వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత సులభ తరం చేస్తూ.. వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందే వెసులు బాటు కల్పించింది.
కాలేజీ విద్యార్ధి నుంచి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ వాహనాల్ని విరివిరిగా వినియోగిస్తున్నారు. అయితే అందుకు కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయో మెట్రిక్ ఇలా వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్ని కేంద్రం అమల్లోకి తేనుంది.
ఇక కేంద్రం విధించిన నిబంధనలకు లోబడి ఉంటే ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అనుమతి ఉంది. ఇందుకోసం కేంద్రం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు ఎలా ఉన్నాయంటే
ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు
ఈ సదుపాయానికి కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి.
4 వీలర్ వాహనాల కోసం డ్రైవింగ్ కేంద్రాలకు అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి.
డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తప్పనిసరిగా తగిన పరీక్షా సౌకర్యాన్ని కలిగి ఉండాలి.
ట్రైనర్లు కనీసం ఉన్నత పాఠశాల డిప్లొమా లేదా తత్సమాన విద్యను కలిగి ఉండాలి.
కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. ట్రైనర్లు బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి.
లైట్ వెహికల్ ట్రైనింగ్ తప్పనిసరిగా 4 వారాలలోపు పూర్తి చేయాలి. కనీసం 29 గంటల శిక్షణ ఉంటుంది.
భారీ మోటారు వాహనాలకు 38 గంటల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను 6 వారాల్లోగా పూర్తి చేయాలి.
ఫీజు వివరాలు ఇలా..
లెర్నర్ లైసెన్స్: రూ 200
లెర్నర్ లైసెన్స్ పునరుద్ధరణ: రూ. 200
అంతర్జాతీయ లైసెన్స్: రూ 1000
శాశ్వత లైసెన్స్: రూ. 200
Most People don't know this fact.
Delhi is the only state with 100% Automated Testing Tracks. No one can ask for bribes, there's zero human intervention and will ensure no one cheats.
This can be easily done by every state, but they won't get regular commission if they do...!! pic.twitter.com/43lCx9SQg2— Dr Ranjan (@AAPforNewIndia) May 20, 2024
ఆటోమేటేడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్
మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఆటోమేటేడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హులు కావాలి. ఈ టెస్ట్‌ను ట్రాక్‌ల మీద ఆర్టీఓ అధికారులు నిర్వహిస్తారు. కానీ ఢిల్లీలో అలా కాదు వాహనదారుల సౌకర్యార్ధం ఆటోమేటేడ్ టెస్టింగ్ ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రాకుల వల్ల వాహనదారులు ఎలాంటి దళారులతో పనిలేకుండా సులభంగా డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొనవచ్చు.
మారుతీ సుజుకి సంస్థ
ఇక.. మారుతీ సుజుకి సంస్థ తన ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌న్ లాడో సరాయ్‌లో గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం కంపెనీ.. ఢిల్లీ టెస్టింగ్ ట్రాక్‌లలో 100 శాతం ఆటోమేటిక్ సౌకర్యాన్ని సాధించిందని తెలిపింది. ఇక.. రాజధానిలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం పూర్తిగా కంప్యూటరైజ్డ్ ప్రక్రియ అవుతుందని మారూతీ సుజుకి పేర్కొంది. టెస్ట్ ట్రాక్‌లు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR)కి అనుగుణంగా రూపొందించబడినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment