బెంగళూరులోని ఆలుర్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న అండర్-19 మహిళల వన్డే కప్‌లో 14 ఏళ్ల ముంబై అమ్మాయి ట్రిపుల్ సెంచరీ సాధించింది. మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో ఐరా జాదవ్ 157 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 220.38 స్ట్రయిక్‌రేట్‌తో 346 పరుగులు (నాటౌట్) చేసింది. భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్‌లో అయినా ఇదే అత్యధిక స్కోర్. ఇరా జాదవ్ వైట్ బాల్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయురాలు.
మహిళల అండర్-19 లెవెల్లో ఐరా జదావ్‌కు ముందు నలుగురు డబుల్ సెంచరీలు సాధించారు. ప్రస్తుత టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన 224 నాటౌట్, రాఘ్వి బిస్త్ 219 నాటౌట్, జెమీమా రోడ్రిగెజ్ 202 నాటౌట్, సనికా ఛాల్కే 200 పరుగులు చేశారు. ఛాల్కే త్వరలో జరుగనున్న మహిళల అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించనుంది. రాఘ్వి బిస్ట్ విషయానికొస్తే.. ఈ అమ్మాయి ఇటీవలే భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసింది.
ఐరా ట్రిపుల్.. ముంబై రికార్డు స్కోర్
మ్యాచ్ విషయానికొస్తే.. ఐరా జాదవ్ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కడంతో మేఘాలయాపై ముంబై కనీవినీ ఎరుగని స్కోర్ చేసింది. ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 563 పరుగులు చేసింది. అండర్-19 మహిళల వన్డే కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ముంబై తరఫున ఇదే అత్యధిక స్కోర్. మేఘాలయాతో మ్యాచ్‌లో ఐరాతో పాటు మరో ప్లేయర్ మూడంకెల స్కోర్ చేసింది. హర్లీ గాలా 79 బంతుల్లో 116 పరుగులు సాధించింది.
ఐపీఎల్ వేలంలో ఎవరూ పట్టించుకోలేదు..!
హిట్టర్‌గా పేరున్న ఐరా జాదవ్‌ను మహిళల ఐపీఎల్-2025 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 10 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో ఐరా మెగా వేలంలో పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment