కన్నుల్లో వెన్నెల కురిపించే పాత్రలు, చూపులతో నిప్పులు రగిలించే పాత్రలు, సూటిగా మాట్లాడే పాత్రలు, సాహసమే శ్వాసగా చేసుకునే పాత్రలు...కంగనా రనౌత్‌ను గుర్తు తెస్తాయి. ‘ఏక్ నిరంజన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ‘మణికర్ణిక’ సినిమాతో శభాష్ అనిపించుకుంటున్న కంగనా అంతరంగ తరంగాలు ఇవి...
సెన్స్ ఆఫ్ స్టైల్
నా మూడ్‌ని బట్టి ‘స్టైల్’ గురించి ఆలోచిస్తాను. కొన్నిసార్లు సా«ధారణంగా కనిపించడానికి ఇష్టపడతాను. కొన్నిసార్లు ఇతరుల కంటే భిన్నంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా సెన్స్ ఆఫ్ స్టైల్ అనేది నా మూడ్‌పై ఆధారపడి ఉంటుంది.
ఫ్యాషన్
ఫ్యాషన్ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యేంత ఆసక్తి లేదు. ప్రపంచమంతా తిరిగి లేటెస్ట్ ట్రెండ్స్‌ను తెలుసుకునేంత టైమ్ లేదు. నేను క్లిష్టమైన పాత్రలు ఎంచుకుంటాను. వాటికి న్యాయం చేయడానికే నా టైమ్ వెచ్చిస్తాను తప్ప ఇతర విషయాల గురించి పెద్దగా పట్టించుకోను. ఆన్‌లైన్ షాపింగ్ మీద ఆసక్తి లేదు. గౌను, శారీ లుక్‌తో మాత్రమే రెడ్ కార్పెట్ కార్యక్రమాల్లో కనిపించాలనుకోను. జీన్స్, జాకెట్‌తో కూడా వెళుతుంటాను.
టైమ్ అంటే టైమే!
సమయపాలనకు ప్రాధాన్యత ఇస్తాను. సెట్‌కి ఆలస్యంగా రావడం ఇష్టం ఉండదు. ‘నేను ప్రత్యేకం’ అనే భావనను దగ్గరకు రానివ్వను. అది వస్తే ‘నేను ఏది చేసినా కరెక్టే’ అనే అతివిశ్వాసం పెరిగిపోతుంది. పాత్రల ఎంపిక విషయానికి వస్తే... ‘ఇలాంటి పాత్రలే చేస్తాను’ అని మడిగట్టుకొని కూర్చోను. ఉదాహరణకు... ‘క్రిష్–3’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర(కెయా)లో నటించాను. అది నెగటివ్ క్యారెక్టరే అయినప్పటికీ అందం, ఆవేశం, అతీతశక్తులు మూర్తీభవించిన పాత్ర. కాబట్టి ఇలాంటి పాత్రలు చేయడానికి నాకు ఇబ్బంది లేదు.
ఏడ్చాను!
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన...‘గ్యాంగ్‌స్టర్’ సినిమాలో నటించిన తరువాత ఒక ఫిల్మ్‌మ్యాగజైన్ వాళ్లు కవర్‌పై నా ఫొటో అడిగారు. ‘‘ఎన్ని డబ్బులు ఇస్తారు?’’ అని అడిగాను. అంతే... అడిగిన జర్నలిస్ట్ బిగ్గరగా నవ్వాడు. ఫోన్ డిస్‌కనెక్ట్ అయింది. ఆరోజు రాత్రి ఏడ్చాను. మ్యాగజైన్ షూట్, ఇంటర్వ్యూలకు డబ్బులు ఇస్తారని చెప్పిన జ్ఞాపకం ఉండటంతో అలా అడిగాను. నా తప్పేమిటో అర్థం కాలేద.
Comments
Please login to add a commentAdd a comment