హెచ్‌సీఏను ఏకిపారేసిన సునీల్‌ గావస్కర్‌ | Sunil Gavaskar Blasts On HCA Lack-Of-Proper Dugout During SRH Vs LSG | Sakshi
Sakshi News home page

#SunilGavaskarVsHCA: హెచ్‌సీఏను ఏకిపారేసిన సునీల్‌ గావస్కర్‌

Published Sat, May 13 2023 11:22 PM | Last Updated on Sat, May 13 2023 11:25 PM

Sunil Gavaskar Blasts On HCA Lack-Of-Proper Dugout During SRH Vs LSG - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మరో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లేఆఫ్‌ చేరే అవకాశాలను కోల్పోయింది. శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో నోబాల్‌ విషయమై ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు కాస్త అతి చేశారు.

థర్డ్‌ అంపైర్‌ నోబాల్‌ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు అభిమానులు లక్నో డగౌట్‌వైపు బోల్టులు, మేకులతో దాడి చేశారు. ఈ సమయంలో లక్నో ఆటగాళ్లు సహా సిబ్బంది అక్కడ ఉండడంతో కాస్త గందరగోళం నెలకొంది, అయితే డగౌట్‌కు కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా కేవలం టెంట్లతో ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. దేవుని దయ వల్ల మేకులు ఎవరికి గుచ్చుకోకపోవడంతో ప్రమాదం తప్పింది.

ఇదే విషయమై టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ హెచ్‌సీఏ వైఖరిని ఎండగట్టాడు. ''ఐపీఎల్‌లో ఇతర వేదికల్లో డగౌట్లను ఫ్లెక్సీ గ్లాస్‌తో ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్‌ స్టేడియంలో మాత్రం డగౌట్లను కేవలం గొడుగుల కింద ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇవాళ లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా నోబాల్‌ ఇవ్వలేదని అభిమానులు మేకులు, బోల్టులు విసరడం మంచి పద్దతి కాదు.

దేవుని దయవల్ల ఎవరికి ఏం కాలేదు. అయినా డగౌట్‌ ఏర్పాటులో ఇంత నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. హెచ్‌సీఏ నిర్వహణ లోపం ఏంటనేది మరోసారి బయటపడింది. కనీసం సరైన డగౌట్లు నిర్మించలేని పరిస్థితిలో హెచ్‌సీఏ ఉండడం దురదృష్టకరం'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ ఆవేశ్‌ ఖాన్‌ వేశాడు. ఓవర్‌ మూడో బంతి హైఫుల్‌ టాస్‌గా వెళ్లింది.  క్రీజులో ఉన్న అబ్దుల్‌ సమద్‌ నడుము పై భాగంలో వెళ్లడంతో ఫీల్డ్‌ అంపైర్‌ నోబాల్‌కు కాల్‌ ఇచ్చాడు. అయితే లక్నో సూపర్‌జెయింట్స్‌ అంపైర్‌ కాల్‌ను చాలెంజ్‌ చేశారు. దీంతో అల్ట్రాఎడ్జ్‌లో పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ బంతి క్లియర్‌గా ఉందని.. నో బాల్‌ కాదని చెప్పాడు. దీంతో క్లాసెన్‌ సహా అబ్దుల్‌ సమద్‌లు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి నడుము పై నుంచి బంతి వెళితే నోబాల్‌ ఇవ్వడం జరుగుతుంది. అంత క్లియర్‌గా నోబాల్‌ అని కనిపిస్తున్నా థర్డ్‌ అంపైర్‌ కరెక్ట్‌ బాల్‌గా కౌంట్‌ చేయడం ఆసక్తి కలిగించింది. 

చదవండి: సూపర్‌ ప్రబ్‌సిమ్రన్‌.. ఓపెనర్‌గా వచ్చి సెంచరీ కొట్టి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement