పండుగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
హైదరాబాద్: బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన యంగ్ హీరో ప్రభాస్ అభిమానులు ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మండు వేసవిలో దీపావళి టపాసులతో సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే...ట్విట్టర్ లో ఈ ఆరడుగుల అందగాడి ఫాన్స్ ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య 5 లక్షలకు చేరిందట. ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఈ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తమ ట్విట్టర్ అభిమానులు సంఖ్య హాఫ్ మిలియన్ కు చేరిందంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఫ్యాన్స్ ఖాతా కే ఇంతఫాలోయింగ్ ఉంటే.. స్వయంగా తమ హీరో ట్విట్టర్ లోకి వస్తే ఇంకెంత క్రేజ్ ఉంటుందో నని ఉవ్విళ్లూరు తున్నారట.
మరోవైపు విభిన్న అవార్డులు సహా, అనేక ప్రాముఖ్యతలను సంతరించుకుంటున్న బాహుబలి తైవాన్‌లోను ఈ రోజు విడుదల కానుంది. బాహుబలి చిత్ర ప్రభంజనం దేశ విదేశాలలో పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో తైవాన్ లో తన హవా చాటుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చైనీస్ భాషలో మాట్లాడిన వీడియోను పోస్ట్ అయింది. తన బాహుబలి సినిమాపై అభిప్రాయం తెలపాల్సిందిగా కోరుతూన్న ఈ వీడియో .ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తైవాన్ లో సినిమా విడుదలతో మాంచి సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Celebrating half a million followers on #Prabhas twitter fans account !!