96 ఏళ్ల 'ట్రిపుల్‌ 'రికార్డు బ్రేక్‌ | South African batsman Marco Marais smashes fastest first-class triple century | Sakshi
Sakshi News home page

96 ఏళ్ల 'ట్రిపుల్‌ ' రికార్డు బ్రేక్‌

Published Mon, Nov 27 2017 11:27 AM | Last Updated on Mon, Nov 27 2017 11:28 AM

South African batsman Marco Marais smashes fastest first-class triple century  - Sakshi - Sakshi

ఈస్ట్‌ లండన్(దక్షిణాఫ్రికా)‌: ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 96 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డు తాజాగా బద్దలైంది. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో మరైస్‌ 191 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. తద్వారా క్రికెట్‌ చరిత్రలోనే 200 బంతుల్లోపు త్రిశతకం సాధించిన తొలి ఆటగాడిగానూ నిలిచాడు. ఈ క్రమంలోనే 1921లో చార్లెస్‌ మెకార్ట్‌నే (221 బంతుల్లో) నెలకొల్పిన వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీ రికార్డును తుడిచిపెట్టాడు. 68 బంతుల్లో శతకం.. 139 బంతుల్లో డబుల్‌ సెంచరీ అందుకున్నాడు.

ఆదివారం జరిగిన మూడు రోజుల కప్‌ మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ తమ బోర్డర్‌ జట్టు 84/4 స్కోరుతో కష్టకాలంలో ఉన్న దశలో ఆరో నంబర్‌ ఆటగాడిగా బరిలోకి దిగిన మార్కో 35 ఫోర్లు, 13 సిక్సర్లతో 191 బంతుల్లో 300 పరుగులు పూర్తి చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement