
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌ల్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. రెండు రోజుల లీగ్‌లో భాగంగా కాంకర్డ్ క్రికెట్ క్లబ్, శ్రీశ్యామ్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ వర్గీస్ అనే కుర్రాడు ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు.
గురువారం జరిగిన మ్యాచ్‌లో కాంకర్డ్ తరపున ఆడిన ఆరోన్ వర్గీస్ మెరుపు ఇన్నింగ్స్ ప్రదర్శించాడు. కేవలం 260 బంతుల్లో 50 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 321 పరుగులు సాధించాడు. ఆరోన్ అద్భుత బ్యాటింగ్‌కు తోడుగా అయాన్ అహ్మద్(52), రామ్ రేపాల(50) రాణించడంతో కంకార్డ్ 85.5 ఓవర్లలో(నిర్ణీత 90 ఓవర్లు) 560 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు చేసిన 560 పరుగుల్లో 321 పరుగులు ఆరోన్ వర్గీస్‌వే కావడం విశేషం.
చదవండి: కసితీరా బాదారు.. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల చేధన