
న్యూఢిల్లీ: ‘డిజీలాకర్’ లేదా ‘ఎంపరివాహన్’ యాప్‌ల్లో ఈ– ఫార్మాట్‌లో నిక్షిప్తం చేసిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ కాగితాలు సాధారణ డాక్యుమెంట్ల మాదిరిగానే చెల్లుబాటు అవుతాయని కేంద్ర రవాణా, రహదారుల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే, ఆ రెండు యాప్‌ల్లో ఉన్న డాక్యుమెంట్లనే వాస్తవ పత్రాలుగా పరిగణనలోకి తీసుకుంటామని, వేరే యాప్‌ల్లోని లేదా ఇతర ఏ రకమైన ఈ– డాక్యుమెంట్లను పరగణించబోమని స్పష్టం చేసింది. ఆర్‌సీ, ఇన్యూరెన్స్, ఫిట్‌నెస్ అండ్ పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్.. తదితర సర్టిఫికెట్లను ఈ–ఫార్మాట్‌లో ఉన్నా ఆమోదించాలని నవంబర్ 2018లో కేంద్ర మోటారు వాహన చట్ట నిబంధనల్లో చేర్చామని పేర్కొంది. ఎంపరివాహన్ యాప్‌ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కోసం ఎన్‌ఐసీ రూపొందించగా, డిజీలాకర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించినది.
Comments
Please login to add a commentAdd a comment