
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న మందుబాబులపై సైబరాబాద్ పోలీసులకు స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 11వరకు 396 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 321 మంది మందుబాబులు ఉండగా.. 74 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న వారు ఉన్నారు.
ఇందులో 33 మంది నిందితులకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. ఆయా నిందితులకు రూ.16.16 లక్షల జరిమానా విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మోటార్ వాహన చట్టం సెక్షన్– 19 ప్రకారం ఆయా నిందితుల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ సంబంధిత రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్టీఓ) అధికారులకు సూచించారు.
(చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!)
Comments
Please login to add a commentAdd a comment