
కరుణ్ నాయర్ గురించి ఈ విషయాలు తెలుసా?
టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్ రికార్డు సృష్టించాడు. అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలివి..
-
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మలయాళీ దంపతులకు డిసెంబర్ 6, 1991న కరుణ్ నాయర్ జన్మించాడు. మొదట అతను కర్ణాటక తరఫున అండర్-15 క్రికెట్ ఆడాడు. అనంతరం కర్ణాటక నుంచే అండర్ 19 జట్టులో చోటు సాధించాడు.
-
ఈ రైట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ 2012లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం ద్వారా సీనియర్ దేశీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2013లో రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడాడు.
-
2014-15 రంజీ ట్రోపీ సీజన్‌లో నాయర్ 47.26 సగటుతో 700 పరుగులు చేసి.. కర్ణాటక మరోసారి రంజీ ట్రోపీ నిలబెట్టుకోవడంలో తోడ్పడ్డాడు. ఈ టోర్నీలో రాబిన్ ఉతప్ప, కేఎల్ రాహుల్ తర్వాత కర్ణాటక తరఫున అత్యధిక పరుగులు చేసింది బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
-
2016లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున ఆడిన కరుణ్ నాయర్ సత్తా చాటాడు. ఢిల్లీ తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
-
2016లో జింబాబ్వేతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో కరుణ్ అడుగుపెట్టాడు.
-
ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆడటం ద్వారా అతను టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
-
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా టెస్టుల్లో తన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలిచిన తొలి భారతీయ ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పాడు.