275 కేసులు.. రూ80వేల జరిమానా | police inspections by asp | Sakshi
Sakshi News home page

275 కేసులు.. రూ80వేల జరిమానా

Published Fri, Aug 28 2015 4:32 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

275 కేసులు.. రూ80వేల జరిమానా - Sakshi

275 కేసులు.. రూ80వేల జరిమానా

- మంచిర్యాల పట్టణంలో పోలీసుల నాకాబందీ
- వాహన పత్రాలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
మంచిర్యాల టౌన్ :
మంచిర్యాలలో ఏఎస్పీ ఎస్.ఎం.విజయ్‌కుమార్ ఆధ్వర్యాన బుధవారం రాత్రి నాకాబందీ నిర్వహించారు. పలు ప్రధాన రహదారుల్లో భారీ ఎ త్తున పోలీసులు మొహరించి వాహన తనిఖీలు, డ్రం క్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల ఎస్‌హెచ్‌వో వి.సురేష్, సీఐలు ప్రవీణ్‌కుమార్, వేణుచందర్, ట్రాఫిక్ ఎస్సై రాజేశం, ఎస్సైలు వెంకటేశ్వర్లు, ప్రమోద్‌రావు, సంజీవ్, మహేందర్‌తో పాటు సి బ్బంది తనిఖీల్లో పాల్గొని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లారీలు, కార్లు ఇతర వాహనాలు మొత్తం 275 వాహనాలను తనిఖీ చేశారు. డ్రైవింగ్ లెసైన్స్, వాహన లెసైన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ తదితర ధృవీకరణ పత్రాలను తనిఖీ చేసిన అధికారులు సరై న పత్రాలు లేని వారి నుంచి రూ.80,400 జరిమానా వసూలు చేశారు. కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 16 మందిపై కేసు లు నమోదు చేసి రిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement