
కేఎల్ రాహుల్ 337
బెంగళూరు: కర్ణాటక బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ (448 బంతుల్లో 337; 47 ఫోర్లు, 4 సిక్సర్లు) రంజీ ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు శుక్రవారం అతను ట్రిపుల్ సెంచరీని అందుకున్నాడు.
కర్ణాటక తరఫున రంజీ ట్రోఫీల్లోనే కాకుండా, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ త్రిశతకంతో కర్ణాటక ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 719 పరులు చేసింది.