Kangana Ranaut Calls Prabhas Wonderful Host Tweet Viral - Sakshi
Sakshi News home page

Kangana Ranaut : ప్రభాస్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన కంగనా రనౌత్‌

Published Tue, Feb 21 2023 8:10 PM | Last Updated on Tue, Feb 21 2023 8:52 PM

Kangana Ranaut Calls Prabhas Wonderful Host Tweet Viral - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌ సరసన ఆమె ఏక్‌ నిరంజన్‌ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అంతగా అలరించలేకపోయినా ప్రభాస్‌-కంగనా జోడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఇంతవరకు నటించలేదు కంగనా. ఇదిలా ఉంటే తాజాగా ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించిన ఆమె నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

ఈ క్రమంలో ఓ నెటిజన్‌.. ప్రభాస్‌తో మీరు మళ్లీ నటించే ఛాన్స్‌ ఉందా? ఆయనతో పనిచేసిన సమయంలో ప్రభాస్‌తో ఉన్న స్వీట్‌ మెమొరీని షేర్‌ చేసుకోగలరా అని అడగ్గా.. దానికి కంగనా సమాధానమిస్తూ.. ప్రభాస్‌ మంచి ఆతిథ్యం ఇస్తాడు. వాళ్ల ఇంట్లో వండిన భోజనం చాలా అద్భుతం అంటూ రిప్లై ఇచ్చింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement