triple century
-
చలాన్లలో ట్రిపుల్ సెంచరీ..!
బెంగళూరు:నగరంలో ఓ స్కూటరిస్టు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ట్రిపుల్ సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. అయితే ఈ ట్రిపుల్ సెంచరీ క్రికెట్ ఆటలో కొట్టింది కాదు.ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సాధించింది.కలసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియస్వామి ఏకంగా 311సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి నగరంలోనే అత్యధిక ఉల్లంఘనల చలాన్లు పొందిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు.ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తున్న పెరియస్వామి స్కూటర్‌ను అతడే కాక అతడి బంధువులు ఇద్దరు ముగ్గురు తరచుగా నడపుతుంటారు.స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడడం, హెల్మెట్ లేకపోవడం, జీబ్రా క్రాసింగ్ మీద బైక్ ఆపడం లాంటి ఉల్లంఘలనకు పాల్పడ్డారు.అయితే 311 చలాన్లు జారీ చేసినప్పటికీ పెరియస్వామి నుంచి జరిమానా వసూలు చేయడంపై మాత్రం ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టలేదు.అయితే ఓ నెటిజన్ షిబమ్ పెండింగ్ చలాన్ల విషయాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఎక్స్(ట్విటర్)లో పెట్టారు.దీంతో ఈ విషయం సోషల్‌మీడియా హాట్‌టాపిక్‌గా మారింది.సోషల్‌మీడియాలో ఈ వివాదంపై చర్చ మొదలవడంతో సిటీ మార్కెట్ పోలీసులు పెరియస్వామి ఆఫీసుకు వెళ్లారు. చలాన్ల విషయం చెప్పారు. దీనికి షాక్‌కు గురైన పెరియస్వామి తొలుత కొంత మొత్తం చెల్లిస్తానని, తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తానని చెప్పారు.జరిమానాలన్నీ కలిపి లక్షా 50 వేలు దాటడంతో స్కూటర్‌ను పోలీస్‌స్టేషనలో వదిలేస్తే బెటరని పెరియస్వామికి సలహా ఇవ్వడం విశేషం. -
వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్
బెంగళూరులోని ఆలుర్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న అండర్-19 మహిళల వన్డే కప్‌లో 14 ఏళ్ల ముంబై అమ్మాయి ట్రిపుల్ సెంచరీ సాధించింది. మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో ఐరా జాదవ్ 157 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 220.38 స్ట్రయిక్‌రేట్‌తో 346 పరుగులు (నాటౌట్) చేసింది. భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లో అయినా ఇదే అత్యధిక స్కోర్. ఇరా జాదవ్ వైట్ బాల్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయురాలు.మహిళల అండర్-19 లెవెల్లో ఐరా జదావ్‌కు ముందు నలుగురు డబుల్ సెంచరీలు సాధించారు. ప్రస్తుత టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన 224 నాటౌట్, రాఘ్వి బిస్త్ 219 నాటౌట్, జెమీమా రోడ్రిగెజ్ 202 నాటౌట్, సనికా ఛాల్కే 200 పరుగులు చేశారు. ఛాల్కే త్వరలో జరుగనున్న మహిళల అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించనుంది. రాఘ్వి బిస్ట్ విషయానికొస్తే.. ఈ అమ్మాయి ఇటీవలే భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసింది.ఐరా ట్రిపుల్.. ముంబై రికార్డు స్కోర్మ్యాచ్ విషయానికొస్తే.. ఐరా జాదవ్ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కడంతో మేఘాలయాపై ముంబై కనీవినీ ఎరుగని స్కోర్ చేసింది. ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 563 పరుగులు చేసింది. అండర్-19 మహిళల వన్డే కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ముంబై తరఫున ఇదే అత్యధిక స్కోర్. మేఘాలయాతో మ్యాచ్‌లో ఐరాతో పాటు మరో ప్లేయర్ మూడంకెల స్కోర్ చేసింది. హర్లీ గాలా 79 బంతుల్లో 116 పరుగులు సాధించింది.ఐపీఎల్ వేలంలో ఎవరూ పట్టించుకోలేదు..!హిట్టర్‌గా పేరున్న ఐరా జాదవ్‌ను మహిళల ఐపీఎల్-2025 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 10 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో ఐరా మెగా వేలంలో పాల్గొంది. -
తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్న సెహ్వాగ్ తనయుడు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తృటిలో ట్రిపుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. బీసీసీఐ ఆథ్వర్యంలో నడిచే కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్ 309 బంతుల్లో 51 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 297 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్యవీర్ మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ స్కోర్ చేశాడు. ఆర్యవీర్ ఔట్ కాగానే ఢిల్లీ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ (623/5) చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 98 పరుగుల వద్ద ఉండిన ధన్య నక్రా ఈ రోజు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నక్రా 122 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అర్నవ్ బుగ్రా (114) కూడా సెంచరీతో చెలరేగాడు. మూడో రోజు లంచ్ సమయానికి మేఘాలయ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. మంధన్ (32), నర్లెంగ్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు మేఘాలయ ఇంకా 293 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకే ఆలౌటైంది.తండ్రి బాటలోనే తనయుడుఆర్యవీర్ సెహ్వాగ్ బాటలోనే నడుస్తున్నాడు. ఆర్యవీర్ సైతం తండ్రిలాగే వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఎదురుచూడలేదు. ఏ స్కోర్ వద్ద ఉన్న దూకుడే మంత్రంగా ఆడాడు. అందుకే ఈ మ్యాచ్‌లో ఆర్యవీర్ ట్రిపుల్ సెంచరీని లెక్క చేయలేదు. వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్లో చాలా సందర్భాల్లో సెంచరీలు, డబుల్, ట్రిపుల్ సెంచరీలు మిస్ అయ్యాడు. 2009లో సెహ్వాగ్ ఓ టెస్ట్ మ్యాచ్‌లో 293 స్కోర్ వద్ద ఔటయ్యాడు. సెహ్వాగ్ కెరీర్లో అప్పటికే రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. ఆర్యవీర్ ఇప్పుడిప్పుడే క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. అతని నుంచి కూడా తండ్రి లాంటి ఇన్నింగ్స్‌లే ఆశించవచ్చు. ఆర్యవీర్ ఈ ఏడాది అక్టోబర్‌లో వినూ మన్కడ్ ట్రోఫీతో ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే ఆర్యవీర్ 49 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
టెస్ట్‌ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన బ్రూక్
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 322 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 29 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 317 పరుగులు చేసి ఔటయ్యాడు. టెస్ట్‌ల్లో బ్రూక్ చేసిన ఈ ట్రిపుల్ సెంచరీ రెండో వేగవంతమైనది. బ్రూక్ తన ట్రిపుల్‌ను 310 బంతుల్లో పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 278 బంతుల్లోనే ట్రిపుల్ కంప్లీట్ చేశాడు.టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ హండ్రెడ్స్- సెహ్వాగ్- 278 బంతులు- బ్రూక్- 310 బంతులు- మాథ్యూ హేడెన్- 362 బంతులు- సెహ్వాగ్- 364 బంతులుకాగా, ఈ మ్యాచ్‌లో బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా.. జో రూట్ భారీ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. రూట్ 375 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 262 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో పాటు జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 823 పరుగుల వద్ద (7 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం -
హ్యారీ బ్రూక్ ఊచకోత.. పాక్‌పై ట్రిపుల్ సెంచరీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్రూక్ విధ్వంసకర ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు.ముల్తాన్ వికెట్‌పై పాక్ బౌలర్లకు బ్రూక్ చుక్కలు చూపించాడు. అతడని ఆపడం ఎవరి తరం కాలేదు. 310 బంతుల్లో 28 ఫోర్లు, 3 సిక్స్‌లతో బ్రూక్ తన తొలి ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.బ్రూక్ ప్రస్తుతం 305 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాడు జో రూట్(262) డబుల్ సెంచరీ సాధించాడు. రూట్‌తో కలిసి హ్యారీ బ్రూక్ నాలుగో వికెట్ 454 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 147 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 795 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 239 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. -
ట్రిపుల్ సెంచరీకి చేరువలో కుల్దీప్
టీమిండియా చైనా మెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌లో కుల్దీప్ మరో ఆరు వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల అరుదైన మైలురాయిని తాకుతాడు. కుల్దీప్ ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 53 వికెట్లు.. 106 వన్డేల్లో 172 వికెట్లు.. 40 టీ20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ టెస్ట్‌ల్లో 4 సార్లు, వన్డేల్లో 2 సార్లు, టీ20ల్లో 2 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించాడు. ఇంత స్వల్ప కెరీర్లో ఇన్ని ఐదు వికెట్ల ఘనతలు సాధించడం చాలా అరుదు. కుల్దీప్ ఖాతాలో రెండు వన్డే హ్యాట్రిక్‌లు కూడా ఉన్నాయి.అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. కుంబ్లే మూడు ఫార్మాట్లలో కలిపి 953 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో కుంబ్లే తర్వాతి స్థానాల్లో అశ్విన్ (744), హర్బజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (597), రవీంద్ర జడేజా (568), శ్రీనాథ్ (551), షమీ (448), ఇషాంత్ శర్మ (434), బుమ్రా (397), అగార్కర్ (349), ఇర్ఫాన్ పఠాన్ (301) ఉన్నారు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల మార్కును 12 మంది తాకారు. వికెట్ల ట్రిపుల్ సాధిస్తే కుల్దీప్ 13వ భారత బౌలర్ అవుతాడు.బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉండే అవకాశం ఉండటంతో ఇక్కడ కుల్దీప్ చెలరేగడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. ఇదే మ్యాచ్‌లో కుల్దీప్ ట్రిపుల్ సెంచరీ వికెట్ల మార్కును తాకవచ్చు.రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరుగనుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్‌కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: జోరుగా సాగుతున్న టీమిండియా ప్రాక్టీస్.. వీడియో -
ట్రిపుల్ సెంచరీతో విజృంభించిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్
అండర్-23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ 2024 ఎడిషన్ తొలి క్వార్టర్ ఫైనల్లో ఉత్తర్‌ప్రదేశ్ ఆటగాడు, చెనై సూపర్ కింగ్స్ ప్లేయర్ సమీర్ రిజ్వి ట్రిపుల్ సెంచరీతో ఇరగదీశాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో రిజ్వి 266 బంతులు ఎదుర్కొని 33 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 312 పరుగులు చేశాడు. రిజ్వి ట్రిపుల్ సెంచరీతో విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ అతి భారీ స్కోర్ చేసింది. 147 ఓవర్ల అనంతరం ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 719 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. రిజ్వికి జతగా రితురాజ్ శర్మ (132) సెంచరీతో కదంతొక్కాడు. స్వస్తిక్ (57), సిద్దార్థ్ యాదవ్ (84) అర్దసెంచరీలతో రాణించారు. విప్రాజ్ నిగమ్ (19), ఆకిబ్ ఖాన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఆదిత్యసిన్హ్ జడేజా 5 వికెట్లు పడగొట్టగా.. నీల్ పాండ్యా 2, గజ్జర్ సమ్మార్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రెండో రోజు ఆట కొనసాగుతుంది. మిగతా మూడు క్వార్టర్ ఫైనల్స్ విషయానికొస్తే.. రెండో క్వార్టర్ ఫైనల్లో విదర్భ, తమిళనాడు.. మూడో క్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్, కర్ణాటక.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో రైల్వేస్, ముంబై జట్లు తలపడుతున్నాయి. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ.. మోఖడే (151), మహళే (117) సెంచరీలతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 380 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేసి ఆలౌటైంది. ప్రకార్ చతుర్వేది (147), స్మరణ్ (106) సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ రెండో రోజు టీ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ముంబైతో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసి రైల్వేస్ 165 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు సింగ్ ఏడు వికెట్లు తీసి రైల్వేస్ పతనాన్ని శాశించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. దివ్యాంశ్ సక్సేనా సెంచరీతో (104) రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. జాక్‌పాట్ కొట్టిన సమీర్ రిజ్వి.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వి ఐపీఎల్ 2024 వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. 20 ఏళ్ల రిజ్విని చెన్నై సూపర్ కింగ్స్ 8.4 కోట్ల రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఐపీఎల్లో ఓ అన్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌కు లభించిన అత్యధిక ధర ఇదే. ఈ వేలంలో రిజ్వి కోసం గుజరాత్ టైటాన్స్ సైతం తీవ్రంగా ప్రయత్నించింది. కుడి చేతి వాటం డాషింగ్ బ్యాటర్ అయిన రిజ్వి.. యూపీ టీ20 లీగ్‌లో మెరుపు శతకం బాదడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. -
శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
టీమిండియా తరఫున ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి, భారత్ తరఫున సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ప్రసిద్ధి చెంది, ఆతర్వాత మరో 4 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడి కనుమరుగైపోయిన కరుణ్ నాయర్.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పోటీల్లో ఇరగదీస్తున్నాడు. భారత దేశవాలీ క్రికెట్లో సొంత జట్టు కర్ణాటక కాదనుకుంటే విదర్భకు వలస వెళ్లి, అక్కడ కెరీర్ పునఃప్రారంభించిన నాయర్.. ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని తనను కాదనుకున్న వారికి బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. HUNDRED FOR KARUN NAIR....!!! Northamptonshire under big trouble with 151 for 6, against an attack led by Roach - Karun smashed a brilliant hundred in his 2nd match of the season. pic.twitter.com/JcJKDxu9bb — Johns. (@CricCrazyJohns) September 20, 2023 ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ఆడే అవకాశాన్ని దక్కించుకున్న నాయర్.. తానాడిన తొలి మ్యాచ్‌లో (వార్విక్షైర్) అర్ధసెంచరీ (78), రెండో మ్యాచ్‌లో ఏకంగా అజేయ సెంచరీ (144 నాటౌట్; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ ప్రదర్శనతో అయినా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న నాయర్.. తన మనసులోని మాటను ఇటీవలే ట్విటర్ వేదికగా బహిర్గతం చేశాడు. డియర్ క్రికెట్.. నాకు మరో ఛాన్స్ ఇవ్వు అంటూ నాయర్ తనలోని అంతర్మథనానికి వెల్లగక్కాడు. ప్రస్తుత కౌంటీ సీజన్లో నార్తంప్టన్‌షైర్ తరఫున కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్న నాయర్.. తాజాగా ప్రదర్శనతో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. A fantastic century by Karun Nair in the County Championship. pic.twitter.com/JwtbAkSOHX — Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 టెస్ట్‌ల్లో టీమిండియాను మిడిలార్డర్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు నాయర్ ప్రదర్శనను ఏమేరకు పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాలి. నాయర్.. సుదీర్ఘ ఫార్మాట్‌తో పాటు పొట్టి క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇటీవల ముగిసిన కర్ణాటక టీ20 టోర్నీలో (మహారాజా ట్రోఫీ) అతను 12 మ్యాచ్‌ల్లో 162.69 స్ట్రయిక్‌రేట్‌తో ఏకంగా 532 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. గుల్భర్గా మిస్టిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో అతను చేసిన సెంచరీ టోర్నీ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. భారత్ తరఫున 6 టెస్ట్‌లు, 2 వన్డేలు ఆడిన నాయర్.. మొత్తంగా 420 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. 31 ఏళ్ల నాయర్ తన అంతర్జాతీయ కెరీర్లో చేసిన ఏకైక సెంచరీ ట్రిపుల్ సెంచరీ (303 నాటౌట్) కావడం విశేషం. -
అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ఖతం!
After Virender Sehwag Only Other Indian To Score Triple Century: అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన బ్యాటర్లు కోకొల్లలు. అదే ట్రిపుల్ సెంచరీ సాధించిన వాళ్లు మాత్రం అరుదు. ఆ జాబితాలో ఉన్న వాళ్లెవరనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. ఈ టీమిండియా విధ్వంసకర ఓపెనర్ 2004లో తొలిసారి ఈ ఫీట్ అందుకున్నాడు. అది కూడా మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ గడ్డపై 309 పరుగులు సాధించి ముల్తాన్ కింగ్‌గా నీరజనాలు అందుకున్నాడు. 2008లో స్వదేశంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో చెన్నైలో 319 పరుగులతో మెరిశాడు. ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి మరి వీరూతో పాటుగా ఈ త్రిశతక లిస్టులో ఉన్న మరో భారత క్రికెటర్ గురించి తెలుసా? దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించే రాజస్తాన్ బ్యాటర్ కరుణ్ నాయర్. 2013-14 సీజన్లో రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఫైనల్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. 328 పరుగులతో రాణించి కర్ణాటకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాతి రంజీ సీజన్లో రెండు శతకాలు బాదడంతో పాటుగా మరో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇలా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన కరుణ్ నాయర్ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 4 పరుగుల వద్ద రనౌట్.. తర్వాత ఎల్బీగా.. జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతడు.. అదే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొహాలీలో మూడో టెస్టు సందర్భంగా తన తొలి మ్యాచ్ ఆడిన కరుణ్ నాయర్.. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. బ్యాట్ ఝులిపించి.. ట్రిపుల్ సెంచరీ బాది తదుపరి ముంబై మ్యాచ్‌లోనూ 13 పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న కరుణ్.. ఐదో టెస్టులో మాత్రం బ్యాట్ ఝులిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే ఏకంగా త్రిశతకం బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఇన్నింగ్స్ 75 పరుగుల భారీ తేడాతో గెలవగా.. కరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెహ్వాగ్ తర్వాత రెండో భారత క్రికెటర్‌గా.. అలా ప్రపంచంలో నంబర్ 1 ఇక ఈ మ్యాచ్ సందర్భంగా.. ట్రిపుల్ సెంచరీతో మెరిసి ప్రపంచంలో ఈ ఘనత సాధించి మూడో క్రికెటర్‌గా కరుణ్ నాయర్ రికార్డులకెక్కాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఏడాదిలోనే ముగిసిన కెరీర్ అదే విధంగా.. తక్కువ మ్యాచ్‌లు ఆడి టెస్టుల్లో త్రిశతకం నమోదు చేసిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత మెరుగ్గా రాణించలేకపోయిన కరుణ్ నాయర్ కెరీర్ మరుసటి ఏడాదే ముగిసింది. 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో మొత్తంగా టీమిండియా తరఫున 6 టెస్టులు, రెండు వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ వరుసగా ఆయా ఫార్మాట్లలో మొత్తంగా 374, 39 పరుగులు చేయగలిగాడు. ఇక 2013 నుంచే ఐపీఎల్ ఆడుతున్న కరుణ్ ఆర్సీబీతో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎక్కడ? డానియల్ వెటోరీ, విరాట్ కోహ్లి సారథ్యంలో బెంగళూరు జట్టుకు ఆడిన అతడు.. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు కూడా ప్రాతినిథ్య వహించాడు. ఇక 2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడిన నేపథ్యంలో.. అతడి స్థానాన్ని 31 ఏళ్ల కరుణ్ నాయర్‌తో భర్తీ చేసింది మేనేజ్మెంట్. ఇక కరుణ్ సనయ తంకరివాలాను వివాహమాడగా.. వారికి కుమారుడు జన్మించాడు. చదవండి: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్.. విండీస్‌కు కూడా..! ఏదో క్లబ్‌గేమ్ ఆడుతున్నట్లు.. రాష్ట్రస్థాయి మ్యాచ్ అన్నట్లు! తిలక్ అలా.. -
50 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ బాదిన హైదరాబాదీ కుర్రాడు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌ల్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. రెండు రోజుల లీగ్‌లో భాగంగా కాంకర్డ్ క్రికెట్ క్లబ్, శ్రీశ్యామ్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ వర్గీస్ అనే కుర్రాడు ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో కాంకర్డ్ తరపున ఆడిన ఆరోన్ వర్గీస్ మెరుపు ఇన్నింగ్స్ ప్రదర్శించాడు. కేవలం 260 బంతుల్లో 50 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 321 పరుగులు సాధించాడు. ఆరోన్ అద్భుత బ్యాటింగ్‌కు తోడుగా అయాన్ అహ్మద్(52), రామ్ రేపాల(50) రాణించడంతో కంకార్డ్ 85.5 ఓవర్లలో(నిర్ణీత 90 ఓవర్లు) 560 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు చేసిన 560 పరుగుల్లో 321 పరుగులు ఆరోన్ వర్గీస్వే కావడం విశేషం. చదవండి: కసితీరా బాదారు.. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల చేధన -
ఏకైక భారత ఆటగాడిగా పృథ్వీ షా.. ఈ రికార్డు కూడా తన ఖాతాలోనే!
Ranji Trophy 2022-23- Prithvi Shaw అమిన్‌గావ్ (అస్సాం): జాతీయ జట్టులో పునరాగమనం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ముంబై యువ క్రికెటర్ పృథ్వీ షా అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన విషయం విదితమే. అస్సాం జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో పృథ్వీ షా (383 బంతుల్లో 379; 49 ఫోర్లు, 4 సిక్స్‌లు) ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో 23 ఏళ్ల పృథ్వీ షా 89 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్ర పుటల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ చరిత్రలో మహారాష్ట్ర క్రికెటర్ బి.బి.నింబాల్కర్ (443 నాటౌట్; 1948లో కతియావార్ జట్టుపై) తర్వాత రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా పృథ్వీ షా నిలిచాడు. అదే విధంగా ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో దేశవాళీ క్రికెట్లో అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఏకైక భారత ఆటగాడిగా రికార్డు రంజీ ట్రోఫీలో ‘ట్రిపుల్ సెంచరీ’... విజయ్ హజారే వన్డే టోర్నీలో ‘డబుల్ సెంచరీ’... ముస్తాక్ అలీ టి20 టోర్నీలో సెంచరీ చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా పృథ్వీ షా గుర్తింపు పొందాడు. రియాన్ బౌలింగ్‌లో.. ఇక ఈ రంజీ సీజన్లో పృథ్వీ ఇప్పటివరకు 539 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు పృథ్వీ షాను జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారా లేదంటే అన్యాయం చేస్తూనే ఉంటారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా 2021 శ్రీలంక పర్యటన తర్వాత పృథ్వీ షాకు ఇంతవరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 240తో బ్యాటింగ్ కొనసాగించిన పృథ్వీ మరో 139 పరుగులు సాధించి రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓవర్‌నైట్ స్కోరు 397/2తో ఆట కొనసాగించిన ముంబై ... కెప్టెన్ అజింక్య రహానే (191; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అవుటవ్వగానే తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 129 పరుగులు చేసింది. చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్‌లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని? IND Vs SL: కోల్‌కతాలోనే సిరీస్ పడతారా? -
రంజీల్లో పృథ్వీ షా చరిత్ర.. అరుదైన రికార్డు! ఎవరికీ అందనంత ఎత్తులో!
Prithvi Shaw Triple Century- Rare Record: ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ముంబై బ్యాటర్ తన అభిమాన ఆటగాడని.. అతడే తన రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందన్నాడు. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా అసోంతో మ్యాచ్‌లో పృథ్వీ షా అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆటలో భాగంగా ఈ ముంబైకర్ ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 379 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కొద్దిలో క్వాడ్రపుల్ సెంచరీ మిస్ అయినా.. కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. రంజీల్లో సరికొత్త చరిత్ర ఈ క్రమంలో రంజీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. బాంబే ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్‌ను అధిగమించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానానికి దూసుకువచ్చాడు. అరుదైన ఘనత సాధించి తన సమకాలీన క్రికెటర్లకు అందనంత ఎత్తుకు ఎదిగాడు 23 ఏళ్ల ఈ టీమిండియా ఓపెనర్. ఈ నేపథ్యంలో పృథ్వీని అభినందిస్తూ.. సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. ‘‘377 పరుగులతో నేను సృష్టించిన రికార్డును.. నేను అభిమానించే ఆటగాడు బద్దలు కొట్టడం చూసి థ్రిల్ అయ్యాను. వెల్డన్ పృథ్వీ!’’ అని ఈ యువ ఆటగాడిని ప్రశంసించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు 1. బీబీ నింబాల్కర్ (మహారాష్ట్ర) – 443 నాటౌట్ (vs) సౌరాష్ట్ర (1948-49) 2. పృథ్వీ షా (ముంబై) – 379 (vs) అసోం (2022-23) 3. సంజయ్ మంజ్రేకర్ (బాంబే) – 377 (vs)హైదరాబాద్ (1990-91) 4. ఎంవీ శ్రీధర్ (హైదరాబాద్) – 366 (vs) ఆంధ్ర (1993-94) 5. విజయ్ మర్చంట్ (బాంబే) – 359 నాటౌట్(vs) మహారాష్ట్ర (1943-44) చదవండి: Ind Vs SL: ఇలాంటి ఆటగాడిని చూడలేదు.. ఆ ప్రేమ నిజం! కోహ్లి ప్రశంసల జల్లు IPL 2023-Rishabh Pant: పంత్ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు Champion player 💪 Too good @PrithviShaw 💯💯💯 👏 pic.twitter.com/5wZ29EasNb — Shreyas Iyer (@ShreyasIyer15) January 11, 2023 Thrilled that my record of 377 was beaten by a batter I adore! Well done Prithvi! 👏🏼👏🏼👏🏼 — Sanjay Manjrekar (@sanjaymanjrekar) January 11, 2023 -
టీమిండియా యువ ఓపెనర్ విధ్వంసం.. 400 మిస్! రికార్డులు బద్దలు
Assam vs Mumbai- Prithvi Shaw Triple Century: రంజీ ట్రోఫీ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర పృథ్వీ షా దుమ్ములేపుతున్నాడు. ఈ ముంబై ఆటగాడు అసోంతో మ్యాచ్‌లో ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిచాడు. గువహటి వేదికగా మంగళవారం మొదలైన టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఈ యువ బ్యాటర్ 240 పరుగులు సాధించాడు. క్వాడ్రపుల్ సెంచరీ మిస్ ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా త్రిశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 379 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్‌లో పృథ్వీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో క్వాడ్రపుల్ సెంచరీ మిస్సయ్యాడు. కాగా ఈ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 383 బంతులు ఎదుర్కొన్న 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఈ మేరకు భారీగా పరుగులు రాబట్టాడు. దిగ్గజాల రికార్డులు బద్దలు తద్వారా ట్రిపుల్ సెంచరీ వీరుడు 23 ఏళ్ల పృథ్వీ షా.. టీమిండియా దిగ్గజాల పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. గతంలో సంజయ్ మంజ్రేకర్ 377 పరుగులతో ముంబై టాప్ బ్యాటర్‌గా ఉండగా.. 32 ఏళ్ల తర్వాత యువ ఓపెనర్ పృథ్వీ షా అతడిని అధిగమించాడు. అదే విధంగా.. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (ముంబై తరఫున రంజీల్లో 340 పరుగులు)ను కూడా దాటేశాడు. కాగా గత కొన్నాళ్లుగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న పృథ్వీ షా ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. చదవండి: Kohli-Pandya: పాండ్యాపై గుడ్లురిమిన కోహ్లి! సెంచరీ మిస్ అయ్యేవాడే! వీడియో వైరల్ IPL 2023: పంత్ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు -
చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న అంధుల వన్డే క్రికెట్ సిరీస్‌లో ఆసీస్ ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో భాగంగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బ్యాటర్ స్టెఫన్ నీరో ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. టీ20ల ప్రభావం కారణంగా వన్డేల్లో డబుల్ హండ్రెడ్ చేయడమే గగనమైన ఈ రోజుల్లో ఓ అంధ క్రికెటర్ ట్రిపుల్ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. కామన్వెల్త్ బ్యాంక్ అంధుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బ్యాటర్ స్టెఫన్ నీరో కేవలం 140 బంతుల్లో 49 ఫోర్లు, సిక్సర్ సాయంతో 309 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 542 పరుగుల భారీ స్కో్ర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన కివీస్ కేవలం 272 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా 270 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. A TRIPLE century! Steffan Nero finishes 309* (140) in the Australian Blind Cricket Team's first ODI against New Zealand 🇦🇺That's his third consecutive century at the #ICIS22 after scores of 113 (46) and 101* (47) earlier this week 👏 https://t.co/MDTiUnAC1S | #ASportForAll pic.twitter.com/cqv9vBEPW3— Cricket Australia (@CricketAus) June 14, 2022 ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన నీరో.. అంధుల వన్డే క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించడం ద్వారా స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 1998లో పాక్ బ్యాటర్ మసూద్ జాన్ చేసిన 262 పరుగులే అంధుల వన్డే క్రికెట్లో టాప్ స్కోర్‌గా ఉండింది. తాజాగా నీరో విధ్వంసంతో మసూద్ జాన్ రికార్డు బద్దలైంది. 5 టీ20లు, 3 వన్డేల ఈ సిరీస్‌లో నీరో ఇప్పటికే రెండు సెంచరీలు (113, 101) సాధించడం విశేషం. ఎనిమిదో ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు.. కివీస్‌పై వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయడంతో నీరో మరో రికార్డును కూడా తర ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా నీరో రికార్డుల్లోకెక్కాడు. గతంలో మాథ్యూ హేడెన్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో ట్రిపుల్ సెంచరీలు సాధించారు. చదవండి: ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్ప అన్న వారు ఈ లెక్కలు చూస్తే ఖంగుతినాల్సిందే..! -
తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!
బిహార్ రంజీ ఆటగాడు షకీబుల్ గని ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గని రికార్డులకెక్కాడు. రంజీ ట్రోఫి 2021-22 సీజన్లో భాగంగా మిజోరామ్తో జరిగిన మ్యాచ్‌లో షకీబుల్ గని ట్రిపుల్ సెంచరీ సాధించాడు. గని కేవలం 387 బంతుల్లోనే 300 పరుగులు చేశాడు. ఇక బిహార్ తొలి ఇన్నింగ్స్‌లో షకీబుల్ మొత్తంగా 405 బంతుల్లో 341 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 56 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు రంజీ ట్రోఫీలో ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ కావడం గమనార్హం. అంతకు ముందు 2018-2019 రంజీ ట్రోఫీ సీజన్లో మధ్య ప్రదేశ్ ఆటగాడు అజేయ్ రోహరా 267 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న బిహార్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 686 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో గని.. బాబుల్ కుమార్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 500 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరో వైపు బాబుల్ కుమార్ కూడా డబుల్ సెంచరీ సాధించాడు. చదవండి: IPL 2022 SRH- Simon Katich: మొన్ననే సంతోషంగా ఉందన్నాడు.. ఇంతలోనే ఏమైందో! కారణం ఆమేనా? 🚨 RECORD ALERT 🚨 3⃣4⃣1⃣ Runs 4⃣0⃣5⃣ Balls 5⃣6⃣ Fours 2⃣ Sixes Sakibul Gani, playing for Bihar, created a world record as he became the 1⃣st batter to score a Triple Ton on First Class debut. 👏 🔝 #BIHvCAM #RanjiTrophy @Paytm A snippet from that landmark knock 🎥 🔽 pic.twitter.com/LXK7F0yA2N — BCCI Domestic (@BCCIdomestic) February 18, 2022 -
అదేంటో అదే రోజు.. రెండు ట్రిపుల్ సెంచరీలు: సెహ్వాగ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్ గడ్డపై నెలకొల్పిన అరుదైన రికార్డు క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 2004లో దాయాది దేశంలో పర్యటించిన భారత జట్టు, నాటి టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇందులో భాగంగా, ముల్తాన్ టెస్టు(మార్చి 28)లో వీరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ట్రిపుల్ సెంచరీ(309 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ చరిత్రకెక్కాడు. ఇక ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తన తొలి ట్రిపుల్ సెంచరీకి 17 ఏళ్లు నిండిన సందర్భంగా సెహ్వాగ్ ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ‘‘మార్చి 29.. నాకు ఎంతో ప్రత్యేకమైన తేదీ. టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా గౌరవం లభించింది. ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై ఈ ఘనత సాధించాను. యాధృచ్చికంగా సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే రోజు దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాను’’అంటూ పాత వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. ఈ క్రమంలో.. ‘‘ముల్తాన్ కా సుల్తాన్.. వీరూ పా నీ అద్భుత ఇన్నింగ్స్ మిస్పవుతున్నాం’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: సచిన్ పాజీతో మళ్లీ బ్యాటింగ్.. సూపర్ ఇన్నింగ్స్! 29th March- a special date for me. Had the privilege and honour of becoming the first Indian to score a triple hundred in Test cricket. Icing in the cake was to score against Pakistan in Multan. Coincidentally 4 years later on the same date got out on 319 against South Africa. pic.twitter.com/ZKBHa5rCOA — Virender Sehwag (@virendersehwag) March 29, 2021 -
ట్రిపుల్ సెంచరీతో షురూ- నిఫ్టీ సెంచరీ
వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 349 పాయింట్లు జంప్‌చేసి 38,083కు చేరగా.. నిఫ్టీ 101 పాయింట్లు ఎగసి 11,255 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలకు డిమాండ్ నెలకొనడంతో నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ మంగళవారం యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి. అయితే ఇటీవల పతన బాటలో సాగిన దేశీ మార్కెట్లలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడంతో ఇండెక్సులు ఊపందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ గురువారం ముగియనుండటం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. లాభాలతో ఎన్ఎస్ఈలో అన్ని ప్రధాన రంగాలూ సగటున 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. మెటల్ స్వల్పంగా 0.15 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్ఐఎల్, విప్రో, ఇన్ఫోసిస్, జీ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, ఐషర్, ఎల్అండ్టీ, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ 2.5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎయిర్టెల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, టీసీఎస్, బజాజ్ ఆటో, శ్రీ సిమెంట్ 2-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి. ఎఫ్‌అండ్‌వో ఇలా డెరివేటివ్ కౌంటర్లలో నౌకరీ, ఇండిగో, మైండ్‌ట్రీ, హావెల్స్, కోఫోర్జ్, గ్లెన్‌మార్క్, బీఈఎల్, అశోక్ లేలాండ్ 3.6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐడియా 3.4 శాతం పతనంకాగా.. పెట్రోనెట్, బీవోబీ, భారత్ ఫోర్జ్, అంబుజా, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్ 0.8-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-1.4 శాతం మధ్య ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,189 లాభపడగా.. 375 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. -
మొన్న ట్రిపుల్ సెంచరీ.. మళ్లీ డబుల్ సెంచరీ
ధర్మశాల: రంజీ ట్రోఫీలో ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ జోరు కొనసాగుతోంది. వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్.. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. సోమవారం ప్రారంభమైన మ్యాచ్‌లో తొలి రోజు మూడో సెషన్లో సర్ఫరాజ్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆది నుంచి హిమాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డ సర్పరాజ్ వందకుపైగా స్టైక్‌రేట్‌తో డబుల్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ద్విశతకతంతో అజేయంగా నిలిచి మరో ట్రిపుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.(ఇక్కడ చదవండి: సర్ఫరాజ్ ట్రిపుల్ సెంచరీ) 213 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 226 పరుగులతో ఉన్నాడు. కాగా, రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కల్గించాడు. దాంతో మ్యాచ్ ప్రారంభం కావడానికి ఆలస్యం కానుంది.నిన్నటి ఆటలో 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై జట్టును సర్ఫరాజ్ తన వీరోచిత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా బౌండరీలే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే తొలుత సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్.. దాన్ని డబుల్ సెంచరీగా మార్చుకున్నాడు. ఐదో వికెట్‌కు ఆదిత్య తారేతో కలిసి 140 భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. రెండో రోజు ఆటలో మరి డబుల్ సెంచరీని ట్రిపుల్‌గా మార్చుకుంటాడో లేదో చూడాలి. -
30 ఫోర్లు, 8 సిక్సర్లతో ట్రిఫుల్ సెంచరీ
ముంబై: యువ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు. అజేయ ట్రిఫుల్ సెంచరీతో చెలరేగాడు. ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో త్రిశతకం సాధించాడు. 391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడో రోజైన మంగళవారం సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఆట నాలుగో రోజు బుధవారం ఏకంగా ట్రిఫుల్ సెంచరీ బాదేశాడు. ముంబై తరపున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంతకుముందు సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, విజయ్ మర్చంట్, అజిత్ వాడేకర్ ఈ ఘనత సాధించారు. ముంబై బ్యాట్స్మన్లు ట్రిఫుల్ సెంచరీ సాధించడం ఇది ఎనిమిదోసారి. వసీం జాఫర్ రెండుసార్లు ట్రిఫుల్ సెంచరీలు చేశాడు. కాగా, ముంబై, యూపీ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో యూపీ 625/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ముంబై జట్టు 688/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ముంబై కెప్టెన్ ఆదిత్య తారే(97), సిద్ధేశ్ లాడ్(98) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. మాజీ టీమ్‌పైనే సత్తా చాటాడు.. ముంబైకి చెందిన సర్ఫరాజ్ ఖాన్ గత రంజీ సీజన్ ఆరంభం వరకు ఉత్తరప్రదేశ్ తరపున ఆడాడు. తర్వాత ముంబై జట్టుకు మారాడు. వాంఖేడే మైదానంలో 2015లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో యూపీ తరపున బరిలోకి దిగిన సర్ఫరాజ్ కేవలం 44 పరుగులు మాత్రమే చేశాడు. మళ్లీ ముంబై తరపున ఆడతానని ఊహించలేదని, ఇదంతా కలలా ఉందని సర్ఫరాజ్ అన్నాడు. ముంబై జట్టు తరపున ట్రిఫుల్ సెంచరీ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. -
ఒకే రోజులో ట్రిపుల్ సెంచరీ
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లీగ్‌లో పాలమూరు జట్టు రికార్డ్ స్కోర్‌ను నమోదు చేసింది. తెలంగాణ జిల్లాల జట్లలో పాలమూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. హైదరాబాద్‌లోని ఫిర్జాదిగూడ బాబురావుసాగర్ గ్రౌండ్–2లో సోమవారం జరిగిన హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో భాగంగా రాజీవ్ క్రికెట్ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు 5 వికెట్లు కోల్పోయి 622 పరుగుల భారీ స్కోర్ చేసింది. తెలంగాణ జిల్లాల జట్లలో జిల్లా జట్టు రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 622 పరుగులు చేసింది. జట్టులో డాషింగ్ బ్యాట్స్‌మెన్ గణేష్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అత్యధిక వ్యక్తిగత రికార్డు స్కోర్ చేశాడు. హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో తెలంగాణ జిల్లాల్లోని ఏ క్రీడాకారుడు సాధించని ఘనతను సాధించాడు. నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గణేష్ ట్రిపుల్ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. రాజీవ్ సీసీ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 200 బంతుల్లో 42 ఫోర్లు, 7 సిక్స్‌లతో 318 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మహేష్‌బాబు సెంచరీ చేసి రాణించాడు. 78 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. సునీల్‌రెడ్డి (30 నాటౌట్) చేశాడు. రాజీవ్ క్రికెట్ క్లబ్ బౌలర్లు మన్‌కేషా 2, ధీరజ్, పవన్‌కల్యాణ్, ట్రైలోక్ చెరో వికెట్లు తీశారు. గణేష్‌ను అభినందించిన ఎండీసీఏ ప్రతినిధులు... హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన గణేష్‌ను మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా అభినందించారు. జిల్లా క్రీడాకారుడు గణేష్ ట్రిపుల్ సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని విజయాలు నమోదు చేసుకోవాలని వారు ఆకాంక్షించారు. -
ట్రిపుల్ సెంచరీ నా లక్ష్యం కాదు: కోహ్లి
బెంగళూరు: బ్యాటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌లో కొత్త ప్రమాణాలు సృష్టించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం తన లక్ష్యం కాదని దాని కంటే మ్యాచ్‌లు గెలవడమే తనకు ముఖ్యమని అంటున్నాడు. ‘నా దృష్టి ఎప్పుడూ మ్యాచ్‌లు గెలవడంపైనే ఉంటుంది. ట్రిపుల్ సెంచరీలాంటి లక్ష్యాలేమి నాకు లేవు. అవి ఇతరుల లక్ష్యాలు’ అని కోహ్లి అన్నాడు. ఒత్తిడిలో రాణించడాన్ని అమితంగా ఆస్వాదించే కోహ్లి పరీక్షల ముందు విద్యార్థులపై ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతూ... ‘బోర్డు పరీక్షలు రాసే సమయంలో నేను కూడా కొంత విరామం తీసుకొని ఆటలకు కేటాయించేవాడిని. ఒత్తిడిని తగ్గించడంలో అవి ఎంతో తోడ్పడేవి. మానసిక ఉల్లాసంతో పాటు సానుకూల దృక్పథం పెరగడంలో ఆటల పాత్ర చాలా ముఖ్యమైనది. దీంతో తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టగలిగేవాడిని. విజయాలు మనకు ఏమి నేర్పవు. పరాజయాలే పాఠాలు చెప్తాయి. కష్ట కాలంలోనే మనలోని నైపుణ్యాలకు పనిపెడతాం’ అని పేర్కొన్నాడు. తొలి సారి భారత జట్టులో చోటు దక్కిన రోజులను గుర్తు చేసుకుంటూ... ‘టీమిండియాకు ఎంపికైన సమయంలో అమ్మతో కలిసి టీవీ చూస్తున్నా. ఫ్లాష్ న్యూస్‌లో నా పేరు చూసి తప్పుడు ప్రచారమేమో అనుకున్నా. కానీ ఆ తర్వాత బోర్డు నుంచి ఫోన్ రావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి’ అని అన్నాడు. -
అతనో వినూత్నమైన కెప్టెన్: నాయర్
సాక్షి, స్పోర్ట్స్ : ఈ సీజన్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్న రవిచంద్రన్ అశ్విన్‌పై ఆ జట్టు ఆటగాడు కరుణ్ నాయర్ ప్రశంసలు కురిపించాడు. ‘అశ్విన్ చాలా మంచి వ్యక్తి. వినూత్నమైన విధానాలతో జట్టును ముందుకు నడిపిస్తాడు. అతని నాయకత్వంలో ఆడటానికి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని’ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ఆడటం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అంతర్జాతీయ క్రికెట్లో రాణించేందుకు దోహదపడుతుందని కరుణ్ నాయర్ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెటర్‌గా ఉన్న తనకు ఐపీఎల్లో ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో కూడా మెరుగ్గా రాణించగలననే నమ్మకం వచ్చిందని పేర్కొన్నాడు. సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన ఈ కర్ణాటక ఆటగాడు ఇప్పుడు అతనితో కలిసి ప్రయాణించబోతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ఐపీఎల్ 11వ సీజన్లో పంజాబ్ జట్టు.. కరుణ్ నాయర్‌తో పాటు కర్ణాటక యువ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లను కొనుగోలు చేయడం ద్వారా టైటిల్ వేటలో దూసుకుపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కరుణ్‌ను ఈ సీజన్‌లోని పంజాబ్ జట్టు యాజమాన్యం రూ. 5.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. -
సెహ్వాగ్ స్పెషల్.. ముల్తాన్ కా సుల్తాన్
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియా ఆటగాడు, ‘డ్యాషింగ్’ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఇవాళ చాలా స్పెషల్ డే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ తరపున తొలి ట్రిపుల్ సాధించిన ఆటగాడు వీరూనే. ఆ అరుదైన రికార్డుకు నేటితో సరిగ్గా 14 ఏళ్లు పూర్తయ్యింది. పాకిస్థాన్ టూర్ సందర్భంగా 2004లో ముల్తాన్ టెస్ట్ లో సెహ్వాగ్ ఈ ఘనతను కైవసం చేసుకున్నారు. మొత్తం 531 నిమిషాలు క్రీజ్‌లో ఉన్న వీరూ.. 375 బంతులెదుర్కుని 309 పరుగులు సాధించారు. అందులో 39 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. షోయబ్ అక్తర్, సక్లైన్ ముస్తాక్, సమీ, రజాక్ వేసిన బంతులను చితకబాదుతూ మైదానంలో వీరూ విశ్వరూపం ప్రదర్శించారు. ఇక అరుదైన ఈ రికార్డును ఐసీసీ గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత నాలుగేళ్లకు మళ్లీ చెన్నైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో 319 పరుగులు చేసి రెండో బ్యాట్స్‌మన్‌గా కూడా తన పేరిట రికార్డును లిఖించుకున్నారు. చివరిసారిగా భారత్ తరపున యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 2016లో నాయర్ ఇంగ్లాండ్‌పై చెన్నైలో జరిగిన టెస్టులో 303 పరుగులు సాధించాడు. 531 minutes. 375 balls. 39 fours. 6 sixes. 309 runs!#OnThisDay in 2004, @virendersehwag became the first Indian to score a Test triple century, against Pakistan in Multan! pic.twitter.com/AwhsQXziwG — ICC (@ICC) 29 March 2018 -
నితీశ్ ట్రిపుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు జట్టుతో జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర బ్యాట్స్‌మన్ కె. నితీశ్ కుమార్ రెడ్డి (407 బంతుల్లో 301 నాటౌట్; 41 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఎన్ఎఫ్సీ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ధరణి కుమార్ (101; 14 ఫోర్లు, 1 సిక్స్) కూడా సెంచరీ చేయడంతో ఆంధ్ర భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 320/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 127 ఓవర్లలో 4 వికెట్లకు 509 పరుగుల వద్ద ఇన్నిం గ్స్‌ను డిక్లేర్ చేసింది. 190 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట ప్రారంభించిన నితీశ్... 318 బంతుల్లో డబుల్ సెంచరీని, 406 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని అందుకున్నాడు. ధరణి, నితీశ్ జోడి నాలుగో వికెట్‌కు 229 పరుగుల్ని జోడించింది. తమిళనాడు బౌలర్లు రోజంతా శ్రమించి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తమిళనాడు ఆటముగిసే సమయానికి 2 వికెట్లకు 126 పరుగులు చేసింది. -
కెప్టెన్‌గా రో'హిట్' ఆ ఫీట్ సాధిస్తాడా!
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీలంకతో ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో చివరిదైన మూడో టెస్ట్ శనివారం ప్రారంభం కానుంది. అయితే భారత క్రికెట్ అభిమానులు మాత్రం వన్డే సిరీస్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ఓపెనర్ రోహిత్ శర్మ, అతడి ఆటతీరు. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి లంకతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా, తాత్కాలికంగా రోహిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చారు. వన్డేల్లో రెండుసార్లు డబుల్ సెంచరీలు చేసిన రోహిత్‌ను మీకు ఏ డబుల్ సెంచరీ ఇష్టమంటే మాత్రం.. సమాధానం చెప్పడం కష్టమంటాడు. దీనిపై రోహిత్ శర్మ మాట్లాడాడు. 'వన్డేల్లో నేను బ్యాటింగ్‌కు దిగుతున్నానంటే 300 కొట్టే మ్యాచ్ ఈరోజు అవుతుందా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య ఎక్కడ కనిపించినా మీరు వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ ఎప్పుడు కొడతారంటూ ఒక్కటే ప్రశ్న. వన్డే మ్యాచ్‌లో 300 పరుగులంటే అంత సులువనుకుంటారేమో. ఐనా ఆ అరుదైన ఫీట్ కోసం శాయశక్తులా కృషిచేస్తాను. 2014లో నవంబర్ 13న లంకపై 264 పరుగులు చేసి ఔటయ్యాను. అప్పటి మా కోచ్ డంకన్ ప్లెచర్ మాత్రం నేను ఈజీగా ట్రిపుల్ సెంచరీ చేస్తానని భావించారట. నేను ఔటయ్యాక నాతో ఆ విషయాన్ని చెప్పడం నాకింకా గుర్తేనని ' క్రికెటర్ రోహిత్ వివరించాడు. గతంలో మాములు ఆటగాడిగా 264 పరుగులు చేసిన రోహిత్, ఈ సిరీస్‌లో కెప్టెన్ హోదాలో వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేసి ఆ అరుదైన ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా ఈ భారత ఓపెనర్ అవతరించాలని దేశ క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు. -
96 ఏళ్ల 'ట్రిపుల్ 'రికార్డు బ్రేక్
ఈస్ట్ లండన్(దక్షిణాఫ్రికా): ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 96 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డు తాజాగా బద్దలైంది. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో మరైస్ 191 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తద్వారా క్రికెట్ చరిత్రలోనే 200 బంతుల్లోపు త్రిశతకం సాధించిన తొలి ఆటగాడిగానూ నిలిచాడు. ఈ క్రమంలోనే 1921లో చార్లెస్ మెకార్ట్నే (221 బంతుల్లో) నెలకొల్పిన వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ రికార్డును తుడిచిపెట్టాడు. 68 బంతుల్లో శతకం.. 139 బంతుల్లో డబుల్ సెంచరీ అందుకున్నాడు. ఆదివారం జరిగిన మూడు రోజుల కప్ మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్ తమ బోర్డర్ జట్టు 84/4 స్కోరుతో కష్టకాలంలో ఉన్న దశలో ఆరో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన మార్కో 35 ఫోర్లు, 13 సిక్సర్లతో 191 బంతుల్లో 300 పరుగులు పూర్తి చేశాడు. -
మయాంక్ ట్రిపుల్ సెంచరీ
పుణే: కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ (494 బంతుల్లో 304 నాటౌట్; 28 ఫోర్లు, 4 సిక్సర్లు) ఫస్ట్ క్లాస్ కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా మహారాష్ట్రతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 461/1తో ఆట కొనసాగించిన కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 628 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 383 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో రోజు గురువారం ఆట ముగిసేసరికి 219 పరుగుల వద్ద ఉన్న మయాంక్ అదే జోరును కొనసాగించి ‘ట్రిపుల్’ను అందుకోగా, కరుణ్ నాయర్ (116) కూడా సెంచరీ చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 4 వికెట్లకు 135 పరుగులు చేసింది. మరో 248 పరుగులు వెనుకబడి ఉన్న ఆ జట్టు చివరి రోజు ఓట మి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే. ►3 ఈ సీజన్లో ప్రశాంత్ చోప్రా, హనుమ విహారి తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడు మయాంక్. భారత గడ్డపై ఓవరాల్‌గా ఇది 50వ ఫస్ట్‌క్లాస్ ట్రిపుల్ సెంచరీ కావడం విశేషం. 2006–07 సీజన్ నుంచి తీసుకుంటే గత పదేళ్లలోనే భారత్‌లో 28 ‘ట్రిపుల్స్’ నమోదు కాగా... ఇదే సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి 31 ట్రిపుల్ సెంచరీలు మాత్రమే రికార్డయ్యాయి. చతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా మాత్రమే చెరో మూడు ట్రిపుల్ సెంచరీలు సాధించారు. -
సంచలనం: 40సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ
సాక్షి: ఆస్ట్రేలియాకు చెందిన బిగ్రేడ్ క్రికెట్ ఆటగాడు మైదానంలో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. సింగిల్ పరుగు తీసినంత సులువుగా సిక్సర్లు కొట్టేశాడు. ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే జోష్ డన్స్టన్ అనే ఆస్ట్రేలియన్ క్లబ్ క్రికెటర్, శనివారం జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. బంతులను అలవోకగా గ్రౌండ్ దాటించాడు. 40 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ(307) పూర్తి చేశాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐదుగురు ఆటగాళ్లు కలిపితే 47 పరుగులు చేయగా అందులో 18 పరుగులే అత్యధికం. మూడో స్థానంలో వచ్చిన డన్స్టన్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. జట్టు మొత్తం పరుగులు 354 కాగా అందులో డన్స్టన్ పరుగులే 307 ఉన్నాయి. అంతేకాదు 203 వద్ద నుంచి 307 పరుగులు చేసే లోపు నాన్‌స్ట్రైకర్ చేసిన పరుగులు 5మాత్రమే. మొత్తం స్కోర్‌లో 86.72 శాతం పరుగులు డన్స్టన్ చేసినవే. ప్రపంచంలో ఇప్పటి వరకూ అన్ని ఫార్మెట్లలో ఈ రికార్డు రిచర్డ్స్ పేరుతో ఉన్న రికార్డును తుడిచేశాడు. వెస్టిండీస్ 1984లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు మొత్తం చేసిన పరుగుల్లో(272) రిచర్డ్స్ 69.48 శాతం పరుగులు(189) చేశాడు. -
‘ఇది నా వాలెంటైన్ ’
భారత క్రికెటర్ కరుణ్ నాయర్ కొత్త కారు కొన్నాడు.. కొంటే కొన్నాడు ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు విషయం. భారత టెస్టు చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ అనంతరం ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఈ కర్ణాటక స్టార్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతడు చేసిన పరుగులు 303. సరిగ్గా ఇదే నంబర్‌ను తను ముచ్చటగా కొనుకు్కన్న ఫోర్డ్ మస్టాంగ్ కారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అంతేకాదండోయ్.. మీరు సరిగ్గా గమనిస్తే ఇందులో కనిపించే ఇంగ్లిష్ అక్షరాలో్లనూ విషయం ఉంది. కేఏ అంటే కర్నాటక మాత్రమే కాదు.. కరుణ్ పేరులో మొదటి రెండక్షరాలు కూడా.. ఇక జిల్లా కోడ్‌కు సంబంధించిన దాంట్లో ఎన్ ఏ అక్షరాలున్నాయి. అంటే నాయర్లో తొలి రెండు అక్షరాలు కలిసివస్తున్నాయి. ఇలా తను సాధించిన అత్యదు్భత ఇన్నింగ్స్‌కు గుర్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ కారు ఫొటోను ట్వీట్ చేసిన కరుణ్ ‘ఇది నా వాలెంటైన్ ’ అని చెప్పడం విశేషం. -
పాపం నాయర్...
అద్భుతమైన ఆటతో గత టెస్టులో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసినా కరుణ్ నాయర్‌కు తర్వాతి మ్యాచ్‌లో మాత్రం జట్టులో చోటే దక్కలేదు. ముందునుంచీ కోచ్, కెప్టెన్ చెబుతూ వచ్చినట్లు గాయం నుంచి కోలుకొని వచ్చిన రహానేపైనే మేనేజ్మెంట్ నమ్మకముంచింది. దాంతో నాయర్ పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. వేర్వేరు కారణాలతో ఇలా ‘ట్రిపుల్ సెంచరీ’ చేశాక తమ జట్టు ఆడిన తర్వాతి మ్యాచ్‌లో చోటు దక్కని నాలుగో ఆటగాడు కరుణ్. గతంలో ఆండీ సాన్దమ్, లెన్ హటన్, ఇంజమామ్ ఈ దురదృష్టవంతుల జాబితాలో ఉన్నారు. -
ధోనీ, డివిలియర్స్లా నిర్దాక్షిణ్యంగా ఆడాలని!
న్యూఢిల్లీ: ట్వంటీ20 క్రికెట్లో కష్టసాధ్యమైన ట్రిపుల్ సెంచరీని అవలీలగా 72 బంతుల్లోనే బాదేసిన యువ క్రికెటర్ మోహిత్ ఆహ్లావత్ తన ఆటతీరుకు కారణాలను వెల్లడించాడు. తన బ్యాటింగ్ శైలిని దక్షిణాఫ్రికా విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను పోలి ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే తనకు ఏబీ శైలి అంటే ఎంతో ఇష్టమని యువ సంచలనం మోహిత్ అంటున్నాడు. మరో విశేషమేమంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే తనకు ఆదర్శమని మోహిత్ తెలిపాడు. అయితే ఆ మ్యాచ్‌లో తాను సహజ సిద్ధంగానే ఆడానని, విభిన్న షాట్లను ఎంచుకోలేదన్నాడు. 'చివరి రెండు ఓవర్లలో యాభై పరుగులు చేస్తే.. ఈ ఫార్మాట్లో ఎవరికీ సాధ్యంకాని ట్రిపుల్ సెంచరీ అవుతుందని తెలుసుకున్నాను. 19వ ఓవర్లో 16 స్కోరు చేశాను. డివిలియర్స్, ధోనీ తరహాలో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా చెలరేగితే అరుదైన ఫీట్ సాధ్యమని భావించాను. దీంతో ఆఖరి ఓవర్లో తొలి బంతిని ఫోర్, చివరి ఐదు బంతులను సిక్సర్లు బాది మొత్తం 34 పరుగులు కొల్లగొట్టి తొలి 'ట్రిపుల్ వీరుడిగా' నిలిచానని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ మ్యాచ్‌లో మావి ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మోహిత్ ప్రత్యర్థి జట్టు ఫ్రెండ్స్ ఎలెవన్‌పై చెలరేగి ట్వంటీ20 చరిత్రలోనే తొలి ట్రిపుల్ సెంచరీని సాధించాడు. -
నాయర్ లేదా రహానే?
తుది జట్టు ఎంపిక ఆసక్తికరం జోరు కొనసాగిస్తామన్న కుంబ్లే రెండో రోజూ భారత్ ప్రాక్టీస్ సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన ‘ట్రిపుల్ సెంచరీ’తో కరుణ్ నాయర్ సత్తా చాటాడు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో మరో సందేహం లేకుండా అతను తుది జట్టులో ఉండాలి. కానీ భారత కోచ్ అనిల్ కుంబ్లే మాత్రం అది తప్పనిసరి కాదని పరోక్షంగా సూచనలు ఇచ్చారు. నాయర్‌కు ముందు అజింక్య రహానే ఆడిన మ్యాచ్‌లను మరచిపోవద్దని ఆయన అన్నారు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల తర్వాత రహానే గాయపడటంతో నాయర్‌కు అవకాశం లభించగా, దానిని అతను పూర్తిగా సద్వినియోగ పరుచుకున్నాడు. ‘తనకు ఇచ్చిన అవకాశాన్ని నాయర్ ఉపయోగించుకోవడం మంచి పరిణామం. ఒక కుర్రాడు ట్రిపుల్ సెంచరీ సాధించడం అభినందించాల్సిన అంశమే. అలాంటి వాళ్లు ఉండటం వల్ల జట్టు బలం ఏమిటో తెలిసింది. అయితే రహానే జట్టుకు ఏం చేశాడో అందరికీ తెలుసు. అన్ని రకాల పరిస్థితుల్లో రహానే అద్భుత ప్రదర్శన కనబర్చాడు’ అని కుంబ్లే వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితుల మధ్య వీరిద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటారో చూడాలి. గురువారం నుంచి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం కుంబ్లే మీడియాతో మాట్లాడారు. సొంతగడ్డపై తమ జోరును ఈ టెస్టులోనూ కొనసాగిస్తామని కోచ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఇప్పటి వరకు మేం చాలా బాగా ఆడాం. ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతాం. బంగ్లాదేశ్‌తో టెస్టు కోసం మేం ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. మా వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయి. దాని ప్రకారం వెళితే కచ్చితంగా విజయం దక్కుతుంది’ అని కుంబ్లే అన్నారు. గతంతో పోలిస్తే బంగ్లాదేశ్ ఎంతో మెరుగైందని, దానిని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. ఓపెనర్లుగా విజయ్, రాహుల్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, ముందు జాగ్రత్త కోసమే ముకుంద్‌ను తీసుకున్నట్లు కుంబ్లే వెల్లడించారు. ఈ సీజన్లో స్పిన్నర్లతో పాటు మన పేసర్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచారన్న కోచ్... అశ్విన్, జడేజాలపై ప్రశంసలు కురిపించారు. టెస్టు ఫార్మాట్లో కూడా మంచి ఆల్‌రౌండర్ అయ్యే లక్షణాలు హార్దిక్ పాండ్యాలో ఉన్నాయని, మున్ముందు అతడిని కూడా పరీక్షించే అవకాశం ఉందని కుంబ్లే వెల్లడించారు. వరుసగా రెండో రోజు కూడా భారత జట్టు ఉప్పల్ స్టేడియంలో సుదీర్ఘ సమయం పాటు సాధన చేసింది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో పాటు ప్రధాన మైదానంలో ఆటగాళ్ళంతా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. బంగ్లాదేశ్ జట్టు మాత్రం మంగళవారం విశ్రాంతి తీసుకుంది. ‘మళ్లీ జరగొచ్చు... జరగకపోవచ్చు’ సరిగ్గా 18 ఏళ్ల క్రితం అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. దానిని గుర్తు చేసుకుంటూ కుంబ్లే తన ఆనందం వ్యక్తం చేశారు. ‘అభిమానులు ఇలా వార్షికోత్సవాలు కూడా గుర్తుంచుకోవడం, మేం కూడా వేడుకగా జరుపుకోవడం చాలా బాగుంటుంది. అప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని 10 వికెట్లు తీస్తానని నేను అసలు ఊహించలేదు. అది అలా జరిగిపోయిందంతే. నాకు రాసి పెట్టి ఉంది. అదో అరుదైన సందర్భం. అయితే భవిష్యత్తులో అలాంటిది మళ్లీ సాధ్యం కావచ్చు లేదా ఎప్పటికీ కాకపోవచ్చు’ అని కుంబ్లే వ్యాఖ్యానించారు. అశ్విన్‌కు అచ్చొచ్చిన మైదానం... భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉప్పల్ స్టేడియంలో మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మైదానంలో ఆడిన 2 టెస్టులలో కలిపి అశ్విన్ 18 వికెట్లు పడగొట్టాడు. అతను తన కెరీర్లో తొలిసారి మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టింది ఇక్కడే. పైగా తన శైలికి ఇది సరిగ్గా సరిపోతుందని అతను చెబుతున్నాడు. ‘నేను ఈ స్టేడియాన్ని ఇష్టపడేందుకు ఇక్కడి మంచి రికార్డు ఉండటం ఒక్కటే కారణం కాదు. మొత్తం సౌకర్యాలన్నీ బాగుంటాయి. మంచి పచ్చికతో అవుట్‌ఫీల్డ్ ఆకట్టుకుంటుంది. స్పిన్నర్ల కోణంలో ఇది చాలా పెద్ద మైదానం. బంతిని గాల్లో ఎక్కువ సేపు ఉంచుతూ బౌలింగ్ చేయవచ్చు. వికెట్లో ఉండే బౌన్స్ వల్ల కొత్తగా ప్రయత్నించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ బౌలింగ్ చేయడాన్ని నేను ఇష్టపడతాను’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. పరిశీలకుడిగా రత్నాకర్ శెట్టి... భారత్, బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు బీసీసీఐ జనరల్ మేనేజర్ (గేమ్ డెవలప్మెంట్) రత్నాకర్ శెట్టిని పరిశీలకుడిగా బోర్డు నియమించింది. హెచ్‌సీఏలో గుర్తింపు పొందిన కార్యవర్గం లేకపోవడంతో హైకోర్టు చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శెట్టికి తోడుగా బోర్డు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతోష్ రంగ్నేకర్ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. కాచుకో బంగ్లాదేశ్... అద్భుతమైన ఆటతో చెలరేగిపోతున్న విరాట్ కోహ్లి గతంలో బంగ్లాదేశ్‌తో ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత కోహ్లికి అదే తొలి టెస్టు కావడం విశేషం. 2015 జూన్‌లో ఫతుల్లాలో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ఆధిక్యం ప్రదర్శించినా, వర్షం కారణంగా చివరకు ‘డ్రా’గా ముగిసింది. విజయ్, ధావన్ శతకాలు బాదిన ఆ మ్యాచ్‌లో కోహ్లి 14 పరుగులు చేసి బౌల్డయ్యాడు. ఇప్పుడు మరోసారి కెప్టెన్ హోదాలో బంగ్లాను విరాట్ ఎదుర్కోబోతున్నాడు. అతని తాజా ఫామ్ నేపథ్యంలో కోహ్లిని బంగ్లా బౌలర్లు అసలు ఆపగలరా! -
సమ్మోహితాస్త్రం...
టి20ల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మోహిత్ ఆహ్లావత్ 72 బంతుల్లో 39 సిక్సర్లు, 14 ఫోర్లతో 300 నాటౌట్ టి20 క్రికెట్లో వేగంగా 30 పరుగులు చేస్తే చాలు ఆ ఇన్నింగ్స్ ఎంతో విలువైనదే... అర్ధ సెంచరీ చేయడం అంటే చాలా బాగా ఆడినట్లు... సెంచరీ అనేది చాలా మందికి సుదూర స్వప్నం... ఇక డబుల్ సెంచరీ అనేది ఏ స్థాయి క్రికెట్లోనైనా గేల్, మెకల్లమ్‌లాంటి మెరుపు వీరులకు కూడా సాధ్యం కాలేదు. అలాంటిది టి20 ఇన్నింగ్స్‌లో ఏకంగా 300 పరుగులు బాదేయడం అంటే మహాద్భుతం జరిగినట్లే! ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల మోహిత్ ఆహ్లావత్ ఇలాంటి అసాధ్యాన్ని చేసి చూపించాడు. టి20ల్లో ఏ స్థాయి మ్యాచ్‌లో అయినా ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన తొలి ఆటగాడిగా మోహిత్ చరిత్ర సృష్టించాడు. న్యూఢిల్లీ: 39 సిక్సర్లతో 234 పరుగులు... 14 ఫోర్లతో 56 పరుగులు... మొత్తం బౌండరీల ద్వారానే 290 పరుగులు... మిగిలిన పది మాత్రమే అలా సింగిల్స్‌తో వచ్చాయి! ఇదీ మోహిత్ విధ్వంసకర బ్యాటింగ్ సంక్షిప్త రూపం. అతను కేవలం 72 బంతులు మాత్రమే ఎదుర్కొని ఈ పరుగుల సునామీని సృష్టించడం విశేషం. ఆకాశమే హద్దుగా సాగిన ఈ బీభత్సానికి ఇక్కడి లలితా పార్క్ మైదానం మంగళవారం వేదికైంది. క్రికెట్ ప్రమాణాల ప్రకారం చూస్తే పరిమాణం రీత్యా ఇదేమీ చిన్న మైదానం కాదు. సాధారణ సైజులోనే ఉన్న ఈ గ్రౌండ్లో ఆకాశమే హద్దుగా మోహిత్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఫ్రెండ్స్ ఎలెవన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మోహిత్ మావి ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 18 ఓవర్లు ముగిసేసరికి 250 వద్ద ఉన్న మోహిత్ తర్వాతి రెండు ఓవర్లలో మిగిలిన 50 పరుగులు రాబట్టి అజేయంగా నిలవడం విశేషం. ఆఖరి ఓవర్లో తొలి బంతిని ఫోర్ కొట్టిన అతను, చివరి ఐదు బంతులను సిక్సర్లుగా మలచి మొత్తం 34 పరుగులు కొల్లగొట్టాడు. ‘బౌలింగ్ మరీ అంత బలహీనంగా కూడా ఏమీ లేదు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకొని ఎదురుదాడికి దిగాను. అన్నీ బాగా కలిసి రావడంతో పరుగులు వరదలా పారాయి. మరో ఐదు ఓవర్లు ఉన్న సమయంలో 200కు చేరాను. మరింత నిర్దాక్షిణ్యంగా బ్యాటింగ్ చేయాలని అప్పుడు నిర్ణయించుకున్నాను. 300 పరుగుల కోసం ప్రయత్నిస్తానని నా సహచరుడితో చెప్పాను. చివరకు సాధించగలిగా’ అని తన బ్యాటింగ్‌పై మోహిత్ వ్యాఖ్యానించాడు. గతంలో ఇంగ్లండ్‌లోని లాంకషైర్ సాడిల్‌వర్త్ లీగ్‌లో శ్రీలంక ఆటగాడు ధనుక పతిరణ 72 బంతుల్లో అత్యధికంగా 277 పరుగులు (29 సిక్సర్లు, 18 ఫోర్లు) చేశాడు. ఈ రికార్డును మోహిత్ తిరగ రాశాడు. కొత్తవాడేమీ కాదు... ఎవరీ మోహిత్?... దాదాపు ఏడాదిన్నర క్రితం ఢిల్లీ జట్టు తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగేందుకు సిద్ధమైన సమయంలో జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అడిగిన ప్రశ్న ఇది. వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చిన అతని ప్రతిభపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఇదే చర్చ ఢిల్లీ క్రికెట్లో కూడా వినిపించింది. పానిపట్‌కు చెందిన ట్రక్‌డ్రైవర్ కొడుకైన మోహిత్ దురదృష్టవశాత్తూ 2015–16 సీజన్లో మూడు రంజీ మ్యాచ్‌లు ఆడి కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో మూడు డకౌట్లు కూడా ఉండటంతో మరో అవకాశం దక్కకుండానే అంతర్ధానమయ్యాడు. ఇప్పుడు మరోసారి అతను క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ‘గౌతీ భాయ్ నా ప్రదర్శన గురించి తెలుసుకొని ఉంటారని ఆశిస్తున్నా. అయితే ఈ ఒక్క మ్యాచ్ నాకు ఐపీఎల్ అవకాశం ఇప్పిస్తుందా అనేది చెప్పలేను’ అని మోహిత్ చెప్పాడు. తాజాగా వేలం కోసం అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాలో మోహిత్ పేరు కూడా ఉంది. ఒక్క మెరుపు ఇన్నింగ్స్‌లో ఐపీఎల్లో రికార్డు మొత్తం కొల్లగొట్టిన ఆటగాళ్లెందరో గతంలోనూ ఉన్నారు. ఈసారి అయితే ఏకంగా 300 పరుగుల రికార్డే నమోదైంది. ఇలాంటి స్థితిలో మోహిత్‌ను తీసుకునేందుకు ఏ జట్టయినా సిద్ధమవుతుందనడంలో సందేహం లేదు. మరి గంభీర్ తన కోల్‌కతా నైట్‌రైడర్స్ కోసం అతడిని ఎంచుకుంటాడా చూడాలి. -
కరుణ్ నాయర్ 'ట్రిపుల్' సరిపోలేదా?
ముంబై:ఇంగ్లండ్ తో చివరిదైన ఐదో టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఆద్యంతం ఆకట్టుకున్న నాయర్(303 నాటౌట్;381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్లు) అజేయంగా ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇదే క్రమంలో తొలి సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మార్చిన ఏకైక భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దాంతో ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో నాయర్‌కు ఛాన్స్ ఖాయంగా కనబడింది. యువ క్రికెటర్లకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్టర్లు నాయర్‌కు అవకాశం ఇస్తారనే అంతా భావించారు. అయితే చెన్నై టెస్టులో విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఆ మళయ మారుతానికి అవకాశం దక్కలేదు. ఇక్కడ ఇద్దరు వెటరన్ క్రికెటర్లను ఎంపిక చేసిన సెలక్టర్లు.. నాయర్‌ను పక్కన పెట్టేశారు. ధోని కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తరువాత యువరాజ్ జట్టులోకి రాగా, అనూహ్యంగా ఆశిష్ నెహ్రాకు కూడా ఇంగ్లండ్ తో తదుపరి సిరీస్‌లో చోటు కల్పించారు. వచ్చే వరల్డ్ కప్‌కు బీసీసీఐ ఓ వ్యూహంతో వెళుతుందని భావించి సరిపెట్టుకున్నా, మరొక అంశాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావించక తప్పదు. ఇంగ్లండ్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా భారత్-ఎ జట్టులో కూడా నాయర్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించలేదు. భారత్ ఆడబోయే రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. అంటే కనీసం ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడటానికి కూడా నాయర్ సరిపోడా అనే ప్రశ్న తలెత్తుంది. ఈ వార్మప్ మ్యాచ్‌లో ఎంతో మంది యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వగా, నాయర్‌ను మాత్రం పట్టించుకోలేదు. పరిమిత ఓవర్ల సిరీస్‌లో లేని సంజూ శాంసన్, అంబటి రాయుడులకు ప్రాక్టీస్ మ్యాచ్‌లో చోటు కల్పించిన సెలక్టర్లు.. ట్రిపుల్ కొట్టిన వీరుడ్ని పక్కన పెట్టేశారు. అతని ప్రతిభ సెలక్టర్ల దృష్టిలో పడలేదా?లేక ఆ ట్రిపుల్ ఏదో యాధృచ్ఛికంగా చేసింది మాత్రమేనని సెలక్టర్లు భావించారా? అనేది మాత్రం వారి విజ్ఞానానికే వదిలేయాలి. నెహ్రా అవసరం ఉందా? సగటు క్రీడా అభిమానికి తలెత్తి ఒకే ఒక్క ప్రశ్న భారత వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఎంపిక. ఇంగ్లండ్ తో మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో నెహ్రాను ఎంపిక చేసిన సెలక్టర్ల నిర్ణయం ఆశ్చర్యపరిచేదే. దాదాపు పది నెలల తరువాత టీ 20 జట్టులోకి వచ్చిన నెహ్రా ఎంత వరకూ రాణిస్తాడు అనేది మాత్రం ప్రశ్నార్థకం. వరల్డ్ టీ 20లో భాగంగా మార్చినెలలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో నెహ్రా చివరిసారి పాల్గొన్నాడు. ఆ మ్యాచ్‌లో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసిన నెహ్రా ఆశించిన ప్రదర్శన కూడా ఏమీ చేయలేదు. ఆ తరువాత నుంచి ఇంటికే పరిమితమైన నెహ్రాను అనూహ్యంగా జట్టులోకి తీసుకున్నారు. వచ్చే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేసే సెలక్టర్లు నెహ్రాను ఎందుకు ఎంపిక చేసినట్లు. ప్రస్తుతం 38వ ఒడిలో ఉన్న నెహ్రా.. ఆ వరల్డ్ కప్ నాటికి పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉంటాడా?అనేది సెలక్టర్లకే తెలియాలి. ఇప్పటికే ఫిట్నెస్ పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న నెహ్రా.. వచ్చే ట్వంటీ 20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కించుకోవడం కష్టం కూడా. 2019లో ఆడబోయే వన్డే వరల్డ్ కప్‌కే యువ క్రికెటర్లకు చోటు కల్పించాలనే దిశగా బీసీసీఐ పయనిస్తోంది. ఆ క్రమంలోనే ధోని కూడా తన పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడనేది అందరికీ విదితమే. ఇక్కడ ఎంతో మంది యువ బౌలర్లు ఉండగా, నెహ్రాకు ఎందుకు చోటు కల్పించినట్లు. ఒకవైపు యువ క్రికెటరైన నాయర్ కు చోటు ఇవ్వని సెలక్టర్లు.. వెటరన్ బౌలర్ అయిన నెహ్రాకు ఏ ఉద్దేశంతో అవకాశం ఇచ్చారనేది మింగుడు పడని ప్రశ్నే. -
‘మలయాళ’ మారుతం
నెలలు నిండకుండానే జన్మించిన బిడ్డ కరుణ్ నాయర్...బలహీనమైన ఊపిరితిత్తులతో పుట్టి సరిగా కూర్చోలేక పదే పదే కింద పడిపోయేవాడు. వయసు ఎదుగుతున్నా పసివాడిలాగే ఏడుపు ఉండేది. ఒక దశలో అతను ఎలా బతకగలడో అన్న ఆందోళన కూడా వారితల్లిదండ్రుల్లో ఉండేది. ఎక్కువగా మాట్లాడని ఆ కుర్రాడికి పసితనమంతా‘ప్లే స్టేషన్’తోనే గడిచింది.దాదాపు ఆరు నెలల క్రితం భారత్ తరఫున తొలి వన్డే మ్యాచ్ ఆడిన తర్వాత కరుణ్ మొక్కు తీర్చుకునేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి అలెప్పీకి వెళ్లాడు. అయితే వీరు ప్రయాణిస్తున్న బోటు పంపా నదిలో తిరగబడటంతో అతని సన్నిహితుల్లో ఇద్దరు చనిపోగా, ఈత రాక మునిగిపోతున్న నాయర్‌ను స్థానికులు కాపాడారు.ఈ రెండు ఘటనల మధ్య పాతికేళ్ల వ్యవధి ఉంది. అప్పుడు అతని జీవితం గురించి కన్నవారు బెంగ పడ్డారు. ఇప్పుడు తనకు లభించిన కొత్త జీవితంతో ఏదైనా సాధించాలని అతను గట్టిగా తనకు తాను చెప్పుకున్నాడు. సరిగ్గా ఆరు నెలల తర్వాత కరుణ్ నాయర్ కొత్త చరిత్రను సృష్టించాడు. భారత క్రికెట్‌ను సుసంపన్నం చేసిన మహామహులకే సాధ్యం కాని రీతిలో ట్రిపుల్ సెంచరీతో టెస్టు ప్రపంచంలో తనదైన పేరును సగర్వంగా లిఖించుకున్నాడు. మెకానికల్ ఇంజినీర్ అయిన తండ్రి కళాధరన్ ఉద్యోగరీత్యా జోధ్‌పూర్‌లో ఉన్నప్పుడు కరుణ్ పుట్టాడు. ఈ మలయాళీ కుటుంబం చివరకు బెంగళూరులో స్థిరపడింది. ప్రాథమిక స్థాయిలో రాణించిన తర్వాత మంగళూరు యునైటెడ్ క్లబ్ అతడికి మంచి అవకాశాలు కల్పించింది. అక్కడ రాటుదేలి 15 ఏళ్ల వయసులోనే కర్ణాటక అండర్–19 జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత కరుణ్ వెనుదిరిగి చూడలేదు. రంజీ ట్రోఫీలో కూడా తొలి సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చి కర్ణాటక టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన అతను... తర్వాతి సీజన్లో జట్టు దానిని నిలబెట్టుకోవడంలో కూడా ప్రధాన భాగమయ్యాడు. ముఖ్యంగా తమిళనాడుతో జరిగిన ఫైనల్లో చేసిన 328 పరుగుల స్కోరు నాయర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2014 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 75 లక్షలకు తీసుకోగా, జట్టులో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడాడు. అయితే 2016 ఐపీఎల్లో అతను రూ.10 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉండగా, 40 రెట్లు ఎక్కువగా చెల్లించి ఢిల్లీ సొంతం చేసుకుంది. డేర్ డెవిల్స్ కోచ్‌గా, ఆ తర్వాత భారత ‘ఎ’ జట్టు కోచ్‌గా కూడా రాహుల్ ద్రవిడ్ సూచనలు అతడిని తీర్చిదిద్దాయి. దేశవాళీలో 50కి పైగా సగటుతో మూడేళ్ల పాటు పరుగుల వరద పారించిన కరుణ్, గత సంవత్సరం శ్రీలంకతో సిరీస్‌కు గాయపడిన విజయ్ స్థానంలో ఎంపికైనా మ్యాచ్ అవకాశం రాలేదు. ఈ ఏడాది ధోని నాయకత్వంలో జింబాబ్వే పర్యటించిన జట్టులో సభ్యుడిగా అతను రెండు వన్డేలు ఆడాడు. ఈ సీజన్లో కూడా ఇంగ్లండ్ టెస్టుకు ఎంపిక కాక ముందు ఆడిన 4 రంజీ ఇన్నిం గ్స్లలో 74, 54, 53, 145 పరుగులు చేశాడు. మొహాలీలో సహచరుడు రాహుల్ గాయంతో తొలి టెస్టు ఆడే అవకాశం దక్కి దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. ముంబై టెస్టులో రహానే గాయంతో లక్కీగా చేరి 13 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో రాణించకపోతే బహుశా అతను మరో అవకాశం కోసం సుదీర్ఘకాలం వేచి ఉం డాల్సి వచ్చేదేమో. కానీ తన క్లాస్, మాస్ ఆటను మొత్తం కలగలిపి అతను కొట్టిన ‘తీన్మార్’ దెబ్బ నేరుగా సెలక్టర్లకే తగిలింది. ‘నా జీవితంలో ఇదో అత్యుత్తమ క్షణం. కలలా అనిపిస్తున్న దీనిని నమ్మేందుకు మరో రెండు రోజులు పడుతుందేమో. సెంచరీ చేయగానే నాపై ఒత్తిడి పోయింది. ట్రిపుల్ గురించి అసలు ఆలోచన లేదు. 250 వద్ద డిక్లరేషన్‌కు సిద్ధమైనా, నా కోసం ఆగిన జట్టుకు కృతజ్ఞతలు. అమ్మా నాన్న ముందు దీనిని సాధించడం అమితానందంగా ఉంది. ట్రిపుల్ సెంచరీ సమయంలో నా మనసులో చాలా భావాలు చెలరేగుతున్నాయి. అందుకే ఆ ఘనతను సాధించిన సమయంలో ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించలేకపోయాను’. -
కరుణ్ నాయర్ గురించి ఈ విషయాలు తెలుసా?
టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్ రికార్డు సృష్టించాడు. అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలివి.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మలయాళీ దంపతులకు డిసెంబర్ 6, 1991న కరుణ్ నాయర్ జన్మించాడు. మొదట అతను కర్ణాటక తరఫున అండర్-15 క్రికెట్ ఆడాడు. అనంతరం కర్ణాటక నుంచే అండర్ 19 జట్టులో చోటు సాధించాడు. ఈ రైట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ 2012లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం ద్వారా సీనియర్ దేశీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2013లో రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడాడు. 2014-15 రంజీ ట్రోపీ సీజన్లో నాయర్ 47.26 సగటుతో 700 పరుగులు చేసి.. కర్ణాటక మరోసారి రంజీ ట్రోపీ నిలబెట్టుకోవడంలో తోడ్పడ్డాడు. ఈ టోర్నీలో రాబిన్ ఉతప్ప, కేఎల్ రాహుల్ తర్వాత కర్ణాటక తరఫున అత్యధిక పరుగులు చేసింది బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2016లో ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున ఆడిన కరుణ్ నాయర్ సత్తా చాటాడు. ఢిల్లీ తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2016లో జింబాబ్వేతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో కరుణ్ అడుగుపెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆడటం ద్వారా అతను టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా టెస్టుల్లో తన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలిచిన తొలి భారతీయ ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పాడు. -
ట్రిపుల్ గురించి నాయర్ ఏమన్నాడంటే..
-
ట్రిపుల్ గురించి నాయర్ ఏమన్నాడంటే..
చెన్నై: ఇంగ్లండ్‌తో చేసిన ట్రిపుల్ సెంచరీయే తన జీవితంలో బెస్ట్ ఇన్నింగ్స్ అని టీమిండియా యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ అన్నాడు. చెన్నైలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో నాయర్ (303 నాటౌట్; 381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్లు) అద్భుతంగా రాణించి, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆట ముగిసిన తర్వాత నాయర్ మాట్లాడుతూ.. సెంచరీ చేశాక ఒత్తిడిగా భావించలేదని చెప్పాడు. ‘సెంచరీ అయ్యాక నా శైలిలో షాట్లు ఆడా. నా మ్యాచ్‌లను చాలా వరకు నాన్న చూస్తారు. నాపై అదనపు ఒత్తిడి ఉండదు. నా ఆట చూశాక అమ్మానాన్న గర్వపడి ఉంటారు. నా జీవితంలో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్. ట్రిపుల్ సెంచరీ చేసే క్రమంలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజాలతో కలసి ఆడాను. నేను క్రీజులో పాతుకుపోవడానికి వారు సహకరించారు. వారికి ధన్యవాదాలు’ అని నాయర్ అన్నాడు. -
మా వాడు ‘ట్రిపుల్’ చేశాక స్వర్గంలో ఉన్నట్టుంది
-
మా వాడు ‘ట్రిపుల్’ చేశాక స్వర్గంలో ఉన్నట్టుంది
చెన్నై: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో అజేయ ట్రిపుల్ సెంచరీ చేసిన టీమిండియా బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్‌ను అతని తల్లిదండ్రులు అభినందించారు. తమ కొడుకు ఈ ఘనత సాధించడం తమకు గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచి చాలా కష్టపడ్డాడని, ఇప్పుడు దాన్ని సాధించాడని కరుణ్ నాయర్ తండ్రి కళాధరన్ నాయర్ అన్నారు. తనకు స్వర్గంలో ఉన్నంత అనుభూతి కలుగుతోందని కరుణ్ తల్లి అన్నారు. కరుణ్ నాయర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నాయర్‌ను అభినందించారు. అతను ఇలాగే మరిన్ని రికార్డులు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, క్రికెటర్లు.. నాయర్‌కు అభినందనలు తెలిపారు. టెస్టు క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నాయర్ రికార్డు నెలకొల్పాడు. చెన్నైలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల నాయర్ (303 నాటౌట్;381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్లు) ఈ ఫీట్ నమోదు చేశాడు. తానాడిన మూడో టెస్టు మ్యాచ్‌లోనే ఈ రికార్డు నెలకొల్పడం విశేషం. అతనికి అభినందనలు తెలుపుతూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. గత 12 ఏళ్లుగా తాను ఒక్కడినే 300 పరుగుల క్లబ్లో ఉన్నానని, ఇన్నాళ్లకు నాయర్‌ను ఆహ్వానిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. 2004లో ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్‌పై సెహ్వాగ్ తొలిసారి ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. నాలుగేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్ మరోసారి ట్రిపుల్ సెంచరీ బాదాడు. -
ఒక్కడు... ఒకే రోజు 393 పరుగులు
హెచ్‌సీఏ లీగ్స్‌లో రేవంత్ సాయి సంచలన బ్యాటింగ్ హైదరాబాద్: సెంచరీ కాదు, డబుల్ సెంచరీ కాదు... ఒక్క రోజులో ఒక బ్యాట్స్‌మన్ దాదాపు 400 పరుగులు చేయడం అసాధారణ విషయం. పిచ్ ఎలాంటిదైనా, ఎంత బలహీన బౌలింగ్ అయినా ఇది అద్భుతం కిందే లెక్క. దానిని సుసాధ్యం చేసి చూపించాడు హైదరాబాద్ క్రికెటర్ రేవంత్ సాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) 2 రోజుల లీగ్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారీ ట్రిపుల్ సెంచరీ చేసిన అతను త్రుటిలో ‘క్వాడ్రాపుల్ సెంచరీ’ కోల్పోయాడు. పీ అండ్ టీ కాలనీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విశాక జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన 25 ఏళ్ల రేవంత్ సాయి రెచ్చిపోయాడు. 336 బంతుల్లో ఏకంగా 393 పరుగులు సాధిం చాడు. ఇందులో 44 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. హెచ్‌సీఏ లీగ్స్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, దానిని ఒకే రోజు చేసిన రికార్డును సాయి సొంతం చేసుకున్నాడు. దాదాపు ఐదున్నర గంటల పాటు క్రీజ్‌లో గడిపిన అతను 236 పరుగులు బౌండరీల ద్వారానే రాబట్టడం విశేషం. చివరకు మరో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్ కవర్స్‌లో క్యాచ్ ఇవ్వడంతో నాలుగొందలు పరుగుల మైలురాయి చేజారింది. రేవంత్ అద్భుత ప్రదర్శనతో విశాక జట్టు తొలి రోజు 88.4 ఓవర్లలో 5 వికెట్లకు 664 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. -
వీరుడొక్కడు చాలు...
-
వీరుడొక్కడు చాలు...
ఎంత కొట్టామన్నది కాదు, ఎంత వేగంతో కొట్టామన్నది ముఖ్యం... సెహ్వాగ్‌కు మాత్రమే సరిపోయే డైలాగ్ ఇది. సిక్సర్‌తో ట్రిపుల్ సెంచరీని అందుకోవడం ఎలా ఉంటుంది... వీరూకి మాత్రమే తెలిసిన మజా. టెస్టు ఓపెనర్ అంటే వికెట్ కాపాడుకోవడం కాదు... వీర విధ్వంసం సృష్టించడం ఎలాగో సెహ్వాగ్ మాత్రమే చూపించిన విద్య. ఒకటా, రెండా ఎన్నో అద్భుతాలు వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ నుంచి జాలువారాయి. సచిన్ అంతటివాడిని కావాలని క్రికెట్లోకి వచ్చిన సెహ్వాగ్ ఒక దశలో మాస్టర్నే మించిపోయాడు. దూకుడు అంటూ ఇప్పుడు కొందరు వల్లె వేయవచ్చు గాక... కానీ అసలు దూకుడు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మైదానంలో నేర్పించిన ఘనత సెహ్వాగ్‌దే. అతను క్రీజ్‌లో ఉన్నంతసేపు ఎంతటి భారీ లక్ష్యమైనా చిన్నదిగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ బంతిని బౌండరీ దాటించడంపైనే దృష్టి పెట్టే ఈ ‘నజఫ్‌గఢ్ నవాబ్’కు ఫుట్‌వర్క్, సాంప్రదాయ షాట్లు లాంటివి పట్టవు. ఎవరైనా దానిని గుర్తు చేసినా అతను పట్టించుకోడు! తక్కువ శ్రమ-ఎక్కువ ఫలితం అనే సిద్ధాంతంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే శైలి అతడిని స్టార్‌ను చేసింది. భారత్‌కు అరుదైన, అనూహ్య విజయాలు అందించింది. సాధారణంగా టెస్టుల్లో ఒక రోజు ఆటంతా ఆడితే జట్టు మొత్తం చేయగలిగే స్కోరు 284. కానీ సెహ్వాగ్ ఒక్కడే దీనిని ఒక్కరోజులో కొట్టి పడేశాడు. భారత్ టెస్టుల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఏ బ్యాట్స్‌మన్‌కూ అందని ‘ట్రిపుల్ సెంచరీ’ అతను పాకిస్తాన్ గడ్డపై సాధించిన రోజున గర్వించని భారతీయుడు లేడు. మరో నాలుగేళ్లకు మరో ‘ట్రిపుల్’ను బాది ఎవరికీ అందని ఎత్తులో నిలిచిన అతను వన్డేల్లోనూ ‘డబుల్’తో తన విలువను చూపించాడు. టెస్టుల్లో ఊహించడానికే సాధ్యం కాని 82 స్ట్రయిక్‌రేట్ అతనికే చెల్లింది. వీరేంద్ర సెహ్వాగ్ అనగానే అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయిన కొన్ని ఇన్నింగ్స్‌లను చూస్తే.... టెస్టులు * 2003 (మెల్బోర్న్): ఆస్ట్రేలియాపై ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఐదు గంటల్లోనే 195 పరుగుల ఇన్నింగ్స్. * 2004 (ముల్తాన్): భారత్ తరఫున తొలి ‘ట్రిపుల్ సెంచరీ’ (319). సక్లాయిన్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఈ ఘనత. * 2006 (లాహోర్): ద్రవిడ్‌తో తొలి వికెట్‌కు 410 పరుగుల భాగస్వామ్యం. 247 బంతుల్లో 254 (47 ఫోర్లు). * 2008 (అడిలైడ్): ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులతో భారత్‌కు తప్పిన ఓటమి. * 2008 (చెన్నై): 278 బంతుల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు (దక్షిణాఫ్రికాపై). * 2009 (ముంబై): మూడో ‘ట్రిపుల్ సెంచరీ’ మిస్. శ్రీలంకపై 254 బంతుల్లో 293. * 2010 (కోల్‌కతా): 174 బంతుల్లో 165. టెస్టుల్లో నంబర్‌వన్‌గా సెహ్వాగ్. వన్డేలు * 2001 (కొలంబో): సచిన్ గైర్హాజరులో వన్డేల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. 69 బంతుల్లో సెంచరీ...సెహ్వాగ్ స్టయిల్ బయటపడింది. * 2002 (కొలంబో): చాంపియన్స్ ట్రోఫీ సెమీస్. ఇంగ్లండ్‌పై 77 బంతుల్లో సెంచరీతో భారత్ ఫైనల్‌కు. * 2009 (హామిల్టన్): 60 బంతుల్లో సెంచరీతో భారత్ తరఫన కొత్త రికార్డు. * 2009 (రాజ్‌కోట్): 102 బంతుల్లో 146 పరుగులతో 414 పరుగుల జట్టు రికార్డు స్కోరులో కీలకపాత్ర. * 2011 (ఇండోర్): 140 బంతుల్లో వన్డేల్లో డబుల్ సెంచరీ. -
నాయర్ ట్రిపుల్ సెంచరీ
తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక 618/7 తమిళనాడుతో రంజీ ఫైనల్ ముంబై: రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కరుణ్ నాయర్ (533 బంతుల్లో 310 బ్యాటింగ్; 45 ఫోర్లు; 1 సిక్స్) కెరీర్లో తొలిసారిగా అజేయ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి కర్ణాటక 189 ఓవర్లలో ఏడు వికెట్లకు 618 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ (320 బంతుల్లో 188; 17 ఫోర్లు; 3 సిక్సర్లు) మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం జట్టు 484 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఉంది. క్రీజులో తనతో పాటు కెప్టెన్ వినయ్ కుమార్ (175 బంతుల్లో 41 బ్యాటింగ్; 4 ఫోర్లు; 1 సిక్స్) ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలిసారిగా ట్రిపుల్ శతకం బాదిన నాయర్ అద్భుతమైన నిలకడ చూపుతూ రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేశాడు. ఇప్పటికే నాయర్ కర్ణాటక తరఫున ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన గుండప్ప విశ్వనాథ్ (247) రికార్డును అధిగమించాడు. ఇక మరో 10 పరుగులు చేస్తే ఓవరాల్‌గా రంజీ ఫైనల్లో ఈ ఫీట్ సాధించిన గుల్ మొహమ్మద్ (319, 1946-47లో) రికార్డును కూడా బద్దలుకొడతాడు. అంతకుముందు 323/5 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన కర్ణాటక లంచ్ వరకు ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే రాహుల్ లాంగ్ ఆన్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆరో వికెట్‌కు వీరు 386 పరుగులు జోడించారు. ఆ వెంటనే మరో వికెట్ పడినా ఓపిగ్గా ఆడిన వినయ్... నాయర్‌కు అండగా నిలిచాడు. -
భరత్ ‘ట్రిపుల్’ సెంచరీ
గోవాతో రంజీలో పట్టుబిగించిన ఆంధ్ర ఒంగోలు: నిలకడైన బ్యాటింగ్... నాణ్యమైన షాట్లతో చెలరేగిన ఆంధ్ర బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (311 బంతుల్లో 308; 38 ఫోర్లు, 6 సిక్సర్లు) గోవాతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ‘ట్రిపుల్’ సెంచరీతో చెలరేగాడు. దీంతో శనివారం రెండో రోజు ఆంధ్ర తొలి ఇన్నిం గ్స్‌లో 123 ఓవర్లలో 5 వికెట్లకు 548 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 408/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆంధ్ర రెండో రోజు ఆట కొనసాగించగా... ఎం.శ్రీరామ్ (254 బంతుల్లో 144; 20 ఫోర్లు, 1 సిక్స్), భరత్‌లు గోవా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 333 పరుగులు జోడించారు. శ్రీరామ్ అవుటైన తర్వాత 46 పరుగుల వ్యవధిలో ఆంధ్ర మూడు వికెట్లు కోల్పోయింది. నరేన్ రెడ్డి (1), రికీ భుయ్ (10)లతో పాటు భరత్ కూడా వెనుదిరిగాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గోవా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. వేదాంత్ నాయక్ (32 బ్యాటింగ్), గవాస్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. దర్శన్ మిసాల్ (66) మెరుగ్గా ఆడాడు. ప్రస్తుతం గోవా తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగులు వెనుకబడి ఉంది. విజయ్ 3, శివ, స్టీఫెన్ చెరో రెండు వికెట్లు తీశారు. రెండు రోజులు ఆట మిగిలిఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఆంధ్రకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. -
కేఎల్ రాహుల్ 337
బెంగళూరు: కర్ణాటక బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ (448 బంతుల్లో 337; 47 ఫోర్లు, 4 సిక్సర్లు) రంజీ ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు శుక్రవారం అతను ట్రిపుల్ సెంచరీని అందుకున్నాడు. కర్ణాటక తరఫున రంజీ ట్రోఫీల్లోనే కాకుండా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ త్రిశతకంతో కర్ణాటక ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 719 పరులు చేసింది. -
'తొలి టెస్టులోనే కెప్టెన్... ట్రిఫుల్ సెంచరీ'
సూరజ్‌కుండ్(హర్యానా): ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ క్రికెట్ పరిభాషలో పొడిగారు. తొలి టెస్టులోనే కెప్టెన్ అయిన మోడీ ఆరంగ్రేటంతోనే అదరగొట్టారని కితాబిచ్చారు. మొదటి టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించారని ప్రశంసించారు. 'తొలి మ్యాచ్ లో సెంచరీ లేదా డబుల్ సెంచరీలు చేసిన వారి గురించి మనం వింటుంటాం. ఆడిన తొలి మ్యాచ్ లోనే కెప్టెన్ కిరిటాన్ని దక్కించుకుని, ట్రిఫు్ల్ సెంచరీ చేసిన ఆటగాడి గురించి నేనెప్పుడూ వినలేదు. నరేంద్ర మోడీ ఈ ఘనత సాధించారు' అని అద్వానీ పేర్కొన్నారు. తొలిసారి పార్లమెంటులో అడుగుపెడుతున్న బీజేపీ ఎంపీలకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో ప్రసంగిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 300 పైగా సీట్లు గెల్చుకుని విజయదుందుభి మోగించింది. -
సంగక్కర మరో సెంచరీ
చిట్టగాంగ్: శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర (144 బంతుల్లో 105; 11 ఫోర్లు; 2 సిక్స్‌లు) అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టిన తను రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కొనసాగించి శతకాన్ని సాధించాడు. దీంతో ఈ ఘనత (ఒకే మ్యాచ్‌లో ట్రిపుల్, సెంచరీ) సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. గతంలో గ్రాహం గూచ్ (333, 123) 1990లో లార్డ్స్‌లో భారత్‌పై ఈ ఘనత సాధించాడు. సంగతో పాటు దినేష్ చండిమాల్ (158 బంతుల్లో 100 నాటౌట్; 4 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించడంతో రెండో ఇన్నింగ్స్‌లో లంక 75.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 305 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 467 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగోరోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి బంగ్లా 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (7 బ్యాటింగ్), రహమాన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు (శనివారం) ఆటకు చివరి రోజు. అంతకుముందు బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 119.5 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. తమ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 17 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. మెండిస్‌కు ఆరు, పెరీరాకు మూడు వికెట్లు దక్కాయి. -
సంగక్కర సూపర్ ‘ట్రిపుల్’
చిట్టగాంగ్ : కుమార సంగక్కర (482 బంతుల్లో 319; 32 ఫోర్లు, 8 సిక్సర్లు) కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించడంతో... బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. వితనాగే (35), అజంతా మెండిస్ (47) సంగక్కరకు అండగా నిలిచారు. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ 277 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఉన్నప్పుడు తొమ్మిదో వికెట్ పడింది. చివరి ఆటగాడు ప్రదీప్ (4 నాటౌట్)ను రెండో ఎండ్‌లో నిలబెట్టి సంగక్కర ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. బంగ్లా బౌలర్ షకీబ్ ఐదు వికెట్లతో రాణించాడు. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. రహమాన్ (45 బ్యాటింగ్), కైస్ (36 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 501 పరుగులు వెనకబడి ఉంది. బ్రాడ్‌మన్ తర్వాత సంగక్కర... టెస్టుల్లో లారాతో సమానంగా సంగక్కర 9 సార్లు 200 పైచిలుకు స్కోర్లు చేశాడు. డాన్ బ్రాడ్‌మన్ 12 సార్లు ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో వేగంగా 11 వేల పరుగులు చేసిన క్రికెటర్ (208 ఇన్నింగ్స్‌లో)గా సంగక్కర గుర్తింపు పొందాడు. జయసూర్య, జయవర్ధనేల తర్వాత లంక తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడు సంగక్కర కావడం విశేషం.