Driving Licence
-
విదేశాల్లో మనోళ్లురయ్.. రయ్..
విదేశీ రోడ్లపై మనోళ్లు డ్రైవింగ్‌లో రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. చదువు, ఉద్యోగం, పర్యాటకం పేరుతో చాలామంది విదేశాలకు వెళ్తుంటారు. అక్కడ వాహనం నడపాలంటే కచ్చితంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్(ఐడీపీ) ఉండాలి. విదేశాలకు వెళ్లే వారంతా ఐడీపీ లైసెన్స్‌లు పొందడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ లైసెన్స్‌లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. నల్లగొండ, సూర్యాపేటటౌన్, భువనగిరి టౌన్ : విదేశాల్లో ఎటు వెళ్లాలన్నా కూడా కారు తప్పనిసరి. ఉద్యోగ నిమిత్తం, ఎంఎస్, ఎంబీఏ, ఎంబీబీఎస్ లాంటి ఉన్నత చదువులకు వెళ్లేవారు వేలాది మంది ఉంటారు. ఆయా దేశాలను బట్టి వారానికి రెండు నుంచి మూడు రోజులే కళాశాలలు, ఆఫీస్‌లు ఉండటంతో మిగతా రోజులు పార్ట్‌టైంగా డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతారు. దీంతో ఐదేళ్లుగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది.అక్కడి లైసెన్స్ పొందాలి.. మనదేశంలో తీసుకున్న ఐడీపీతో దాదాపు 150 దేశాల్లో వాహనాలు నడపవచ్చు. ఇక్కడి ఐడీపీతో విదేశాలకు వెళ్లిన తర్వాత ఆ దేశాన్ని బట్టి ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ఐడీపీ చెల్లుబాటు అవుతుంది. తర్వాత డ్రైవింగ్ చేయాలనుకునే వారు అక్కడి నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందాలి. మనదేశంలో లైసెన్స్ పొంది, 3, 4 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి విదేశాల్లో లైసెన్స్ త్వరగా వస్తుందని అధికారులు చెబుతున్నారు.పార్ట్ టైం డ్రైవింగ్ చేస్తానేను 2021 నుంచి లండన్‌లో ఉంటున్న. 2023లో ఇక్కడ ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకున్నా. అది వ్యాలిడిటీ అయిపోవడంతో లండన్‌లోనే ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకున్నా. వారంలో మూడు రోజులు పార్ట్‌టైంగా డ్రైవింగ్, నాలుగు రోజులు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా. మూడు రోజులు డ్రైవింగ్ చేస్తే రూ.45వేలు వస్తే.. నాలుగు రోజులు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే రూ.38 వేలు వస్తున్నాయి. ఖర్చులు, రూం కిరాయి, ఇతర ఖర్చులు డ్రైవింగ్ మీదే వెళ్లదీస్తా.– బి.రాజేష్కుమార్ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది మన దేశంలో ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకుంటే విదేశాల్లో ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ తీసుకోవచ్చు. వీలు కుదరకపోతే ఇక్కడి లైసెన్స్‌ను అక్కడ లెర్నింగ్‌గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని చూపించి ఆయా దేశాల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. – సురేష్‌రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి, సూర్యాపేటఐడీపీ తీసుకునేవారి సంఖ్య పెరుగుతోందివిదేశాలకు వెళ్తున్న వారు తప్పని సరిగా ఐడీపీ లైసెన్స్ తీసుకుంటున్నారు. విదేశాల్లో ఈ లైసెన్స్‌ను ప్రామాణికంగా తీసుకుని అక్కడి లైసెన్స్ ఇస్తారు. అంతర్జాతీయ లైసెన్స్‌కు రెన్యువల్ ఉండదు. కాలపరిమితి ముగిస్తే మరోసారి తీసుకోవాలి్సందే. – సాయికుమార్, డీటీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా -
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్.. ప్రభుత్వం స్పష్టత
గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఏడీటీసీ), డ్రైవింగ్ స్కూళ్లు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మీడియా కథనాలపై స్పందించిన మంత్రిత్వ శాఖ జూన్ 1 నుంచి ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది."కొన్ని వర్గాల మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలకు సంబంధించి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 లో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణ కేంద్రాలకు నిర్దేశించిన నిబంధనలు 31బీ నుంచి 31జే వరకు 2021 జూన్ 7న జీఎస్ఆర్ 394 (ఇ) ప్రకారం చేర్చడం జరిగింది. ఈ నిబంధనలు 2021 జులై 1 నుంచి అమలులో ఉన్నాయి. కొత్తగా 2024 జూన్ 1 నుంచి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు" అని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిఅంటే 2021 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, 2024 జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలాగే గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఫారం 5బి) లేదా ఇతర డ్రైవింగ్ స్కూళ్ల (ఫారం 5) నుంచి కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ పొందినప్పటికీ డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండదని రవాణా శాఖ పునరుద్ఘాటించింది. -
డ్రైవింగ్ స్కూళ్లలోనూ లైసెన్స్..
ఆదిలాబాద్: రహదారి భద్రత చట్టం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నూతన సంస్కరణకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇకపై రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా ఈ స్కూళ్లలో డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. మోటారు వాహన చట్టం మార్పులో భాగంగా ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ అంతా కూడా ప్రైవేటు భాగస్వామ్యంలో సాగనుంది.ఈ చట్టం జూన్ ఒకటి నుంచి అమలులోకి రానుంది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ లేదు సరికదా ఇప్పటికిప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కూడా కష్టమే. రవాణా శాఖ చట్టం నిబంధన మేరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే పలు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడున్న వారు ఏర్పాటుకు సముఖంగా లేరు. డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తే అనుమతి ఇస్తామని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.పారదర్శకతతో డ్రైవింగ్ ఉంటేనే..అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే డ్రైవింగ్ శిక్షణ నాణ్యమైనదిగా, సమర్థవంతమైనదిగా, పారదర్శకతతో ఉంటే లైసెన్స్‌లు ఇవ్వాలనేది రవాణా శాఖ ముఖ్యోద్దేశం. ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే 5–ఏ సర్టిఫికేట్ల ఆధారంగా నేరుగా లైసెన్స్ జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో రవాణా శాఖ అధికారులను పరిమితం చేస్తూ తీసుకొస్తున్న అక్రిడేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ప్రస్తుతం కష్టతరంగానే ఉండబోనుంది. ప్రస్తుతం ఉన్న సాధారణ డ్రైవింగ్ స్కూళ్లు కూడా కఠిన నిబంధనలతో స్కూళ్ల ఏర్పాటు కష్టమే అంటున్నారు.మూడెకరాలు కావాల్సిందే..డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు కనీసం మూడెకరాల స్థలం కావాలి. రెండెకరాల్లో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ప్రాథమిక శిక్షణ కోసం సిమ్యులేటర్లు ఏర్పాటు చేయాలి. మరో ఎకరంలో శిక్షణ తరగతుల కోసం భవనం, తరగతి గదులు, ఇంటర్నెట్ సదుపాయం, ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ, టీచింగ్ పరికరాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇందుకు పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరం. భూముల విలువ రూ.లక్షలు, రూ.కోట్లలో ఉండగా మూడెకరాల్లో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కష్టమే అంటున్నారు. అయినా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తే ఆదాయం ఆ స్థాయిలో ఉంటుందా అనేది అనుమానమేనని అంటున్నారు. -
లైసెన్స్.. సైలెన్స్!
సాక్షి, హైదరాబాద్: రహదారి భద్రతా చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. ఈ స్కూళ్లలో శిక్షణ తీసుకున్నవారికి నేరుగా డ్రైవింగ్ లైసెన్సులు లభిస్తాయి. మరోవిధంగా చెప్పాలంటే డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యాన్ని కల్పిస్తూ కేంద్రం మోటారు వాహన చట్టంలో మార్పులు తెచ్చింది. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇంతవరకు బాగా ఉందికానీ.. గ్రేటర్లో ఇప్పటి వరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు కాలేదు. దీంతో లైసెన్సుల జారీలో కొత్త నిబంధనల అమలుపై సందిగ్ధం నెలకొంది. ‘కేంద్రం రూపొందించిన ఈ చట్టాన్ని కచి్చతంగా అమలు చేయాల్సిందే. అక్రిడేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు’ అని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిబంధనల మేరకు స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు సంస్థలు లేదా వ్యక్తులు ముందుకు వస్తే అనుమతివ్వనున్నట్లు పేర్కొన్నారు. సమర్థంగా.. ప్రామాణికంగా.. అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే నాణ్యమైన, సమర్థమైన శిక్షణే ప్రామాణికంగా భావించి లైసెన్సులు ఇవ్వాలనేది చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే ‘5– ఏ’ సర్టిఫికెట్లు ఆధారంగా నేరుగా లైసెన్సులు పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో రవాణా అధికారాలను పూర్తిగా పరిమితం చేస్తూ ప్రవేశపెట్టిన అక్రిడేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ఎంతో ఖరీదైన వ్యవహారం కావడంతో వ్యాపార సంస్థలు లేదా డ్రైవింగ్‌లో శిక్షణనిచ్చేందుకు ఆసక్తి ఉన్నవారు సైతం ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సాధారణ డ్రైవింగ్ స్కూళ్లు కూడా నిరాసక్తత చూపుతున్నాయి. రెండు ఎకరాల్లో ట్రాక్‌లను ఏర్పాటు చేయడంతో పాటు వాహనాలు, మౌలిక సదుపాయాలను కలి్పంచాల్సి ఉంటుంది. కానీ.. పెద్దమొత్తంలో పెట్టుబడి పెడితే ఆదాయం ఆ స్థాయిలో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ హకీంపేట్‌లో ఈ తరహా డ్రైవింగ్ స్కూల్‌ను నిర్వహిస్తోంది. ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణలో మెలకువలు నేర్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాలు తప్పనిసరి.. అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్ల కోసం కనీసం 2 ఎకరాల్లో వివిధ రకాల టెస్ట్ట్రాక్లను ఏర్పాటు చేయాలి. ప్రాథమిక శిక్షణ కోసం సిమ్యులేటర్లను ఏర్పాటు అవసరం. శిక్షణ తరగతుల కోసం పక్కా భవనాలను నిర్మించాలి. తరగతి గదులు ఉండాలి. ఇంటర్నెట్ సదుపాయం, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ. టీచింగ్ పరికరాలు తదితర సదుపాయాలు ఉండాలి.స్థల లభ్యతే ప్రధాన సమస్య.. నగరంలో భూమి లభ్యతే ప్రధాన సమస్యగా మారింది. అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లకు ఎకరం నుంచి రెండెకరాల స్థలం అవసరం. కార్లు వంటి తేలికపాటి వాహనాలు నడిపేందుకు ఎకరం పరిధిలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, బస్సులు, లారీలు వంటివి నేర్చుకొనేందుకు 2 ఎకరాలలో ట్రాక్‌లు ఉండాలి. నగరానికి నలువైపులా ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో రియల్ ఎస్టేట్ భూమ్‌తో భూమి ధరలకు రెక్కలొచ్చాయి. రూ.కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేసి డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయడం అసాధ్యమనే భావన ఉంది. ఇలా ఏర్పాటు చేసే అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లలో ఫీజులు కూడా భారీ మొత్తంలోనే ఉంటాయి. అలాంటప్పుడు శిక్షణ తీసుకొనేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవచ్చు. ఏ విధంగా చూసినా ఇది ఖరీదైన వ్యవహారంగా మారడంతో అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్ల ఏర్పాటు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో కేంద్రం కొత్త చట్టం అమలుపై సందిగ్ధత నెలకొంది. -
71 ఏళ్ల వయసులో అన్ని డ్రైవింగ్ లైసెన్స్‌ల..!
భారీ వాహనాలను అలవోకగా డ్రైవ్ చేస్తున్న ఈ బామ్మను చూసి వామ్మో..! అనాల్సిందే. చాలా చాకచక్యంగా నడిపేస్తోంది. అంతేకాదు హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌ని కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది కూడా. అలాంటి వాహనాలను నడపడం కేవలం మగవాళ్లు మాత్రమే చేయగలరన్న మూసధోరణిని మూలనపడేసింది. సామర్థ్యం ఉంటే ఎవ్వరైనా.. చేయగలరని చేసి చూపించింది ఈ సూపర్ బామ్మ..!. ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..మణి అమ్మగా పిలచే రాధామణి అమ్మ..కేరళకు చెందిన 71 ఏళ్ల మహిళ. తన అద్భతమైన డ్రైవింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె జేసీబీలు దగ్గర నంచి క్రేన్ల వంటి భారీ వాహనాల వరకు ప్రతీది ఈజీగా నడిపేస్తుంది. అంతేకాదండోయే ఏకంగా విభిన్న హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్‌ల 11 పొందిందట. తాను ఈ హెవీ వెహికల్స్‌ని ఇంత అలవోకగా నడపడానికి కారణం.. తన భర్తదే క్రెడిట్ అంటోంది. మహిళలు అస్సలు డ్రైవింగ్ నేర్చకోవడానికి ముందుకురాని కాలంలో ఆమె తన భర్త అండదండలతో భారీ వాహనాలను డ్రైవ్ చేయడం నేర్చుకుంది. అలా ఆమె 1981లో ఫోర్ వీలర్ లైసెన్స్ పొందింది. ఆ తర్వాత 1984లో హెవీ వెహికల్ లైసెన్స్ పొందింది. ఆ టైంలో కేరళలో మహిళలు హెవీ వెహికల్ లైసెన్స్ పొందడంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. అంతేగాదు తాను ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌ని ఎలా స్థాపించారో కూడా వివరించారు. 2004లో భర్త మరణంతో రాధమణి ఈ రంగంలో పలు అడ్డంకులను ఎదుర్కొంది. అయిన ప్పటికీ పట్టుదలతో డ్రైవింగ్ స్కూల్ భాద్యతలు చేపట్టి డ్రైవింగ్ కమ్యూనిటీ లీడర్ స్థాయికి ఎదిగింది. మొదట్లో అది ఏ2Z డ్రైవింగ్ స్కూల్ ఆ తర్వాత కాలక్రమేణ ఏ2Z ఇన్స్టిట్యూట్గా మారింది. ఇక్కడ మణి అమ్మ..అన్ని రకాల భారీ పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలో శిక్షణ ఇస్తుంది. ఈ వయసులో కూడా ఆమె చదువు కొనసాగిస్తోంది. ఆమె ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేస్తోంది. అంతేగాదు తాను మొదట్లో భారీ వాహనాల డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడూ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో గర్తు చేసుకున్నారు. ఆ టైంలో డ్రైవింగ్ నేర్చకోవడం ఓ సవాలుగా ఉండేదన్నారు మణి అమ్మ. అంతేగాదు చిన్న వాహనాల కంటే భారీ వాహనాల నడపటమే సులభమని ఆమె నొక్కిచెబుతున్నారు. తాను ఎన్ని ఆటంకాల ఎదురైనా అంకితభావంతో వేర్వేరు భారీ వాహనాల 11 లైసెన్స్‌లు పొందినట్లు చెప్పుకొచ్చారు. నేర్చుకోవాలన్న అభిరుచి ఉన్నవాళ్లకి వయోభేదం పెద్ద సమస్య కాదంటున్నారు. అలాగే డ్రైవింగ్ అనేది ఏ ఒక్క లింగానికో పరిమితం కాదని రాధామణి నొక్కి చెబుతున్నారు. నిజంగా రాధామణి గ్రేట్ కదూ. మన అమ్మమల కాలంలోనే ఆమె ఇంత అలవోకగా నేర్చుకోవడమే గాక ఇతరులకు మెళ్లకువలు నేర్పిస్తున్నారు. పైగా మహిళలు ఈ రంగంలోకి ధైర్యంగా రావొచ్చు, సంకోచించాల్సిన పని లేదంటన్నారు రాధామణి.(చదవండి: ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..) -
జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత సులభ తరం చేస్తూ.. వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందే వెసులు బాటు కల్పించింది. కాలేజీ విద్యార్ధి నుంచి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ వాహనాల్ని విరివిరిగా వినియోగిస్తున్నారు. అయితే అందుకు కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయో మెట్రిక్ ఇలా వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్ని కేంద్రం అమల్లోకి తేనుంది.ఇక కేంద్రం విధించిన నిబంధనలకు లోబడి ఉంటే ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అనుమతి ఉంది. ఇందుకోసం కేంద్రం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు ఎలా ఉన్నాయంటే ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు ఈ సదుపాయానికి కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. 4 వీలర్ వాహనాల కోసం డ్రైవింగ్ కేంద్రాలకు అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి. డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తప్పనిసరిగా తగిన పరీక్షా సౌకర్యాన్ని కలిగి ఉండాలి. ట్రైనర్లు కనీసం ఉన్నత పాఠశాల డిప్లొమా లేదా తత్సమాన విద్యను కలిగి ఉండాలి. కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. ట్రైనర్లు బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి.లైట్ వెహికల్ ట్రైనింగ్ తప్పనిసరిగా 4 వారాలలోపు పూర్తి చేయాలి. కనీసం 29 గంటల శిక్షణ ఉంటుంది. భారీ మోటారు వాహనాలకు 38 గంటల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను 6 వారాల్లోగా పూర్తి చేయాలి.ఫీజు వివరాలు ఇలా..లెర్నర్ లైసెన్స్: రూ 200లెర్నర్ లైసెన్స్ పునరుద్ధరణ: రూ. 200అంతర్జాతీయ లైసెన్స్: రూ 1000శాశ్వత లైసెన్స్: రూ. 200 Most People don't know this fact. Delhi is the only state with 100% Automated Testing Tracks. No one can ask for bribes, there's zero human intervention and will ensure no one cheats.This can be easily done by every state, but they won't get regular commission if they do...!! pic.twitter.com/43lCx9SQg2— Dr Ranjan (@AAPforNewIndia) May 20, 2024ఆటోమేటేడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఆటోమేటేడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హులు కావాలి. ఈ టెస్ట్‌ను ట్రాక్‌ల మీద ఆర్టీఓ అధికారులు నిర్వహిస్తారు. కానీ ఢిల్లీలో అలా కాదు వాహనదారుల సౌకర్యార్ధం ఆటోమేటేడ్ టెస్టింగ్ ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రాకుల వల్ల వాహనదారులు ఎలాంటి దళారులతో పనిలేకుండా సులభంగా డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొనవచ్చు. మారుతీ సుజుకి సంస్థ ఇక.. మారుతీ సుజుకి సంస్థ తన ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్న్ లాడో సరాయ్లో గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం కంపెనీ.. ఢిల్లీ టెస్టింగ్ ట్రాక్‌లలో 100 శాతం ఆటోమేటిక్ సౌకర్యాన్ని సాధించిందని తెలిపింది. ఇక.. రాజధానిలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం పూర్తిగా కంప్యూటరైజ్డ్ ప్రక్రియ అవుతుందని మారూతీ సుజుకి పేర్కొంది. టెస్ట్ ట్రాక్‌లు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR)కి అనుగుణంగా రూపొందించబడినట్లు తెలిపింది. -
అలా చేస్తే 'డ్రైవింగ్ లైసెన్స్' క్యాన్సిల్.. ఇలాంటి రూల్ మంచిదేనా?
భారతదేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేయడానికి 'ఉత్తరప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్' ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి మూడు కంటే ఎక్కువ చలాన్స్ పొందిన డ్రైవర్ లేదా రైడర్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు పౌరులను హెచ్చరించారు. ఆ తరువాత కూడా ఇదే మళ్ళీ పునరావృతమైతే.. వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా.. ఉత్తరప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, వరుసగా మూడు కంటే ఎక్కువ చలాన్లు పొందిన వ్యక్తి లైసెన్స్‌ను రద్దు చేయవచ్చని నిర్ణయించారు. రెడ్ లైట్ జంపింగ్, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్లడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా డ్రంక్ అండ్ డ్రైవింగ్ వంటి నేరాలకు సంబంధించి పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదీ చదవండి: చేతులు లేని మహిళకు డ్రైవింగ్ లైసెన్స్.. సీఎం చేతుల మీదుగా.. కేవలం నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఈ ఏడాది జరిగిన 1000 రోడ్డు ప్రమాదాల్లో సుమారు 400 మంది మరణించినట్లు తెలుస్తోంది. 2023 సెప్టెంబర్ వరకు ట్రాఫిన్ నిబంధలనను ఉల్లంఘించిన వాహనదారులు 14 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇందులో 69906 ఓవర్ స్పీడ్, 66867 రెడ్ లైట్ జంపింగ్, 10516 డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడినందు చలాన్ జారీ చేశారు. -
చేతులు లేని మహిళకు డ్రైవింగ్ లైసెన్స్.. సీఎం చేతుల మీదుగా..
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం, వాహనాలను డ్రైవ్ చేయాలంటే తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం దాదాపు అందరికి తెలుసు. ఇటీవల రెండు చేతులూ లేని ఓ మహిళకు కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ లైసెన్స్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టిన 'జిలుమోల్ మరియెట్ థామస్' (Jilumol Mariet Thomas) ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనే పట్టుదలతో ఐదు సంవత్సరాలు కృషి చేసి డ్రైవింగ్ నేర్చుకుంది. నేర్చుకోవడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందింది. జిలుమోల్ కారు డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మీరు గమనించినట్లయితే ఈమె కాళ్లతోనే కారుని డ్రైవ్ చేయడం చూడవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం మొదట్లో అప్లై చేసుకున్నప్పుడు అధికారులు తిరస్కరించారు. కానీ పట్టు వదలకుండా డ్రైవింగ్ నేర్చుకుని చివరికి సంబంధిత అధికారుల చేతులమీదుగానే డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. లైసెన్స్ కోసం జిలుమోల్ చేసిన అభ్యర్థనను ఐదేళ్ల క్రితం అధికారులు తిరస్కరించడంతో ఆమె రాష్ట్ర వికలాంగుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ను కోరింది. ఈ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన పరిష్కారం చూపాలని ఎర్నాకులం జిల్లాలోని మోటారు వాహన శాఖ అధికారులను రవాణా కమిషనర్ ఆదేశించింది. జిలుమోల్ కారుని సవ్యంగా డ్రైవింగ్ చేయగలదా లేదా అనే విషయాన్నీ మోటారు వాహన శాఖ అధికారులు పూర్తిగా తెలుసుకున్నారు. అయితే ఈమె కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారు ఉండాలని వారు తీర్మానించారు. దీంతో ఒక సంస్థ 2018 మోడల్ సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌కి కావలసిన మార్పులను చేస్తూ సవరించింది. జిలుమోల్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారుని ఆమె తన పాదాలతోనే ఆపరేట్ చేయవచ్చు. అంతే కాకుండా ఈ కారులోని కొన్ని ఫీచర్స్ యాక్టివేట్ చేయడానికి వాయిస్ రికగ్నిషన్ కూడా అందించింది. ఈమె ఈ ఏడాది మార్చిలో లెర్నర్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, నవంబర్‌లో డ్రైవింగ్ టెస్ట్ కూడా పాసయ్యింది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు కస్టపడి అనుకున్నది సాధించిన 'జిలుమోల్'కు కేరళ ముఖ్యమంత్రి స్వయంగా డ్రైవింగ్ లైసెన్స్ అందించారు. చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ సాధించిన మొదటి మహిళా ఈమె కావడం గమనార్హం. జిలుమోల్ ఆర్టిస్ట్ కావడం వల్ల ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తోంది. -
డ్రైవరన్నా.. చలో సిరిసిల్ల..!
ఖమ్మం: హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్లు రెన్యూవల్ చేసుకోవడం భారమవుతోంది. గతంలో ఎక్కడికక్కడ రవాణా శాఖ కార్యాలయంలో లైసెన్స్ రెన్యూవల్ చేసేవారు. కానీ గత మే నెల నుంచి రెన్యూవల్ స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్(టీఐడీఈఎస్)ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ సర్టిఫికెట్ జారీకి శిక్షణ కేంద్రం రాష్ట్రం మొత్తం మీద రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాత్రమే ఉంది. దీంతో కనీసం రెండు రోజులు కేటాయిస్తే తప్ప అక్కడకు వెళ్లి వచ్చే పరిస్థితి లేకపోవడంతో డ్రైవర్లు వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. రాష్ట్రమంతటా ఒకటే ట్రాక్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్(టీఐడీఈఎస్)ను ఏర్పాటుచేశారు. ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ ట్రాక్ నిర్మించటంతో డ్రైవర్‌కు ఒకరోజు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై డ్రైవింగ్‌లో మెళకువలు, సిగ్నలింగ్ సిస్టమ్‌పై శిక్షణ ఇస్తారు. ఆన్లైన్ తరగతుల ద్వారా జాతీయ రహదారిపై ఎంత వేగంగా వాహనం నడపాలో వివరించి టీఐడీఈఎస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటేనే హెవీ డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. గతంలో దీనిని పెద్దగా పరిగణనలోకి తీసుకోకున్నా ఈ ఏడాది మే నెల నుంచి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో రాష్ట్రమంతటా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు తప్పనిరిగా సిరిసిల్ల వెళ్లాల్సి వస్తోంది. వాస్తవానికి ఇది మంచి కార్యక్రమనే ప్రశంసలు వస్తున్నా.. దూరం కావటం వల్లే డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాగా, కొత్త హెవీ లైసెన్సులు మాత్రం ఎక్కడికక్కడ ఎంవీఐ కార్యాలయాల్లోనే జారీ చేస్తున్నారు. సిరిసిల్ల వెళ్లాలంటే.. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు టీఐడీఈఎస్ సర్టిఫికెట్ కోసం సిరిసిల్ల వెళ్లాల్సి రావడం దూరాభారమేనని చెప్పాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా డ్రైవర్లను తీసుకుంటే సరైన రవాణా సౌకర్యం లేక ఒక రైలు, ఒక బస్సు లేదంటే రెండు బస్సులు మారాల్సి ఉంటుంది. దీనికి తోడు ఆ ప్రాంతం కొత్తది కావటంతో డ్రైవర్లు ఇబ్బంది పడుతుండగా.. కనీసం రూ.3 వేలకు పైగా వ్యయమవుతోంది. ఇక సిరిసిల్ల ట్రాక్ వద్ద రోజుకు కేవలం 300 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చే అవకాశం ఉండడంతో డ్రైవర్లు అక్కడికి వెళ్లాక ఎప్పుడు పిలుస్తారో తెలియక పడిగాపులు పడాల్సి వస్తోంది. మినహాయింపు ఇవ్వండి.. రెండు, మూడు జిల్లాలు కలిపి వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ ట్రాక్‌ను నిర్మిస్తే తమకు అందుబాటులో ఉంటుందని డ్రైవర్లు అంటున్నారు. సిరిసిల్ల దూరాభారం కావడంతో కొత్తగా మరిన్ని డ్రైవింగ్ ట్రాక్‌లు అందుబాటులోకి వచ్చే వరకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌కు టీఐడీఈఎస్ సరిఫికెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డ్రైవర్లు, లారీ యజమానుల నుంచి డిమాండ్ వస్తోంది. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హెవీ డ్రైవింగ్ లైసెన్సు కలిగిన వారు సుమారు 20వేల మంది ఉంటారనేది అంచనా. -
రవాణా కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
ములుగు: ములుగు జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇన్ని రోజులు వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌ల విషయంలో ఇప్పటి వరకు ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీదనే ఆధార పడాల్సి వచ్చింది. వాహనదారులకు ఆ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. జిల్లాకు ప్రత్యేక కోడ్ టీఎస్ 37ను కేటాయిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా కేంద్రంలో కార్యాలయ ఏర్పాటుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇందులో భాగంగా రంగరావుపల్లి సమీపంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆవరణలో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. రంగులు అద్ది ముస్తాబు చేశారు. భవనం ముందున్న సుమారు రెండెకరాల ఖాళీ స్థలంలో మట్టిపోసి రోలర్‌తో చదును చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి అయిన తరువాత రాష్ట్ర రవాణా శాఖ, కలెక్టర్ ఆదేశాలతో ఈ నెల చివరి వారంలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. స్థానికులకు ఉపాధి రవాణా శాఖ కార్యాలయ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. ఇప్పటికే లిటిల్ ఫ్లవర్ స్కూల్ చుట్టపక్కల అద్దె గదులను వ్యాపారులు వెతుకుతున్నారు. సరైన భవనాలు లేని పక్షంలో డబ్బాలను ఏర్పాటు చేసుకొని ఆన్లైన్ చేసేందుకు చదువుకున్న యువత మొగ్గు చూపుతున్నారు. భూపాలపల్లి నుంచి సిబ్బంది కేటాయింప ములుగు జిల్లాలో ఏర్పాటు కానున్న ఆర్టీఓ కార్యాలయానికి ఇప్పటి వరకు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా శ్రీనివాస్ మాత్రమే పూర్తి బాధ్యతల్లో ఉన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యావంతులు, కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. తాత్కాలికంగా ప్రస్తుతం భూపాలపల్లిలో నిర్వహిస్తున్న రవాణా శాఖ కార్యాలయం నుంచి సిబ్బందిని కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా బండారుపల్లి సమీపంలో రవాణా శాఖకు కలెక్టర్ రెండు ఎకరాల భూమిని కేటాయించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యేంత వరకు తాత్కాలిక భవనంలో కొనసాగనున్నాయి. తగ్గనున్న దూరభారం.. పెరగనున్న ఆదాయం జిల్లాలోని చిట్టచివరిగా ఉన్న మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల వాహనదారులు వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌లకు భూపాలపల్లికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లాకు ప్రత్యేక రవాణా శాఖ కార్యాలయం కేటాయించడంతో సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి ఉపయోగకరంగా మారనుంది. దూరభారం భారీగా తగ్గనుంది. సుధీర్ఘ ప్రయాణం చేయలేక చాలా మంది ఇప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేని వారంతా ప్రస్తుతం జిల్లా కేంద్రానికి వచ్చి తీసుకోవచ్చు. కార్యాలయం ప్రారంభమైతే వాహనాదారులు లైసెన్స్‌ల కోసం క్యూ కట్టనున్నారు. ఇదే సమయంలో స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ లైసెన్స్‌లకు వచ్చే ఆదాయం భారీగా పెరుగనుంది. జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు అవుతుందని తెలిసి వాహనదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.. జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు టీఎస్ 37 కోడ్‌ను కేటాయించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మిగిలి ఉన్నాయి. రెండు లేదా మూడు రోజుల్లో సామగ్రి వస్తుంది. పనులు పూర్తి అయ్యాక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారిక భవనం పూర్తి అయ్యేంత వరకు తాత్కాలికంగా లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ పక్కన అద్దె భవనంలో కార్యాలయాన్ని కొనసాగిస్తాం. – శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి -
విదేశీయులకు షాకిచ్చిన కువైట్.. 66 వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు
మోర్తాడ్ (బాల్కొండ): వలస కార్మికులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పించిన కువైట్.. డ్రైవింగ్ లైసెన్స్‌ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి విదేశీయులకు జారీ చేసిన లైసెన్స్‌లలో ఏకంగా 66 వేల లైసెన్స్‌లను రద్దు చేసింది. ఇంకా అనేక మంది లైసెన్స్‌లు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనలతో ఇతరులతో పాటు తెలుగు రాష్ట్రాల వలస కారి్మకులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడనున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన అనేకమంది అరబ్బులకు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. అలాగే సేల్స్‌మెన్ కమ్ డ్రైవర్లుగా కూడా అనేక మంది వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి వారికి జారీ చేసిన లైసెన్స్‌ల విషయంలో కువైట్ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. సేల్స్మెన్లు కేవలం అదే పని చేయాలని, డ్రైవింగ్ ఎలా చేస్తారని ప్రశి్నస్తూ గతంలో జారీ చేసిన లైసెన్స్‌లను బ్లాక్ లిస్ట్‌లో ఉంచారని సమాచారం. మరోవైపు కంపెనీలను నిర్వహిస్తున్నవారు సొంతంగా వాహనాలను కొనుగోలు చేసి డ్రైవింగ్ లైసెన్స్‌లను పొందారు. వీరి ఆదాయం కూడా పరిగణనలోకి తీసుకుని సంతృప్తికరంగా ఉంటేనే లైసెన్స్‌లను కొనసాగించనున్నారు. కొన్నేళ్ల కిందట డ్రైవింగ్ లైసెన్స్‌లను విచ్చలవిడిగా జారీ చేయడంతో కొన్ని దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన కువైట్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుందని అక్కడ నివసిస్తున్న తెలంగాణ వాసులు కొందరు వెల్లడించారు. దిద్దుబాటులో భాగంగా సొంత కారు ఉండి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మన కరెన్సీలో కనీసం రూ.1.50 లక్షల వేతనం ఉండాలనే నిబంధన అమలులోకి తీసుకువచ్చారు. తక్కువ వేతనం అందుకుంటున్నవారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసి ఉంటే దానిని రద్దు చేశారు. కాగా తప్పుడు ఆధారాలతో డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందినవారు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చదవండి: అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ -
మైనర్ తప్పు.. మేజర్ ముప్పు
పటాన్చెరు టౌన్: తల్లిదండ్రులకు పిల్లలే సర్వస్వం. వారిపై అతి ప్రేమతో బైక్‌లు, కార్ల ఇస్తున్నారు. వాటిని నడుపుతుంటూ అది చూసి సంబరపడుతున్నారు. అయితే కంటికి రెప్పలా పిల్లలను కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే వాహనాలు ఇచ్చి వారిని ప్రమాదాలల్లోకి నెడుతున్నారు. పట్టణ, మండల ప్రాంతాల్లో 4, 5 ప్రమాదాల్లో ఒకటి మైనర్ల డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు సమచారం. ● ప్రస్తుతం పిల్లలు వాహనాలు నడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు వద్దని చెప్తున్న వారి మాట వినకుండా ద్విచక్ర వాహనాలను తీసుకొని రహదారుల పైకి వస్తున్నారు. ● మరికొందరు స్వయంగా తమ పిల్లలకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పోల్చుకుంటే, పటాన్చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ కేసులను ఎక్కువగా నమోదయ్యాయి. ● సైకిల్ నడపాల్సిన వయస్సులో పిల్లలు ద్విచక్ర వాహనాలపై స్కూళ్లకు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి దుకాణాల్లో సరుకులు తేవాలని పంపుతున్నారు. మరికొందరి తమ పిల్లలు వాహనం నడుపుతున్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇలా ఇవ్వడం తప్పని తెలిసే తప్పు చేస్తున్నారు. జిల్లాలో మైనర్ డ్రైవింగ్ వివరాలు... జిల్లాలోని సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 12 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో రూ.6 వేలు జరిమానా విధించారు. పటాన్చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 313 మైనర్ డ్రైవింగ్ కేసులకు రూ.1,56,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి వాహనాలు నడపాలంటే 18 సంవత్సరాల పైబడి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. గంటకు 25 కిలోమీటర్ కంటే వేగంగా వెళ్లలేని వాహనాలకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 26 కిలో మీటర్ల కంటే ఒక్క కిలోమీటర్ వేగంగా వెళ్లినా ఎలక్ట్రిక్ వాహనాలైనా రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. – రాజా మహమ్మద్, ఎంవీఐ తల్లిదండ్రులే బాధ్యత వహించాలి మైనర్లు వాహనాలు నడపరాదు. మొదటిసారి తనిఖీల్లో పట్టుబడితే వారికి జరిమానా విధించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే వారు ప్రమాదంబారినపడే విధంగా ప్రోత్సహించడం సరికాదు. వాహనం ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలి. – ప్రవీణ్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ -
ఈ వెహికల్స్ కొంటే డ్రైవింగ్ లైసెన్స్‌తో పనే లేదు - మరెందుకు ఆలస్యం..
భారతదేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డీజిల్, పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ అన్ని విభాగాల్లోనూ కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే ప్రజా రహదారులలో డ్రైవ్/రైడ్ చేయడానికి తప్పకుండా లైసెన్స్ అవసరం. కానీ మన దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అవాన్ ఇ ప్లస్ (Avon E Plus) భారతదేశంలో లభించే సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'అవాన్ ఇ ప్లస్'. దీని ధర కేవలం రూ. 25,000 కావడం గమనార్హం. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 50 కిమీ రేంజ్ అందిస్తుంది. 48v/12ah కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 24 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 6.5 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రధానంగా చెప్పుడోదగ్గ మోడల్ ఈ అవాన్ ఇ ప్లస్ కావడం గమనార్హం. డీటెల్ ఈజీ ప్లస్ (Detel Easy Plus) మన జాబితాలో మరో టూ వీలర్ 'డీటెల్ ఈజీ ప్లస్'. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 40,000 మాత్రమే. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 60 కిమీ రేంజ్ అందిస్తుంది. 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ కేవలం 4 నుంచి 5 గంటల సమయంలో ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ. ఆంపియర్ రియో ఎలైట్ (Ampere Reo Elite) రూ. 44,500 ధర వద్ద లభించే ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ ఛార్జ్‌తో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 20Ah లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగి గంటకు 25 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 8 గంటలు. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 (Hero Electric Flash E2) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మన జాబితాలో డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని వెహికల్ కావడం గమనార్హం. రూ. 52,500 ఖరీదైన హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ2 స్కూటర్ వినియోగించడానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇందులోని 51.2v/30ah బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 4 నుంచి 5 గంటలు. ఇది ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 65 కిమీ రేంజ్ అందిస్తుంది. లోహియా ఓమా స్టార్ లి (Lohia Oma Star Li) రూ. 41,444 వద్ద లభించే ఈ 'లోహియా ఓమా స్టార్ లి' ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ రైడింగ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని వెహికల్స్ లో ఇది ఒకటి. ఇందులోని 48V/20 Ah బ్యాటరీ 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. ఒకినావా లైట్ (Okinawa Lite) దేశీయ విఫణిలో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగానే ఉంది. ఇందులో భాగంగానే ఒకినావా లైట్ మంచి అమ్మకాలతో ముందుకు వెళుతోంది. ఈ స్కూటర్ ధర రూ. 67,000. ఇందులోని 1.25 కిలోవాట్ బ్యాటరీ ఇక ఫుల్ ఛార్జ్‌తో 60 కిమీ రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ టైమ్ 6 నుంచి 7 గంటలు. (ఇదీ చదవండి: ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి) ఓకినావా ఆర్30 (Okinawa R30) మన జాబితాలో చివరి ఎలక్ట్రిక్ బైక్ 'ఓకినావా ఆర్30'. దీని ధర రూ. 62,500. ఈ స్కూటర్ రేంజ్ 65 కిలోమీటర్లు. ఇది 4 నుంచి 5 గంటల సమయంలో 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ డిటాచబుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 1.25 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన 2023 స్కోడా కొడియాక్ - ధర & వివరాలు) నిజానికి దేశంలో వినియోగించే చాలా వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అయితే తక్కువ వేగంతో లేదా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇలాంటి స్కూటర్లు లాంగ్ రైడ్ చేయడానికి ఉపయోగపడవు, కానీ రోజు వారి ప్రయాణానికి, నగర ప్రయాణానికి చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
సిబిల్ స్కోర్ తరహాలోనే.. డ్రైవింగ్‌కూ స్కోర్! కేంద్రం కీలక నిర్ణయం?
సిబిల్ స్కోర్ తరహాలోనే డ్రైవింగ్‌కూ స్కోరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే బ్యాంకులు అంత సులువుగా రుణాలు ఇస్తాయి. అలాగే డ్రైవింగ్ స్కోర్ ఎక్కువ ఉంటే వాహనాల బీమా, కొత్త వాహనాల కొనుగోలులో రాయితీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. రహదారి భద్రతలో భాగంగా కేంద్రం ఈ వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చింది. త్వరలోనే దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించింది. – సాక్షి, అమరావతి ప్రమాదాలను తగ్గించేలా.. దేశంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2021లో దేశంలో 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 1.53 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 3.84 లక్షల మంది గాయపడ్డారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే 70 శాతం ప్రమాదాలు జరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రహదారి భద్రత లక్ష్యాలు సాధించాలంటే డ్రైవర్లకు తగిన అవగాహన కల్పించడం.. వారిని నియంత్రించడం ప్రధానమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ క్రమశిక్షణను ఎప్పటికప్పుడు అంచనా వేసే వ్యవస్థను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘రహదారి భద్రతా ప్రణాళిక 2.0’ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దేశంలో డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారంతా దీని పరిధిలోకి వస్తారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర భారీ వాహనాల డ్రైవర్ల క్రమశిక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానాలు, రోడ్డు ప్రమాదాలకు కారణమైన సందర్భాలు, పోలీసులు నమోదు చేసిన కేసులు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా డ్రైవింగ్ క్రమశిక్షణకు స్కోర్ ఇస్తారు. స్కోర్ ఆధారంగా ప్రోత్సాహకాలు డ్రైవింగ్ క్రమశిక్షణ స్కోర్ బాగున్నవారికి వాహన బీమాలో రాయితీలిస్తారు. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే బీమా ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా ధరలో రాయితీ ఇస్తారు. వీటిపై కేంద్ర రవాణా శాఖ వాహనాల తయారీ కంపెనీలు, బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ఢిల్లీలో అమలు చేయాలని భావిస్తున్నారు. లోటుపాట్లను సరిదిద్దుకుని 2025 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడీఏఎస్ ఏర్పాటు.. రెండో దశలో కార్లు, ఎస్‌యూవీలు, ఇతర భారీ వాహనాల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం(ఏడీఏఎస్)ను ఏర్పాటు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడే ఏడీఏఎస్ వ్యవస్థ కోసం కాస్త అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాల యజమానులు కూడా ఏడీఏఎస్ను తమ వాహనాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇది డ్రైవర్ నావిగేషన్‌కు సహకరిస్తుంది. అలాగే డ్రైవింగ్ సీటులో ఎవరు ఉన్నారో రికార్డు చేస్తుంది. తద్వారా క్రమశిక్షణారహితంగా వాహనం నడిపినప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఏడీఏఎస్ను ఇప్పటికే విద్యుత్ వాహనాల్లో ప్రవేశపెట్టారు. త్వరలో పెట్రోల్, డీజీల్ వాహనాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏడీఏఎస్ సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని డ్రైవింగ్ క్రమశిక్షణ స్కోర్‌ను నిర్ణయిస్తారు. -
డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నారా?... కొత్త రూల్స్ ఇవే
-
లైసెన్స్ లేకపోయినా.. నో ఫైన్ !
సాక్షి, భీమవరం: మన రోడ్లపై నిత్యం అనేకమంది ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో జరిమానాలు కట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా బైక్‌లు నడపడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఈ సమస్యకు భీమవరం పోలీసులు ఒక పరిష్కారం కనుగొన్నారు. ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే వారికి ఫైన్ కాకుండా రూ. 410లు కట్టించుకుని వెంటనే ఎల్ఎల్ఆర్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా అమలుచేసేలా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారిని తనిఖీ చేస్తే ప్రతి 10 మందిలో 8 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం లేదని పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ.5 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది. దీంతో ఎప్పీ రవిప్రకాష్ వినూత్నంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. పోలీసు సిబ్బంది తనిఖీలు చేసే సమయంలో లైసెన్స్‌లేని వారు అక్కడికక్కడే ఎల్ఎల్ఆర్ పొందేలా రూపకల్పన చేశారు. లైసెన్స్ లేనివారు లేని వారు కేవలం రూ. 410తో ఎల్ఎల్ఆర్ పొందే అవకాశం ఉండడంతో పాటు వెంటనే శాశ్వత లైసెన్స్ తీసుకునేలా వారికి అవగాహన కలి్పస్తున్నట్లు రవిప్రకాష్ చెప్పారు. ఈ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి లైసెన్స్‌లు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 7 వేల మందికి తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేసినట్లు చెప్పారు. హెల్మెట్ తప్పనిసరి వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని నివారించేలా చర్యలు చేపట్టారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వాహనాదారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. దీనిలో భాగంగా తనిఖీలు చేసే ప్రాంతాల్లో హెల్మెట్ల అమ్మకాలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. నాణ్యమైన హెల్మెట్లు విక్రయించేలా చేయడం వల్ల జరిమానా కట్టే కంటే హెల్మెట్ కొనుగోలు చేయడం, ధరించడం మేలనే భావన వాహనదారుల్లో కలిగేలా చైతన్యం కలిగించడానికి ప్రణాళిక రూపొందించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు భీమవరం జిల్లాకేంద్రంగా అవతరించిన తరువాత ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. అవసరాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాలు రూపొందించవచ్చనే అంశంపై పట్టణంలోని శ్రీవిష్ణు ఇంజనీరింగ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలల్లోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో ప్రత్యేక సర్వే చేపట్టాం.సమస్య పరిష్కారానికి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాక.. జిల్లాలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్న తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఆకివీడు పట్టణాల్లో కూడా ఇదే తరహా సర్వే చేయించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గాన్ని అన్వేíÙస్తాం. – రవిప్రకాష్ ఎస్పీ, భీమవరం జిల్లా -
వామ్మో జిన్‌పింగ్.. చైనాలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..
ఏదైనా వాహనం నడిపేందుకు ప్రతీ వాహనదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. లేనిపక్షంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే జరిమానా అయినా కట్టాలి.. ఒక్కోసారి జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇక, మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా సాధించాలో దానికి సంబంధించిన టెస్టు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇక, విదేశాల్లో డ్రైవింగ్ టెస్టు ఎలా ఉంటుందో చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక, తాజాగా డ్రాగన్ కంట్రీ చైనాలో డ్రైవింగ్ టెస్టు చూస్తే నిలుచున్న చోటే కాళ్లకు వణుకు వస్తుంది. అంత కఠినంగా ఉంటుంది టెస్ట్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోలో పాము కన్నా ఎక్కువ వంకరలు తిరిగిన రెండు లైన్లలో వాహనం వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా మధ్యలో 8 ఆకారం ఉన్న లైన్లలో వాహనం లైన్‌కు టచ్ కాకుండా బయటకు వెళ్లాలి. అనంతరం.. డ్రైవర్ కారును రివర్స్‌లో పార్క్ చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో కారు టైర్ ఏ మాత్రం లైన్‌కు తాకినా టెస్ట్ ఫెయిల్ అయినట్టుగా అధికారులు గుర్తిస్తారు. Driver license exam station in China pic.twitter.com/BktCFOY4rH — Tansu YEĞEN (@TansuYegen) November 4, 2022 కాగా, చైనాలో డ్రైవింగ్ టెస్టుకు సంబంధించిన వీడియోను తన్సు యెగెన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, కొందరు నెటిజన్లు మాత్రం ఇతరు దేశాలకు చెందిన డ్రైవింగ్ టెస్టులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుండటం విశేషం. Meanwhile at indonesia pic.twitter.com/SfqaiXcRCh — Aku (@AkuVaatu) November 5, 2022 That’s why they use bikes 😄 pic.twitter.com/mTilg4KL6r — Cynthia🦋Zoe (@arc_zoe_) November 4, 2022 -
కొత్త ఓటర్లకు డిజిటల్ కార్డులు.. డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో ఈ కార్డులు
నల్లగొండ: కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఓటర్ గుర్తింపు కార్డు లను తొలిసారిగా రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికలో యువ ఓటర్లు వినియోగించబోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో ఈ కార్డులు ఉండనున్నాయి. ఈ–ఎపిక్ కార్డులుగా పేర్కొనే ఈ కార్డులు ఆరు ప్రధాన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటాయి. క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ (ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు కలిగిన) ఓటరు గుర్తింపు సంఖ్య, ఓటరు ఫోటో, చిరునామా, ఇతర వివరాలు ఈ కార్డులో ఉంటాయి. మునుగోడులో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు ఈ కార్డులను గురువారం నుంచి ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిని పోస్టు ద్వారా మునుగోడుకు పంపించినట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. పాత ఓటర్లు సైతం మీ–సేవా కేంద్రాల్లో డబ్బులు చెల్లించి ఈ డిజిటల్ ఓటరు కార్డులను పొందవచ్చు. 22,350 మంది అర్హులకు పంపిణీ ఈ కార్డులను సెక్యూర్డ్ పీడీఎఫ్ ఫైల్ రూపంలో ఫోన్లో లేదా వేరే ఎలక్ట్రానిక్ పరికరంలో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఈ–ఎపిక్ కార్డు అందుబాటులో లేకున్నా పీడీఎఫ్ ఫైల్ ప్రింట్‌ను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కార్డులను టాంపర్ /ఎడిట్ చేయడం సాధ్యం కాదు. ఈ మేరకు పటిష్ట రక్షణ చర్యలను ఎన్నికల సంఘం తీసుకుంది. నకిలీ ఓటరు కార్డుల తయారీ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం అందిన దరఖాస్తులను ఎన్నికల సంఘం పరిశీలించి 22,350 మంది అర్హులని తేల్చింది. వారందరికీ చెన్నైలో ముద్రించిన కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. -
యువకుడి అసాధారణ బిజినెస్.. సినిమాలో హీరోలా..
మాడ్రిడ్: స్పెయిన్‌లో ఓ యువకుడు అసాధారణమైన ‘బిజినెస్’ చేస్తున్నాడు.. కొంత రుసుము తీసుకొని కోరుకున్న వారికి తన ‘సేవలు’ అందిస్తున్నాడు.. ఇంతకీ అతను అందిస్తున్న సేవలు ఏమిటో తెలుసా? సినిమాలో డబ్బు కోసం ఇతరుల నేరాలను తనపై వేసుకొని జైలుపాలయ్యే హీరో తరహాలో అతను వ్యవహరిస్తున్నాడు!! అంటే డ్రైవింగ్ తప్పిదాలకు పాల్పడే వ్యక్తుల నుంచి కాస్త ఫీజు వసూలు చేసి ఆ నేరాలను తనపై వేసుకుంటున్నాడు! తద్వారా వారి డ్రైవింగ్ లైసెన్సులతోపాటు డ్రైవింగ్ రికార్డులను పదిలంగా ఉంచుతూ తనపై మచ్చ వేసుకుంటున్నాడు! అలాగే వారిని ప్రభుత్వ జరిమానాల బారి నుంచి తప్పిస్తున్నాడు. ఇలా ఇప్పటివరకు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 100 మంది వాహనదారుల నేరాలను తనపై వేసుకున్నాడు. ఇందుకోసం ‘ఖాతాదారుల’ నుంచి రూ. 6 వేల నుంచి రూ. 16 వేల వరకు వసూలు చేస్తున్నాడు. స్పెయిన్ మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం ఒక్కో వాహనదారుడికి లైసెన్స్ జారీ చేసే సమయంలో 12 పాయింట్లు కేటాయిస్తారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్ తదితర నేరాలకు పాల్పడే వాహనదారుల నుంచి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు వసూలు చేయడంతోపాటు వారి నిర్ణీత పాయింట్లు కోల్పోగానే లైసెన్సులను సస్పెండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో వాహనదారులను కాపాడేందుకు ఆ యువకుడు నేరాన్ని తనపై వేసుకొని జరిమానాలు కడుతున్నాడట. ఇప్పటివరకు అతని డ్రైవింగ్ లైసెన్స్ కింద ఏకంగా మైనస్ 321 పాయింట్లు ఉండటం గమనార్హం. రెండేళ్లుగా పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఆ యువకుడు ఇటీవల మాత్రం దొరికిపోయాడట. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కోసం ఓ ద్విచక్ర వాహనదారుడి వాహనాన్ని పోలీసులు ఆపబోగా అతను ఆపకుండా పరారయ్యాడు. కానీ మర్నాడే ఆ నేరాన్ని తానే చేశానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ యువకుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆన్లైన్లో తనిఖీ చేయగా అసలు బండారం బయటపడింది. దీంతో అతన్ని జైలుకు పంపారు. చదవండి: మళ్లీ చూడాలంటే 107 ఏళ్లు ఆగాల్సిందే! -
ఇక ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో సమూల మార్పులకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. లైసెన్సుల జారీకి ప్రస్తుతం ఉన్న విధానం స్థానంలో కొత్తగా ఆటోమేటెడ్ వ్యవస్థను నెలకొల్పనుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ, రాష్ట్ర రవాణా శాఖ సంయుక్తంగా రాష్ట్రంలోని 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్‌లను నెలకొల్పాలని నిర్ణయించాయి. తద్వారా పూర్తిస్థాయిలో డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలు నిర్వహించిన అనంతరమే లైసెన్సులు జారీ చేయనున్నారు. దాంతో లైసెన్సుల జారీలో సమగ్రత, కాలయాపన లేకుండా ఉంటుంది. మొదటి దశలో రాష్ట్రంలో చిత్తూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళంలో ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్‌లను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇప్పటికే చిత్తూరులోని డ్రైవింగ్ ట్రాక్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మిగిలిన 8 కేంద్రాల్లోనూ త్వరలోనే ట్రాక్‌ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. సమగ్ర పరీక్షల అనంతరమే.. ప్రస్తుతం లైసెన్సుల జారీకి నాలుగంచెల్లో డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తున్నారు. మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించి లెర్నింగ్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్), పర్మనెంట్ లైసెన్స్ జారీ చేస్తున్నారు. కాగా ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. తూతూ మంత్రంగా నైపుణ్య పరీక్షలు నిర్వహించి లైసెన్సులు జారీ చేసేస్తున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు లైసెన్సుల జారీలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. రోజుకు సగటున 10 వేల వరకు దరఖాస్తులు వస్తున్నాయి. దాంతో పరీక్షల నిర్వహణ, లైసెన్సుల జారీకి ఎక్కువ సమయం పడుతోంది. దీనికి పరిష్కార మార్గంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీకి ఆటోమేటెడ్ వ్యవస్థను నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. 24 రకాల నైపుణ్య పరీక్షలు.. ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్‌ల డిజైన్‌ను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) రూపొందించింది. దాంతో ఆధునిక రీతిలో డ్రైవింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. 24 కేటగిరీలుగా డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. వాహనాన్ని ముందుకు నడిపించడంలో 8 రకాలుగా పరీక్షిస్తారు. ఇక రివర్స్, ఎస్ టైప్ రివర్స్, ట్రాఫిక్ జంక్షన్లు, ఓవర్ టేక్ చేయడం, క్రాసింగ్, పార్కింగ్ ఇలా వివిధ రీతుల్లో డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తూ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తారు. డ్రైవింగ్ ట్రాక్‌లలో సెన్సార్లు అమరుస్తారు. వాటిని కంప్యూటర్ గదికి అనుసంధానిస్తారు. డ్రైవింగ్ నైపుణ్య పరీక్షల సమయంలో తప్పు చేస్తే వెంటనే బీప్ శబ్ధం వస్తుంది. ఆ ట్రాక్‌పై డ్రైవింగ్ పరీక్ష పూర్తయ్యేసరికి ఆ విధంగా ఎన్ని బీప్‌లు వచ్చాయో లెక్కించి పాయింట్లు వేస్తారు. అర్హత పాయింట్లు వస్తే ఆటోమెటిక్‌గా లైసెన్సు జారీ చేస్తారు. లేకపోతే ఆటోమెటిక్‌గా లైసెన్సు తిరస్కరిస్తారు. ఆ తరువాత నిర్ణీత గడువు తరువాతే మళ్లీ పరీక్షకు హాజరుకావాలి. తమ డ్రైవింగ్ తీరును అభ్యర్థులు వీడియో ద్వారా చూసి లోటుపాట్లు తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్రంలో 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్‌ల ఏర్పాటును ఏడాదిలోగా పూర్తి చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. సమాధానం ఇచ్చారు. -
డ్రైవింగ్ లైసెన్సుల జారీ.. ట్రాఫిక్ పోలీస్ కొత్త ఐడియా
సాక్షి,హిమాయత్‌నగర్(హైదరాబాద్): నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఐడియాకు శ్రీకారం చుట్టారు. ఓ పక్క ట్రాఫిక్ కంట్రోలింగ్‌తో పాటు డ్రైవింగ్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తిస్తున్నారు. లైసెన్సు లేకుండా రోడ్డుపైకి రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో పట్టుబడ్డ వారు లైసెన్సుకు అర్హత కలిగిన వారైతే ట్రాఫిక్ పోలీసులే లైసెన్సులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ట్రాఫిక్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ ట్రాఫిక్ కంట్రోలింగ్, సిబ్బంది పనితీరు వంటి వాటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై చార్జ్‌షీట్ సైతం వేయాలంటూ ఇటీవల ట్రాఫిక్ అధికారులకు రంగనాథ్ సూచించారు. ప్రజల్లో ట్రాఫిక్ విభాగంపై మంచి అభిప్రాయం వచ్చేందుకు సిబ్బంది సహకారం ఎంతో అవసరమని వారికి చెప్పడంతో..చీఫ్ దృష్టిని ఆకర్షించేందుకు నారాయణగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ ఓ కొత్త ఐడియాకు నాంది పలికారు. ఎస్సై ఆధ్వర్యంలో అర్హుల ఎంపిక.. డ్రైవింగ్ లైసెన్సు కోసం చాలా మంది దళారుల చేతిలో మోసపోతున్నారు. ఇకపై అలా జరగకుండా ఉండేందుకు పోలీసులే వాటిని జారీ చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇందుకోసం పృథ్వీరాజ్ అనే ఎస్సైని ఇన్స్పెక్టర్ కేటాయించారు. డిగ్రీ కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, ఎలక్ట్రానిక్స్, టీ కొట్లలో పనిచేస్తూ..డ్రైవింగ్ లైసెన్సు లేకుండా ఉన్న వారిని ఎస్సై పృథ్వీరాజ్ గుర్తిస్తున్నారు. వీరికి ముందుగా డ్రైవింగ్ లైసెన్సు జారీకి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను సూచిస్తున్నారు. లోకల్ వ్యక్తి అయితే..అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్..ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే లైసెన్సుకు ఎటువంటి గుర్తింపు ధృవపత్రాలు ఉండాలనే విషయాలను వారికి వివరిస్తారు. ఇప్పటి వరకు సుమారు 30 మందిని ఎంపిక చేశారు. ఎల్‌ఎల్‌ఆర్‌కు ఎలా ఎంపిక అవ్వాలి, ఎటువంటి ట్రాఫిక్ గుర్తులు ప్రొజెక్టర్‌పై ఉంటాయి, టెస్ట్ ఎలా పాస్ కావాలనే విషయాలను వివరించనున్నారు. ఎల్‌ఎల్‌ఆర్‌కు అర్హత కూడా పోలీసు స్టేషన్లోనే చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది. తాము ఈ తరహా ఐడియాకు శ్రీకారం చుట్టామని దీనిని పరిశీలించి అనుమతి ఇస్తే ఓ అడుగు ముందుకేస్తామంటూ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్‌ను కోరారు. ఆయన సరే అంటే రానున్న రోజుల్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్సులను జారీ అయ్యే అవకాశం ఉంటుంది. -
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు..! కేంద్రం కీలక నిర్ణయం..!
కేంద్ర ప్రభుత్వం తెర పైకి కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, ఓటరు కార్డు వంటి అన్నిరకాల కార్డులను ఒకే కార్డులోకి తీసుకుని వచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది. అన్నీంటికీ ఒకే కార్డు..! ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదిక మేరకు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ , పాన్ కార్డు, ఆధార్ కార్డ్ వంటి ఇతర డిజిటల్ ఐడీ కార్డులను లింక్ చేస్తూ కొత్తగా “ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్” కొత్త మోడల్ రూపొందించేందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రణాళికలను ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రభుత్వ సేవల కోసం ఆధార్ కార్డు, ఓటర్ కార్డు , పాన్ కార్డుతో పాటుగా పాస్ పోర్ట్ వంటి ప్రభుత్వ ఐడీల కోసం ఒకే డిజిటల్ ఐడీ ఉంటే బెటర్ అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్డుపై గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. వన్ కార్డు మరోసారి తెరపైకి వచ్చింది. లక్ష్యం అదే..! ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ కార్డుతో వేగవంతమైన పనితీరు, కచ్చితమైన ఫలితాల కోసం ఉపయోపడేలా రూపొందిస్తున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో వ్యక్తిగత కేవైసీ ప్రక్రియ అన్ని విభాగాల్లో మరింత సులభమయ్యే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ వన్‌స్టాప్ డెస్టినేషన్‌గా ఉంటుందని తెలిపింది. చదవండి: భారత కంపెనీల జోరు..! బొక్కబోర్లపడ్డ చైనా..! -
శభాష్ శివలాల్.. మరుగుజ్జు వ్యక్తిని అభినందించిన సజ్జనార్, ఎందుకో తెలుసా?
సాక్షి, బంజారాహిల్స్: అంకితభావం, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో డ్రైవింగ్ నేర్చుకుని తెలంగాణ రవాణా శాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్ట మొదటి మరుగుజ్జుగా రికార్డు సృష్టించిన డాక్టర్ శివలాల్‌ను టీఎస్ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ మంగళవారం శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు. శివలాల్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా, రోల్‌మోడల్‌గా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో నివసించే శివలాల్ తన ఎత్తుకు సరిపడా కారు క్లచ్, బ్రేక్‌లు ఏర్పాటు చేసుకొని మూడు నెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని అధికారులను ఒప్పించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అభినందనీయమని సజ్జనార్ అన్నారు. లిమ్కాబుక్ ఆఫ్రికార్డ్స్లో స్థానం దక్కించుకున్న శివలాల్ భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరారు. ఈ మేరకు ఆయన శివలాల్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేశారు. -
Hyderabad: తాగి నడిపితే జైలుకే!
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న మందుబాబులపై సైబరాబాద్ పోలీసులకు స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 11వరకు 396 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 321 మంది మందుబాబులు ఉండగా.. 74 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న వారు ఉన్నారు. ఇందులో 33 మంది నిందితులకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. ఆయా నిందితులకు రూ.16.16 లక్షల జరిమానా విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మోటార్ వాహన చట్టం సెక్షన్– 19 ప్రకారం ఆయా నిందితుల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ సంబంధిత రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (ఆర్టీఓ) అధికారులకు సూచించారు. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!
India's First Dwarf Driving License: ప్రపంచంలో అందరికి ఏవేవో లోపాలు ఉంటాయి. కొంతమంది వాటిని అధిగమించి తమలో ఉన్న నైపుణ్యాలకు పదునుపెట్టి స్ఫూర్తిదాయకంగా నిలవడానికి ప్రయత్నిస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అలానే చేసి అందరికి స్ఫూర్తిగా నిలాచాడు. (చదవండి: అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!) అసలు విషయంలోకెళ్లితే...కరీంనగర్ జిల్లాకి చెందిన గట్టిపల్లి శివపాల్ సుమారు మూడు అడుగుల ఎత్తులో ఉండే 42 ఏళ్ల మరుగుజ్జు వ్యక్తి. అంతేకాదు మరుగుజ్జువాళ్లలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అయితే అతన్ని ప్రజలు తనని ఎత్తు కారణంగా హేళన చేస్తుండేవారని చెబుతున్నాడు. ఈ క్రమంలో అతను తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, పైగా తనలాంటి వాళ్లకి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రజలు కూడా సుముఖంగా లేరని వాపోయాడు. అయితే తన స్నేహితురాలి సాయంతో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, ప్రస్తుతం తాను అక్కడే 20 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు అతను ఎక్కడికైన వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసినప్పుడల్లా వారు తన రైడ్‌ని రద్దుచేసేవారని, పైగా తన భార్యతో కలిసి బయటకి వెళ్లినప్పుడల్లా రకరకాలుగా కామెంట్లు చేసేవారని శివపాల్ అన్నాడు. దీంతో అప్పుడే శివపాల్ తానే స్వయంగా కారు నడపాలనే నిర్ణయించుకున్నాడు. పైగా అందుకోసం ఇంటర్నెట్లో విపరీతంగా సర్చ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే శివపాల్‌కి యూఎస్‌లో ఒక వ్యక్తి అప్లోడ్ చేనిన వీడియో ఒకటి అతన్ని ఆకర్షించింది. అంతేకాదు ఆ వీడియోలో కారుని తన ఎత్తుకు తగిన విధంగా సెటప్ చేస్తే సులభంగా డ్రైవ్ చేయవచ్చునని వివరించి ఉంది. దీంతో అతను అనుకున్నదే తడువుగా తన స్నేహితుడి సాయంతో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే రవాణా శాఖకు ఎత్తుపై కొన్ని మార్గదర్శకాలను కలిగి ఉన్నందున లైసెన్స్ పొందడం మరొక అతి పెద్ద సవాలుగా మారింది. ఈ మేరకు శివపాల్ అధికారులకు విజ్ఞప్తి చేసి సరైన డ్రైవింగ్ టెస్ట్ చేయించి డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తిగా నిలవడమే కాక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి నామినేట్ అయ్యాడు. దీంతో చాలామంది మరుగుజ్జు వ్యక్తులు శివపాల్ని డ్రైవింగ్ శిక్షణ కోసం సంప్రదించడం విశేషం. అంతేకాదు శివపాల్ వచ్చే ఏడాది శారీరక వికలాంగుల కోసం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. (చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!) -
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ. 4 వేల వరకు జరిమానా..! బాదుడే.. బాదుడు!!
ముంబై: రాష్ట్రంలో సెంట్రల్ మోటర్ వెహికల్ చట్టం 2021 అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంఘిస్తే బారీగానే జరిమానాలను విధిస్తారు. ఈమేరకు మహారాష్ట్ర రవాణా శాఖ డిసెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు విముఖత చూపినా.. రాష్ట్రంలో తరచూ జరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు, పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా దీన్ని అమలు చేసేందుకు రవాణా శాఖ సంకల్పించింది. దీని ప్రకారం గురువారం కొత్త నిబంధనల నోటిఫికేషన్ విడుదలైంది. నిబంధనలను ఉల్లంగించిన ద్విచక్ర వాహనాలకు వెయ్యి, ఫోర్ వీలర్ వాహనాలకు రెండు వేలు, ఇతర భారీ వాహనాలు నడిపేవారు నాలుగు వేల రూపాయల చొప్పున జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుమునుపు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే జరిమానాగా విధించేవారు. ఈ చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంగించినా, ఫోన్ మాట్టాడుతూ వాహనాలను నడిపినా తడిసిమోపెడవుతుంది! చదవండి: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్... దెబ్బతో అకౌంట్లో డబ్బులన్నీ మాయం! వాహనాలకు రిఫ్లెక్టర్ లేకపోయినా, ఫ్యాన్సీ నెంబర్ ఫ్లేట్స్ అమర్చినా.. వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. గతంలో ఇందుకు రెండువందల రూపాయలు జరిమానాగా విధించేవారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనాలకు నడిపిన వారికి ఏకంగా రూ.5 వేలు జరిమానా తప్పదు. కాగా మోటారు వాహనాల చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం జరిమానా మొత్తాన్ని పెంచారు. ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను అమలు చేయడానికి వెనుకాడింది.ఐతే తాజాగా వాటిని అమలు చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. చదవండి: ఒమిక్రాన్ ఎలుకల నుంచి మనుషులకు సోకిందా? ఎంతవరకు నిజం.. -
‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకోనున్న అక్షయ్‌కుమార్
మాలీవుడ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ను బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ తీసుకోనున్నారు. మలయాళ హిట్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్‌లో అక్షయ్‌కుమార్ నటించనున్నారని లేటెస్ట్ టాక్. ఇందులో ఇమ్రాన్ హష్మి మరో హీరోగా నటిస్తారు. అక్షయ్ కుమార్‌తో ‘గుడ్‌న్యూస్’ చిత్రాన్ని తీసిన రాజ్ మెహతా ‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్‌ను తెరకెక్కిస్తారట. వచ్చే ఏడాది ఈ షూటింగ్ ఆరంభం కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... మలయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్’లో పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ నటించారు. ఈ చిత్రానికి జూనియర్ లాల్ డైరెక్టర్. తమ అభిమాన హీరోతో సెల్ఫీ దిగాలనుకున్న ఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కుటుంబం ఎలాంటి ఇబ్బందులకు లోనైంది? హీరోకి, ఇన్స్పెక్టర్కు ఈగో క్లాషెస్ ఎందుకొచ్చాయి? అన్నదే ఈ చిత్ర కథాంశం. -
మరుగుజ్జు.. శివలాల్ సాధించాడు!
బంజారాహిల్స్: అతడి ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది.. లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఓ మరుగుజ్జును అందరికీ ఆదర్శంగా నిలిపింది.. హైదరాబాద్ బంజారాహిల్స్‌రోడ్ నంబర్–10లోని గౌరీశంకర్ కాలనీలో నివసించే జి.శివలాల్(39) మరుగుజ్జు. బీకాం చదివాడు. భార్య కూడా మరుగుజ్జే. వీరికి ఒక కొడుకు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో దారి వెంట వెళుతుంటే ‘పొట్టివాడు’అంటూ కొందరు గేలిచేసేవారు. వీడు సైకిల్ కూడా తొక్కలేడంటూ నవ్వేవారు. ఈ అవమానాలు శివలాల్లో పట్టుదలను పెంచాయి. సైకిల్ ఏం ఖర్మ, ఏకంగా కారే నడిపిద్దామని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది..! గతే డాది నవంబర్ 27న ఓ కారు కొనుక్కున్నాడు. క్లచ్, బ్రేక్ అందదు కాబట్టి కారును రీమోడలింగ్ చేయించాడు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అదే కారులో డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టి నెలరోజుల్లోనే పూర్తిగా తర్ఫీదు పొందాడు. గత మార్చి 12న కారు నడిపించుకుంటూ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అయితే, ఇంతవరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరుగుజ్జులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇవ్వలేదు. ఉన్నతాధికారులు వారంపాటు ఈ విషయంపైనే చర్చించి చివరకు ఈ నెల 6న శివలాల్‌కు పర్మనెంట్ లైసెన్స్ జారీ చేశారు. తెలంగాణలో ఉన్న సుమారు 400 మంది మరుగుజ్జులలో డిగ్రీ చేసిన మొట్టమొదటివ్యక్తి శివలాల్. అంతేకాకుండా మొదటగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మరుగుజ్జు కూడా ఆయనే కావడం గమనార్హం. చదవండి: 3 పేర్లు 3 ఫోన్ నంబర్లు.. స్రవంతికి పెళ్లయినా వదల్లేదు.. -
వాహనాల ఫిట్నెస్ టెస్ట్.. ఇక ఆటోమేటెడ్
సాక్షి, హైదరాబాద్: వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆటోమేటెడ్ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల నాణ్యతను, పనితీరును, వినియోగ అర్హతను ధృవీకరించేందుకు ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం తాజాగా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు అక్టోబర్ నాటికి గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని చోట్ల ఈ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ► ఆటోమెబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనానికి సంబంధించిన 40 అంశాలను ఈ ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రాలు తనిఖీ చేసి సదరు వాహనం సామర్థ్యాన్ని నిగ్గు తేలుస్తాయి. ► బస్సులు, లారీలు, ఆటోరిక్షాలు తదితర అన్ని రకాల ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా వాహనాలను ఈ ఫిట్నెస్ కేంద్రాల్లోనే తనిఖీలు చేయవలసి ఉంటుంది. ► ప్రస్తుతం మోటారు వాహన తనిఖీ అధికారులే అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో స్వయంగా తనిఖీలు చేసి వాహనాల సామర్థ్యాన్ని ధృవీకరిస్తుండగా రానున్న ఆ రోజుల్లో ఆ పనిని యంత్రాలు చేయనున్నాయి. ► మరో వైపు ఈ ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ స్టేషన్ల (ఏవిఎఫ్ఎస్) నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం నిర్వహించే పరీక్షలను పూర్తిగా ప్రైవేట్ అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లకు అప్పగించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఫిట్నెస్ కేంద్రాలను సైతం ప్రైవేటీకరించేందుకు తాజాగా రంగం సిద్ధమైంది. ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యానికి ఊతం వాహనాల సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ..నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేట్ సంస్థలు ఏ మేరకు కచ్చితమైన ప్రమాణాలను పాటిస్తున్నాయో నిర్ధారించడం సాధ్యం కాదని రవాణాశాఖ సాంకేతిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆటోమేటెడ్ వెహికల్ టెస్టింగ్ సెంటర్లను ఆర్టీఏలే నిర్వహించే విధంగా మార్పులు చేయాలంటున్నారు. పక్కాగా తనిఖీలు... ► వాహనం ఇంజన్ సామర్ధ్యం, బ్రేకులు, టైర్లు, కాలుష్య కారకాల తీవ్రత వంటి ముఖ్యమైన అంశాలు మొదలుకొని వైపర్లు, సైడ్ మిర్రర్లు, షాకబ్జర్వర్స్, డైనమో, బ్యాటరీ తదితర 40 అంశాలను ఈ యంత్రాలు క్షుణ్ణంగా పరీక్షిస్తాయి. ► ఎలక్ట్రికల్, మెకానికల్ లోపాలను గుర్తిస్తాయి. ► వాహనాల నుంచి వెలువడిన కాలుష్య కారకాలను గుర్తించి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్లకు అర్హత ఉన్నదీ లేనిదీ ఈ యంత్రాలే నిర్ధారిస్తాయి. ► గంటకు 30 వాహనాల వరకు తనిఖీలు నిర్వహించే విధంగా పూర్తిస్థాయిలో కంఫ్యూటరీకరించిన ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది. ► ప్రస్తుతం మోటారు వాహన ఇన్స్టెక్టర్లు నిర్వహించే తనిఖీల్లో శాస్త్రీయత కొరవడినట్లు ఏఆర్ఏఐ నిపుణులు భావిస్తున్నారు. మొక్కుబడిగా నిర్వహించే ఈ తనిఖీల వల్ల కాలం చెల్లిన, డొక్కు వాహనాలకు తేలిగ్గా అనుమతి లభిస్తుందనే అభిప్రాయం ఉంది. ► ఇలా ఉత్తుత్తి తనిఖీలతో రోడ్డెక్కే వాహనాలు రహదారి భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. -
డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ కార్డుల సమస్యకు చెక్ : ఏపీ
-
లై‘సెన్సు’ తప్పనిసరి.. చాలామంది ఎల్ఎల్ఆర్ వద్దే ఆగిపోతున్నారు
సాక్షి,కర్నూలు: ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో వాహనం ఒక భాగం అయిపోయింది. పని ఎటువంటిదైనా ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే వారి ఆర్థిక స్థోమత బట్టి ఏదో ఒక వాహనం చేతిలో ఉండాల్సిందే. కరోనా మహమ్మారి అధిక శాతం మంది జీవన శైలిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. దీంతో జనాలు గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రజా రవాణాలైన ఆటోలు, బస్సులు ఎక్కేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదు. ఎవరికి వారు ఉన్నంతలో సొంత వాహనాలు సమకూర్చుకుంటున్నారు. వాహనం నడిపే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగిఉండాలి. శాశ్వత లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ముందుగా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి ముందుగా లెర్నింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్(ఎల్ఎల్ఆర్) తీసుకోవాలి. తరువాత రవాణా శాఖ కార్యాలయంలో శాశ్వత లైసెన్స్ ఇస్తారు. ఎల్ఎల్ఆర్ కోసం ముందుగా కామన్ సర్వీసు కేంద్రాలు, వార్డు, సచివాలయాల్లో స్లాట్ బుక్ చేస్తారు. కుదిరిన తేదికి స్లాట్ బుక్ చేసుకుని రవాణా శాఖ కార్యాలయానికి వెళ్తే పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారికి లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇది 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఇది తీసుకున్న నెల రోజుల తరువాత శాశ్వత లైసెన్స్ పొందేందుకు అనుమతి వస్తుంది. కానీ అధిక శాతం మంది ఎల్ఎల్ఆర్తోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రతి ఏడాది ఎల్ఎల్ఆర్ పొందినవారిలో కనీసం 10 వేల మందికి పైగా శాశ్వత లైసెన్స్ తీసుకోవడం లేదు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపి రవాణా శాఖ అధికారులు, పోలీసులకు పట్టుబడితే వేల రూపాయలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే జరిమానాలు పెరిగాయి. కావున ఎల్ఎల్ఆర్ తీసుకున్న వారు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. కరోనాకు ముందు జిల్లాలో ప్రతి రోజూ ఎల్‌ఎల్‌ఆర్‌లు 250, శాశ్విత లైసెన్స్‌లు 250, స్లాట్ బుక్కింగ్‌కు అనుమతించే వారు. కర్ఫ్యూ నిబంధనలు సడలించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెండు నెలల విరామం తరువాత సేవలు పునఃప్రారంభమయ్యాయి. చలానాలు... ఎల్ఎల్ఆర్ కోసం ద్విచక్ర వాహన చోదకులు రూ. 260, ద్విచక్ర వాహనంతో పాటు కారు లైసెన్స్ కావాలనుకునే వారు రూ.420 చలానా చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎల్ఎల్ఆర్ పాసైన తర్వాత శాశ్వత లైసెన్స్ కోసం కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి. ద్విచక్ర వాహనం కోసమైతే రూ.960, ద్విచక్ర వాహనంతోపాటు కారు అయితే రూ.1260 చలానా చెల్లించాలి. పట్టుబడితే భారీగా అపరాధ రుసుం లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడితే భారీగా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో సుమారు 1.30 లక్షల రవాణ వాహనాలున్నాయి. వీటి పర్యవేక్షణకు కర్నూలులో ఉప రవాణా శాఖ కార్యాలయం, ఆదోని, నంద్యాలలో ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, డోన్, ఆత్మకూరు ప్రాంతాల్లో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలున్నాయి. అక్కడ ఎల్ఎల్ఆర్, శాశ్విత లైసెన్స్‌లు పొందవచ్చు. – రాజ్‌గోపాల్, ఎంవీఐ -
ట్రైనింగ్ అంతంతే.. లైసెన్స్ వచ్చేస్తుందంతే..!
సాక్షి,హైదరాబాద్: బండి ఎక్కాల్సిన పనిలేదు. గేర్లు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎక్కడో ఒకచోట డ్రైవింగ్ స్కల్లో చేరితే చాలు నెల రోజుల్లో లైసెన్సు చేతికొచ్చేస్తుంది. ఇందుకోసం సదరు డ్రైవింగ్ స్కూల్ డివండ్ మేరకు ఫీజు చెల్లిస్తే సరి. కోవిడ్ సాకుతో అన్ని వ్యవస్థలూ నిబంధనలకు తిలోదకాలిచ్చేశాయి. ఏడాది కాలంగా అన్ని చోట్లా అక్రమాల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ క్రమంలోనే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి గుర్తింపు లేని కొన్ని డ్రైవింగ్ స్కళ్లు సైతం దళారులకు అడ్డాలుగా వరాయి. ఎలాంటి శిక్షణ, నైపుణ్యం లేకుండానే ఎడాపెడా లైసెన్సులు ఇప్పించేస్తున్నాయి. కొంతమంది ఆర్టీఏ అధికారులు, సిబ్బంది సైతం వీటికి అండగా నిలుస్తున్నారు. దీంతో రవాణా శాఖ పౌరసేవల్లోని పాదర్శకత హాస్యాస్పదంగా మారింది. కొరవడిన శిక్షణ.. కారు డ్రైవింగ్‌లో శిక్షణ పొందేందుకు కనీసం 30 రోజుల పాటు శిక్షణ అవసరం. అప్పటికి డ్రైవింగ్‌లో ప్రాథమిక అనుభవం మాత్రమే వస్తుంది. నైపుణ్యం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రవాణాశాఖ డ్రైవింగ్ నేర్చుకొనేవాళ్లకు లెర్నింగ్ లైసెన్సు ఇస్తుంది. ఈ లైసెన్సు తీసుకున్నవాళ్లు 30 రోజుల తర్వాత 6 నెలల్లోపు ఎప్పుడైనా డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవచ్చు. డ్రైవింగ్‌లో శిక్షణ, నైపుణ్యం, మెలకువలు నేర్చుకొనేందుకే ఈ ఆరు నెలల వెసులుబాటు కల్పించారు. కానీ చాలా స్కూళ్లు 30 రోజుల శిక్షణలోనే అన్ని పనులు పూర్తి చేస్తున్నాయి. ఈ వ్యవధిలో పట్టుమని 10 క్లాసులు కూడా ఇవ్వడం లేదు. డ్రైవింగ్‌లో ప్రాథమికమైన అవగాహన కూడా కల్పించడం లేదు. ఆర్టీఏ అధికారులు, సిబ్బందితో ఉన్న అవగాహన మేరకు మొక్కుబడి డ్రైవింగ్ పరీక్షలతో లైసెన్సులు ఇప్పించేస్తున్నారు. కొన్ని చోట్ల కనీసం పరీక్షలు లేకుండానే డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కోవిడ్ ముసుగులో ఉల్లంఘన.. సాధారణంగా డ్రైవింగ్‌లో శిక్షణ రెండు విధాలుగా ఉంటుంది. మొదట సాంకేతిక అంశాలపైన తరగతిగది శిక్షణనిస్తారు. ఆ తర్వాత స్టిమ్యులేటర్పై స్టీరింగ్ శిక్షణ ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలతో పాటు రోడ్డుపై శిక్షణనిస్తారు. కనీసం 3 నెలల వ్యవధిలో అభ్యర్థి అన్ని అంశాలపై అవగాహన, శిక్షణ పెంచుకొనేలా ఈ కార్యక్రమం ఉండాలి. అనేక దశాబ్దాలుగా శిక్షణనిస్తున్న కొన్ని ప్రముఖ డ్రైవింగ్ స్కూళ్లు మినహాయించి చాలా వరకు ఎలాంటి శిక్షణను ఇవ్వడం లేదు. కరోనా ముసుగులో ఏడాది కాలంగా ఈ దందా సాగుతోంది. గ్రేటర్లో రవాణా శాఖ గుర్తింపు ఉన్న స్కళ్లు 150 వరకు ఉంటే ఎలాంటి గుర్తింపు, ఆమోదం, కనీస నిబంధనలు పాటించనివి 500 పైగానే ఉంటాయి. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగమే నేరుగా ప్రోత్సహించడం గమనార్హం. -
కొత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి శుభవార్త!
మీరు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి శుభవార్త. ఇక లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయాల(ఆర్టీఓ) వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆర్టీఓ కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్టు కూడా చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా ఓ ముసాయిదాను తీసుకొచ్చింది. ఈ ముసాయిదా ప్రకారం జూలై 1 నుంచి కొత్త నిబందనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం లైసెన్స్ కోరుకునే వ్యక్తి ఏదైనా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలోనే ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. హైక్వాలిటీ డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవర్‌గా ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలోనే డ్రైవింగ్ లెసెన్స్ జారీ కోసం ఆర్టీఓ కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్టు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ శిక్షణ కేంద్రాల వద్ద సిమ్యులేటర్లు, దరఖాస్తుదారులకు హైక్వాలిటీ ట్రైనింగ్ కోసం ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ను కలిగి ఉంటాయి. గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్ లో లైట్ మోటార్ వేహికల్ కొరకు డ్రైవింగ్ కోర్సు ప్రారంభం అయిన తేదీ నుంచి గరిష్టంగా నాలుగు వారాల వ్యవధిలో 29 గంటల పాటు రన్ అవుతుందని నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టీసు కూడా ఉంటుంది. అలాగే, శిక్షణ కేంద్రాలలో మీడియం, హెవీ మోటార్ వేహికల్ డ్రైవింగ్ కోర్సుల కాలవ్యవధి 38 గంటలు(ఆరు వారాల వ్యవధిలో). ఇందులో రెండు సిగ్మెంట్లు ఉంటాయి.. ఒకటి థియరీ, రెండవది ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో కొన్ని బేసిక్స్ కూడా నేర్పిస్తారు. రోడ్డుపై ఇతరులతో నైతికంగా, మర్యాదపూర్వకంగా ఎలా నడుచుకోవలో వంటి కొన్ని ప్రాథమికాంశాలను ఈ శిక్షణలో నేర్పిస్తారు. ఈ కోర్సు వల్ల రహదారిపైకి నైపుణ్యం కలిగిన డ్రైవర్లు వస్తారు అని కేంద్రం పేర్కొంది. అక్రిడేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల కొరకు మంజూరు చేయబడ్డ అక్రిడిటేషన్ ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. తర్వాత పునరుద్దరించుకోవచ్చు. చదవండి: ప్రతి నెల రూ.55 పొదుపుతో.. నెల నెల రూ.3000 పెన్షన్ -
జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంక్ చార్జీల వరకు జూలై 1, 2021 నుంచి అనేక కొత్త మార్పులు చోటు చేసుకొనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రేపటి నుంచి ఛార్జీలు పెంచేందుకు సిద్దమవుతుంది. అలాగే ఎల్పీజీ ధరలో కూడా మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ కొత్త మార్పుల వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్బీఐ బీఎస్‌బీడీ జూలై 1 నుంచి ఎస్బీఐ బీఎస్‌బీడీ ఖాతాదారుల జేబుకు చిల్లు పడనుంది. ఒక నెలలో బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి కూడా కలిపి నెలకు ఉచితంగా నాలుగుసార్లు మాత్రమే నగదు తీసుకునే వీలుంటుంది. ఆపై ఒక్కో లావాదేవీపై రూ.15 (జీఎస్టీ అదనం) చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఒక ఆర్ధిక సంవత్సరంలో 10 చెక్స్ మాత్రమే ఉచితంగా అందించనున్నారు. అంతకంటే ఎక్కువ 10 లీఫ్ల చెక్ బుక్కు కోసం అయితే రూ. 40, 25 లీఫ్‌లదైతే రూ.75 చార్జీలు ప్లస్ జీఎస్టీ వర్తిస్తుంది. ఇక అత్యవసర చెక్ బుక్ కోసం రూ. 50 (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. ఎల్పీజీ గ్యాస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) లేదా కిచెన్ గ్యాస్ రేట్లు కూడా జూలై 1 నుండి సవరించనున్నారు. ప్రతి 5 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను సవరిస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ జూలై 1 నుంచి కేంద్రం ఏర్పాటు చేస్తున్న కొత్త సిస్టమ్ ప్రకారం, ఇక నుంచి ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్(ఆర్ టీఓ) ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్రం గుర్తించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలో డ్రైవింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత వారు ఆ కేంద్రం నుంచే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఐఎఫ్ఎఎస్ సీ కోడ్లు కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే. అయితే, జులై 1 నుంచి సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు కెనరా బ్యాంక్‌కు చెందిన కొత్త ఐఎఫ్ఎఎస్ సీ కోడ్లు వినియోగించాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎఎస్ సీ కోడ్ లను కెనరా బ్యాంక్ వెబ్సైట్ ద్వారా పొందొచ్చు. చెక్కు బుక్కులు చెల్లవు మీరు ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాదారులా? అయితే ఇది మీ కోసమే. ఈ రెండు బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం అయిన కారణంగా పాత చెక్కు బుక్కులు జులై 1 నుంచి చెల్లవ్. కొత్త చెక్కు బుక్కులు యూనియన్ బ్యాంకు శాఖల్లో తీసుకోవాల్సి ఉంటుంది. టీడీఎస్ కొత్త రూల్స్ ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్రకారం గత రెండేళ్లలో చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ పన్ను రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే వారి నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి రానుంది. చదవండి: ఇజ్రాయిల్ తరహా 'ఐరన్ డోమ్'ను భారత్ నిర్మించాలి -
ఇకపై వాహనాలకు ఏకీకృత కాలుష్య సర్టిఫికెట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఇకపై ఏకీకృత పొల్యూషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అందజేసే పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికెట్‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తారు. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ వాహనం, వాహన యజమాని పూర్తి వివరాలు కనిపిస్తాయి. వాహనం యజమాని, అతని ఫోన్ నంబర్, చిరునామా, వాహన ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్, వాహనం కాలుష్యాన్ని ఎంత స్థాయిలో ఉద్గారాలను వెదజల్లుతోంది తదితర వివరాలన్నింటినీ పొందుపరుస్తారు. ఇకపై వాహనం యజమాని మొబైల్ నంబర్‌ను తప్పనిసరి చేశారు. వ్యాలిడేషన్, చెల్లింపులు తదితరాల కోసం ఎస్ఎంఎస్ అలర్ట్లనూ పంపుతారు. పరిమితికి మించి అధిక ఉద్గారాలు వెలువడితే ఇకపై రిజెక్షన్ స్లిప్‌ను ఇవ్వనున్నారు. కేంద్ర మోటార్ వెహికల్ చట్టాలు–1989లో సవరణలు చేసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ఇకపై పీయూసీ డేటాబేస్‌ను జాతీయ రిజిస్ట్రర్‌తో అనుసంధానిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీసహా ఇతర పత్రాల రెన్యువల్ గడువు పొడిగింపు కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో వాహనాల పత్రాలను రెన్యువల్ చేసుకోలేని వారికి కేంద్రం మరో ఉపశమనం కల్గించింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఫిట్నెస్ సర్టిఫికెట్లతో పాటు అన్ని రకాల పర్మిట్ల చెల్లుబాటును కేంద్రం సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి గడువు ముగిసిన మోటారు వాహన డ్రైవర్లపై విచారణ చేయరాదని రాష్ట్రాల రవాణా శాఖలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఒక అడ్వైజరీ జారీ చేసింది. చదవండి: దేశంలో 8 లక్షల దిగువన కరోనా పాజిటివ్ కేసులు చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
వాహనదారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా వాహనదారులకు శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ వంటి పలు వాహన సంబందిత డాక్యుమెంట్ల గడువును తాజాగా 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. దీనికి సంబందించి రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. "కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ఫీట్ నెస్, పర్మిట్(అన్ని రకాల), లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్(ల) గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడగించినట్లు" అని కేంద్రం ట్వీట్ చేసింది. గత ఏడాది ఫిబ్రవరి 1 ముగిసిన అన్నీ వాహన పత్రాల గడువును సెప్టెంబర్ 30, 2021 నాటికి పొడగించింది. ఈ చర్య వల్ల సామాజిక దూరాన్ని పాటిస్తూ రవాణా సంబంధిత సేవలను పొందవచ్చు అని తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో పౌరులు, రవాణాదారులు ఇబ్బందులను ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, గతంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. ఇంతకు ముందు, అభ్యర్థులు లైసెన్స్ కోసం ఆర్టివో కార్యాలయలలో డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి వచ్చేది. కొత్త నిబందనల ప్రకారం, ప్రభుత్వం గుర్తించిన, అర్హత కలిగిన కేంద్రాల్లో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. Taking into consideration the need to prevent the spread of COVID-19, MoRT&H has advised the Enforcement Authorities that the validity of Fitness, Permit (all types), License, Registration or any other concerned document(s) may be treated to be valid till 30th Sept, 2021. pic.twitter.com/xe6QIvks5T — MORTHINDIA (@MORTHIndia) June 17, 2021 చదవండి: కొత్త ఇన్‌కంటాక్స్ పోర్టల్ మరీ ఇంత ఖరీదా? -
అక్కడ ఉత్తీర్ణులైతే డ్రైవింగ్ టెస్ట్ ఉండదు
సాక్షి, న్యూఢిల్లీ: గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు అమలయ్యేలా తప్పనిసరి నియమావళిని రోడ్డు రవాణా– రహదారుల శాఖ జారీ చేసింది. మోటారు వాహనాల (సవరణ) చట్టం –2019లోని సెక్షన్ 8 ద్వారా దఖలు పడిన అధికారంతో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు నియమ నిబంధనలను తయారు చేసి జారీ చేసింది. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. కేంద్రం జారీ చేసిన కొత్త నియమావళి ప్రకారం అభ్యర్థులకు అత్యున్నత నాణ్యత కలిగిన శిక్షణను అందించేందుకు ఆయా కేంద్రాల్లో సిమ్యులేటర్లు, డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారు డ్రైవింగ్ లైసెన్స్‌కు దాఖలు చేసుకున్న సమయంలో ప్రస్తుతం ప్రాంతీయ రవాణా కార్యాలయా(ఆరీ్టవో)ల్లో నిర్వహిస్తున్న డ్రైవింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ శిక్షణ కేంద్రాల గుర్తింపును ఐదేళ్ల కాలానికి గాను జారీ చేస్తారు. తర్వాత రెన్యూవల్ చేయవచ్చు. చదవండి : Tesla S Plaid : ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కార్ -
ప్రకృతి పిలిచినా.. రైలు ఆగలేదు!
వెబ్‌డెస్క్: జపాన్‌లో బుల్లెట్ రైలు నడిపే ఓ డ్రైవర్ నిర్లక్ష్యం అందరినీ కాసేపు టెన్షన్ పెట్టింది. ప్రకృతి పిలుపుతో డ్రైవర్ బాత్రూంకి వెళ్లగా, డ్రైవర్ లేకుండానే బులెట్ రైలు కొన్ని నిమిషాలు పరుగులు పెట్టింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ కావడంతో డ్రైవర్, కండక్టర్లపై చర్యలకు సిద్ధమయ్యారు. అసలేం జరిగిందంటే.. హికరీ 633 సూపర్ ఫాస్ట్ బుల్లెట్ రైలు శుక్రవారం ఉదయం టొకైడో-షిన్కన్సేన్ రైల్వే లైన్ల మధ్య నడుస్తోంది. ఆ టైంలో హఠాత్తుగా కడుపు నొప్పి రావడంతో డ్రైవర్ బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ టైంలో కండక్టర్ని తన సీట్లో ఉంచి వెళ్లాలి. కానీ, ఆ కండక్టర్‌కి లైసెన్స్ లేదు. దీంతో కాక్‌పిట్‌ను ఖాళీగానే వదిలి బాత్రూంకి వెళ్లాడు. కనీసం రైలు వేగాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు ట్రైన్ గంటకు150 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. రైళ్లో 160 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ మానిటరింగ్ చేస్తున్న అధికారులు.. డ్రైవర్ ఇంజిన్ కాక్‌పిట్‌లో లేకపోవడంతో కంగారుపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ప్రమాదేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చర్యలు తప్పవు సెంట్రల జపాన్ రైల్వే జపాన్ రూల్స్ ప్రకారం.. బుల్లెట్ ట్రైన్ నడిపే డ్రైవర్‌తో పాటు కండక్టర్‌కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒకవేళ డ్రైవర్ ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు, అత్యవసర సమయాల్లోనూ ఆ కండక్టర్ ట్రైన్‌ను నడపొచ్చు. అలాకాని పక్షంలో డ్రైవర్ ఎంత ఎమర్జెన్సీ అయిన కాక్‌పిట్‌ను వదిలేసి వెళ్లకూడదు. -
డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్
హైదరాబాద్ కు చెందిన గడ్డం వంశీ అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ చేశారు. తర్వాత ఇండియాకు వచ్చి తన కలను నిజం చేసుకోవడానికి తన పది మంది ఫ్రెండ్స్ తో కలిసి మూడేళ్లు శ్రమ పడి ఒక ఎలక్ట్రిక్ బైక్ రూపొందించారు. ఆ బైక్ పేరు ఆటమ్ 1.0. దీని డిజైన్ చూడటానికి వింటేజ్ కేఫ్ రేజర్ మోడల్లా ఉంటుంది. బరువు అంతా కలిపిన 35 కేజీలే. అయితే, ఈ బైక్ గంటకు 25కి.మీ అధిక వేగంతో వెళ్తుంది. ఈ బైక్‌కి 2 సంవత్సరాల వారంటీ కూడా ఉంది. ఇది ముఖ్యంగా మైనర్లు, టీనేజర్లు, పెద్దవాళ్లు అందరికీ ఉపయోగపడేలా తయారు చేసినట్లు వారు పేర్కొన్నారు. దీనిని నడపడటానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని వారు పేర్కొంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 48 వోల్ట్, 250 వాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీని బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. సింగల్ ఛార్జ్ తో 100 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. మరొక విషయం ఏమిటంటే బైక్ బ్యాటరీ ప్యాక్‌ని మీరు బయటకు తీసి ఛార్జ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ బైక్‌కి దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోందని వంశీ తెలిపారు. ఈ కంపెనీ బైక్ తయారీ కేంద్రం తెలంగాణలో ఉంది. ఈ కేంద్రంలో రోజూ 250 నుంచి 300 బైకులు తయారుచేయగలరు. కస్టమర్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీస్థాయిలో మాన్యుఫాక్చర్ యూనిట్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ బైక్ ధర రూ.50,000 ఉంది. కావాలనుకునేవారు ఆటోమొబైల్స్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మీరు ఆటం 1.0ని అడ్వాన్స్‌గా బైక్ బుక్ చేసుకోవాలంటే మీరు ముందుగా రూ.3,000 కంపెనీ వెబ్సైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ బైక్‌ని రివోల్డ్ ఇంటెల్ కార్ప్ అనే స్టార్టప్ కంపెనీ లాంచ్ చేసింది. దీన్ని ఆర్ వి400 అనే పేరుతో లాంచ్ చేసింది. ఈ బైక్ ప్రత్యేకమైనది. దీనికి జియో-ఫెన్సింగ్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, క్లౌడ్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో 4జీ సిమ్ కార్డ్ కూడా ఉంది. చదవండి: 2030లో గాల్లో ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్! కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా? -
వాహనదారులకు కేంద్రం తీపికబురు
వాహనదారులకు కేంద్రం శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు కేంద్రం పెంచింది. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతున్న కారణంగా వాటిని రెన్యువల్ చేసుకోవడంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా గడువును పొడిగించింది. అంటే గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఎక్స్పైరీ అయిన వాటి గడువు 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు కానున్నట్లు పేర్కొంది. గతంలో ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో తాజాగా గడువు పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989 కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. చదవండి: సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
విదేశాల్లో మన మహిళలు రయ్ రయ్..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోనే కాదు.. విదేశాల్లోనూ సిటీ లేడీస్ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, తదితర అవసరాల కోసం విదేశాలకు వెళ్తున్న నగరవాసులు ఆ దేశాల్లో సొంత డ్రైవింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. విశాలమైన రోడ్లు, సురక్షితమైన డ్రైవింగ్ సదుపాయం ఉండడంతో మహిళలు సైతం సొంత వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉద్యోగాల కోసం వెళ్లిన వాళ్లే కాకుండా సాధారణ గృహిణులు కూడా సొంత వాహనాలపైన ఎక్కువగా ఆధారపడాల్సి రావడం వల్ల డ్రైవింగ్‌ను తప్పనిసరిగా భావిస్తున్నారు. దీంతో నగరంలో అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లకు పురుషులతో పాటు మహిళలు సైతం పోటీ పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి ఏడాది సుమారు 8 వేల నుంచి 10 వేల అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు జారీ అవుతుండగా అందులో 1500 నుంచి 2000 వరకు మహిళల పర్మిట్లు ఉంటున్నాయి. రవాణా శాఖ అందజేసే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు విదేశాల్లో ఏడాది పాటు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. ఈ పర్మిట్లతో అక్కడ ఏడాది పాటు వాహనాలు నడుపొచ్చు. ఆ లోపు అక్కడి రవాణాశాఖ ప్రమాణాల మేరకు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకోవలసి ఉంటుంది. హెచ్ 4 వీసాపై డిపెండెంట్‌గా వెళ్తున్న మహిళలు అక్కడికి వెళ్లిన తరువాత ఉద్యోగాన్వేషణలో భాగంగా డ్రైవింగ్‌ను తప్పనిసరిగా భావిస్తున్నారు. పెరుగుతున్న అంతర్జాతీయ పర్మిట్లు.. అమెరికా వంటి దేశాల్లో చాలా చోట్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ తక్కువ. దీంతో ప్రతి ఒక్కరు సొంత వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. హైదరాబాద్‌లో సొంత వాహనాలపైన పరుగులు తీసిన వాళ్లు అక్కడికి వెళ్లిన తరువాత మరింత ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. అక్కడి పటిష్టమైన డ్రైవింగ్ నిబంధనలు కూడా అందుకు ఇతోధికమైన ప్రోత్సాహాన్ని అందజేస్తున్నాయి. సాధారణంగా మన రోడ్డు నిబంధనలకు విదేశాల్లో నిబంధనలకు మధ్య ఎంతో తేడా ఉంటుంది. అక్కడ స్టీరింగ్ ఎడమ వైపు ఉంటే మన దగ్గర కుడి వైపునకు ఉంటుంది. రోడ్లకు అనుగుణమైన వేగ నియంత్రణ వ్యవస్థ అమలవుతుంది. దీంతో మహిళలు ధైర్యంగా వాహనాలు నడుపుతున్నారు. 24 గంటల్లోనే... డ్రైవింగ్ లైసెన్సుతో పాటు, విదేశాలకు వెళ్లేందుకు వీసా కలిగిన వాహనదారులు అంతర్జాతీయ పర్మిట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రస్తుతం ఆన్లైన్లో స్లాట్ సమోదు చేసుకొనే సదుపాయం ఉంది. దరఖాస్తు చేసుకొన్న 24 గంటల వ్యవధిలోనే అంతర్జాతీయ పర్మిట్లను వాహనదారులకు అందజేస్తారు. ఎంతో భరోసా హైదరాబాద్‌లో డ్రైవింగ్‌లో ఎంత అనుభవం ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్లిన తరువాత కొద్దిగా భయం ఉంటుంది. అధికారులు వాహనాలను నిలిపివేసినప్పుడు గందరగోళంగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో హైదరాబాద్ నుంచి వెంట తెచ్చుకున్న అంతర్జాతీయ పర్మిట్ ఒక భరోసానిస్తుంది. డ్రైవింగ్‌లో అనుభవానికి అది ప్రామాణికంగా దోహదం చేస్తుంది. – జ్యోతి, న్యూజిల్యాండ్ -
ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయండి ఇలా
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధార్-ప్రామాణీకరణ ఆధారిత కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించింది. ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడంతో సహా 18 సేవలను ఆన్లైన్ ద్వారా ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆధార్ ప్రామాణీకరణత గల కొన్ని సేవలు ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసిన దాదాపు 3 వారాల తర్వాత తీసుకోని రానున్నారు. ప్రస్తుతం పరివాహన్ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పునరుద్ధరించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. దశ 1: పరివహన్ బోర్డు అధికారిక వెబ్సైట్ పరివాహన్.గోవ్.ఇన్ లేదా మీ రాష్ట్ర సంబంధిత ఆర్టీఓ వెబ్సైట్ కు వెళ్లండి. దశ 2: పోర్టల్‌లోని కనిపించే “ఆన్లైన్ సర్వీస్” విభాగంలో గల “డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు” ఎంచుకోండి. దశ 3: ఇప్పుడు క్రొత్త విండో ఓపెన్ అవుతుంది, అక్కడ మీ రాష్ట్ర పేరును ఎంచుకోవాలి. దశ 4: ఆపై డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ సేవలను ఎంచుకోండి. దశ 5: ఇప్పుడు, మీ దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలో మీకు సూచనలు వస్తాయి. వాటిని పూర్తిగా చదివిన తర్వాత 'కొనసాగింపు'పై క్లిక్ చేయండి. దశ 6: మీ పుట్టిన తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పిన్‌కోడ్, ఇతర వివరాలు దగ్గర పెట్టుకోండి దశ 7: ఇప్పుడు మీ వ్యక్తిగత లేదా వాహన సంబంధిత వివరాలను నింపండి. దశ 8: తర్వాత మీ ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేయండి. దశ 9: మీరు ఈ ప్రక్రియ పూర్తీ చేశాక మీరు మీ అప్లికేషన్ ఐడిని చూడగలిగే రసీదు పేజీ కనిపిస్తుంది. అలాగే, మీకు అన్ని వివరాలతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. దశ 10: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఛార్జీని ఆన్లైన్ ద్వారా లేదా కార్యాలయానికి వెళ్లి చెల్లించవచ్చు. చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! మొబైల్ టారిప్‌లు పెరుగనున్నాయా? -
వాహనదారులకు కేంద్రం శుభవార్త!
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీఓ కార్యాలయాలు అందించే ముఖ్యమైన సేవలను ఇప్పుడు ఆన్లైన్లో ద్వారా పొందవచ్చు అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు 18 రకాల సేవలను ఆధార్ అనుసంధానం ద్వారా వినియోగించుకునేలా మార్పులు చేసింది. ఈ సేవల కోసం ఆర్టీఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులో అడ్రస్ మార్పు, ఆర్ సీ రిజిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ వంటివి ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఆన్లైన్లో పొందవచ్చు. ఆన్లైన్లో లభించే ఇతర సేవలలో డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎన్ఓసి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు, మోటారు వాహన యాజమాన్య బదిలీ నోటీసు, మోటారు వాహన యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి దరఖాస్తు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో చిరునామా, డ్రైవర్ శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రం, దౌత్య అధికారి మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, దౌత్య అధికారి మోటారు వాహనం తాజా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, లీజు-కొనుగోలు ఒప్పందానికి ఆమోదం, లీజు-కొనుగోలు ఒప్పందాన్ని వంటివి ఉన్నాయి. ఈ ప్రక్రియలను మరింత సౌకర్యవంతంగా చేయడానికి, ఆర్టీఓల వద్ద రద్దీని తగ్గించడానికి ఆన్లైన్లో సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్రం తెలిపింది. కొత్త డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడంలో ఆధార్ ధృవీకరణ తప్పనిసరని మంత్రిత్వ శాఖ ఇంతకుముందు విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. చదవండి: రికార్డ్ స్థాయిలో పెరిగిన ఐటీ నియామకాలు అమెజాన్.. వెనక్కి తగ్గాలి -
తస్మాత్ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు ఏ-1 గా జైలుకెళ్లాడు
మూసాపేట: తెలిసిన వారే కదా అని డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చిన, ప్రమాదాలు జరిగినప్పుడు వాహనం యజమానే నిందితుడిగా అవుతారు. ఇతరుల వాహనం నడిపే క్రమంలో లైసెన్స్ లేని వ్యక్తి ప్రమాదం బారిన పడితే వాహనం యజమాని జైలుకు వెళ్లిన ఘటన తాజా కేసుతో ఈ విషయం వెల్లడైంది. స్నేహితురాలికి తన స్కూటీ ఇస్తే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్కూటీ యజమాని అయిన స్నేహితుడిని ప్రధాన నిందితుడిగా చేస్తూ, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను రెండవ నిందితుడిగా పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో దంత విద్యార్థిని ఆది రేష్మా మరణించిన విషయం విదితమే. ఈ కేసులో స్కూటీ యజమాని అజయ్‌సింగ్ (23), హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. (చదవండి: రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి) -
ఎవరికి హెల్మెట్ లేకున్నా.. లైసెన్సు రద్దు
సాక్షి, హైదరాబాద్: మీరు హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తున్నారా.. మీ వెనకాల కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేదా.. ఇలా తొలిసారిగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. ఇక రెండోసారి దొరికితే మీకు హెల్మెట్ ఉన్నా, లేకున్నా.. పిలియన్ రైడర్ ధరించకపోతే మాత్రం శాశ్వతంగా మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అంశాన్ని అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులకు లేఖలు రాసేందుకు సమాయత్తం అవుతున్నారు. దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చే ముందు మోటార్ వెహికల్ సవరణల చట్టం–2019, సెక్షన్ 206 (4) ద్వారా హెల్మెట్ లేని వాహనదారులపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో అవగాహన కలిగించేలా వీడియో చిత్రాలు చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. అలాగే వాహనాలు ఎక్కువగా ఆగే ట్రాఫిక్ జంక్షన్లలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహించి జాగృతం చేస్తున్నారు. భారీగా ఈ–చలాన్లు.. గతేడాది హెల్మెట్ లేని 18,50,000 మంది (వాహనదారులు, పిలియన్ రైడర్లు)కి ఈ–చలాన్లు జారీ చేశారు. గతేడాది జరిగిన 625 రోడ్డు ప్రమాదాల్లో 663 మంది మృతి చెందారు. అత్యధిక శాతం హెల్మెట్ ధరించకపోవడంతోనే మరణించారని ట్రాఫిక్ గణాంకాలు చెబుతున్నాయి. మృతుల్లో చాలామంది పిలియన్ రైడర్లే ఉండటంతో హెల్మెట్ ధరించే అంశాన్ని కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్ పోలీసు అధికారులు నిర్ణయించారు. సీపీ సజ్జనార్ మార్గదర్శనంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ ఇప్పటికే పిలియన్ రైడర్లకు హెల్మెట్ లేకున్నా ఈ–చలాన్లు విధిస్తున్నారు. ఆ తర్వాత కూడా హెల్మెట్ లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అంశంపై తొలుత అవగాహన కలిగించి.. అమలు చేసే యోచనలో ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు విస్తృత స్థాయిలో అవగాహన కలిగించిన తర్వాతే లైసెన్స్ రద్దుపై రవాణా శాఖకు లేఖలు రాస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: (కొత్త సచివాలయం ముందు 2 భారీ ఫౌంటెయిన్లు) (10,673 టీచర్ పోస్టులు ఖాళీ) -
వాహనదారులకు షాక్ : శాశ్వతంగా లైసెన్సు రద్దు
సాక్షి,హైదరాబాద్: భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా..అనేకమంది ద్విచక్రవాహనదారుల ప్రాణాలు పోతున్నా..లైట్ తీసుకుంటున్నారా? హెల్మెట్ లేకుండానే ప్రయాణిస్తున్నారా? ఆఫీసుకు ఆలస్యం అవుతోందని, ఏమవుతుందిలే.. చలానా కట్టేద్దాంలే అంటూ నిర్లక్ష్యంగా బైక్‌తో రోడ్డెక్కుతున్నారా? అయితే మీకు భారీ ఝలక్ తప్పదు. ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్ నడపుతూ పట్టుబడితే రూ.100 చలానాతో సరిపెట్టబోమని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసుల విభాగం స్పష్టం చేసింది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు నాణ్యమైన హెల్మెట్లుధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, అలాగే రోడ్డు భద్రతలో తమతో సహకరించాని కోరారు. తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, చలానాల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది.#RoadSafety #RoadSafetyCyberabad@cyberabadpolice @TelanganaCOPs pic.twitter.com/AWbxWDLTZM — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 19, 2021 -
ఇకపై డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ జారీ..
సాక్షి, న్యూఢిల్లీ : ఇకపై డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్‌లు జారీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. పౌరులకు డ్రైవింగ్‌లో నాణ్యతతో కూడిన శిక్షణను అందించేందుకు డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు నిర్ధిష్టమైన అర్హతలతో కూడిన ముసాయిదాను రూపొందించింది. ఈ కేంద్రాల్లో డ్రైవింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇది రవాణా పరిశ్రమకు సుశిక్షితులైన డ్రైవర్లను అందించేందుకు తోడ్పడుతుందని, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని రవాణా మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి పైగా తగ్గించాలనే ధ్యేయంతో రవాణా శాఖ ఈ ముసాయిదాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇటీవల కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ముసాయిదాను రూపొందిస్తుందంటూ పేర్కొన్నారు. -
అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం!
సాక్షి, అమరావతి: రహదారి భద్రతకు సంబంధించి ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేయనుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల కంటే తక్కువగా సస్పెండ్ చేయాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్ (డీసీ)లను రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు ఆదేశించారు. ప్రస్తుతం పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి వారి లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమైన 4 కేటగిరీల్లో డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని, ఈ నిబంధన కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు కేటగిరీలు ఇవే.. కేంద్ర మోటారు వాహన చట్టం సెక్షన్ 19 కింద డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తారు. అధిక వేగంతో వెళ్లినా..ఓవర్ లోడ్‌తో వాహనం నడుపుతున్నా, మద్యం సేవించి వాహనం నడిపినా, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపినా డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తారు. మోటార్ వాహన చట్టం 206(4) సెక్షన్ కింద ఉల్లంఘనలకు పాల్పడినా.. లైసెన్స్ సస్పెండ్ చేయాలని అధికారులను రవాణా శాఖ ఆదేశించింది. ఈ ఉల్లంఘనలకు పాల్పడితే 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవాల్సి ఉంటుంది. రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రీ ఎల్ఎల్ఆర్ (లెర్నర్ లైసెన్స్ ఇచ్చే ముందు) దరఖాస్తుదారులకు ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకుగాను విజయవాడ, విశాఖలలో సేఫ్టీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 2022 మార్చి కల్లా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. శిక్షణకు హాజరైతేనే ఎల్ఎల్ఆర్ రవాణా శాఖ కార్యాలయాల్లో లెర్నర్ లైసెన్స్‌లకు స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు ముందుగా 2 గంటల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహకారం అందించేందుకుగాను హోండా మోటార్ సైకిల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. ఎల్ఎల్ఆర్ పరీక్షలకు హాజరయ్యే దరఖాస్తుదారులకు ఈ శిక్షణ ఉపయోగకరంగా ఉంటుందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రహదారి భద్రతకు సంబంధించి వాహనదారుల్లో అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే ఈ శిక్షణ అవసరమని రవాణా శాఖ భావిస్తోంది. ఎల్ఎల్ఆర్ దరఖాస్తుదారులు కచ్చితంగా శిక్షణ కార్యక్రమానికి హాజరైతేనే ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తారు. -
‘నేను బతికే ఉన్నాను.. గుర్తించండి’
పారిస్: బతికి ఉన్న మనిషిని చనిపోయారని ప్రకటిస్తే.. ఎంత బాధగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. సాధారణంగా మన దగ్గర యూట్యూబ్ చానెళ్లు.. అప్పుడప్పుడు మీడియా సంస్థలు కూడా బతికి ఉన్న మనుషులను చనిపోయారని ప్రకటించి.. ఆ తర్వాత నాలుక కర్చుకుంటాయి. ఇక మన ప్రభుత్వ సంస్థల నుంచి పెన్షన్ లాంటివి పొందాలంటే అధికారులు మనం బతికి ఉన్నామనే సర్టిఫికెట్ తీసుకురమ్మాంటారు. చెట్టంత మనిషి ఎదురుగా ఉంటే నమ్మరు.. స్టాంప్ వేసిన కాగితం తెచ్చిస్తేనే.. మనం బతికి ఉన్నామనడానికి నిదర్శనం అని నమ్ముతారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. ఓ 58 ఏళ్ల మహిళ తాను బతికే ఉన్నానని.. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుతూ.. కోర్టు మెట్లు ఎక్కింది. జీన్ పౌచైన్ అనే మహిళ తాను బతికి ఉన్నానని గుర్తించండి అంటూ 2017 నవంబర్ నుంచి ప్రభుత్వ సంస్థలను కోరుతుంది. ఆ వివరాలు.. జాన్ ఫౌచెన్ అనే మహిళ చనిపోయిందంటూ ఆమె భర్తతో పాటు పని చేసిన ఓ ఉద్యోగి ప్రభుత్వానికి తెలియజేశాడు. దాంతో అధికారులు ఆమెకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి రికార్డులను శాశ్వతంగా తొలగించారు. ఆమె ఉద్యోగం కూడా కోల్పోయి.. ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు కారణం ఏంటి అంటే ఫౌచైన్, ఆమె భర్త, కుమారుడు పని చేస్తున్న క్లీనింగ్ కంపెనీ 2000 సంవత్సరంలో ఓ పెద్ద కాట్రాంక్ట్ కోల్పోయింది. ఆ తర్వాత 2004లో కార్మిక ట్రిబ్యునల్ ఫౌచైన్ 14 వేల యూరోల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే అదృష్టవశాత్తు కేసు సంస్థపై రిజిస్టర్ కావడంతో ఫౌచైన్ బతికి పోయిది. ఈ క్రమంలో సదరు మాజీ ఉద్యోగి ఇదే కేసులో ఫౌచైన్ భర్త, కుమారుడి మీద కేసు నెగ్గడం కోసం ఆమె మరణించింది అంటూ ఫేక్ పత్రాలను సమర్పించాడు. దాంతో అధికారులు ఆమెకు సంబంధించిన రికార్డులను శాశ్వతంగా తొలగించారు. మాజీ ఉద్యోగి ఫౌచైన్పై రెండుసార్లు కేసు పెట్టడానికి ప్రయత్నించాడు కాని ఫలించలేదు. (చదవండి: వెలుగులోకి 100 ఏళ్లనాటి పావురాయి సందేశం) ఈ సందర్భంగా ఫౌచైన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఇది ఒక మతిలేని కేసు. అధికారులు ఎలాంటి దర్యాప్తు, ఆధారాలను తనిఖీ చేయకుండా ఆమె చనిపోయిందని ప్రకటించారు. ఒక్కరు కూడా క్రాస్ చెక్ చేసుకోలేదు’ అంటూ మండిపడ్డారు. మనికొందరు మాత్రం కాంట్రాక్ట్ లాస్ కేసులో నుంచి బయటపడటం కోసం ఫౌచైన్ తప్పుడు పత్రాలు సృష్టించిందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. ‘నేను మరణించలేదని.. సంస్థలు తెలుపుతున్నాయి.. అలా అని నేను బతికి ఉన్నానని కూడా ప్రకటించడం లేదు. ఈ ప్రకటన చేయించడం కోసం నేను ఫైట్ చేస్తున్నాను’ అంటూ ఫౌచైన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
హెల్మెట్ లేకుంటే 3 నెలలు లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో నియంత్రించడంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ద్విచక్ర వాహన చోదకులతో పాటు వెనకాల కూర్చునే వారికి హెల్మెట్ లేకుంటే ఈ–చలాన్లు జారీ చేస్తున్న పోలీసులు.. ఇకపై మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మోటార్ వెహికల్ చట్టం– 2019 ప్రకారం హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయొచ్చన్న అంశాలు వాహన దారులకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘ఇప్పటివరకు జరుగుతున్న చాలా వరకు రోడ్డు ప్రమాదాల సమయంలో వాహన చోదకులకు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో హెల్మెట్ ధరించని వారికి జరిమానాతో పాటు 3 నెలల డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదించింది. ఇదే విషయాన్ని వాహనచోదకులకు అవగాహన కలిగించే దిశగా కార్యక్రమాలు చేపడతాం. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అదేశాను సారం చర్యలు తీసుకుంటాం’అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
ఇలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడైనా చూశారా
వాషింగ్టన్ : అమెరికాలోని టెనేస్సీ రాష్ట్రానికి చెందిన జేడ్ డాడ్‌కు వింత అనుభవం ఎదురైంది. కొద్ది రోజుల క్రితం ఆమె తన డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి రెన్యువల్‌ను ఆన్లైన్లో అప్లై చేశారు. సరిగ్గా వారం క్రితం పోస్ట్ ద్వారా లైసెన్స్ ఇంటికి వచ్చింది. అయితే జేడ్ లెసెన్స్‌ను చూడగానే కొంచెం ఆశ్చర్యానికి లోనైంది. డ్రైవింగ్ లైసెన్స్‌పై తన ఫోటోకు బదులు ఖాళీగా ఉన్న కుర్చీ మాత్రమే కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని సదరు ఆర్టీఏ ఆఫీసుకు ఈ-మెయిల్ ద్వారా పంపించింది. అయితే డాడ్ ఫోన్లో చెప్పిన విషయం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారిణి నమ్మలేదు. జేడ్ పంపిన మెయిల్‌ను చూసి ఆమె కూడా షాక్‌కు గురైంది. నిజంగా.. ఇది నమ్మలేకపోతున్నా.. ఈ విషయాన్ని మేనేజర్ దృష్టికి తీసుకెళతా అని చెప్పారు.(భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో) అయితే అసలు విషయం ఏంటంటే డాడ్ ఆన్లైనలో అప్లై చేసేటప్పుడు.. ఫోటో సరిగానే దిగింది.. సేవ్ చేసేటప్పుడు మాత్రం తను దిగిన ఫోటో కాకుండా పొరపాటున ఖాళీగా ఉన్న కుర్చీని అప్లోడ్ చేసింది. ఈ విషయాన్ని గమనించని అధికారులు అదే ఫోటోను పెట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను పోస్ట్ ద్వారా పంపించారు. అయితే డాడ్ దీనిని అంత సీరియస్‌గా తీసుకోలేదు.. అంతేగాక ఫోటో వల్ల తాను పని చేస్తున్న సంస్థలో జరిగిన ఫన్నీ మూమెంట్‌ను షేర్ చేసుకున్నారు. ఆఫీసులో బాస్‌తో పాటు కొలీగ్స్ ఖాళీగా ఉన్న కుర్చీని చూపిస్తూ ' డాడ్.. ఖాళీ కుర్చీలో ఉన్నావా' అంటూ ఆటపట్టించేవారు అంటూ తెలిపారు. ఈ వింత డ్రైవింగ్ లైసెన్స్‌ను జేడ్ డాడ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అయితే ఈ సోమవారం డాడ్‌కు మళ్లీ లెసెన్స్ పోస్ట్‌లో వచ్చింది.. ఈసారి మాత్రం ఖాళీ కుర్చీ కాకుండా ఆమె ఫోటోనే వచ్చింది. -
లైసెన్సులన్నీ ఇక ఆన్లైన్లోనే
సాక్షి, హైదరాబాద్ : స్వయంగా రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే వివిధ రకాల పౌరసేవలను పొందే సదుపాయం దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలో అందుబాటులోకి వచ్చింది. లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాడ్జ్, సాధారణ పత్రాల స్థానంలో స్మార్ట్‌కార్డులు వంటి ఐదు రకాల పౌరసేవలను ఆన్లైన్లోనే పొందవచ్చు. దీనికి సంబంధించిన పోర్టల్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్తులో మరో 12 రకాల పౌరసేవలను ఆన్లైన్లోనే పొందే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, రవాణా కమీషనర్ ఎంఆర్ఎం రావు, టీఎస్టీసీ ఎండీ టి.వెంకటేశ్వర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రవాణా శాఖ అందజేసే పౌరసేవలను మరింత సులభతరం చేసేవిధంగా ఆన్లైన్ సర్వీసులకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు నేరుగా వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంటి వద్దనే తమకు కావలసిన సేవలను పొందేవిధంగా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవలను ప్రవేశపెట్టారు. ఇంటి నుంచే నేరుగా.... ఇప్పటివరకు ఆర్టీఏ అందజేసే వివిధ రకాల సేవల కోసం వినియోగదారులు మొదట ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్‌లో కేటాయించిన తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. కానీ తాజాగా ప్రవేశపెట్టిన ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల డూప్లికేట్ లెర్నింగ్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లకు ఇచ్చే బ్యాడ్జ్, డ్రైవింగ్ లైసెన్సుల డాక్యుమెంట్ల స్థానంలో స్మార్ట్‌కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ హిస్టరీ షీట్ ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ (ఆర్టీడీఏఐ) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రవాణాశాఖ ఈ సర్వీసులను అందజేస్తుంది. స్మార్ట్‌ఫోన్ ద్వారానే వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా లభిస్తాయి.... ►ఎంగవర్నెన్స్, టి యాప్ ఫోలియో ద్వారా రవాణాశాఖ ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీసెస్‌ను పొందవచ్చు. ►వినియోగదారులు తమ పేరు, తండ్రి పేరు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్లతో పాటు సెల్ఫీ క్లిక్ చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ►ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా సెల్ఫీని తనిఖీ చేస్తారు. ►అలాగే వినియోగదారుడి పేరు, చిరునామాలలో ఏమైనా తప్పులు ఉంటే బిగ్ డేటా ఆధారంగా తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ►డీప్ లెర్నింగ్ ఆధారిత ఇమేజ్‌లతో ఫొటోల్లో ఉండే వైవిధ్యాలను కూడా గుర్తిస్తారు. ►అనంతరం వినియోగదారుడి మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందుతుంది.ఆ తరువాత ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి. ► అనంతరం వినియోగదారులు ఎంపిక చేసుకొన్న పౌరసేవలు ఆన్లైన్లోనే తీసుకొనే అవకాశం లభిస్తుంది. మరో 15 రోజుల్లో 6 రకాల పౌరసేవలను కూడా ఆన్లైన్ ద్వారా అందజేయనున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. శాశ్వత లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్, పర్మిట్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు వంటివి ఆన్లైన్లో పొందవచ్చు. ఆ తరువాత మరో 6 సర్వీసులను కూడా ఆన్లైన్ పరిధిలోకి తేనున్నారు. ►వాహనాన్ని భౌతికంగా తనిఖీ చేయవలసిన సేవలు మినహా మిగతావన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. -
ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే కేసులే..
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పెలియన్ రైడర్‌కు హెల్మెట్ లేకున్నా, వాహనాలకు సైడ్ మిర్రర్లు లేకున్నా ఈ–చలాన్లు జారీ చేస్తున్న వీరు.. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న లెర్నింగ్ లైసెన్స్(ఎల్ఎల్) వ్యక్తులపై దృష్టి సారించారు. ఎల్ఎల్ చేతికి వచ్చిన వెంటనే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ అన్నట్లుగా ఊహించుకుంటూ సరిగా డ్రైవింగ్ రాకుండానే రోడ్లెక్కి ప్రమాదాలకు కారణం అవుతున్నట్లుగా సైబరాబాద్ పోలీసుల అధ్యయనంతో తేలింది. వీరు చాలా వరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో మోటారు వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా మూడు రోజులుగా ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం.. ప్రతిరోజూ వీరిపై నిఘా ఉంచి వారి ఎల్ఎల్ తీసుకొని నిబంధన ప్రకారం రద్దు కోసం ఆర్టీఏ అధికారులకు పంపిస్తాం. ‘లెర్నింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడూ అతడితో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వాహనం ముందు, వెనక భాగంలో ఎల్ అనే ప్లేట్‌ను కూడా పెట్టుకోవడం లేదు. కొంతమంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కూడా వాడటం లేదు. నేర్చుకుందామని రోడ్లపైకి వచ్చి నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. ఇలా వివిధ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అందుకే లెర్నింగ్ లైసెన్స్ వ్యక్తులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. – విజయ్‌కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
పవన్ కల్యాణ్.. ‘డ్రైవింగ్ లైసెన్స్’?
టాలీవుడ్లో ప్రస్తుతం రీమేక్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రీమేక్ చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని చిత్రాలు సంప్రదింపుల దశలో ఉన్నాయి. ఇప్పటికే ‘పింక్’ రిమేక్ చిత్రం ‘వకీల్ సాబ్’లో నటిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో మలయాళ చిత్రం రిమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2019లో మలయాళంలో వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే మొన్నటివరకు ఈ చిత్రం విక్టరీ వెంకటేశ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్ర రీమేక్ హక్కులు కొన్న నిర్మాత పవన్‌తో ఈ సినిమా తీయాలని భావిస్తున్నారట. ఈ సినిమా స్టోరీ విన్న పవన్ సైతం ‘డ్రైవింగ్ లైసెన్స్’పై ఆసక్తి కనబరుస్తున్నారని టాక్. పృథ్వీరాజ్ పోషించిన పాత్రను పవన్ చేస్తారని, ఈ సినిమాలో ఉండే మరో ప్రధాన పాత్ర కోసం పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లేక వైష్ణవ్ తేజ్‌ను తీసుకోవాలని నిర్మాత ఆలోచిస్తున్నారట. అయితే ఈ సినిమా పట్టాలెక్కుతుందా? రీమేక్‌లో పవన్ నటిస్తాడా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు తీపి కబురు.. బర్త్‌డే గిఫ్ట్ సిద్ధం? ‘థాంక్యూ శేఖర్ కమ్ముల’ -
ఆన్లైన్ రూట్లో ఆర్టీఏ
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ ఆన్లైన్ బాటపడుతోంది. ప్రత్యేక నంబర్ల కోసం ఆన్లైన్ బిడ్డింగ్ విజయవంతంగా నిర్వహించిన ఆర్టీఏ.. మరిన్ని సేవలను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. వాహన వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావలసిన అవసరంలేని సేవల్ని గుర్తించి ఆన్లైన్ పరిధిలోకి తెచ్చారు. ఇంటి వద్ద నుంచే నేరుగా ఈ సేవలను పొందవచ్చు. ఇప్పటి వరకు ఆన్లైన్లో స్లాట్ నమోదుకే అవకాశం ఉంది. ఒకసారి స్లాట్ (సమయం,తేదీ) నమోదు చేసుకున్న వినియోగదారులు నెట్‌బ్యాంకింగ్ లేదా ఈ సేవ కేంద్రా ల్లో ఫీజు చెల్లించి నిర్ణీత సమయం ప్రకారం ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సి ఉండేది. ఇకపై కొన్ని సేవలకు మినహాయింపు లభించనుంది. ప్రస్తుతం ప్రత్యేక నంబర్లకు ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్టే సుమారు 20 రకాల పౌరసేవలకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. వినియోగదారుల అభ్యర్థనలు, వారు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు, చిరునామా ధ్రువీకరణ ఇతర పత్రాలను అధికారులు పరిశీలించి సంతృప్తి చెందితే.. వారు కోరుకున్న సేవలను ఆన్లైన్లోనే అందజేస్తారు. ఇందుకోసం నెట్‌బ్యాంకింగ్, ఈ సేవా కేంద్రాల ద్వారా చెల్లిస్తున్నట్టే ఫీజులను చెల్లించాలి. రవాణాశాఖ మంత్రి నుంచి ఆమోదం లభించిన వెంటనే మార్చి నుంచి ఆన్లైన్ సేవలను అమల్లోకి తేనున్నట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు. ఆన్లైన్ సేవలివే.. లెర్నింగ్ లైసెన్స్ కేటగిరీ: కాలపరిమితి ముగిసిన లెర్నింగ్ లైసెన్స్ కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. ఉదాహరణకు ద్విచక్ర వాహనం నడిపేందుకు మొదట అనుమతి పొందిన వారు తరువాత ఆన్లైన్లోనే కారు లేదా ఆటో వంటి వాటి కోసం అనుమతి పొందవచ్చు. లెర్నింగ్ లైసెన్స్ పోగొట్టుకొంటే తిరిగి డూప్లికేట్ పొందవచ్చు. కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ స్థానంలో లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కేటగిరీ: రవాణా వాహనాలు నడిపేందుకు అనుమతించే బ్యాడ్జి, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ లైసెన్స్, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్, లైసెన్స్‌లో చిరునామా మార్పు, డ్రైవింగ్ లైసెన్స్ హిస్టరీ షీట్ సేవలను పొందవచ్చు. కండక్టర్ లైసెన్స్: ఆర్టీసీ కండక్టర్లు, ఇతర ప్రయాణికుల వాహనాల్లో కండక్టర్లుగా విధులు నిర్వహించే వారు ఆర్టీఏ నుంచి పొందే లైసెన్స్ ఆన్లైన్లోనే లభిస్తుంది. కొత్త లైసెన్స్ తీసుకోవడంతో పాటు రెన్యూవల్, డూప్లికేట్, అడ్రస్ మార్పువంటి అన్ని సదుపాయాలను పొందవచ్చు. వాహనాల రిజిస్ట్రేషన్ కేటగిరీ: వాహనం యాజమాన్య బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం విక్రయించిన వారు, కొనుగోలు చేసిన వారు తమ పూర్తి వివరాలను, డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. డూప్లికేట్ ఆర్సీ తీసుకోవచ్చు. సదరు వాహనానికి ఫైనాన్స్ ఉంటే మాత్రం సాధ్యం కాదు. ఆర్సీ (వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)లో చిరునామా మార్చుకోవచ్చు. వాహనంఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవచ్చు. డాక్యుమెంట్లే కీలకం ఆన్లైన్ సేవల్లో వినియోగదారులు సమర్పించే డాక్యుమెంట్లను అధికారులు సీరియస్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు వాహన యాజమాన్యం ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయ్యేందుకు ప్రస్తుతం అందజేసే పత్రాలనే ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు వాహనం ఫొటో, అభ్యర్థుల తాజా చిత్రాలను సైతం అందజేయాలి. అభ్యర్థుల సంతకాలనూ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ‘ఫొటోలకు సంబంధించి కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థుల సెల్ఫీ అప్లోడ్ చేయడమా లేక, ఇంకేదైనా చేయవచ్చా అనేది పరిశీలిస్తున్నాం’అని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. -
రవాణా సేవలు @ వన్ క్లిక్
సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్లైసెన్స్ పోయిందా...ఆరు నెలల క్రితం తీసుకున్న లెర్నింగ్ లైసెన్స్ గడువు దాటిందా..నో ప్రాబ్లమ్. ఒక్కసారి ఆన్లైన్లో క్లిక్ చేయండి చాలు. నేరుగా ఇంటికే వచ్చేస్తాయి. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాయాల్సిన పనిలేదు. ఫొటోలు, డిజిటల్ సంతకాలం కోసం క్యూలైన్లో బారులు తీరాల్సిన అవసరం లేదు. క్షణాల్లో కావలసిన సర్వీసులను పొందవచ్చు. వివిధ రకాల పౌరసేవలను మరింత పారదర్శకం చేసేందుకు రవాణాశాఖ కసరత్తు చేపట్టింది. వాహనాల ప్రత్యేక నెంబర్లకు ఆన్లైన్ బిడ్డింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చిన పద్ధతిలోనే మానవ ప్రమేయం లేని సర్వీసులను ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు అందజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నాటికి ఈ తరహా ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లో దళారులు, మధ్యవర్తుల ప్రమేయం మరింత తగ్గుతుందని, వినియోగదారులకు రవాణా శాఖ అందజేసే సర్వీసులు నేరుగా అందుతాయని అధికారులు భావిస్తున్నారు. పారదర్శకంగా పౌరసేవలు.... డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు (ఆర్సీలు), చిరునామా మార్పు, యాజమాన్య బదిలీ, హైపతికేషన్ రద్దు, డూప్లికేట్ సర్టిఫికెట్లు వంటి 56 రకాల పౌరసేవల నమోదు కోసం ఆన్లైన్లో స్లాట్ పద్ధతిని నాలుగేళ్ల క్రితమే ప్రవేశపెట్టారు. అలాగే ఫీజుల చెల్లింపును సైతం ఆన్లైన్, నెట్‌బ్యాంకింగ్, ఈ సేవా పరిధిలోకి తెచ్చారు. ఆన్లైన్లో స్లాట్ (సమయం, తేదీ) నమోదు చేసుకొని నిర్ణీత ఫీజులు చెల్లించినప్పటికీ ప్రస్తుతం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసిన ఉంటుంది. ఫొటో గుర్తింపు, డిజిటల్ సంతకాల నమోదు, ధృవపత్రాల నిర్ధారణ కోసం ప్రస్తుతం వినియోగదారులు అధికారులను సంప్రదిస్తున్నారు. నిజానికి వీటిలో చాలా వరకు వినియోగదారులు నేరుగా ఆర్టీఏకు వెళ్లవలసిన అవసరం లేకుండానే సర్వీసులను పొందవచ్చు. ఉదాహరణకు లెర్నింగ్ లైసెన్స్ సర్టికెట్ 6 నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆ లోపు అభ్యర్ధులు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేని వారు మరోసారి గడువు పొడిగించుకోవచ్చు. అలాగే డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్స్, డూప్లికేట్ ఆర్సీలు, చిరునామా మార్పు వంటి సేవల్లోనూ వినియోగదారులు నేరుగా వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంటికే పౌరసేవలను అందజేసేవిధంగా ఇప్పుడు ఉన్న ఆన్లైన్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తున్నారు. పర్మిట్లు, హైపతికేషన్ రద్దు, యాజమాన్య బదిలీలు వంటి అంశాల్లోనూ వీలైనంత వరకు వినియోగదారులు ప్రత్యక్షంగా కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా మార్పులు చేస్తున్నట్లు ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘మొదటి సారి లెర్నింగ్ లైసెన్స్, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం నేరుగా పరీక్షలకు హాజరు కావాలి. వాహనాల ఫిట్నెస్ పరీక్షలకు తప్పకుండా రావలసిందే. ఇలా వినియోగదారులు తప్పనిసరిగా రావలసిన సేవలను మినహాయించి ఇతర సేవలను ఆన్లైన్ ద్వారానే అందజేస్తాం.వాటి కోసం ఆర్టీఏ ఆఫీసులకు రావలసిన అవసరం లేదు.’ అని పేర్కొన్నారు. ఆన్లైన్లోనే ఫొటోలు, సంతకాల సేకరణ... ఈ మేరకు వాహనదారులు ఆర్టీఏ వెబ్సైట్లో తమ దరఖాస్తులను, ధృవపత్రాలను అప్లోడ్ చేస్తారు. సెల్ఫీఫొటోతో పాటు, సంతకాలను కూడా ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేసి, ఫీజులు చెల్లిస్తారు. అలా తమకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన తరువాత సంబంధిత అధికారులు సంతృప్తి చెందితే వినియోగదారుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ అందుతుంది. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు వంటివి పోస్టు ద్వారా ఇంటికి చేరుతాయి. లెర్నింగ్ లైసెన్స్ పొడిగింపు వాటిని మెయిల్ ద్వారా పొందవచ్చు. ‘ఆన్లైన్ పౌరసేవలను సులభంగా పొందేందుకు వీలైన పద్ధతులను అన్వేషిస్తున్నాం. ఒకటి, రెండు నెలల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.’ అని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. -
అభిలాష్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..
గచ్చిబౌలి: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగుతుండగా.. మద్యం మత్తులో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభిలాష్ ర్యాష్ డైవింగ్ చేస్తూ ఇద్దరు యువకులను ఢీకొట్టడంతో వారు కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ర్యాష్ డ్రైవింగ్ చేశాడని నిర్ధారించిన రాయదుర్గం పోలీసులు ఐపీసీ 304(ఏ)337, 279, సెక్షన్లతో పాటు 185 ఆఫ్ ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆల్కహాల్ 230ఎంజీ/100 ఎంఎల్‌గా ఉండటంతో కూకట్పల్లి ఆర్టీఏ అధికారులు 2019 నవంబర్ 15 నుంచి 2020 నవంబర్ 15 వరకు సంవత్సరం పాటు లైసెన్స్ రద్దు చేశారు. ఘటనా స్థలంలో సాయివంశీ కృష్ణ, ప్రవీణ్ మృతదేహాలు (ఫైల్) గత నవంబర్ 10న అర్ధరాత్రి 1 గంట సమయంలో కూకట్పల్లి శాంతినగర్ నివాసి అభిలాష్ పెదకొట్ల మెహిదీపట్నంలో మద్యం తాగి స్నేహితుడితో కలిసి ఐ20 కారులో కూకట్‌పల్లికి బయలుదేరారు. అభిలాష్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగుతున్న సరూర్‌నగర్‌కు చెందిన పి.సాయి వంశీకృష్ణ (22), కిష్టాపూర్నకు చెందిన ఎన్.ప్రవీణ్ (22)లను ఢీకొట్టడంతో ఎగిరి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో నలుగురు గాయాలపాలయ్యారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రారంభమైన 7 రోజులకే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయింది. రవాణాశాఖ ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను 6 నెలలపాటు రద్దు చేసింది. గతనెల 12న ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద ఆయన కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఆ సమయంలో రాజశేఖరేకారు నడిపారు. ఈ కేసులోనే రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేసినట్లుగా సమాచారం. 2017 అక్టోబర్‌లోనూ పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ కారును రాజశేఖర్ వాహనం ఢీకొట్టిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితి 2017 లోనే ముగిసింది. అయినా, ఆయన దాన్ని రెన్యువల్ చేసుకోలేదు. దీనికితోడు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వరుసగా ప్రమాదాలకు కారణమవుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
డిజీలాకర్‌లో ఉంటేనే..!
న్యూఢిల్లీ: ‘డిజీలాకర్’ లేదా ‘ఎంపరివాహన్’ యాప్‌ల్లో ఈ– ఫార్మాట్లో నిక్షిప్తం చేసిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ కాగితాలు సాధారణ డాక్యుమెంట్ల మాదిరిగానే చెల్లుబాటు అవుతాయని కేంద్ర రవాణా, రహదారుల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే, ఆ రెండు యాప్‌ల్లో ఉన్న డాక్యుమెంట్లనే వాస్తవ పత్రాలుగా పరిగణనలోకి తీసుకుంటామని, వేరే యాప్‌ల్లోని లేదా ఇతర ఏ రకమైన ఈ– డాక్యుమెంట్లను పరగణించబోమని స్పష్టం చేసింది. ఆర్సీ, ఇన్యూరెన్స్, ఫిట్నెస్ అండ్ పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్.. తదితర సర్టిఫికెట్లను ఈ–ఫార్మాట్లో ఉన్నా ఆమోదించాలని నవంబర్ 2018లో కేంద్ర మోటారు వాహన చట్ట నిబంధనల్లో చేర్చామని పేర్కొంది. ఎంపరివాహన్ యాప్‌ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కోసం ఎన్ఐసీ రూపొందించగా, డిజీలాకర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించినది. -
‘ఫోటో గోడకెక్కినా’.. రవాణాశాఖ వదల్లేదు
జైపూర్ : రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అధికవేగంతో కారును నడపడమేగాక సీటుబెల్టు ధరించనందుకు గాను మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నామని ఓ వ్యక్తికి నోటీసులు పంపించింది. అయితే సదరు వ్యక్తి ఏనిమిదేళ్ల క్రితమే చనిపోవడం ఇక్కడ గమనార్హం. దీంతో ఖంగుతిన్న కుటుంబసభ్యులు మీడియాకు సమాచారం ఇవ్వడంతో.. ప్రస్తుతం రవాణాశాఖ తన తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది. వివరాలు.. రాజస్తాన్ రాష్ట్రం జలావర్ జిల్లాకు చెందిన రాజేంద్ర కసేరా 2011లో చనిపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 11న రాజేంద్ర కసేరా పేరు మీదుగా అతని ఇంటికి రవాణా శాఖ నుంచి ఓ లెటర్ వచ్చింది. ‘మీరు సీటుబెల్టు ధరించకుండా అధిక వేగంతో కారును నడిపినందుకు గానూ మోటారు వాహన చట్టం సెక్షన్ 19 ప్రకారం మీ లైసెన్సును రద్దు చేస్తున్నామని’ ఆ నోటీసులో రవాణాశాఖ పేర్కొంది. అయితే ఇక్కడ విశేషమేంటంటే రాజేంద్ర కసేరాకు కారు లేదు సరికదా బతికి ఉన్నప్పుడు కనీసం ద్విచక్రవాహనాన్ని కూడా నడప లేదంట. ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి ఇప్పుడు కారు నడపడం ఏంటి? కారు కూడా లేని వ్యక్తికి లైసెన్సు ఎలా వచ్చింది అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రాజేంద్ర కసేరాను కుటుంబ సభ్యులు మర్చిపోయినా రవాణాశాఖ మర్చిపోలేదని, మన ప్రభుత్వ శాఖల ‘పనితీరు’ అంత బాగా ఉంటుందని అక్కడి గ్రామస్తుడు ఎద్దేవా చేశారు. కాగా, నిరక్ష్యరాస్యులకు డ్రైవింగ్లైసెన్స్ రద్దు చేయాలని రాజస్తాన్ హైకోర్టు సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. నిరక్ష్యరాస్యులకు సరైన అవగాహన లేక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, వారి లైసెన్సులను రద్దు చేయాలని సింగిల్ బెంచ్ రవాణాశాఖను ఆదేశించింది. దీనిపై ప్రజలలో ఆగ్రహం వ్యక్తం కావడంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. (చదవండి : ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు) -
కొత్త వాహన చట్టంతో అంతా అలర్ట్
సాక్షి, మిర్యాలగూడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వాహన చట్టంతో వాహనదారులు అంతా అలర్ట్ అవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడే అమలు లేకపోయినప్పటికీ అక్కడక్కడా జరిమానాలు విధించడం వల్ల ముందస్తు జాగ్రత్తలు పడుతున్నారు. ఈ నెల 1వ తేదీన నుంచి కొత్త వాహనం చట్టం అమలులోకి వచ్చినా అంతకుముందునుంచే జిల్లాలోని ప్రధాన పట్ట ణాలైన నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. దీంతో వాహనదారులు ముందస్తుగా వాహనానికి రిజిస్ట్రేషన్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గతంలో జిల్లాలో రోజుకు వంద మంది దరఖాస్తులు చేసుకునే వారు.. కానీ నెల నుంచి రోజుకు రెండు వందల మంది దరఖాస్తు చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. లెర్నింగ్ లైసెన్స్‌లకు భారీగా దరఖాస్తులు మిర్యాలగూడ ఎంవీఐ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం కూర్చున్న దరఖాస్తు దారులు ఇన్ని రోజులు వాహనం నడుపుతున్నా డైవ్రింగ్ లైసెన్స్ ఎందుకులే అనుకున్నారు. కొత్త వాహన చట్టం రావడం వల్ల అలాంటివారందరూ లెర్నింగ్ లైసెన్స్ కోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడలలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం రోజుకు వందల మంది వెళ్తున్నారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ ఎంవీఐ కార్యాలయాల్లో ఈ ఏడాది జూలై మాసంలో 2,645 మంది కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోగా, ఆగస్టు మాసంలో 2,507 మంది తీసుకున్నారు. ఈ నెలలో ఏడు పని దినాల్లోనే ఇప్పటివరకు 1,418 మంది దరఖాస్తులు చేసుకొని లెర్నింగ్ లైసెన్స్‌లు పొందారు. స్లాట్ బుకింగ్‌కు వారం రోజుల గడువు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారు, పర్మనెంట్ లైసెన్స్ తీసుకునే వారు ముందుగా మీ సేవా కేంద్రంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంది. స్లాట్ బుకింగ్ చేసుకున్నాక గతంలో ఒక్క రోజులోనే ఎంవీఐ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ దరఖాస్తులు పెరగడం వల్ల వారం రోజులు ఆగాల్సి వస్తుంది. కొత్తగా లెర్నింగ్ లైసెన్స్ కోసం ద్విచక్ర వాహనానికి 300 రూపాయలు, ద్విచక్రవాహనాలతోపాటు నాలుగు చక్రాల వాహనానికి 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ద్విచక్ర వాహనానికి 1,035 రూపాయలు, ద్విచక్ర వాహనంతో పాటు నాలుగు చక్రాల వాహనానికి 1,335 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువమంది డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. కొత్త వాహన చట్టం రావడం వల్ల డ్రైవింగ్ వచ్చిన వారంతా లైసెన్స్ తీసుకుంటున్నారు. గతంలో రోజుకు 40 నుంచి 45 మంది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు. కానీ ప్రస్తుతం 90నుంచి వంద మంది దరఖాస్తు చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందుతున్నారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. దీనితోపాటు వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. – శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ, మిర్యాలగూడ -
రూ.15 వేల బండికి జరిమానా రూ.23 వేలు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త మోటార్ వాహన చట్టం నిబంధనలు పాటించని వాహనదారులకు చుక్కలు చూపెట్టడం ఖాయం. గుర్‌గ్రామ్‌లో చోటు చేసుకున్న ఉదంతం ఒకటి ఈ విషయాన్ని తేట తెల్లం చేసింది. నాలుగు రాష్ట్రాలు (తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్) మినహా దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ప్రకారం భారీ జరిమానాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా హెల్మెల్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, కాలుష్య నియంత్రణ.. ఇలా ఏ సర్టిఫికెట్ లేకపోయినా వాహనదారుడు పది రెట్లకు మించి భారీ మూల్యం చెల్లించాల్సిందే. దినేష్ మదన్ తాజా అనుభవం గురించి తెలుసుకుందాం.. దినేష్‌కు కొత్త ట్రాఫిక్ నిబంధనల కింద ఏకంగా రూ.23,000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఎందుకంటే.. లైసెన్స్, ఆర్సీ డాక్యుమెంట్స్ లేవు.. దీంతో పాటు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు భారీ జరిమానా విధించారు. హెల్మెట్ లేదని బండి ఆపి, సర్టిఫికెట్లు లేవంటూ భారీ ఫైన్ విధించారని, వాట్సాప్‌లో లెసెన్స్ కాపీని చూపించినా అంగీకరించలేదని దినేష్ వాపోయాడు. హోండా యాక్టివా బైక్‌ను సెకండ్ హ్యాండ్లో రూ.15వేలకు కొన్నాను. ఇపుడు దీనికి రూ. 23 వేల జరిమానా చూసి షాకయ్యానంటున్నాడు దినేష్. బండికి సంబంధించిన కాగితాలన్నీ ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పాడు. అయితే హెల్మెట్ ధరించనందుకు గాను వెయ్యి రూపాయల ఫీజును తీసుకొని, తన బండి తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నాడు. అంతేకాదు.. ఇక మీదట అన్ని నిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తానని తెలిపాడు. అయితే రూల్ ఈజ్ రూల్ అంటున్నారు అధికారులు. లైసెన్స్ లేని డ్రైవింగ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు, థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేదు, ఎయిర్ పొల్యూషన్ నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ లేని డ్రైవింగ్... ఈ నిబంధనల ఉల్లంఘనల కింద జరిమానా విధించామని వెల్లడించారు. చదవండి : 'ఆ' రాష్ట్రాల్లో పాత చలాన్లే! -
లైసెన్స్ లేకపోతే సీజే
సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లు, యువకులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. స్నేహితులు, బంధువుల కార్లు, బైక్‌లను తీసుకుని రయ్యిమంటూ రహదారులపై దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమైతున్న వారిని కట్టడి చేసి. ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక డ్రైవ్... ఇందుకుగాను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకే బైక్‌పై ముగ్గురు ప్రయాణించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిని పట్టుకునేందుకు గల్లీల్లో సైతం తనిఖీలు చేపట్టారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారిని అడ్డుకుని వాహనాన్ని అక్కడికక్కడే స్వాధీనం చేసుకుంటున్నారు. సైబరాబాద్ పరిధిలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఏకంగా 4981 కేసులు నమోదుచేశారు. మైనర్లు వాహనం నడిపితే తల్లిదండ్రులను పిలిపించి వారితో మరోసారి వాహనాలను నడపనీయమంటూ లిఖితపూర్వకంగా రాయించుకుని వాహనం ఇస్తున్నారు. ఇలా నాలుగు నెలల కాలంలో 782 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. మేజర్లపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నారు. అనంతరం. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామంటూ దరఖాస్తు నంబరు చూపించిన తర్వాతే వాహనాన్ని ఇస్తున్నారు. నేరుగా కోర్టుకే.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే నేరుగా కోర్టు మెట్లెక్కాల్సిందే. గతంలో లైసెన్స్ లేకుండా నడిపితే పోలీసులు జరిమానా విధించి వదిలేసేవారు. అయినా ఫలితం లేకపోవడంతో గత కొద్ది నెలలుగా వాహనాలను స్వాధీనం చేసుకొంటున్నారు. మరుసటి రోజు ఉదయం సదరు చోదకుడు ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకుని న్యాయస్థానంలో హాజరు కావాలి. వాస్తవానికి మోటార్ వాహన చట్టంలో ఇవన్నీ ఉన్నా.. పోలీసులు, రవాణా శాఖ అధికారులు అవసరమైన సందర్భాల్లోనే వినియోగిస్తున్నారు. ప్రమాదాలు తగ్గుతున్నా.. తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులందరూ లైసెన్సును తప్పక దగ్గర ఉంచుకోవాలని ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కూడళ్ల వద్ద సైన్‌బోర్డుల్లోనూ దీనిపై ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్ లేని వారికి జరిమానాను విధిస్తున్నారు. ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు.. ♦ లైసెన్సు లేకుండా తొలిసారి పోలీసులకు చిక్కితే.. వాహనం స్వాధీనం చేసుకుని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తారు. కోర్టు సమయం పూర్తయ్యేవరకూ న్యాయస్థానం ప్రాంగణంలోనే నిలబడి ఉండాలి. జరిమానా చెల్లించాలి. ♦ రెండోసారి పోలీసులకు దొరికితే.. 48 గంటలపాటు జైల్లో ఉంచుతారు. ♦ మూడోసారి చిక్కితే రెండు అంతకంటే ఎక్కువ రోజుల జైలుశిక్షతో పాటు భారీగా జరిమానా చెల్లించాలి. దీని ప్రభావం విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లే అవకాశాలపై పడుతుంది. ♦ ఐదు, అంతకంటే ఎక్కువసార్లు దొరికితేవారం రోజుల జైలుశిక్ష అనుభవించి.. భారీ జరిమానా చెల్లించక తప్పదు. పోలీసుల నివేదిక అధారంగా కోర్టులు జరిమానా నిర్ణయిస్తాయి. -
డ్రంకన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి 20 రోజుల జైలు
సాక్షి, సూరారం(హైదరాబాద్) : డ్రంకన్ డ్రైవ్‌లో మూడవ సారి పట్టుబడిన వ్యక్తికి 20 రోజుల జైలు శిక్షతోపాటూ లైసెన్స్ రద్దు చేస్తు మేడ్చల్ కోర్టు తీర్పునిచ్చింది. కుత్బుల్లాపూర్ గాంధీనగర్‌కు చెందిన లాల్‌మహ్మద్ బుధవారం రాత్రి నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. గతంలో రెండు సార్లు ఇదే తరహాలో దొరకడంతో గురువారం ట్రాఫిక్ పోలీసులు అతన్ని మేడ్చల్ కోర్టులో హాజరు పరిచారు. మూడుసార్లు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడడంతో ఆగ్రహించిన జడ్జి అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు 20 రోజుల జైలు శిక్ష విధించారు. -
డ్రైవింగ్ లైసెన్సు వదులుకున్న యువరాజు
లండన్: బ్రిటన్ యువరాజు ఫిలిప్(97) తన డ్రైవింగ్ లైసెన్సును స్వచ్ఛందంగా నోర్‌ఫోల్క్ పోలీసులకు సరెండర్ చేశారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. గత నెల 17న శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫిలిప్ నడుపుతున్న కారు, మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే సీటు బెల్టు లేకుండా డ్రైవ్ చేస్తూ ఆయన మీడియాకు చిక్కారు. కాగా, తాజా నిర్ణయం నేపథ్యంలో కారు ప్రమాదం విచారణ నుంచి ఫిలిప్ తప్పించుకునే అవకాశముందని భావిస్తున్నారు. అన్నట్లు బ్రిటన్‌లో డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు గరిష్ట వయోపరిమితి లేదు. లైసెన్సు వదులుకున్న్పటికీ ప్రైవేటు రహదారులపై తన డ్రైవింగ్ చేయొచ్చని న్యాయనిపుణులు పేర్కొన్నారు. ఏడవడం తప్పా ఏమీచేయలేను ఇక నుంచి రోడ్లు భద్రంగా ఉంటాయని ప్రమాదంలో గాయపడిన ఎమ్మా ఫెయిర్‌వెదర్(46) అనే మహిళ వ్యాఖ్యానించారు. యువరాజు ఫిలిప్ ఇంత ఆలస్యంగా డ్రైవింగ్ లైసెన్స్ అప్పగించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఏడవడం తప్పా యువరాజును తానేమి చేయలేనని ఆవేదన చెందారు. ప్రమాదంలో ఆమె చేతికి గాయమైంది. -
దేశంలో తొలిసారి ట్రాన్స్ జెండర్‌కు లైసెన్స్
సాక్షి, వైఎస్సార్: వినూత్న కార్యక్రమానికి వైఎస్సార్ కడప జిల్లా వేదికైంది. దేశంలో మొదటిసారిగా ట్రాన్స్ జెండర్‌కు డ్రైవింగ్ లైసెన్స్‌ను జిల్లా రవాణా శాఖ అధికారులు కల్పించారు. ఇంత వరకు దేశంలో ట్రాన్స్ జెండర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కల్పించని విషయం తెలిసిందే. రవాణ శాఖ డీటీసీ బసిరెడ్డి నేతృత్వంలో 32 మందికి శనివారం లైసెన్సును అందించారు. దీంతోపాటు ఆన్లైన్లో స్త్రీ, పురుషులతో పాటు ట్రాన్స్ జెండర్ ఆప్షన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్, జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్, ఎస్పీ అభిషేక్ మహంతిల చేతుల మీదుగా వీరికి లైసెన్సులను పంపిణీ చేశారు. -
ఇక స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్‌లు
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకే రకమైన డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఎక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా అన్నీ ఒకే పరిమాణం, రంగు, రూపురేఖలు, భద్రతా సౌకర్యాలతో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది జూలై నుంచి ఈ రకమైన కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు దేశంలోని అన్ని రోడ్డు రవాణా కార్యాలయాల్లోనూ జారీ అవుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారితోపాటు పాత వాటిని రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ కొత్త ఫార్మాట్లోనే లైసెన్స్‌లను జారీ చేయనున్నారు. ఈ లైసెన్స్‌లపై జాతీయ, సబంధిత రాష్ట్ర చిహ్నాలు ఉంటాయి. భద్రత కోసం కార్డుల్లో మైక్రో చిప్‌లను అమర్చి, క్యూఆర్ కోడ్లను కూడా ముద్రించనున్నారు. లైసెన్స్‌దారుడి సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ప్రస్తుతం మెట్రోరైళ్ల స్మార్ట్‌కార్డుల్లో వాడుతున్న ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) టెక్నాలజీని కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్సుల్లో వాడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఫార్మాట్లలో డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లోని ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. -
మెగా ‘మేళా’!
జిల్లాలో డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేస్తున్న వాహనచోదకుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. లైసెన్సులపై ఇటీవల కాలంలో అవగాహన పెరగడంతో రవాణా శాఖ రెండో విడత నిర్వహించిన ఎల్ఎల్ఆర్ మేళాకు విశేష స్పందన కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించిన మేళా కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎల్‌ఎల్‌ఆర్‌ల మంజూరులో వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. నెల్లూరు, వైజాగ్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. సాక్షి, అమరావతిబ్యూరో: వాహనదారులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో రవాణాశాఖ ఇటీవల విస్తృతంగా మేళాలు నిర్వహిస్తోంది. గ్రామీణుల్లో అనేక మంది వాహనదారుల వద్ద సరైన పత్రాలు ఉండటం లేదు. ఈ పరిస్థితులను మార్చి అర్హులకు లైసెన్సులు ఇచ్చేందుకు రవాణా శాఖ ‘మీ ముంగిట్లో రవాణాశాఖ’ నినాదంతో గత జూన్ నెలలో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించింది. దీనికి మంచి స్పందన కనిపించింది. డ్రైవింగ్ లైసెన్సుల పరీక్షల కోసం హాజరయ్యే వారి సంఖ్య పెరిగింది. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి 23 తేదీ వరకు రవాణా శాఖ నిర్వహించిన రెండో విడత మేళాకు అంతేస్థాయిలో స్పందన కనిపించింది. ఈ కార్యక్రమం కింద కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పల్లెలకు ఆర్టీఏ అధికారులు వెళ్లి వాహన చోదకులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. రహదారి భద్రతపై నిబంధనలు వివరించారు. తర్వాత పరీక్షలకు సన్నద్ధం చేశారు. ప్రథమ స్థానంలో కృష్ణా జిల్లా.. కృష్ణా జిల్లా రవాణా అధికారులు రోజుకు 15 గ్రామాల చొప్పున మొత్తం 101 పల్లెల్లో నిర్వహించారు. మొత్తం 12,063 మంది ఎల్ఎల్ఆర్ పరీక్షలకు హాజరవ్వగా.. అందులో 11,637 మంది ఉత్తీర్ణులయ్యారు. 332 మంది ఉత్తీర్ణత సాధించకపోగా 94 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాలేదు. వీరికి పత్రాలు అందజేశారు. గుంటూరు జిల్లాలో 84 గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో 5,992 మంది అక్కడికక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రవాణా శాఖ అధికారులు అత్యధికంగా 11,637 మందికి ఎల్ఎల్ఆర్ పత్రాలు మంజూరు చేయగా.. తర్వాతి స్థానాల్లో నెల్లూరు (10,094), విశాఖపట్నం(8,626) నిలిచాయి. గత జూన్‌లో నిర్వహించిన తొలి విడత ఎల్ఎల్ఆర్ మేళా కార్యక్రమంలోనూ జిల్లా రవాణా శాఖ అధికారులు 9,534 మందికి లైసెన్సులు మంజూరు చేసి మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. లైసెన్సుల జారీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్ చేసింది. ఎల్ఎల్ఆర్ మేళాలు విజయవంతం కావడంతో ఇదే తరహాలో భవిష్యత్తులో పల్లెల్లోనే డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
డిజిలాకర్ వినియోగం ఇలా...!
ఈ సారి ఎప్పుడైనా రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాన్ని ఆపితే ఎంచక్కా జేబులోంచి మొబైల్‌ఫోన్ తీసి డిజిటల్ రూపంలో భద్రపరిచిన వాహన పత్రాలు చూపించొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్కు, ఇన్సురెన్స్, తదితర ధృవీకరణపత్రాలను కాగిత రూపంలోనే కాకుండా అవి డిజిటల్ రూపంలో ఉన్నా అధికారికంగా చెల్లుబాటు అవుతాయని తాజాగా కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని అన్ని రాష్ట్రాల రవాణాశాఖలను కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో డిజిలాకర్ యాప్ లేదా ఎం పరివాహన్ ప్లాట్ఫోమ్లో ఈకాపీల రూపంలో వివిధ డాక్యుమెంట్లు ఇలా దాచుకోవచ్చు... డ్రైవింగ్‌కు సంబంధించిన పత్రాలే కాకుండా ఓటరు ఐడీకార్డు, ఆధార్‌కార్డు, విద్యాసంబంధిత సర్టిఫికెట్లు ఏవైనా డిజిలాకర్ మొబైల్ యాప్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ వెబ్సైట్లతో పాటు మొబైల్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంది. మీ డాక్యుమెంట్లన్నింటిని డిజిటల్ లాకర్లో భద్రపరుచుకోవడమే ’డిజిలాకర్’. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పనిచేస్తుంది.ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ నెంబర్లకు దీనిని లింక్చేస్తారు. క్లౌడ్ పద్ధతిలో (ఓ సాఫ్ట్వేర్)లో డేటానంతా స్టోర్ చేస్తారు. మీ డాక్యుమెంట్లను పీడీఎఫ్, జేపీఈజీ లేదా పీఎన్జీ ఫార్మాట్లో స్కాన్ చేసి వాటిని ఆ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు అవసరం పడినా దాని నుంచి వాటిని ఉపయోగించవచ్చు. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై మీరు ఎలక్ట్రానిక్(ఈ) సంతకం కూడా చేయొచ్చు. ఈ విధంగా మీ పత్రాలపై మీరు సొంతంగా అటెస్ట్ చేసినట్టు అవుతుంది. అదే విధంగా సీబీఎస్ఈ, రిజిస్ట్రార్ ఆఫీస్ లేదా ఆదాయపన్ను శాఖలు కూడా వారి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల ఎలక్ట్రానిక్ కాపీలు కూడా నేరుగా మీ ఈలాకర్లోకి పంపవచ్చు. ఆధార్ పథకాన్ని అమలుచేస్తున్న ’యూనిక్ ఇండెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంస్థతో పాటు, రోడ్డురవాణా, హైవేల మంత్రిత్వశాఖ. ఆదాయపు పన్ను శాఖ, సీబీఎస్ఈ తో సహా వివిధ స్కూలు బోర్డులు, వివిధ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, సంస్థలు డిజిలాకర్‌లో రిజిష్టరయి ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం 1.35 కోట్ల మంది డిజిలాకర్ను ఉపయోగిస్తున్నారు. పాన్‌కార్డులు, మార్కుషీట్లు, కుల, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు ఇలా వివిధ సేవల కోసం దానిని వాడుతున్నారు. ఎలా ఉపయోగించాలి... డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ సిస్టమ్‌లో ముందుగా డిజిలాకర్ వెబ్‌సైట్‌కు వెళ్లడం లేదా స్మార్ట్‌ఫోన్‌లో డిజిలాకర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. వన్ టైమ్ పాస్వర్్డ కోసం మీ ఆధార్‌కార్డు, మొబైల్‌నెంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించాలి. ఏదైనా సంస్థ మీ ఈడాక్యుమెంట్లను అందులో అప్లోడ్ చేసినా మీ అకౌంట్లో కనిపిస్తుంది. మీ డాక్యుమెంట్లు కూడా మీరే స్వయంగా అప్లోడ్ చేయడంతో పాటు వాటిపై సంతకం చేయొచ్చు. ఈ డాక్యుమెంట్లను ఇతరులతో పంచుకునే (షేర్ చేసుకునే) సౌకర్యాన్ని కూడా మీరు పొందవచ్చు. దీని కోసం ఈడాక్యుమెంట్లో లింక్ షేర్ చేయాల్సి ఉంటుంది. -
డిజిలాకర్ను అంగీకరించండి
న్యూఢిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) తదితర వాహన సంబంధిత ధ్రువపత్రాలను డిజిలాకర్ లేదా ఎం–పరివాహన్ యాప్ ద్వారా అంగీకరించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మోటార్ వాహనాల చట్టం–1988, సమాచార, సాంకేతిక చట్టం–2000 ప్రకారం ఆ ఎలక్ట్రానిక్ ధ్రువపత్రాలను రవాణా శాఖ జారీ చేసిన ఒరిజినల్స్‌తో సమానంగా పరిగణించాలంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కొత్త వాహనాలఇన్సూరెన్స్ వివరాలు, రెన్యువల్ ఇన్సూరెన్స్ వివరాలను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డు ‘వాహన్’ డేటాబేస్‌లోకి ప్రతి రోజూ అప్లోడ్ చేస్తుందని, ఇవన్నీ ఎం–పరివాహన్ లేదా ఈ–చలాన్ యాప్‌లో కనిపిస్తాయని స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ వివరాలు సదరు యాప్‌ల్లో కనిపిస్తే ఒరిజినల్ ధ్రువపత్రాలు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంది. -
కార్డు..నోవేర్ –ఫైన్ బరాబర్!
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్‌కు చెందిన వినోద్ మే నెలలో డ్రైవింగ్ లైసెన్స్ చిరునామా మార్పు కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కొత్త లైసెన్స్ ‘స్మార్ట్ కార్డు’ పోస్టు ద్వారా వారం రోజుల్లో ఇంటికే వస్తుందని అధికారులు చెప్పారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు అతన్ని తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్సు చూపించమన్నారు. అది లేకపోవడంతో జరిమానా విధించారు. ఐ లంగర్‌హౌస్‌లో ఉంటున్న సాయితేజ నెల రోజుల క్రితం కొత్త బైక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు వాహనం రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ) చేతికి రాలేదు. 15 రోజుల పాటు ఎదురు చూసి అధికారులను సంప్రదించాడు. కార్డుల కొరత వల్ల పంపిణీ నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడతడు బండి బయటకు తీస్తే పోలీసులు పట్టుకుంటారేమోనని భయపడుతున్నాడు. ఈ సమస్య వినోద్, సాయితేజలదే కాదు.. గ్రేటర్‌లోని సుమారు లక్షా 75 వేల మంది వాహన వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య. నగరంలోని ఒక్కో ఆర్టీఏ కార్యాలయంలో 10 వేల నుంచి 25 వేల వరకు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీ నిలిచిపోయింది. నగర శివారులోని ఒక్క ఇబ్రహీంపట్నం ఆర్టీఏ పరిధిలోనే సుమారు 20 వేల స్మార్ట్ కార్డుల పంపిణీకి బ్రేక్ పడింది. ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌లో 25 వేల కార్డులు ఆగిపోయాయి. ప్రస్తుతం అత్యంత ప్రముఖులకు మాత్రమే అతికష్టంగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు అందజేస్తున్నారు. మేడ్చల్, అత్తాపూర్, ఉప్పల్ తదితర అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత రవాణాశాఖకు సవాల్‌గా మారింది. రెండు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ ప్రతిష్టంభన ఇప్పటికీకొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం డ్రైవింగ్ లైసెన్సు కోసం వినియోగదారుడు రూ.1550 వరకు చెల్లిస్తాడు. రవాణాశాఖ అందజేసే పౌరసేవల కోసం చెల్లించే ఫీజుతో పాటు, కార్డుపైన వాహనదారుడి వివరాలను ముద్రించి ఒక ప్రామాణికమైన డ్రైవింగ్ లైసెన్సు రూపంలో పోస్టు ద్వారా అందజేసేందుకు రూ.35 పోస్టల్ చార్జీలతో సహా రూ.250 సేవా రుసుం, ఇతరత్రా అన్ని ఖర్చులను ముందే చెల్లిస్తాడు. గతంలో డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలు పూర్తయిన వెంటనే నేరుగా లైసెన్స్ ఇచ్చేవారు. ఆర్సీలూ అంతే. వాహనదారుల చిరునామా ధ్రువీకరణ కోసం కొంతకాలంగా పోస్టు ద్వారా పంపిణీ చేస్తున్నారు. వారం రోజుల్లో వినియోగదారుడికి చేరేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ అన్ని రకాల ఫీజులు, సర్వీసు చార్జీలు చెల్లించిన సుమారు లక్షా 75 వేల మంది వినియోగదారులకు గత రెండు నెలలుగా స్మార్ట్ కార్డులు అందడం లేదు. ఒక్కో వినియోగదారుడు సగటున రూ.1500 ఫీజు చెల్లించినట్లు భావించినా ఈ రెండు నెలల్లో రవాణాశాఖ ఖజానాలో జమ అయిన మొత్తం అక్షరాలా రూ.26.25 కోట్లపైనే.. అంటే వాహనదారుల నుంచి ముందుగానే ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసిన రవాణశాఖ వారికి అందించాల్సిన స్మార్ట్‌కార్డుల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏడాది కాలంగా ఈ సమస్య పదే పదే పునరావృతమవుతోంది. ఈ ఏడాది కాలంలో పౌరసేవలపైన వినియోగదారుల నుంచి వందల కోట్ల రూపాయలు ఆర్జించిన రవాణాశాఖ.. వారికి అందజేయవలసిన పౌరసేవలపైన మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యానికి ప్రదర్శిస్తోంది. బకాయిలు రూ.4 కోట్లే ప్రతినెలా 1.15 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను ముద్రించి పంపిణీ చేస్తారు. ఇందుకోసం వినియోగించే స్టేషనరీని పూణేకు చెందిన ఎంటెక్ ఇన్నొవేషన్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. సాధారణంగా వినియోగదారుల డిమాండ్ మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సంస్థ 6 లక్షల కార్డులను రవాణాశాఖకు అందజేస్తుంది. అలాగే ముంబైకి చెందిన శ్రీనాథ్ ఎంటర్ప్రైజెస్ స్మార్ట్ కార్డుల ముద్రణకు అవసరమైన రిబ్బన్‌ను సరఫరా చేస్తుంది. ప్రతి 3 నెలలకోసారి ఈ రెండు సంస్థలకు నిధులు చెల్లించాలి. ఎంటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇంకా 9 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ రూ.4 కోట్ల మేర బకాయీలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆ సంస్థ మే నెలాఖరు నుంచి కార్డుల సరఫరాను నిలిపివేసింది. అప్పటి వరకు అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిల్వ ఉన్న కార్డులను పంపిణీ చేయగా జూన్ నుంచి తీవ్ర కొరత ఏర్పడింది. వాహనదారులకు రెండు విధాలా నష్టం.. ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. అన్ని రకాల ఫీజులు చెల్లించి సకాలంలో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు అందుకోలేకపోవడం ఒకటైతే.. సరైన ధ్రువపత్రాలు లేవనే కారణంతో ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం రెండోది. చాలా వరకు తమ వద్ద ఉన్న రశీదుల ఆధారంగా వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి బయటపడుతున్నప్పటికీ అవి కోల్పోయిన వారు మాత్రం తగిన ‘మూల్యం’ చెల్లించకతప్పడం లేదు. ఇలా ప్రతి రోజు సుమారు 250 మంది డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు లేక చలానాలు కడుతున్నారు. -
రేపిస్టులకు సంక్షేమ పథకాలు కట్..!
చండీగఢ్ : హరియాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచార కేసుల్లో నిందితులకు సంక్షేమ పథకాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం వారికి రేషన్ మినహా మిగత ప్రభుత్వ పథకాలు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గురువారం వెల్లడించారు. అందులో భాగంగా వారి వృద్ధాప్య ఫింఛన్, వికలాంగ ఫింఛన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుధ లైసెన్స్‌లను తొలుత తాత్కాలికంగా రద్దు చేస్తారు. ఒకవేళ కోర్టులో వారు దోషిగా తెలితే వాటిపై పూర్తి నిషేధం విధిస్తారు. కాగా రేషన్ మాత్రం యథాతదంగా కొనసాగుతోంది. ఇంకా ఖట్టర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ, భద్రత కోసం ఓ సమగ్ర పథకాన్ని ఆగస్టు 15న గానీ, రక్షా బంధన్(ఆగస్టు 26)న గానీ ప్రారంభించనున్నట్టు తెలిపారు. అత్యాచార బాధితులు తమ తరపున ఇష్టమైన లాయర్‌ను నియమించుకునేందుకు వారికి 22,000 రూపాయల ఆర్థిక సహాయం అందివ్వనున్నట్టు ప్రకటించారు. అత్యాచార, ఈవ్‌టీజింగ్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారిచేయనున్నట్టు తెలిపారు. అత్యాచారం కేసు విచారణ నెల రోజుల్లో, ఈవ్‌టీజింగ్ కేసు విచారణ 15 రోజుల్లో పూర్తిచేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో 6 పాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. -
ప్రమాదాలపై పోలీసుల కీలకనిర్ణయం!
రోడ్డు ప్రమాదాల నివారణకు పంజాబ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలకు కారణమైన వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయించే చర్యలకు ఉపక్రమించారు. పైలట్ ప్రాజెక్టుగా జలంధర్ పట్టణంలో అమలు చేస్తున్న అధికారులు త్వరలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. మోటారు వాహన చట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్‌లో ఉన్న సెక్షన్లను సైతం పక్కాగా అమలు చేస్తున్నారు. దీనికి అక్కడి ఆర్టీఏ అధికారుల నుంచి పూర్తి సహకారం అందుతోంది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహన ప్రమాదాల దృష్ట్యా.. ఆ విధానం ఇక్కడా అమలు చేయాలంటున్నారు నిపుణులు. సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వాహనచోదకుల్లో బాధ్యత పెంచడమే మార్గంగా భావించిన పంజాబ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలకు కారణమైన వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయించే చర్యలకు ఉపక్రమించారు. పైలెట్ ప్రాజెక్టుగా అక్కడి జలంధర్ పట్టణంలో దీన్ని అమలు చేస్తున్నారు. ఇలాంటి విధానం నగరంలో ఉండాలని నిపుణులు చెబుతుండగా... ఇప్పటికే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారి విషయంలో దీన్ని అమలు చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. వాతావరణ కారణాలు, రోడ్డు స్థితిగతుల వల్ల చోటు చేసుకునే ప్రమాదాలను మామూలుగానే పరిగణిస్తున్న పంజాబ్ అధికారులు డ్రైవర్ నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యంతో పాటు మద్యం మత్తులో జరిగిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అక్కడి ఆర్టీఏ అధికారుల నుంచీ పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఆ ‘రెండు చట్టాలు’ ఏం చెబుతున్నాయంటే.. నిర్లక్ష్యంగా వాహనం నడపడం ద్వారా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడటానికి, మృతి చెందటానికి, అంగవైకల్యం పొందడానికి కారణమైన వాహన చోదకుడి లైసెన్సును రద్దు చేసే అవకాశం అధికారులకు భారత మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్)తో పాటు ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్లు కూడా కల్పిస్తున్నాయి. ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 19 ప్రకారం ఓ వ్యక్తి డ్రైవింగ్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే లైసెన్స్ రద్దు చేసే లేదా రెన్యువల్‌కు నిరాకరించే అవకాశం ఉంది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 304–ఏ (నిర్లక్ష్యంతో మృతికి కారణం కావడం), 279 (బహిరంగ రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం), 337 (నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల భద్రతకు ముప్పుగా మారడం), 338 (నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఇతరులు తీవ్రంగా గాయపడటానికి కారణం కావడం) సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లైసెన్సును కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటి ఆధారంగానే జలంధర్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఏళ్లుగా ఈ విధానం అమలులో ఉంది. అక్కడ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ చిక్కితే జరిమానాలు, శిక్షలు భారీ స్థాయిలో ఉండడంతో క్యాన్సిల్ అయిన వ్యక్తి వాహనం తీసే సాహసం చేయడని, ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవని అధికారులు చెబుతున్నారు. సిటీలో అమలుకు సవాళ్లెన్నో.. ఇలాంటి కఠిన విధానాలు కేవలం మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన వారి విషయంలోనే కాకుండా ప్రమాదాలకు కారణమైన వారి పైనా ఉండాలని నగర ట్రాఫిక్ పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే అమలుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయంటున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆర్టీఏ అధికారుల వద్ద ఉన్న డేటాబేస్ ఎంతో కీలకం. అయితే ఇది అన్ని అవసరాలకు వినియోగించేలా, అన్ని స్థాయిల్లోనూ యాక్సిస్ చేసేందుకు అవసరమైన పరిజ్ఞానం అందుబాటులో రావాలని సూచిస్తున్నారు. మరోపక్క ఓ వ్యక్తి లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసినా పేరు లేదా ఇంటి పేరులో కొన్ని అక్షరాలను మార్చడం ద్వారా అదే వ్యక్తి మరోసారి లైసెన్స్ తీసుకునే అవకాశం ఉండకూడదని, ప్రస్తుతం ఆధార్ లింకేజ్‌లో ఇది సాధ్యమవుతుందంటున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో లైసెన్స్ వివరాలు సైతం సామాజిక భద్రతా కార్డుల్లో నిక్షిప్తమై ఉండడంతో వారు ఇలా తీసుకునే అవకాశం ఉందని, ఇక్కడ అలాంటి వ్యవస్థ లేదని చెబుతున్నారు. డేటాబేస్‌తో పాటు ఇతర సమస్యలను అధిగమించి జలంధర్ విధానాన్ని సిటీలోనూ అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
‘లైసెన్స్’ సాయం
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలో ఉన్న వాహనాల సంఖ్యలో సగం కూడా డ్రైవింగ్ లైసెన్సులు లేవు. ఈ నేపథ్యంలో లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న కేసుల్లో అత్యధికం ఈ ప్రాంతంలోనే నమోదవుతున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ డీసీపీ–2 బాబూరావు ప్రత్యేక మేళా ఏర్పాటు చేశారు. దీనికి వచ్చిన స్పందన చూసి ప్రతి ఠాణాలోనూ హెల్ప్‌డెస్క్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి ఇవి పని చేయనునున్నాయి. మరోపక్క వేసవి తీవ్రత నేపథ్యంలో వాహనచోదకులకు ఉపశమనం కోసం పాతబస్తీలోని జంక్షన్లలో పరదాలు ఏర్పాటు చేస్తున్నారు. కారణాలనేకం... నిరక్షరాస్యత, అవగాహన లేమి, అందుబాటులో లేని వనరులు, తదితర కారణాల నేపథ్యంలో పాతబస్తీకి చెందిన అనేక మంది వాహనచోదకులు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోవట్లేదు. గతంలో సౌత్‌జోన్ అదనపు డీసీపీగా పని చేసిన బాబూరావుకు ఈ విషయంపై అవగాహన ఉండటంతో ఆయన ఈ అంశాన్ని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. పాతబస్తీ ప్రజల కోసం డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ఆర్టీఏ అధికారులతో సంప్రదింపుల అనంతరం అనిల్‌కుమార్ ఫలక్‌నుమా ప్రాంతంలో సోమ–మంగళవారాల్లో ప్రత్యేక మేళా ఏర్పాటు చేయించారు. దాదాపు 1200 మంది రిజిస్టర్ చేసుకోవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేయించుకున్నారు. ఇలా వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో శాశ్వత ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఠాణాలోనూ డెస్క్ ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహణ కోసం 20 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్సుల స్లాట్స్ బుక్ చేయడం, ఆన్లైన్ టెస్ట్‌కు సంబంధించిన అంశాలను స్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం వంటివి వీరికి నేర్పారు. మేళాలో విధులు నిర్వర్తించిన ఈ కానిస్టేబుళ్లు బుధవారం నుంచి వారి ట్రాఫిక్ ఠాణాల్లోనే ఉంటారు. వీరి నేతృత్వంలో పాతబస్తీలోని 12 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పరిధులకు చెందిన వారు ఎవరైనా ఆర్టీఏ స్లాట్ బుక్ చేసుకోవడానికి ఈ డెస్క్‌ను సంప్రదిస్తే, సిబ్బంది స్లాట్ బుక్ చేయడంతో పాటు ఆన్లైన్ టెస్ట్‌పై అవగాహన కల్పిస్తారు. ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత ట్రాక్ టెస్ట్‌కు అవసరమైన స్లాట్స్ బుక్ చేయడం, సహాయం చేయడం వంటి విధులు నిర్వర్తిస్తారు. బుధవారం నుంచి ఈ డెస్క్‌లు పని చేయనున్నాయి. ఇదీ పాతబస్తీ పరిస్థితి 2017 జనవరి–ఏప్రిల్ మధ్య డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడానికి సంబంధించి 8727 కేసులు నమోదయ్యాయి. ఇందుళక్ష సౌత్ డిస్ట్రిట్లోనే 5483 (62.82 శాతం) నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో నగర వ్యాప్తంగా 5735 కేసులు నమోదు కాగా... పాతబస్తీతో కూడిన సౌత్ డిస్ట్రిట్లోనే 3138 (54.71 శా>తం) రిజిస్టర్ అయ్యాయి. పరదాలు ఏర్పాటు చేస్తున్నాం ‘డ్రైవింగ్ లైసెన్స్‌లేని వాహనచోదకులకు ఈ హెల్ప్‌డెస్క్‌లు సహకారం అందిస్తాయి. మరోపక్క వేసవి నేపథ్యంలో పగటి పూట ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగుతున్న వాహనచోదకులు ఎండ వేడితో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీలోని రద్దీ జంక్షన్లలో పరదాలు ఏర్పాటు చేస్తున్నాం. బహదూర్‌పుర చౌరస్తాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. శాలిబండ, చంద్రాయణగుట్ట జంక్షన్లలో బుధవారం ఏర్పాటు చేయనున్నాం. వారంలో మరికొన్ని చోట్ల ఇవి అందుబాటులోకి వస్తాయి. పరదాలు ఏర్పాటు చేయడంతో పాటు పాయింట్ డ్యూటీలో ఉండే సిబ్బంది, అధికారులు వీటిని నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నాం.’ – కె.బాబూరావు, ట్రాఫిక్ డీసీపీ–2 -
15 ఆటోలు సీజ్
రెంజల్(బోధన్) : మోటారు వాహణ చట్టానికి విరుద్ధంగా నడుపుతున్న 15 ఆటోలను సీజ్ చేసినట్లు బోధన్ ఆర్టీవో రాజు తెలిపారు. శనివారం మండలంలోని సాటాపూర్‌లో జరిగిన వారాంతపు సంతకు ప్రయాణికులను తరలిస్తున్న ఆటోలను ఆయన తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాటిని పట్టుకుని సీజ్ చేశారు. ఇటీవల మెండారాలో జరిగిన సంఘటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి వారం మూడు రోజులపాటు ప్రత్యేక స్పెషల్‌డ్రైవ్‌లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిట్‌నెస్‌లేని ఆటోలను గుర్తించి సీజ్ చేస్తామన్నారు. సాటాపూర్ చౌరస్తాలో పలువురు ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. -
మంచి దొంగ.. లైసెన్స్ ఇచ్చేశాడు..
పూణె : ఒక వస్తువు పోగొట్టుకున్నామంటే తిరిగి పొందడం కష్టం. దొంగతనం జరిగిన తర్వాత ఆ వస్తువులు మళ్లీ సొంతదారులకు చేరడం అనేది కల్లే. ఇక ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటివి పోగొట్టుకుంటే మళ్లీ అప్లై చేయాలంటే కాస్త తలనొప్పి వ్యవహారమే. అయితే దొంగతనం చేసినవారు...ఆ వస్తువుల్ని తిరిగి మనకి పంపిస్తే ఆ ఆనందమే వేరు కదా. పూణెకి చెందిన స్వప్న డేకి అచ్చంగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గత నెల 28న తనకు వచ్చిన పార్శిల్ తెరచి చూసిన ఆమె స్వీట్ షాక్‌కు గురయ్యానని చెప్పారు. అందుకు కారణం పోయిందనుకున్న డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి పొందడమే. ఎంజీ రోడ్డులోని తన బొటిక్‌ను మూసివేసిన తర్వాత ప్రతీ సాయంత్రం వాకింగ్‌కు వెళ్లడం స్వప్న డేకు అలవాటు. రోజూ స్కూటర్‌పై వెళ్లే ఆమెకు కొడుకు ఈ మధ్యనే ఒక ఎస్యూవీ కారును బహుమతిగా ఇచ్చాడు. మార్చి 17 సాయంత్రం కారు పార్క్ చేసి వాకింగ్ ముగించుకుని వచ్చేసరికి కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న పర్సును దుండగుడు చోరీ చేశాడు. అందులో డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు డబ్బులు కూడా ఉన్నాయి. అయితే పర్స్‌ను కొట్టేసిన దొంగ... బ్రాండెడ్ పర్సును, అందులో ఉన్న రూ. 1500లను తనతో పాటే అట్టిపెట్టుకుని లైసెన్స్‌ని మాత్రం కొరియర్ చేసి నిజాయితీని చాటుకున్నాడు. దీంతో స్వప్న డేకు మళ్లీ లైసెన్స్ కోసం అప్లై చేయాల్సిన పని తప్పింది. డబ్బులు కొట్టేసినా.. లైసెన్స్ తిరిగి ఇచ్చేశాడు గనుక అతడు మంచి దొంగ అని సంబరపడిపోతున్నారు స్వప్న. -
వాహనం ఎక్కడో...రిజిస్ట్రేషన్ ఇక్కడే...
యానాం: ఆ శాఖలో అంతా ఇష్టారాజ్యం. ఉద్యోగుల ముసుగులో కొంతమంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆమ్యామ్యాలతో తతంగమంతా నడిపిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తుంటారు. ఇష్టారాజ్యంగా లైసెన్సులు జారీ చేస్తుంటారు. వారి దగ్గరే సంబంధిత ఆఫీసు తాళం కూడా ఉండటంతో ఇక ప్రతిదీ వారిష్టమే. సంబంధిత శాఖ అధికారులు సిటిజన్ చార్టర్ పెట్టరు. ఫీజుల వివరాలు బహిర్గతం చేయరు. అన్నిటా గోప్యతే. దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే ఉద్యోగులు ఎదురు తిరిగి కొట్టేంత పని చేస్తున్నారంటే వారి బరితెగింపును అర్థం చేసుకోవచ్చు. అక్రమాలకు అడ్డాగా.. : పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కన్నా పుదుచ్చేరిలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పలు ఇతర రాష్ట్రాల వాహనాలకు యానాంలో తప్పుడు చిరునామాలు, డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు పలు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఈ నెల 20న హర్యానాలో రూ.2.32 కోట్లతో కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారుకు ఇక్కడ తప్పుడు చిరునామాలు సృష్టించి రూ.1.22 లక్షలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో అయితే 14 శాతం చొప్పున రూ.7.28 లక్షలు అయ్యేది. ఇక్కడ అద్దెకు ఉంటున్నట్లు అడ్రస్సులు సృష్టించి, తదనంతరం ఎల్ఐసీ పాలసీ సంపాదించి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మార్చి 2న రేంజ్ రోవర్ చిన్న మోడల్ కారును గుంటూరులో కొనుగోలు చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే ప్రతి నెలా సుమారు 30 హర్యానాకు చెందిన బస్సులను యానాంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 18 హర్యానాకు చెందిన ఏసీ బస్సులకు రిజిస్ట్రేషన్లు జరిగాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 60 వేల జనాభాకు అన్ని బస్సులా? యానాం జనాభా కేవలం 60 వేలు. ఇక్కడ బస్సులు కొనుగోలు చేసేవారు చాలా తక్కువమంది ఉన్నా రిజిస్ట్రేషన్లు మాత్రం గణనీయంగానే జరుగుతున్నాయి. 2016 నుంచి ఇప్పటివరకూ ఇక్కడ 70 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేశారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతున్న బస్సులేవీ యానాంలో ఉండడం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కనుసన్నల్లోనే.. యానాం రవాణా శాఖలో పని చేస్తున్న ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఇటీవల డ్రైవింగ్ స్కూల్‌ను తన తండ్రి పేరిట బదిలీ చేయించి, ఆ స్కూల్ లైసెన్సులను సహితం ఇష్టారాజ్యంగా ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవింగ్ స్కూల్ నడుపుకునే ఆ వ్యక్తి, చాలా సంవత్సరాలపాటు ఆర్టీవో ఆఫీసుకు బ్రోకర్‌గా వ్యవహరించేవాడు. తదనంతరం మెల్లగా ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా రవాణా శాఖ కార్యాలయంలో తిష్ట వేసిననాటి నుంచీ అంతా తానై నడిపిస్తున్నాడు. ఇతడికి ఏళ్ల తరబడి బదిలీ లేకుండా అక్కడే ఉంటున్న ఒక యూడీసీ స్థాయి ఉద్యోగి సహకారం తోడవడంతో ఇక్కడి అక్రమాలకు అడ్డు లేకుండా పోతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సదరు ఔట్సోర్సింగ్ ఉద్యోగి పని కేవలం సంబంధిత పత్రాలు ప్రింటింగ్ తీయడమే. కానీ ఇష్టానుసారం వసూళ్లు చేస్తూ, షాడో అధికారిగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక గది కేటాయించినప్పటికీ అతను ప్రధాన గదిలోనే ఉంటూ తతంగమంతా నడిపిస్తుంటాడు. టూ వీలర్ లైసెన్సుకు రూ.1015 తీసుకోవాల్సి ఉండగా రూ.1220 తీసుకుంటున్నాడు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1560గా నిర్ణయిస్తే రూ.2,100, ఆర్డినరీ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.9 వేలు ఉంటే రూ.12,500 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు... యానాం రీజినల్ ట్రాన్స్పోర్ట్ యూనిట్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీకి ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసా యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కోన వెంకటరత్నం, సుంకర స్వామినాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సుంకర కార్తీక్ తెలిపారు. అంతా సక్రమమే.. యానాం ఆర్టీవో కార్యాలయంలో అన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని ఆర్టీవో రవిచంద్రన్ చెప్పారు. దీనిపై ప్రశ్నించిన ‘సాక్షి’ విలేకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మైనర్ డ్రైవింగ్‌కు మరో ఇద్దరు బలి
‘మైనర్ డ్రైవింగ్’ మరో ఇద్దరిని చంపేసింది. పాతబస్తీలో ఓ బాలుడిని మింగిన ఉదంతాన్ని మరువక ముందే హుమాయున్‌నగర్‌లో శుక్రవారం ఇద్దరు మైనర్లు వేగంగా బైక్ నడిపి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ట్రిబుల్ రైడింగ్ చేస్తూ బస్సును క్రాస్ చేసేందుకు ప్రయత్నించగా..అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. పవన్ కుమార్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా...మధు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు. సాక్షి, సిటీబ్యూరో/మెహిదీపట్నం: ‘మైనర్ డ్రైవింగ్’ మరో ఇద్దరిని చంపేసింది. పాతబస్తీలో ఓ బాలుడిని మింగిన ఉదంతాన్ని మరువక ముందే హుమాయున్‌నగర్‌లో మరోటి వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని బాలుడు వాహనం నడపటానికి తోడు ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణించడంతో తీవ్రత పెరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..గుడిమల్కాపూర్ అల్లూరి సీతారామరాజునగర్‌కు చెందిన కె.పవన్ కుమార్ (15) లంగర్‌హౌస్ పీటల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. సాయినగర్‌కు చెందిన ఎన్.మధు(16) మెహిదీపట్నం పుల్లారెడ్డి పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. హీరానగర్‌కు చెందిన భాగ్యచంద్(17) గౌతమ్ విద్యానికేతన్ స్కూల్లో చదువుకుంటున్నాడు. వీరి ముగ్గురు ఉషోదయనగర్ కాలనీలోని వివేకానంద స్కూల్లో ప్రతి రోజూ ఉదయం ట్యూషన్‌కు వెళ్తుంటారు. శుక్రవారం ఎవరికి వారు ట్యూషన్‌కు వెళ్లగా, మాస్టారు రాకపోవడంతో క్లాసు రద్దయింది. దీంతో ఈ ముగ్గురితో పాటు మరికొందరూ కలిసి మాసబ్‌ట్యాంక్‌లోని చాచానెహ్రూ పార్క్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు మూడు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. పవన్ తన తండ్రి కె.కృష్ణ పేరిట ఉన్న హోండా యాక్టివా వాహనం (టీఎస్ 13 ఏడీ 6266) తీసుకురావడంతో మధు, భాగ్యచంద్ కూడా అదే వాహనం ఎక్కారు. పవన్ వాహనం నడుపుతుండగా... మధు మధ్యలో, భాగ్యచంద్ వెనుక కూర్చున్నారు. ఎన్ఎండీసీ సమీపంలో పవన్ తమ ముందు వెళ్తున్న రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును క్రాస్ చేయడానికి ప్రయత్నించాడు. అదుపు తప్పి బైక్‌కు బస్సు వెనుక భాగం తగలడంతో ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. తీవ్రంగా గాయపడిన పవన్ అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధు కన్నుమూశాడు. గాయపడిన భాగ్యచంద్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనతో గుడిమల్కాపూర్ ప్రాంతంలో విషాద ఛాయలు అమలముకున్నాయి. ప్రాథమికంగా పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేని, మైనర్‌కు వాహనాన్ని ఇస్తే దాని యజమాని సైతం శిక్షార్హుడే. కేసు దర్యాప్తులో భాగంగా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నాం.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మైనర్లు వాహనాలు నడపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనికి చెక్ చెప్పడానికి ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం. ఇలాంటి కేసుల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కంటే చిన్న చిన్న పనుల కోసం వాహనాలపై వెళ్లే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఎవరైనా చిక్కితే వారికి జరిమానా విధించే విధానానికి స్వస్తి చెప్పాం. మైనర్, వారి తల్లిదండ్రులు/సంరక్షకుడు, వాహనం ఇచ్చిన వాహన యజమానులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఆపై మైనర్‌పై జ్యువైనల్ కోర్టులో, ఇతరులపై ట్రాఫిక్ కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేస్తున్నాం. న్యాయస్థానాలు తొలిసారి చిక్కిన వారికి జరిమానా విధిస్తున్నాయి. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
‘త్వరలో డ్రైవింగ్ లైసెన్స్–ఆధార్ లింక్’
న్యూఢిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆధార్‌తో అనుసంధానించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు బుధవారం ఓ కమిటీ తెలిపింది. రహదారి భద్రతపై గతంలో కోర్టు సుప్రీంకోర్టు మాజీ జడ్టి జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. గత నవంబరు 28న తాము రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శితో సమావేశం నిర్వహించామనీ, నకిలీ లైసెన్స్‌లను ఏరివేసేందుకు ఆధార్ అనుసంధానాన్ని త్వరలోనే చేపట్టనున్నట్లు సదరు అధికారి తమకు చెప్పారని కమిటీ పేర్కొంది. అందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందిస్తోందంది. సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే అన్ని రాష్ట్రాల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆధార్‌తో అనుసంధానించే పనిని కేంద్రం మొదలుపెడుతుందని కమిటీ తన నివేదికలో చెప్పింది. -
డ్రైవింగ్ లైసెన్స్ కోసం పోటెత్తిన మహిళలు
టీ.నగర్: సబ్సిడీ ధరలపై స్కూటర్ పథకం అమలు కావడంతో డ్రైవింగ్ లైసెన్సులు పొందేందుకు మహిళా ఉద్యోగులు ఆర్టీఓ కార్యాలయం బాట పడుతున్నారు. ప్రయివేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కార్యాలయానికి సులభంగా వెళ్లేందుకు వీలుగా ద్విచక్ర వాహనాలపై 50శాతం సబ్సిడీ లేదా రూ.25వేల నగదు అందజేసే పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. తిరువణ్ణామలై జిల్లాలో దరఖాస్తులను గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం, మున్సిపల్, పట్టణ పంచాయతీ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఫీజులు లేకుండా పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తును సమర్పించేందుకు ఫిబ్రవరి 5వ తేదీ వరకు గడువు ఉంది. ద్విచక్ర వాహనాలను సబ్సిడీపై పొందేందుకు అనేక నిబంధనలు ఉన్నాయి. తప్పనిసరిగా డ్రైవింగ్లైసెన్స్ కలిగిఉండాలి. దీంతో మహిళా ఉద్యోగులు డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం ఆర్టీఓ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. సోమవారం తిరువణ్ణామలై ఆర్టీఓ కార్యాలయంలో 555 మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేశారు.