బెంగళూరు:నగరంలో ఓ స్కూటరిస్టు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ట్రిపుల్ సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. అయితే ఈ ట్రిపుల్ సెంచరీ క్రికెట్ ఆటలో కొట్టింది కాదు.ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సాధించింది.కలసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియస్వామి ఏకంగా 311సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి నగరంలోనే అత్యధిక ఉల్లంఘనల చలాన్లు పొందిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు.
ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తున్న పెరియస్వామి స్కూటర్‌ను అతడే కాక అతడి బంధువులు ఇద్దరు ముగ్గురు తరచుగా నడపుతుంటారు.స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడడం, హెల్మెట్ లేకపోవడం, జీబ్రా క్రాసింగ్ మీద బైక్ ఆపడం లాంటి ఉల్లంఘలనకు పాల్పడ్డారు.
అయితే 311 చలాన్లు జారీ చేసినప్పటికీ పెరియస్వామి నుంచి జరిమానా వసూలు చేయడంపై మాత్రం ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టలేదు.అయితే ఓ నెటిజన్ షిబమ్ పెండింగ్ చలాన్ల విషయాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఎక్స్(ట్విటర్)లో పెట్టారు.దీంతో ఈ విషయం సోషల్‌మీడియా హాట్‌టాపిక్‌గా మారింది.
సోషల్‌మీడియాలో ఈ వివాదంపై చర్చ మొదలవడంతో సిటీ మార్కెట్ పోలీసులు పెరియస్వామి ఆఫీసుకు వెళ్లారు. చలాన్ల విషయం చెప్పారు. దీనికి షాక్‌కు గురైన పెరియస్వామి తొలుత కొంత మొత్తం చెల్లిస్తానని, తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తానని చెప్పారు.జరిమానాలన్నీ కలిపి లక్షా 50 వేలు దాటడంతో స్కూటర్‌ను పోలీస్‌స్టేషనలో వదిలేస్తే బెటరని పెరియస్వామికి సలహా ఇవ్వడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment