టీమిండియా చైనా మెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌లో కుల్దీప్ మరో ఆరు వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్ల అరుదైన మైలురాయిని తాకుతాడు.
కుల్దీప్ ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 53 వికెట్లు.. 106 వన్డేల్లో 172 వికెట్లు.. 40 టీ20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ టెస్ట్‌ల్లో 4 సార్లు, వన్డేల్లో 2 సార్లు, టీ20ల్లో 2 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించాడు. ఇంత స్వల్ప కెరీర్‌లో ఇన్ని ఐదు వికెట్ల ఘనతలు సాధించడం చాలా అరుదు. కుల్దీప్ ఖాతాలో రెండు వన్డే హ్యాట్రిక్‌లు కూడా ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. కుంబ్లే మూడు ఫార్మాట్లలో కలిపి 953 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో కుంబ్లే తర్వాతి స్థానాల్లో అశ్విన్ (744), హర్బజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (597), రవీంద్ర జడేజా (568), శ్రీనాథ్ (551), షమీ (448), ఇషాంత్ శర్మ (434), బుమ్రా (397), అగార్కర్ (349), ఇర్ఫాన్ పఠాన్ (301) ఉన్నారు.
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్ల మార్కును 12 మంది తాకారు. వికెట్ల ట్రిపుల్ సాధిస్తే కుల్దీప్ 13వ భారత బౌలర్ అవుతాడు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది. చెన్నై పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉండే అవకాశం ఉండటంతో ఇక్కడ కుల్దీప్ చెలరేగడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. ఇదే మ్యాచ్‌లో కుల్దీప్ ట్రిపుల్ సెంచరీ వికెట్ల మార్కును తాకవచ్చు.
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరుగనుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.
తొలి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: జోరుగా సాగుతున్న టీమిండియా ప్రాక్టీస్.. వీడియో
Comments
Please login to add a commentAdd a comment