అద్వానీ ఇంటికి మోదీ | Prime Minister Modi greets L K Advani on his birthday | Sakshi
Sakshi News home page

అద్వానీ ఇంటికి మోదీ

Published Sun, Nov 8 2015 10:00 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

అద్వానీ ఇంటికి మోదీ - Sakshi

అద్వానీ ఇంటికి మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ నివాసానికి వెళ్లారు. నేడు అద్వానీ పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసానికి వచ్చిన మోదీకి అద్వానీ సాదర స్వగతం పలికారు. నేడు అద్వానీ 88వ పడిలోకి ప్రవేశించారు.

అద్వానీ నివాసానికి వెళ్లకముందే ఆయనకు ట్విట్టర్ ద్వారానూ బర్త్ డే విషెస్ తెలిపారు మోదీ. అద్వానీ అత్యంత గౌరవనీయులని, మార్గదర్శిగా, ఉత్తేజాన్నిచ్చిన స్పూర్తి ప్రధాతగా నిలుస్తారని పేర్కొన్న మోదీ.. పెద్దాయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాననన్నారు. అపారమైన జ్ఞానసంపత్తి, రుజువర్తన అద్వానీ సొంతమని కొనియాడారు. వ్యక్తిగతంగా అద్వానీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తన జీవితంలో అత్యుత్తమ గురువు ఆయనేనని చెప్పుకొచ్చారు.

 

మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్.కె. అద్వానీ 1927, నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించారు. విభజన అనంతరం భారత్ కు వచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement