
అమర్ అమ్‌షా(ఫైల్)
పహాడీషరీఫ్: పట్టపగలు.. నడిరోడ్డుపై దుండగులు ఓ రౌడీ షీటర్‌ను హతమార్చారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చి జాకీ రాడ్‌తో తలపై కొట్టి చంపేశారు. ఈ ఘటన చూసి ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ వీవీ చలపతి, స్థానికుల కథనం ప్రకారం....బార్కాస్‌కు చెందిన అమర్ అమ్‌షాన్(41)పై పహాడీషరీఫ్, చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేన్‌న్లలో రౌడీషీట్ ఉంది. ఇతను బాలాపూర్ ఎంఐఎం ఎంపీటీసీ అలీ అమ్‌షాన్‌కు సోదరుడు. సోమవారం సాయంత్రం 5 గంటలకు అమర్ అమ్‌షాన్ ద్విచక్రవాహనంపై న్యూబాబానగర్ బస్తీ నుంచి ప్రధాన రహదారి ఎక్కి పహాడీషరీఫ్ వైపు మళ్లాడు.
వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అతడిని అడ్డగించి.. తలపై జాకీరాడ్‌తో బలంగా కొట్టారు. దీంతో తల పగిలి మెదడు బయటపడటంతో అలీ అమ్‌షాన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు దర్యాప్తులో ఉంది. కాగా, బార్కాస్‌కు చెందిన ఉమర్ బహమాద్ అనే యువకుడు సోమవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీస్‌షే్టషన్‌లో లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ హత్యకు భూ వివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుడికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు.