న్యూఢిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) తదితర వాహన సంబంధిత ధ్రువపత్రాలను డిజిలాకర్ లేదా ఎం–పరివాహన్ యాప్ ద్వారా అంగీకరించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మోటార్ వాహనాల చట్టం–1988, సమాచార, సాంకేతిక చట్టం–2000 ప్రకారం ఆ ఎలక్ట్రానిక్ ధ్రువపత్రాలను రవాణా శాఖ జారీ చేసిన ఒరిజినల్స్‌తో సమానంగా పరిగణించాలంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కొత్త వాహనాలఇన్సూరెన్స్ వివరాలు, రెన్యువల్ ఇన్సూరెన్స్ వివరాలను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డు ‘వాహన్’ డేటాబేస్‌లోకి ప్రతి రోజూ అప్‌లోడ్ చేస్తుందని, ఇవన్నీ ఎం–పరివాహన్ లేదా ఈ–చలాన్ యాప్‌లో కనిపిస్తాయని స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ వివరాలు సదరు యాప్‌ల్లో కనిపిస్తే ఒరిజినల్ ధ్రువపత్రాలు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment