Vehicle documents
-
డిజీలాకర్‌లో ఉంటేనే..!
న్యూఢిల్లీ: ‘డిజీలాకర్’ లేదా ‘ఎంపరివాహన్’ యాప్‌ల్లో ఈ– ఫార్మాట్లో నిక్షిప్తం చేసిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ కాగితాలు సాధారణ డాక్యుమెంట్ల మాదిరిగానే చెల్లుబాటు అవుతాయని కేంద్ర రవాణా, రహదారుల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే, ఆ రెండు యాప్‌ల్లో ఉన్న డాక్యుమెంట్లనే వాస్తవ పత్రాలుగా పరిగణనలోకి తీసుకుంటామని, వేరే యాప్‌ల్లోని లేదా ఇతర ఏ రకమైన ఈ– డాక్యుమెంట్లను పరగణించబోమని స్పష్టం చేసింది. ఆర్సీ, ఇన్యూరెన్స్, ఫిట్నెస్ అండ్ పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్.. తదితర సర్టిఫికెట్లను ఈ–ఫార్మాట్లో ఉన్నా ఆమోదించాలని నవంబర్ 2018లో కేంద్ర మోటారు వాహన చట్ట నిబంధనల్లో చేర్చామని పేర్కొంది. ఎంపరివాహన్ యాప్‌ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కోసం ఎన్ఐసీ రూపొందించగా, డిజీలాకర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించినది. -
ఇప్పుడెలా వేస్తారు ట్రాఫిక్ చలానా!?
గాంధీనగర్: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధిస్తూ.. జేబు గుల్ల చేస్తోంది. వాహనానికి సంబంధించి ఏ చిన్న కాగితం లేకపోయినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గతంలో మాదిరి ఇంట్లో మర్చిపోయాను సర్ అంటే కుదరదు. అన్ని కాగితాలను మనతో పాటు తీసుకెళ్లాల్సిందే. ఈ క్రమంలో ఓ వ్యక్తి బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించుకుని తిరుగుతున్నాడు. వివరాలు.. గుజరాత్ వడోదరకు చెందిన రామ్ షా అనే వ్యక్తి ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా రోజంతా ఎక్కడెక్కడో తిరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం వచ్చిన నూతన మోటార్ వాహన చట్టం వల్ల ఏ చిన్న కాగితం మిస్ అయినా పెద్ద మొత్తంలో చలాన్ కట్టాల్సి వస్తుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి రామ్ షా ఓ వినూత్న మార్గం కనుగొన్నాడు. ఎక్కడికెళ్లినా హెల్మెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. దాంతో బండికి సంబంధించిన కాగితాలన్నింటిని హెల్మెట్‌కు అంటించాడు. ఇక నేను కాగితాలు చూపించడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పని లేదు.. ఫైన్ కట్టాల్సిన అవసరం లేదంటున్నాడు రామ్ షా. ఇతని ప్రయత్నాన్ని ట్రాఫిక్ పోలీసులు కూడా అభినందిస్తున్నారు. (చదవండి: విక్రమ్ ల్యాండర్‌కు చలాన్ విధించం) -
275 కేసులు.. రూ80వేల జరిమానా
- మంచిర్యాల పట్టణంలో పోలీసుల నాకాబందీ - వాహన పత్రాలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు మంచిర్యాల టౌన్ : మంచిర్యాలలో ఏఎస్పీ ఎస్.ఎం.విజయ్‌కుమార్ ఆధ్వర్యాన బుధవారం రాత్రి నాకాబందీ నిర్వహించారు. పలు ప్రధాన రహదారుల్లో భారీ ఎ త్తున పోలీసులు మొహరించి వాహన తనిఖీలు, డ్రం క్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల ఎస్‌హెచ్‌వో వి.సురేష్, సీఐలు ప్రవీణ్‌కుమార్, వేణుచందర్, ట్రాఫిక్ ఎస్సై రాజేశం, ఎస్సైలు వెంకటేశ్వర్లు, ప్రమోద్‌రావు, సంజీవ్, మహేందర్‌తో పాటు సి బ్బంది తనిఖీల్లో పాల్గొని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లారీలు, కార్లు ఇతర వాహనాలు మొత్తం 275 వాహనాలను తనిఖీ చేశారు. డ్రైవింగ్ లెసైన్స్, వాహన లెసైన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ తదితర ధృవీకరణ పత్రాలను తనిఖీ చేసిన అధికారులు సరై న పత్రాలు లేని వారి నుంచి రూ.80,400 జరిమానా వసూలు చేశారు. కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 16 మందిపై కేసు లు నమోదు చేసి రిమాండ్ చేశారు.