'తొలి టెస్టులోనే కెప్టెన్... ట్రిఫుల్ సెంచరీ' | Modi a Captain who scores a triple century on debut: Advani | Sakshi
Sakshi News home page

'తొలి టెస్టులోనే కెప్టెన్... ట్రిఫుల్ సెంచరీ'

Published Sun, Jun 29 2014 8:52 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'తొలి టెస్టులోనే కెప్టెన్... ట్రిఫుల్ సెంచరీ' - Sakshi

'తొలి టెస్టులోనే కెప్టెన్... ట్రిఫుల్ సెంచరీ'

సూరజ్‌కుండ్(హర్యానా): ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ క్రికెట్ పరిభాషలో పొడిగారు. తొలి టెస్టులోనే కెప్టెన్ అయిన మోడీ ఆరంగ్రేటంతోనే అదరగొట్టారని కితాబిచ్చారు. మొదటి టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించారని ప్రశంసించారు.

'తొలి మ్యాచ్ లో సెంచరీ లేదా డబుల్ సెంచరీలు చేసిన వారి గురించి మనం వింటుంటాం. ఆడిన తొలి మ్యాచ్ లోనే కెప్టెన్ కిరిటాన్ని దక్కించుకుని, ట్రిఫు్ల్ సెంచరీ చేసిన ఆటగాడి గురించి నేనెప్పుడూ వినలేదు. నరేంద్ర మోడీ ఈ ఘనత సాధించారు' అని అద్వానీ పేర్కొన్నారు. తొలిసారి పార్లమెంటులో అడుగుపెడుతున్న బీజేపీ ఎంపీలకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో ప్రసంగిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 300 పైగా సీట్లు గెల్చుకుని విజయదుందుభి మోగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement