Ranji Trophy 2021-22: Sakibul Gani Creates World Record by Scoring a Triple Century on 1st Class Debut - Sakshi
Sakshi News home page

తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!

Published Fri, Feb 18 2022 3:17 PM | Last Updated on Sat, Feb 19 2022 8:08 AM

Sakibul Gani creates world record by scoring a triple century on first class debut - Sakshi

బిహార్‌ రంజీ ఆటగాడు షకీబుల్‌ గని ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్ర మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గని  రికార్డులకెక్కాడు. రంజీ ట్రోఫి 2021-22 సీజన్‌లో  భాగంగా మిజోరామ్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబుల్‌ గని ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. గని కేవలం 387 బంతు​ల్లోనే 300 పరుగులు చేశాడు. ఇక బిహార్‌ తొలి ఇన్నింగ్స్‌లో షకీబుల్‌ మొత్తంగా 405 బంతుల్లో  341 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 56 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు రంజీ ట్రోఫీలో ఇదే తొలి ట్రిపుల్‌ సెంచరీ కావడం​ గమనార్హం.

అంతకు ముందు 2018-2019 రంజీ ట్రోఫీ సీజన్‌లో మధ్య ప్రదేశ్‌ ఆటగాడు అజేయ్‌ రోహరా 267 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బిహార్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 686 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో గని.. బాబుల్ కుమార్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 500 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరో వైపు బాబుల్ కుమార్ కూడా డబుల్ సెంచరీ సాధించాడు.

చదవండిIPL 2022 SRH- Simon Katich: మొన్ననే సంతోషంగా ఉందన్నాడు.. ఇంతలోనే ఏమైందో! కారణం ఆమేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement