భారతదేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేయడానికి 'ఉత్తరప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్' ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి మూడు కంటే ఎక్కువ చలాన్స్ పొందిన డ్రైవర్ లేదా రైడర్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు పౌరులను హెచ్చరించారు. ఆ తరువాత కూడా ఇదే మళ్ళీ పునరావృతమైతే.. వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా.. ఉత్తరప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, వరుసగా మూడు కంటే ఎక్కువ చలాన్లు పొందిన వ్యక్తి లైసెన్స్‌ను రద్దు చేయవచ్చని నిర్ణయించారు. రెడ్ లైట్ జంపింగ్, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్లడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా డ్రంక్ అండ్ డ్రైవింగ్ వంటి నేరాలకు సంబంధించి పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి: చేతులు లేని మహిళకు డ్రైవింగ్ లైసెన్స్.. సీఎం చేతుల మీదుగా..
కేవలం నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఈ ఏడాది జరిగిన 1000 రోడ్డు ప్రమాదాల్లో సుమారు 400 మంది మరణించినట్లు తెలుస్తోంది. 2023 సెప్టెంబర్ వరకు ట్రాఫిన్ నిబంధలనను ఉల్లంఘించిన వాహనదారులు 14 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇందులో 69906 ఓవర్ స్పీడ్, 66867 రెడ్ లైట్ జంపింగ్, 10516 డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లో మాట్లాడినందు చలాన్ జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment