వాషింగ్టన్ : అమెరికాలోని టెనేస్సీ రాష్ట్రానికి చెందిన జేడ్ డాడ్‌కు వింత అనుభవం ఎదురైంది. కొద్ది రోజుల క్రితం ఆమె తన డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి రెన్యువల్‌ను ఆన్‌లైన్‌లో అప్లై చేశారు. సరిగ్గా వారం క్రితం పోస్ట్ ద్వారా లైసెన్స్ ఇంటికి వచ్చింది. అయితే జేడ్ లెసెన్స్‌ను చూడగానే కొంచెం ఆశ్చర్యానికి లోనైంది. డ్రైవింగ్ లైసెన్స్‌పై తన ఫోటోకు బదులు ఖాళీగా ఉన్న కుర్చీ మాత్రమే కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని సదరు ఆర్‌టీఏ ఆఫీసుకు ఈ-మెయిల్ ద్వారా పంపించింది. అయితే డాడ్ ఫోన్‌లో చెప్పిన విషయం మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ అధికారిణి నమ్మలేదు. జేడ్ పంపిన మెయిల్‌ను చూసి ఆమె కూడా షాక్‌కు గురైంది. నిజంగా.. ఇది నమ్మలేకపోతున్నా.. ఈ విషయాన్ని మేనేజర్ దృష్టికి తీసుకెళతా అని చెప్పారు.(భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో)
అయితే అసలు విషయం ఏంటంటే డాడ్ ఆన్‌లైనలో అప్లై చేసేటప్పుడు.. ఫోటో సరిగానే దిగింది.. సేవ్ చేసేటప్పుడు మాత్రం తను దిగిన ఫోటో కాకుండా పొరపాటున ఖాళీగా ఉన్న కుర్చీని అప్‌లోడ్ చేసింది. ఈ విషయాన్ని గమనించని అధికారులు అదే ఫోటోను పెట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను పోస్ట్ ద్వారా పంపించారు. అయితే డాడ్ దీనిని అంత సీరియస్‌గా తీసుకోలేదు.. అంతేగాక ఫోటో వల్ల తాను పని చేస్తున్న సంస్థలో జరిగిన ఫన్నీ మూమెంట్‌ను షేర్ చేసుకున్నారు. ఆఫీసులో బాస్‌తో పాటు కొలీగ్స్ ఖాళీగా ఉన్న కుర్చీని చూపిస్తూ ' డాడ్.. ఖాళీ కుర్చీలో ఉన్నావా' అంటూ ఆటపట్టించేవారు అంటూ తెలిపారు. ఈ వింత డ్రైవింగ్ లైసెన్స్‌ను జేడ్ డాడ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అయితే ఈ సోమవారం డాడ్‌కు మళ్లీ లెసెన్స్ పోస్ట్‌లో వచ్చింది.. ఈసారి మాత్రం ఖాళీ కుర్చీ కాకుండా ఆమె ఫోటోనే వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment