two wheeler
-
చలాన్లలో ట్రిపుల్ సెంచరీ..!
బెంగళూరు:నగరంలో ఓ స్కూటరిస్టు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ట్రిపుల్ సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. అయితే ఈ ట్రిపుల్ సెంచరీ క్రికెట్ ఆటలో కొట్టింది కాదు.ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సాధించింది.కలసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియస్వామి ఏకంగా 311సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి నగరంలోనే అత్యధిక ఉల్లంఘనల చలాన్లు పొందిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు.ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తున్న పెరియస్వామి స్కూటర్‌ను అతడే కాక అతడి బంధువులు ఇద్దరు ముగ్గురు తరచుగా నడపుతుంటారు.స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడడం, హెల్మెట్ లేకపోవడం, జీబ్రా క్రాసింగ్ మీద బైక్ ఆపడం లాంటి ఉల్లంఘలనకు పాల్పడ్డారు.అయితే 311 చలాన్లు జారీ చేసినప్పటికీ పెరియస్వామి నుంచి జరిమానా వసూలు చేయడంపై మాత్రం ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టలేదు.అయితే ఓ నెటిజన్ షిబమ్ పెండింగ్ చలాన్ల విషయాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఎక్స్(ట్విటర్)లో పెట్టారు.దీంతో ఈ విషయం సోషల్‌మీడియా హాట్‌టాపిక్‌గా మారింది.సోషల్‌మీడియాలో ఈ వివాదంపై చర్చ మొదలవడంతో సిటీ మార్కెట్ పోలీసులు పెరియస్వామి ఆఫీసుకు వెళ్లారు. చలాన్ల విషయం చెప్పారు. దీనికి షాక్‌కు గురైన పెరియస్వామి తొలుత కొంత మొత్తం చెల్లిస్తానని, తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తానని చెప్పారు.జరిమానాలన్నీ కలిపి లక్షా 50 వేలు దాటడంతో స్కూటర్‌ను పోలీస్‌స్టేషనలో వదిలేస్తే బెటరని పెరియస్వామికి సలహా ఇవ్వడం విశేషం. -
పోలీస్‌స్టేషన్‌లో టూ వీలర్ల కుప్పలు : ఆధారాలు చూపిస్తే మీవే!
సోలాపూర్: సోలాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో వ్యర్థంగా పడిఉన్న వాహనాలను పక్షంరోజుల్లోగా రుజువులు చూపించి తీసుకువెళ్లాలని, లేని పక్షంలో వాటిని స్క్రాప్ కింద పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని సోలాపూర్ తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేశ్‌పాండే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘స్టేషన్ ఆవరణలో నాలుగు ఫోర్‌వీలర్లు, 67 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటి యజమానులు అవసరమైన పత్రాలు చూపించి తమ తమ వాహనాలను గుర్తించి తీసుకువెళ్లాలని కోరారు. లేకుంటే వాటిని పాడుబడిన వాహనాలుగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి : ఎన్నికల పోరులోతగ్గేదెలా : ఓటమనేదేలేకుండా..విజయఢంకా! -
ఇక అందుబాటు ధరలో హీరో ఎలక్ట్రిక్ టూ-వీలర్లు
వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూ–వీలర్ల వ్యాపార విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. వచ్చే కొద్ది నెలల్లో అందుబాటు ధరల్లో మరిన్ని మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా ఈ విషయాలు తెలిపారు.‘వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగం చాలా సందడిగా ఉండబోతోంది. విడా శ్రేణికి సంబంధించి అందుబాటు ధరల్లో మోడల్స్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 1–1.5 లక్షల శ్రేణిలో (రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలతో కలిపి) ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో విడా స్కూటర్లను కంపెనీ విక్రయిస్తోంది. 32 రోజుల పాటు సాగిన పండుగ సీజన్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి స్పందన కనిపించిందని, 11,600 యూనిట్లు విక్రయించామని గుప్తా వివరించారు.క్షేత్రస్థాయిలో భౌతికంగా సేల్స్, సర్వీస్ మౌలిక సదుపాయాలు ఉంటే కస్టమర్‌కి మరింత నమ్మకం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలు ఉండటం తమకు కలిసి వచ్చే అంశమని వివరించారు. ఈవీల విభాగంలో ధర, కస్టమర్ సర్వీసు అంశాలే దీర్ఘకాలికంగా ఏ కంపెనీకైనా కీలకం అవుతాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్ ప్లాంటులో తయారీఇక దేశీ మార్కెట్లో మొత్తం వాహన విక్రయాలపరంగా చూస్తే పట్టణ ప్రాంతాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయని గుప్తా చెప్పారు. ఈ ఏడాది పండుగ సీజన్లో హీరో మోటోకార్ప్ విక్రయాలు గత సీజన్‌తో పోలిస్తే 13 శాతం పెరిగి 15.98 లక్షల యూనిట్లకు చేరాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాల్లోకి కూడా విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
కొత్త సెగ్మెంట్లోకి టీవీఎస్ ఎలక్ట్రిక్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో సుస్థిర స్థానం దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ త్రీ–వీలర్స్ సెగ్మెంట్లోకి ఈ ఏడాదే ఎంట్రీ ఇస్తోంది. కంపెనీ ఇప్పటికే పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీతో నడిచే మూడు రకాల ప్యాసింజర్, ఒక కార్గో రకం త్రిచక్ర వాహనాలను కింగ్ పేరుతో పలు వేరియంట్లలో విక్రయిస్తోంది.భారత త్రిచక్ర వాహన విపణిలో సెప్టెంబర్‌లో అన్ని కంపెనీలవి కలిపి 1,06,524 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2,009 యూనిట్ల విక్రయాలతో టీవీఎస్ వాటా 1.89 శాతం నమోదైంది. 2023 సెప్టెంబర్‌లో ఇది 1.34 శాతంగా ఉంది. మూడవ ఈ–టూ వీలర్.. సంస్థ నుంచి మూడవ ఈ–టూ వీలర్ మోడల్‌ను మార్చికల్లా ప్రవేశపెట్టనున్నట్టు టీవీఎస్ ప్రకటించింది. 2024 ఆగస్ట్ వరకు ఈ–టూ వీలర్స్ అమ్మకాల్లో భారత్‌లో రెండవ స్థానంలో కొనసాగిన టీవీఎస్ మోటార్.. సెప్టెంబర్‌లో మూడవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అర్ధ భాగంలో కంపెనీ నుంచి దేశవ్యాప్తంగా 1.27 లక్షల యూనిట్ల ఈ–స్కూటర్స్ రోడ్డెక్కాయి. 2023 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఈ సంఖ్య 96,191 యూనిట్లు నమోదైంది. దీర్ఘకాలంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం, సాంకేతికతలలో పెట్టుబడులు, రిటైల్ విస్తరణపై దృష్టిసారించింది.భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని టీవీఎస్ యాజమాన్యం ఇప్పటికే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200–1,400 కోట్ల మూలధన వ్యయం చేయాలని టీవీఎస్ నిర్ణయించింది. ఇందులో 70 శాతం ఈవీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) విభాగాలలో నూతన ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అభివృద్ధికి, అలాగే డిజిటల్ సామర్థ్యాలను నిర్మించడానికి ఖర్చు చేస్తారు. ఇవీ ప్రస్తుత ఈ–టూ వీలర్ మోడళ్లు.. ప్రస్తుతం కంపెనీ ఖాతాలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. టీవీఎస్ ఎక్స్ మోడల్ ఈ–స్కూటర్‌ను రూ.2,49,990 ఎక్స్‌షోరూం ధరలో విక్రయిస్తోంది. ఒకసారి చార్జింగ్‌తో ఇది 140 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని 2.6 సెకన్లలో అందుకుంటుంది. అలాగే టీవీఎస్ ఐక్యూబ్ ఈ–స్కూటర్‌ను రూ.89,999 నుంచి రూ.1,85,373 వరకు ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. వేరియంట్‌నుబట్టి ఒకసారి చార్జింగ్‌తో 75–150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. -
‘ఆటో’ బతుకులు అస్తవ్యస్థం
సాక్షి, అమరావతి: ‘అటో డ్రైవర్ కె.శివారెడ్డి ఊర్మిళనగర్ రెండో లైనులో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలకు ఆ ఇల్లు మునిగిపోయింది. జీవనాధారమైన ఆటోతో పాటు ద్విచక్రవాహనం పూర్తిగా పాడైపోయాయి. సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. అప్పు చేసి ఆటోకు మరమ్మతులు చేయించుకుంటే రూ.45 వేలు ఖర్చయింది. ఇంటికిగానీ, వాహనాలకు గానీ పరిహారం ఇప్పించాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.పదహారేళ్లుగా ఇదే ప్రాంతంలో ఆటో నడుపుతున్న నా పేరు ఎందుకు జాబితాలో లేదని ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని వాపోతున్నాడు.’’...ఇది బుడమేరు వరదల్లో ఆటోలను కోల్పోయిన వేలాది మంది డ్రైవర్ల ఆవేదన. నగరంలో తిరిగే ఆటోలలో అతకధికం సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, కండ్రిగ, వాంబేకాలనీ, మిల్క్ ప్రాజెక్ట్, డాబా కోట్లు సెంటర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, భరతమాత కాలనీ, ఊరి్మళనగర్ల నుంచే వస్తున్నాయి. అక్కడి నిరుద్యోగులు డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరి జీవితాలు అస్తవ్యస్ధంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల బతుకు చిత్రంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది.మరమ్మతులకు కొత్త అప్పులురోజుల తరబడి ముంపులోనే ఉండటంతో ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయట మెకానిక్ దగ్గర నుంచి కంపెనీ షోరూమ్ వరకూ ఒక్కో దాని మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం అవుతోంది. రేడియేటర్, ఇంజిన్, బ్యాటరీతో పాటు బీఎస్ 6 వాహనాల్లో సెన్సార్లు పాడవ్వడంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్‌ల కొరత ఉండటంతో రోజుల తరబడి మోటార్ షెడ్ల వద్దే ఆటోలు పడి ఉంటున్నాయి. ఒకసారి మరమ్మతు చేసినా మళ్లీ మళ్లీ కొత్త లోపాలు బయటపడుతున్నాయి. దీంతో కొత్త అప్పులు చేసి మరమ్మతులకు వెచి్చస్తున్నారు. ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగానీ తమను అసలు పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.బీమా సంస్థల కొర్రీలువరద నీటిలో మునిగిన ఆటోలకు క్లెయిమ్‌లు ఎగవేసేందుకు బీమా సంస్థలు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నాయి. బీమా చేసే సమయంలో డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియని షరతులను పొందుపరిచి వాటిని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నాయి. ఒక ఆటోకి బీమా రావాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని తప్పించుకుంటున్నాయి. అదికూడా వరద వచి్చనప్పటి నుంచి ప్రతి దశలోనూ తీసిన ఫొటోలు, వీడియోలు ఉంటేనే బీమా వర్తిస్తుందని మెలికపెడుతున్నాయి.ప్రాణాలే కాపాడుకుంటామా, ఫొటోలు తీస్తామా అంటూ బాధితులు అడుగుతుంటే బీమా సంస్థలు సమాధానం చెప్పడం లేదు. రెండు వారాల్లోనే క్లెయిమ్‌లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో మాత్రం అది శూన్యం. బీమా సంస్థలు కనీసం 45 రోజుల పాటు ఆటోను ఉన్న చోటు నుంచి కదపకుండా ఉంచాలని చెప్పాయి. అప్పటి వరకూ మరమ్మతు చేయకపోతే మొత్తానికే పనికిరాదని, ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.పరిహారం లేదురాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 1న విజయవాడలో వదర విలయం సృష్టించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి జీవనాధారాలైన ఆటోలు, మోటార్ సైకిళ్లు వరద నీటిలో పూర్తిగా మునిపోయాయి. రోజుల తరబడి బురద నీటిలోనే నానిపోవడంతో ఇంజిన్, సెన్సార్లు,కార్బొరేటర్ వంటి ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోకి రూ.10 వేలు, ద్విచక్ర వాహనానికి రూ.3 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం రకరకాల కొర్రీలతో మూడొంతుల మందిని మోసం చేసింది. ఆటో నడిపితేగానీ పూటగడవని నిరుపేదలు వాటిని బాగు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బుడమేరు వరదల వల్ల దాదాపు 15 వేలకుపైగా అటోలు నీట మునిగితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 6,515 మాత్రమే ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 4,348 ఆటోలకు పరిహారం అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వాస్తవానికి మొత్తం బాధితుల్లో దాదాపు 80 శాతం మంది ఆటోవాలాలకు నష్టం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు..కొందరి పేర్లు ఉన్నా వారికి డబ్బులు పడలేదు.ఎవరూ పట్టించుకోవట్లేదు‘‘వరదల్లో ఇల్లు మునిగిపోయింది. ఆటో బాగా బెబ్బతింది. ప్రస్తుతానికి నడిచేలా చేయడానికి రూ.8 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.10 వేల ఇస్తామని చెప్పింది. కానీ మా వివరాలను నమోదు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. సచివాలయంలో అడిగితే కలెక్టరేట్‌కు వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ –లింగయ్య, ఆటో డ్రైవర్, రాజీవ్‌నగర్ కాలనీజీవనాధారం పోతే పరిహారం రాదా?‘‘ఆటో నడిపితేగానీ మా కుటుంబం నడవదు. వరదల వల్ల ఆటో మునిగిపోయి జీవనాధారాన్ని కోల్పోయాం. బీమా రావాలంటే 45 రోజులు ఆటోను వాడకూడదంటున్నారు. బాగు చేయించుకునే స్తోమత కూడా లేదు. అయినా జాబితాలో మా పేరు లేదంటున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు. మా గోడును ఎవరికి చెప్పుకోవాలి. మమ్మల్ని ఆదుకునేవారెవరు.’’ –బాబ్జి, ఆటో డ్రైవర్, రాజరాజేశ్వరిపేటఅద్దె ఆటోనే ఆధారం‘‘నేను ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. వరదకు ఆటో మునిగిపోయింది. ఎలాంటి పరిహారం రాలేదు. ఎవరిని అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు.ఏం చేయాలో తెలియడం లేదు.’’ –దుర్గారావు, ఆటో డ్రైవర్, వాంబేకాలనీ.చాలా ఖర్చవుతోంది‘ఇంటర్ చదివి ఆటో నడుపుతున్నాను. మా నాన్న కూడా ఆటో డ్రైవరే. రెండు ఆటోలూ వరదలో మునిగిపోయాయి.ఒక సారి రిపేరుకి రూ.12 వేలు ఖర్చయ్యింది. కానీ మళ్లీ రేడియేటర్ పాడయ్యింది. నాలుగు రోజులుగా మెకానిక్ దగ్గరే పెట్టి బాగుచేయిస్తున్నాం.’’ –వై.సాయి, ఆటో డ్రైవర్, పాయకాపురం. -
ఈ–టూవీలర్‌కు సబ్సిడీ రూ. 10,000
న్యూఢిల్లీ: పీఎం ఈ–డ్రైవ్ పథకం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) కొనుగోలుపై రూ.10,900 కోట్ల మేర సబ్సిడీలను కేంద్రం అందించనుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడమే ఈ పథకం ఉద్దేశ్యం. 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 30 వరకు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్) కింద సబ్సిడీలను అందించగా.. దీని స్థానంలో పీఎం ఈ–డ్రైవ్‌ను కేంద్రం తీసుకొచ్చింది. 24.79 లక్షల ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల త్రిచక్ర వాహనాలు, 14,208 ఈ–బస్సులకు సబ్సిడీలు అందనున్నాయి. సబ్సిడీలు ఇలా.. ఈ పథకం కింద తొలి ఏడాది కాలంలో.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంపై రూ.5,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం రెండు కిలోవాట్ అవర్‌కు మించి ఉన్నా కానీ, ఒక ఎలక్ట్రిక్ టూవీలర్‌కు గరిష్టంగా రూ.10,000 వరకే సబ్సిడీ ప్రయోజనం లభిస్తుంది. రెండో ఏడాది కిలోవాట్ అవర్‌కు రూ.2,500కు (ఒక టూవీలర్‌కు గరిష్టంగా రూ.5,000) తగ్గిపోతుంది.ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనం (ఈ రిక్షాలు సైతం) కొనుగోలుపై మొదటి ఏడాది రూ.25,000, రెండో ఏడాది రూ.12,500 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. ఎల్5 కేటగిరీ త్రిచక్ర వాహనాలపై మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.25,000 చొప్పు న సబ్సిడీ అందుతుంది. ఈ–ట్రక్కులకు రూ. 500 కోట్ల సబ్సిడీ కేటాయించారు. ఎలక్ట్రిక్ 4 చక్రాల వాహనాల కోసం 22,100 ఫాస్ట్ చార్జర్లు, ఈ బస్సుల కోసం 1,800 ఫాస్ట్ చార్జర్లు, ద్విచక్ర /త్రిచక్ర వాహనాల కోసం 48,400 ఫాస్ట్ చార్జర్లను ఈ పథకం కింద ఏర్పాటు చేయనున్నారు. ఓచర్ల రూపంలో..పథకం ఆవిష్కరణ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సెక్రటరీ హనీఫ్ ఖురేషీ మాట్లాడుతూ.. సబ్సిడీ పొందేందుకు మొబైల్ యాప్‌ను తీసుకొస్తామని, దీని ద్వారా సబ్సిడీ ఈ–ఓచర్లు జారీ అవుతాయని ప్రకటించారు. ఒక ఆధార్ నంబర్‌పై ఒక వాహనాన్నే సబ్సిడీ ప్రయోజనానికి అనుమతిస్తున్నట్టు చెప్పారు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే ఆధార్ ఆధారిత ఈ–ఓచర్ కొనుగోలుదారుకు జారీ అవుతుంది. ఈ–ఓచర్‌ను డౌన్లోడ్ చేసుకుని, దానిపై కొనుగోలుదారు సంతకం చేసి డీలర్‌కు ఇవ్వాలి. డీలర్ సైతం దీనిపై సంతకం పెట్టి పీఎం ఈ–డ్రైవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఓఈఎం (వాహన తయారీ సంస్థ) రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌కు ఈ–ఓచర్ అవసరం. -
‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’
ద్విచక్ర వాహన తయారీదారులు తమ కస్టమర్లకు డిస్కౌంట్ ధరకు హెల్మెట్ అందించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. 2022లో దేశంలో జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల 50,029 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.‘ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారు అధికంగా మృత్యువాత పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనే తయారీదారులను డిస్కౌంట్ ధరకు హెల్మెట్లు ఇవ్వమని అడగండి. తయారీ కంపెనీలు కూడా కొంత తగ్గింపుతో వాహనదారులకు హెల్మెట్లు ఇస్తే చాలా మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న ద్విచక్రవాహనదారుల్లో దాదాపు 43 శాతం మంది మరణిస్తున్నారు’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: జీవిత పాఠాలు నేర్పిన గురువులుపాఠశాల బస్సులు నిలిపేందుకు సరైన పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019 ట్రాఫిక్ నేరాలపై భారీ జరిమానాలు విధించిందని చెప్పారు. దేశంలోని ప్రతి టౌన్లో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్
టూవీలర్ మార్కెటింగ్ పరిశ్రమ బలంగా పుంజుకుంటుందని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటికి గిరాకీ పెరుగుతుందని, రుతుపవనాలు ఆశించిన మేర వస్తుండడంతో వ్యయ సామర్థ్యం పెరిగి వినియోగదారుల సంఖ్య అధికమవుతుందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో స్కూటర్లకు డిమాండ్ హెచ్చవుతుందని తెలిపారు.అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ..‘స్కూటర్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామాలకు చెందినవారే టూవీలర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ పరిశ్రమలో స్కూటర్ సెగ్మెంట్ 32 శాతం వాటాను కలిగి ఉంది. రుతుపవనాలు ఆశించినమేర వస్తుండడంతో వినియోగదారులు ద్విచక్రవాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే పండుగ సీజన్లో విక్రయాలు పెరగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వీటి అమ్మకాల్లో సుమారుగా 13 శాతం వృద్ధి నమోదైంది’ అన్నారు.ఇదీ చదవండి: పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!‘గతంలో బైక్ వాడిన యూజర్లు స్కూటర్ కొనుగోలు చేయాలంటే మైలేజీ, వాహన ఖరీదు వంటి అంశాలు అడ్డంకిగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మైలేజీతోపాటు అధునాతన టెక్నాలజీను అందిస్తున్నారు. టూవీలర్ అనేది ప్రస్తుతం సాధారణంగా అందరి వద్ద ఉండాల్సిన వస్తువుగా మారింది. ప్రభుత్వాలు కూడా మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగంగా రోడ్లను మెరుగుపరుస్తున్నాయి. దాంతో వీటిని మరింత సౌకర్యంగా నడిపే అవకాశం ఉంది’ అని తెలిపారు. -
ఫిలిప్పీన్స్‌లో ఇండియన్ కంపెనీ.. 48 దేశాల్లో హవా
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే బ్రాండ్ అమ్మకాలను ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఈ తరుణంలో కంపెనీ తన కార్యకలాపాలను ఫిలిప్పీన్స్‌లో ప్రారంభించింది.కొలంబియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో భాగమైన టెర్రాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్ (TMC).. ఫిలిప్పీన్స్‌లోని హీరో మోటోకార్ప్ ఉత్పత్తుల అసెంబ్లర్, విక్రయదారుగా ఉంటుంది. ఈ భాగస్వామ్యం అక్టోబర్ 2022లో ప్రకటించినప్పటికీ ఇప్పటికి అమలు అయ్యింది. దీంతో హీరో మోటోకార్ప్ వాహనాలు ఆగ్నేయాసియా మార్కెట్లోకి కూడా విస్తరిస్తున్నాయి.ఫిలిప్పీన్స్‌లోని లగునాలో టెర్రాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్లో అసెంబ్లీ యూనిట్, విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 600 చదరపు మీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ సదుపాయంలో సంవత్సరానికి 1.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలుస్తోంది.ఈ కొత్త తయారీ కేంద్రంలో ఎక్స్‌పల్స్ 200 4వీ, హంక్ 160ఆర్ 4వీ, జూమ్ వంటి టూ వీలర్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. హీరో మోటోకార్ప్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 48 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
రక్షణ చత్రమంటున్నా.. రెక్లెస్!
2024 ఫిబ్రవరి 6: షేక్‌పేట గుల్షన్ కాలనీకి చెందిన వ్యాపారి మొహమ్మద్ అర్షద్ (22) ఈ ఏడాది ఫిబ్రవరి 6న యాక్టివా వాహనంపై ప్రయాణిస్తున్నాడు. టోలీచౌకీలోని షేక్‌పేట్ నాలా నుంచి సెవెన్ టూంబ్స్ మెయిన్ రోడ్డు వరకు ఉన్న çశ్మశానానికి సరిహద్దు గోడ ఉంది. అక్కడ అర్షద్ వాహనం అదుపుతప్పి ఆ గోడను బలంగా ఢీ కొంది. ఆ సమయంలో అతడి తలకు హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఈ ప్రమాదం చోటు చేసుకుంది.2024 మే 26: మాసబ్‌ట్యాంక్‌లోని ఎంజీ నగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీ (45) ప్రైవేట్ ఉద్యోగి. మే 26 తెల్లవారుజామున తన కుమారుడితో (15) కలిసి ద్విచక్ర వాహనంపై మెహిదీపట్నం వైపు బయలుదేరారు. మైనర్ వాహనాన్ని డ్రైవ్ చేస్తుండగా అలీ వెనుక కూర్చున్నారు. కాగా హుమయూన్‌నగర్ ఠాణా సమీపంలో ఆ బాలుడు వాహనాన్ని సడన్ బ్రేక్ వేసి ఆపాడు. దీంతో వెనుక కూర్చున్న అలీ కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మూడు రోజులకు కన్ను మూశారు. హెల్మెట్ పెట్టుకుని ఉంటే గాయాల తీవ్రత తగ్గేదని, ప్రాణం దక్కేదనే అభిప్రాయం వ్యక్తమైంది.హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని స్పష్టం చేస్తున్న ప్రమాదాలు, హెల్మెట్ ధారణ విషయంలో ఏపీ సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఇటీవల జారీ చేసిన కీలక ఉత్తర్వులు.. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించడం ఎంత తప్పనిసరో తేల్చి చెబుతున్నాయి. హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ప్రమాదాలు నమోదవుతున్నాయి.2023లో మొత్తం 2,548 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఇందులో ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే దాదాపు సగం (1,263) ఉన్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 335 మంది మరణిస్తే, ఇందులో టూ వీలర్లకు సంబంధించిన మరణాలు దాదాపు 40 శాతం వరకు ఉండటం గమనార్హం. అయినప్పటికీ టూ వీలర్ వాహనాలు నడిపేవారిలో ఇంకా అనేకమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఒకవేళ హెల్మెట్ ధరించినా ఎక్కువమంది స్ట్రాప్ పెట్టుకోవడం లేదు.కొందరు అలంకారంగా బండి మీద పెట్టుకునో, తగిలించుకునో వెళ్తున్నారు. కొందరు పోలీసుల్ని చూసి హెల్మెట్ పెట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో కిందపడి ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలూ ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి పిలియన్ రైడర్ (ద్విచక్ర వాహనం వెనుక కూర్చునేవారు) సైతం విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం స్పష్టం చేస్తున్నా దాన్ని పట్టించుకునేవారే లేరు.అడపాదడపా పోలీసుల స్పెషల్ డ్రైవ్లుహెల్మెట్ ధారణను హైదరాబాద్‌లో 2012 లోనే తప్పనిసరి చేశారు. అయితే ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. వాహనచోదకుల అవగాహన రాహిత్యం/నిర్లక్ష్యం, పోలీసుల ఉదాసీన వైఖరితో పాటు రాజకీయ జోక్యం కూడా ఈ పరిస్థితికి కారణంగా కన్పిస్తోంది. నగర వ్యాప్తంగా దాదాపు 70 శాతం, పాతబస్తీ సహా మరికొన్ని ప్రాంతాల్లో 30 శాతం మాత్రమే హెల్మెట్ వినియోగంలో ఉంది. వాస్తవానికి మోటారు వాహనాల చట్టం పుట్టిన నాటి నుంచే ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్ కచ్చితంగా ధరించాలనే నిబంధన ఉంది. అయితే సుదీర్ఘకాలం పాటు ఈ విషయాన్ని నగర పోలీసులు పట్టించుకోలేదు.తేజ్ దీప్ కౌర్ మీనన్ హైదరాబాద్ ట్రాఫిక్ విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తుండగా 2005లో తొలిసారిగా ఈ అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో పెద్ద ఎత్తున హడావుడి చేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనను పక్కాగా అమలు చేయడానికి కృషి చేశారు. అయితే దీని చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టడంతో ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత ట్రాఫిక్ చీఫ్‌గా వచ్చిన అబ్దుల్ ఖయ్యూం ఖాన్ (ఏకే ఖాన్) సైతం హెల్మెట్ అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. ఈ నిబంధనను అమలు చేయడానికి ముందు వాహనచోదకులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అప్పట్లో మొదటి పేజీ తరువాయి అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా దాదాపు ఆరు నెలల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆపై స్పెషల్ డ్రైవ్స్‌కు శ్రీకారం చుట్టారు. వాహనచోదకుల్లో నిర్లక్ష్యంనగరంలోని ద్విచక్ర వాహనచోదకులందరితో హెల్మెట్ పెట్టించాలని ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పటికీ పాతబస్తీతో పాటు అనేక ప్రాంతాలకు చెందినవారు దీనికి దూరంగానే ఉంటున్నారు. హాఫ్ హెల్మెట్లు, హెల్మెట్ ధరించినా స్ట్రాప్ బిగించుకోకపోవడం, హెల్మెట్ వెంటే ఉన్నప్పటికీ కేవలం జంక్షన్లు, పోలీసులు సమీపిస్తున్నప్పుడే తలకు పెట్టుకోవడం పరిపాటిగా మారింది.నగరానికి చెందిన అనేకమంది వాహనచోదకులు తాము నివసిస్తున్న ప్రాంతం దాటి బయటకు వస్తేనే హెల్మెట్ ధరిస్తున్నారు. ఏ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నా ఇబ్బందులు తప్పవనే భావన వీరికి ఉండకపోవడమే దీనికి కారణం. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కొన్ని రోజులు హడావుడి చేయడం, ఆపై మిన్నకుండి పోవడంతో 100 శాతం హెల్మెట్ ధారణ సాకారం కావట్లేదు. నగరంపై డబ్ల్యూహెచ్ఓ దృష్టిహైదరాబాద్లో వాహనచోదకులకు హెల్మెట్ తప్పనిసరి చేయడమెట్లా అనే విషయంపై 2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దృష్టి పెట్టింది. ఏటా నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహ నాలకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం, వీటిలో తలకు దెబ్బతగలడం కారణంగా మరణిస్తున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది.ఆ ఏడాది హరియాణాలో ఉన్న ఫరీదాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించిన కీలక సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న డబ్ల్యూహెచ్ఓలోని రోడ్ సేఫ్టీ అండ్ ఇన్జ్యూరీ ప్రివెన్షన్ విభాగం టెక్నికల్ ఆఫీసర్ స్వేర్కర్ అల్మ్క్విస్ట్.. హైదరాబాద్‌లో హెల్మెట్ నిబంధన అమల్లో తమ సహకారంపై నిర్ణయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో హెల్మెట్ వాడకం 30 శాతమే ఉందని అప్పట్లో అభిప్రాయపడ్డారు.హెల్మెట్ వల్ల ఎన్నో ప్రయోజనాలుతలకు రక్షణ: శిరస్త్రాణాలు ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురైతే దాని ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. తల అంతర్గత, బహిర్గత గాయాల తీవ్రత, పుర్రె పగుళ్ల ప్రమాదం తగ్గుతుంది.మెదడు రక్షణ: హెల్మెట్ అనేది ప్రమాద సమయంలో తలకు కుషన్‌లా పనిచేస్తుంది. తద్వారా మెదడుకు గాయాలు (ట్రుమాటిక్ బ్రెయిన్ ఇన్జ్యూరీస్) కాకుండా రక్షించడంలో సహాయపడుతుంది.ఫేస్ ప్రొటెక్షన్: చాలా హెల్మెట్లు ఫేస్‌షీల్డ్ లేదా విజర్‌ను కలిగి ఉంటాయి. ఇవి ప్రమాదాల సమయంలో, అలాగే ప్రతికూల వాతావరణంలో ముఖాన్ని రక్షిస్తాయి.కంటి రక్షణ: విజర్ లేదా గాగుల్స్‌తో కూడిన హెల్మెట్లు గాలి, దుమ్ము, సూక్ష్మస్థాయి చెత్త, క్రిమి కీటకాల నుంచి కళ్లను రక్షిస్తాయి.ధ్వని తీవ్రత తగ్గింపు: కొన్ని హెల్మెట్లు చెవి రక్షణ బాధ్యత కూడా నిర్వర్తిస్తాయి. హెల్మెట్ పెట్టుకుంటే శబ్ద కాలుష్యం తక్కువగాఉంటుంది. ప్రమాద సమయంలో వినికిడి దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది.మార్పు కోసం కృషి చేస్తున్నాంగతంతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో పరిస్థితి బాగా మెరుగైందనే చెప్పాలి. జంక్షన్లలోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్‌తో పాటు వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికీ కొందరు.. ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తేనే హెల్మెట్ పెట్టడం, హెల్మెట్ పెట్టుకున్నా దాని స్ట్రాప్ బిగించుకోకపోవడం వంటివి చేస్తున్నారు. వీరి విషయంలోనూ మార్పు కోసం కృషి చేస్తున్నాం. - పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) -
పెరగనున్న టూ వీలర్స్ ధరలు.. జులై 1నుంచే అమలు
భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన లైనప్‌లో ఎంపిక చేసిన ద్విచక్ర వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఏ మోడల్ మీద ఎంత ధరలను పెంచనుంది అనే వివరాలను ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించలేదు.హీరో మోటోకార్ప్ తన టూ వీలర్ల ధరలను పెంచినట్లయితే.. రూ. 1500 వరకు పెంచే అవకాశం ఉంది. ఇది కూడా మోడల్‌ను బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. ధరల పెంపు 2024 జులై 1 నుంచి వర్తిస్తుంది. ఇన్పుట్ ఖర్చులు పెరగటం వల్ల కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిళ్ల శ్రేణిలో స్ప్లెండర్ ప్లస్ వేరియంట్లు, హెచ్ఎఫ్ డీలక్స్, హెచ్ఎఫ్ 100, ప్యాషన్ ప్లస్, ప్యాషన్ ఎక్స్‌టెక్, సూపర్ స్ప్లెండర్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్, గ్లామర్, గ్లామర్ ఎక్స్‌టెక్, ఎక్స్ట్రీమ్ 125ఆర్, ఎక్స్ట్రీమ్ 4వీ, ఎక్స్ట్రీమ్ 200 4వీ, ఎక్స్ట్రీమ్ 160ఆర్, మావ్రిక్ 440 వంటివి ఉన్నాయి. స్కూటర్ల విభాగంలో హీరో డెస్టిని ప్రైమ్, డెస్టిని 125 ఎక్స్టీఈసీ, జూమ్, ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ వున్నాయి. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే పేద మహిళా డ్రైవర్‌కు కొత్త ఆటో బహుమతిగా అందించారు. తనవంతు సాయంగా సమాజ సేవలో భాగంగా తాజాగా వికలాంగులకు బైక్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులు, అనాథ బాలల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లారెన్స్. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన 13 ద్విచక్ర వాహనాలు అందజేశారు. అంతే కాకుండా వారికి ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. త్వరలోనే వారికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని లారెన్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం రాఘవ చేస్తున్న సేవలను కొనియాడారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఎంట్రీ ఇచ్చిన రాఘవ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చంద్రముఖి-2, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాలతో అలరించిన రాఘవ.. ప్రస్తుతం దుర్గ అనే చిత్రంలో నటిస్తున్నారు. Hatsoff @offl_Lawrence Sir தமிழர் பாரம்பரிய மல்லர் கலையில் கலக்கி வரும் #கை_கொடுக்கும்_கை மாற்றுத்திறனாளி குழுவினர் ஒவ்வொருவருக்கும் இரண்டு சக்கர வாகனம் பரிசளித்தார் மாஸ்டர் #ராகவா_லாரன்ஸ் .#RaghavaLawrence pic.twitter.com/879dQ28jLO — Actor Kayal Devaraj (@kayaldevaraj) April 18, 2024 Service is god 🙏🏼 pic.twitter.com/UBZXYFIDMQ — Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2024 -
కారుతో ఢీ కొట్టి.. మృతదేహంతో 18 కిలోమీటర్లు..
ఆత్మకూరు: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొన్నాడు. ఎగిరి కారుపై పడి మృతిచెందిన యువకుడిని అలాగే 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అటుగా వెళుతున్న వాహనదారులు కారు పైభాగంలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి అప్రమత్తం చేయడంతో కారును రోడ్డుపక్కన ఆపి ఉడాయించాడు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జెన్నే ఎర్రిస్వామి (35)కి ఆత్మకూరు మండలం సిద్ధరామపురం గ్రామానికి చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న ఎర్రిస్వామి ఆదివారం ద్విచక్ర వాహనంపై అత్తారింటికి వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై వై.కొత్తపల్లి వద్దకు చేరుకోగా.. ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి కారు పైభాగంపై పడి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లాడు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద వాహన చోదకులు కారు పైభాగంపై మృతదేహం ఉండటాన్ని గుర్తించి.. కారు డ్రైవర్‌కు చెప్పారు. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి, టాప్‌పై పడి ఉన్న మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఉడాయించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Sachin Tendulkar: తమ్ముడూ... ఎలా ఉన్నావు?
మనం స్కూటర్‌పై వెడుతుంటే పక్కన కారులో మన అభిమాన హీరో లేదా క్రికెటర్ కనిపిస్తే ‘ఇది కలా? నిజమా?’ అనుకుంటాం. సచిన్ టెండూల్కర్ వీరాభిమానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. టూ వీలర్‌పై వెళుతున్న హరీష్‌కుమార్‌ను కారులో వెళుతున్న వ్యక్తి ‘ఎయిర్‌పోర్ట్‌కు ఎలా వెళ్లాలి?’ అని అడిగాడు. సమాధానం చెప్పడానికి రెడీ అయిన హరీష్ అటువైపు చూసి స్వీట్ షాక్‌కు గురయ్యాడు. అతడు ఎవరో కాదు సచిన్ టెండూల్కర్. రోడ్డు మీద నుంచి క్లౌడ్ 9లోకి వెళ్లిన హరీష్ ‘నమ్మలేకపోతున్నాను. థ్యాంక్యూ గాడ్’ అన్నాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చి సెల్ఫీ దిగిన సచిన్ హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తున్నందుకు హరీష్‌ను అభినందించాడు. ‘నేను కూడా సీటు బెల్ట్ ధరించాను చూడు’ అన్నాడు. హరీష్ ధరించిన ముంబై ఇండియన్స్ జెర్సీ వెనుక ‘టెండూల్కర్ 10 ఐ మిస్ యూ’ అనే అక్షరాలు కనిపిస్తాయి. కారులో వస్తున్న సచిన్‌కు ఆ అక్షరాలు కనిపించాయి. అభిమానితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడేలా చేశాయి. ఈ వీడియో క్లిప్‌ను సచిన్ టెండూల్కర్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇది క్విక్‌గా వైరల్ అయింది. అయిదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. -
ఆటో అవార్డ్స్ 2023 విన్నర్స్ జాబితా - పూర్తి వివరాలు
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 2023 ఆటో అవార్డ్స్ మూడో ఎడిషన్ విజేతల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఆటోమొబైల్ నిపుణులు, పరిశ్రమ నాయకులు, ఉన్నతాధికారులు, ఆటోమోటివ్ తయారీదారుల సమక్షంలో అవార్డుల ప్రధానం జరిగింది. ఫోర్ వీలర్, టూ వీలర్ విభాగాల్లో జరిగిన నామినేషన్స్‌లో అవార్డులు సొంతం చేసుకున్న వాహనాల జాబితా ఇక్కడ చూడవచ్చు 👉బడ్జెట్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ - హోండా షైన్ 100 👉ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్ - అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 👉స్కూటర్ ఆఫ్ ది ఇయర్ - హీరో జూమ్ 👉ప్రీమియం మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ - కేటీఎమ్ డ్యూక్ 390 👉మోస్ట్ ట్రస్టడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ - టీవీఎస్ మోటార్ కంపెనీ ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! 👉ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ (మాస్ మార్కెట్) - టాటా నెక్సన్ 👉డిజైన్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ వెర్నా 👉ఎస్యూవీ ఆఫ్ ది ఇయర్ - మారుతి సుజుకి జిమ్నీ 👉ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ ఐయోనిక్ 5 👉హై-టెక్ కార్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ ఐయోనిక్ 5 👉మోస్ట్ ట్రస్టడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ మోటార్ ఇండియా 👉మోస్ట్ ప్రామిసింగ్ కార్ ఆఫ్ ది ఇయర్ - ఎంజీ కామెట్ -
ఓలా ఎలక్ట్రిక్‌కు రూ.3,200 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వా హనాల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ తాజా గా రూ.3,200 కోట్ల నిధులను అందుకుంది. టెమసెక్ నేతృత్వంలోని ఇన్వెస్టర్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మొత్తాన్ని సమకూర్చాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపార విస్తరణకు, అలాగే తమిళనాడులోని కృష్ణగిరి వద్ద లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు ఈ నిధులను వెచి్చంచనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ద్విచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతోపాటు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడం.. అలాగే గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా వృద్ధిని వేగవంతం చేయాలని ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా చేసుకుంది. ‘ఆటోమొబైల్స్ రంగంలో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ యుగానికి ముగింపు పలకడమే మా లక్ష్యం. అంతర్జాతీయంగా ఈవీ హబ్‌గా మారే దిశగా భారత ప్రయాణంలో కంపెనీ నెలకొల్పుతున్న గిగాఫ్యాక్టరీ పెద్ద ముందడుగు. ఈవీలు, సెల్ విభాగంలో ప్రధాన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. స్థిర మొబిలిటీ వైపు వేగవంతంగా మళ్లడానికి తయారీని పరుగులు పెట్టిస్తున్నాం’ అని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కడప: కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో వల్లూరు మండల పరిధిలోని తోల్లగంగనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వల్లూరు ఎస్ఐ పెద్ద ఓబన్న తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్లకు చెందిన రాజుల మధుసూదన్‌రెడ్డి (28) కడపలోని రైల్వే విద్యుత్ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తుండే వాడు. ఆయన విధులు ముగించుకుని సోమవారం ఉదయం ఎర్రగుంట్లకు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. మార్గంమధ్యలో తోల్లగంగనపల్లె బస్టాపు వద్ద గంగాయపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు లక్ష్మీనరసింహ, మధు పాఠశాలకు వెళ్లడానికి లిఫ్ట్ అడిగారు. దీంతో వారిని ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని బయలుదేరాడు. అక్కడి నుంచి కొద్ది దూరంలో ఏ ఓబాయపల్లెకు చెందిన నిరంజన్‌రెడ్డి వస్తున్న ద్విచక్ర వాహనం, మధుసూధన్‌రెడ్డి ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. వారి వెనుకే కడప వైపు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న లారీ ద్విచక్ర వాహనాలను ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు చెల్లాచెదురుగా పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స కోసం కడప ఆసుపత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడ్డ మధుసూదన్‌రెడ్డిని ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కాగా ఆయనకు ఈ నెల 25వ తేదీన వివాహం జరగాల్సి వుందని సమాచారం. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి?
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ (Electric Two wheeler) కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారు ఆ వాహనాలపై తాము పొందిన డిస్కౌంట్‌ను ఆయా కంపెనీలకు వెనక్కి కట్టాల్సి రావచ్చు. ఫేమ్2 పథకం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తం రూ. 469 కోట్లు తిరిగి కట్టాలని భారీ పరిశ్రమల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా తమకు సబ్సిడీలు రద్దు చేసిన నేపథ్యంలో తాము కస్టమర్లకు ఇచ్చిన డిస్కౌంట్లను వారి నుంచి వెనక్కి కోరే అవకాశాన్ని పరిశీలించాలని ఆ ఏడు ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనను తెలియజేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సొసైటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు తాజాగా ఓ లేఖ రాసింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్ , ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక ప్రోత్సాహకాలను పొందినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో ఆయా కంపెనీలు పొందిన సబ్సిడీలను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంపోర్టెడ్ పార్ట్స్ వినియోగం ఫేమ్2 పథకం నిబంధనల ప్రకారం.. మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్లను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. కానీ ఈ ఏడు సంస్థలు విదేశాల దిగుమతి చేసుకున్న విడి భాగాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా ఈవీ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని పెంచడానికి ఉద్దేశించిన దశల తయారీ ప్రణాళిక (PMP) నిబంధనలను పాటించకుండా సబ్సిడీలను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అనామక ఈ-మెయిల్లు అందడంతో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడానికి 2019లో రూ. 10,000 కోట్లతో ఫేమ్2 ((ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రారంభించిన ఫేమ్ పథకానికి కొనసాగింపు. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్!
ప్రముఖ లగ్జరీ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ మార్కెట్లో అమ్మకాల్లో దూసుకెళ్తుంది. జూన్ నెలలో 26శాతం వృద్దిని సాధించి 77,109 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది జూన్‌లో 61,407 బైక్స్ అమ్మింది. భారత్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు ఏడాది క్రితం 50,265 యూనిట్లు అమ్ముడు పోగా..ఈ ఏడాది 34 శాతం పెరిగి 67,495 అమ్మినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2022 జూన్ లో 11,142 యూనిట్లను ఎగుమతి చేయగా.. గత నెలలో వాటి సంఖ్య 9,614 యూనిట్లతో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ బీ గోవింద రాజన్ మాట్లాడుతూ.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మోటారు సైకిళ్లతో తాము దేశీయంగా, గ్లోబల్ మార్కెట్లలో మంచి సేల్స్ నమోదు చేశామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ బైక్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఎలక్ట్రిక్ టూ వీలర్స్ జోరు తగ్గనుందా? కారణం ఇదే అంటున్న నిపుణులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరింత ప్రియం అయ్యాయి. ఇప్పటికే ప్రధాన కంపెనీలు వివిధ మోడళ్ల ధరలను పెంచాయి. ఇతర కంపెనీలు వీటిని అనుసరిస్తున్నాయి. ఫేమ్–2 పథకం కింద ఇచ్చే సబ్సిడీకి భారీ పరిశ్రమల శాఖ కోత విధించడమే మోడళ్లు ఖరీదవడానికి కారణం. భారత్‌లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరిగేందుకు 2015లో కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా (ఫేమ్) పథకం దేశీ ఈవీ రంగానికి బూస్ట్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) హెచ్చరించింది. సబ్సిడీ తగ్గుదల ఇలా.. 2023 జూన్ 1 లేదా ఆ తర్వాత రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఫేమ్–2 పథకం కింద సబ్సిడీని తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. దీని ప్రకారం కిలోవాట్ అవర్‌కు గతంలో ఇచ్చిన రూ.15,000 సబ్సిడీ కాస్తా ఇక నుంచి రూ.10,000 ఉంటుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో గతంలో ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. రానున్న రోజుల్లో పరిశ్రమ వాస్తవిక వృద్ధి చూస్తుందని బజాజ్ అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాగా, 2023 మే నెలలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 1,04,755 యూనిట్లు రోడ్డెక్కాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 57 శాతం అధికం. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తున్నాయన్న నేపథ్యం కూడా ఈ విక్రయాల జోరుకు కారణమైంది. ఓలా, టీవీఎస్, ఏథర్, బజాజ్, ఆంపియర్ టాప్–5లో నిలిచాయి. వృద్ధి వేగానికి కళ్లెం.. ప్రభుత్వ చర్యతో ఈ–టూ వీలర్ల వేగానికి కళ్లెం పడుతుందని ఎస్ఎంఈవీ తెలిపింది. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, ఈ–టూవీలర్ల మధ్య ధర వ్యత్యాసం అమాంతం పెరుగుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈవీల జోరు పెరిగే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతివ్వాలని అవేరా ఏఐ మొబిలిటీ ఫౌండర్ రమణ తెలిపారు. (ఇదీ చదవండి: భారీగా పెరిగిన వెహికల్ సేల్స్ - గత నెలలో అమ్మకాలు ఇలా..) కస్టమర్లు సన్నద్ధంగా లేరు.. భారత్‌లో ధర సున్నితమైన అంశం అని ఎస్ఎంఈవీ ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. ద్విచక్ర వాహనం కోసం అధికంగా ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరని స్పష్టం చేశారు. ‘పెట్రోలుతో నడిచే ద్విచక్ర వాహనాల్లో అధిక భాగం మోడళ్లు రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈవీ కోసం రూ.1.5 లక్షలకు పైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువ. మార్కెట్ వృద్ధి చెందే వరకు సబ్సిడీలను కొనసాగించాల్సిందే. భారత్‌లో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ఈవీల వాటా ప్రస్తుతం 4.9 శాతమే. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ప్రకారం ఇది 20 శాతానికి చేరుకోవడానికి నిరంతర రాయితీలు ఇవ్వాల్సిందే’ అని వివరించారు. (ఇదీ చదవండి: యూపీఐ నుంచి పొరపాటున డబ్బు పంపించారా? ఇలా చేస్తే మళ్ళీ వస్తాయ్..) వరుసలో బజాజ్ చేతక్.. బజాజ్ చేతక్ ధర రూ.22,000 పెరిగింది. దీంతో చేతక్ ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.1.44 లక్షలకు చేరింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఐక్యూబ్ ధర వేరియంట్‌ను బట్టి రూ.17–22 వేల మధ్య పెరిగింది. ఏథర్ 450ఎక్స్ ప్రో సుమారు రూ.8,000 అధికం అయింది. దీంతో ఈ మోడల్ ప్రారంభ ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.1,65,435లకు చేరింది. ఓలా ఎలక్ట్రిక్ టూ–వీలర్లు రూ.15,000 వరకు ప్రియం అయ్యాయి. ప్రస్తుతం ఎస్1–ప్రో రూ.1,39,999, ఎస్1 రూ.1,29,999, ఎస్1 ఎయిర్ ధర రూ.1,09,999 పలుకుతోంది. ఈ–స్కూటర్ మోడల్స్ ధరలను పెంచబోమని హీరో ఎలక్ట్రిక్ ఇప్పటికే తెలిపింది. -
ద్విచక్ర వాహనదారులకు ఊరట?..టూవీలర్లపై జీఎస్టీ తగ్గనుందా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని ప్రస్తుతం ఉన్న 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రభుత్వానికి విన్నవించింది. లక్షలాది మందికి అవసరమైన ఈ విభాగాన్ని లగ్జరీ వస్తువుగా వర్గీకరించకూడదని పేర్కొంది. ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్ ఛైర్మన్ నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, ఆటోమొబైల్ రంగాన్ని పర్యవేక్షిస్తున్న భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు ఫెడరేషన్ తెలిపింది. ‘ఈ సమయానుకూల, నిర్ణయాత్మక జోక్యం వల్ల ద్విచక్ర వాహనాలను మరింత సరసమైనవిగా చేయడంలో, డిమాండ్‌ను పునరుద్ధరించడంలో తోడ్పడుతుంది. గత కొన్నేళ్లుగా విక్రయాలలో గణనీయమైన తిరోగమనాన్ని చవిచూసిన పరిశ్రమను గాడిలో పెట్టేందుకు సాయపడుతుంది’ అని వివరించింది. తక్కువ ఖర్చుతో రవాణా.. ‘ద్విచక్ర వాహన పరిశ్రమ క్లిష్ట దశలో ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కఠిన ఉద్గార నిబంధనలు, కోవిడ్–19 అనంతర ప్రభావాలు వంటి సవాళ్లతో పోరాడుతోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గించి సామాన్యులకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్‌కు ఇది సరైన తరుణం. పన్ను తగ్గింపు పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఉపాధి అవకాశాలను సృష్టించడంలో, దేశ మొత్తం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అధిక జనాభాకు తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేసే విషయంలో ద్విచక్ర వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ప్రజా రవాణా తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇవి విస్తరించాల్సి ఉంది. కొన్నేళ్లుగా వివిధ ద్విచక్ర వాహనాల ధరలు గణనీయంగా పెరిగాయి. వినియోగదారులకు కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతోంది. ముడి పదార్థాల ధరలు పెరగడం, కఠినమైన ఉద్గార నిబంధనలు, అధిక పన్నులు, రుసుములతో సహా అనేక కారణాలు ఈ పెరుగుదలకు కారణం’ అని ఎఫ్ఏడీఏ తెలిపింది. తగ్గిన టూవీర్ల వాటా.. హోండా యాక్టివా ధర 2016లో రూ.52,000లు పలి కింది. 2023లో రూ.88,000లకు చేరింది. బజాజ్ పల్సర్ ధర 2016లో రూ.72,000 ఉంటే ఇప్పు డది రూ.1.5 లక్షలకు ఎగసింది. ద్విచక్ర వాహనాల ధరలలో నిరంతర పెరుగుదల తత్ఫలితంగా అమ్మకాల క్షీణతకు దారితీసింది. పరిశ్రమ వృద్ధి పథాన్ని పునరుద్ధరించడానికి జోక్యం అవసరం. జీఎస్టీ రేటు తగ్గింపు అత్యవసర అవసరాన్ని గు ర్తు చేస్తోంది. 2016లో భారత్‌లో జరిగిన మొత్తం ఆటోమొబైల్ విక్రయాలలో ద్విచక్ర వాహనాల వాటా ఏకంగా 78% ఉంది. 2020 నుండి నిరంతర ధరల పెరుగుదల కారణంగా టూవీలర్ల వాటా 2022–23లో 72%కి పడిపోయింది. ఇది ధరల పెరుగుదల ప్రభావాన్ని నొక్కి చెబుతోంది. జీఎస్టీ రేటును తగ్గించడం వల్ల ఇతర రవాణా విధానాల తో పోలిస్తే ద్విచక్ర వాహనాల పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా పరిశ్రమకు అమ్మకాలతోపాటు ఆదాయం అధికం అవుతుంది’ అని ఫెడరేషన్ ప్రెసి డెంట్ మనీష్ రాజ్ సింఘానియా వివరించారు. -
స్మార్ట్ కీతో యాక్టివా 125
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తాజాగా ఆధునీకరించిన ఇంజన్‌తో యాక్టివా 125 స్కూటర్‌ను నాలుగు వర్షన్స్‌లో విడుదల చేసింది. డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్–స్మార్ట్ వీటిలో ఉన్నాయి. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.81,342 నుంచి రూ.90,515 వరకు ఉంది. అయిదు రంగుల్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: స్వర్గంలో ఉన్న నానాజీ, నానీ.. నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం) స్టార్ట్/స్టాప్ ఫీచర్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఓపెన్ గ్లోవ్ బాక్స్, ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్‌తో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంది. రియల్ టైమ్ మైలేజ్, ట్యాంకులో ఉన్న ఇంధనంతో ప్రయాణించే దూరం, ఇంధనం ఎంత ఉంది, సగటు మైలేజ్, సమయం వంటి వివరాలను చూపే చిన్న డిజిటల్ స్క్రీన్ పొందుపరిచారు. ఇంధన సమర్థవంతమైన టైర్లను జోడించారు. స్మార్ట్ ఫైండ్, సేఫ్, అన్‌లాక్, స్టార్ట్ ఫీచర్లు గల స్మార్ట్ కీతో టాప్ ఎండ్ వేరియంట్ లభిస్తుంది. వాహనాల మధ్య ఈ స్కూటర్ ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్...: టీం మొత్తానికి ఉద్వాసన) -
వచ్చే నెలలో విడుదలకానున్న టూ వీలర్స్, ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను వినియోగించాలనే ఆసక్తికలిగిన కస్టమర్ల కోసం కంపెనీలు కూడా ఆధునిక వెహికల్స్ విడుదల చేస్తూనే ఉన్నాయి. ఎప్పటిలాగే వచ్చే నెలలో కూడా కొన్ని లేటెస్ట్ కార్లు, బైకులు దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్నాయి. వచ్చే నెల నుంచి బీఎస్6 పేస్-2 ఎమిషన్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొత్తగా విడుదలయ్యే వాహనాలు తప్పకుండా దానికి లోబడి ఉండాలి. సింపుల్ వన్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికీ విక్రయానికి రాలేదు, ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో గొప్ప ఆదరణ పొందిన ఈ టూ వీలర్ బుకింగ్స్ పరంగా కూడా ఉత్తమ వృద్ధిని కనపరిచింది. కాగా ఈ స్కూటర్ వచ్చే నెల ప్రారంభం నుంచి విక్రయానికి రానున్న సమాచారం. డుకాటీ మాన్స్టర్ ఎస్పీ: ద్విచక్ర వాహన ప్రియులకు ఎంతగానో ఇష్టమైన బైకులతో ఒకటైన డుకాటీ 2023 ఏప్రిల్ చివరి నాటికి తన మాన్స్టర్ ఎస్పీ బైక్ విడుదల చేయాలని ఆలోచిస్తోంది. కంపెనీ గతంలోనే 9 బైకులను విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో మరిన్ని డుకాటీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది. హోండా యాక్టివా 125 హెచ్- స్మార్ట్: హోండా మోటార్‌సైకిల్ దేశీయ మార్కెట్లో వచ్చే నెలలో ఇప్పటికే విక్రయానికి ఉన్న యాక్టివా స్కూటర్లో కొత్త వెర్షన్ విడుదల చేయనుంది. దీని పేరు 'హోండా యాక్టివా 125 హెచ్-స్మార్ట్'. దీనికి సంబంధించిన చాలా వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. కావున డిజైన్ పరంగా పెద్ద తేడా లేనప్పటికీ.. రిమోట్ ఇంజిన్ స్టార్ట్, కీలెస్ ఇగ్నీషన్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయని తెలిసింది. 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్: ఇప్పటికే భారతదేశంలో విడుదల కావాల్సిన 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్ బైకులు కొన్ని అనివార్య కారణాల వల్ల లాంచ్ కాలేదు. అయితే ఇవి రెండూ వచ్చే నెలలో విడుదలకానున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ బైకులకు సంబంధిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
త్వరలో విడుదలకానున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇదే
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేవారు రోజురోజుకి ఎక్కువవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాపులర్ కంపెనీల దగ్గర నుంచి, చిన్న కంపెనీల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో ఎలక్ట్రిక్' ఒక కొత్త స్కూటర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. హీరో ఎలక్ట్రిక్ త్వరలో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్‌ను కంపెనీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇందులో హీరో కొత్త స్కూటర్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఆప్టిమాను పోలి ఉందని తెలుస్తోంది. ఇది ఈ నెల 15న (2023 మార్చి 15) విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, దీని ఫ్రంట్ కౌల్ టాప్ పొజిషన్లో ఎల్ఈడీ హెచ్ల్యాంప్, సెంటర్లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కర్వీ సీట్, గ్రాబ్ రెయిల్, బ్లూ పెయింట్ థీమ్‌తో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రానున్న ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. (ఇదీ చదవండి: కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్) కనెక్టెడ్ టెక్నాలజీ కూడా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇంకా చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది. ఇవన్నీ లాంచ్ సమయంలో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది. ఇప్పటికే కంపెనీ ఏడు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇప్పుడు రాబోయే మోడల్ 8 వ స్థానంలో ఉంటుంది. A new era of intelligent and sustainable mobility is all set to dawn! Are you ready to experience the newest electrifying ride from Hero Electric? Watch this space to know more 🛵⚡#TheSmartMove pic.twitter.com/0nH6eSvFkO — Hero Electric (@Hero_Electric) March 12, 2023 -
ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా యూఎస్‌లో 63 శాతం, మరి భారత్‌లో ఎంతో తెలుసా?
ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు 2030 నాటికి భారత్‌లో 2.2 కోట్ల యూనిట్లకు చేరతాయని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. అందుబాటు ధరలో రవాణా సౌకర్యాలకు డిమాండ్, కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యం ఇందుకు కారణమని వివరించింది. ‘2022లో దేశంలో జరిగిన మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా కేవలం 3 శాతమే. అదే యూఎస్‌లో అయితే ఈవీల వాటా ఏకంగా 63 శాతం, చైనాలో 56 శాతం ఉంది. పెట్రోల్‌తో పోలిస్తే ఈవీలతో యాజమాన్య ఖర్చులు చాలా తక్కువ. అందుకే క్రమంగా కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. దిగుమతులను ఆసరాగా చేసుకుని చాలా బ్రాండ్లు ఈ రంగంలోకి ప్రవేశించాయి. మార్కెట్ పరిపక్వత చెంది, నిబంధనలు కఠినతరం అయితే ఈ రంగం ఏకీకృతం (కన్సాలిడేట్) అవుతుంది’ అని తెలిపింది. ప్రయాణ ఖర్చు తక్కువ.. ‘కొత్త కొత్త బ్రాండ్ల చేరికతో మోడళ్లను ఎంపిక చేసుకోవడానికి కస్టమర్లకు అవకాశం ఉంటుంది. ఫీచర్లు, రోజువారీ వ్యయం, వాహన ధర ఆధారంగా ఈవీ కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ టూ వీలర్లతో పోలిస్తే ప్రయాణానికి అయ్యే ఖర్చు తక్కువ. ‘ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది’ అన్న వినియోగదార్ల ఆందోళన పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా ఉంది. ఈవీ అమ్మకాలు పెరిగేకొద్దీ సుదూర ప్రయాణాలకు బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతుంది. ప్రధానంగా వేగంగా చార్జింగ్ పూర్తి అయ్యేలా ఫాస్ట్ చార్జింగ్ వసతులు ఉండాలి. ఈవీలు సింహ భాగం చేజిక్కించుకునే వరకు ఫేమ్, పీఎల్ఐ పథకాలు కొనసాగాలి’ అని నివేదిక వివరించింది. -
హీరో నుంచి గ్రాండ్ లాంచ్.. తక్కువ ధరకే 110 సీసీ స్కూటర్!
గురుగ్రామ్: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ కొత్తగా జూమ్ పేరిట 110 సీసీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 68,599–76,699గా ఉంటుందని సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రణ్జీవ్జిత్ సింగ్ తెలిపారు. స్కూటర్ల మార్కెట్లో 110 సీసీ వాహనాల వాటా అత్యధికంగా 60 శాతం పైగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పోర్టీ స్కూటర్ల విభాగంలో ఉన్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణమైన హీరో జూమ్‌లో పూర్తి డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలర్ ఐడీ, ఎస్ఎంఎస్ అప్డేట్స్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్, మొబైల్ చార్జర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం 2022–23 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో హీరో 2,82,169 స్కూటర్లను విక్రయించింది. చదవండి: పన్ను ప్రయోజనాలు కావాలంటే.. ఈ పోస్టాఫీస్ పథకాలపై ఓ లుక్కేయండి! -
అద్భుతమైన బైక్.. దీనికి ముందువైపు చక్రం బదులుగా..
మనదేశంలో వీథుల్లోను, రహదారుల్లోను మంచు పేరుకుపోయే సమస్య దాదాపు లేదు గాని, ప్రతిఏటా శీతకాలంలో పాశ్చాత్యదేశాల్లో ఇదొక పెద్ద సమస్య. మంచులో చక్రాలు చిక్కుకుపోయి వాహనాలు ముందుకు సాగవు. మంచుదారిలో కాలినడక మరీ ప్రమాదకరం. రహదారులపై మంచు పేరుకుపోయినా సరే, ఏమాత్రం ఇబ్బందిలేకుండా ప్రయాణించడానికి వీలుగా అమెరికన్ కంపెనీ ‘మూన్‌బైక్స్’ ఇటీవల ఒక అద్భుతమైన బైక్‌ను రూపొందించింది. దీనికి ముందువైపు చక్రం బదులు, మంచును చీల్చుకుపోయే పదునైన పరికరాన్ని అమర్చారు. వెనుకవైపు యుద్ధట్యాంకుల మాదిరిగా చైన్లతో కూడిన రెండు చక్రాలు ఉండటం వల్ల ఎగుడుదిగుడు మంచుదారిలో కూడా ఈ బైక్ మహాజోరుగా సాగిపోగలదు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్ కావడం వల్ల దీనివల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దీని ధర 8500 డాలర్లు (రూ.6.94 లక్షలు) మాత్రమే! చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
బుల్లెట్: రూ. 1.5 లక్ష నుంచి రూ. 3.5 లక్షల వరకు.. నాడు మిలిట్రీ బైక్, కానీ.. నే
వైరారూరల్ (ఖమ్మం): బుల్లెట్.. దానిపై వెళ్తుంటే ఉండే ఆ రాజసం.. దాని నుంచి వచ్చే ఫైరింగ్.. జనాలు చూసే తీరూ ప్రతీది ప్రత్యేకమే.. బుల్లెట్ అంటేనే ఒకప్పుడు ఉన్నత వర్గాల వాహనంగా చలామణి అయ్యింది. కానీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా బుల్లెట్‌పై రయ్.. రయ్.. మంటూ దూసుకుపోతున్నారు. ఇది వరకు గ్రామాల్లో అయితే పలుకుబడి ఉన్నవారు, రాజకీయంగా మంచి పట్టున్నవారు వీటిని ఎక్కువగా వాడేవారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. మార్కెట్లోకి ఇలా.. ఈ బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని 1955లో ఇండియాన్ ఆర్మీ బోర్డర్ సెక్యూరిటీ కోసం ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. అనంతరం 1960 నుంచి స్పేర్ పార్ట్స్‌ను ఇంగ్లాండ్ నుంచి తెప్పించి ఇండియాలోనే బుల్లెట్ ద్విచక్రవాహనాన్ని ఫిటింగ్ చేసే వారు. ఇవన్నీ గతంలో పెట్రోల్‌తో నడిచేవి. దాని తర్వాత కొన్నేళ్ల పాటు కొంత మంది మెకానిక్‌లు పెట్రోల్ ఇంజన్ తొలగించి డీజిల్ ఇంజన్‌తో రీమోడలింగ్ చేసి మార్కెట్లో విక్రయించేవారు. ఆ సమయంలో డీజిల్ బుల్లెట్లకు భారీ డిమాండ్ ఉండేది. అనంతరం 1994–2000 వరకు బుల్లెట్ కంపెనీ వారే డీజిల్ బుల్లెట్‌ను విడుదల చేశారు. కాలక్రమేణా పొల్యూషన్ కారణంగా 2000 సంవత్సరంలో డీజిల్ బుల్లెట్ వాహనాలు పూర్తిస్థాయిలో బ్యాన్ అయ్యాయి. దాని తర్వాత పలు రకాల బుల్లెట్ ద్విక్రవాహనాలు కొత్త వర్షన్ మోడల్స్‌తో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్లో కాస్ట్‌ఐరన్ స్టాండర్డ్, ఎలక్ట్రా, క్లాసిక్, థండర్బాడ్, ఇంటర్‌స్పెక్టర్, కాంటినంటల్ జీటీ, హిమాలయం, హంటర్ వంటి మోడల్స్ వాహనాలు మార్కెట్లోకి విడుదలై యువతతో పాటు మధ్య వయస్సు గల వ్యక్తులను సైతం ఆకర్షిస్తున్నాయి. (చదవండి: సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. తెలంగాణలో మరీ ఇంత ఘోరమా?) బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేస్తున్న యువకులు సీసీలపై యువత మోజు.. ప్రస్తుతం మార్కెట్లో 100 నుంచి 180 సీసీ గల ద్విచక్రవాహనాలే అధిక శాతం ఉన్నాయి. ఇటువంటి ద్విచక్రవాహనాలపై మక్కువ లేని యువత బుల్లెట్ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. బుల్లెట్ వాహనం ఒక్కొక్క మోడల్ ఒక్కో విధంగా సీసీ కలిగి ఉంటుంది. బుల్లెట్ వాహనాలలో 350, 411, 500, 650 సీసీ సామర్థ్యంతో కూడినవి దొరుకుతున్న నేపథ్యంలో.. వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా బుల్లెట్ వాహనానికి అనుగుణంగా ఉండేందుకు షోరూంతో వచ్చిన సైలెన్సర్‌ను తొలగించి బుల్లెట్‌పై ఉన్న మోజుతో అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్ అమర్చుకోని ప్రయాణిస్తూ బుల్లెట్ బైక్‌లను ఆస్వాదిస్తున్నారు. ధర లెక్కచేయకుండా.. బుల్లెట్ ధరతో కారు కొనుగోలు చేయవచ్చు. కానీ యువతతో పాటు మధ్య వయస్సు గల వ్యక్తులు సైతం కారుపై ఆసక్తి కనబర్చకుండా బుల్లెట్ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. బుల్లెట్ బండ్ల ధరలు మోడల్‌ను బట్టి వాటి ధర ఉంటుంది. రూ. 1.50 లక్ష నుంచి రూ. 3.50 లక్షల వరకు బుల్లెట్ బైకుల ధరలు ఉన్నాయి. ఇంతటి ధరను కూడా లెక్క చేయకుండా యువత ఈ బుల్లెట్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారంటే.. వీటి క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులోనే బుల్లెట్ ధర రూ. 3.50 లక్షలు వరకు ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్తులో వీటి ధర కొంత శాతం మేర పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ బుల్లెట్ కొనుగోలుపై యువత వెనుకడుగు వేయకపోవడం కొసమెరుపు. బుల్లెట్ రైడ్.. బుల్లెట్ ద్విచక్రవాహనాలు గంటకు 80 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న విహారయాత్రలకు ఈ బుల్లెట్ వాహనాలపై ప్రయాణాలు చేయడం పరిపాటిగా మార్చుకున్నారు. రవాణా సౌకర్యార్థం బుల్లెట్ బండ్లు అనుకూలంగా ఉండడం వలన అధికశాతం మంది బుల్లెట్‌ను కొనుగోలు చేసుకుంటూ.. వీటిపై తమకు ఉన్న మక్కువను చూపుతున్నారు. (చదవండి: వరంగల్‌లో విషాదం.. బాలుడిని చంపేసిన ‘చాక్లెట్’) -
Fact Check: బైక్‌పై బాలుడి మృతదేహం వార్తల్లో అసలు వాస్తవం ఇదీ..
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం బీచ్‌లో మృతి చెందిన బాలుడిని ద్విచక్రవాహనంపై తరలించారని, పోలీసులు సరిగా స్పందించలేదన్న వార్తల్లో వాస్తవం లేదని కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. పోలీసులు వాహనం ఏర్పాటు చేయలేదని చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసినా, పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు బాలుడి మృతిపై కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటన చేసింది. పోలీసుల ప్రకటన ప్రకారం.. గొడుగు పేటకు చెందిన గోళ్ల నవీన్ కుమార్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర స్నానానికి మంగినపూడికి ఆదివారం వెళ్ళాడు. ఈ క్రమంలో అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయ్యాడు. తనతో కలిసి స్నానానికి వెళ్లిన మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకుని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న స్థానిక రాబర్ట్ సన్ పేట ఇన్స్పెక్టర్, బందరు తాలూకా, ఆర్ పేట ఎస్ఐలు, మెరైన్ ఎస్ఐ, సిబ్బంది బీచ్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు గల్లంతైన సమాచారం తల్లిదండ్రులకు తెలియపరిచారు. చీకటి పడే వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజాము నుంచి గాలింపును తిరిగి కొనసాగించారు. పెదపట్నం, ఇంతేరు చిన్న గొల్లపాలెం వరకు ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. మరోవైపు.. పెదపట్నం బీచ్ ఒడ్డుకు బాలుడి మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా సంఘటన స్థలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై బాలుడి మృదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. బాలుడు మృతదేహం పెదపట్నం బీచ్ వద్ద లభ్యమైందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ద్విచక్ర వాహనంపై వస్తున్న బాధిత కుటుంబాన్ని ఆపి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి బాలుడి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో పోలీసు వారు సరైన గాలింపు చర్యలు చేపట్టలేదని, మృతదేహాన్ని తరలించడానికి సైతం వాహనం ఏర్పాటు చేయలేదని, సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది అసత్యాలను ప్రచారం చేశారు. గాలింపు చర్యలు వేరు వేరు ప్రాంతంలో జరగటం వలన పెదపట్నం బీచ్ వద్దకు చేరుకునే సరికి సమయం పట్టింది గాని, ఇందులో పోలీసు వారు సరిగా స్పందించలేదన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రచారం చేసిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం తప్పదని పోలీసులు హెచ్చరించారు. పోలీసు వారిని సంప్రదించి ఎలాంటి వివరణ తీసుకోకుండా తమప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించాలని చూస్తే చర్యలు తప్పవని బందరు డీఎస్పీ మాసుం భాష హెచ్చరించారు. ఇదీ చదవండి: Fact Check: 'ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం' -
ఈవీ.. బేఫికర్..
-
ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్మెట్ ఉంటేనే ప్రవేశం
ముంబై: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై హెల్మెట్ లేకుండా ప్రవేశం లభించదు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇటీవల జారీ చేసిన ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు ద్విచక్రవాహనాల్లో వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. లేనట్లయితే ప్రవేశం లభించదు. కొంతకాలంగా రహ దారులపై జరిగే ప్రమాదాలలో అత్యధికంగా ద్విచక్రవాహనాలే ప్రమాదానికి గురవుతున్నాయి. దీంతో ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మందికి తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధగా కొన్ని సూచనలు చేసింది. హైకోర్టు చేసిన సూచనల మేరకు రాష్ట్ర రవాణా శాఖ జనజాగృతి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ‘ఎన్నో జన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ హెల్మెట్ ధరించడం విషయంలో అనుకున్న ఫలితాలు రావడం లేదనీ, అందుకు ఇకనుంచి కఠినమైన చర్యలు చేపట్టాలనీ నిర్ణయించినట్లు రవాణా శాఖ కమిషనర్ అవినాశ్ డాక్టె తెలిపారు. హెల్మెట్ లేని వారెవ్వరినీ ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించకూడదనీ, ఉన్నతాధికారులైనా, సామాన్యులైనా అందరికీ ఈ నియమం వర్తిస్తుందన్నారు. చదవండి: (సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గొర్రెల కాపరి..) ఈ నిర్ణయానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు, జన చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా హెల్మెట్ ధారణ విషయంలో నిర్లక్ష్యం వహించే ద్విచక్రవాహనదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామనీ అవినాష్ డాక్టె వెల్లడించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని పరిపాలనా శాఖకు చెందిన అన్ని ఆఫీసుల్లో, విద్యా సంస్థల్లో, ఇతర విభాగాలకు చెందిన కార్యాలయాల్లో కూడా హెల్మెట్ తప్పని సరిగా ధరించాలనే నియమాన్ని కఠినంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి -
బిడ్డకు హెల్మెట్.. సూపర్ తల్లి! కారులో వెళ్తూ వీడియో తీసిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి, బంజారాహిల్స్: రోడ్డు ప్రమాదాలు నగరంలో అంతకంతకు పెరుగుతున్నాయి. బయటికి వెళ్లిన వాహనదారులు ఇంటికి క్షేమంగా వచ్చేవరకు ఆందోళనకరంగా గడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైనప్పుడు తలకు దెబ్బలు తగిలి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎంతగా ప్రచారం చేస్తున్నా చాలా మందికి పట్టింపు ఉండటం లేదు. అయితే కొంత మంది మాత్రం తమతో పాటు తమ పిల్లలు, వాహనాలు నడిపే సమయంలో భద్రంగా ఉండాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా శిరస్త్రాణం ధరిస్తున్నారు. బుధవారం నానక్‌రాంగూడ చౌరస్తాలో ఓ మహిళ తాను హెల్మెట్ ధరించడమే కాకుండా స్కూల్‌కు తీసుకెళ్తున్న నాలుగేళ్ల కూతురికి కూడా హెల్మెట్ ఏర్పాటు చేసి స్కూటీ నడిపిస్తున్న దృశ్యం తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ముచ్చటపడ్డ ఈ దృశ్యాన్ని ఆమె వీడియో తీసి ట్విట్టర్ వేదికగా షేర్చేసుకోగా వేలాది మంది ఆ వీడియోకు ఫిదా అయ్యారు. తల్లి తానే కాకుండా తన కూతురికి కూడా హెల్మెట్ ధరించి స్కూటీ నడిపిస్తూ తనకు స్ఫూర్తిగా నిలిచిందంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రతి ఒక్కరు హె ల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాంటూ సందేశాన్నిచ్చింది. Inspiring Mother & Daughter duo I ran into at Nanakram guda chourastha today !!! Wear Helmet & Be safe 😊🙏🏻 pic.twitter.com/0RfV6Bj2rH — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 23, 2022 -
టూ వీలర్ ప్రీమియంతో భారీ వాహనాలకు ఇన్సూరెన్స్.. బాగోతం బట్టబయలు
సాక్షి, అనంతపురం: జిల్లాలో వెహికిల్ ఇన్సూరెన్స్ బాగోతం బట్టబయలైంది. టూవీలర్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లతో ఆటోలు, కార్లు, లారీలు, బస్సులకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. రవాణా శాఖ అధికారులకు అనుమానం రావడంతో ఇన్సూరెన్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. టూవీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం కేవలం రూ. 1,500 లోపే ఉంటుంది. అదే ఆటోలు, కార్లు, లారీలకు అయితే రూ.10 వేల నుంచి రూ.80 వేల దాకా ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్దమొత్తంలో ఎందుకు చెల్లించాలనుకున్న కొందరు వాహనదారులు.. అక్రమార్కులను ఆశ్రయిస్తున్నారు. దీంతో టూవీలర్ ప్రీమియంతోనే భారీ వాహనాలకు దళారులు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీనిపై అనంతపురం రవాణాశాఖ అధికారులకు అనుమానం రావడంతో ఇన్సూరెన్స్ అక్రమాలు బయటపడ్డాయి. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు సమర్పించిన 252 మందికి అనంతపురం డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ శివరాంప్రసాద్ నోటీసులు జారీ చేశారు. -
Viral Video: ద్విచక్రవాహన దారుడిని కుమ్మేసిన ఆవు
-
బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..
సాక్షి, కుత్బుల్లాపూర్: ఒక ద్విచక్ర వాహనానికి ఏకంగా 65 చలాన్లు ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. సుచిత్ర లయోలా కాలేజీ వద్ద బుధవారం రాత్రి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అల్వాల్‌కి చెందిన సయ్యద్ సాజిద్ (టీఎస్ 10 ఈపీ 8619) ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రికార్డులు పరిశీలించిన అనంతరం చలాన్ల గురించి ఆరా తీయగా 64 ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 23,580 రూపాయలు అపరాధ రుసుం ఉన్నట్లు తెలుసుకుని రసీదు ఇచ్చి వాహనాన్ని సీజ్ చేశారు. అయితే ఈ వాహన వివరాలు తనిఖీ చేయగా ఉమారామ్నగర్ అల్వాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా తేలింది. అయితే సదరు వాహనం తనదంటే తనది అని ఇద్దరూ మొండికేయడంతో వాహనానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు తీసుకురావాలని ఇద్దరికీ సూచించామని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చదవండి: Hyderabad: బైక్‌పై చలాన్లు చూసి షాకైన పోలీసులు విల్లాలో చోరీ నిజాంపేట్: సోలార్ ఫెన్సింగ్‌ను తొలగించి ఓ విల్లాలో దొంగతనానికి పాల్పడిన సంఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పోలీసులు తెలిపిన వివరాలు. బాచుపల్లిలోని శ్రీనివాస లేక్వ్యూలోని పసుపులేటి వెంకట శివకుమార్‌కు చెందిన విల్లాలోకి దొంగలు ప్రవేశించి రెండున్నర తులాల బంగారు హారం, 20 తులాల రెండు వెండి ప్లేట్ల ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
వివాహమై ఏడాది కాకముందే.. భార్యభర్తలు
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులు మృతిచెందారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన శరవణన్(39), నివేద(37) దంపతులు ఈ నెల 8వ తేదీ ద్విచక్ర వాహనంపై తిరుత్తణికి వెళుతున్నారు. పట్రపెరంబదూరు వద్ద వెనుక నుంచి లారీ ఢీకొనడంతో గాయపడ్డారు. తిరువళ్లూరులో ప్రథమ చిక్సిత అనంతరం చెన్నై రాజీవ్‌గాంధీ వైద్యశాలకు తరలించారు. ఈ నెల 10న నివేద మృతి చెందగా, శనివారం శరవణన్ మృతి చెందాడు. వివాహమై ఏడాది కాకముందే భార్యభర్తలు కన్నుమూయడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నంబర్ ప్లేట్‌పై ‘అప్నా టైమ్ ఆయేగా’.. ఇక నీ టైం అయిపోయింది!
సాక్షి, నల్లకుంట: నంబర్ ప్లేట్‌పై నంబర్ కనిపించకుండా ట్రాఫిక్ వయోలెన్స్‌కు పాల్పడిన ఓ మైనర్‌పై కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. సీఐ మొగిలిచర్ల రవి కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం ఓయూ ఎన్సీసీ ఎక్స్ రోడ్స్ వద్ద నల్లకుంట సెక్టార్–2 పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో విద్యానగర్ చర్చి కాలనీకి చెందిన ఓ మైనర్ (16) హీరో మ్యాస్ట్రో ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. వాహనం నంబర్ ప్లేట్‌పై నల్లటి తొడుగు ఉండడంతో ఆ వాహనాన్ని వెంబడించిన పోలీసులు విద్యానగర్ చర్చి వద్ద నిలిపి వేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో పోలీసులు పంపించే ఈ చలానాల నుంచి తప్పించుకోవడానికి వెనుక నంబర్ ప్లేట్‌పై మాస్క్ లాంటి నల్లటి ఓ తొడుగును తొడిగాడు. దానిపై ‘అప్నా టైమ్ ఆయేగా’ అనే స్లోగన్ రాశాడు. ఆర్సీ చెక్ చేయగా వాహన నంబర్ టీఎస్11ఈసీ 7505 అని ఉంది. ఇక ఏముంది అప్నా టైమ్ ఆయేగా కాదు ఇప్పుడు పోలీసుల టైం వచ్చిందంటూ మోటారు వాహన చట్టం ప్రకారం నల్లకుంట పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. -
అమ్మో పాము.. యువతి వాహనంపై వెళ్తుండగా..
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, ఒక్కసారిగా బండిలో నుంచి తాచుపాము బయటికొచ్చి పడగ విప్పి పైకి లేస్తే.! అమ్మో.. ఇంకేమైనా ఉందా? అంటారా? పైగా ఓ యువతి వాహనం నడుపుతుండగా.. సరిగ్గా అదే జరిగింది గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిలోని కొత్తూరుకు చెందిన ఝాన్సీ ఇంటి దగ్గర నుంచి ద్విచక్రవాహనంపై విజయవాడ వెళ్లి తిరుగు ప్రయాణమైంది. ఉండవల్లి సెంటర్లోని తాడేపల్లి రోడ్డులోకి వచ్చేసరికి ద్విచక్రవాహనం ఎదుటి డోమ్‌లో నుంచి తాచుపాము ఒక్కసారిగా పడగ విప్పి పైకి లేచింది. భయంతో బిత్తరపోయిన ఝాన్సీ బండిని వదిలేసింది. దీంతో కంగారు పడ్డ పాము మళ్లీ ద్విచక్రవాహనం లైట్ డోమ్‌లోకి వెళ్లింది. ఈ లోగా స్థానికులు అక్కడికి చేరుకోగా, వాహనంలో పాము ఉన్న విషయాన్ని యువతి వారికి తెలిపింది. దీంతో వారు మెకానిక్ సాయంతో ద్విచక్రవాహనం డోమ్ విప్పదీసి, పామును బయటకు తీసి చంపేశారు. రెండు గంటల పాటు పాము బండిలోనే అటూఇటూ తిరగడంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చదవండి: దారుణం: పాము మెడకు కండోమ్.. ఇద్దరూ అన్యోన్యంగా.. అంతలోనే ఏమైందో.. -
వింత సంఘటన: దెయ్యం పనేనా!
అహ్మదాబాద్: గుజరాత్లో వింత సంఘటన చోటుచేసుకుంది. ఇంటిముందు పార్క్ చేసి ఉన్న ఓ ద్విచక్రవాహనం అర్థరాత్రి దానికి అదే కదిలిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియోను అంబర్ జైదీ అనే ట్వీటర్ యూజర్ ఖాతాలోని ఈ పోస్ట్ వైరల్‌గా వారింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదెలా సాధ్యమంటూ అక్కడ ఏముందో తెలుసుకునే పనిలో పడ్డారు. ‘కెమెరాలో రికార్డు అయ్యింది.. లేదంటే ఎవరూ నమ్మేవారు కాదు’ అంటూ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. (చదవండి: డ్రైవర్ లేకుండా ముందుకెళ్లిన బస్.. వీడియో వైరల్) 30 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో నిశ్శబ్ధంగా ఉన్న వీధిలో అర్థరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న వాహనం ఉన్నట్టుండి దానికి అదే ముందుకు కదిలింది. అలా కదులుతూ టర్న్ చేసుకుంటుండగా ఆ వాహనం కింద పడిపోయింది. అయితే దానిపై ఎవరూ లేకపోవడంలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘నమ్మలేక పోతున్న.. దెయ్యాలు నిజంగా ఉంటాయి’, ‘ఆత్మలు ఉంటాయడానికి ఇదే ఉదహరణ’, ‘ఎవరిదో ఆత్మ ఈ బండిలో దూరింది’ అంటూ నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను) -
79 శాతం ద్విచక్రవాహనదారులు, పాదచారులే..
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల్లో పేదల బతుకులు చితికిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఈ ప్రమాదాల్లో ఎక్కువగా పేదలే వీటి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇలా మరణిస్తున్న వారిలో తగిన జీవనభృతి, ఉపాధి ఆదాయం వంటివి లేనివారే అధికంగా ఉంటున్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు కలిపి 79 శాతం మంది ఉంటున్నారని ఇటీవల జరిపిన విస్తృత పరిశీలనల్లో వెల్లడైంది. వివిధ అంశాలపై సర్వే డేటా క్రోడీకరణ దేశవ్యాప్తంగా 20 నగరాల్లోని 54 ఆసుపత్రుల్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు, ఈ ప్రమాదాల్లో మరణించిన వారి స్థితిగతులు, ఇతర అంశాలపై సేకరించిన సమాచారంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీఆర్ఐపీపీ ఐఐటీ (ఢిల్లీ) ఆధ్వర్యంలోని బృందంతో పాటు, డీఐఎంటీఎస్ వేర్వేరు రూపాల్లో పోలీస్స్టేషన్ల నుంచి ఎఫ్ఐఆర్లు, ఇతరత్రా సేకరించిన సమాచారాన్ని ఒకచోట చేర్చి రోడ్డు ప్రమాదాల కారణంగా ఆర్థికంగా, సామాజికంగా పడే భారం, ప్రభావాన్ని పరిశీలించారు. వివిధ అంశాలకు సంబంధించి సేకరించిన సమాచారం, డేటాను క్రోడీకరించి రోడ్డు ప్రమాదాల వల్ల సామాజిక–ఆర్థిక పరంగా పడే భారం, ఖర్చులపై కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రిత్వశాఖకు నివేదికను అందజేసినట్టు సమాచారం. అయితే ఈ నివేదికను ఇంకా కేంద్రం బహిర్గతపరచలేదు. ఎఫ్ఐఆర్ల విశ్లేషణ పోలీస్స్టేషన్ల నుంచి సేకరించిన ఎఫ్ఐఆర్లను విశ్లేషించినపుడు దాదాపు 79 శాతం రోడ్డు ప్రమాద మృతులు ద్విచక్ర వాహనదారులు (40 శాతం), పాదచారులు (39 శాతం) ఉన్నట్టుగా తేలింది. తరచుగా ప్రమాదాల బారిన పడుతున్న వారి జాబితాలో టూవీలర్‌పై ప్రయాణించే వారు, పాదచారులు ఉండటంతో ఇవి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ప్రస్తుతం దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది. రోడ్డుపై ప్రయాణించే వారి భద్రత, పరిరక్షణకు కఠినంగా నిబంధనల అమలు, తగిన మౌలిక సదుపాయాల కల్పన, ఏవైనా ప్రమాదాలు జరిగినపుడు వెంటనే వైద్య, ఆరోగ్యపరంగా ఆదుకునేలా వివిధ రకాల సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ అధ్యయనం నొక్కి చెప్పింది. సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలు ► రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారిలో 34శాతం పేదలు ఎలాంటి ఆదాయం లేనివారే ► 28 శాతం మంది మృతులు నెలకు రూ.10–20 వేల మధ్యలో సంపాదిస్తున్నవారు ► చనిపోయిన వారిలో 3 శాతం మంది మాత్రమే నెలకు రూ.50 వేలకు పైగా ఆదాయం ఉన్నవారు ► మృతుల్లో 67 శాతం మంది 18 నుంచి 45 ఏళ్ల మధ్యలోని వారు (కుటుంబ పోషకులు, సంపాదనాపరులు) ► ప్రమాదాల్లో మృతిచెందిన ద్విచక్ర వాహనదారులు 40 శాతం, పాదచారులు 39 శాతం, కార్లు, ట్యాక్సీలు, ఎస్‌యూవీల్లోని వారు 8.8 శాతం ► ప్రమాదాలు సంభవించిన 7 శాతం కేసుల్లో అక్కడికక్కడే మరణాలకు కారణమవుతుండగా, 66 శాతం తీవ్ర గాయాల పాలవుతున్నారు ► రోడ్డు ప్రమాదాలకు గురయ్యాక ఆసుపత్రుల్లో చేర్చిన మృతుల్లో 59 శాతం మంది టూవీలర్ నడిపేవారు, 15.5 శాతం పాదచారులు -
పరీక్షకు వెళ్లొస్తూ.. వంకలో కొట్టుకుపోయిన దంపతులు
సాక్షి, కమలాపురం : కమలాపురం–ఖాజీపేట రహదారిలో పాగేరు వంతెనపై ద్విచక్ర వాహనంలో వెళుతూ నీటి ఉధృతికి దంపతులు గల్లంతయ్యారు. స్థానికులు గమనించి భార్యను రక్షించి బయటకు తీశారు. భర్త ఆచూకీ లభించలేదు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు... మండలంలోని చిన్న చెప్పలికి చెందిన శరత్ చంద్రారెడ్డికి కడపకు చెందిన ఐశ్వర్యతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారు కడపలోనే నివాసం ఉంటున్నారు. శరత్ చంద్రారెడ్డి కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పీఆర్ఓగా పని చేస్తున్నాడు. గురువారం ఎడ్ సెట్ పరీక్ష రాసేందుకు ఐశ్వర్యను చాపాడుకు తీసుకెళ్లాడు. పరీక్ష ముగిసిన అనంతరం సాయంత్రం కమలాపురం మీదుగా స్వగ్రామం చిన్న చెప్పలికి ద్విచక్ర వాహనంలో బయలు దేరారు. పాగేరు వంకలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై కొంత దూరం రాగానే ప్రవాహ వేగానికి అదుపు తప్పడంతో ద్విచక్ర వాహనంతో పాటు భార్యా భర్తలిద్దరూ వరద నీటిలో కొట్టుకొని పోయారు. స్థానిక యువకుడు నీటిలో దూకి ఐశ్వర్యను రక్షించాడు. శరత్ చంద్రారెడ్డి అప్పటికే కనబడకుండా పోయాడు. తహసీల్దార్ విజయ్ కుమార్, ఎస్ఐ రాజారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఓఓ నాగేశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శిక్షణ పొందిన అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయినా శరత్ ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు ఆపివేశారు. తన భర్త కోసం కొండంత ఆశతో వంతెన ఒడ్డున ఐశ్వర్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన చూసినవారు కంట తడి పెట్టారు. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు, ఏడు నెలల కుమార్తె ఉంది. -
ట్రిపుల్... ట్రబుల్
సాక్షి, సిటీబ్యూరో: ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం సర్వసాధారణమైంది. ప్రధానంగా యువతే ఈ ఉల్లంఘనకు పాల్పడుతూ నిత్యం ప్రమాదాల బారినడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్ హరా దర్వాజా వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నగరంలో తరచు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మంగళ్‌హాట్ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుడు సైతం మద్యం తాగి ఉన్నారని, దీని వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించే వారిలో యువకులే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణంగా టూ వీలర్స్ వినియోగించేది వీరే ఎక్కువ కావడంతో ప్రమాదాలబారిన పడుతున్న వారిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది. బంధువుల కంటే స్నేహితులతో కలిసే ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడుతుంటారు. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు కనిపించినా... జంక్షన్ వచ్చినా... ఆఖరులో కూర్చున్న యువకుడు తక్షణం దిగిపోయి నడుస్తూ ముందుకు వెళ్లడం పరిపాటి. ఇలా చేస్తూ ట్రిపుల్ రైడర్లు అనేక సందర్భాల్లో పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా దూసుకుపోతూ తరచు ప్రమాదాలకు లోనవుతున్నారు. అదుపు అసాధ్యం... ప్రతి వాహనానికీ దానిని తయారు చేసే కంపెనీ కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఇందులో భాగంగానే టూ వీలర్‌ను కేవలం ఇద్దరు వినియోగించడానికి వీలుగానే రూపొందిస్తుంది. ముందు డ్రైవర్, వెనుక పిలియన్ రైడర్ మాత్రమే ప్రయాణించాలంటూ తమ నిబంధనల్లో స్పష్టం చేస్తుంది. దీనికి సాంకేతికంగానూ ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇంజిన్ కెపాసిటీ: మోటారు వాహనాలకు ఉండే ప్రతి ఇంజిన్‌కు ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. దీనిని సాంకేతికంగా ఇంజిన్ కెపాసిటీ అంటారు. ఆ వాహనం ఎందరు ప్రయాణించడానికి అనువుగా రూపొందిస్తారో... అదే సామర్థ్యంలో ఇంజిన్ అభివృద్ధి చేస్తారు. నిర్దేశించిన ప్రయణికుల కంటే ఎక్కువ మంది ఆ వాహనంపై ప్రయాణిస్తే దాని ప్రభావం ఇంజిన్‌పై పడుతుంది. యాక్సిలరేటింగ్ కెపాసిటీ: ఓ వాహనం ఎంత వేగంతో దూసుకుపోవాలనేది స్పష్టం చేసేదే యాక్సిలరేటింగ్ కెపాసిటీ. సదరు వాహనంపై పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కినప్పుడు ఈ కెపాసిటీ తగ్గుతుంది. సాధారణంగా గంటకు 60 కిమీ వేగంతో దూసుకుపోయే వాహనం ఇలాంటప్పుడు 40 కిమీ మించదు. ఈ ప్రభావం ఓవర్‌టేకింగ్ తదితర సమయాల్లో ప్రమాదాలకు కారణమవుతుంది. బేకింగ్/బ్యాలెన్సింగ్ కెపాసిటీ: ఏదైనా వాహనం ప్రమాదానికి లోనుకాకుండా ఉండాలంటే ఈ రెండూ అత్యంత కీలకం. సరైన సమయానికి బ్రేక్ వేయగలగటం, అవసరమైన స్థాయిలో బ్యాలెన్స్ చేసుకోవడం తప్పనిసరి. అయితే ట్రిపుల్ రైడింగ్ వంటివి చేసినప్పుడు ఈ ప్రభావం ఈ రెండు కెపాసిటీల పైనా పడి... ఎదురుగా ముప్పును గుర్తించినా తక్షణం స్పందించి వాహనాన్ని ఆపలేరు. ఈ ఏడాది జరిగిన ‘ట్రిపుల్’ యాక్సిడెంట్స్‌లో కొన్ని... ♦రామ్‌నగర్‌కు చెందిన గోపీకృష్ణ తన స్నేహితురాళ్లు అనూష, పల్లవితో కలిసి తన బైక్‌పై సంఘీ టెంపుల్‌కు వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. గోపి మృతి చెందగా.. మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ♦ఛత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చిన సురేష్ అహ్మద్‌గూడ వద్ద మోది కన్స్ట్రక్షన్స్లో పని చేసేవాడు. భార్య రాధిక, బావమరిది ఉదయ్‌లతో పాటు చిన్నారుల్ని తీసుకుని బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. సురేష్ మరణించగా మిగిలిన వారు క్షతగాత్రులయ్యారు. ♦డీ పోచంపల్లికి చెందిన సాయి తన స్నేహితులు కృపాకర్, విష్ణులతో కలిసి బైక్‌పై వెళుతుండగా జరిగిన ప్రమాదంలో సాయి చనిపోగా... మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ♦తాగాజా బుధవారం తెల్లవారుజామున మంగళ్‌హాట్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు చనిపోగా... మరొకరు క్షతగాత్రులయ్యారు. వీరు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు చెబున్నారు. -
డబుల్స్ వస్తే రూ.500 జరిమానా
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు పయనించేందుకు నిషేధం విధించారు. డబుల్స్‌తో చక్కర్లు కొడితే రూ. 500 జరిమానా విధించనున్నారు. అలాగే, కార్లు, ఆటోల్లో ఓవర్ లోడింగ్‌పై దృష్టి పెట్టనున్నారు. ఇక లాక్‌డౌన్‌కాలంలోనూ రాష్ట్రంలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మార్చి 24న లాక్డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐదో విడతగా లాక్డౌన్ పొడిగింపు కొనసాగుతోంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల మినహా, తక్కిన అన్ని చోట్ల సడలింపులు ఎక్కువే. చెన్నైలో కేసులు అమాంతంగా పెరగుతుండడంతో టెన్షన్ తప్పడం లేదు. దీంతో ఇక్కడ ఆంక్షల్ని మరింత కఠినం చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. సడలింపు పుణ్యమాని, రోడ్ల మీద వాహనాలు కిక్కిరిసి ఉన్నాయి. డబుల్స్, త్రిబుల్స్ అంటూ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాళ్లు ఎక్కువగానే ఉన్నారు. అలాగే, కార్లలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు, ఆటోల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు పయనించేందుకు అవకాశం కల్పించినా, అంతకన్నా ఎక్కువగానే అనేక చోట్ల ప్రయాణిస్తున్నారు. ఇలా ఎక్కువమందితో పయనిస్తున్న వాహనాల భరతం పట్టేందుకు గురువారం నుంచి పోలీసులు దూకుడు పెంచనున్నారు.ద్విచక్ర వాహనల్లో ఒకరు మాత్రమే పయనించాలన్న ఆంక్షను విధించారు. డబుల్స్‌తో ఎవరైనా రోడ్డెక్కిన పక్షంలో వారికి రూ. 500 జరిమానా విధించనున్నారు. అలాగే, కార్లు, ఆటోల్లో అధిక శాతం మంది ఉంటే, సంఖ్యను బట్టి తలా రూ. 500 జరిమానా వడ్డించబోతున్నారు. ఆటోలు, కార్లకు అనుమతి ఇచ్చినప్పుడు తమకు సైతం అనుమతి ఇవ్వాలని కోరుతూ షేర్ ఆటోడ్రైవర్లు మంగళవారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీరిని కట్టడి చేయడం పోలీసులకు శ్రమగా మారింది. ప్రమాదాలు.. లాక్డౌన్ అమల్లోకి వచ్చినా, నిబంధనల్ని ఉల్లంఘించి రోడ్డెక్కిన వాళ్లు ఎక్కువే. వీరిపై కేసులు వి«ధించినా, జరిమానాల వడ్డన మోగించినా ఏమాత్రం తగ్గలేదు. అదే సమయంలో ఈ కాలంలోనూ ప్రమాదాలు తప్పలేదు. జవనరిలో రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో 731 మంది, ఫిబ్రవరిలో 232 మంది, మార్చిలో 610 మంది మరణించారు. లాక్ అమల్లోకి వచ్చినానంతరం ఏప్రిల్‌లో 119 మంది, మేలో 143 మంది ప్రమాదాల్లో మరణించినట్టు గణాంకాలు తేల్చాయి. -
తొలి బీఎస్-6 యాక్టివా125 లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన మొట్ట మొదటి బీఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తొలి వాహనాన్ని విడుదల చేసింది. బీఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా యాక్టివా వెర్షన్‌ను బుధవారం తీసుకొచ్చింది. మూడు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ .67,490 గా నిర్ణయించింది. ఈ నెల చివరి నాటికి కొత్త స్కూటర్లు రోడ్లపైకి రావడం ప్రారంభిస్తాయని, దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు హోండా తెలిపింది. తమ కొత్త యాక్టివా 125 బిఎస్-6 తో, పరిశ్రమలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో, తదుపరి విప్లవానికి లీడర్‌గా నిలుస్తుందని హోండీ సీఎండీ మినోరు కటో చెప్పారు. -
ద్విచక్ర వాహనదారుడి హల్చల్
ఒంగోలు: ఒంగోలు డీఎస్పీ కార్యాలయం ఎదుట గురువారం ఓ ద్విచక్ర వాహనదారుడి హల్చల్తో జనం బెంబేలెత్తారు. ఉదయం 11 గంటల సమయంలో ఎల్జీ కంపెనీ టీవీలకు మెకానిక్‌గా పనిచేస్తున్న జె.పంగులూరు మండలం చందలూరుకు చెందిన దొడ్డి మల్లికార్జున్ కొత్తపట్నం బస్టాండ్ నుంచి ఇందుర్తినగర్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఆ సమయంలో కొప్పోలు వైపు నుంచి టౌన్లోకి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొన్నాడు. మల్లికార్జున్ తీవ్రంగా గాయపడ్డాడు. అయినా ప్రమాదానికి కారణమైన వ్యక్తి బైకు వేగాన్ని తగ్గించకుండా కొత్తపట్నం వైపు నుంచి నగరంలోకి వస్తున్న జయరావ్ అనే కానిస్టేబుల్ బైకును ఢీకొట్టాడు. బైకులు తీవ్రంగా ధ్వంసం కాగా ప్రమాదానికి కారణమైన వ్యక్తి జనం తేరుకునేలోపే ఘటన స్థలం నుంచి అదృశ్యమయ్యాడు. అతడి బైకు నుంచి సీలలు బయట పడటంతో అతను ప్లంబర్ లేదా ఎలక్ట్రీషియనై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కానిస్టేబుల్‌తో పాటు అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు బైకు మీద ఉన్నారు. చిన్న పిల్లవాడు రెండు బైకుల మధ్యలో ఇరుక్కోగా కానిస్టేబుల్ భార్య, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. విషయం తెలియగానే టూటౌన్ సీఐ సురేష్‌రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో తెగిన చెయ్యి
కూసుమంచి: ద్విచక్ర వాహనంపై ముగ్గురు స్నేహితులు వెళుతున్నారు. వారి బైక్‌ను డీసీఎం డీకొంది. ఆ ముగ్గురిలో ఒకరి చేయి పూర్తిగా తెగిపోయింది. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం కూసుమంచిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పాలేరుకు చెందిన చెరుకుపల్లి శంకర్, వల్లెపు వెంకన్న, బత్తుల ఉపేందర్ బిల్డింగ్ వర్కర్లు. వీరు ముగ్గురూ కలిసి బైక్‌పై పాలేరు నుంచి కూసుమంచి వైపు వస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలోకి రాగానే, రోడ్డు క్రాస్ చేసేందుకని మధ్యలో కూర్చున్న శంకర్ తన చేతిని చాచాడు. ఇదే సమయంలో ఖమ్మం నుంచి పాలేరు వైపు వేగంగా వెళుతున్న డీసీఎం.. ఆ చేతిని ఢీకొంది. దీంతో శంకర్ చేయి గూడ కింది భాగం వరకు పూర్తిగా తెగిపడింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడింది. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శంకర్ చేయి తెగిపడటంతో పాటు తలకు దెబ్బలు తగిలాయి. వారిని, తెగిన చేతిని 108 సిబ్బంది ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమించటంతో హైదరాబాద్ గాం«ధీ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ రఘు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బతికించిన హెల్మెట్
కేసముద్రం(మహబూబాబాద్): అదుపుతప్పి రోడ్డుపక్కనున్న వ్యవసాయ బావిలో ద్విచక్ర వాహనంతో పడిన ఓ వ్యక్తిని హెల్మెట్ బతికించింది. తీవ్ర గాయాలతో బావిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుడిని పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, స్థానికుల సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కల్వల గ్రామ శివారు గాంధీపురం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన ప్రకారం..ఖమ్మం జిల్లా తిరుమరాయపాలెం మండలం తిప్పరెడ్డిడూడెం గ్రామానికి చెందిన బర్మావత్ రవి అనే యువకుడు కేసముద్రం నుంచి మహబూబాబాద్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కల్వల గ్రామశివారు గాంధీపురం దగ్గరలో మలుపు వద్ద బైక్ అదుపు తప్పడంతో వ్యవసాయబావిలోకి బైక్‌తో సహా రవి పడియాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సైతోపాటు పోలీసు సిబ్బంది, మహబూబాబాద్ నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. తాడు సాయంతో మంచంలో క్షతగాత్రుడిని బయటకు తీశారు. కాళ్లు, చేతులకు, నడుముభాగంలో రవికి గాయాలయ్యాయి. కాగా, అతన్ని 108లో మానుకోట ఆస్పత్రికి తరలించారు. హెల్మెట్ ధరించడం వలన నీళ్లులేని బావిలో బైక్‌తోపాటు పడిన రవి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఎస్సై తెలిపారు. -
పట్టపగలే చైన్ స్నాచింగ్
జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలో పట్ట పగలు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు ఇలాఉన్నాయి. వాసవీనగర్‌లో నివాసం ఉంటున్న కొన్యాల అనూష జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణానికి వెళ్లి తన భర్తకు టిఫిన్ ఇచ్చి తిరిగి వస్తోంది. ఇంటికి దగ్గరలోనే ఇద్దరు యువకులు బైక్‌పై ఆమెను వెంబడించారు. ముందుకు వెళ్లిన వారు వాహనాన్ని మలుపుకొని ఎదురుగా వచ్చి అనూష మెడలో నుంచి బంగారు చైన్‌ను తెంపే ప్రయత్న చేశారు. ఆమె ప్రతిఘటించడంతో దొంగల చేతికి కొంత భాగం మాత్రమే దక్కింది. అనూష మాట్లాడుతూ తన మెడలో మూడు తులాల బంగారు చైన్ ఉందని, ఎదురుగా వచ్చి దుండగులు లాగుతున్న క్రమంలో తాను చైన్‌ను గట్టిగా పట్టుకున్నాని చెప్పింది. దీంతో కొంత భాగం సుమారుగా అర్ధ తులం చైన్‌ను లాక్కెళ్లినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. -
నేర్చుకొని నేర్పిస్తోంది..!
అమ్మాయిలూ.. అబ్బాయిల్లా బైక్‌పై దూసుకెళ్లాలంటే ఎన్నో ఆంక్షలు. ఈ పరిస్థితిలో ఇప్పుడు కొంచెంమార్పొచ్చినా ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇక 1990 ప్రాంతంలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో సొంతంగా బైక్ డ్రైవింగ్నేర్చుకొని, మరెంతో మందికినేర్పిస్తూ ముందుకెళ్తున్నారు నగరవాసి నిర్మల. హిమాయత్‌నగర్: నిర్మలకు ఇద్దరు పిల్లలు. వారిని స్కూల్ తీసుకెళ్లి, ఆఫీస్‌కు వెళ్లే సరికి ఆలస్యమవుతోందని భర్త కోప్పడేవాడు. ‘నీకు కనీసం బండి కూడా రాదు..’ అంటూ హేళన చేసేవాడు. దీనికి ఎలాగైనా సమాధానం చెప్పాలనుకున్న నిర్మల.. అవసరాన్ని చాలెంజ్‌గా తీసుకొని ఇంట్లో ఎవరికీ తెలియకుండా కెనటిక్ హోండా బైక్‌పై ఓ 10రోజులు ప్రాక్టీస్ చేసి, సొంతంగా డ్రైవింగ్ నేర్చుకుంది. ఫర్ఫెక్ట్ అయ్యాక భర్త, బంధువుల ఎదుట నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పూజారి మాటతో... డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నిర్మల కొత్త బైక్ కొనుగోలు చేశారు. పూజ చేయించేందుకు గుడికి వెళ్లగా ‘అమ్మా.. డ్రైవింగ్ రాక ఇంట్లో మాటలు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. వారికి నేర్పిస్తే బాగుంటుంది కదా’ అని పూజారి ఆమెతో అన్నారు. ఆ మాట నిర్మల మనసులో నాటుకుపోయింది. దానికి కట్టుబడి ‘సాయి డ్రైవింగ్ స్కూల్’ పేరుతో మహళల కోసం ప్రత్యేకంగా బైక్ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు. 1997లో ప్రారంభమైన ఈ స్కూల్లో ఇప్పటి వరకు 3వేలకు పైగా మంది బైక్ నేర్చుకున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు.. సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 వరకు డ్రైవింగ్ నేర్పిస్తారు. ఫీలింగ్ హ్యాపీ.. బైక్ డ్రైవింగ్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇతరులను సాయం కోరేకన్నా నేర్చుకుంటే బాగుంటుంది కదా అని... కష్టంతో ఇష్టపడి నేర్చుకున్నాను. ఇప్పుడు నేనే మరొకరి నేర్పించే స్థాయికి ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉంది. సిటీలో ఫస్ట్ లేడీస్ టూవీలర్ డ్రైవింగ్ స్కూల్ నాదే అయినందకు గర్వంగా కూడా ఉంది. – నిర్మల చార్జీలు ఇలా.. ఇక్కడ పాతకాలం బైక్‌ల నుంచి ఆధునిక బైక్‌ల వరకు అందుబాటులో ఉన్నాయి. కెనటిక్ హోండాపై నేర్చుకోవాలంటే రూ.2,800, హోండా యాక్టివాపై అయితే రూ.3,800 చొప్పున చార్జీ చేస్తారు. శిక్షణ సమయంలో ఆర్టీఏ రూల్స్‌ని వివరిస్తూ నేర్పిస్తారు. -
వాహన చోదకురాలి తిరుగుబాటు
అచ్యుతాపురం(యలమంచిలి): తప్పుడు కేసు నమోదు చేయడమే కాకుండా పరిమితికి మించి అపరాధ రుసుము వసూలు చేయడం అన్యాయమంటూ ఓ వాహనచోదకురాలు పోలీసులకు ఎదురుతిరగడం చర్చనీయాంశమైంది. పైగా ఆమె పోలీసు స్టేషన్లో ఐదుగంటలపాటు నిరసన వ్యక్తం చేసి కలకలం రేపింది. వివరాలివీ.. మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన రాజాన దేవి అనే మహిళ ఆదివారం బైక్‌పై అచ్యుతాపురం మండలంలోని ఎస్ఈజెడ్ పరిశ్రమల వైపు వెళ్తోంది. వాహన తనిఖీల్లో భాగంగా అచ్యుతాపురం ఎస్ఐ దీనబంధు ఆమె బైక్‌ను ఆపి రికార్డులు చూపమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, లైసెన్స్ చూపకపోవడంతో రూ.635 పెనాల్టీ విధించారు. అయితే ఆమె పెనాల్టీ చెల్లించడానికి నిరాకరించింది. తనవద్ద అన్నిరికార్డులు ఉన్నాయని ఆమె ఎస్ఐకు తెలిపింది. హెల్మెట్ విషయానికి వస్తే రూ.100కు మించి ఫైన్ వేయడానికి లేదని వాదించింది. వాహనాన్ని నిలిపే హక్కు పోలీసులకు లేదని వాదించింది. అంతేకాకుండా వాహనాన్ని స్టేషనుకు తరలించగా, స్టేషన్లోనే ఆమె ఐదు గంటలపాటు నిరసన వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ వచ్చి సంజాయిషీ ఇస్తేనే ఇంటికి వెళ్తానని భీష్మించుకు కూర్చుంది. దీంతో పోలీసులు కంగుతిన్నారు. దీనిపై ఎస్ఐ దీనబంధు మాట్లాడుతూ వాహనం తనిఖీ సమయంలో రికార్డులు చూపకపోవడంతో నిబంధనల ప్రకారం అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. ఆ తరువాత ఆమె రికార్డులను తీసుకువచ్చి చూపడంతో రుసుము తగ్గించడానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. కాగా పోలీసులంటే భయపడేలా తనిఖీలు నిర్వహిస్తున్నారని, రికార్డులున్నప్పటికీ వేలల్లో అపరాధ రుసుము వసూలు చేస్తున్నారని నిత్యం పోలీసులు వాహచోదకులను దోచుకుంటున్నారని దేవి స్టేషన్లోనే పోలీసుల తీరును ఎండగట్టింది. ఎట్టకేలకు ఆమెకు పోలీసులు నచ్చచెప్పి ఇంటికి పంపించేశారు. -
చైనాను వెనక్కు నెట్టిన ఇండియా
-
ద్విచక్రవాహనం చోరీ
అనంతపురం సెంట్రల్ : ఆస్పత్రిలో ఆవరణలో నిలిపిన బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..... నవోదయ కాలనీలో పనిచేసే విజయ్‌కుమార్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. బుధవారం ఆస్పత్రి ఆవరణలో తన బైక్‌ను పార్కింగ్ చేసి లోనికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. దీంతో బాధితుడు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మూడు టైర్ల టూ వీలర్
సాక్షి నాలెడ్జ్ సెంటర్ విద్యుత్తుతో నడిచే వాహనాల గురించి మనం చాలాసార్లు ముచ్చటించుకున్నాం. ఫోల్డ్ చేసుకునే బుల్లి బైకుల నుంచి పడవంత కార్లు కూడా ఇప్పుడు విద్యుత్తుతో నడుస్తున్నాయి. ఇందులో ఏమీ విశేషం లేదుగానీ.. ఈ ఫొటోను పరిశీలనగా గమనిస్తే విషయం మీకే అర్థమవుతుంది. అవునండి... ఈ మోటా ర్‌సైకిల్ రెండు చక్రాల బండి కాదు. మూడు చక్రాలబండి. ఇదొక్కటే దీని విశేషం కాదులెండి. ఇంకా చాలా ఉన్నాయి. అమెరికాలోని వెస్ట్ వర్జీనియా ప్రాంతంలో ఉండే జెడ్ఈవీ అనే చిన్న కంపెనీ వీటిని తయారు చేస్తోంది. ఇప్పటివరకూ చాలా మోడళ్ల ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేసిన ఈ సంస్థ తాజాగా ముందువైపున రెండు, వెనుకవైపు ఒక చక్రం ఉండే ఎల్‌ఆర్‌సీ – టీ 15ని సిద్ధం చేసింది. ఎల్‌ఆర్‌సీ టీ–15 అని పిలుస్తున్న ఈ మోటార్ బైక్ 15 కిలోవాట్ల బ్యాటరీలతో పనిచేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలగడం దీని ప్రత్యేకత. అది కూడా గంటకు 88 కిలోమీటర్ల వేగంతో! బీఎండబ్ల్యూ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కంపెనీ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు ఇంత సామర్థ్యమున్న బ్యాటరీని వాడుతున్నప్పటికీ కేవలం 160 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలగడం విశేషం. పైగా ఎల్‌ఆర్‌సీ టీ–15 మోటార్.. బాడీలో కాకుండా చక్రంలోనే ఏర్పాటు అవడం మరో విశేషం. మూడు చక్రాలు ఉండటం వల్ల రోడ్డుపై ఇది చాలా స్థిరంగా ఉంటుంది. వంపులు వచ్చినప్పుడు ముందువైపున ఉన్న రెండు చక్రాలు వంపునకు తగ్గట్టుగా పైకి కిందకు కదులుతాయి. పదేళ్ల క్రితం పియాజియో కూడా ఇలాంటి బైక్‌ను సిద్ధం చేసినప్పటికీ అది మార్కెట్ ఆదరణ చూరగొనలేదు. తాజాగా జెడ్ఈవీ సిద్ధం చేసిన ఈ సరికొత్త బైక్‌కు ఏమాత్రం ఆదరణ లభిస్తుందో చూడాలి. రేటెంతో చెప్పలేదు కదూ... దాదాçపు 20 వేల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 14 లక్షలు! -
నడిరోడ్డుపై రాడ్‌తో కొట్టి చంపారు..
పహాడీషరీఫ్: పట్టపగలు.. నడిరోడ్డుపై దుండగులు ఓ రౌడీ షీటర్‌ను హతమార్చారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చి జాకీ రాడ్‌తో తలపై కొట్టి చంపేశారు. ఈ ఘటన చూసి ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వీవీ చలపతి, స్థానికుల కథనం ప్రకారం....బార్కాస్‌కు చెందిన అమర్ అమ్‌షాన్(41)పై పహాడీషరీఫ్, చాంద్రాయణగుట్ట పోలీస్స్టేన్న్లలో రౌడీషీట్ ఉంది. ఇతను బాలాపూర్ ఎంఐఎం ఎంపీటీసీ అలీ అమ్షాన్కు సోదరుడు. సోమవారం సాయంత్రం 5 గంటలకు అమర్ అమ్‌షాన్ ద్విచక్రవాహనంపై న్యూబాబానగర్ బస్తీ నుంచి ప్రధాన రహదారి ఎక్కి పహాడీషరీఫ్ వైపు మళ్లాడు. వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అతడిని అడ్డగించి.. తలపై జాకీరాడ్‌తో బలంగా కొట్టారు. దీంతో తల పగిలి మెదడు బయటపడటంతో అలీ అమ్‌షాన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు దర్యాప్తులో ఉంది. కాగా, బార్కాస్‌కు చెందిన ఉమర్ బహమాద్ అనే యువకుడు సోమవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీస్షే్టషన్లో లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ హత్యకు భూ వివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుడికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. -
లారీ ఢీకొని డీఆర్డీఏ ఏసీవో దుర్మరణం
– ఏపీఎంకు తీవ్రగాయాలు మదనపల్లె టౌన్: కురబలకోట మండలంలో శనివారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో తంబళ్లపల్లె నియోజకవర్గ డీఆర్డీఏ రమేష్(47) దుర్మరణం చెందారు. ఏపీఎం సాంబశివ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు... అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన తోట రామచంద్రయ్య కుమారుడు రమేష్(47) మదనపల్లెకు చెందిన మాధవిని 17 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అమ్మినేని వీధిలో నివాసం ఉంటూ తంబళ్లపల్లె నియోజకవర్గ వెలుగు, డీఆర్డీఏ కార్యాలయంలో పనిచేస్తున్నారు. పట్టణంలోని దిగువకమ్మపల్లెలో నివాసముంటున్న ఏపీఎం శివ (35) కలిసి శనివారం ఉదయం విధుల నిమిత్తం తంబళ్లపల్లె వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా కురబలకోట మండలం కంటేవారిపల్లె సమీపంలో లారీ ఢీకొంది. ఈ ఘటనలో రమేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా శివకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు రమేష్‌కు భార్య మాధవి, పిల్లలు మానస, మౌనిషా ఉన్నారు. మాధవి మదనపల్లె ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఏపీఎంగా పనిచేస్తున్నారు. రమేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి పరామర్శించి సంతాపం తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటీ సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ చెంచు బాలుడు దుర్మరణం చెందాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ డివిజన్లోని మర్రిపాలెం చెంచు గూడేనికి చెందిన కుడుముల అంజన్న(15) అదే పేరు గల దాయాది సోదరునితో కలిసి కొత్త పల్లె మండలం గుమ్మడాపురం చెంచు గూడెంలో ఉన్న సోదరిని కలిసేందుకు ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. వేగంగా వెళ్తుండటంతో బైర్లూటీ సమీపంలో వాహనం అదుపు తప్పింది. ఈ ఘటనలో పోతయ్య కుమారుడైన కుడుముల అంజన్న మరణించగా దాయాదైన అంకన్న కుమారుడు అంజన్న తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలిసి ఆత్మకూరు ఎస్ఐ రమేష్ కుమార్ సంఘటన స్థలానికెళ్లి పరిశీలించారు. మత దేహాన్ని పోస్టు మార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. -
తిరుమలఘాట్‌లో ప్రమాదం
♦ దంపతులు దుర్మరణం ♦ మృతులు తమిళనాడులోని తిరువళ్లూరువాసులు తిరుమల: తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు దంపతులు దుర్మరణం చెందారు. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన గోవిందరాజు (47), ఆయన సతీమణి లక్ష్మి(42) ద్విచక్రవాహనంలో తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని మంగళవారం అదే వాహనంలో తిరుగుప్రయాణం అయ్యారు. ఉదయం 11.25 గంటలకు మార్గంలోని 35వ మలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో గోవిందరాజు, లక్ష్మి కింద పడి గాయపడ్డారు. దీంతోపాటు వారిపై బస్సు వేగంగా ఎక్కింది. దీంతో లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా గోవిందరాజు మృతి చెందారు. మృత దేహాలను మెడికల్ కళాశాలకు తరలించారు. ఘటన స్థలిని తిరుమల ఏఎస్పీ త్రిమూర్తులు, ఎస్ఐ తులసీరామ్ సందర్శించి కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్సులు కూడా ప్రై వేట్ వాహనాల తరహాలోనే వేగంగా వెళ్లటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. -
టూ వీలర్, మొబైల్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు టూవీలర్, మొబైల్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డెరైక్టర్ లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం, వ్యక్తిగత వికాస తరగతులు, స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్థానిక వెంకటేశ్వరకాలనీలోని తమ సంస్థ కార్యాలయాన్ని, 08542-270395, 9985529381 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
టూ వీలర్ కొంటే హెల్మెట్ ఫ్రీ..!
కేరళ: ద్విచక్ర వాహనం నడిపేప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలన్న నిబంధన దాదాపు అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. రూల్స్ అధిగమించేవారికి, నిర్లక్ష్యంగా వ్యవహరించినవారికి జరిమానాలు విధించడం, ఆర్టీఏ వెబ్ సైట్లో చలాన్లు పంపించడం చేస్తున్నారు. దీంతో ఇంతకు ముందు హెల్మెట్ లేని వారు కూడా ఇప్పుడు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొన్న కేరళ రవాణా, రోడ్ సేఫ్టీ కమిషనర్ టామిన్ జె థచంకరీ నూతన దిశా నిర్దేశాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తగా ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ ను బహూకరించేందుకు కేరళ ప్రభుత్వం సన్నాహాలు చేసింది. దీంతోపాటు వాహనానికి కావలసిన నెంబర్ ప్లేట్, అద్దాలు, శారీ గార్డ్, వంటి కొన్ని ఉపకరణాలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కేరళలోని సుమారు 50 మోటార్ సైకిల్ తయారీదారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మార్చి 29న ఈ నూతన నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉపకరణాలకు కొనుగోలుదారుల వద్ద ఎటువంటి డబ్బు వసూలు చేయకూడదని సమావేశంలో నిర్ణయించారు. అయితే ఇలా హెల్మెట్ ఉచితంగా పంపిణీ చేసిన తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధించటంతో పాటు, లైసెన్సులను సైతం రద్దు చేసేందుకు కేరళ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం కేరళలో గతేడాది 20,000 లకు పైగా ప్రమాదాలు చోటు చేసుకోవడం, ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. -
రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి
వేగంగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. నల్లగొండ శివారులోని చర్లపల్లికి చెందిన ఓ రైతు ద్వచక్రవాహనం పై నల్లగొండకు వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలుతెలియాల్సి ఉంది. -
మహీంద్రా 300 సీసీ బైక్.. మోజో
ధర రూ.1.58 లక్షలు దీపావళి తర్వాత 20,000-30,000 వరకూ పెంపు న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ 300 సీసీ బైక్, మోజోను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ బైక్ ధరను రూ.1.58 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని కంపనీ పేర్కొంది. వివిధ వినూత్నమైన ఫీచర్లతో ఈ బైక్‌ను అందిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ఇది ప్రారంభ ధర మాత్రమేనని, దీపావళి తర్వాత ధరను సవరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబై, పుణే, ఢిల్లీ, బెంగళూరు- ఈ నాలుగు నగరాల్లోనే ఈ బైక్‌ను విక్రయించనున్నామని, తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ మోజో బైక్‌లో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇగ్నీషన్, ఇరిడీయమ్ స్పార్క్ ప్లగ్, రెసోనేటర్ ఫిట్టెట్ ఇన్‌టేక్ సిస్టమ్, రెండు ఎగ్జాస్లు వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. . 21 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉందని, ఈ కేటగిరీలో అతి పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న బైక్ ఇదేనని తెలిపారు. మోజోట్రైబ్ ఏర్పాటు.. మోజో యజమానులతో మోజోట్రైబ్ కమ్యూనిటీని ఏర్పాటు చేస్తున్నామని మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఫార్మ్ ఎక్విప్మెంట్, టూ వీలర్ డివిజన్) రాజేశ్ జుజురికర్ చెప్పారు. ఈ మోజో ట్రైబ్ సభ్యులు కలసిమెలసి లాంగ్ రైడ్స్‌ను నిర్వహించి ఆనందం పొందుతారని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
వేగంగా దూసుకువచ్చిన కారు ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ మండలం డీ పోచంపల్లి సాయిపూజ కాలనీకి బానోతు తుల్జా, సికిందర్‌లు కూలి పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం వీరు బైక్‌పై సాయి పూజ కాలనీకి వెళ్తుండగా దుండిగల్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా మేడ్చల్ నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తుల్జా, సికిందర్లకు తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇన్నోవా కారు నడుపుతున్న వ్యక్తి పరారు కాగా... కారులో బీరు సీసాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రైవింగ్ లెసైన్స్
అనంతపురం టౌన్ : టూవీలర్, ఫోర్ వీలర్లు నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లెసైన్స్ ఉండాల్సిందే. దీనికి 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. 16 సంవత్సరాలు నిండిన వారు గేర్లు లేని (55 సీసీ లోపు సామర్థ్యం కలిగిన వాహనాలు) మోపెడ్లు నడిపేందుకు అర్హత ఉంటుంది. అయితే వీరికి తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్ఎల్ఆర్ తీసుకోవాలంటే.. లెర్నింగ్ లెసైన్స్ కావాలనుకునే వారు .aptransport.gov.in బ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. లెసైన్స్ ఎవరికి కావాలో వారి చిరునామాకు సమీపంలో మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ పొందే అనుమతి లభిస్తుంది. లేదంటే దాని పరిధిలోని కార్యాలయాల్లో తీసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోపు సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో లేదా ఈ-సేవా కేంద్రంలో ఫీజు చెల్లించాలి. టూ వీలర్, ఫోర్ వీలర్లలో ఏదైనా ఒక దాని కోసం రూ.90, రెండూ కావాలనుకుంటే రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. స్లాట్ తీసుకున్న 24 గంటల్లోగా ఫీజు చెల్లించకపోతే అది రద్దయిపోతుంది. స్లాట్ బుక్ చేసుకున్న గడువు, సమయాన్ని అనుసరించి ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించే పరీక్షకు హాజరు కావాలి. ఇదే సమయంలో అభ్యర్థులు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, చిరునామా పత్రాలు వెంట తీసుకెళ్లాలి. లెర్నింగ్ లెసైన్స్ పరీక్షలో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత నియమాలపై 20 ప్రశ్నలుంటాయి. వాటిలో కనీసం 16 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన సమాధానం గుర్తించాలి. పరీక్షలో పాస్ అయిన వారికి మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ ఇస్తారు. అయితే ఇది కేవలం ఆరు నెలల వరకే చెల్లుబాటు అవుతుంది. ఎల్ఎల్ఆర్ పొందిన 30 రోజుల తర్వాత, దాని గడువు ముగిసేలోగా శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ పొందవచ్చు. నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లెసైన్స్ 18 ఏళ్లకే పొందినప్పటికీ, ట్రాన్స్పోర్ట్ లెసైన్స్ పొందేందుకు కనీసం 20 సంవత్సరాలు నిండి ఉండాలి. అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి ఆర్టీఏ కార్యాలయాల్లో లెర్నింగ్ లెసైన్స్ పొందవచ్చు. శాశ్వత లెసైన్స్ కోసం.. శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ పొందాలనుకునే వారు కూడా ఆర్టీఏ వెబ్సైట్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. 24 గంటల్లో ఈ-సేవ, సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో గానీ రూ.550 నుంచి రూ.650 ఫీజు చెల్లించాలి. ఆర్టీఏ కార్యాలయాల టెస్ట్ ట్రాక్‌లలో పరీక్ష నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం వాహనాలు నడపాల్సి ఉంటుంది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించే పరీక్షలో వాహనదారులు నైపుణ్యంతో వ్యవహరిస్తే శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ మంజూరవుతుంది. పోస్టు ద్వారా లెసైన్స్ మీ చిరునామాకు చేరుతుంది. పూర్తి వివరాల కోసం అనంతపురంలోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో లేదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. -
లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడి దుర్మరణం
గాజువాక: విశాఖపట్నం నగరంలోని పాత గాజువాక ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జబ్బు జంక్షన్ వైపు నుంచి ఓ వ్యక్తి బైక్‌పై వస్తుండగా జాతీయ రహదారిపై అనకాపల్లి వైపు వెళుతున్న షిప్పింగ్ కంపెనీ లారీ ఢీకొట్టింది. బైక్‌తోపాటు వాహనదారుడ్ని కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు నుజ్జునుజ్జయిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బాధితుని వివరాలు తెలియాల్సి ఉంది. -
హెల్మెట్ వాడకంపై టీ.రవాణశాఖకు మొట్టికాయలు
హైదరాబాద్ : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్న నిబంధనపై తెలంగాణ రవాణా శాఖకు హైకోర్టు సోమవారం తప్పుబట్టింది. మొదట హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించి, ఆ తర్వాత తప్పనిసరి చేయాలని మొట్టికాయలు వేసింది. హెల్మెట్ వాడకంపై ఇప్పటివరకు ఏం చేశారని న్యాయస్థానం ఆ సందర్భంగా అధికారులను ప్రశ్నించింది. అయితే హెల్మెట్ వాడనివారిపై ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 92వేల కేసులు నమోదు చేశామని రవాణా శాఖ అధికారులు తెలపగా, మీ కేసులతో ఒరిగేదేమీ లేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. -
ప్రాణమే ముద్దు ‘ఆకాష్’మే హద్దు
హెల్మెట్ వాడకంపై చిన్నారి వినూత్న ప్రచారం ఒక పుస్తకం పది చెడు అలవాట్ల్లను దూరం చేస్తుంది.... ఒక సంఘటన పది మందికి సాయపడేలా ప్రేరణ కలిగిస్తుంది. 2013వ సంవత్సరం మహాబలిపురం వద్ద జరిగిన ఒక సంఘటన ఐదేళ్ల చిన్నారిలో ప్రేరణ కలిగించింది. హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపి ప్రమాదానికి గురైన సంఘటనతో చలించి పోయిన ఆకాష్‌ను హెల్మెట్‌పై ప్రచారం చేసేలా ఉసిగొల్పింది... ఎంతగా అంటే.... హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపిన ముఖ్యమంత్రినే నిలదీసేంతగా... రాష్ట్ర సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రినే మెప్పించిన ఐదేళ్ల చిన్నారి ఆకాష్ ఉదంతమిది. తిరువళ్లూరు: 2013వ సంవత్సరం తమిళనాడులోని కాంచీపురం జిల్లా మహాబలిపురం రోడ్డులో ఆకాష్‌తో కలిసి షికారుకు బయలుదేరాం. ఎప్పుడూ రద్దీగా ఉండే మాంబళం రోడ్డులో వాహనాలు రాకెట్లా దూసుకెళ్తున్నాయి. హెల్మెట్ లేకుండా చాలా మంది వాహనాలను నడుపుతూనే ఉన్నారు. సరిగ్గా ఆరు గంటల సమయంలో మా వెనుక నుండి వచ్చిన ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తలపై తప్ప మరెక్కడా గాయం లేదని అప్పట్లో జరిగిన సంఘటనను వివరించాడు ఆకాష్ తండ్రి ఆనందన్. బహుశా ఇదే సంఘటన హెల్మెట్‌పై ప్రచారం నిర్వహించాలనే ఆలోచన ఆకాష్‌కు కలిగివుండవచ్చని వివరించాడు ఆనందన్. కాంచీపురం జిల్లా మహాబలిపురం ప్రాంతానికి చెందిన పెయింటర్ ఆనందన్. తల్లి యోగలక్ష్మి. గృహణి. వీరి ఐదేళ్ల కుమారుడు ఆకాష్ . చెన్నైలోని ప్రయివేటు పాఠశాలల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. మాంబళం రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి ప్రతి చోటా సమయం దొరికినప్పడు హెల్మెట్‌పై ప్రచారం చేసేవాడు. అలా ప్రారంభమైన ప్రచారం ఆంధ్ర, కర్ణాటక, కేరళా, తమిళనాడు, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో హెల్మెట్‌పై ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు లక్షల కరపత్రాలను పంపిణీ చేసి, పది లక్షల మందిని కలిసి హెల్మెట్ ధరించాలని విన్నవించాడు. ఇతని బృందంలోని సభ్యులు మణిమేఘలై. 2014లో పాండిచ్చేరిలో హెల్మెట్‌పై ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రంగస్వామి ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా వస్తున్నారు. రంగస్వామి వద్దకు వెళ్లిన ఆకాష్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం సరికాదంటూ సలహా ఇచ్చాడు. వెంటనే గుర్తించి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చిన్న పిల్లోడు మీరెవరో తెలియకుండా వాహనాన్ని ఆపేసాడంటూ క్షమాపణ కోరాం. కాని రంగస్వామి మాత్రం ఆకాష్ చేస్తున్న ప్రచారానికి మురిసిపోయాడు. అప్పటికప్పడు హెల్మెట్ తెప్పించి వేసుకోవడంతో పాటు తన చాంబర్‌కు తీసుకెళ్లి సన్మానించి ఆకాష్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు జరిపించాడు. ఈ ఘటన తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందని వివరించాడు ఆకాష్ బృందంలోని ఓ సభ్యుడు తమిళ్‌సెల్వన్. ప్రచారం ఇలా హెల్మెట్‌పై ప్రచారం చేయాలని నిర్ణయించిన ఆకాష్‌కు తల్లిదండ్రులు బాసటగా నిలిచారు. ఆకాష్ చేస్తున్న హెల్మట్ ప్రచారాన్ని గమనించిన 20 మంది బృందంలో చేరారు. ఆకాష్‌కు పాఠశాల సెలవు రోజుల్లో హెల్మెట్ ప్రచారం కోసం వెళ్లేవాడు. ప్రచారం ఎలా నిర్వహించాలి. ఎక్కడ నిర్వహించాలి అనే విషయాన్ని ఆకాష్ నిర్ధేశించేవాడు. 20 మంది వేర్వేరు చోట నిలబడి కరపత్రాలను పంపిణీ చేసే వాడు. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే సాయంత్రం వరకు ప్రచారం నిర్వహించి ఇంటికి వచ్చే వాళ్లం. మా ప్రచారాన్ని పోలీసులు స్వాగతించేవారు. అదే సమయంలో ఐదేళ్ల చిన్నారి ెహ ల్మెట్పై చేస్తున్న పోరాటంపై పలువురు ప్రశంసించే సమయంలో తాము పొందే ఆనందానికి అవధులు లేవంటూ మురిసిపోయారు మణిమేఖలై. ఒక పువ్వు- ఒక నవ్వు మంచి పనులకు ముహూర్తం చూడకూడదని తాతగారు చెప్పేవారు. ప్రమాదం జరిన తీరును చూసి తన వంతుగా హెల్మెట్‌పై ప్రచారం చేయాలని నిర్ణయించి తల్లిదండ్రులకు చెప్పా. ఈ ప్రచారం వలన చదువు పాడైపోతుందని బాధపడ్డారు తల్లిదండ్రులు. పాఠశాలకు ఒక్క రోజు కూడా నిలిచిపోనని చెప్పడంతో వారు ఓకే చెప్పారు. రెండు సంవత్సరాల్లో వంద శాతం పాఠశాలకు హాజరుకావడంతో అవార్డు వచ్చింది. అయితే నేను చేస్తున్న ప్రచారం కొంత వినూత్నంగా ఉండాలన్న ఉద్దేశంతోనే హెల్మెట్‌తో వాహనాలను నడిపే వారిని సన్మానించేలా పూల బొకే ఇవ్వడం, లేకుంటే ఒక నవ్వు నవ్వి కరపత్రాన్ని ఇవ్వడం ఇది దినచర్య అంటూ వివరించాడు ఆకాష్. మిడిమిడి జ్ఞానం. అసలే ఆరేళ్లు దాటని వయస్సులో చిన్నారి చేస్తున్న అవగాహన ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది. వందలాది అవార్డులు.. ప్రశంసలు వచ్చినా ఆత్మసంతృప్తి లేదంటూనే తన ఆశయం కోసం నిరంతరం శ్ర మిస్తున్న ఆకాష్‌ను మనసారా దీవిద్దాం. -
డిస్టెన్స్
మెట్రో కథలు బాస్ పిలిస్తే లోపలికెళ్లి బయటకు వచ్చాక మళ్లీ ఒకసారి కాల్ చేసి చూశాడు. స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. సీట్లో కూచుని సెల్ వైపు చూసుకుంటూ తిరిగి కాల్ చేశాడు. స్విచ్డ్ ఆఫే. టైమ్ పదకొండు అవుతోంది. సాయంత్రం ఆరుకు ఆఫీస్ అయిపోతే ఏడుకు ఇల్లు చేరేదాకా ఈ నరకం తప్పదు. ఉదయం బయలుదేరే ముందు చిన్నగా మాటా మాటా పెరిగింది. సాయంత్రం వచ్చి తీసుకెళతారుగా అంది. చూద్దాం అన్నాడు. చూద్దాం ఏంటి? రెట్టించింది. చెప్తానన్నాగా. నువ్వు రెడీ అయి కూచుని నా ప్రాణం తీయకు. ఆ మాట చెప్పి టూ వీలర్ ఎక్కి ఆఫీసుకు వచ్చేశాడు. అయితే అలా టూ వీలర్ ఎక్కి ఆఫీసుకు వచ్చేయడం అంత సులభం కాదు. ఏ రోజూ సులభం అవగా చూళ్లేదు. ట్రాఫిక్ ఉంటుంది. సిగ్నల్స్ దగ్గర చాలాసేపు వెయిటింగ్ ఉంటుంది. మధ్యలో పోలీసులు ఎందుకాపేస్తారో తెలియదు, పదీ పదిహేను నిమిషాలు అందరినీ ఆపేసి ఎవరికో దారి వదులుతారు. బాగా నిండిన మురుగు కాలువ అతి మెల్లగా కదిలినట్టు ఒక్కోసారి ఎంత విశాలమైన రోడ్డైనా బండ్లతో నిండిపోయి నల్లటి పొగ వదులుతూ అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదులుతుంటుంది. ఓ కారు దాదాపు డ్యాష్ ఇస్తూ ముందుకుపోతుంది. యూ టర్న్ దగ్గర ఎవడిదో బైక్ మీదమీదకు వచ్చేస్తుంది. చాలా అదృష్టం కలిసి రావాలి. ఆఫీసుకు అప్పుడు చేరాలి. ఎవరో ఒకరు సెక్షన్లోనో క్యాంటీన్లోనో స్మోక్రూమ్లోనో మరొకరిని అడుగుతుంటారు- ఎక్కడ ఉంటున్నావ్? ఏదో ఒక ఏరియా చెప్తారు. అక్కడా? అంత దూరమా? అబ్బే... ఏం దూరం... అరౌండ్ ఫిఫ్టీన్. ఈ అరౌండ్ అనే మాటకు ఎవరి లెక్క వారికుంటుంది. అదనం రెండు కిలోమీటర్లు కావచ్చు. అదనం ఐదు కిలోమీటర్లు కావచ్చు. అదనం పది కిలోమీటర్లు కూడా కావచ్చు. పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్నా అరౌండ్ ఫిఫ్టీన్ అనే చెప్తారు. మరేం చేస్తారు? మంచి ఆఫీసే. చెప్పుకోదగ్గ జీతం అంటే పద్దెనిమిది నుంచి పాతికవేల వరకూ ఉంటుంది. ప్రతి నెలా పదో తేదీకల్లా ఇచ్చేస్తారు. ఒకవేళ పది ఆదివారం అయితే తొమ్మిదిన- శనివారమే పడిపోతాయి. మరి జీతం సరిగ్గా ఇస్తున్నప్పుడు పద్ధతులు సరిగ్గా ఆశించడంలో తప్పు లేదు. టైముకు రావాలి. నెలకు ఒక సెలవు వాడుకోవాలి. లేటొచ్చినా ఆబ్సెంట్ అయినా శాలరీ కట్కు అంగీకరించాలి. అందువల్ల అందరూ జాగ్రత్తగా పని చేస్తారు. బడ్జెట్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. పదీ పదిహేను కిలోమీటర్ల అవతలకు వెళ్లి- అన్నీ కలిపి ఐదున్నరా ఆరులో అయిపోయేలాగా ఒక పోర్షన్ తీసుకుని- జాగ్రత్తగా ఉండిపోతారు. అయితే ఇలాంటి సందర్భాల్లోనే వస్తుంది సమస్య. ముందు రోజు రాత్రే గుర్తు చేస్తూ అంది. శిల్పారామం సంప్రదాయవేదికలో రేపు సాయంత్రం మావాళ్ల పెళ్లి. కార్డు చూశారుగా. అంత ఇదిగా వచ్చి పిలిచి వెళ్లాక వెళ్లకుండా ఉంటే ఏం బావుంటుంది. ఏం జవాబు చెప్పలేదు. దిండు మడిచి తల కింద సర్దుకుంటూ నిద్రపోయాడు. రెండు వారాల క్రితమే ఊళ్లో ఏవో కొంపలంటు కున్నాయంటే పోయేసి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ లీవ్ పెట్టలేడు. ఒకవేళ పెడదామన్నా సాయంత్రం ఫంక్షన్ అయితే ఇప్పట్నించి ఇంట్లో ఉండి లీవ్ వేస్ట్ చేయడం ఎందుకు అంటుంది. గంట ముందు పర్మిషన్ అంటే అదో పెద్ద తతంగం. ఇక ఆరుకు బయట పడి, ట్రాఫిక్ అంతా దాటి, అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకుని, గొంతులో టీనీళ్లైనా పోసుకోకుండా భార్యనూ పిల్లలనూ తీసుకొని తిరిగి ముప్పై కిలోమీటర్లు ట్రాఫిక్‌లో పడి, శిల్పారామం చేరుకుని.... ఇదా బతుకు... బస్సుల్లో తిరగలేరు. ఆటోలను భరించలేరు. టూ వీలర్ నడపలేరు. చెప్తే అర్థం కాదా? హూ. మీరు ఏ రోజు సుఖపెట్టారు కనుక. నిజమే. ఆదివారం వస్తే నాలుగు వీధుల అవతల ఆమె చెల్లెలి ఇల్లు ఉంది అక్కడకు తీసుకెళ్లి పడేస్తాడు. దగ్గరలో పాత థియేటర్ ఉంది. సినిమా చూపించేస్తాడు. మూడు నెలలకు ఒకసారి పిల్లలరైలు తిరిగే ఎగ్జిబిషన్ పెడతారు. తీసుకెళ్లి తీసుకొచ్చేస్తాడు. కాని సిటీలోకి మాత్రం రాడు. అది ఆమెకు విసుగు. ఇవాళైనా అంత గట్టిగా పట్టు పట్టేది కాదు. ఆమె బంధువుల్లో వీళ్లే కాస్తంత కలిగిన వాళ్లు. చూడు... శిల్పారామంలో పెళ్లి చేసేంత స్తోమత మా వాళ్లకూ ఉంది చూడు అని చూపిద్దామని తాపత్రయం. అదీగాక ఈ మధ్యే రెండు వేలు పెట్టి ప్యారెట్గ్రీన్ పీకాక్బ్లూ కాంబినేషన్లో అనార్కలి డ్రస్ కొంది. లక్కీగా స్టిచింగ్ కూడా కుదిరింది. అది వేసుకు చూపించాలని కోరిక. పెళ్లంటే ఈ మధ్య కనీసం డెబ్బై రకాల వంటకాలైనా పెడుతున్నారు. మీల్మేకర్ రైస్... బేబీ కార్న్ దమ్ బిర్యానీ... తమ సంగతి ఏముందిగానీ పిల్లల నోటికి కాస్తంత అందివ్వచ్చు కదా. ఒక పూట వంట తప్పుతుంది. అన్నింటి కంటే ముఖ్యం- ఈ బందిఖానా నుంచి కాసేపైనా బయటపడొచ్చని ఆశ. కానీ... పిల్లల్ని కూచోబెట్టుకుని అంతంత దూరం పోకూడదు. ఇన్ని మాటలు ఎందుకు? ఇష్టం లేదని చెప్పెయ్యండి. సిటీలో టూ వీలర్ నడపడం ఎంత రిస్కో ఆడవాళ్లకు అర్థం కాదు. ముందు పెద్దాణ్ణి కూచోపెట్టుకుని వెనక పిల్లదాన్ని ఒళ్లో పెట్టుకుని... మొత్తం నాలుగు ప్రాణాలు... క్షణం కూడా గ్యారంటీ లేదు. అదీగాక వెళ్లేటప్పుడు పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. వచ్చేటప్పుడు నిద్రపోతారు. చాలాసార్లు అయ్యింది. పెద్దాడు అలా తూగుతూ ట్యాంక్ మీద వాలిపోయి నిద్రలో ఎక్కడ జారిపోతాడో అని దడ రేపి... కాని వినదు. మళ్లీ ట్రై చేశాడు. స్విచ్డాఫ్. ఇక ఫోన్ తీయదు. తీయకపోతే పోయింది ఆ కోపంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అల్లరి చేస్తుంటే నాలుగు పీకుతుంది. ఒకసారి ఇలాగే సోఫాలో నుంచి పెద్దాణ్ణి లాగి కిందకు పడేసింది. ఆ సంగతి తెలిసి రెండు రోజులు గుండె గుబగబలాడింది. ఆమె చెల్లెలికి ఫోన్ చేశాడు. ఇక్కడికి రాలేదు బావా. ఇందాక అటువైపు వెళుతూ చూశాను. ఇంట్లో కూడా లేదే. మెల్లగా కడుపులో మంట మొదలయ్యింది. ఈ మధ్య ఇంతే అవుతోంది. టెన్షన్ వస్తే ఎసిడిటీ పెరిగిపోతోంది. గడియారం వైపు చూశాడు. టైమ్ చాలా ఉంది. ఎప్పటికి సాయంత్రం కావాలి? ఎప్పటికి ట్రాఫిక్ దాటాలి? ఎప్పటికి ఇంటికి చేరాలి? చేరి ఇంట్లో ఏం చూడాలి? సెల్ పట్టుకుని వెనక్కి వాలాడు. మంట ఛాతీని గుంజుతూ ఉంది. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
హీరో మోటొకార్ప్ నికర లాభం రూ.477 కోట్లు
⇒ 14 శాతం క్షీణత ⇒ రూ.155 కోట్ల ఇంపెయిర్మెంట్ నష్టంతో తగ్గిన లాభం ⇒ క్యూ4 ఫలితాలు వెల్లడించిన కంపెనీ ⇒ ఒక్కో షేర్‌కు రూ.30 డివిడెండ్ న్యూఢిల్లీ: టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ నికర లాభం గత ఏడాది నాలుగో త్రైమాసిక కాలంలో 14 శాతం తగ్గింది. 2013-14 క్యూ4లో రూ.544 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.477 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. తాము అమెరికా కంపెనీ ఇరిక్ బ్యూయల్ రేసింగ్‌లో... రూ.155 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, అయితే ఆ సంస్థ దివాళా పిటీషన్ దాఖలు చేయడంతో ఈ మేరకు నష్టం వాటిల్లిందని, అందుకే నికర లాభం క్షీణించిందని కంపెనీ వైస్ చైర్మన్, సీఈఓ, ఎండీ పవన్ ముంజాల్ చెప్పారు. నికర అమ్మకాలు రూ.6,513 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.6,794 కోట్లకు పెరిగాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.30 డివిడెండ్‌ను చెల్లించనున్నామని చెప్పారు. గత ఆగస్టులో రూ. 30 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని, మొత్తం మీద గత ఆర్థిక సంవ్సరంలో తమ డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.60కు చేరుతుందని వివరించారు. ఇక విక్రయించిన వాహనాల సంఖ్య 15,89,462 నుంచి 15,75,501కు తగ్గిందని పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరం ఫలితాల విషయానికొస్తే, నికర లాభం రూ.2,109 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.2,386 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర అమ్మకాలు రూ.25,275 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.27,585 కోట్లకు, విక్రయించిన వాహనాల సంఖ్య 62,45,960 నుంచి 6 శాతం వృద్ధితో 66,31,826కు పెరిగాయని పేర్కొన్నారు. -
బైక్‌ను ఢీకొన్న సుమో..ఒకరి మృతి
వైఎస్సార్ జిల్లా(చిన్నమండెం): చిన్నమండెం మండలంలోని ముండ్లవారికోట గ్రామం వద్ద కడప-బెంగుళూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టాటా సుమో ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో హోటల్ రమేశ్(40) అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. రమేశ్ చిన్నమండెం మండలంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ చిన్న హోటల్ నడుపుతున్నాడు. -
2 కోట్ల టూవీలర్లు విక్రయించిన హోండా
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) భారత్‌లో 2 కోట్ల టూవీలర్లను విక్రయించింది. గత వారం 2 కోట్లవ బైక్‌ను ఉత్పత్తి చేశామని హోండా ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. హోండా షైన్ బైక్, యాక్టివా స్కూటర్ల కారణంగా ఈ స్థాయి అమ్మకాలు సాధించామని, భవిష్యత్తులో మరింత నాణ్యమైన ఉత్పత్తులను, సేవలనందిస్తామని తెలిపారు. -
వాహన ధరలకు రెక్కలు..
4 శాతం వరకూ పెరిగే అవకాశం.. టీవీలు, ఫ్రిజ్‌లు ఇతరత్రా ఉత్పత్తుల రేట్లు కూడా పైపైకి...! ఎక్సైజ్ సుంకం రాయితీల పొడిగింపు లేదని తేల్చిచెప్పిన కేంద్రం... న్యూఢిల్లీ: కొత్త ఏడాది వస్తూనే వినియోగదారుల జేబులు కొల్లగొడుతోంది!! వాహనాలు, టీవీ, ఫ్రిజ్ వంటి వినియోగ వస్తువుల ధరలు రేపటి(జనవరి 1) నుంచి పెరగనున్నాయి. కార్లు, టూ వీలర్లు, కన్సూమర్ డ్యూరబుల్స్‌పై ఇప్పటివరకూ ఇస్తున్న ఎక్సైజ్ సుంకం రాయితీలను పొడిగించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాహనాల ధరలు 4 శాతం వరకూ పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయంటూ పలు వాహన కంపెనీలు తమ కార్ల ధరలను ఇప్పటికే 2 శాతం వరకూ పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెరుగుదల కూడా రేపటి నుంచే అమల్లోకి రానున్నది. ఏతావాతా కొత్త ఏడాది వస్తూనే వినియోగదారులపై ధరల దెబ్బ తీయనున్నది. ఖజానాకు రూ. 1,000 కోట్ల అదనపు రాబడి... గత రెండు సంవత్సరాలుగా తగినంతగా అమ్మకాల్లేక అతలాకుతలమైన వాహన రంగాన్ని ఆదుకోవడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం రాయితీలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ రాయితీలు జూన్30 వరకూ అమల్లో ఉన్నాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఎక్సైజ్ రాయితీలను ఈ నెల 31 వరకూ పొడిగించింది. ఎక్సైజ్ సుంకం రాయితీలను మరికొంత కాలం కొనసాగించాలని వాహన కంపెనీలు కోరుతూ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయని, ఎక్సైజ్ సుంకం రాయితీలను పొడిగిస్తే వాహన రంగానికి ప్రయోజనం కలుగుతుందనేది ఆటోమొబైల్ కంపెనీల వాదన. ఎక్సైజ్ సుంకం రాయితీల పొడిగింపుపై ఈ నెల 31 వరకూ వేచి చూడండి అని కూడా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఊరించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ప్రభుత్వం ఈ రాయితీలను పొడిగించలేదు. ఎక్సైజ్ సుంకం రాయితీలను కొనసాగించడం లేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ నిర్ణయం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడు నెలల్లో ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల అదనపు రాబడి సమకూరుతుందని. దీంతో ద్రవ్యలోటును జీడీపీలో 4.1%కి పరిమితం చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని అంచనాలున్నాయి. తిరోగమన చర్య: ఇది తిరోగమన చర్య అని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ వ్యాఖ్యానించారు. అధిక వడ్డీరేట్లు, బలహీనంగా ఉన్న వినియోగదారుల సెంటిమెంట్ అంశాలకు ఎక్సైజ్ సుంకం పెంపు కూడా తోడైతే రానున్న ఏడాది కూడా వాహన పరిశ్రమకు గడ్డుకాలమేనని పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం పెంపును వినియోగదారులకు బదలాయించక తప్పదని మారుతి సుజుకీ చైర్మన్ ఆర్. సి. భార్గవ చెప్పారు. ధరలు పెరుగుతాయని, దీంతో అమ్మకాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ధరలు పెరుగుతాయని, డిమాండ్‌పై ప్రభావం ఉంటుందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్)జ్ఞానేశ్వర్ సేన్ వ్యాఖ్యానించారు. కొత్త ఏడాది మొదటి మూడు నెలల్లో మంచి అమ్మకాలు సాధిస్తామని ఆశగా ఉన్నామని, కానీ ఈ నిర్ణయం ఆ ఆశలపై నీళ్లు చల్లిందని హేయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు. ఇప్పటికే అధికంగా ఉన్న వడ్డీరేట్లు, మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా అమ్మకాలు తగ్గాయని, ఎక్సైజ్ సుంకం రాయితీ కారణంగా ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయని టాటా మోటార్స్ ప్రతినిధి పేర్కొన్నారు. ఎంత పెరుగుతాయ్... రూ. 1.97 లక్షల నుంచి రూ.4.03 లక్షల రేంజ్లో ఉన్న టాటా నానో, మారుతీ ఆల్టో800, హ్యుందాయ్ ఈఆన్ వంటి ఎంట్రీ లెవల్ కార్ల ధరలు రూ.7,900 నుంచి రూ.16,000 వరకూ పెరగవచ్చు. అలాగే రూ.4.42 లక్షల నుంచి రూ.7.66 లక్షల రేంజ్లో ఉండే మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఇలీట్ ఐ20 వంటి ప్రీమియం హ్యాచ్‌బాక్ కార్ల ధరలు రూ.17,700 నుంచి రూ.30,600 వరకూ పెరగవచ్చు. -
షోరూంలో బైకులను గుట్టుగా అమ్మేశారు!
హైదరాబాద్: నగరంలోని ఓ ద్విచక్ర వాహన షోరూంలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. యజమానికి తెలియకుండానే షోరూం సిబ్బంది బైకులను విక్రయించి ఆ నగదును నొక్కేశారు. వీటిని కొన్నవారు సదరు వాహనాలు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షోరూం యజమాన్యం ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. టోలిచౌకిలోని హోండా బైక్స్ షోరూంలో పనిచేసే ఏడుగురు సిబ్బంది యజమానికి తెలియకుండా 27 బైకులను వినియోగదారులకు విక్రయించి వచ్చిన సొమ్మును పంచుకున్నారు. ఈ తతంగం రెండు నెలల నుంచి సాగింది. వీటిని కొన్నవారికి నకిలీ రసీదులు ఇవ్వడంతో వాటికి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో పలువురు వినియోగదారులు షోరూంకు వచ్చి సిబ్బందిని నిలదీయగా రేపుమాపు అంటూ సిబ్బంది నెట్టుకొస్తున్నారు. ఎంతకు వాహనాల రిజిస్ట్రేషన్ కాకపోవడంతో అనుమానం వచ్చిన వినియోగదారులు విషయాన్ని షోరూం యజమాని దృష్టికి తీసుకెళ్లగా ఆయన రికార్డులు తనిఖీ చేశారు. దీంతో బైకుల స్కాం వెలుగులో వచ్చింది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు షోరూంలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని వీరు విక్రయించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
సులభంగా.. వేగంగా... బైక్ స్ప్రే
ద్విచక్రవాహనంతో పురుగు మందులను పిచికారీ చేసే విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత 90శాతం మంది రైతులు పాత పద్ధతులకు స్వస్తి చెప్పారు. బైక్ సాయంతో పైరుకు మందుకొట్టడం చాలా సులభమంటున్నారు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతోందని చెబుతున్నారు. ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల ఉపాధి లభిస్తోందని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. ఆ వివరాలు ఇవీ... - చిన్నమండెం - ద్విచక్రవాహనంతో పురుగు మందుల పిచికారీ - ఈ పద్ధతి చాలా సులభమంటున్న రైతులు - జీవనోపాధి లభిస్తోందంటున్న నిర్వాహకులు గతంలో కాలితో తొక్కే యంత్రం, భుజాలకు తగిలించుకునే యంత్రం ద్వారా రైతులు పైరుకు మందులను పిచికారీ చేసుకునే వారు. ప్రస్తుతం ద్విచక్రవాహనంతో మందును పిచికారీ చేసుకునే కొత్తపద్ధతి అలవాటైంది. కొందరు నిరుద్యోగులు.బజాజ్ బైక్‌కు ఒక చిన్నపాటి వీల్‌ను ఏర్పాటు చేసుకుని, కావాల్సినంత పైపును, 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్మును అమర్చుకుని పంట పొలాలకు మందులను పిచికారీ చేసి జీవనం సాగిస్తున్నారు. బైక్ పద్ధతి ద్వారా మామిడి, టమాట, వరి, వేరుశనగ, కర్బుజా తదితర పైర్లకు మందు కొట్టొచ్చు. ద్విచక్రవాహనంతో మందులను పిచికారీ చేసే పద్ధతి వచ్చిన తర్వాత 90శాతం మంది రైతులు పాత పద్ధతులకు స్వస్తి పలికారు. ఎందుకంటే ఈ పద్ధతిలో సులభంగానూ, త్వరితగతిన మందును పిచికారీ చేయవచ్చు. పైపు నుంచి మందు వేగంగా వచ్చి చెట్లపైన పడి, ఆ తర్వాత చెట్ల మొదళ్లకు కూడా తాకుంది. తెగుళ్ల నివారణకు కూడా ఈ పద్ధతి బాగుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఒక డ్రమ్ము మందు పిచికారీకి రూ.150 బజాజ్ ద్విచక్ర వాహనం సాయంతో పురుగు మందులు పిచికారీ చేస్తే రూ.150 మాత్రమే ఖర్చవుతుంది. ఇదే మందు పాత పద్ధతిలో పిచికారీ చేయాలంటే, కూలీలకు, మిషన్ అద్దె సహా మొత్తం రూ.500 అవుతుంది. దీంతో పాటు పని కూడా వేగంగా జరుగుతుంది. దీంతోనే రైతులు ఈ పద్ధతిపైనే ఆధారపడుతున్నారు. పని సులభమవుతోంది గతంలో కూలీలను పిలిచి, యంత్రాన్ని బాడుగకు తెచ్చుకుని పైరుకు మందులు కొట్టే వాళ్లం. ఇప్పుడు బైక్‌తో మందును పిచికారీ చేసుకోవడం సులభమవుతోంది. ఖర్చు తగ్గుతోంది. బైక్‌తో మందు కొట్టేందుకు ఎకరాకు 150 రూపాయల ఖర్చవుతోంది. అదే మందును యంత్రం ద్వారా కొట్టాలంటే మిషన్ తొక్కేందుకు ఒకరు, నీళ్లు తెచ్చేందుకు మరొకరు, మందు కొట్టేందుకు ఇంకొకరు మొత్తం ముగ్గురు కూలీలు అవసరం ఉంటుంది. దీంతో పాటు మందులు చాలా సార్లు కలపడం వల్ల పంటలకు సమాన మోతాదులో అందే అవకాశం ఉండదు. - మచ్చ చంద్ర మోహన్, రైతు (9642 407596) జీవనోపాధి దొరికింది రోజువారీ వ్యవసాయ పనులకు వెళ్లేవాడిని. కుటుంబ పోషణ జరిగేది కాదు. ఏడాది క్రితం 20వేల రూపాయల ఖర్చుతో ఒక బజాజ్ బైక్, అందుకు కావాల్సిన పైపు, వీలు, డ్రమ్మును కొనుగోలు చేసుకున్నాను. పైర్లకు మందులను పిచికారీ చేస్తున్నాను. ప్రతి నెలా అన్ని ఖర్చులు పోనూ 10 -15వేల రూపాయలు మిగులుతోంది. పొలాలకు మందులు పిచికారీ చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాను. మామిడితోటల్లో మందు కొట్టాలంటే నాతో పాటు మరొకరిని తీసుకెళతాను. ఖర్చు తక్కువ రావటం వల్ల రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. - దేవరింటి నాగరాజ, బజాజ్ బైక్ నిర్వాహకుడు (95730 48996), దేవగుడిపల్లె -
తెలంగాణలోనే ‘హీరో’ యుూనిట్!
హైదరాబాద్: ప్రపంచ అగ్రశ్రేణి పరిశ్రమ ‘హీరో’ సంస్థ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌ను తెలంగాణలోనే ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. హైదరాబాద్ శివారులోని రావిరాలలో ఈ యుూనిట్ను ఏర్పాటు చేస్తామని, వాటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, రావిరాలలో భూమిని కేటాయించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. రూ.1,250 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 15 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి హీరో సంస్థ నిర్ణయించుకుంది. అయితే ఈ పరిశ్రమను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వాహనాల డీలరుగా ఉన్న టీడీపీ నేత ఒకరు హీరో సంస్థ ఉన్నతస్థాయి వ్యక్తులపై ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. అయితే తెలంగాణలోనే ఏర్పాటు చేయడానికి హీరో సానుకూలంగా ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వ కీలకనేత ఒకరు వెల్లడించారు. -
పోలీసులమంటూ అర్ధరాత్రి హల్చల్
- మహిళా సర్పంచ్‌ను రివాల్వర్‌తో బెదిరించిన దుండగులు - ద్విచక్రవాహనం, సెల్ ఫోన్‌తో పరారీ - అధికార పార్టీ నాయకులపైనే అనుమానం! చాగలమర్రి: పోలీసులమని చెప్పి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి హల్చల్ చేశారు. ముత్యాలపాడు గ్రామ సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు స్వప్న ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళ అని చూడకుండా రివాల్వర్ చూపించి బెదిరించడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటనపై సర్పంచ్ స్వప్న బుధవారం చాగలమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. స్వప్న కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రిస్తుండగా ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల మంటు వచ్చి లేపారు. మీ మరిది బాబావలి ఎక్కడా అంటూ ఆమెను అడగడంతో.. మీరు ఎవరు, ఈ సమయంలో ఎందుకు వచ్చారని సర్పంచ్ ప్రశ్నించారు. మేము పోలీసులమని, బాబావలిని సీఐ తీసుకురమ్మన్నాడని చెప్పారు. అతను ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మళ్లి ఈడ్చుకెళ్తామని బెదించారు. ఇంట్లో ఉన్న సామాన్లను చెల్లాచెదురు చేసి సెల్‌ఫోన్, బయట నిలిపిన ద్విచక్ర వాహానాన్ని తీసుకొని వెళ్లారు. ఈ మేరకు సర్పంచ్ స్వప్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్సర్‌బాష, జగదీశ్వరరెడ్డి, పుల్లయ్య, ముల్లా ఖాదర్‌బాష, స్వామిరెడ్డి ఎస్ఐ హరిప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ విలేకరులతో మాట్లాడుతూ తన భర్త మస్తాన్‌వలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1వ ఎంపీటీసీ స్థానానికి ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో మరుసటి రోజు నుంచి టీడీపీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులలో ఇరికించడమే కాకుండా ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు బనాయిస్తు మూడు నెలలుగా తన భర్తను జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మస్తాన్ వలి జైల్లో ఉండే కూడా ఎంపీటీసీగా గెలుపొందారని చెప్పారు. తన అనుచర ఎంపీటీసీలతో అధికార పార్టీలోకి రావాలని తన భర్తపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తూ, ఇబ్బందులు పెడుతున్నారని ఆమె వాపోయారు. ఇందులో భాగంగానే అర్ధరాత్రి మా ఇంటిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణం పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, భూమా నాగిరెడ్డి నాయకత్వాన్ని వదలి వెళ్లే ప్రసక్తే లేదని స్వప్న స్పష్టం చేశారు. -
ఇక మహిళలకూ హెల్మెట్లు తప్పనిసరి
- గెజిట్ విడుదల చేసిన సర్కార్ - అమల్లోకి వచ్చిన ఆదేశాలు న్యూఢిల్లీ: ద్విచక్రవాహనంపై వెనుక కూర్చొని ప్రయాణించే మహిళలూ ఇక తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని ఢిల్లీ ప్రభుత్వం గె జిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గెజిట్ విడుదలయిన వెంటనే ఆదేశాలు అమల్లోకివచ్చాయి. అయితే దీనిపట్ల ప్రజల్లో ఏమైనా అభ్యంతరాలున్నా, సూచనలన్నా సరిగ్గా 30 రోజుల్లో తమకు తెలియజేయాలని తెలిపింది. ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఎల్జీ ఆమోదించినా.. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అమలుకు ఢిల్లీ ఈసీ అనుమతి కోరింది ప్రభుత్వం. నిర్ణయంపై ముందుకు వెళ్లండన్న ఈసీ ప్రకటనతో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇక నుంచి వెనుక కూర్చొని ఉన్న మహిళలు హెల్మెట్ ధరించకపోయినా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తారని నోటిఫికేషన్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక... రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారి సంఖ్య అత్యధికంగా భారత్‌లోనే ఉన్నట్లు తెలిపింది. భారత్‌లో ఏటా 105,725 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, ఆ త రువాతి స్థానంలో చైనా, అమెరికా, రష్యాలున్నాయని వెల్లడించింది. ఢిల్లీ రవాణా శాఖ లెక్కల ప్రకారం 2012లో ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న 576 మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రతి రోజూ ఇద్దరు చనిపోతుండగా, వారిలో అత్యధికులు వెనుక కూర్చుని ప్రయాణిస్తున్న మహిళలలే అని తేలింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది. అయితే తలపై టోపీల్లాంటివి ధరించొద్దన్న సిక్కు సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం ఉందని ఢిల్లీ సిక్ గురుద్వారా నిర్వహణ కమిటీ, ఇతర సిక్కు సంస్థలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. -
స్పీడు పెరుగుతున్న కారు భీమా !
137 శాతం వరకూ పెరుగుతున్న థర్డ్ పార్టీ ప్రీమియం 150 సీసీలోపు ద్విచక్ర వాహనాలకైతే ప్రీమియంలో 13% వృద్ధి 350సీసీ దాటిన టూవీలర్ల ప్రీమియంలో భారీ తగ్గుదల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు వాహన బీమా ప్రీమియంలు పెరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం... అంటే ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా చిన్న కార్ల ప్రీమియంలు భారీగా పెరుగుతుండగా, ఇదే సమయంలో అధిక సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలు, పబ్లిక్ కారియర్స్ ప్రీమియంలు తగ్గుతుండటం గమనార్హం. దీనికి సంబంధించి ఐఆర్డీఏ ఇప్పటికే ముసాయిదాను విడుదల చేసింది. వీటిని యథాతథంగా ఆమోదిస్తే.. ప్రతి వాహనదారుడికీ కచ్చితంగా కలిగి ఉండాల్సిన థర్డ్ పార్టీ ప్రీమియం ధరలు భారీగానే పెరుగుతాయి. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం.. దేశీయ మోటార్ వాహన చట్టం ప్రకారం ప్రతి వాహనదారుడూ పూర్తిస్థాయి బీమా కాకపోయినా కనీసం థర్డ్ పార్టీ బీమా రక్షణను తప్పకుండా తీసుకుని ఉండాలి. ఇటీవల ప్రమాదాలు పెరిగి... క్లెయిముల సంఖ్య కూడా భారీగా పెరగటంతో 2014-15 సంవత్సరానికి ఈ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లను సవరిస్తూ ఐఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. ఈ రేట్లు అమలు చేస్తే చాలా కార్ల ప్రీమియం ధరలు కనీసం 25 నుంచి 137 శాతం వరకు పెరుగుతాయి. అదే ద్విచక్ర వాహనాల్లో గరిష్టంగా 45 శాతం వరకు ప్రీమియం పెరగవచ్చు. గతేడాది దాఖలైన క్లెయిమ్‌ల ఆధారంగా ఐఆర్డీఏ ఈ ప్రీమియం ధరలను సవరించింది. థర్డ్ పార్టీ అంటే.. సాధారణంగా వాహన బీమాలో రెండు రకాల నష్టాలు జరుగుతుంటాయి. ప్రమాదంలో సొంత కారుకు నష్టం వాటిల్లడం కాని, మన కారు వల్ల ఎదుటి వారి(థర్డ్ పార్టీ)ఆస్తికి, లేదా ప్రాణానికి నష్టం సంభవించడం కాని జరుగుతుంది. సొంత కారుకు జరిగే నష్ట అంచనాని బీమా కంపెనీ నిర్దేశించడమే కాకుండా ఇది పరిమిత స్థాయిలోనే ఉంటుంది. అదే థర్డ్ పార్టీకి జరిగే నష్టానికి వచ్చే సరికి ఆ విలువపై ఎటువంటి పరిమితులు ఉండవు. కొన్ని సందర్భాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరగొచ్చు. ఇలాంటి కేసుల్లో నష్ట పరిహారాన్ని కోర్టులు అంచనా వేస్తాయి. అదే కేవలం ఆస్తి నష్టమైతే గరిష్టంగా రూ.7.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకు పెరుగుతున్నాయి? వాహనదారులు తప్పకుండా కలిగి ఉండాల్సిన ఈ థర్డ్ పార్టీ ప్రీమియంలను ఐఆర్డీఏ నియంత్రిస్తుంటుంది. వస్తున్న ప్రీమియం కన్నా చెల్లిస్తున్న క్లెయిమ్‌లు ఎక్కువగా ఉంటే బీమా కంపెనీలు నష్టాల్లోకి జారుకునే ప్రమాదం ఉంది. అందుకని 2011 నుంచి ప్రతి ఏటా ప్రీమియం టారిఫ్‌లను సమీక్షించాకే ఐఆర్డీఏ నిర్ణయం తీసుకుంటోంది. 2007-08లో సగటు డెత్ క్లెయిమ్ రేటు రూ.2.1 లక్షలుగా ఉంటే అది ఇప్పుడు రూ.3.9 లక్షలకు చేరుకుంది. ముఖ్యంగా 1,000 సీసీ, 1,500 సీసీలోపు సామర్థ్యం కలిగిన కార్లలో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గమనించింది. దీంతో ఈ ఏడాది ఈ విభాగంలో టారిఫ్ రేట్లను ఐఆర్డీఏ భారీగా పెంచింది. ముఖ్యంగా 1000 సీసీలోపు ఉండే వేగన్ ఆర్, మారుతీ ఆల్టో వంటి చిన్న కార్ల థర్డ్ పార్టీ ప్రీమియంలు సుమారుగా ఒకటిన్నర రెట్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది రూ.941 చెల్లిస్తే వచ్చే ఏడాది ఏకంగా రూ.2,227 కట్టాల్సి ఉంటుంది. కాని ఇదే సమయంలో ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉన్న ప్రైవేటు కారియర్స్, 350 సీసీ సామర్థ్యం ఉన్న బైక్‌ల ప్రీమియంలు తగ్గుతున్నాయి. 350 సీసీ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహన ప్రీమియం ధరలు రూ.804 నుంచి రూ.306 తగ్గుతున్నాయి. సవరించిన తర్వాత 350 సీసీ బైక్స్ కంటే 75 సీసీ ద్విచక్ర వాహన ప్రీమియంలు ఎక్కువగా ఉండటం విశేషం. వివిధ వాహనాల ప్రీమియం ధరలు ఇప్పుడెలా ఉన్నాయి? ఏప్రిల్ 1 నుంచి ఎలా ఉంటాయన్నది దిగువ పట్టికలో చూడొచ్చు... -
హీరో మోటో లాభం 525 కోట్లు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి రూ. 525 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 488 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 8% వృద్ధి. ఇక అమ్మకాలు 11% పుంజుకుని రూ. 6,846 కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం రూ. 6,151 కోట్ల అమ్మకాలను సాధించింది. ఈ కాలంలో మొత్తం 16,80,940 వాహనాలను విక్రయించింది. గతంలో ఇదే కాలానికి 15,73,135 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మందగమన మార్కెట్లోనూ అమ్మకాలను పెంచుకోగలిగామని కంపెనీ ఎండీ పవన్ ముంజాల్ చెప్పారు. అయితే లోహాల ధరలు పెరగడం, కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల లాభదాయకత పరిమితమైనట్లు తెలిపారు. టాంజానియా, ఉగాండా, ఈజిప్ట్ తదితర కొత్త మార్కెట్లకు వాహన ఎగుమతులను మొదలుపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. లాటిన్ మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా కొలంబియాలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో హీరో మోటో షేరు బీఎస్ఈలో 3.4% క్షీణించి రూ. 2,000 వద్ద ముగిసింది. -
టూ వీలర్... కొత్త స్టైల్లో...!
టూ వీలర్ అంటే వెనకో చక్రం, ముందో చక్రం ఉండాలా? పక్కపక్కగా ఉంటే ఎలా ఉంటుంది? అనే ఐడియా వచ్చిందో ఏమో కానీ ఇంగ్లండ్‌కు చెందిన కొంతమంది బైక్ డిజైనర్లు కొత్తరకం టూవీలర్‌ను డిజైన్ చేశారు. చక్రాలు ముందు, వెనుక ఉంటే బ్యాలెన్స్ చేయలేని వారి కోసం ఈ కొత్త బైక్‌ను డిజైన్ చేశారు. దీనిపేరు జీరో స్కూటర్. చక్రాలు పక్కపక్కగా ఉండే ఈ బైక్ ను బ్యాలెన్స్ చేయడం చాలా సులభం. దీంట్లో గరిష్ఠంగా 20 మైళ్ల వేగంతో, ఏకధాటిగా 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. 51 ల కేజీ బరువుండే ఈ బైక్ ద్వారా 180 కేజీల బరువును తీసుకెళ్లవచ్చు. లిథియం బ్యాటరీ ద్వారా ఈ బైక్ నడుస్తుంది. ధర దాదాపు నాలుగు వేల డాలర్లు. చూడటానికి ఆసక్తికరంగా, ఫన్నీగా ఉన్న ఈ బైక్‌ను ఏ కంపెనీ ఉత్పత్తి చేయలేదు. వెస్పా బైక్‌ను రీ మాడిఫై చేసి దీన్ని తయారుచేశారు. నేలనుంచి 30 డిగ్రీల కోణంలో ఉన్న రోడ్డువైపు కూడా ఈ బైక్ దూసుకెళ్లగలదు. 360 డిగ్రీల్లోనూ ఈ బైక్‌ను టక్కున టర్న్ చేసుకోవచ్చు. అమ్మలేని లోటు తీరుస్తున్నారు! ఒక పెనుతుపాను ఆ సీల్ చేపల పాలిట మరణమృదంగంలా మారింది. విశాల సముద్రంలో తమ జాతి మధ్య గడుపుతున్న అవన్నీ ఒక్కసారిగా ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇంకా పాలు తాగే దశలో ఉన్నవాటికి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయే నేర్పులేకపోయింది. ఈ సమయంలో ఏ కుక్కల, నక్కల పాలో కావాల్సిన వాటిని సంరక్షిస్తోంది ఒక జీవకారుణ్యసంస్థ. యూకే పరిధిలోని ఈస్ట్ ఆంగ్లియన్ కోస్ట్‌లో ఇటీవల సంభవించిన తుపానుతో మొత్తం 58 బుజ్జి బుజ్జి సీల్ చేపలు ఒడ్డుకు కొట్టుకొవచ్చాయి. ఆ తీరం పక్కనే ఉన్న ఆర్ఎస్పీసీఏ అనే ఆసుపత్రి సిబ్బంది వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకొన్నారు. సీల్ చేపలు క్షీరద జాతికి చెందినవి. బాల్యదశలో ఉన్న వాటికి పాలు పట్టాల్సి ఉంటుంది! ఈ లెక్కన చూస్తే వీటి సంరక్షణ సాధారణమైన విషయం కాదు. అయినా వాటి అమాయకపు చూపులను గమనించి వాటి మీద దయతో ఫీడింగ్ బాధ్యతను తీసుకొన్నారు ఆర్ఎస్పీసీఏ వారు. వాటికి పాలివ్వాల్సిన తల్లి బాధ్యతను నెరవేరుస్తున్నందుకు మానవతావాదులు ఆసుపత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు