డ్రైవింగ్ లెసైన్స్ | Driving license | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్ లెసైన్స్

Published Sat, Sep 26 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

Driving license

 అనంతపురం టౌన్ : టూవీలర్, ఫోర్ వీలర్లు నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లెసైన్స్ ఉండాల్సిందే. దీనికి 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. 16 సంవత్సరాలు నిండిన వారు గేర్లు లేని (55 సీసీ లోపు సామర్థ్యం కలిగిన వాహనాలు) మోపెడ్‌లు నడిపేందుకు అర్హత ఉంటుంది. అయితే వీరికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
 
 ఎల్‌ఎల్‌ఆర్  తీసుకోవాలంటే..
  లెర్నింగ్ లెసైన్స్ కావాలనుకునే వారు  .aptransport.gov.in బ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి.
  లెసైన్స్ ఎవరికి కావాలో వారి చిరునామాకు సమీపంలో మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ పొందే అనుమతి లభిస్తుంది. లేదంటే దాని పరిధిలోని కార్యాలయాల్లో తీసుకోవచ్చు.
  స్లాట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోపు సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో లేదా ఈ-సేవా కేంద్రంలో ఫీజు చెల్లించాలి.
  టూ వీలర్, ఫోర్ వీలర్లలో ఏదైనా ఒక దాని కోసం రూ.90, రెండూ కావాలనుకుంటే రూ.120 చెల్లించాల్సి ఉంటుంది.
  స్లాట్ తీసుకున్న 24 గంటల్లోగా ఫీజు చెల్లించకపోతే అది రద్దయిపోతుంది.
  స్లాట్ బుక్ చేసుకున్న గడువు, సమయాన్ని అనుసరించి ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించే పరీక్షకు హాజరు కావాలి.
  ఇదే సమయంలో అభ్యర్థులు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, చిరునామా పత్రాలు వెంట తీసుకెళ్లాలి.
  లెర్నింగ్ లెసైన్స్ పరీక్షలో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత నియమాలపై 20 ప్రశ్నలుంటాయి. వాటిలో కనీసం 16 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన సమాధానం గుర్తించాలి.
  పరీక్షలో పాస్ అయిన వారికి మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ ఇస్తారు. అయితే ఇది కేవలం ఆరు నెలల వరకే చెల్లుబాటు అవుతుంది.
  ఎల్‌ఎల్‌ఆర్ పొందిన 30 రోజుల తర్వాత, దాని గడువు ముగిసేలోగా శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ పొందవచ్చు.
  నాన్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లెసైన్స్ 18 ఏళ్లకే పొందినప్పటికీ, ట్రాన్స్‌పోర్ట్ లెసైన్స్ పొందేందుకు కనీసం 20 సంవత్సరాలు నిండి ఉండాలి.
  అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి ఆర్టీఏ కార్యాలయాల్లో లెర్నింగ్ లెసైన్స్ పొందవచ్చు.
 
 శాశ్వత లెసైన్స్ కోసం..
 శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ పొందాలనుకునే వారు కూడా ఆర్టీఏ వెబ్‌సైట్‌లో స్లాట్ నమోదు చేసుకోవాలి. 24 గంటల్లో ఈ-సేవ, సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో గానీ రూ.550 నుంచి రూ.650 ఫీజు చెల్లించాలి. ఆర్టీఏ కార్యాలయాల టెస్ట్ ట్రాక్‌లలో పరీక్ష నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం వాహనాలు నడపాల్సి ఉంటుంది. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించే పరీక్షలో వాహనదారులు నైపుణ్యంతో వ్యవహరిస్తే శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ మంజూరవుతుంది. పోస్టు ద్వారా లెసైన్స్ మీ చిరునామాకు చేరుతుంది. పూర్తి వివరాల కోసం అనంతపురంలోని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో లేదా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement