ఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం పెరిగి గాలి నాణ్యత క్షిణించటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యానికి దారితీసే పొరుగు రాష్ట్రాల్లో భారీగా పంట వ్యర్థాలను తగులబెట్టటంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని సవరణల ద్వారా పళ్లు లేని చట్టంగా మార్చడంపై కేంద్రాన్ని నిలదీసింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఐశ్వర్య భాటి స్పందిస్తూ.. 10 రోజుల్లో నిబంధనలను ఖరారు చేస్తామని, చట్టం అమలులోకి వస్తుందని కోర్టుకు తెలిపారు.
‘‘మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతున్నాం. ఈ అంశంలో కేంద్రం ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు. పర్యావరణ పరిరక్షణ చట్టం శక్తిలేని చట్టంగా మార్చారు. శిక్ష నుంచి విముక్తి పొందటం కోసం సెక్షన్ 15 తీసుకువచ్చారు. పెనాల్టీ విధింటం కూడా కేంద్ర పభుత్వానికి సాధ్యం కావటం లేదు’’ సుప్రీంకోర్టు అహనం వ్యక్తం చేసింది.
Air Pollution: Supreme Court takes strong exception on Punjab and Haryana governments not taking any action against people for stubble burning.
Supreme Court says if these governments are really interested in implementing the law there will have been at least one prosecution.… pic.twitter.com/ykmhWlza4g— ANI (@ANI) October 23, 2024
పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల కార్యదర్శి (పర్యావరణ), అదనపు ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం)కి షోకాజ్ నోటీసులు అందజేశామని ఏఎస్‌జీ తెలిపారు. 10 రోజుల్లో, సెక్షన్ 15 పూర్తిగా అమలు చేయబడుతుందని అన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం పర్యావరణాన్ని పరిరక్షించడానికి సిద్ధంగా ఉంటే.. సెక్షన్ 15కి సవరణకు ముందే చర్యలు తీసుకునేవాళ్లు. కానీ, ఇదంతా రాజకీయం కోసమే చేస్తున్నారు తప్ప మరేమీ చేసిందేమీ లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment