కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పుట్టినరోజు నేడు(జూలై 21). ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఖర్గే 1942 జూలై 21న జన్మించారు. కర్నాటకకు చెందిన దళిత నేత అయిన ఖర్గే సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పలు కీలక పదవులు చేపట్టారు. రెండు దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబయేతర తొలి కాంగ్రెస్ అధ్యక్షునిగా ఖర్గే నిలిచారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున్ ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అణగారిన, పేద ప్రజల హక్కులను కాపాడేందుకు ఖర్గే కృషి చేశారన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నారు.
Birthday wishes to Congress President and the Leader of Opposition in the Rajya Sabha, Shri Mallikarjun Kharge Ji. Praying for his long and healthy life. @kharge
— Narendra Modi (@narendramodi) July 21, 2024
Comments
Please login to add a commentAdd a comment