మోదం.. ఖేదం..!
తెలంగాణ సర్కారు సోమవారం జిల్లాల ఏర్పాటుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజామాబాద్‌ను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలుగా ప్రకటించింది. బాన్సువాడను రెవెన్యూ డివిజన్‌గా.. తొమ్మిది మండలాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నిరసన వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు సంబరాలు జరుపుకుంటున్నారు.. దోమకొండ మండలంలోని బీబీపేటను మండలం చేయాలని స్థానికులు ఆరుగంటల పాటు రాస్తారోకో చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.. నాగరాజ్ అనే యువకుడు వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. అలాగే వర్ని మండలంలోని చందూరును మండలం చేయాలని ప్రజలు రాస్తారోకో చేశారు. చందూర్ మండల సాధన కోసం 51 రోజులుగా చేస్తున్న రిలే దీక్షలకు తాత్కాలికంగా విరామం పలికారు. కొత్త మండలాలు ప్రకటించడంపై ఇందల్వాయి, మోపాల్, రామారెడ్డి, రాజంపేట మండలవాసులు సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.. బాణసంచా కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు.