Celebrating
-
సరస్వతి పూజలో టీమిండియా మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా కుటుంబం (ఫొటోలు)
-
రాజకీయ కవిసార్వభౌముడు
అది 1984 డిసెంబర్ 30. ముంబైలోని శివాజీ పార్కు. బీజేపీ సదస్సులో అటల్ ప్రసంగిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా విని్పంచేంతటి నిశ్శబ్దం నడుమ అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ‘‘చీకట్లు విడిపోతాయి. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారాయన. అప్పట్లో అంతా పెదవి విరిచినా, మరో పుష్కరం తిరక్కుండానే హస్తిన కోటపై కాషాయ జెండా ఎగరేసి చూపించారు. ప్రాణమిత్రుడు ఆడ్వాణీతో కలిసి బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి కేంద్రంలో అధికార పీఠం దాకా ఒక్కొక్క మెట్టూ ఎక్కించారు. ఒకప్పుడు రాజకీయాల్లో అంటరానిదిగా పరిగణన పొందిన బీజేపీని వాజ్‌పేయీ ప్రబల శక్తిగా తీర్చిదిద్దారు. ఆ క్రమంలో ఎదురైన ఆటుపోట్లను ఏమాత్రమూ చలించని నిబ్బరంతో, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసి ఆ పదవికే వన్నె తెచ్చారు. అంతకుముందు లోక్‌సభలో విపక్ష నేతగానూ పార్టీలకతీతంగా మన్ననలూ అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పొరుగు దేశం కుట్రలను పటాపంచలు చేసి దేశ వైఖరిని ప్రస్ఫుటంగా చాటారు. నెహ్రూ తనకిష్టమైన నేత అని చెప్పినా, పాక్ పీచమణిచి బంగ్లాను విముక్తం చేసిన ఇందిరను విజయేందిరగా కొనియాడినా వాజ్‌పేయికే చెల్లింది. తర్వాత కొన్నేళ్లకే ఎమర్జెన్సీ వేళ అదే ఇందరి నియంతృత్వాన్ని ఆయన అంతే నిస్సంకోచంగా కడిగిపారేశారు. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాల కంటే దేశమే ముందని, ముఖ్యమని త్రికరణ శుద్ధిగా నమ్మడమే గాక దాన్ని ఆచరణలోనూ చూపారు. పలు సందర్భాల్లో మాతృ సంస్థ ఆరెస్సెస్ విధానాలతోనే విభేదించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై పార్టీ వైఖరికి భిన్న స్వరం వినిపించేందుకు కూడా వెనకాడలేదు. అంతేనా...? తొలిసారి ప్రధాని పదవి తనకు 13 రోజుల ముచ్చటగానే ముగిశాక నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర దించేందుకు ఏకంగా కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతిచ్చేందుకు కూడా ముందుకొచి్చన దేశ ప్రేమికుడు వాజ్‌పేయి. ఇలా బహుముఖీనమైన వ్యక్తిత్వంతో పార్టీలకతీతంగా చెరగని అభిమానం సంపాదించుకున్నారు వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయారు. ఆయన జయంతి డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవంగా ప్రకటిస్తూ కేంద్రం సముచిత నిర్ణయమే తీసుకుంది. ఆదర్శ నాయకుడు 1984 సార్వత్రిక ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా బీజేపీ గుర్తింపు తెచ్చుకుంది. వాజ్‌పేయి నేతృత్వంలో 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాల సాయంతో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ రూపంలో జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ ప్రయోగాలకు వాజ్‌పేయి ఆద్యునిగా నిలిచారు. పదో ప్రధానిగా ప్రమాణం చేశారు. 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చినా 1998లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 13 నెలల అనంతరం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయినా చలించలేదు. ఆ వెంటనే వచి్చన ఎన్నికల్లో నెగ్గి ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి పూర్తికాలం పదవిలో కొనసాగారు. ఆ ఘనత సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచిపోయారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దశాబ్దాల విభేదాలకు, ఉద్రిక్తతలకు శాంతిచర్చలే విరుగుడంటూ సాహసోపేతంగా సంప్రదింపులకు తెర తీశారు. నాటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్ ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సరీ్వసును ప్రారంభించారు. పాక్ కపట బుద్ధి కార్గిల్ యుద్ధానికి దారి తీసినా ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పారు. 2003లో ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా సైనిక సాయం కోరితే నిష్కర్షగా తిరస్కరించిన ధీశాలి వాజ్‌పేయి. డజన్ల కొద్దీ దేశాలు అమెరికా పక్షం వహించినా, అదే బాటన నడుద్దామని సొంత మంత్రివర్గ సభ్యులే ఒత్తిడి తెచి్చనా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అదే మేలని మీడియా సలహాలిచి్చనా ససేమిరా అన్నారు. ఇరాక్‌పై అమెరికా యుద్ధంలో పాల్గొనేది లేదని పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన కీలక ఘట్టంగా మిగిలిపోయింది.కీలక సంస్కరణలు మూడోసారి ప్రధానిగా కీలక ఆర్థిక సంస్కరణలకు వాజ్‌పేయి బాటలు వేశారు. పీవీ బాటన సాగుతూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని, సరళీకృత విధానాలను, విదేశీ పెట్టుబడులను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. హైవేల అభివృద్ధి, ప్రధాని గ్రామసడక్ పథకాలతో దేశ రవాణా రూపురేఖలనే మార్చేశారు. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేశారు. నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1998లో పోఖ్రాన్లో రెండో అణు పరీక్షల ద్వారా భారత అణ్వస్త్ర పాటవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలో టెలికాం విప్లవానికి బాటలు పరిచిందీ వాజ్పేయే. ఆయన హయాం సుపరిపాలనకు పర్యాయపదంగా నిలిచిపోయింది. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనంతరం వాజ్‌పేయీ క్రమంగా రాజకీయ రంగం నుంచి తప్పుకున్నారు. 2006లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ తర్వాత చివరిసారిగా మీడియాతో మాట్లాడారు వాజ్‌పేయి. ఈ సందర్భంగానే నాయకత్వ బాధ్యతలను ఆడ్వాణీకి అప్పగించారు. క్షీణించిన ఆరోగ్యానికి నిదర్శనంగా అప్పటికే చేతికర్ర సాయం తీసుకున్నారు. 2007లో చివరిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత 2018 ఆగస్టు 16న కన్నుమూసేదాకా దాదాపు పుష్కర కాలం వాజ్‌పేయి ఏకాంత జీవితమే గడిపారని చెప్పాలి. ఆ గళం.. అనితరసాధ్యంవాజ్పేయి అద్భుత వక్త. హిందీ, ఇంగ్లీష్ ల్లో తిరుగులేని వాగ్ధాటి ఆయన సొంతం. 1957లో పార్లమెంటేరియన్‌గా తొలి ప్రసంగంతోనే నాటి ప్రధాని నెహ్రూతో సహా అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో గొప్పగా రాణించి ప్రధాని అవుతాడంటూ నెహ్రూ ప్రశంసలు అందుకున్నారు. విపక్ష నేతగా అయినా, ప్రధానిగా హోదాలోనూ ఆయన మాట్లాడేందుకు లేచారంటే సభ్యులంతా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యం, చమత్కారాలు, అక్కడక్కడా అవసరమైన మేరకు వ్యంగ్యం మేళవిస్తూ కవితాత్మకంగా సాగే వాజ్‌పేయి ప్రసంగాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి. హిందీ అంతగా అర్థం కాని తమిళ దిగ్గజం సీఎన్ అన్నాదురైని కూడా ఆకట్టుకున్న ఘనత ఆయన ప్రసంగాలకు దక్కింది! 1994లో జెనీవా వేదికపై కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రించేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఏరికోరి వాజ్‌పేయినే ఎంచుకున్నారు. ఏ అంశంపై అయినా సమగ్ర కసరత్తు చేశాకే మాట్లాడేవారు. గణాంకాలు తదితరాలను తప్పకుండా ప్రస్తావించేవారు. అందుకే పార్లమెంటులో ఆయన వాదనలను తిప్పికొట్టలేక ప్రత్యర్థి పక్షాల్లోని మహామహులైన నేతలు కూడా చేష్టలుడిగేవారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన క్షణాలు తనకు మరపురానివని గుర్తు చేసుకునేవారు. వాజ్‌పేయి కొంతకాలం జర్నలిస్టుగా కూడా రాణించారు.సినీ ప్రియుడు వాజ్‌పేయి సినీ ప్రియుడు. పాత హిందీ సినిమాలు బాగా చూసేవారు. తీస్రీ కసమ్, దేవదాస్, బందినీ వంటివి ఆయన ఆల్‌టైం ఫేవరెట్ హిందీ సినిమాల్లో కొన్ని. లతా మంగేష్కర్, ముకేశ్, ఆయన అభిమాన గాయనీ గాయకులు. ‘మీకూ నాకూ ఎన్నో పోలికలు. ఇద్దరమూ ఒంటరితనమే. ఇంగ్లీష్ లో నా పేరు (అటల్)ను తిరగేస్తే మీ పేరు (లత) వస్తుంది’ అంటూ ఓసారి లతా మంగేష్కర్తో చమత్కరించారట! అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా బాగా ఇష్టపడేవారు. ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వై తనకిష్టమైన సినిమా అని తరచూ చెప్పేవారు. అలాగే బార్న్ ఫ్రీ, గాంధీ సినిమాలు కూడా. వాజ్‌పేయి కవితలకు పలువురు గాయకులు ప్రాణం పోయడం మరో విశేషం. ఆయన రాసిన ‘క్యా ఖోయా, క్యా పాయా’, ‘దూర్ కహీ కోయీ రోతా హై’, ‘ఝుకీ న ఆంఖే’ వంటి వేదనాభరిత కవితలను గజల్ సమ్రాట్ జగ్జీత్సింగ్ తన గళంతో అజరామరం చేశారు. శరత్, ప్రేమ్‌చంద్ సాహిత్యమన్నా వాజ్‌పేయికి ప్రాణం. ఎమర్జెన్సీ వేళ జైల్లోనూ కవితా రచన చేసిన కళాపిపాసి వాజ్‌పేయీ. అడ్వాణీ ఆయనకు ఆజన్మాంతం ప్రియమిత్రుడు. తనతో కలిసి ఢిల్లీ వీధుల్లో స్కూటర్‌పై చక్కర్లు కొట్టేవారు. పానీపూరీ, చాట్ వాజ్‌పేయి ఎంతో ఇష్టంగా తినేవారని అడ్వాణీ చెబుతారు. ఆయన చేయి తిరిగిన వంటగాడే గాక మంచి భోజనప్రియుడు కూడా.చావు అయుష్షెంత, రెండు క్షణాలేగా! మరి జీవితమేమో ప్రగతిశీలం, ఒకటీ రెండు నాళ్లలో ముగిసేది కాదు ప్రధానిగా ఒకనాటికి మాజీని అవుతానేమో. మాజీ కవిని మాత్రం ఎప్పటికీ కాలేను మిత్రులను మార్చగలం గానీ పొరుగువారిని మార్చుకోలేం భారతీయులుగా మనమంతా ఉత్కృష్ట నాగరికతకు వారసులం. శాంతే మన జీవిత గీతిక అధికారం కోసం పార్టీని చీల్చాల్సి, కొత్త గ్రూపులు కట్టాల్సే వస్తే అలాంటి అధికారాన్ని తాకనైనా తాకను పేదరికం బహుముఖీనం. దాన్ని కేవలం డబ్బు, ఆదాయం, విద్య, ఆరోగ్య పరామితుల్లో కొలవలేం పుడమి వయసు లక్షల ఏళ్లు. మనిషివి అంతులేని జీవన గాథలు. కానీ మన దేహానికి హద్దులున్నాయి.శత శరత్కాలాల వాణిని విన్నాం. అది చిట్టచివరిసారి తట్టినపుడైనా మనసు తలుపు తెరుద్దాంపాలిటిక్స్తో విసిగిపోయా. వాటిని వదిలేద్దామనుకుంటున్నాను. కానీ అవి నన్ను వదిలేలా లేవుస్వేచ్ఛకు సంకెళ్లు వేద్దామనుకునేవాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. నిప్పుతో చెలగాటాలొద్దు. పక్కింటికి నిప్పుపెడితే ఆ దావాగ్ని మీ ఇంటినీ కాల్చేస్తుంది–వాజ్‌పేయి -
వావ్, వావ్..యానివర్సరీ వీక్ అంటే ఇలా, మంచు పూల జల్లుల్లోన (ఫోటోలు)
-
‘జామియా’లో దీపావళి ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. దీపావళి వేడుకల సందర్భంగా రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం యూనివర్శిటీకి చెందిన కొందరు హిందూ విద్యార్థులు దీపావళి వేడుకలకు ముందుగా దీపాలు వెలిగించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మరోవర్గానికి చెందినవారు నిరసనకు దిగారు. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ నేపధ్యంలో యూనివర్సిటీ క్యాంపస్‌లో పోలీసు భద్రతను మరింతగా పెంచారు. జామియా యూనివర్సిటీలో దీపావళి వేడుకల సందర్భంగా వెలిగించిన దీపాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్శిటీలో మతపరమైన నినాదాలు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. BIG BREAKING NEWS 🚨 Clash breaks out at Jamia Millia Islamia University during Diwali celebrations of Hindus.Conflict began when some individuals allegedly tried to erase off Rangoli with their feet & extinguish Diyas.Viral Video claims some students were raising… pic.twitter.com/Kg4tf9eA2k— Times Algebra (@TimesAlgebraIND) October 22, 2024ఇది కూడా చదవండి: కొనసాగుతున్న బాంబు బెదిరింపులు -
World EV Day 2024: దేశంలో రయ్ మంటున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫోటోలు)
-
అంధులకు సాయం చేసిన తెలుగు హీరో.. మనసు బంగారం (ఫోటోలు)
-
ఖర్గేకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పుట్టినరోజు నేడు(జూలై 21). ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఖర్గే 1942 జూలై 21న జన్మించారు. కర్నాటకకు చెందిన దళిత నేత అయిన ఖర్గే సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. కర్నాటక కాంగ్రెస్ పార్టీలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పలు కీలక పదవులు చేపట్టారు. రెండు దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబయేతర తొలి కాంగ్రెస్ అధ్యక్షునిగా ఖర్గే నిలిచారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున్ ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అణగారిన, పేద ప్రజల హక్కులను కాపాడేందుకు ఖర్గే కృషి చేశారన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఖర్గేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నారు. Birthday wishes to Congress President and the Leader of Opposition in the Rajya Sabha, Shri Mallikarjun Kharge Ji. Praying for his long and healthy life. @kharge— Narendra Modi (@narendramodi) July 21, 2024 -
జపాన్‌లో మంచుగూళ్ల సంబరాలు.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా!?
జపాన్‌లో ఏటా మంచుగూళ్ల సంబరాలు జరుగుతాయి. నెల్లాళ్ల పాటు జరిగే ఈ సంబరాల్లో జపాన్ ప్రజలు బాగా హిమపాతం జరిగే ప్రదేశాల్లో మంచుగూళ్లు నిర్మించుకుని, వాటిలో గడుపుతూ విందు వినోదాలతో ఓలలాడతారు. ‘యునిషిగవా ఓన్సెన్ కమకురా’ పేరిట జరుపుకొనే ఈ సంబరాలు ‘స్నో హౌస్ ఫెస్టివల్’గా అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందాయి. ఈ ఏడాది ఈ సంబరాలు జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో మంచు దట్టంగా పేరుకునే ప్రదేశాల్లో ‘ఇగ్లూ’ల మాదిరిగా మంచుతోనే చిన్న చిన్న గూళ్ల వంటి ఇళ్లు నిర్మించుకుని, వాటిలోనే తాత్కాలికంగా బస చేస్తారు. రాత్రివేళ వాటిలో పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించి, పరిసరాలను దేదీప్యమానం చేస్తారు. జపాన్‌లోని షింటో మతస్థుల దేవుడు ‘కమకురా దైమ్యోజిన్’ గౌరవార్థం ఈ సంబరాలను జరుపుకొంటారు. ఈ సంబరాల్లో షింటో మతస్థుల జలదేవత ‘సుయిజిన్’కు ప్రత్యేక పూజలు జరుపుతారు. జపాన్ను పన్నెండో శతాబ్ది నుంచి పద్నాలుగో శతాబ్ది వరకు పరిపాలించిన ‘కమకురా షొగునటే’ పాలకుల కాలం నుంచి షింటో మతస్థులు ఈ వేడుకలను జరుపుకొంటూ వస్తున్నారు. ఆనాటి రాచరిక ఆచార వ్యవహారాలను తలపించేలా ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంబరాల్లో భాగంగా యోకోటే నగరంలో ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు జరిపే కార్యక్రమాలను జానపద సాంస్కృతిక వారసత్వ కార్యక్రమంగా జపాన్ సాంస్కృతిక శాఖ గుర్తించింది. ఇవి కూడా చదవండి: కొంపముంచిన స్టంట్: ఏకంగా 29వ అంతస్థు నుంచి -
పని చెయ్యడం ఒక వేడుక
ఫలితం రావడానికి పనిచెయ్యడం ప్రాతిపదిక. ప్రయత్నం పని చెయ్యడానికి ప్రాతిపదిక. ఏ పరిణామానికైనా ప్రయత్నం, పని చెయ్యడం ఉండాలి. ప్రయత్నంతో పని చెయ్యడానికి మనిషి పూనుకోవాలి; ప్రయోజనకరమైన ఫలితాలను సాధించాలి. ‘తప్పులు జరుగుతాయన్న భయంతో పని మొదలు పెట్టక΄ోవడం చెడ్డవాడి లక్షణం; అజీర్ణం అవుతుందనే భయంవల్ల భ్రాంతిలో ఎవరు భోజనాన్ని వదిలేస్తారు? అని హితోపదేశం మాట. తప్పులు జరుగుతాయని పని చెయ్యక΄ోవడం నేరం. పని చెయ్యడం గురించి ఓషో ఇలా చె΄్పారు... జీవితం అన్నది బాధ్యతలతో మాత్రం పని చెయ్యడమా? లేదా వేడుకలోపాలుపంచుకోవడమా? పని చెయ్యడం మాత్రమే జీవితం అయితే జీవితం ఇబ్బందికరమైనదై ఇరుకైందిగా మారి΄ోతుంది. బరువెక్కిన హృదయంతో జీవించాల్సి వస్తుంది. కృష్ణుడు పని చెయ్యడం మాత్రమే బాధ్యత గా జీవించినవాడు కాదు. జీవితాన్ని ఒక వేడుకగా; ఒక ఉత్సవంగా మార్చుకున్నవాడు. జీవితం ఇంట్లో చదువుకునేపాఠం కాదు. జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చుకోవడం వల్ల ఎవరూ జీవితాన్ని కోల్పోవడం లేదు. పని చెయ్యి; ఆ పనిని వేడుకలాగా మార్చెయ్యి. అప్పుడు పని కూడా ఆటపాటల సంకలనంగా మారి΄ోతుంది. అందువల్ల చిన్నపని కూడా నిండుగా ఉంటుంది. పని సౌందర్యాత్మకం అవుతుంది. పనికి బానిసలుగా మారినవాళ్ల గురించి మీకు తెలిసి ఉంటుంది. పని చెయ్యడం కోసం జీవించేవాళ్లు ఉద్రిక్తతలో జీవించాల్సి వస్తుంది. పని పిచ్చివాళ్లైనవాళ్లు జీవించడాన్ని ఒక కర్మాగారంగా మార్చేసు కుంటున్నారు.‘చెయ్యి లేదా చచ్చి΄ో‘ అని ఘోషిస్తున్నారు. పని చెయ్యడం తప్పితే మరో కోణం వాళ్లకు తెలీదు. వాస్తవానికి వాళ్లకు పని చెయ్యడానికి ప్రయోజనం ఏమిటో తెలియదు. జీవితం అన్నది ఒక వేడుక. మనం పని చెయ్యడం నాట్యం చేస్తున్నట్టు ఉండాలి. పని చెయ్యడం ద్వారా వేడుకను తీసుకురావాలి. కఠినమైన జీవితాన్ని తలుచుకుంటూ ఉంటేపాడడానికీ, ఆడడానికీ, వేడుక చేసుకోవడానికీ సమయం లేకుండా ΄ోతుంది. జీవితం ఇంటికీ, కార్యాలయానికీ మధ్యలో ఆగి΄ోతుంది. ఈ రెండు ప్రదేశాల మధ్యలో ముళ్లకంచెను ఏర్పరుచుకుని మానసికంగా మీరు బాధకు గురి అవుతున్నారు. ఒకరోజున జీవితంలో విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించాలని మీరు అనుకుంటారు. కానీ ఆ రోజు రాదు; పని పిచ్చివాళ్లు ఎప్పటికీ జీవితాన్ని వేడుక చేసుకోరు. కృష్ణుడు జీవితాన్ని ఉత్సవంగా మార్చుకున్నాడు. పువ్వులు, పక్షులు, ఆకాశ తారలు జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. మనిషి తప్పితే జీవరాశులన్నీ జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. పువ్వులు ఎందుకు పూస్తూ ఉన్నాయి? అని అడగండి. తారలు ఎందుకు ఆకాశంలో తేలుతున్నాయి? అని అడగండి. గాలి ఎందుకు ఒంటరిగా వీస్తోంది? అని అడగండి. సూర్యుడికి కింద జీవిస్తున్నవి అన్నీ వేడుక చేసుకుంటున్నాయి. ప్రపంచమే వేడుక చేసుకుంటోంది. మనిషి కూడా ప్రపంచంలో భాగమే అని కృష్ణుడు చెబుతున్నాడు; వేడుక చేసుకోండి అని చెబుతున్నాడు. ఏ పనీ చెయ్యకుండా వేడుక చేసుకోమని కృష్ణుడు చెప్పలేదు. గాలి పని చెయ్యకుండా వీచడం లేదు. తార ఒకేచోట నుంచుని వేడుక చేసుకోవడంలేదు. అది కదులుతూనే ఉంది. పువ్వులు పుయ్యడం కూడా పనే. అయితే వీటికి పని చెయ్యడం ముఖ్యం కాదు. వేడుక ముఖ్యం. వేడుక ముందు ఉంటుంది అదే సమయంలో అవి తమ బాధ్యతల్ని కూడా నెరవేరుస్తాయి. వేడుకకు కొనసాగింపే పని; జీవితమే ఒక ఉత్సవం. పని చెయ్యడంలోని సౌందర్యాన్ని, పని చెయ్యడంవల్ల సత్ఫలితాన్ని మనిషి సొంతం చేసుకోవాలి. పని చేస్తూ మనిషి తన జీవితాన్ని ఉత్సవం చేసుకోవాలి. – శ్రీకాంత్ జయంతి -
షారుక్ ఖాన్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Sharuk Khan Drops First Look Of Pathaan Celebrating 30 Years Film Industry: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అనేక విజయాలు, గ్లామర్ పాత్రలు, రొమాంటిక్ హీరోగా పేరు గడించిన షారుక్ ఖాన్ 'కింగ్ ఖాన్'గా మన్ననలు పొందాడు. ఈ బాలీవుడ్ బాద్షా సినీ ప్రయాణం ప్రారంభమై నేటితో (జూన్ 25) 30 ఏళ్లు పూర్తయింది. 1992 జూన్ 25న విడుదలైన 'దీవానా' సినిమాతో షారుక్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఒక్కో సినిమాతో తన స్టార్డమ్ పెంచుకున్నాడు. ఇక షారుక్, కాజల్ రొమాంటిక్ లవ్ ట్రాక్ 'దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే'తో ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రదర్శితమైన మూవీగా రికార్డు సాధించింది. ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ తన 30 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. షారుక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'పఠాన్' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోలో చేతిలో గన్‌తో, చేతికి బేడీలతో ఇంటెన్సివ్ లుక్‌లో ఆకట్టుకుంటున్న షారుక్‌ను చూడొచ్చు. ఈ పోస్టర్ రిలీజైన అతి తక్కువ సమయంలోనే నెట్టింట షేక్ చేస్తోంది. కాగా పఠాన్ మూవీలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కూడా కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 25, 2023న గ్రాండ్‌గా విడుదల కానుంది. (చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?) 'పఠాన్'తోపాటు షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో 'జవాన్' సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనుంది. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించే 'డంకీ'లోనూ నటించనున్నాడు. ఇవేకాకుండా మాధవన్ 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్', అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్ధా', రణ్‌బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర', సల్మాన్ ఖాన్ 'టైగర్-3' చిత్రాల్లో కింగ్ ఖాన్ కెమియో ఇవ్వనున్నట్లు సమాచారం. (చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
సంక్రాంతి సంబరం.. ఆయ్.. మా ఊరొచ్చేశామండీ..
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి): పండగంటే పదిమందీ కలవడమే.. అయినవాళ్లతో ఆనందం కలబోసుకోవడమే.. ఉపాధికో ఉద్యోగ రీత్యానో చెల్లాచెదురై ఏడాదికోసారైనా కన్న ఊరికి చేరుకోవడమే.. ఆత్మీయ పలకరింపుల మధ్య అన్నీ మరచిపోవడమే.. అనుబంధాలన్నీ పెనవేసుకోవడమే.. చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడమే.. తీపి అనుభూతులను మూటగట్టుకోవడమే.. ఔను అదే పండగ.. కాదు.. అనురాగ నిలయమైన మన గోదావరి జిల్లాలో ఇది పెద్ద పండగే.. అందుకే ఏటా సంక్రాంతి కోసం అన్ని ఎదురు చూపులు.. అంత సంతోషం.. ఆ రోజే రానే వచ్చింది. ప్రతి లోగిలీ మమతల కోవెల.. జిల్లాకు చెందిన వేలాది కుటుంబాలు ఉద్యోగ, ఇతర వృత్తుల రీత్యా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడ్డాయి. వారందరూ భోగి నాటికే (శుక్రవారం) సొంతూళ్లకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా రెక్కలు కట్టుకుని మరీ వాలిపోయారు. లోగిళ్లన్నీ పలకరింపులతో పులకరించిపోతున్నాయి. అయినవారి ఆనంద కాంతులతో మెరిసిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కళ తప్పిన పల్లెలు కళకళలాడుతున్నాయి. తండ్రి, తల్లి, కొడుకులు, కోడళ్లు, కూతుర్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లతో ప్రతి ఇల్లూ ఓ మమతల కోవెలను తలపిస్తోంది. కోడి పందేలు, ప్రభల తీర్థాలు, సహపంక్తి భోజనాలు, గ్రామీణ క్రీడలు, పచ్చని కొబ్బరి తడికలతో జోడెడ్ల గూడు బండ్ల వంటి అరుదైన అనుభూతులను వారు చవి చూస్తున్నారు. తాము హైదరాబాద్‌లో స్థిరపడినప్పటికీ సంక్రాంతికి అమలాపురం వచ్చి పండగ మూడు రోజులూ ఆనంద సాగరంలో మునిగిపోతామని కోనసీమకు చెందిన మెట్రో కెమ్ కంపెనీల అధినేత నందెపు బాలాజీ అన్నారు. గంగలకుర్రులో ఉమ్మడి కుటుంబంలా సహపంక్తి భోజనాలు చేస్తున్న బంధువులు ఆయ్ తినండి మరీ.. మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేయడం జిల్లా వాసుల సహజ లక్షణం. సరికొత్త రుచులతో కొసరి కొసరి వడ్డించేస్తారు. పూత చుట్టలు, కజ్జికాయలు, పోక ఉండలు, జంతికలు, మినపసున్నుండలే కాదు.. గోదావరి పాయల్లో దొరికే చందువ, పండుగప్ప వంటి చేపలే కాకుండా కోడి పందేల్లో వీర మరణం పొందిన పుంజు కోస మాంసం కూరలు వడ్డించి తినమంటూ సుతిమెత్తని ఒత్తిడి పెట్టేస్తారు. కోనసీమ సంప్రదాయాలు సూపర్ నాది తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట. ఉద్యోగ రీత్యా కుటుంబ సమేతంగా కొన్నేళ్లుగా మలావి దేశంలో స్థిరపడ్డాను. అక్కడ నాతో కలిసి పని చేసే అంబాజీపేటకు చెందిన పరసా బాలాజీతో కలిసి కోనసీమ వచ్చాను. మా కోనసీమ రుచులు, సంక్రాంతి సంబరాలు స్వయంగా చూడాలని చెప్పి నా స్నేహితుడు బాలాజీ ఈ సీమకు తీసుకు వచ్చాడు. ఇక్కడి సంక్రాంతి సంబరాలు, పిండి వంటలు అన్ని అద్భుతంగా, అమోఘంగా ఉన్నాయి. ఈ మధురానుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. – నేగూరి నవీన్, అంబాజీపేట పుణె నుంచి పుట్టింటికి.. సంక్రాంతి పండగలెప్పుడొస్తాయా అని పుణెలో ఎదురు చూస్తూంటాను. పండగ రాగానే రెండు రోజుల ముందే పుట్టిల్లయిన అంబాజీపేట మండలం గంగలకుర్రు వచ్చే స్తాం. ఇక్కడికి దగ్గర్లో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థం చూడడం కోసమైనా పుణె నుంచి వస్తాం. ఉద్యోగ రీత్యా మేము అక్కడ ఉంటున్నా సంక్రాంతికి రెక్కలు కట్టుకు వచ్చి మరీ వాలిపోతాం. – పమ్మి అరుణ, గృహిణి, గంగలకుర్రు ఉమ్మడి కుటుంబ వారసత్వం అంబాజీపేట మండలం గంగలకుర్రు, ఇందుపల్లి గ్రామాల బ్రాహ్మణుల వీధిలోని 300 కుటుంబాలకు చెందిన ఇళ్లన్నీ పండగ సందర్భంగా ఓ స్వర్గసీమగా మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాల ఉనికిని చాటుతున్నాయి. పండగ మూడు రోజులూ ఈ కుటుంబాలన్నీ ఒకచోట సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గంగలకుర్రుకు చెందిన ఆకెళ్ల పద్మామహాలక్ష్మి కుటుంబం ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నా సంక్రాంతికి కుటుంబ సమేతంగా పుట్టింటికి వచ్చారు. ఇదే గ్రామానికి చెందిన పుల్లెల సతీష్ కుటుంబం అమెరికాలో ఉంటున్నా సంక్రాంతికి ఆ ఊరి వేడుకలకు హాజరు కావడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. -
మా స్నేహానికి రేంజ్ అడ్డు కాదు!
ఒకరితో స్నేహం చేయడం అంటే ఓకే. ఇద్దరు ముగ్గురు స్నేహితులున్నా ఓకే. అభిప్రాయభేదాలు ఉన్నా సర్దుకుపోవచ్చు. కానీ పదమూడు మంది స్నేహితులంటే సర్దుబాట్లు చాలా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘చిత్రం’ శ్రీను, ‘సత్యం’ రాజేశ్, తాగుబోతు రమేశ్, ధన్‌రాజ్, సప్తగిరి, సత్య, ప్రవీణ్, వేణు, నవీన్ నేని, నందు, రఘు... వీరంతా మంచి స్నేహితులు. స్నేహానికి విలువ ఇచ్చే ఈ 13 మంది ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇచ్చుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆ స్నేహబంధం గురించి అడిగిన ‘సాక్షి’తో నటుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పిన విశేషాలు. ►మా పదమూడు మందికి ఒక వాట్సప్ గ్రూప్ ఉంది. పేరు ‘ఫ్లయింగ్ కలర్స్’. మేమంతా ఆర్టిస్టులుగా రంగుల ప్రపంచంలో ఉంటాం కాబట్టి, ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడు ఫ్లై అవుతుంటాం కాబట్టి మా గ్రూప్‌కి ‘ఫ్లయింగ్ కలర్స్’ అని పెట్టుకున్నాం. ►మా గ్రూపులో ఉన్నవారందరం ఒకరికొకరం పరుగెత్తి పోటీపడే ఆర్టిస్టులమే. అయినా కానీ అదంతా ప్రొఫెషనల్ లైఫ్. ఫ్రెండ్షిప్ విషయంలో రేంజ్‌ని పట్టించుకోం. పోటీని దూరంగా ఉంచుతాం. ‘వెన్నెల’ కిశోర్ అయినా ఒకటే.. నవీన్, శ్రీనివాస్ రెడ్డి అయినా ఒకటే. అందరం సరదాగా ఒకరికొకరం అన్నట్లుగా ఉంటాం. ►అవకాశాల పరంగా ఎవరికి వారిమే అన్నట్లు ఉంటాం. ఒకరికొకరు చాన్సులు చెప్పుకునే అవసరం ఉండదు. గ్రూప్‌లో ఇలాంటి విషయాలను కలపం. మా గ్రూప్‌లోని సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా మీట్ అవుతుంటాం. ముఖ్యంగా ఏవైనా పండగలు, శుభకార్యాలప్పుడు కలుస్తుంటాం. ►మేం తీసిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత మరో సినిమా అనుకున్నాం. కానీ ఆర్టిస్టులుగా మేమందరం బిజీగా ఉన్నాం. అయితే మళ్లీ ఓ సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ►ఏదైనా ఒకటి రెండు సందర్భాల్లో మాటా మాటా అనుకున్నా, ఆ తర్వాత ఎవరికి వారు కంట్రోల్ కాగలిగినవాళ్లమే. సో... మా మధ్య పెద్దగా సమస్యలు రాలేదు. అందరూ సరదాగా ఉంటాం. రిలాక్సేషన్ కోసం ఫన్నీ కౌంటర్స్ వేస్తుంటాం. ∙మాలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం. అలాగే మేం అందరం కలిసి కోవిడ్ టైమ్‌లో కొందరికి హెల్ప్ చేశాం. ►మామూలుగా నెలకోసారి కలవడం మా అలవాటు. అప్పుడు డ్రెస్ కోడ్ అనుకుంటాం. ఉదాహరణకు చిల్డ్రన్స్ డే అంటే స్కూల్ డ్రెస్సులు, పండగలప్పుడు అందుకు తగ్గ డ్రెస్సులు. కరోనా వల్ల మా మీటింగ్స్ కట్ అయ్యాయి. ఈ ఫ్రెండ్షిప్ డేకి కలుద్దామనుకున్నాం కానీ కరోనా టైమ్ కాబట్టి వద్దనుకున్నాం. -
నేడు 35వ పుట్టినరోజు జరుపుకుంటోన్న శృతి హాసన్..
-
సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క
-
తెలుగు రాష్ట్రాల్లో లో ఘనంగా నాగుల చవితి
-
క్రిస్మస్ జరుపుకునే జంతువులు
-
విల్లా మేరి విమెన్స్ కాలేజ్‌లో ఫేర్వెల్ డే
-
ఘనంగా సాక్షి పండుగ సంబరాలు
-
KKR డిగ్రీ కాలేజ్‌లో బతుకమ్మ సంబరాలు
-
మోదం.. ఖేదం..!
తెలంగాణ సర్కారు సోమవారం జిల్లాల ఏర్పాటుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజామాబాద్‌ను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలుగా ప్రకటించింది. బాన్సువాడను రెవెన్యూ డివిజన్‌గా.. తొమ్మిది మండలాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నిరసన వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు సంబరాలు జరుపుకుంటున్నారు.. దోమకొండ మండలంలోని బీబీపేటను మండలం చేయాలని స్థానికులు ఆరుగంటల పాటు రాస్తారోకో చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.. నాగరాజ్ అనే యువకుడు వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. అలాగే వర్ని మండలంలోని చందూరును మండలం చేయాలని ప్రజలు రాస్తారోకో చేశారు. చందూర్ మండల సాధన కోసం 51 రోజులుగా చేస్తున్న రిలే దీక్షలకు తాత్కాలికంగా విరామం పలికారు. కొత్త మండలాలు ప్రకటించడంపై ఇందల్వాయి, మోపాల్, రామారెడ్డి, రాజంపేట మండలవాసులు సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.. బాణసంచా కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. -
పండుగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
హైదరాబాద్: బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన యంగ్ హీరో ప్రభాస్ అభిమానులు ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మండు వేసవిలో దీపావళి టపాసులతో సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే...ట్విట్టర్ లో ఈ ఆరడుగుల అందగాడి ఫాన్స్ ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య 5 లక్షలకు చేరిందట. ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఈ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తమ ట్విట్టర్ అభిమానులు సంఖ్య హాఫ్ మిలియన్ కు చేరిందంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఫ్యాన్స్ ఖాతా కే ఇంతఫాలోయింగ్ ఉంటే.. స్వయంగా తమ హీరో ట్విట్టర్ లోకి వస్తే ఇంకెంత క్రేజ్ ఉంటుందో నని ఉవ్విళ్లూరు తున్నారట. మరోవైపు విభిన్న అవార్డులు సహా, అనేక ప్రాముఖ్యతలను సంతరించుకుంటున్న బాహుబలి తైవాన్‌లోను ఈ రోజు విడుదల కానుంది. బాహుబలి చిత్ర ప్రభంజనం దేశ విదేశాలలో పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో తైవాన్ లో తన హవా చాటుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చైనీస్ భాషలో మాట్లాడిన వీడియోను పోస్ట్ అయింది. తన బాహుబలి సినిమాపై అభిప్రాయం తెలపాల్సిందిగా కోరుతూన్న ఈ వీడియో .ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తైవాన్ లో సినిమా విడుదలతో మాంచి సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. Celebrating half a million followers on #Prabhas twitter fans account !! -
వికసించిన కమలం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంచందర్‌రావు ఘన విజయం సాక్షి, మహబూబ్‌నగర్: పట్టభద్రులు కమలానికి పట్టం కట్టారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు విజయకేతనం ఎగిరేశారు. ఉద్యోగ సంఘాల నేత, అధికార టీఆర్ఎస్ అభ్యర్థి దేవీ ప్రసాద్‌ను ఓడించారు. రాంచందర్‌రావు వరుసగా మూడుసార్లు పోటీచేసి ఎట్టకేలకు పట్టుసాధించారు. బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాలు సంబరాలు జరుపుకున్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రం తో పాటు పలు పట్టణాల లో బాణాసంచా కాల్చి, స్వీ ట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఫలించిన వ్యూహం... పట్టభద్రుల ఎన్నికలపై కన్నేసిన బీజేపీ వీటిపై ప క్కా ప్రణాళికతో ముం దుకు సాగింది. రామచంద్రరావు ఇదివరకే 2007, 2009 లలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యం ఉండడంతో ఆయనకు కలిసి వచ్చింది. రెండుసార్లు ఓటమి సానుభూతితో అనుకూలంగా మలుచుకోవడంతో పాటు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగారు. ఎన్నికలకు ఆరునెలల ముందుగానే పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతో ఎక్కడిక్కడ సమావేశాలు నిర్వహించారు. అలాగే కొత్తగా ఓటర్లను నమోదు చేయడంలో ముందుండి నడిచారు. ఓటరుగా నమోదైన ప్రతీ ఒక్కరినీ కలిసే ప్రయత్నం చేశారు. దీంతో పాటు పార్టీకి అనుబంధమైన విద్యార్థి సంఘం ఏబీవీపీ కూడా శక్తిమేర బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేసింది. అలాగే కొన్నిచోట్ల కాంగ్రెస్ నేతలు లోలోన బీజేపీకి మద్దతిచ్చినట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదని భావించిన కాంగ్రెస్ నేతలు... టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినట్లు తెలిసింది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కూడా అధికార టీఆర్ఎస్పై ఉన్న కోపంతో బీజేపీకి మద్దతిచ్చినట్లు వినికిడి. బీజేపీకి పట్టం కడుతున్న పాలమూరు... బీజేపీకి సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా పాలమూరు జిల్లా కేంద్రంగా మారుతుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా బీజేపీకి సంచలన విజయాలు అందించింది. దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ ఏర్పడడంతో అనివార్యంగా ఏర్పడిన ఎన్నికల్లో పాలమూరు వాసులు బీజేపీకి పట్టం కట్టారు. ఉద్యమం బాగా తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు టీఆర్ఎస్ను కాదని, బీజేపీకి 2012లో పట్టం కట్టారు. అప్పుడు బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి విజయఢంకా మోగించారు. ప్రస్తుతం కూడా పట్టభద్రుల ఎన్నికల్లో మూడు జిల్లాలో అత్యధికంగా పోలింగ్ జరిగినది పాలమూరులోనే. పాలమూరు అత్యధికంగా 56.08శాతం ఓటింగ్ జరిగింది. గతంలో కంటే రెట్టింపు స్థాయిలో జరిగిన పోలింగ్‌లో పట్టభద్రులు కమలానికి పట్టంగట్టారు. -
భోగి పండగ సందడి షురూ..
-
ఊరూవాడా సంక్రాంతి సంబరాలు
అనంతపురం సెంట్రల్ : సంక్రాంతి శోభ ఉట్టిపడేలా ఊరువాడా సంబరాలు నిర్వహించాలని అడిషనల్ జాయింట్ కలెక్టరు సయ్యద్ ఖాజామొహిద్దీన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సంక్రాంతి సంబరాల వేదికైన పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 12వ తేదీ సాయంత్రంలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. వేదికను సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. వంటలు, ముగ్గులు, కబడ్డీ పోటీలను నిర్వహించాలని చెప్పారు. పంటలు, పశువుల ప్రదర్శన, ప్రభుత్వ శాఖలకు సబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. ఆహూతులను ఆకట్టుకునే విధంగా సంప్రదాయ కళారూపాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని చె ప్పారు. పతంగులను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ, సహాయ సంచాలకులు వై.వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ జాయింట డెరైక్టర్ శ్రీరామమూర్తి, అనంతపురం ఆర్డీఓ హుసేన్ సాహెబ్, ఉద్యానవనశాఖ డీడీ సుబ్బరాయుడు, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, సమాచారశాఖ డీఈ నాగభూషణం, ఐసీడీఎస్, అగ్నిమాపకశాఖ, ఆర్అండ్బీ, డీఆర్డీఏ శాఖల అధికారులు పాల్గొన్నారు. 12, 13 తేదీల్లో గవర్నర్ పుట్టపర్తి, కదిరిలో పర్యటన అనంతపురం సెంట్రల్ : గవర్నర్ నరసింహన్ ఈనెల 12, 13వ తేదీల్లో పుట్టపర్తి, కదిరి పర్యటిస్తారని ఏజెసీ సయ్యద్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని రెవిన్యూభవన్‌లో గవర్నర్ పర్యటన, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ పర్యటనలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని చెప్పారు. గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు 66వ గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఏజేసీ అధికారులకు సూచించారు. ప్రభుత్వ శాఖల ప్రగతి నివేదికలను ఈ నెల 15లోపు సమాచార శాఖ, సహాయ సంచాలకులకు పంపాలన్నారు. 20వ తేదీలోపు అవార్డులకు ఉద్యోగుల పేర్లు సిఫార్సు చేయాలని సూచించారు. ప్రగతిని సూచించే స్టాళ్లను, శకటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ హేమసాగర్, అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, ఆర్డీవోలు హుస్సేన్‌సాహెబ్, రాజశేఖర్, రామారావు, సెరికల్చర్ జెడీ అరుణకుమారి, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, డీపీవో రమణ, డీయంఅంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్ పాల్గొన్నారు. -
కమలనాథుల సంబరాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాల్లో ఘనవిజయం సాధించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం, మహారాష్ట్ర, హర్యానా పార్టీ కార్యాలయాలు బాణసంచా పేలుళ్లతో మారుమోగాయి. కార్యకర్తలు, పార్టీ నేతలు డప్పులు వాయిస్తూ.. డాన్సులు చేస్తూ మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరోవైపు ఇదే హవాను దేశవ్యాప్తంగా మిగిలిన ఎన్నికల్లోనూ కొనసాగించి అన్ని రాష్ట్రాలనూ కైవసం చేసుకుంటామని కమలనాథులు ధీమా వ్యక్తం చేశారు. బీహార్, కాశ్మీర్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో తాజా ఎన్నికల ఫలితాలే ప్రతిఫలిస్తాయని ఆ రాష్ట్రాల బీజేపీ శ్రేణులు నమ్మకంగా చెపుతున్నాయి. మోదీ పాలనకు ప్రజలు వేసిన ఓటు: వెంకయ్య ప్రధాని మోదీ పాలనకు మెచ్చి మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ‘మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథాన సాగాలన్న ఉద్దేశంతో అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు వేసిన ఓటుగా ఈ ఫలితాలను భావిస్తున్నాం. పదిహేనేళ్లుగా మహారాష్ట్రలోని అవినీతి, అసమర్థ పాలనకు, పదేళ్లుగా హర్యానాలో అహంకార పూరిత కాంగ్రెస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు’ అని వెంకయ్య అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ముఖ్యమంత్రులే పాలనాపగ్గాలు చేపడతారని వెంకయ్య స్పష్టం చేశారు. -
పార్టీ కార్యాలయాల్లో సందడే సందడి
ఖమ్మం, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సంబరాలు అంబరాన్ని తాకాయి. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం, తెలంగాణ రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, భారతీయ జనతాపార్టీ, బీఎస్సీ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. ముందుగా త్రివర్ణ పతాకం, తర్వాత వారి పార్టీల జెండాలను ఆవిష్కరించారు. కేక్‌లు కట్‌చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. వృద్ధులు, రోగులకు పండ్లు అందించారు. బంగారు తెలంగాణకు బాటలు వేయాలని నేతలు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో.. రోటరీనగర్‌లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో సంబురాలు చేశారు. ఆదివారం అర్ధరాత్రి మొదలు సోమవారం మధ్యాహ్నం వరకు వేడుకలు జరిపారు. ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తించారు. పార్టీ ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి కూరాకుల నాగభూషణం జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీసీసెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు, మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షురాళ్లు పద్మజారెడ్డి, కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, మైనార్టీ నాయకులు ఎండీ ముస్తఫా, ఉపాధ్యాయ విభాగం జిల్లా కన్వీనర్ గురుప్రసాద్, నాయకులు జిల్లేపల్లి సైదులు, కొదమసింహం పాండురంగాచార్యులు, తుమ్మా అప్పిరెడ్డి, ఆకుల మూర్తి, షకీనా, ఆరెంపుల వీరభద్రం, మార్కం లింగయ్యగౌడ్, షర్మిలాసంపత్, హెచ్. వెంకటేశ్వర్లు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయంలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకం, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కేక్ కట్‌చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధులు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యాలయం ఇన్‌చార్జ్‌లు శీలంశెట్టి వీరభద్రం, ఐతం సత్యం, శ్రీనివాసరెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పోరిక లక్ష్మీబాయి, కోటా గురుమూర్తి, కొత్తా సీతారాములు, సోమ్లానాయక్, మనోహర్‌నాయుడు, కె. పద్మ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో రాష్ట్ర అవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు జగ్గారావు టీఆర్ఎస్జెండాను, యాదగిరిరావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కేక్ కట్‌చేసి, మిఠాయి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రడం సురేష్, కాసాని నాగేశ్వర్రావు, అజీమ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సంబురాలు.. భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఆపార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో కేక్ కట్‌చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో తెలంగాణ బంగారు తెలంగాణగా ఆవిర్భవిస్తుందని కిషన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు దొంగల సత్యనారాయణ, నాయకులు విద్యాసాగర్‌రావు, వీరెల్లి లక్ష్మయ్య, పిట్టల వెంకటనర్సయ్య పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ సమావేశం.. సపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లాపార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ సమావేశం ఏర్పాటు చేశారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, పరకాల నాగన్న, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య, మలీదు నాగేశ్వర్రావు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి అశోక్, ఐఎఫ్టీయూ నాయకులు రామారావు పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గిరిప్రసాద్ భవనంలో బాణసంచా పేల్చారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు పోటు కళావతి, జితేందర్‌రెడ్డి, నరసింగరావు, కత్తుల లక్ష్మయ్య, మహ్మద్‌సలాం, సీతామహాలక్ష్మి పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో... సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులదని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగిందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పాలకులు ముందుకు సాగాల న్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, ఏజే రమేష్, యర్రా శ్రీనివాస్, విక్రమ్, మల్సూర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కొండబాల కోటేశ్వరరావు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ, జలగం యువసేన ఆధ్వర్యంలోనూ సంబురాలు జరిగాయి. -
ఫుల్‌హ్యాపీ
పెండింగ్‌లో కొత్త లెసైన్సుల జారీ పాత లెసైన్సుల పొడిగింపుపై ఆశలు విశాఖపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో అంతా నష్టపోయామని బాధపడుతుంటే మద్యం వ్యాపారులు మాత్రం తెగ సంబరాలు చేసుకుంటున్నారు. మద్యం లెసైన్సుల గడువు ముగియకముందే ఎన్నికలను నిర్వహించి మద్యం వ్యాపారులకు భారీ ఆదాయం సమకూరేలా చేసిన ప్రభుత్వం తాజాగా కొత్త లెసైన్సులు జారీ చేయకుండా పెండింగ్‌లో పెట్టడంపై వీరంతా పండగ చేసుకుంటున్నారు. మరి కొన్నాళ్ల పాటు ఇలాగే లెసైన్సులు జారీ చేయకుండా ఉంచు దేవుడా అంటూ మొక్కుకుంటున్నారు. మద్యం వ్యాపారులపై ఏసీబీ కేసులు పెట్టి కొన్నాళ్లు హడలుగొట్టినా ఆఖర్లో మాత్రం ఆఫర్లపై ఆఫర్లు ఇవ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. వ్యాపారం ఫుల్లుగా సాగుతుండడంతో వారంతా ఆనందోత్సహాల్లో మునిగితేలుతున్నారు. మద్య నిషేధాన్ని ఎత్తేసి వాడవాడలా బెల్టు షాపులకు మార్గం సుగమం చేసిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతోనే తమ లెసైన్సుల గడువును కొంత కాలం పెంచుతారని ఆశపడుతున్నారు. వాస్తవానికి జూన్ 30 తేదీ నాటికి మద్యం లెసైన్సుల గడువు ముగుస్తోంది. ఈలోగానే కొత్త లెసైన్సుల జారీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ రాష్ట్ర విభజన నేపధ్యంలో మద్యం డిపోలను ఈ నెల 27 నుంచీ మూసేసి ఆదాయవ్యయాలను లెక్కిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొత్త లెసైన్సుల గందరగోళాన్ని సృష్టించుకోవడం లేదు. ఇదే మద్యం వ్యాపారులకు కలిసొచ్చింది. ఎలాగూ మరికొన్నాళ్లు లెసైన్సు గడువు పెంచుతార న్న ఆశల్లో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా కావల్సినంత మద్యం కొనుగోలు చేయడానికి వ్యాపారులకు అవకాశమిస్తున్నారు. మద్యం డిపోలను మూసివేస్తున్నందున ఎలాంటి ఆంక్షలు లేకుండా కావల్సినంత మద్యం కొనుక్కోవాలని సూచిస్తున్నారు. అప్పోసప్పో చేసి మద్యం నిల్వలను భారీ ఎత్తున విడుదల చేసి వ్యాపారులు గొడౌన్లలో నిల్వ చేస్తున్నారు. -
రేపే బక్రీద్ పండగ
-
జగమంత సంబరం
ఇది ముందే వచ్చిన జన ‘విజయ’ దశమి.. అశేషాంధ్రుల ఆకాంక్ష నెరవేరేలా.. కుత్సితాలను, కుతంత్రాలను చీల్చుకునిజనప్రియనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలు నుంచి బయటకు రానున్న రోజు.. జన నేతకు బెయిల్ లభించిందన్న ‘బ్రేకింగ్ న్యూస్’ సోమవారం సాయంత్రం వెలువడిన వెంటనే అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా వెలుగులతో ఆకాశం నిండిపోయింది. వాడవాడలా జై జగన్ అన్న నినాదం మార్మోగింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలే కాకుండా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు.. అన్ని వర్గాల ప్రజలు స్వీట్లతో నోరు తీపిచేసుకున్నారు. తమ అభిమాన నేత ఇన్ని రోజులకు జనంలోకి రానున్నారన్న సంతోషంతో పలువురు జగన్ ప్లకార్డులు, వైఎస్సార్ సీపీ పతాకాలు చేతబూని వీధివీధినా కలియతిరుగుతూ ఉత్సాహభరితంగా ర్యాలీలు నిర్వహించారు. విభజన వేడితో అగ్నిగుండంలా మారిన జిల్లాకు వైఎస్సార్సీపీ అధినేత బెయిల్ వార్త వాసంత సమీరమైంది. ఆంధ్రులనందరినీ ఒక్కటిగా నిలిపే బాధ్యతను భుజాలకెత్తుకునే ఒకే ఒక్కడు జగనన్నే అన్న నిశ్చితాభిప్రాయం ఎల్లెడలా వ్యక్తమయింది. -
పుల్ జోష్ దిల్ ఖుష్
ఆశలు ఫలించాయి. నిరీక్షణకు తెరపడింది. అన్ని గుండెచప్పుళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. గుండె గుండెనా గూడుకట్టుకున్న అభిమానం ఒక్కసారిగా ఆనందమై ఎగసింది. ఉత్సాహం మిన్నంటింది. జగన్నినాదం హోరెత్తింది. బాణసంచా మెరుపులు.. మిఠాయిల పంపకాలు.. పరస్పర అభినందనలు.. ఎటుచూసినా వేడుకే.. పండగొచ్చినంత సంబరం.. సోమవారం సాయంత్రం జగన్‌కు బెయిల్ మంజూరు కాగానే నగరం నలుమూలలా చోటుచేసుకొన్న జనోత్సాహమిది. సాక్షి, హైదరాబాద్ : జయహో జగన్.. సత్యమేవజయతే.. వైఎస్సార్ అమర్ రహే.. అన్న నినాదాలతో నగరం హోరెత్తిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి బెయిల్ కోసం సోమవారం ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేసిన అభిమానులు.. సాయంత్రం కోర్టు ప్రకటనతో సంబరాలు జరుపుకొన్నారు. అభిమాన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఎవరికీ వారే తమ సన్నిహితులతో ఆనందాన్ని పంచుకోగా, పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అధికారులు, ఉద్యోగులు మిఠాయిలు పంచుకుని హర్షం వెలిబుచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నగరమంతటా బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినదించారు. బెయిల్ ప్రకటన వెలువడగానే పార్టీ సీఈసీ సభ్యులు కె.శివకుమార్, నగర పార్టీ కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్ కోర్టు వెలుపల విజయోత్సవం నిర్వహించగా, యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో చంచల్‌గూడ జైలు సమీపంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఖైరతాబాద్‌లో పి.విజయారెడ్డి, రాజేంద్రనగర్‌లో సీఈసీ సభ్యులు బి.జనార్దన్‌రెడ్డి, కూకట్‌పల్లిలో వడ్డేపల్లి నర్సింగ్‌రావు, సరూర్‌నగర్‌లో దేపా భాస్కర్‌రెడ్డి, కంటోన్మెంట్లో జంపన ప్రతాప్, వెంకట్రావు, కుత్బుల్లాపూర్‌లో సురేష్‌రెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి, జూబ్లీహిల్స్‌లో కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, ఉప్పల్‌లో ధన్‌పాల్‌రెడ్డి, ముషీరాబాద్‌లో పీవీ అశోక్‌కుమార్, శ్వేతా వెంకట్రామిరెడ్డి, శేరిలింగంపల్లిలో ముక్కా రూపానందరెడ్డి, మల్కాజిగిరిలో సూర్యనారాయణరెడ్డి, సుమతీమోహన్, సనత్‌నగర్‌లో వెల్లాల రాంమోహన్‌ల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి ప్రధాన కూడళ్లలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు. పోలీసుల అత్యుత్సాహం జగన్మోహన్రెడ్డికి బెయిల్ లభిస్తోందన్న విషయాన్ని తెలుసుకుని నాంపల్లి కోర్టుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాదు నియోజకవర్గం ఇన్చార్జి మతీన్ ముజద్దదీ, వికారాబాదు నియోజకవర్గం ఇన్చార్జి సంజీవరావు ఆధ్వర్యంలో చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. దీనికి నిరసనగా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నాంపల్లి కోర్టు నుంచి మే రోజ్ కేఫ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అరెస్టయిన మతీన్ ముజద్దదీ, సంజీవరావులు నాంపల్లి పోలీస్ స్టేషన్లోనే ధర్నా చేశారు. సీబీఐ కోర్టులో జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో అరెస్టు చేసిన నాయకులను పోలీసులు విడుదల చేశారు. జగన్మోహన్రెడ్డికి బెయిల్ లభిందన్న సంతోషంతో నాంపల్లి పోలీస్ స్టేషన్ ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. మిఠాయిలు పంచిపెట్టారు. టపాకాయలు పేల్చారు. జీహెచ్ఎంసీలో ఆనందం సాక్షి, సిటీబ్యూరో : జగన్‌కు బెయిల్ లభించిందన్న విషయం తెలియగానే జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పలువురు సభ్యులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో మేయర్ మాజిద్ హుస్సేన్ సభకు టీ బ్రేక్ ఇచ్చారు. ఆ సమయంలో విషయం తెలిసిన వైఎస్సార్సీపీ సభ్యులు సురేష్‌రెడ్డి (సూర్యనారాయణరెడ్డి), సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి తదితరులు సభ్యులకు స్వీట్లు పంచారు. మేయర్ మాజిద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ జాఫర్‌హుస్సేన్, ఎమ్మెల్సీ జాఫ్రీ, కార్పొరేటర్లు తదితరులకు స్వీట్లు ఇచ్చి ఆనందం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా పలువురు సభ్యులు జగన్ విడుదలపై ఉత్సాహం కనబరిచారు. జీహెచ్ంఎసీ ఉద్యోగులు సైతం ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. యోధుడిలా బయటకు వస్తున్నారు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రల ఫలితంగానే వైఎస్జగన్ జైలుపాలయ్యారు. 16 నెలలుగా పోరాడుతూ పలు రాజకీయ ఒత్తిడులు ఎదుర్కొంటూ ధీరుడిలా నిలిచారు. ఎవరెన్ని అడ్డంకులు కలిగించినా చీకట్లను చీల్చుకు వచ్చిన సూరీడులా బెయిల్‌పై విడుదలై బయటకు వస్తున్నారు. - దేప భాస్కర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ సమన్వయ కర్త ప్రజాభిమానం గెలిచింది మహనేత వైఎస్ఆర్ మరణానంతరం ప్రజలకిచ్చిన మాట కోసం జగన్ ఇన్ని రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయినా మడ మ తిప్పని వ్యక్తిగా బాధలు భరిస్తూ కుటుంబానికి 16 నెలలుగా దూరంగా ఉన్నారు. ప్రజల మధ్య ఉన్న నాయకుడిని అందరికీ దూరం చేశారు. ప్రజాభిమానం ముందు జైలు గోడలూ అడ్డుకావని కుట్రదారులకు అర్థం కావాలి. ఎదేమైనా ప్రజాభిమానమే గెలిచింది. - లింగాల హరిగౌడ్, మలక్‌పేట నియోజకవర్గ సమన్వయకర్త టీడీపీకి చెంపపెట్టు రాష్ట్ర ప్రజల కల నెరవేరింది. జగన్‌కు బెయిల్ రాకుండా మొదట్నుంచీ చివరివరకు టీడీపీ ప్రయత్నించినా న్యాయమే గెలిచింది. తెలంగాణాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుంది. మూడు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగేందుకు జగన్ నేతృత్వంలోని వైసీపీ పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో కుల, మత, ప్రాంతాలకతీతంగా ఆయన బెయిల్‌ను ప్రజలు స్వాగతిస్తున్నారు. - బి.జనార్దన్‌రెడ్డి, సీఈసీ సభ్యులు ఆరోపణలు అబద్ధమని తేలింది వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు నిజం కాదని తేలింది. దేవుడు జగన్ కుటుంబానికి న్యాయం చేశాడు. ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు. - కాలేరు వెంకటేష్, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, అంబర్‌పేట నియోజకవర్గం దసరా ఇప్పుడే మొదలైంది మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలలు గన్న స్వర్ణయుగాన్ని సాకారం చేయాలంటే జగన్‌కే సాధ్యం. అక్రమ నిర్భంధం నుంచి జగన్ విడుదల అవుతున్నందుకు యావత్ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దసరా వేడుకలు ఇప్పుడే మొదలయ్యాయా అన్నట్లు సందడి నెలకొంది. - పుత్తా ప్రతాప్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు -
బెయిలొచ్చింది పండగ తెచ్చింది
ఊరూరా పండగొచ్చింది.. ఇంటింటావెలుగునిచ్చింది.. గుండెగుండెలో ఆక్సిజన్ నింపింది.. ధర్మం గెలిచింది.. న్యాయం నిలిచింది.. కుమ్మక్కు కుట్రలు, కుయుక్తులు, చీకటి శక్తులు చతికిలబడ్డాయి.. పేదల మోము వేయి వోల్టుల్లా వికసించింది.. పచ్చని పైరు, విచ్చుకునే పువ్వు, స్వేచ్ఛగా విహరించే పావురాయి సరికొత్త రాగమాలపించాయి.. ప్రకృతి పరవశించింది.. తెలుగుతల్లి గుండెనిండా ఊపిరి పీల్చుకుంది.. కొండంత అండగా తన బిడ్డ వస్తున్నాడని, ఇక సమైక్యతావాణి ప్రతిధ్వనిస్తుందని మురిసిపోయింది.. జైలు చిన్నబోయింది.. ఇన్నాళ్లూ ఈ అక్రమ నిర్బంధానికి తను నెలవైనందుకు తల్లడిల్లింది.. జననేత జగనన్నకు బెయిల్ వచ్చింది.. సెప్టెంబరు 23 చరిత్రలో చిరస్థాయి పొందింది.. తమ వాడొస్తున్నాడంటూ జనం ముందుగానే దసరా, దీపావళి సంబ రాల్ని ఒకేసారి చేసుకున్నారు.. చిన్నాపెద్దా తేడా మర్చి ఆనందతరంగాలై సందడి చేశారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : కుమ్మక్కు కుట్రలు, అక్రమ కేసులతో 16 నెలలుగా జైలులో నిర్బంధించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుతో జిల్లాలో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. సోమవారం సాయంత్రం బెయిల్ వార్తలు వెలువడగానే జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, జగన్మోహన్రెడ్డి అభిమానులు, ప్రజలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరైన వార్తను టీవీల్లో చూసిన జనం ‘ధర్మం గెలిచింది.. న్యాయం పలికింది’ అంటూ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. డప్పుల మోత, బాణాసంచా కాల్పులతో జిల్లా అంతటా పండగ వాతవరణం నెలకొంది. ఊరూవాడా వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు జగన్మోహన్రెడ్డి అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఈ ఆనందోత్సాహాల్లో పాల్గొనడం విశేషం. తిరుగులేని నేత.. మహానేత వైఎస్ మరణంతో రాష్ట్రానికి నాయకత్వ లోటును భర్తీ చేస్తూ తిరుగులేని నేతగా ఎదిగిన జగన్మోహన్రెడ్డిపై సాగిన కుమ్మక్కు కుట్రల విషయం ప్రజలకు తెలిసిందే. ఆయన జనంలో ఉంటే తమ ఉనికికే ఇబ్బంది అనుకున్న కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కుట్రలు చేసి అక్రమ కేసులు పెట్టి ఇరికించి దాదాపు 16 నెలలుగా జైలులో ఉంచిన సంగతి విదితమే. ఆయన జైలులో ఉన్నా ప్రజల కష్టాలపై ఎప్పటికప్పుడు స్పందించారు. జగన్‌పై అక్రమ కేసులు, అధికారపార్టీ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పదవులను తృణప్రాయంగా త్యజించారు. జగన్మోహన్రెడ్డి సూచనతో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. జగన్మోహన్రెడ్డిపై సాగుతున్న కుమ్మక్కు కుట్రలను ప్రజలకు వివరిస్తూ ఆయన సోదరి షర్మిల జిల్లాల్లో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెల్సిందే. హైదరాబాద్‌కు పయనమైన నేతలు.. జగన్మోహన్రెడ్డి రాకకోసం నిలువెల్లా కనులై ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక నేటికి ఫలించనుంది. చంచల్‌గూడ జైలులో 484 రోజులుగా ఉన్న జగన్మోహన్రెడ్డికి బెయిల్ విషయంలో సోమవారం సీబీఐ కోర్టు తీర్పు కోసం జిల్లా వాసుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ఆయనకు బెయిల్ రావాలని కోరుకున్న అభిమాన జనం గంటల తరబడి టీవీల వద్ద ఆసక్తిగా తిలకించారు. జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించడంతో జిల్లా అంతటా ఒక్కసారిగా ఉత్సాహం ఉప్పొంగింది. ఇదే సందర్భంగా జిల్లా అంతటా పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలు జరుపుకొని మంగళవారం జిల్లా అంతటా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు పయనమయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయంలో.. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అక్టోబరు ఒకటిన ప్రతిష్టాత్మకంగా జరపతలపెట్టిన సమైక్య రైతు శంఖారావం విజయవంతానికి గుంటూరు, కృష్ణాజిల్లా నేతలు సమావేశం నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి కోర్టువద్ద జరుగుతున్న పరిణామాలను ప్రసార మాధ్యమాల్లో చూస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాయకులు సాయంత్రం జగన్ బెయిల్ వార్త వినడంతో ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురామ్, ఉభయ జిల్లాల పార్టీ క న్వీనర్లు సామినేని ఉదయభాను, మర్రి రాజశేఖర్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, జలీల్‌ఖాన్, జోగి రమేష్, పేర్ని నాని, మేకా ప్రతాప్ అప్పారావు, గౌతమ్‌రెడ్డి, తాతినేని పద్మావతి, తాడి శకుంతల, వాకా వాసుదేవరావు, ఉప్పాల రామప్రసాద్, జిల్లా పార్టీ ప్రచార అధ్యక్షుడు సానికొమ్ము వేంకటేశ్వరరెడ్డి, డాక్టర్ మొహబూబ్ తదితరులు ఉత్సవాలు నిర్వహించుకున్నారు. ఆనందోత్సాహాలతో స్వీట్లు పంచుకుని పండగ నిర్వహించుకున్నారు. అంబరాన్నంటిన సంబరాలు.. జగన్‌కు బెయిల్ మంజూరవటంతో నగరంలో, జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, గుణదల మేరీమాత ఆలయంలో ప్రార్థనలు జరిపారు. అంనతరం బందరు రోడ్డులో బాణాసంచా పేల్చారు. వన్‌టౌన్‌లో జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు వీధులలో సందడి చేశారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త పీ గౌతంరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరిపారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆధ్వర్యంలో పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. బందరు కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీటాకీస్ వరకూ ర్యాలీ చేశారు. బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. పెడన నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఉప్పాల రాము, రామ్‌ప్రసాద్, వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి ర్యాలీ నిర్వహించారు. కైకలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. గుడివాడలో పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూచౌక్‌లో సంబరాలు జరిగాయి. పట్టణంలో కార్యకర్తలు ప్రదర్శన జరిపారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. పెనమలూరులో పార్టీ సమన్వయకర్త తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చారు. తిరువురు నియోజకవర్గంలో పార్టీ మండల కన్వీనర్ శీలం నాగనర్సిరెడ్డి, దుర్గగుడి మాజీ చైర్మన్ పిడపర్తి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. మైలవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నుంచి జీ కొండూరు, మైలవరం వరకూ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో మైలవరంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీ నిర్వహించి వైఎస్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జగ్గయ్యపేట పట్టణంలో సామినేని విశ్వనాథం కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. నందిగామ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు నాయకత్వం వహించారు. నియోజకవర్గంలో చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండలాలలో కూడా పార్టీ సంబరాలు జరిగాయి. నూజివీడు పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వీట్లు పంచారు. నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ అప్పారావు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. గన్నవరంలో గాంధీబొమ్మ సెంటర్లో బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. హనుమాన్‌జంక్షన్‌లో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.