు సంవత్సరం కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల వరకు ఉన్న వారు మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులవుతారు.’అని కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసును ప్రభుత్వం ఆమోదించడంలో జాప్యం కారణంగా నీట్–పీజీ–2021 కౌన్సెలింగ్ ఆలస్యం అయింది. దీంతో, ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనలకు దిగారు. న్యాయపరమైన అవరోధాలను తొలగించి, వెంటనే కౌన్సిలింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నీట్–పీజీ కౌన్సెలింగ్ చేపట్టడంలో 8 నెలలపాటు జరిగిన జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో రెసిడెంట్ డాక్టర్లకు తీవ్ర కొరత ఏర్పడిందని వారు పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ ఇంకా ఏం చెప్పిందంటే.. ‘ప్రస్తుతమున్న కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలను భారీ ఆదాయంగా పరిగణించలేము. అందుబాటులో ఉన్న వాస్తవ ఫలితాలను బట్టి చూస్తే ఈ మొత్తం సమంజసమైందిగా ఉంది. సంవత్సరాదాయంలో వ్యవసాయ ఆదాయం, వేతనాలను కూడా కలిపిన విషయం గమనించాలి. ఆదాయంతో సంబంధం లేకుండా అయిదెకరాలు అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబానికి చెందిన అభ్యర్థిని ఈ డబ్ల్యూఎస్ నుంచి మినహాయించవచ్చు. నివాస ఆస్తుల ప్రాతిపదికను తొలగించవచ్చు’అని పేర్కొంది. -
కరోనా కేసుల్లో పెరుగుదల.. జాగ్రత్త సుమా!
న్యూఢిల్లీ/ముంబై: కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతున్న నేపథ్యంలో 8 రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని, ఆస్పత్రుల్లో సన్నద్ధతను పటిష్టం చేయాలని కోరింది. అదేవిధంగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి, వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలంది. ఈ మేరకు ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు కేంద్ర ఆరో గ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈనెల 29న ∙ఒక లేఖ రాశారు. ఇటీవలి కాలంలో ప్రయాణా లు, పండగలు, ఉత్సవాల వంటివి పెరుగుతున్న నేపథ్యంలో వీటిపై ఓ కన్నేసి ఉంచాలని సూచించింది. ‘ఈ శీతాకాలంలో కాలుష్యం కారణంగా, శ్వాస సంబంధ సమస్యల బారినపడే వారిని క్షుణ్నంగా పరీక్షించాలి. కేసులను సకాలంలో గుర్తిస్తే వ్యాప్తిని తగ్గించడంతోపాటు మరణాలను కూడా నివారించవచ్చు. ఈ విషయంలో సానుకూల దృక్పథంతో చర్యలు తీసుకోవాలి’అని కోరింది. గత వారం కోవిడ్ కేసులతోపాటు పాజిటివిటీ రేటులో పెరుగుదల భారీగా నమోదైన మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌లను ‘స్టేట్స్ అండ్ యూటీస్ ఆఫ్ కన్సర్న్’గా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. గురువారం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ ఆక్సిజన్ నిల్వలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. -
నాగాలకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: అమాయక కూలీలపై ఆర్మీ కాల్పులతో రగిలిపోతున్న నాగాలాండ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గురువారం షాకిచ్చింది. సైనిక బలగాలకు విస్తృత అధికారాలు, శిక్ష భీతిని లేకుండా చేస్తున్న ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) నాగాలాండ్‌లో మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. నాగాలాండ్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తూ... అక్కడ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలిచేందుకు సాయుధ బలగాల మొహరింపు తప్పనిసరని తెలిపింది. అందువల్ల ఏఎఫ్ఎస్పీఏ–1958 సెక్షన్ 3 కింద నాగాలాండ్ రాష్ట్రం మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. డిసెంబరు 30 నుంచి ఆరునెలల పాటు ఏఎఫ్ఎస్పీఏ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. చొరబాటుదారులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 3వ తేదీన ఆర్మీ నాగాలాండ్‌లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామ పరిసరాల్లో నిఘా పెట్టింది. పనులు ముగించుకొని ఒక ఓపెన్ జీపులో వస్తున్న బొగ్గుగని కార్మికులపైకి వారెవరనేది ధ్రువీకరించుకోకుండానే సైనికులు కాల్పు లు జరపడంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సైనికులపై దాడి చేయగా.. ఒక జవాను మరణించారు. వీరిని అదుపు చేసే ప్రయత్నంలో ఆర్మీ మళ్లీ కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సైన్యానికి విస్తృత అధికారాలు కట్టబెడుతున్న ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రిఫియూతో పాటు నాగాలాండ్‌లోని అన్ని రాజకీయపక్షాలూ, గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటులో ఈ ఘటనను లేవనెత్తిన విపక్షాలు ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని గట్టిగా కోరాయి. కమిటీ వేసి... అంతలోనే 1958లో ఏఎఫ్ఎస్పీఏను తెచ్చారు. అప్పటినుంచీ నాగాలాండ్‌లో ఇది అమలవుతోంది. ఆరునెలలకు ఒకసారి పొడిగిస్తూ పోతున్నారు. ఓటింగ్ ఘటన తర్వాత నాగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీన్ని గమనించిన నాగాలాండ్ ప్రభుత్వం డిసెంబరు 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి... ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలనే తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఏఎఫ్ఎస్పీఏ ఉపసంహరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం నాలుగురోజులు తిరగకముందే... దీన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. ఆమోదయోగ్యం కాదు: కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని నాగా గిరిజన సంఘాలు తేల్చిచెప్పాయి. కొన్నితరాల పాటు నాగాలను అణచివేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర సర్కారు ఏఎఫ్ఎస్సీఏను పొడిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశా యి. ‘నాగా ప్రజల ఆకాంక్షలను కేంద్రం పట్టించుకోలేదు. చట్టం ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఎంతదూరమైనా వెళతాం’ అని నాగా హోహో సంస్థ ప్రధాన కార్యదర్శి కె. ఎలు ఎన్ డాంగ్ స్పష్టం చేశారు. కేంద్ర నిర్ణయంపై చర్చించడానికి జనవరి 7న సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఈఎన్‌పీవో అధ్యక్షుడు ఆర్.టి.సంగ్టామ్ తెలిపారు. -
చైనా కంపెనీలకు భారత్ షాక్! యాంటీ డంపింగ్ సుంకాలు
న్యూఢిల్లీ: కొన్ని రకాల అల్యుమినియం ఉత్పత్తులు, రసాయనాలు సహా చైనా నుంచి దిగుమతయ్యే అయిదు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం యాంటీడంపింగ్ సుంకం విధించింది. అయిదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. పొరుగు దేశం నుంచి చౌక ఉత్పత్తులు వెల్లువెత్తడం వల్ల దేశీ తయారీదారులు దెబ్బతినకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిర్దిష్ట ఫ్లాట్ రోల్డ్ అల్యుమినియం ఉత్పత్తులు, సోడియం హైడ్రో సల్ఫైట్ (అద్దకం పరిశ్రమలో ఉపయోగించేది), సిలికాన్ సీలెంట్ (సోలార్ ఫోటోవోల్టెయిక్ మాడ్యూల్స్ తయారీలో ఉపయోగపడేది), హైడ్రోఫ్లూరోకార్బన్ కాంపోనెంట్ ఆర్–32 .. హైడ్రోఫ్లూరోకార్బన్ బ్లెండ్స్ (రెండింటిని రిఫ్రిజిరేషన్ పరిశ్రమలో వాడతారు) వీటిలో ఉన్నాయి. వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) నిర్వహించిన దర్యాప్తులో ఈ ఉత్పత్తులను భారత మార్కెట్లో సాధారణ తయారీ రేటు కన్నా చాలా తక్కువకు చైనా ఎగుమతి చేస్తున్నట్లు తేలింది. ఇలా భారీ స్థాయిలో వచ్చి పడుతున్న దిగుమతుల వల్ల (డంపింగ్) దేశీ పరిశ్రమ నష్టపోతోందని వెల్లడైంది. దీంతో డీజీటీఆర్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం సుంకాలు విధించింది. మరోవైపు, ఇరాన్, ఒమన్ తదితర దేశాల నుంచి కాల్సైన్డ్ జిప్సం పౌడరుపైనా యాంటీ డంపింగ్ సుంకం విధించింది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో చైనాకు భారత్ నుంచి ఎగుమతులు కేవలం 12.26 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు ఏకంగా 42.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అధిక కేసులు నమోదవుతున్న 10 రాష్ట్రాలకు కేంద్రం సహాయ బృందాలను పంపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరాం, కర్ణాటక, బిహార్, యూపీ, జార్ఖండ్, పంజాబ్‌ల్లో కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండడంతో నిపుణుల బృందాలను పంపామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల్లో 3–5 రోజులుండి రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి పనిచేస్తాయని తెలిపింది. కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్, తగినన్ని శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడంపై ఈ బృందాలు ప్రత్యేక శ్రద్ధ పెడతాయి. కోవిడ్ నిబంధనల అమలు, ఆస్పత్రుల్లో పడకల వివరాలు, అంబులెన్సులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లభ్యత, టీకా కార్యక్రమంపై సమీక్ష చేస్తాయి. ఆవివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతాయి. ఒమిక్రాన్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు బీఎంసీ(బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ప్రకటించింది. బీఎంసీ పరిధిలోని ఎక్కడా ఉత్సవాలు జరపకూడదని కమిషనర్ ఇక్బాల్ సింగ్ స్పష్టం చేశారు. డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే ముంబైలో రాత్రి పూట ఐదుగురికి మించి గుమికూడడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య శనివారానికి 415కు చేరింది. వీరిలో 115మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర(108)లో నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో ఢిల్లీ(79), గుజరాత్(43), తెలంగాణ(38), కేరళ(37), తమిళనాడు(34), కర్ణాటక(31) ఉన్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 7,189 కరోనా కేసులు, 387 మరణాలు నమోదయ్యాయి. వరుసగా 58వ రోజు కూడా కొత్త కేసులు 15వేలకు లోపు నమోదు కావడం విశేషం. అదేవిధంగా మొత్తం యాక్టివ్ కేసులు 77,032కు చేరాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో ఇది 0.22 శాతానికి సమానం. -
ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ కాదు: భగవత్
ధర్మశాల(హిమాచల్‌ప్రదేశ్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వెనుక నుంచి నడిపిస్తోందని మీడియా చిత్రీకరిస్తోందని, అది నిజం కాదని సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ వంటిదని మీడియా అంటోంది. అది అబద్ధం. స్వయంసేవకులకు ప్రభుత్వం హామీలు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఏం పొందారని మమ్మల్ని కొందరు అడుగుతున్నారు. నా సమాధానం ఒక్కటే. పొందడానికి బదులు మేం ఉన్నది కోల్పోవచ్చు’అని వ్యాఖ్యానించారు. -
వివాహ కనీస వయసు.. పాజిటివ్‌తో పాటు నెగెటివ్ కూడా!
అమ్మాయిల కనీస పెళ్లి వయసును 21 ఏళ్లకు పెంచాలనే నిర్ణయాన్ని భాగస్వామ్యులైన నేటి యువతరం మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. అయితే దేశంలోని పేదరికం, విద్య, వైద్య సదుపాయాలు... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల మనస్తత్వం, వైవాహిక వ్యవస్థపై బలంగా నాటుకుపోయిన భావాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలనేది నిపుణుల భావన. పర్యవసానాల గురించి కూడా ఆలోచించాలనేది వారి సూచన. ఈ నేపథ్యంలో అనుకూల, ప్రతికూల వాదనలేమిటనేది ప్రస్తావనార్హం. అనుకూల వాదన ► అమ్మాయిలకు చదువులు కొనసాగించే వీలు కలుగుతుంది. నైపుణ్యాభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. దాంతో సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో వారో హోదాను పొందుతారు. మహిళా సాధికారికతకు దోహదపడుతుంది. ► ప్రపంచం, చుట్టూ ఉన్న సమాజం పట్ల అవగాహన విస్తృతం అవుతుంది. ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. స్థిరమైన సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోగలుగుతారు. తమ గొంతుకను బలంగా వినిపించగలరు. ► లేబర్ ఫోర్స్‌లో (ఉద్యోగాల్లో) మహిళల సంఖ్య పెరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ 2019 అంచనాల ప్రకారం భారత లేబర్ ఫోర్స్‌లో మహిళలు 20.3 శాతం మాత్రమే. పొరుగునున్న బంగ్లాదేశ్‌లో ఇది 30.5 శాతం. శ్రీలంకలో 33.7 %. 2020లో ప్రపంచ సగటు 46.9 % ► పోషకాహార స్థాయి పెరుగుతుంది. ► గర్భధారణ సమయంలో తలెత్తే సమస్యల కారణంగా (గర్భస్రావం, ప్రసవ సమయంలో) సంభవించే మరణాలు తగ్గుతాయి. 21 ఏళ్లు దాటితే శారీరక ఎదుగుదల బాగుంటుంది కాబట్టి అమ్మాయిలు బిడ్డను కనేందుకు అనువైన వయసు అవుతుంది. ప్రతి లక్ష మందితో గర్భధారణ, ప్రసవ సమయంలో ఎంత మంది మరణిస్తున్నారనే దాన్ని ‘మాటర్నల్ మొర్టాలిటీ రేషియో (ఎంఎంఆర్)గా పిలుస్తారు. 2014–16 మధ్య ఎంఎంఆర్ భారత్‌లో 130 ఉండగా, 2016–18 మధ్య ఇది 113 చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంఎంఆర్‌ను 70గా నిర్దేశించారు. ప్రతికూల వాదన ► అమ్మాయి పెళ్లి ఎప్పుడనేది భారత సమాజంలో తల్లిదండ్రులకు నిత్యం ఎదురయ్యే ప్రశ్న. వారిపై బయటికి కనిపించని సామాజిక ఒత్తిడి. కనీస వయసును 21 ఏళ్లకు పెంచినా గ్రామీణ భారతంలో ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ► కనీస వయసు 21 ఏళ్లకు పెంచకముందే... భారత్‌లో 2019 నాటికే అమ్మాయిల సగటు పెళ్లి వయసు 22.1 ఏళ్లుగా ఉందని భారత గణాంక, పథకాల అమలు శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో, పేదల్లో బాల్యవివాహాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ► ప్రస్తుతం పీసీఎంఏ– 2006లో బాల్యవివాహం చేసిన వారికి, సహకరించిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఫిర్యాదు వస్తేనే కేసులు నమోదవుతున్నాయి. సామాజికంగా ఆమోదయోగ్యం కాబట్టి ఎవరికీ అభ్యంతరం లేకపోతే చెల్లుబాటు అవుతున్నాయి. తేబోయే చట్ట సవరణలో 21 ఏళ్ల కింది వయసులో పెళ్లిళ్లను నిషేధిస్తేనే ఫలితం ఉంటుంది. ► అమ్మాయిలు తమకు నచ్చిన వారిని పెళ్లాడే స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంది. పరువు, కులం పేరిట తల్లిదండ్రులు యువజంటలకు వ్యతిరేకంగా దీన్నో ఆయుధంగా వాడుకునే అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో... అధికభాగం 18 ఏళ్లు నిండకుండానే నచ్చిన వ్యక్తిని పెళ్లాడిన అమ్మాయిల తల్లిదండ్రులు పెడుతున్నవే ఉన్నాయి. ప్రపంచంలోని భిన్న ఖండాల్లోని వివిధ దేశాల్లో అమ్మాయిలు, అబ్బాయిల కనీస వివాహ వయసు ఇలా ఉంది. అమెరికాలో మూడు నాలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నా మెజారిటీ రాష్ట్రాల్లో 18 ఏళ్లుగానే ఉంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
21 ఏళ్లు వచ్చాకే అమ్మాయి పెళ్లి
న్యూఢిల్లీ: దేశంలో మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో మహిళల కనీస వివాహ వయసు పురుషులతో సమానమవనుంది. స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసును సమానం చేసి 21 ఏళ్లుగా నిర్ణయించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం అంగీకారం తెలిపిందని, ఈ శీతాకాల సమావేశాల్లో సంబంధిత సవరణ బిల్లు తేవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమ్మాయిల పెళ్లి వయసు పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు, శిశువులను పౌష్టికాహార లేమి నుంచి కాపాడేందుకు అమ్మాయిల పెళ్లి వయసును పెంచడం అవసరమని గత ఏడాది స్వాతంత్య్రదిన ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. ఈ విషయంపై అధ్యయనానికి సమతా పార్టీ మాజీ చీఫ్ జయా జైట్లీ అధ్యక్షతన గత ఏడాదే నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. డిసెంబర్లో ఈ కమిటీ సిఫార్సులను కేంద్రానికి సమర్పించగా, వీటి పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రతి రంగంలో లింగ సమానత్వం, సాధికారత పెంచాలని భావించేటప్పుడు స్త్రీ కనీస వివాహ వయసును 18 ఏళ్లకు పరిమితం చేయడం సబబు కాదని జయా జైట్లీ అభిప్రాయపడ్డారు. 18 ఏళ్ల పరిమితి వల్ల పలువురు మహిళలు కాలేజీలకు వెళ్లే అవకాశం కోల్పోతున్నారని, పురుషులకు 21 ఏళ్ల వరకు స్వీయ సంసిద్ధత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. పురుషుడితో సమానంగా స్త్రీలకు అవకాశాలు కల్పించాలంటే అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై పలువురి అభిప్రాయాలు స్వీకరించామని, వివాహ వయసు పెంపు ప్రతిపాదనకు మతాలకతీతంగా స్త్రీ సమాజం నుంచి అధిక సానుకూలత వచ్చిందన్నారు. యూనివర్శిటీలు, కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మాయిలతో మాట్లాడామని వివరించారు. ఈ సంఘంలో నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, విద్యావేత్తలు నజ్మా అఖ్తర్, వసుధా కామత్, దీప్తీ షా తదితరులున్నారు. నిపుణుల ఆందోళన వివాహ వయసు పెంచాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు అంటున్నారు. వయసు పెంపు ప్రతిపాదనను చట్టబద్ధం చేయడంతో 21 ఏళ్లకు లోపు చేసే వివాహాలు శిక్షార్హమవుతాయని, దీంతో కలిగే దుష్పరిణామాలు, 18 ఏళ్లకు పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాల కన్నా అధికమని ఆక్స్‌ఫామ్ ఇండియాకు చెందిన అమితా పిత్రే అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం సమాజంలో చిన్న వయసులో చేసే వివాహాల శాతం 23 శాతానికి (27 నుంచి) తగ్గిందన్నారు. ఇటీవల కాలంలో పలు అగ్ర, మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఆడపిల్లలు 21 ఏళ్లు దాటిన చాన్నాళ్లకు పెళ్లాడుతున్నారన్నారు.అనేక సమాజాల్లో సగానికిపైగా వివాహాలు 21 ఏళ్లకు ముందే అవుతున్నాయని, దీన్ని ఒక్కమారుగా శిక్షార్హం చేయడం సమాజంలో అలజడకి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. చట్ట సవరణ చేయడం.. మూలకారణాలను వదిలి లక్షణాలకు చికిత్స చేసినట్లని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. శతాబ్దాలుగా ఉన్న అలవాటు ఒక్కమారుగా పోదంది. అసమానత్వం, పేదరికం, విద్యా వైద్య లేమి, ఉపాధి అవకాశాల కొరత లాంటి పలు అంశాలు బాల్య, చిన్నవయసు వివాహాలకు కారణమని తెలిపింది. ఈ చట్టాలకు సవరణ! మహిళల కనీస వివాహ వయసును మార్చేందుకు ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధ చట్టం (పీసీఎంఏ)– 2006కు సవరణలు తీసుకువస్తుంది. పీసీఎంఏలో స్త్రీ, పురుషుల కనీస వివాహ హక్కు వరుసగా 18, 21 ఏళ్లుగా నిర్ణయించారు. తాజా నిర్ణయంతో పీసీఎంఏతో పాటు స్పెషల్ మ్యారేజ్ (సివిల్) యాక్ట్–1954, హిందూ మ్యారేజ్ యాక్ట్–1955కు సైతం మార్పులు చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కుల వివాహల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనలుంటాయి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మతంతో సంబంధం లేకుండా భారతీయులందరికీ వర్తించే నిబంధనలుంటాయి. –నేషనల్ డెస్క్, సాక్షి -
తొలిరోజే ఉపసంహ‘రణం’
న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ఉపసంహరించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నిర్ణయించింది. అలాగే కోవిడ్–19 మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని తీర్మానించింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అగ్రనేతలు గురువారం సమావేశమయ్యారు. ఈ నెల 29 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మల్లికార్జున ఖర్గే, ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, అధిర రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, మాణిక్కం ఠాగూర్, రవ్‌నీత్‌సింగ్ బిట్టూ, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. సాగు చట్టాలను పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజే రద్దు చేసేలా పట్టుబట్టాలని నిర్ణయించారు. పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్దత కల్పించాలని ఉభయ సభల్లో డిమాండ్ చేస్తామని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను అరెస్టు చేయాలన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. డిమాండ్ల సాధనకు ఇతర పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామని తెలిపారు. -
చమురు ధరలకు భారత్ చెక్!
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా మండుతున్న ముడిచమురు ధరలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకు వీలుగా అత్యవసర వినియోగానికి పక్కనపెట్టే చమురు నిల్వల నుంచి 5 మిలియన్ బ్యారళ్లను విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా యూఎస్, చైనా, జపాన్ బాటలో నడవనుంది. దేశ చరిత్రలోనే తొలిసారి కేంద్ర ప్రభుత్వం 3.8 కోట్ల బ్యారళ్ల(5.33 మిలియన్ టన్నులు) ముడిచమురును నిల్వ చేసింది. ఇందుకు తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో ఏర్పాటు చేసిన భూగర్భ బిలాలను వినియోగించుకుంది. వీటి నుంచి తాజాగా నిర్ణయించిన 5 మిలియన్ బ్యారళ్ల చమురును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో 1.33 మిలియన్ టన్నులు, కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్ టన్నులు, పాడూర్‌లో 2.5 మిలియన్ టన్నులు చొప్పున చమురు స్టోరేజీలున్నాయి. కాగా.. దేశీయంగా రోజుకి 4.8 మిలియన్ బ్యారళ్ల చమురును వినియోగిస్తుండటం గమనార్హం! అమెరికా రెడీ ప్రపంచ ఇంధన ధరలు తగ్గేందుకు వీలుగా నిల్వల నుంచి చమురును విడుదల చేయవలసిందిగా గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో గత వారం యూఎస్ ప్రభుత్వం అభ్యర్థించింది. ఇందుకు ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు చైనా, ఇండియా, జపాన్ తదితరాలనుద్ధేశించి కలసికట్టుగా వ్యవహరించాలంటూ సూచించింది. చమురు ఉత్పత్తిని పెంచమంటూ పలుమార్లు చేసిన అభ్యర్థనలను పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్), తదితర దేశాలు తిరస్కరించిన నేపథ్యంలో యూఎస్ వినియోగ దేశాలకు చమురు విడుదలకు సూచించింది. ఇందుకు మార్గదర్శకత్వాన్ని వహిస్తూ 50 మిలియన్ బ్యారళ్లను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ బాటలో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వుల నుంచి 5 మిలియన్ బ్యారళ్ల విడుదలకు భారత్ సైతం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇతర ప్రధాన వినియోగ దేశాలతో చర్చల ద్వారా భారత్ ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు వివరించాయి. చమురు వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మూడో పెద్ద దేశంగా నిలుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా 72.7 కోట్ల బ్యారళ్ల చమురును నిల్వ చేయగా.. జపాన్ 17.5 కోట్ల బ్యారళ్ల చమురును రిజర్వులో ఉంచుతోంది. సహేతుకంగా లిక్విడ్ హైడ్రోకార్బన్ల ధరలు సహేతుకంగా, బాధ్యతాయుతంగా ఉండాలని బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మార్కెట్ శక్తులు ధరలను నిర్ణయించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. చమురు ఉత్పాదక దేశాలు డిమాండ్ కంటే తక్కువగా సరఫరాలను కృత్రిమంగా సర్దుబాటు చేయడంపై పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేసింది. ఇది ధరల పెంపునకు దారితీస్తున్నట్లు పేర్కొంది. అయితే చమురు విడుదల తేదీని వెల్లడించనప్పటికీ రానున్న 7–10 రోజుల్లోగా నిర్ణయానికి వీలున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మక రిజర్వుల నుంచి పైపులైన్లు కలిగిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్(ఎంఆర్‌పీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)కు చమురును విక్రయించనున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా ప్రకటన... వాషింగ్టన్: దేశ వ్యూహాత్మక రిజర్వుల నుంచి 5 కోట్ల బ్యారళ్ల చమురు విడుదలకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా నిర్ణయించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తద్వారా అమెరికన్ల ఇంధన వ్యయాలను తగ్గించనున్నట్లు తెలియజేసింది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఇండియా, జపాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యూకేలతో సంప్రదింపుల తదుపరి బైడెన్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడుతున్న సమయంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి ఇతర దేశాలతో బైడెన్ చర్చలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఈ అంశంపై కొద్ది వారాలుగా ఇతర దేశాలతో నిర్వహిస్తున్న చర్చలు వెల్లడవుతున్న నేపథ్యంలో ధరలు 10% దిగివచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేసింది. ఇటీవల గ్యాస్ ధరలు గ్యాలన్‌కు 3.4 డాలర్లను తాకినట్లు పేర్కొంది. ఇది ఏడాదిక్రితం ధరలతో పోలిస్తే 50% అధికమని తెలియజేసింది. ధరలు దిగివస్తాయ్.. ప్రపంచంలోనే చమురును అత్యధికంగా వినియోగించే దేశాలు యూఎస్, చైనా, భారత్ తదితరాలు చేతులు కలపడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చే అవకాశమున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాల్లో కోతలకు వ్యతిరేకంగా యూఎస్, భారత్ అత్యవసర నిల్వల నుంచి చమురును దేశ వ్యవస్థలలోకి విడుదల చేయనుండటంతో ధరలకు కొంతమేర చెక్ పడే వీలున్నట్లు తెలియజేశాయి. చమురు సరఫరాలు పెరిగితే.. దిగుమతులను తగ్గించుకోవలసి ఉంటుంది. దీంతో ముడిచమురుకు తాత్కాలికంగా డిమాండ్ తగ్గనుంది. వెరసి ధరలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు కోవిడ్–19 పరిస్థితుల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో తగినంత చమురు సరఫరాలు లేకపోవడం పలు దేశాలలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు యూఎస్ ప్రభుత్వం తాజాగా వ్యాఖ్యానించింది. డిమాండుకు తగిన రీతిలో సరఫరాలను పెంచమంటూ చమురు ఉత్పత్తి, ఎగుమతి(ఒపెక్) దేశాలను అభ్యర్థించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇంధన వినియోగ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు ఏకంకావడంతో ధరలు బలహీనపడే అవకాశమున్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
మద్దతు ధరకు చట్టబద్ధత
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేలా చేసిన రైతన్నలు ఇక కనీస మద్దతు ధర కోసం పోరుబాట పట్టనున్నారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించేంతవరరు ఉద్యమాన్ని కొనసాగించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీలో ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సమావేశమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బలప్రదర్శన చేయాలని నిర్ణయానికొచ్చింది. సోమవారం లక్నోలో మహాపంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించి, కేంద్రానికి రైతుల బలమేంటో మరోసారి చూపిస్తామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు. ‘‘వ్యవసాయ రంగంలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా రైతన్నల కష్టాలు తీరవు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడమే అతి పెద్ద సంస్కరణ’’ అని అన్నారు. పార్లమెంట్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో పాటు తాము చేస్తున్న డిమాండ్లన్నీ కేంద్రం నెరవేర్చేవరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసేవరకు ఉద్యమం కొనసాగేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇందుకోసం మరోసారి ఈ నెల 27న సమావేశం కావాలని నిర్ణయించారు. రైతు సంఘాలు ఆరు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయి. వీటిపై తమతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించేదాకా ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పాయి. 29న పార్లమెంట్ వరకూ ర్యాలీ తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను రైతులు ముమ్మరం చేయనున్నారు. సోమవారం లక్నోలో కిసాన్ పంచాయత్‌తో పాటు ఈ నెల 26న ఢిల్లీలో అన్ని సరిహద్దుల్లో మోహరిస్తామని, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజు అంటే ఈ నెల 29న పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవాలే వెల్లడించారు. 24న కేంద్ర కేబినెట్ సమావేశం న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అవసరమైన అధికార ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నెల 24న (బుధవారం) కేంద్ర మంత్రిమండలి సమావేశమయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల కంటే ముందుగానే కేబినెట్ సమావేశమై చట్టాల రద్దుపై చర్చించి దానికి అవసరమైన తీర్మానాన్ని ఆమోదిస్తుంది. ఆపై ఉపసంహరణ బిల్లుకు తుదిరూపమిస్తారు. ప్రధాని మోదీకి బహిరంగ లేఖ సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది. ఎంఎస్పీకి చట్టబద్ధతతోపాటు మొత్తం ఆరు డిమాండ్లపై రైతులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. ‘‘11 రౌండ్ల చర్చల తర్వాత ద్వైపాక్షిక పరిష్కార మార్గం కనుగొనడం కంటే మీరు(ప్రధాని మోదీ) ఏకపక్ష తీర్మానానికే మొగ్గుచూపారు’’ అని లేఖలో ప్రస్తావించింది. రైతు సంఘాల ఆరు డిమాండ్లు ► పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలి. ► గత ఏడాది కాలంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మందికి పైగా రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ► రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. ► పోరాటంలో రైతుల ప్రాణత్యాగాలకు గుర్తుగా ఒక స్మారక స్తూపం నిర్మించాలి. ► పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు–2020/21 ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి. ‘‘దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం–2021’ లో రైతులపై జరిమాన విధించే అంశాలను తొలగించాలి. హా లఖీమీపూర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలి. -
అన్నదాతల అలుపెరుగని పోరాటం.. వ్యవసాయ చట్టాల కథేంటంటే
అన్నదాతల ఆగ్రహానికి కారణమైన... వారిని అలుపెరుగని పోరాటానికి కార్యోన్ముఖులను చేసిన మోదీ సర్కారు తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలేమిటి? వాటిని కేంద్రం ఎలా సమర్థించుకుంది? రైతుల అభ్యంతరాలేమిటో చూద్దాం... 1. ది ఫార్మర్స్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్– ఎఫ్‌పీటీసీ) యాక్ట్ రైతులు తమ ఉత్పత్తుల ప్రాంతీయ వ్యవసాయ మార్కెట్లలో కాకుండా... వాటి పరిధిని దాటి దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకొనే స్వేచ్ఛను కల్పించింది. అధికధరలు ఎక్కడ లభిస్తే అక్కడ విక్రయించుకోవచ్చు. ఎక్కడి వ్యాపారులైనా... ఎక్కడికైనా వచ్చి పంట ఉత్పత్తులను కొనొచ్చు. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాలను నిర్వీర్యం చేసింది. మార్కెట్ కమిటీలు వసూలు చేసే సెస్‌ను రద్దు చేసింది. ప్రభుత్వ వాదన: రైతులు స్థానిక వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా... తమ ఉత్పత్తులను డిమాండ్ ఉన్నచోటికి తరలించి మంచి ధరకు అమ్ముకోవడానికి ఈ చట్టం వీలుకల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ మార్కెట్ల (ఈ– మార్కెట్లు)లోనూ అమ్ముకోవచ్చు. ఎక్కడో హరియాణాలో ఉన్న వ్యాపారి కూడా ఆన్లైన్ ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో సరుకు కొనుగోలు చేయవచ్చు. ప్యాన్ కార్డులు, ఇతర చట్టబద్ధ ధ్రువపత్రాలు ఉన్నవారెవరైనా సులువుగా ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు రంగంలోకి సులువుగా ప్రవేశించవచ్చు. రైతుల అభ్యంతరం: స్థానిక మార్కెట్లలో తమ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతుంది. వ్యవసాయ మార్కెట్లు లేకపోతే కనీస మద్దతు గ్యారెంటీ ఏముంటుంది? అడిగే దిక్కెవరు? మూడు నుంచి ఐదెరకాల చిన్న కమతాలు ఉన్న రైతులు పంటను రవాణా ఖర్చులు భరించి ఎక్కడో సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవడం సాధ్యమయ్యే పనేనా? కొనుగోలు ఒప్పందంలో ఏదైనా వివాదం తలెత్తినా సమస్య పరిష్కారం కోసం సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చని చట్టంలో ఉంది... సామాన్య రైతులను ఆ స్థాయి అధికారిని కలుసుకొనే అవకాశం ఉంటుందా? నిర్ణీత వ్యాపార లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేని వ్యక్తులు వ్యాపారంలోకి వస్తే... రైతులు మోసపోయే అవకాశాలుంటాయి. 2. ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, 2020 ఒప్పంద వ్యవసాయానికి (కాంట్రాక్టు ఫార్మింగ్) ఇది చట్టబద్ధతను చేకూర్చింది. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు రైతులు ఫలానా ధరకు తమ పంటను అమ్ముతామని కొనుగోలుదారుతో నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొనుగోలుదారులు రైతులకు ఏ పంటకు ఎంత కనీస మద్దతు ధర చెల్లించాలనేది ఈ చట్టంలో ప్రస్తావన లేదు. ప్రభుత్వ వాదన: రైతులు తమ పంట ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకొనే వీలు కలుగుతుంది. ముందస్తు ఒప్పందాల ద్వారా ఎవరికైనా అమ్ముకోవచ్చు. చట్టాల చట్రం నుంచి రైతుకు విముక్తి లభిస్తుంది. రైతుల భయం: వ్యవసాయరంగం కార్పొరేటీకరణకు ఇది బాటలు వేస్తుంది. బడా కంపెనీలదే గుత్తాధిపత్యం అవుతుంది. కనీసం మద్దతు ధర అనే భావన ప్రశ్నార్థకం అవుతుంది. కాంట్రాక్టు వ్యవసాయ విధానంలో సన్న, చిన్నకారులు రైతులు దోపిడీకి గురయ్యే ఆస్కారం ఉంటుంది. రైతుకు లభించే అమ్మకపు ధర మీద నియంత్రణ లేకపోతే... రైతుల బతుకులు గాలిలో దీపాలవుతాయి. వివాదాలు తలెత్తితే బడా కార్పొరేట్ కంపెనీలను ఎదురించి సామాన్య రైతు నిలబడగలడా? 3. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం–2020 నిత్యావసర వస్తువుల నిల్వల పరిమితిపై ఇదివరకున్న ఆంక్షలను ఈ చట్టం ఎత్తివేసింది. అసాధారణ, అత్యయిక పరిస్థితులు తలెత్తితే తప్ప నిత్యావసర వస్తువుల నిల్వలపై ఆంక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా చేసింది. వంటనూనెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల తదితర ఆహార వినియోగవస్తువులను నిత్యావసరాల జాబితాలో నుంచి తొలగించింది. ఉద్యానపంటల ధరలు రిటైల్ మార్కెట్లో 100 శాతం పెరిగితే, ఆహారధాన్యాల ధరలు 50 శాతానికి పైగా పెరిగితేనే వ్యాపారులు, హోల్సేలర్ల వద్ద సదరు సరుకులు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరిమితులు విధించడానికి ఈ చట్టంలో వీలుకల్పించారు. మొత్తానికి ఈ నిబంధన మూలంగా రైతులపై పెద్దగా ప్రభావం ఉండదు కాని వినియోగదారులకు చేటు చేసేదే. పరిమితి లేకపోతే భారీగా నిల్వలు చేయడం ద్వారా బడా వ్యాపారులు కృతిమ డిమాండ్‌ను సృష్టించి నిత్యావసరాల ధరలను పెంచే ముప్పు పొంచి ఉంటుంది. జూన్ 5 2020: మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ప్టెంబరు 14–22: ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడం, పెద్దగా చర్చలేకుండా లోక్‌సభ, రాజ్యసభలు మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయింది. సెప్టెంబర్ 27: రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, క్రిప్టో కరెన్సీకి చట్ట బద్ధత కల్పించడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు మరోసారి స్పష్టం అయ్యింది. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని భావిస్తున్న 2022–23 బడ్జెట్లోనే ఈ మేరకు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన సూచించారు. క్రిప్టో కరెన్సీని కొందరు అసెట్‌గా భావిస్తున్నారని అన్నారు. తద్వారా వచ్చే ఆదాయంపై ఇప్పటికే కొంత మంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని తరుణ్ బజాజ్ తెలిపారు. ఇతర కొన్ని సేవల తరహాలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా క్రిప్టోకి వర్తిస్తుందని చట్టం ‘చాలా స్పష్టంగా‘ చెబుతోందని వివరించారు. ‘‘క్రిప్టోపై పన్ను అంశాలపై మేము దృష్టి సారిస్తాము. ఇప్పటికే ప్రజలు దానిపై పన్నులు చెల్లిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొనుగోళ్ల పరిమాణం నిజంగానే చాలా పెరిగింది. ఈ అంశంపై పన్నులకు సంబంధించి కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకురాగలమా లేదా అని చూద్దాం. అయితే ఇది బడ్జెట్ నాటికి సిద్ధం అవుతుంది. మనం ఇప్పటికే బడ్జెట్‌కు దగ్గరగా ఉన్నాము. బడ్జెట్లో ప్రతిపాదనలను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలించాలి’’ అని బజాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిప్టో ట్రేడింగ్ విషయంలో టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. వేగంగా పరిణామాలు... క్రిప్టో కరెన్సీపై దేశంలో నియంత్రణకానీ, నిషేధంకానీ లేవు. ఈ వర్చువల్ కరెన్సీల వల్ల ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర విఘాతమని ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రకటనల నేపథ్యంలో మీడియాలో దీనికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడుతున్నాయి. సినీ స్టార్ నుంచి క్రీడాకారుల వరకూ క్రిప్టోకు సానుకూలంగా ప్రచారం చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిపై భారీ రాబడులు వస్తాయంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలు వస్తున్నాయన్న ఆందోళనల మధ్య స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు క్రిప్టోపై నిషేధం తగదని, దీనిపై నియంత్రణ మాత్రమే ఉండాలని బీజేపీ నాయకుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని జరిగిన తాజా పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచీ ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులుసహా తన నియంత్రిత సంస్థలను అన్నింటిపైనా నిషేధం విధిస్తూ, 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను 2021 మార్చి 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. -
రెట్రో ట్యాక్స్‌పై కెయిర్న్ ఆఫర్‌కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: రెట్రో ట్యాక్స్ వివాదాలను సత్వరం పరిష్కరించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కెయిర్న్ ఎనర్జీ సమర్పించిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం అంతర్జాతీయ కోర్టుల్లో భారత్‌పై వేసిన కేసులన్నింటినీ కెయిర్న్ ఉపసంహరించుకోవడం ప్రారంభిస్తుంది. ఇది పూర్తయ్యాక, కంపెనీకి ప్రభుత్వం దాదాపు రూ. 7,900 కోట్ల పన్నులను రీఫండ్ చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసుల ఉపసంహరణకు మూడు–నాలుగు వారాలు పట్టొచ్చని వివరించాయి. గత లావాదేవీలకు కూడా పన్నులు విధించేందుకు వెసులుబాటు నిచ్చే చట్ట సవరణ (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) ద్వారా ట్యాక్స్‌లు వసూలు చేయడంపై కెయిర్న్ సహా పలు కంపెనీలు, కేంద్రం మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదం కావడంతో ఈ చట్టాన్ని పక్కన పెట్టి, ఆయా కంపెనీల నుంచి వసూలు చేసిన పన్నులను తిరిగి ఇవ్వడం ద్వారా వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టాలని కేంద్రం భావించింది. అయితే, ఇందుకోసం భారత్‌పై అంతర్జాతీయ కోర్టుల్లో పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని సంస్థలకు షరతు విధించింది. దానికి అనుగుణంగానే కెయిర్న్ తాజా ఆఫర్ ఇచ్చింది. -
పల్లెపల్లెకూ మొబైల్
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ సేవలు లేని గ్రామాలకు 4జీ సేవలు అందించడానికి కేంద్రం సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో 1,218 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 44 ఆకాంక్ష (యాస్పిరేషనల్) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించడంలో భాగంగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలు బుధవారం సమావేశమయ్యాయి. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. యూఎస్ఓఎఫ్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాల్లోని 44 ఆకాంక్ష జిల్లాల్లో 7,287 గ్రామాల్లో సుమారు రూ.6,466 కోట్ల అంచనా వ్యయంతో 4జీ ఆధారిత మొబైల్ సేవలు అందించనున్నట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాల అనంతరం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ... ఏపీలోని ఆకాంక్ష జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, కడపల్లోని మారుమూల గ్రామాలకు మొబైల్ సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో 1,054, విజయనగరంలో 154, కడప జిల్లాలో 10 గ్రామాల్లో మొబైల్ సేవల విస్తరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.మొత్తంగా 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్ పవర్ బ్యాటరీలు ద్వారా టెలికాం టవర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. 2022 వరకు పీఎంజీఎస్‌వై పథకం ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం ఫేజ్ 1, 2 లను సెప్టెంబరు 2022 వరకూ కొనసాగించనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. రూ.33,822 కోట్లతో గిరిజన, మారుమూల ప్రాంతాల్లో 32,152 కి.మీ.ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మైదాన ప్రాంతాల్లో 500 పైగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల్లో 250పైగా జనాభా ఉన్న గ్రామాలకు రహదారుల అనుసంధానం నిమిత్తం కేంద్రం పీఎంజీఎస్‌వైను ప్రారంభించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధానం (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఏ) ద్వారా 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 4,490 కిలోమీటర్ల మేర రహదారిలో 105 వంతెనలు ఇప్పటికే పూర్తిచేశామన్నారు. 5,714 కిలోమీటర్ల రహదారి, 358 వంతెనలు పూర్తి కావాల్సి ఉండగా మరో 1,887 కిలోమీటర్ల రహదారి, 40 వంతెనల నిర్మాణాలకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. ఈ పథకాన్ని మార్చి 2023 వరకు కొనసాగించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంతాల రాష్ట్రాల్లోని మిగిలిన పనులు పూర్తి కానున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ పదవీకాలం ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాము అనుకున్నదే చేస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల దాకా పొడిగించే వెసులుబాటును కల్పిస్తూ ఇటీవలే వివాదాస్పద ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చిన కేంద్రం... దీనికి అనుగుణంగానే ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని బుధవారం మరో ఏడాదిపాటు పెంచింది. 1984 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన మిశ్రా 2018 నవంబరు 18న రెండేళ్ల పదవీకాలానికి ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2020లో ఆయన పదవీకాలాన్ని పెంచుతూ... రెండేళ్ల బదులు మూడేళ్లకు గాను ఆయన్ను ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర నియామక ఉత్తర్వులను సవరించింది. కొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... ఆ ఒక్కసారికి పొడిగింపునకు సమ్మతించిన కోర్టు తదుపరి మాత్రం సంజయ్‌కుమార్ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అయినప్పటికీ సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పదవీకాలాన్ని పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చి... మిశ్రాకు మరో ఏడాది పొడిగింపునిచ్చింది. గురువారం ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా... 2022 నవంబరు 18 దాకా ఆయన పదవిలో కొనసాగుతారని బుధవారం ఆదేశాలు జారీచేసింది. జాబితాలోకి విదేశాంగ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు అర్హుల జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేరుస్తూ కేంద్రం ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను సవరించింది. రక్షణ, హోంశాఖ కార్యదర్శులు, ఐబీ డైరెక్టర్, ‘రా’ కార్యదర్శి, సీబీఐ, ఈడీల డైరెక్టర్ల పదవీకాలాన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించేలా ఆదివారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో విదేశాంగ కార్యదర్శిని చేర్చింది. -
ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలకమైన చర్యలు చేపట్టబోతున్నట్లు బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. నగరంలోకి నిత్యావసర సరుకు రవాణాల వాహనాలు తప్ప ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు తెలిపింది. విద్యా సంస్థలను మూసివేయడంతోపాటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 థర్మల్ పవర్ ప్లాంట్లలో కేవలం ఐదు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతిస్తామని, మిగిలినవి ఈ నెలాఖరు వరకూ మూసివేయనున్నట్లు పేర్కొంది. ఎన్టీపీసీ ఝాజ్జర్, మహాత్మాగాంధీ టీపీఎస్, సీఎల్పీ ఝాజ్జర్, పానిపట్ టీపీఎస్, హెచ్పీజీఎల్సీ, నభాపవర్ లిమిటెడ్ టీపీఎస్ రాజ్‌పురా, తల్వాండి సాబో టీపీఎస్ మాన్సాలను అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒక అఫిడవిట్‌ను సమర్పించారు. ఈ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించడానికి వీలుగా పరిసర రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తొలగించడానికి రైతులకు ఉచితంగా యంత్రాలను అందజేయాలని కోరుతూ పర్యావరణ కార్యకర్త ఆదిత్య దూబే, న్యాయ విద్యార్థి అమన్ బాంకా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ‘గాలి నాణ్యత నిర్వహణ కమిషన్’ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ఢిల్లీతోపాటు పరిసర రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు నవంబర్ 15న ఇచ్చిన ఆదేశాల ప్రకారం నవంబర్ 16న గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ అత్యవసర సమావేశం ఏర్పాట చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. నిర్వహణ కమిషన్ నిర్ణయాలు/ఆదేశాలు ► ఢిల్లీ, పరిసర రాష్ట్రాలు గ్యాస్‌తో అనుసంధానమైన పరిశ్రమలను గ్యాస్‌తోనే నడిపేలా చూడాలి. అనుమతి లేని ఇంధనాలతో నడిచే పరిశ్రమలను వెంటనే మూసివేయాలి. ► నిత్యావసర సరకులను తరలించే ట్రక్కులు మినహా మిగతా ట్రక్కులకు ఈ నెల 21 వరకు ఢిల్లీలోకి ప్రవేశం నిషేధించాలి. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు రహదారులపై తిరగకుండా చూడాలి. ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని సీఎన్జీ బస్సులను అందుబాటులో తీసుకురావాలి. ► నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేయాలి, స్మాగ్ టవర్లు ఉపయోగించాలి. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో (హాట్స్పాట్లు) రోజుకి కనీసం మూడుసార్లు స్ప్రింకర్లు, డస్ట్ సప్రెసెంట్లు ఉపయోగించాలి. ► అత్యసవర సేవలకు మినహా డీజిల్ జనరేటర్లు వినియోగాన్ని కచ్చితంగా నిషేధించాలి. ► దేశ రాజధాని ప్రాంత రాష్ట్రాలు నవంబరు 21 వరకూ కనీసం 50 శాతం ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలి. ప్రైవేట్ సంస్థలను ఆ దిశగా ప్రోత్సహించాలి. ► తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను మూసివేయాలి. ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలి. నిర్ణయాలన్నీ కోర్టులే తీసుకోవాలా?: సుప్రీం ఢిల్లీలో కాలుష్యానికి కారణం పంట వ్యర్థాల దహనమేనని అనడం సమంజసం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కొందరు వ్యక్తులు స్టార్ హోటళ్లలో కూర్చొని, నాలుగైదు శాతం కాలుష్యానికి కారణమయ్యే రైతులపై నిందలు వేస్తున్నారని ఆక్షేపించింది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ‘వారం రోజులపాటు పంట వ్యర్థాలు దహనం చేయొద్దని రైతుల్ని కోరాలని ఇప్పటికే కేంద్రానికి సూచించాం. టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో ఎవరి అజెండా ప్రకారం వారు మాట్లాడుతున్నారు. ఇదే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తోంది’ అని కోర్టు పేర్కొంది. నిర్మాణాలు, పరిశ్రమల కార్యకలాపాలు ఏడాది పొడవునా సాగుతూనే ఉంటాయని, వాటిపై చర్యలు తీసుకోకుండా పంట వ్యర్థాల దహనం గురించే ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీసింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఒక రకమైన ఉదాసీనత పెరిగిందని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు కోరుకోవడం లేదని తప్పుపట్టారు. అన్ని నిర్ణయాలు కోర్టులే తీసుకోవాలని వారు ఆశిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిష్క్రియాపరత్వం ఎందుకని ప్రశ్నించారు. పిటిషనర్ తరపున అడ్వొకేట్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. వాయు కాలుష్యంపై అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారే గానీ ఏదీ జరగడం లేదని తెలిపారు. పంట వ్యర్థాల దహనాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని కోరారు. పంట వ్యర్థాల దహనం 36 శాతం కాలుష్యానికి కారణమవుతున్నట్లు ‘సఫర్’ అధ్యయనం చెబుతోందని ఢిల్లీ ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ పేర్కొన్నారు. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ సూచనలను పాటించాలని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏడాదికి రూ.లక్ష కోట్ల నష్టం కరోనా ధాటికి ఢిల్లీ విలవిలలాడిపోయింది. కోవిడ్‌తో గత 18 నెలల్లో 25 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఏడాదిన్నరలో ఎన్నోసార్లు కఠినమైన లాక్డౌన్లు విధించి కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ కరోనా కంటే ప్రతీ ఏడాది కాలుష్యం అనే భూతం ఢిల్లీని భయపెడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టైనా ఎందుకు లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాలుష్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత ఏడాది ఢిల్లీలో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఢిల్లీలో కాలుష్యంతో నిండిన ఒక రహదారి కరోనా తరహాలో కాలుష్యం ఆరోగ్యంతో పాటు ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తోంది. ప్రతీ ఏడాది దేశ రాజధానికి లక్ష కోట్ల రూపాయల నష్టం వస్తోంది. అయినప్పటికీ కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వాల్లో కదలిక రావడం లేదు. ప్రఖ్యాత లాన్సెట్ మ్యాగజైన్ ప్రకారం 2019లో భారత్‌లో కాలుష్యం బారిన పడి 16.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు ఏడాది శిలాజ ఇంధనాల కాలుష్యంతో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని హార్వార్డ్ అధ్యయనం తేటతెల్లం చేస్తోంది. కాలుష్య నష్టాన్ని ఎలా లెక్కిస్తారు ? కాలుష్యం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని రెండు పద్ధతుల్లో లెక్కిస్తారు. ఉత్పత్తి సామర్థ్యమున్న ప్రజలు ముందుగానే మరణించడం, కాలుష్యంతో అనారోగ్యం పాలైన వారికి చికిత్స చెయ్యడానికైన ఖర్చు, పని చేసే ప్రాంతాల్లో దగ్గు, జలుబుతో బాధపడడం వల్ల పడిపోయిన ఉత్పాదకత వంటి వాటినన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కాలుష్యంతో ఏర్పడిన నష్టాన్ని లెక్కిస్తారు. ఆ విధంగా చూసుకుంటే కాలుష్యంతో దేశ జీడీపీలో 4.5 శాతం నష్టం ప్రతీ ఏడాది వాటిల్లుతోంది. గ్రీన్‌పీస్ సంస్థ వేసిన అంచనాల ప్రకారం గత ఏడాది కాలుష్యంతో ఢిల్లీ రాష్ట్ర జీడీపీలో 13 శాతం అంటే దాదాపు రూ.60 వేల కోట్ల నష్టం వాటిల్లింది. విల్లింగ్ టు పే (డబ్ల్యూటీపీ) అనే విధానంలోనూ కాలుష్య నష్టాన్ని లెక్కిస్తారు. దీని ప్రకారం కాలుష్య నివారణకు ప్రజలు ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్న లెక్కల ఆధారంగా చూస్తే ఢిల్లీకి ఏడాదికి లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతోంది. కాలుష్య సమస్య నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేవీ శాశ్వత చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంత అవసరం ఏమొచ్చింది?
న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుల విషయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆగమేఘాల మీద ఆర్డినెన్సులను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. కొన్ని వ్యవస్థలకు ఉన్న స్వతంత్రతను ఈ ఆర్డినెన్సులతో కేంద్రం పూర్తిగా తుడిచిపెట్టేసిందని విమర్శించాయి. ఆర్డినెన్స్ రాజ్యాన్ని తీసుకొచ్చి, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆరోపించారు. రెండు వారాల్లో పార్లమెంటు సమావేశాలు పెట్టుకుని వాటిని తీసుకురావడం పార్లమెంటరీ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని దుయ్యబట్టారు. పదవీ కాలం పొడిగింపు చాలా తక్కువ కాలం ఉండాలన్న సుప్రీం కోర్టు తీర్పును తప్పించుకునేందుకే కేంద్రం ఈ ఆర్డినెన్సులను తీసుకొచ్చిందని విమర్శించారు. ‘ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టు.. ఎక్స్టెన్షన్ పట్టు’అన్న చందంగా కేంద్రం తీరు ఉందని పేర్కొంది. ఇప్పటివరకు ఈ సంస్థలకు ఎంతో కొంత సమగ్రత ఉందని, ఆర్డినెన్స్ రాజ్యాన్ని తీసుకొచ్చి, వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. కాగా, కేంద్ర నిరంకుశ పాలనను ప్రతిపక్షాలమంతా కలసి అడ్డకుంటామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒ బ్రియెన్ పేర్కొన్నారు. ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా టీఎంసీ రాజ్యసభలో నోటీసులు అందించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రూల్స్‌కు సంబంధించి ప్రాథమిక నిబంధనల్లో కేంద్రం సవరణలు చేసింది. సర్వీసులో ఉన్న ఉద్యోగులు, రిటైర్మెంట్ అనంతరం విధులకు సంబంధించి అన్ని అంశాలు ఈ నిబంధనల్లో ఉంటాయి. ఈ నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి సర్వీసును కూడా రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు మించి పొడిగించడానికి వీల్లేదు. కాకపోతే కేబినెట్ సెక్రటరీ, బడ్జెట్ సంబంధిత అంశాలు చూసుకునే అధికారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఐబీ, ఆర్ఏడబ్ల్యూ చీఫ్‌లు, సీబీఐ డైరెక్టర్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే తాజాగా చేసిన సవరణల్లో డిఫెన్స్ సెక్రెటరీ, హోం సెక్రెటరీ, ఐబీ డైరెక్టర్, ఆర్ఏడబ్ల్యూ, సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పెంచే అధికారం కేంద్రానికి వచ్చింది. కాగా, సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రాథమిక నిబంధనల జాబితా నుంచి విదేశీ వ్యవహారాల సెక్రటరీని తొలగించి ఈడీ పేరును చేర్చారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకేనా? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డినెన్స్–2021, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్డినెన్స్–2021 ప్రకారం సీబీఐ డైరెక్టర్, ఈడీ చీఫ్‌ల పదవీకాలాన్ని ఒకేసారి ఏడాది పాటు పెంచే వీలుంది. ఆ పొడిగింపు ఐదేళ్లకు మించి ఉండొద్దని ఈ రెండు ఆర్డినెన్సులు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఈడీ చీఫ్ ఎస్కే మిశ్రా బుధవారంతో ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ఆర్డినెన్సులు తీసుకురావడం చర్చనీయాంశమైంది. రెండేళ్ల పాటు ఈడీ చీఫ్‌గా పనిచేసిన అనంతరం 2020లో ఆయన పదవీ కాలాన్ని కేంద్రం ఏడాది పాటు పెంచింది. -
నిజాయితీపరులైన బ్యాంకు ఉద్యోగులకు భరోసా
న్యూఢిల్లీ: నిజాయితీగా పనిచేసే బ్యాంకు ఉద్యోగులకు రుణాలపరమైన మోసాల కేసుల్లో చర్యల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. సిబ్బంది జవాబుదారీతనానికి సంబంధించి నిబంధనలు సూచించింది. రూ. 50 కోట్ల దాకా విలువ చేసే రుణాల మంజూరు విషయంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు తారుమారైనా సదరు ఉద్యోగినే బాధ్యుడిగా చేసి, చర్యలు తీసుకోకుండా వీటిని రూపొందించింది. కేవలం నిజాయితీగా తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయని, దురుద్దేశంతో తీసుకున్న వాటికి వర్తించబోవని ఆర్థిక శాఖ తెలిపింది. ఇలాంటి కేసుల్లో విచారణ జరిపేందుకు పాటించాల్సిన విధానాలను వివరించింది. రుణాన్ని మొండిబాకీగా వర్గీకరించిన ఆరు నెలల్లోగా జవాబుదారీగా వ్యవహరించాల్సిన వారిని గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. ఓవైపు నిజాయితీగా నిర్ణయాలు తీసుకున్న ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూనే మరోవైపు సిబ్బంది జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా ఈ మార్గదర్శకాలు ప్రోత్సహించగలవని ఆర్థిక శాఖ పేర్కొంది. ఓ సంస్థ రుణ ఎగవేత కేసుకు సంబంధించి ఎస్బీఐ మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా పలువురు బ్యాంకర్లు రుణ డిఫాల్ట్ కేసుల్లో అరెస్ట్ అవ్వడం గమనార్హం. సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) విచారణలకు భయపడి, కొన్ని రకాల రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ భయాలను పోగొట్టి, రుణ వితరణను మెరుగుపర్చేలా బ్యాంకర్లను ప్రోత్సహించేందుకు తాజా మార్గదర్శకాలు ఉపయోగపడగలవని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఎండీ ఎస్ కృష్ణన్ తెలిపారు. -
కేంద్రంలో మోదీ.. యూపీలో యోగి
సాక్షి, న్యూఢిల్లీ: 2024లో కేంద్రంలో నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిగా చేయాలంటే.. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలిపించి, యోగి ఆదిత్యనాథ్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన యూపీ రాజధాని లక్నోలో పర్యటించారు. ‘మేరా పరివార్–బీజేపీ పరివార్’ పేరిట సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చేందుకు మరో ఐదేళ్లు బీజేపీ అధికారంలో ఉండడం అవసరమని చెప్పారు. రాష్ట్రంలో మాఫియాను తరిమికొట్టే అతిపెద్ద పనిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేశారని ప్రశంసించారు. 1.43 లక్షల మందికి పైగా పోలీసు సిబ్బంది నియామకంలో ఎక్కడా ఎలాంటి అవినీతి జరగలేదని గుర్తుచేశారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి, వరదల సమయంలో అఖిలేష్ యాదవ్, రాహుల్‌గాంధీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. యూపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుచుకోవాలని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 1.5 కోట్ల నూతన కార్యకర్తలే లక్ష్యం: యోగి ఏక్ భారత్, శ్రేష్ట భారత్ కలను ప్రధాని మోదీ సాకారం చేశారని సీఎం యోగి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో కొత్త చైతన్యం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు 1.5 కోట్ల మంది కొత్త కార్యకర్తలను తయారు చేసుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా నేతృత్వంలో అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతుండడంపై ప్రజలంతా గర్వపడుతున్నారని తెలిపారు. -
ఏజీఆర్ లెక్కింపుపై టెల్కోలకు ఊరట
న్యూఢిల్లీ: టెలికం సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించే దిశగా లైసెన్స్ నిబంధనలను కేంద్రం సవరించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కించే విధానంలో మార్పులు చేసింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల విధింపునకు సంబంధించి టెలికంయేతర ఆదాయాలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం మొదలైన వాటిని ఏజీఆర్ నుంచి మినహాయించింది. ఇకపై టెల్కోల స్థూల ఆదాయం నుంచి ముందుగా వీటిని మినహాయిస్తారు. ఆ తర్వాత మిగిలే మొత్తం నుంచి ఇప్పటికే మినహాయింపులు అమలవుతున్న రోమింగ్ ఆదాయాలు, ఇంటర్కనెక్షన్ చార్జీల్లాంటి వాటిని తీసివేసి తుది ఏజీఆర్‌ను లెక్కిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచే ఈ సవరణను వర్తింపచేస్తున్నట్లు టెలికం శాఖ (డాట్) తెలిపింది. గత ఏజీఆర్ లెక్కింపు విధానం కారణంగా టెల్కోలపై ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల బకాయిల భారం పడుతోంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో ఏజీఆర్ సవరణ కూడా ఒకటి. ‘మారటోరియం’కు ఎయిర్టెల్ ఓకే! సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్), స్పెక్ట్రమ్ బకాయిల చెల్లింపుపై నాలుగు సంవత్సరాల మారటోరియం తనకు అంగీకారమేనని భారతీ ఎయిర్టెల్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగానికి ఇటీవల ప్రకటించిన సహాయక ప్యాకేజీలో భాగంగా టెల్కోలకు బకాయిలపై మారటోరియం అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. -
భారత్ బాండ్ ఈటీఎఫ్‌తో రూ.10,000 కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్రం డిసెంబర్‌లోగా భారత్ బాండ్ ఈటీఎఫ్ (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ద్వారా రూ.10,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశం ఉందని ఆర్థిక శాఖలో ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పురోగతి ప్రణాళికలకు ఈ నిధులను వినియోగిస్తారు. ఇదే జరిగితే భారత్ బాండ్ ఈటీఎఫ్ జారీ ఇది మూడవ విడత అవుతుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల సులభతర రుణాలకు సంబంధించి ఒక పెట్టుబడి సాధనం. ఈటీఎఫ్ ప్రస్తుతం ప్రభుత్వ రంగ కంపెనీల ’ఏఏఏ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. 2020 జూలైలో రెండవ విడత భారత్ బాండ్ ఈటీఎఫ్ జారీ జరిగింది. మూడురెట్లకుపైగా ఇది ఓవర్సబ్స్రై్కబ్ అయ్యింది. రూ.11,000 కోట్ల సమీకరణలు జరిగాయి. ఇక 2019 డిసెంబర్లో వచ్చిన తొలి ఆఫర్ ద్వారా రూ.12,400 కోట్ల సమీరణలు జరిగాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు మొదటి విడతలో మూడు, పది సంవత్సరాల మెచ్యూరిటీ ఆప్షన్లు ఉండగా, రెండవ విడతకు ఐదు, 12 సంవత్సరాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎడెల్వైస్ అసెట్ మేనేజ్మెంట్ ఈ పథకం ఫండ్ మేనేజర్. -
ఏడు మెగా టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఏడు మెగా టెక్స్టైల్ పార్క్‌ల ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం–ఎంఐటీఆర్‌ఏ) పార్క్ స్కీమ్ కింద ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు రూ.4,445 కోట్ల కేటాయింపులతో ఈ స్కీమ్ అమలు ప్రతిపాదనను 2021–22 బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కొక్క పార్క్ ద్వారా లక్ష ప్రత్యక్ష, రెండు లక్షల పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన ప్రధాన ఉద్దేశ్యం. పార్క్‌ల ఏర్పాటుకు ముందుకు వస్తున్న రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు జరుగుతుంది. 1,000 ఎకరాలకుపైగా అందుబాటులో ఉన్న భూమి, టెక్స్‌టైల్స్‌కు సంబంధించి ఇతర సౌలభ్యత, తగిన పర్యావరణ వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని పార్క్‌ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించడం జరుగుతోందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రాజెక్టుల అత్యాధునిక సాంకేతికతను అలాగే భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, స్థానిక ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షిస్తాయని టెక్స్టైల్ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలుగురాష్ట్రాలుసహా తమిళనాడు, పంజాబ్, ఒడిస్సా, గుజరాత్, రాజస్తాన్, అస్సోం, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు పార్క్‌ల ఏర్పాటుకు తమ ఉత్సుకతను తెలియజేసినట్లు కూడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. -
వైజాగ్ స్టీల్ విక్రయానికి సలహా సంస్థల క్యూ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్)లో కేంద్ర ప్రభుత్వానికి గల 100 శాతం వాటా విక్రయ లావాదేవీని చేపట్టేందుకు ఐదు కంపెనీలు బిడ్ చేసినట్లు దీపమ్ తాజాగా వెల్లడించింది. జాబితాలో యర్నెస్ట్ అండ్ యంగ్‌సహా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డెలాయిట్ టచ్ తోమత్సు, జేఎం ఫైనాన్షియల్, ఆర్బీఎస్ఏ క్యాపిటల్ అడ్వయిజర్స్ చేరినట్లు వెబ్సైట్లో పేర్కొంది. రేసులో నిలిచిన అడ్వయిజర్ కంపెనీలు ఈ నెలాఖరులోగా దీపమ్ వద్ద ప్రజెంటేషన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించేందుకు జులై 7న ఆసక్తి గల కంపెనీల నుంచి దీపమ్ బిడ్స్‌ను ఆహా్వనించింది. ఇందుకు తొలుత ప్రకటించిన గడువును జూలై 28 నుంచి ఆగస్ట్ 26 వరకూ పొడిగించింది. వాటా విక్రయ లావాదేవీ నిర్వహణకు దీపమ్ ఒకే అడ్వయిజర్ సంస్థను ఎంపిక చేయనుంది. సలహా సంస్థ వైజాగ్ స్టీల్‌తోపాటు.. అనుబంధ కంపెనీలలోనూ వాటా విక్రయ వ్యవహారాన్ని చేపట్టవలసి ఉంటుంది. కాగా.. మరోవైపు న్యాయ సలహాదారుగా వ్యవహరించేందుకు సైతం ఐదు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ కంపెనీలు కూడా ఈ నెల 30న దీపమ్‌కు ప్రతిపాదనలు అందించవలసి ఉంటుంది. వీటిలో చాందియోక్ అండ్ మహాజన్, ఎకనమిక్ లాస్ ప్రాక్టీస్, జే సాగర్ అసోసియేట్స్, కొచ్చర్ అండ్ కంపెనీ, లింక్ లీగల్ ఉన్నాయి. జనవరిలోనే.. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్(సీసీఈఏ) ఈ ఏడాది జనవరి 27న రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్)లో పూర్తి వాటా విక్రయానికి ముందస్తు అనుమతిని మంజూరు చేసింది. ప్రైవేటైజేషన్ ద్వారా అనుబంధ సంస్థలతోపాటు వైజాగ్ స్టీల్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. -
సెజ్‌ల నిబంధనల సరళతరంపై కసరత్తు
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) నిబంధనలు సరళతరం చేయడంపైనా, వీటి నుంచి యూనిట్లు వైదొలిగే ప్రక్రియను సులభతరం చేయడంపైనా కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ ఈ విషయాలు తెలిపారు. డిమాండ్ అంతగా లేని ప్రాంతాల్లోని ప్రస్తుత సెజ్‌ల గుర్తింపును పాక్షికంగా ఉపసంహరించి, ఆయా స్థలాలను పారిశ్రామిక.. ఇతరత్రా అవసరాలకు వినియోగించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు. సెజ్‌లకు పన్ను రాయితీల గడువు ముగిసిపోతున్నందున వీటిలో యూనిట్లను ఏర్పాటు చేయడానికి కొత్త వ్యాపారవేత్తలు పెద్ద స్థాయిలో ఆసక్తి చూపకపోవచ్చని గోయల్ తెలిపారు. ముంబైలోని శాంటాక్రూజ్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎగుమతిదారులతో భేటీ సందర్భంగా గోయల్ ఈ విషయాలు వివరించారు. 2020 మార్చి 31లోగా కార్యకలాపాలు ప్రారంభించిన కొత్త సెజ్ యూనిట్లకు మాత్రమే ఆదాయ పన్నుపరమైన ప్రయోజనాలు లభిస్తాయంటూ 2016–17 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం షరతు పెట్టింది. ఎగుమతి హబ్‌లుగా ఎదిగిన సెజ్‌లు.. ప్రత్యామ్నాయ పన్ను వడ్డన, రాయితీల ఉపసంహరణ గడువు విధింపు వంటి అంశాల కారణంగా క్రమంగా ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లాజిస్టిక్స్ సెంటర్ ప్రారంభం.. మరోవైపు, ముంబైలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను గోయల్ ప్రారంభించారు. అంతర్జాతీయంగా పోటీ, ఆర్థిక సంక్షోభపరమైన సవాళ్ల కారణంగా సరఫరా వ్యవస్థలను నిర్వహించడం మరింత సంక్లిష్టంగా మారిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అధునాతన పరిశోధనలు, లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపు తదితర అంశాల్లో పరిశ్రమకు కేంద్రం తగు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. -
ప్రజా ప్రయోజనాల కోసమే ఆస్తానా నియామకం
న్యూఢిల్లీ: ఢిల్లీ నగర పోలీసు కమిషనర్‌గా గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్తానాను నియమించడాన్ని కేంద్రం మళ్లీ సమర్థించుకుంది. ఢిల్లీలో భిన్నమైన శాంతి భద్రతల సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రయోజనాల కోసమే ఆయనను నియమించినట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆస్తానా పెద్ద రాష్ట్రమైన గుజరాత్లో పనిచేశారని, భారీ స్థాయిలో పోలీసు బలగాలను నేతృత్వం వహించిన అనుభవజ్ఞుడని, కేంద్ర దర్యాప్తు సంస్థలు, పారా మిలటరీ దళాల్లో పని చేశారని వెల్లడించారు. అలాంటి అపార అనుభవం ఉన్న అధికారి సేవలు ఢిల్లీలో అవసరమని భావించామని, అందుకే నగర పోలీసు కమిషనర్‌గా నియమించినట్లు అఫిడవిట్లో స్పష్టం చేశారు. ఆస్తానా సర్వీసు గడువును సైతం పొడిగించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా నియమించడానికి కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) కేడర్‌లో ప్రస్తుతం నిర్దేశిత అనుభవం ఉన్న అధికారులెవరూ అందుబాటులో లేరని వివరించారు. అందుకే తగిన అనుభవం కలిగిన గుజరాత్ క్యాడర్‌కు చెందిన రాకేశ్ ఆస్తానాను నియమించినట్లు పేర్కొన్నారు. ఆస్తానాను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా అపాయింట్ చేస్తూ కేంద్ర హోంశాఖ జూలై 27న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. -
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు: నిర్ధారిత మరణాలకే ధ్రువపత్రం
సాక్షి, న్యూఢిల్లీ: నిర్ధారణ పరీక్షల్లో కరోనాగా తేలి, మరణానికి అదే కారణమైనపుడు మాత్రమే కోవిడ్–19 మరణ ధ్రువపత్రాలు జారీచేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. కోవిడ్ మరణ ధ్రువపత్రాలు జారీ చేయడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించాయి. కోవిడ్ మృతుల మరణానికి గల కారణాలతో వైద్య ధువ్రపత్రాలు కుటుంబసభ్యులు, బంధువులకు జారీ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. జూన్ 30న కోవిడ్ మృతుల మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యంపై పదిరోజుల కిందట సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి కూడా మార్గదర్శకాల్లో ఓ విధానాన్ని కేంద్రం పొందుపరిచింది. అఫిడవిట్లో పేర్కొన్న ప్రధానాంశాలు: ► ఆర్టీపీసీఆర్ పరీక్ష, మాలిక్యులర్ టెస్ట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా కోవిడ్–19 నిర్ధారణ కావడం లేదా కోవిడ్ సోకినట్లు ఆసుపత్రిలో వైద్యులు ధ్రువీకరిస్తేనే... కోవిడ్–19 కేసుగాపరిగణిస్తారు. ► కరోనా ఉన్నప్పటికీ విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాద మృతి తదితర వాటిని కోవిడ్–19 మరణంగా గుర్తించరు. ► ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం కరోనాతో మృతి చెందిన వారిలో 95 శాతం మంది సోకిన 25 రోజుల్లోపే మరణించారు. అయినప్పటికీ కరోనా సోకిన తర్వాత 30 రోజుల్లో మృతి చెందిన వారిని కూడా కోవిడ్–19 మృతులుగా గుర్తించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ► మార్గదర్శకాల పరిధి, ఎంసీసీడీలోకి రాకుండా కోవిడ్–19తో మృతి చెందిన వారి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాస్థాయిలో రాష్ట్రాలు/ కేంద్ర పాలితప్రాంతాలు కమిటీని ఏర్పాటు చేయాలి. ► జిల్లా స్థాయి కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, అదనపు వైద్యాధికారి లేదా వైద్య కళాశాల మెడిసిన్ హెడ్, విషయ నిపుణుడు ఉండాలి. ► జిల్లా స్థాయి కమిటీ ముందు మృతుడి కుటుంబసభ్యుడు/ బంధువులు వినతి పత్రం ఇవ్వాలి. ► ఫిర్యాదు వినతి మేరకు వాస్తవాలన్నీ పరిశీలించి కమిటీ తగిన ధ్రువపత్రం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ► ఆయా ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరించాలి. -
తోలు పరిశ్రమకు ప్రోత్సాహకాలు పొడిగింపు!
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ, ఉపాధి కల్పన, ఎగుమతులకు ఊతమిచ్చే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తోలు, పాదరక్షల పరిశ్రమలకు ప్రోత్సాహక పథకాన్ని (ఐఎఫ్ఎల్ఏడీపీ) 2025–26 దాకా పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2021–22 నుంచి 2025–26 మధ్య కాలంలో ఈ స్కీమ్ కింద రాయితీల విలువ సుమారు రూ. 1,700 కోట్ల మేర ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి సమరి్పంచిందని, కేంద్ర క్యాబినెట్ దీన్ని త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యయాలపై ఆరి్థక శాఖ కమిటీ దీనికి ఇప్పటికే ఆమోదముద్ర వేసిందని వివరించారు. గతంలో 2017–18 నుంచి 2019–20 మధ్య కాలంలో రూ. 2,600 కోట్ల వ్యయాల అంచనాలతో కేంద్రం ఐఎఫ్ఎల్ఏడీపీని ప్రకటించింది. తాజాగా పథకం ప్రకారం తోలు, పాదరక్షల రంగంలో దేశీ బ్రాండ్ల ప్రమోషన్ కోసం రూ. 100 కోట్లు, డిజైన్ స్టూడియోల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు, తోలు పరిశ్రమ సమగ్రాభివృద్ధి కోసం రూ. 500 కోట్లు, సంస్థాగత కేంద్రాల ఏర్పాటుకు రూ. 200 కోట్లు మేర వ్యయాల ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కనీసం 10 భారతీయ బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు అవసరమైన సహకారం లభిస్తుంది. 10 డిజైన్ స్టూడియోల అభివృద్ధి కోసం కావాల్సిన సహాయం అందుతుంది. ఇక మెగా లెదర్ ఫుట్‌వేర్, యాక్సెసరీస్ క్లస్టర్ డెవలప్మెంట్ సబ్–స్కీమ్ కింద స్థల అభివృద్ధి, తయారీ కేంద్రాలు, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలపరమైన తోడ్పాటు లభిస్తుంది. -
ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ప్రెస్ నోట్ ఆధారంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టవచ్చా? బాధితుడి తరఫున ట్రిబ్యునల్ సభ్యుడు విచారణ ప్రారంభించవచ్చా? పార్టీతో ట్రిబ్యునల్ సభ్యుడు జతకట్టే అవకాశం లేదా?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చట్టం–2010 ప్రకారం.. పత్రికల్లో వచ్చే కథనాలు, లేఖలు, విజ్ఞప్తులు ఆధారంగా ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా? అనే అంశంపై జస్టిస్ ఎం.ఎం.ఖానీ్వల్కర్, జస్టిస్ హృషికేశ్, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా వ్యర్థాల తొలగింపుపై ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టి, ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే కేరళలో క్వారీల ఏర్పాటుకు నివాస స్థలాల నుంచి కనీస దూర నియమాన్ని 200 మీటర్లు నుంచి 50 మీటర్లకు తగ్గించారంటూ వచ్చిన విజ్ఞప్తి ఆధారంగా ఎన్జీటీ ఆదేశాలపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేరళ కేసులో ఎన్జీటీకి అధికార పరిధి ఉందని హైకోర్టు నిర్ధారించినప్పటికీ కొత్త క్వారీల కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేసింది. నిబంధనలు సమగ్ర ప్రాతిపదికన చదవాలి ఎన్జీటీకి న్యాయ సమీక్ష చేసే అధికారం లేదని ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14 చెబుతోందని థామ్సన్ అగ్రిగేట్స్, క్రిస్టల్ అగ్రిగేట్స్ సంస్థల తరఫు సీనియర్ న్యాయవాది వి.గిరి పేర్కొన్నారు. ట్రిబ్యునల్ పరిధి విస్తరణ నిర్ణయం విషయంలో సెక్షన్ 14(1), (2)లు కలిపి చదవాలని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ దరఖాస్తు స్వీకరించడానికి అవసరమైన షరతులను సెక్షన్ 14(3) వివరిస్తోందని, ఎవరైనా దరఖాస్తుతో వస్తే సెక్షన్ 14లోని సబ్‌సెక్షన్ 3 ప్రకారం స్వీకరించాలని, అంతేకానీ ఓ లేఖ ద్వారా విచారణ చేపట్టరాదని వి.గిరి తెలిపారు. ఆర్టికల్ 323ఏ ప్రకారం ఎన్జీటీ ఏర్పాటు కాలేదు ఆర్టికల్ 323ఏ ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ ఎన్జీటీ కాదని కేరళ తరఫున్యాయవాది జైదీప్ గుప్తా తెలిపారు. అందుకే శాసన అధికారాలను సమీక్షించే అధికారం ఎన్జీటీకి లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226, 32 కింద హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉన్న అధికారాలు ఎన్జీటీకి లేవన్నారు. ఎన్జీటీ చట్టంలోని ఏ ప్రొవిజన్ కూడా ట్రిబ్యునల్‌కు సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పలేదని గుర్తుచేశారు. ఎన్జీటీ సుమోటోగా కేసు చేపట్టాలంటే చట్టంలో ఉండాలని జైదీప్ తెలిపారు. అధికార పరిధి ఉన్న కోర్టులు కూడా చట్టబద్ధమైన నిబం« దనలకు వ్యతిరేకంగా వెళ్లవని వ్యాఖ్యానించారు. శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలి ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేదు, ఎందుకంటే చట్టం ఆ మేరకు అవకాశం కల్పించలేదని ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా తెలిపారు. శాసనంలోని భాష నుంచి శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంట్ ఉద్దేశపూర్వకంగా ట్రిబ్యునల్‌కు అలాంటి అధికారం ఇవ్వలేదన్నారు. ఒకవేళ ఎన్జీటీకి సుమోటో అధికార పరిధి ఉందని చెబితే, చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టాల్సి వస్తుందని ధ్రువ్ మెహతా పేర్కొన్నారు. అధికారం లేకున్నా చట్టం ద్వారా నిరోధించలేం ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేకున్నా చట్టం ద్వారా దాని పనితీరును నిరోధించలేమని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. సుమోటో విచారణలో ఎన్జీటీ బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. అయితే, ట్రిబ్యునల్‌కు ఎలాంటి సుమోటో అధికారాలు లేవని ఆమె తెలిపారు. రాజ్యాంగబద్ధమైన కోర్టులకే అధికారం రాజ్యాంగబద్ధమైన కోర్టులే సుమోటో విచారణలు చేపట్టాలని అమికస్ క్యూరీగా హాజరైన సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తెలిపారు. నేషనల్ ఎన్విరానిమెంటల్ అప్పీలేట్ అథారిటీ యాక్ట్ 1997 ప్రకారం ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పారు. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ యాక్ట్–2010 వచ్చాకా అథారిటీ యాక్ట్ రద్దయిందన్నారు. ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ ఉందని గ్రోవర్ స్పష్టం చేశారు. ‘‘ఒకవేళ ట్రిబ్యునల్ దృష్టికి ఏదైనా అంశం వస్తే అప్పుడు తప్పనిసరిగా విచారణ చేపట్టాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. లా కమిషన్ నివేదిక చెబుతోంది ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనేది చట్టసభల ఉద్దేశమని 186వ లా కమిషన్ నివేదిక చెబుతోందని ఓ పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వెల్లడించారు. ఎన్జీటీకి విస్తృత అధికారాలు ఇవ్వడాన్ని ‘స్థానిక’ అంశాలు డైల్యూట్ చేసినప్పటికీ సుమోటోగా కేసులు స్వీకరించే అధికారం పొందేంతగా లేదని స్పష్టం చేశారు. అప్లికేషన్ ద్వారానే విచారణ చేపట్టాలనే అధికార పరిధిని చట్టం పేర్కొందని, సుమోటో విచారణల ద్వారా కాదని తెలిపారు. ప్రతిపాదిత ట్రిబ్యునళ్ల పరిధి దాటి ఉద్దేశపూర్వకంగానే క్రిమినల్ అప్పీలేట్, న్యాయ సమీక్ష హైకోర్టుల పరిధిలోకి తీసుకొచ్చామని లాకమిషన్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. -
పండగలప్పుడు జరభద్రం!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని కేంద్రం ప్రజలను హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అప్రమత్తత అవసరమనీ, రాబోయే పండుగలను కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ జరుపుకోవాలని కోరింది. కేంద్రం ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ మధ్యలోనే ఉందన్నారు. పండగల తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా 41 జిల్లాల్లో కోవిడ్ వీక్లీ పాజిటివ్ రేటు 10% కంటే ఎక్కువగానూ, 27 జిల్లాల్లో 5–10 శాతాల మధ్యలోనూ నమోదవుతోందని వివరించారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే కేసులు భారీగా పెరుగుతాయన్నారు. జనం ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడడాన్ని నివారించడం చాలా ముఖ్యమని వివరించారు. ఒక్క కేరళలోనే లక్ష యాక్టివ్ కేసులున్నాయనీ, మొత్తం యాక్టివ్ కేసుల్లో ఇవి 51.19% అని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో యాక్టివ్ కేసులు 10 వేల నుంచి 1లక్ష వరకు ఉన్నట్లు తెలిపారు. రోజువారీ వ్యాక్సినేషన్ రేటు కూడా జూలైలో 43.41 లక్షలుండగా ఆగస్టులో అది 52.16 లక్షల డోసులకు పెరిగిందన్నారు. దేశంలో గత రెండు, మూడు వారాలుగా ఏ రాష్ట్రం నుంచి కూడా కోవిడ్ టీకా కొరత ఉందంటూ ఫిర్యాదులు అందలేదని భూషణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో, ఉపయోగించని/ నిల్వ ఉన్న టీకా డోసులు 2.5 కోట్లకు తగ్గలేదని తెలిపారు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 80 లక్షల డోసుల టీకా వేసినట్లు తమకు వివరాలందాయని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ లభ్యత సంతృప్తికరంగా ఉందని వివరించారు. దేశంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో 50 శాతం మందికి కోవిడ్ టీకా మొదటి డోసు అందగా, వీరిలో 15%మంది రెండో డోసు కూడా వేయించుకున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ మెడికల్ ఆక్సిజన్ నిల్వలు సరిపోను ఉన్నాయని పేర్కొన్నారు. -
వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్
సాక్షి, వెబ్‌డెస్క్ : వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసింది కేంద్రం. దీని ప్రకారం ఇకపై వ్యాక్సిన్ స్టాట్ బుకింగ్ కోసం కోవిన్ యాప్, వెబ్పోర్టల్లకు వెళ్లాల్సిన పని లేదు. థర్డ్ పార్టీ యాప్‌లను వినియోగించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారానే ఈ పనిని సుళువుగా చేసేయొచ్చు. ఎక్కువ మందికి చేరువగా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరి ఫోన్లో వాట్సాప్ కామన్‌గా మారింది. ఎంట్రీ లెవల్ ఫోన్లలోనూ వాట్సాప్ ఉంటోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం వాట్సాప్‌ను వినియోగడంలో పట్టు పెంచుకున్నారు. దీంతో వాట్సాప్ ద్వారా వాక్సిన్ స్లాట్ బుకింగ్‌కు కేంద్రం అవకాశం కల్పించింది. వాట్సాప్ అయితేనే వాట్సాప్ ద్వారా కరోనా హెల్ప్ డెస్క్‌ని ఈ ఏడాది మార్చిలో కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల ప్రారంభం నుంచి వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్‌కి అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ హెల్ప్‌డెస్క్ నుంచి 31 లక్షల మంది వ్యాక్సిన్ సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇతర ఆప్షన్ల కంటే వాట్సాప్ ద్వారా ఎక్కువ మంది అత్యంత వేగంగా వ్యాక్సిన్ సర్టిఫికేట్టు డౌన్లోడ్ చేసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. దీంతో వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌కి అవకాశం కల్పించింది. 9013151515 వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ బుకింగ్ చేసుకోవడానికి మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ పద్దతులు పాటించాలి. - మీ మొబైల్ నంబరులో 9013151515 నంబరు సేవ్ చేసుకోవాలి. ఇదే నంబరుకు బుక్ స్లాట్ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి మెసేజ్ పంపాలి. - ఆరు అంకెల ఓటీపీ నంబరు మీ మొబైల్‌కి వస్తుంది. మూడు నిమిషాల్లోగా ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాలి - ఆ నంబరు ఆధారంగా ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలను బట్టి మనకు వివిధ ఆప్షన్లు వస్తాయి. అందులో మొదటి డోసు ఎప్పుడు ఇచ్చారు, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఉంటాయి - హెల్ప్ డెస్క్ మెనూలో కుటుంబ సభ్యుల్లో ఎవరి పైరునైనా చేర్చాలా , దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ వివరాలు ఇలా వివిధ ఆప్షన్లకు 1, 2 ,3 ఇలా 8 వరకు నంబర్లు కేటాయించారు. మన అవసరానికి తగ్గట్టు నంబరును రిప్లై ఇస్తే దానికి తగ్గట్టుగా ఆప్షన్లు వస్తాయి. - ఈ హెల్ప్‌లైన్ డెస్క్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు కరోనాకు సంబంధించి ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకునే వీలుంది. చదవండి: IKEA : కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్‌వార్‌కి రెడీ -
భారత్‌లో కోవిడ్ టీకా: ఒక అడుగు ముందుకు.. రెండు వెనక్కు!
ఒక అడుగు ముందుకు పడితే... రెండు అడుగులు వెనక్కు!! ఇదీ దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమం పరిస్థితి. 2021లోపు అర్హులైన ప్రజలందరికీ టీకాలేస్తామని... కేంద్రం ప్రకటనైతే చేసింది కానీ... అందుకు తగ్గట్టుగా టీకా ఉత్పత్తి, సరఫరా, పంపిణీలలో సమస్యలు ఎదురు కాకుండా చూడటంలో మాత్రం విఫలమైంది. మరి దేశం ఏడాది చివరిలోగా తన లక్ష్యాన్ని అందుకోగలదా? ఎన్ని టీకాలు వేశాం? ఎన్ని వేయాలి? ఏ ఏ కంపెనీలు ఉన్నాయి? అన్నది పరిశీలిస్తే.... వూహాన్లో పుట్టి ప్రపంచమంతా వ్యాపించి మానవాళికి పెనువిపత్తుగా పరిణమించిన కోవిడ్‌ను నిలువరించేందుకు ఉద్దేశించిన టీకా కార్యక్రమం దేశంలో నత్తనడకన సాగుతోందంటే తప్పేమీ కాదు. ఈ ఏడాది జనవరి పదహారవ తేదీన సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్‌లు తయారు చేసిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో కార్యక్రమం మొదలైనా.. ఆ తరువాత ముడిసరుకుల కొరత, పంపిణీ లోపాలు, ప్రభుత్వ విధానాల్లో తరచూ మార్పుల వంటి అనేక సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో టీకాలు ఇవ్వలేకపోయామన్నది నిష్టూర సత్యం. తాజాగా ఆగస్టు 11వ తేదీ నాటికి దేశం మొత్తమ్మీద 51.90 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం పూర్తయింది. అయితే ఇందులో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 12 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఒక డోసు తీసుకున్న వారు 40 కోట్లు ఉన్నారు. ఇంకోలా చెప్పాలంటే దేశ జనాభాలో వైరస్ నుంచి పూర్తిగా రక్షణ పొందిన వారు కొంచెం అటు ఇటుగా పది శాతం మంది మాత్రమే! సరఫరా సమస్యలకు అవగాహన రాహిత్యం, అపోహలు తోడు కావడంతో చాలామంది టీకాలు వేయించుకునేందుకు ఇప్పటికీ తటపటాయిస్తున్నారు. అవసరాలేమిటి? ఉత్పత్తి ఎంత? 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో టీకాకు అర్హులైన వారు దాదాపు 95 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వం లెక్క కట్టింది. ఇప్పటివరకూ వీరిలో 11 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడ్డాయి. అంటే.. ఇప్పటివరకూ ఒక డోసు వేసుకున్న 40 కోట్ల మందితోపాటు ఒక టీకా కూడా తీసుకోని 44 కోట్ల మందికి కలిపి దాదాపు 130 కోట్ల టీకాలు అవసరమవుతాయి. డిసెంబర్ నాటికల్లా మిగిలిన వారందరికీ టీకాలు ఇవ్వాలంటే కొంచెం అటు ఇటుగా నెలకు 29 కోట్ల టీకాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం దేశంలో టీకా ఉత్పత్తి 12 నుంచి 13 కోట్లకు మించి లేదు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ఉత్పత్తిలో నాణ్యత పరమైన సమస్యలు ఎదురయ్యాయని, ఫలితంగా ముందుగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగలేదని టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి చెందిన ఎన్కే ఆరోరా ఇటీవలే తెలపడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో 40 కోట్ల కోవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం మే నెలలోనే ప్రకటించింది. అయితే జనవరి –జూలై మధ్యకాలంలో సరఫరా చేసేందుకు అంగీకరించిన ఎనిమిది కోట్ల టీకాల్లోనూ భారత్ బయోటెక్ ఇందులో సగం కూడా అందించలేదని సమాచారం. కోవీషీల్డ్ తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం నెలకు 11 నుంచి 12 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తోంది. కొత్త టీకాలు కొన్నింటికి అనుమతులిచ్చినా వాటి ఉత్పత్తి లేదా సరఫరా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితుల్లో అనుకున్న సమయానికి టీకా కార్యక్రమం పూర్తవడం కష్టసాధ్యం! అందుబాటులో ఐదు టీకాలు.. దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లతో టీకా కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. అయితే కొంత కాలం తరువాత రష్యా తయారు చేసిన స్పుత్నిక్–వీ వినియోగానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే స్థానికంగా తయారీలో కొన్ని సమస్యలు ఎదురు కావడంతో వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది జాప్యానికి దారితీసింది. తాజా సమాచారం ప్రకారం స్పుత్నిక్–వీ స్థానిక ఉత్పత్తి వచ్చే నెలకు గానీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతులు జారీ చేసినా... న్యాయపరమైన రక్షణ కల్పించాలన్న కంపెనీ డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకూ ఒక్క టీకా కూడా పడలేదు. తాజాగా అమెరికన్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకూ (సింగిల్ డోస్) ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ.. ఈ టీకాల వాడకం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇదిలా ఉండగా.. జైడస్ క్యాడిల్లా జైకోవ్–డీ టీకాతోపాటు భారత్‌లో తయారైన మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్ ‘హెచ్‌జీసీఓ19’, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నాసల్ వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఇవే కాకుండా... అమెరికన్ కంపెనీ తయారు చేస్తున్న నోవావ్యాక్స్ టీకాను భారత్‌లో కోవావ్యాక్స్ పేరుతో తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో దేశంలో పంపిణీ అయ్యే టీకాల జాబితాలో కోవావ్యాక్స్‌ను కూడా చేర్చడాన్ని బట్టి చూస్తే దీనికి త్వరలోనే అత్యవసర అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమోరికా, ఇతర జీ7 సభ్యదేశాలు ఇస్తామన్న టీకాలు న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికీ అందలేదు. –నేషనల్ డెస్క్, సాక్షి -
రైతు వ్యతిరేక చట్టాలు వద్దేవద్దు
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని 14 ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేశారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా వారు శుక్రవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కిసాన్ సంసద్‌లో (రైతుల పార్లమెంట్) పాల్గొన్నారు. అంతకముందు ప్రతిపక్ష నేతలంతా పార్లమెంట్ హౌస్ వద్ద కలుసుకొని, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. అనంతరం బస్సులో జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. ‘నల్ల’ వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలవాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దేశంలోని రైతులందరికీ తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. నల్ల సాగు చట్టాలపై కేవలం చర్చలతో కాలయాపన చేస్తే సరిపోదని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెగసస్ నిఘా అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. దేశంలో ప్రజల ఫోన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిఘా పెట్టారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కిసాన్ సంసద్‌లో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత మనోకుమార్ ఝా, సీపీఎం నుంచి ఎలమారమ్ కరీమ్, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, ఐయూఎంఎల్ నేత మహమ్మద్ బషీర్, డీఎంకే నాయకుడు తిరుచ్చి శివ తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ, ఆప్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కిసాన్ సంసద్ వద్ద ప్రతిపక్ష నేతలతో కలిసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ -
ఇక్కడి చట్టాలను పాటించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో నివసించే, పనిచేసే వారందరూ భారతప్రభుత్వ చట్టాలు, నియమాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఐటీ శాఖ నూతన మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ నూతన మంత్రిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే, నూతన ఐటీ నిబంధనల విషయంలో ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టంచేశారు. ట్విట్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ దేశంలోని చట్టాలు అందరికీ సమానమని, అందరూ దీనిని తప్పనిసరిగా పాటించాలని అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యుడు అశ్విని వైష్ణవ్ బుధవారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు రైల్వేశాఖ బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్‌ను కలిసిన తరువాత వైష్ణవ్ విలేకరులతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్, ఐటి, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలో బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ స్థానంలో వైష్ణవ్ నియమితులయ్యారు. దేశంలో నూతన నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, ప్రభుత్వం పదేపదే గుర్తుచేసినప్పటికీ ట్విట్టర్ ఇంకా సోషల్ మీడియా మార్గదర్శకాలకు కట్టుబడలేదు. ట్విట్టర్‌కు రక్షణ కల్పించలేం: ఢిల్లీ హైకోర్టు కొత్త ఐటీ నిబంధనల నుంచి అమెరికాకు చెందిన ప్రముఖ మైక్రో బ్లాగింగ్ యాప్ ట్విటర్‌కు ఎలాంటి మినహాయింపు, రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ నిబంధనల ఉల్లంఘన జరిగితే, చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేసింది. తాజా ఐటీ నిబంధనలను అమలు చేస్తామని పేర్కొంటూ అమెరికాలో నోటరీ అయిన అఫిడవిట్‌ను రెండు వారాల్లోగా సమర్పించాలని జస్టిస్ రేఖ పల్లి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ట్విటర్‌ను ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్ నియమించిన అధికారులు కూడా కోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని పేర్కొంది. కోర్టు నుంచి తాము కూడా ఎలాంటి రక్షణ కోరడం లేదని ట్విటర్ తరఫు న్యాయవాది సాజన్ పూవయ్య తెలిపారు. కొత్తగా నియమించిన చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ తదితర అధికారుల వివరాలను జులై 8లోగా కోర్టు ముందుంచాలని గతంలో కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం ట్విటర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తాత్కాలిక ప్రాతిపదికను అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. తాత్కాలిక చీఫ్ కంప్లయన్స్ అధికారిని ఇప్పటికే నియమించామని, భారత్‌లో నివసించే గ్రీవెన్స్ అధికారిని, నోడల్ ఆఫీసర్‌ను తాత్కాలిక ప్రాతిపదికన ఈ నెల 11న నియమిస్తామని తెలిపారు. వారు తాత్కాలిక అధికారులే అయినా.. పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడ్తారన్నారు. ఫిర్యాదులు, ఇతర వివాదాల విషయంలో పూర్తి స్థాయి బాధ్యత ట్విటర్ తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోరారు. పారదర్శకత ఉండాల్సిందే ఫేస్‌బుక్‌కు సుప్రీం స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు పవర్ సెంటర్లుగా మారుతున్నాయని, ప్రజల అభిప్రాయాలను సైతం ప్రభావితం చేయగలుగుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫేస్‌బుక్‌కు ఇండియాలో 27 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని గుర్తుచేసింది. ఇలాంటి సామాజిక వేదికలు పారదర్శకత పాటించాల్సిందేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఢిల్లీ అసెంబ్లీ శాంతి, సామరస్య కమిటీ తమకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఫేస్బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్ మోహన్‌తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈశాన్య ఢిల్లీలో గత ఏడాది చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి సాక్షిగా తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ ఢిల్లీ శాసనసభకు చెందిన శాంతి, సామరస్య కమిటీ ఫేస్‌బుక్‌తోపాటు ఇతరులకు గతంలో సమన్లు జారీ చేసింది. సాక్షిగా ప్రశ్నించేందుకు పిలిచే విశేష అధికారాలు ఢిల్లీ హైకోర్టుకు, దాని కమిటీకి ఉన్నాయని పేర్కొంది. -
కోవిడ్ ముప్పు తొలిగిపోలేదు.. జాగ్రత్త: కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: కోవిడ్ నిబంధనలను ఖాతరు చేయకుండా జనం పర్యాటక హిల్ స్టేషన్లు, మార్కెట్లలో పెద్ద సంఖ్యలో సంచరిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి తీరుతో ఇప్పటి వరకు కోవిడ్ మహమ్మారిపై దేశం సాధించిన ఫలితం వృథాగా పోతుందని పేర్కొంది. కోవిడ్ ముప్పు ఇంకా తొలగి పోలేదని పేర్కొన్న ప్రభుత్వం.. ప్రముఖ హిల్ స్టేషన్లకు పెద్ద సంఖ్యలో జనం పోటెత్తడం ఆందోళ నకరమని వ్యాఖ్యానించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను పాటించకపోవడం కేసులను మరింతగా పెంచడానికి కారణమవుతుందని హెచ్చరించింది. ‘చాలా రాష్ట్రాల్లో సెకండ్‌వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ సెకండ్ వేవ్‌తో పాజిటివిటీ రేటు ఇప్పటికీ 10%పైనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంక్షలను అమలు చేయడం/ కొనసాగించడం చేయాల్సి రావచ్చు. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 73 జిల్లాల్లో జూన్ 29–జూలై 5వ తేదీ మధ్యలో పాజిటివిటీ రేటు 10% పైగానే నమో దైంది. జూలై 4వ తేదీ నాటికి 91 జిల్లాల్లో రోజువారీ కేసులు 100కు పైగానే ఉంటున్నాయి. దేశంలో నమోదవుతున్న 80% కేసులు 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 90 జిల్లాల నుంచే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కోవిడ్ అప్రమత్తత కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తోంది’ అని ఓ అధికారి అన్నారు. కాగా, అండమాన్ నికోబార్ దీవుల్లో 24 గంటల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇక్కడ మొత్తం 7,482 కేసులు నమోదు కాగా, 128 మరణాలు సంభవించాయి. 3 నెలల్లో కనిష్ట స్థాయికి రోజువారీ మరణాలు దేశంలో కోవిడ్ బాధిత మరణాలు 90 రోజుల్లోనే అతి తక్కువగా ఒక్క రోజులో 553 నమోదైనట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 4,03,281కి చేరుకుందని మంగళవారం పేర్కొంది. అదేవిధంగా, 111 రోజుల తర్వాత రోజువారీ కోవిడ్ 24 గంటల్లో 34,703 నమోదయ్యాయి. దీంతో, మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,06,19,932కు చేరింది. దీంతోపాటు, 101 రోజుల తర్వాత అతి తక్కువగా 4,64,357 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.