ek niranjan
-
ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కంగనా రనౌత్
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ప్రభాస్ సరసన ఆమె ఏక్ నిరంజన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా అలరించలేకపోయినా ప్రభాస్-కంగనా జోడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఇంతవరకు నటించలేదు కంగనా. ఇదిలా ఉంటే తాజాగా ట్విటర్లో అభిమానులతో ముచ్చటించిన ఆమె నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ప్రభాస్‌తో మీరు మళ్లీ నటించే ఛాన్స్ ఉందా? ఆయనతో పనిచేసిన సమయంలో ప్రభాస్‌తో ఉన్న స్వీట్ మెమొరీని షేర్ చేసుకోగలరా అని అడగ్గా.. దానికి కంగనా సమాధానమిస్తూ.. ప్రభాస్ మంచి ఆతిథ్యం ఇస్తాడు. వాళ్ల ఇంట్లో వండిన భోజనం చాలా అద్భుతం అంటూ రిప్లై ఇచ్చింది. Prabhas home has the best food ever … and he is a wonderful host #askkangana https://t.co/gmACXcPo1d — Kangana Ranaut (@KanganaTeam) February 20, 2023 -
కలల రాణి
కన్నుల్లో వెన్నెల కురిపించే పాత్రలు, చూపులతో నిప్పులు రగిలించే పాత్రలు, సూటిగా మాట్లాడే పాత్రలు, సాహసమే శ్వాసగా చేసుకునే పాత్రలు...కంగనా రనౌత్‌ను గుర్తు తెస్తాయి. ‘ఏక్ నిరంజన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ‘మణికర్ణిక’ సినిమాతో శభాష్ అనిపించుకుంటున్న కంగనా అంతరంగ తరంగాలు ఇవి... సెన్స్ ఆఫ్ స్టైల్ నా మూడ్‌ని బట్టి ‘స్టైల్’ గురించి ఆలోచిస్తాను. కొన్నిసార్లు సా«ధారణంగా కనిపించడానికి ఇష్టపడతాను. కొన్నిసార్లు ఇతరుల కంటే భిన్నంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా సెన్స్ ఆఫ్ స్టైల్ అనేది నా మూడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్యాషన్ ఫ్యాషన్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేంత ఆసక్తి లేదు. ప్రపంచమంతా తిరిగి లేటెస్ట్ ట్రెండ్స్‌ను తెలుసుకునేంత టైమ్ లేదు. నేను క్లిష్టమైన పాత్రలు ఎంచుకుంటాను. వాటికి న్యాయం చేయడానికే నా టైమ్ వెచ్చిస్తాను తప్ప ఇతర విషయాల గురించి పెద్దగా పట్టించుకోను. ఆన్లైన్ షాపింగ్ మీద ఆసక్తి లేదు. గౌను, శారీ లుక్‌తో మాత్రమే రెడ్ కార్పెట్ కార్యక్రమాల్లో కనిపించాలనుకోను. జీన్స్, జాకెట్‌తో కూడా వెళుతుంటాను. టైమ్ అంటే టైమే! సమయపాలనకు ప్రాధాన్యత ఇస్తాను. సెట్‌కి ఆలస్యంగా రావడం ఇష్టం ఉండదు. ‘నేను ప్రత్యేకం’ అనే భావనను దగ్గరకు రానివ్వను. అది వస్తే ‘నేను ఏది చేసినా కరెక్టే’ అనే అతివిశ్వాసం పెరిగిపోతుంది. పాత్రల ఎంపిక విషయానికి వస్తే... ‘ఇలాంటి పాత్రలే చేస్తాను’ అని మడిగట్టుకొని కూర్చోను. ఉదాహరణకు... ‘క్రిష్–3’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర(కెయా)లో నటించాను. అది నెగటివ్ క్యారెక్టరే అయినప్పటికీ అందం, ఆవేశం, అతీతశక్తులు మూర్తీభవించిన పాత్ర. కాబట్టి ఇలాంటి పాత్రలు చేయడానికి నాకు ఇబ్బంది లేదు. ఏడ్చాను! సినిమాల్లోకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన...‘గ్యాంగ్‌స్టర్’ సినిమాలో నటించిన తరువాత ఒక ఫిల్మ్మ్యాగజైన్ వాళ్లు కవర్‌పై నా ఫొటో అడిగారు. ‘‘ఎన్ని డబ్బులు ఇస్తారు?’’ అని అడిగాను. అంతే... అడిగిన జర్నలిస్ట్ బిగ్గరగా నవ్వాడు. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఆరోజు రాత్రి ఏడ్చాను. మ్యాగజైన్ షూట్, ఇంటర్వ్యూలకు డబ్బులు ఇస్తారని చెప్పిన జ్ఞాపకం ఉండటంతో అలా అడిగాను. నా తప్పేమిటో అర్థం కాలేద. -
గీత స్మరణం
నేడు ప్రభాస్ బర్త్‌డే పల్లవి : అతడు: గుండెల్లో... ఓ... గుండెల్లో... ఓ... గుండెల్లో గిటారు మోగించావే నాకేవేవో సిల్లీ థాట్స్ నే ర్పించావే ఆమె: చూపుల్తో పటాసు పేల్చేశావే నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేశావే అ: చెలియా నీపై నే ఫిక్సయ్యేలా చేశావే ఆ: జిగిరిజానై నా మైండ్ అంతా లాగేశావే అ: లెఫ్ట్ రైటు టాప్ టు బాటమ్ నచ్చేశావే ఆ: ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేశావే ॥ చరణం : 1 అ: సున్నాలా ఉన్నా నా పక్కన ఒకటయ్యావే ఆ: ఎరవేసి వలలోకి నను లాగేసింది నువ్వే అ: ఖాళీ దిల్లోన దేవతలా దిగిపోయావే ఆ: తెరతీసి సరదాకి పిలుపందించింది నువ్వే అ: అనుకోకున్నా నాకన్నీ నువ్వైపోయావే ఆ: ఎటువైపున్నా నీ వైపే నను నడిపించావే అ: నరనరాన ఏక్తార వినిపించావే ఆ: నా స్వరాన ప్రేమ పాట పలికించావే ॥ చరణం : 2 అ: ఎమ్మో ఏం ఫిగరో యమ హాటనిపించేశావే ఆ: నువ్వు కూడా పిల్లగాడా నన్నెంతో కదిలించావే అ: జియ్యా చెయిజారే చెయ్ వాటమ్ చూపించావే ఆ: నువ్వు కూడా మన్ మేరా ఇట్టాగే దోచేశావే అ: కనుపాపల్లో హరివిల్లై నువు కనిపించావే ఆ: ఎదలోయల్లో చిరుజల్లై నను తడిపేశావే అ: అందమైన మత్తు మందు నువ్వే నువ్వే ఆ: అందుకున్న ప్రేమ విందు నువ్వయ్యావే ॥ చిత్రం : ఏక్ నిరంజన్ (2009) రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : మణిశర్మ గానం : హేమచంద్ర, గీతామాధురి నిర్వహణ: నాగేష్