ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో అజేయ ట్రిపుల్ సెంచరీ చేసిన టీమిండియా బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్‌ను అతని తల్లిదండ్రులు అభినందించారు. తమ కొడుకు ఈ ఘనత సాధించడం తమకు గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచి చాలా కష్టపడ్డాడని, ఇప్పుడు దాన్ని సాధించాడని కరుణ్ నాయర్ తండ్రి కళాధరన్ నాయర్ అన్నారు. తనకు స్వర్గంలో ఉన్నంత అనుభూతి కలుగుతోందని కరుణ్ తల్లి అన్నారు.