Manikarnika
-
ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!!
ముత్తుస్వామి దీక్షితార్ గొప్ప వాగ్గేయకారులు. పుస్తకం పట్టి శాస్త్రాధ్యయనం చేయక పోయినా గంగానదీతీరాన గురు శుశ్రూష చేస్తూ చాలా ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నారు. తదనంతర కాలంలో ఆయన గంగాదేవి గొప్పదనాన్ని కీర్తిస్తూ చేసిన కీర్తనలో ఆయన విషయగాఢత మనకు బోధపడుతుంది. ‘‘...అక్రూర పూజితే అఖిల జనానందే/సకలతీర్థమూలే...’’ అన్నారు. అన్ని తీర్థాలూ గంగానదిలోనే ఉన్నాయన్నారు. ఎందుకలా...!!! తీర్థయాత్ర చేసివచ్చాం అంటారు గానీ భగవత్ దర్శన యాత్ర చేసివచ్చాం అనరు. తీర్థయాత్ర అంటే.. మజ్జనం అంటే.. స్నానం. తీర్థంలో స్నానం చేస్తారు. వేదాలకు భాష్యం చెబుతూ పెద్దలు ఒక మాటన్నారు. అంగీరసాది మహర్షులు ఊర్థ్వలోకాలకు వెడుతూ... వెళ్ళేముందు తమ తమ నియమాలను, తపోదీక్షను, తపఃఫలితాన్ని నీటిలో కొన్నిచోట్ల నిక్షేపించి వెళ్ళారు. అవి ఎక్కడ నిక్షేపింపబడ్డాయో అవి తీర్థములు. అటువంటి తీర్థాల్లోకెల్లా గొప్ప తీర్థమేది... అంటే మణికర్ణిక. అది ఎక్కడుంది... గంగానదిలో! మణికర్ణికా వైభవం అంతా ఇంతా కాదు. ‘మణికర్ణికాష్టకమ్’ అని శంకరాచార్యులవారు ఒక అష్టకం చేశారు. ఆయన ఒక నదిని గురించి చెప్పడమే చాలా గొప్ప. సాధారణంగా ఆయన క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. అటువంటిది గంగాష్టకమ్, నర్మదాష్టకమ్, యమునాష్టకమ్ చేశారు. ఒక్క మణికర్ణిక మీద ఒక అష్టకమ్ చేశారు. తీర్థం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఒక శ్లోకంలో అద్భుతమైన వర్ణన చేశారు. ‘‘కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా/ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ / స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా/ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’. కాశీ చాలా చాలా గొప్ప నగరం. అసలు కాశీ ఒకసారి వెడితే చాలు.. అనుకుంటాం. కాశీ అంటేనే ప్రకాశం. కాశీ విముక్తనగరి. అంత గొప్పది కాశీ .... ఆ కాశీకి మళ్ళీ అలంకారం గంగానది. తత్రేయం మణికర్ణికా. అక్కడ మణికర్ణికా తీర్థం కూడా ఉంది. దీనికున్న గొప్పదనం ఏమిటంటే – ‘‘మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః/ స్వీయైరబ్ధ శతైశ్చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః/యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత/స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్’’... మధ్యాహ్నం 12 గంటలవేళ మణికర్ణికాతీర్థంలో స్నానం చేస్తున్న వారికోసం శివకేశవ రూపాల్లో పరబ్రహ్మం పోట్లాడుకుంటుందట... నే తీసుకువెడతా అంటే నే తీసుకువెడతా అని.. ‘నీయందు ఎవరయినా స్నానం చేస్తే వారికి మోక్షం ఇస్తాను’ అని ముక్తిదేవత ఒక సేవకురాలిలాగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుందట. ఇంతమంది దేవతలతో కూడుకున్న స్వర్గలోకం గొప్పదా? కాశీపట్టణం గొప్పదా ? అని ఒకప్పుడు బ్రహ్మగారికి సందేహం వచ్చిందట. పెద్ద త్రాసు సృష్టించి ఒక పళ్ళెంలో స్వర్గలోకాన్ని మరో పళ్ళెంలో కాశీపట్టణాన్ని, గంగానదిని, మణికర్ణికా తీర్థాన్ని ఉంచాడట...‘‘ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’ కాశీ బరువుకు అది ఉంచిన పళ్ళెం కిందికి దిగితే.. స్వర్గలోకం ఉన్న పళ్ళెం పైకి తేలిపోయిందట. అటువంటి కాశీ పట్టణం ఉన్న ఈ దేశం గొప్పది, ఇక్కడ పుట్టడం కూడా గొప్ప అదృష్టం కదూ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలించే సినిమాలు ఇవే
సినిమా అనేది వినోదాన్ని మాత్రమే కాదు పంచుతుందనుకుంటే పొరపాటే.. కొన్ని సనిమాలు యువకుల్లో దేశభక్తిని రగిలించింది. అందుకు తగినట్లుగానే కొందరు హీరోలు,దర్శకులు కథలను ఎంచుకుంటుంటారు. ఇలా వారు భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. మన హీరోలు స్వాతంత్ర సమర యోధులుగా, దేశాన్ని రక్షించే వీరులుగా కనిపించి ఆకట్టుకున్నారు. అలాంటి సినిమాలపై 77వ స్వాతంత్య్రం సందర్భంగంగా కొన్నింటిపై ఫోకస్ చేయండి. గాంధీ (1982) 1982లో వచ్చిన గాంధీ సినిమా రిచర్డ్ అటెన్ బరో తీశారు. అస్కార్ అవార్డు పొందిన సినిమా ఇది. బెన్ కింగ్ స్లే గాంధీగా నటించారు. భారత స్వతంత్ర పోరాటాన్ని, గాంధీ జీవితాన్ని తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. గాంధీజీ పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ 1982లో తెరకెక్కిన గాంధీ సినిమా మాత్రం ప్రత్యేకం. అయితే దానికి ప్రత్యేకమయిన కారణం కూడా ఉంది. ఈ సినిమాను రూపొందించింది ఇంగ్లాండ్‌లో పుట్టిపెరిగిన రిచర్డ్ అటెన్‌బరో అనే ఫిల్మ్ మేకర్. ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కూడా. ఇక ఆ సినిమాలో గాంధీగా నటించింది కూడా బ్రిటిష్ యాక్టర్ అయిన బెన్ కింగ్స్లే. ఇలా ఏ దేశం పై అయితే గాంధీజీ తన పోరాటాన్ని సాగించారో వాళ్ళే మళ్ళీ ఆయనపై సినిమా తియ్యడం, దాన్ని ఇంగ్లాండ్‌లో కూడా రిలీజ్ చేస్తే అక్కడ అది ఘనవిజయం సాధించడం అనేది సామాన్యమయిన విషయం కాదు. పైగా ఆ సినిమాలో గాంధీజీ పాత్రను అద్బుతంగా పోషించిన బెన్ కింగ్స్లే కి అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. అంటే గాంధీజీ జీవితంలో ఉన్న సారాంశం ఎంత గొప్పది అనేది ఆ సినిమాలో చూపించడం వల్ల, అది అందరి మనసులకు హత్తుకోవడం వల్ల ఆ విజయం సాధ్యమయింది. భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో ఆగష్ట్రు 14వ తేదీ నుంచి 24 వరకు 'గాంధీ' చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ (2000) భీంరావ్ రాంజీ అంబేడ్కర్ పాత్రలో మమ్ముట్టి రోల్ ఔట్‌స్టాండింగ్ అనే చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా జబ్బర్ పటేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదట ఆంగ్లంలో నిర్మించబడింది. తరువాత ప్రాంతీయ భాషలలోకి డబ్ చేయబడింది. ఈ చిత్రంలో మమ్ముట్టి డాక్టర్ అంబేడ్కర్ పాత్రను పోషించారు. అతని నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేద్కర్ యొక్క పోరాటాలను దృశ్యమానం చేసిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్రం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించాలని పిలుపునిచ్చింది. నిర్మాణాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. డాక్టర్ అంబేద్కర్గా మమ్ముట్టి నటన మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002) హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తోటి సభ్యులతో కలిసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుడు భగత్ సింగ్ గురించి 2002లో ఈ చిత్రం విడుదల అయింది. ఇందులో అజయ్ దేవగన్ టైటిల్ క్యారెక్టర్‌తో పాటు సుశాంత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో భారత స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పూర్తిగా చూపించారు. 1931 మార్చి 24న అధికారిక విచారణకు ముందు జలియన్ వాలాబాగ్ మారణకాండను చూపినప్పటి నుంచి భగత్ సింగ్ ని ఉరి తీసే వరకు ఈ సినిమాలో చూయించారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికంబానికి ఎలా ఎక్కాడో తెలిపే చిత్రమే ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. లగాన్ (2001) బ్రిటీషు పాలనలో భూమి పన్ను రద్దుకు వ్యతిరేకంగా ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు. అప్పటివరకూ అలవాటు లేని ఆట అది. పన్ను భారం తగ్గాలంటే ఆడి గెలవాల్సిందే. ఆడారు.. గెలిచారు. ఆమిర్ ఖాన్ నటించిన ఈ ‘లగాన్’ చిత్రకథను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2001లో ఈ సినిమా విడుదలైంది. అప్పట్లో ఎందరిలోనే దేశభక్తిని రగిలించిన సినిమా ఇది. ఇప్పటికి ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ (2004) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా వచ్చిన Netaji Subhas Chandra Bose: The Forgotten Hero హిందీ చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ ఎపిక్ బయోగ్రాఫికల్ వార్ని సినిమాగా తెరకెక్కించింది. ఇందులో నేతాజీగా సచిన్ ఖేడేకర్ కరెక్ట్‌గా సెట్ అయ్యారు. బ్రిటీష్ ఇండియాలో మహాత్మా గాంధీతో రాజకీయ విబేధాల తర్వాత, బోస్ అరెస్టు, విడుదలయ్యాక జరిగిన కథను వివరించారు. ఈ చిత్రానికి ఇండియన్ ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ దక్కింది. సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును కూడా దక్కింది. అలాగే 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంయుక్తంగా సమర్పించిన ఇండిపెండెన్స్ డే ఫిల్మ్ ఫెస్టివల్లో ఆగష్టు 14, 2016న ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ సినిమాకు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఎమ్ ఎక్స్ ప్లేయర్,యూట్యూబ్‌లో ఈ సినిమా ఉంది. సర్దార్ (1993) 1993లో ఈ చిత్రం విడుదలైంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలను ఇండియన్ ఆఫ్ యూనియన్‌లో చేరేలా శ్రమించిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జీవితం ఆధారంగా నిర్మించిందే ఈ చిత్రం. ఈ సినిమాలో పరేష్ రావల్ సర్దార్‌గా నటించారు. ఈ సినిమాలో క్విట్ ఇండియా ఉద్యమంలో జరిగిన అల్లర్లతో పాటు నెహ్రుతో సర్దార్కు ఉన్న విబేధాలను చూపుతుంది. సర్దార్ లాంటి వ్యక్తి లేకుండా ఉండి ఉంటే భారత్ ఇప్పటికి కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో ఈ సినిమాను చూడొచ్చు కేసరి (2019) కేసరి 2019లో విడుదలైన బాలీవుడ్ సినిమా. 1897న భారత్‌లోకి సుమారు 10 వేలకు పైగా ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా చొచ్చుకొని వస్తారు. అప్పుడు వారందరినీ కేవలం 21 మంది సిక్కులు మాత్రమే ఎలా అడ్డుకున్నారు. అనేది ఈ సినిమాలో చూపిస్తారు .ఈ దళాల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట సన్నివేశాలు మెప్పిస్తాయి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మంగళ్ పాండే: ది రైజింగ్ (2005) మంగళ్ పాండే జీవితం ఆధారంగా 2005లో కేతన్ మెహతా దర్శకత్వంలో మంగళ్ పాండే: ది రైజింగ్ మూవీ వచ్చింది. ఇందులో ఆమీర్ ఖాన్ లీడ్ రోల్లో నటించారు. మంగళ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో జులై 19, 1827న జన్మించారు. పాండే బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలో రెజిమెంట్‌లో సిపాయిగా చేరారు. అప్పట్లో అతను తన అసాధారణమైన ప్రతిభ, తెగువతో సైనిక దళ నాయకుడిగా ఎదిగారు. అయితే ఆ కాలంలో బ్రిటిష్ వారు అందించిన తుపాకీ తూటాలను సిపాయిల వీసమెత్తు నచ్చలేదు. ఈ గుండ్లకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారు. వాటిని పేల్చాలంటే సిపాయిలు నోటితో కొరికి తొక్క తీయాల్సి ఉంటుంది. హిందువులు, ముస్లింల మత విశ్వాసాలకు ఇది విరుద్ధమని భావించిన సిపాయిలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు. కానీ అది కోవ్వేనని పాండే, ఇతర సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి. ఆ సందేహాలే చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై తిరుగుబాటుకు ఎలా దారితీసింది. పాండే ఉరి శిక్ష సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మణికర్ణిక (2019) 2019లో వచ్చిన ఈ సినిమా ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఆదారంగా బాలీవుడ్లో తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్ ఝాన్సీగా తన నటనతో భారతీయులను మెప్పించింది.1828లో వారణాసిలో తన పుట్టుకతో కథ మొదలౌతుంది. పరాక్రమానికి మారుపేరుగా లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఉంటుంది. ఝాన్సీ రాజు అయిన గంగాధర్ రావుతో ఆమెకు వివాహం అవుతుంది. రాజ్యం గంగాధర్ అన్న అయిన సధాశివ్ బ్రిటీష్ వారితో కలిసి కుట్ర పన్నుతాడు. అందులో భాగంగా గంగాధర్ రావును బ్రిటీష్ వారు చంపేస్తారు. తన భర్తకు ఇచ్చిన మాట కోసం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌గా రాజ్యాధికారం అందుకుంటుంది. ఈ క్రమంలో తెల్లవారిపై ఆమె చేసిన దండయాత్ర ఎలా ఉంటుందో చెప్పేదే మణికర్ణిక చిత్రం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
కంగనా రనౌత్ కీలక నిర్ణయం.. ‘మణికర్ణిక’గా నామకరణం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలయ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెండితెరపై ప్రేక్షకులకు వినోదం పంచిన ఈ ఫైర్‌బ్రాండ్.. త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన 'మణికర్ణిక' చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం. అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా 'టికు వెడ్స్ షేరు' పేరుతో సినిమా తీయబోతున్నట్టు ట్వీటర్ వేదికగా కంగనా వెల్లడించింది. అలాగే తన ప్రొడక్షన్ హౌస్ లోగోను శనివారం ఆమె ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమకు ఆశీర్వదించాలని ఆమె కోరింది. ‘టికు వెడ్స్ షెరు సినిమాతో మణికర్ణిక ఫిలిమ్స్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది ఒక సెటైరికల్ కామెడీతో కూడిన ప్రేమ కథ. కొత్త రకం వినోదాన్ని ఈ సినిమా ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాక, మా ప్రొడక్షన్ సంస్థ నుంచి కొత్త టాలెంట్‌ని, కొత్త కాన్సెప్ట్‌లని పరిచయం చేస్తాము. సాధారణ సినిమాలు చూసే ప్రేక్షకుల కంటే.. డిజిటల్ సినిమాలు చూసే ప్రేక్షకులు కాస్త పరిణితి చెందిన వాళ్లు అని మా భావన’’ అని కంగనా తెలిపింది. ఇదిలా ఉంటే... కంగనా రనౌత్ నటించిన జయలలిత బయోపిక్ 'తలైవి' విడుదలకు సిద్ధంగా ఉంది. Launching the logo of @ManikarnikaFP with the announcement of our debut in digital space with a quirky love story Tiku weds Sheru .... Need your blessings 🙏 pic.twitter.com/ulaMK62m7l — Kangana Ranaut (@KanganaTeam) May 1, 2021 -
మహర్షి... జెర్సీకి డబుల్ ధమాకా
67వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా మెరుపులు మెరిపించింది. 2019వ సంవత్సరానికి గాను సోమవారం ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమా 4 అవార్డులు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌గా మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ (దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి) అవార్డు గెలిచింది. ‘మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా చారిత్రక కథాంశంతో మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్ – అరేబియన్ కడలింటె సింహం’ (మరక్కర్ – లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ), ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (‘మణికర్ణిక’, ‘పంగా’) ఎంపికైతే, ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్ (చిత్రం ‘అసురన్’) – హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (‘భోన్స్లే’)లకు సంయుక్తంగా ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (హిందీ ‘బహత్తర్ హూరేన్’) ఎంపికయ్యారు. ఉత్తమ తమిళ చిత్రం అవార్డు కూడా వెట్రిమారన్ దర్శకత్వంలోని ‘అసురన్’కే దక్కగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, తెలుగు నటుడు నవీన్ పొలిశెట్టి నటించిన ‘చిఛోరే’ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైంది. సినిమాల నిర్మాణానికి అనుకూలమైన ‘మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్’ అవార్డును సిక్కిమ్ దక్కించుకుంది. ఇటీవల ‘ఉప్పెన’లో అందరినీ ఆకట్టుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’తో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. పార్తీబన్ నటించి, రూపొందించగా, వివిధ దేశ, విదేశీ చలనచిత్రోత్సవాలకు వెళ్ళిన తమిళ చిత్రం ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (ఒక చెప్పు సైజు 7) స్పెషల్ జ్యూరీ అవార్డును గెలిచింది. అజిత్ నటించిన తమిళ ‘విశ్వాసం’కు ఇమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు. ఈసారి ఆస్కార్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన మలయాళ ‘జల్లికట్టు’ సినిమాటోగ్రఫీ విభాగం (గిరీశ్ గంగాధరన్)లో అవార్డు దక్కించుకుంది. కరోనా కారణంగా విడుదల ఆలస్యమైనా, ఉత్తమ చిత్రంగా నిలిచిన మోహన్‌లాల్ ‘మరక్కర్’ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు సాధించింది. నిజానికి, గత ఏడాది మే నాటికే ఈ 2019 అవార్డుల ప్రదానం జరగాల్సి ఉంది. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో అవార్డుల ప్రకటన – ప్రదానం ఇప్పటి దాకా ఆలస్యమైంది. జయహో... మలయాళం ఈ 2019 జాతీయ అవార్డుల్లో మలయాళ సినిమా పంట పండింది. ఫీచర్‌ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్, గీతరచన, మేకప్, సినిమాటోగ్రఫీ సహా 9 అవార్డులు, నాన్–ఫీచర్‌ఫిల్మ్ విభాగంలో 2 అవార్డులు – మొత్తం 11 జాతీయ అవార్డులు మలయాళ సినిమాకు దక్కడం విశేషం. ఒకటికి రెండు తాజా నేషనల్ అవార్డుల్లో మలయాళ ‘మరక్కర్...’కు 3, మలయాళ ‘హెలెన్’కు 2, తమిళ ‘అసురన్’, ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’కు చెరి రెండేసి, హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’కు 2, తెలుగు చిత్రాలు ‘మహర్షి’, ‘జెర్సీ’ లకు చెరి రెండేసి అవార్డులు, మరాఠీ ‘ఆనందీ గోపాల్’కు 2, బెంగాలీ చిత్రం ‘జ్యేష్ఠ పుత్రో’కు 2 అవార్డులు రావడం గమనార్హం. అవార్డు మిస్సయ్యాం అనుకున్నాం – నాని ‘‘గత ఏడాది అంతా కరోనాతో గడిచిపోయింది. అవార్డ్స్ ఫంక్షన్లు ఏమీ లేవు. ‘జెర్సీ’కి అవార్డ్స్ మిస్ అయిపోయాం అనుకున్నాం. కానీ, ఇప్పుడు 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ‘జెర్సీ’కి రెండు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ‘జెర్సీ’తో పాటు అవార్డులు గెలుచుకున్న ‘మహర్షి’ చిత్ర బృందానికి కూడా కంగ్రాట్స్. జాతీయ అవార్డులు వచ్చిన ప్రతిసారీ వాటిలో మన తెలుగు సినిమాల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది.’’ శిల్పకు ధన్యవాదాలు ‘‘నాకీ అవార్డు రావడానికి కారణం దర్శకుడు కుమారరాజా. అలాగే శిల్ప (‘సూపర్ డీలక్స్’లో సేతుపతి చేసిన ట్రాన్స్‌జెండర్ పాత్ర పేరు). ఏ పాత్ర చేసినా అవార్డులు వస్తాయా? అని ఆలోచించను. శిల్ప రెగ్యులర్ పాత్ర కాదు. అలాగని నన్నేం ఇబ్బంది పెట్టలేదు. ‘నేను శిల్ప’ అనుకుని, లీనమైపో యా. అందుకే, కుమారరాజాకి, శిల్పకి థ్యాంక్స్.’’ – ఉత్తమ సహాయ నటుడు విజయ్ సేతుపతి ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాను ‘‘నేను డైరెక్టర్ కావడానికి ఏడేళ్లు పట్టింది. రాహుల్‌గారు నన్ను నమ్మి ‘మళ్ళీ రావా’కి చాన్స్ ఇచ్చారు. నిర్మాతగా ఆయనకు అది తొలి సినిమా. ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం గ్రేట్. అందుకే ఆయనకు ఫోన్ చేసి ‘థ్యాంక్స్’ చెప్పాను. ‘జెర్సీ’ తీస్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఉంది. ‘మంచి సినిమా తీయాలి’... అంతే. నేను రాసిన కథ ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాలంటే మంచి నటుడు చేయాలి. నా కథను నానీ, శ్రద్ధా శ్రీనాథ్, బాలనటుడు రోనిత్... ఇలా ఇతర నటీనటులందరూ తమ నటనతో ఎలివేట్ చేశారు. సాంకేతిక నిపుణులు కూడా న్యాయం చేశారు.’’ – ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాకు ఇది హ్యాపీ మూమెంట్ – ‘దిల్’ రాజు ‘‘మహేశ్ వంటి స్టార్‌ని పెట్టుకుని వాణిజ్య అంశాలు మిస్ అవకుండా సందేశాత్మక చిత్రం తీయడం కష్టమైన పని. టీమ్ అంతా కష్టపడి చేశారు. అవార్డులకు వచ్చే ప్రైజ్ మనీని మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తా. మాకిది హ్యాపీ మూమెంట్’’ అన్నారు ‘మహర్షి’ నిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు. ‘‘ఈ కథ విన్నప్పుడు మహేశ్ నా కెరీర్లోనే బెస్ట్ మూవీ అని, విడుదలయ్యాక నేను గర్వపడే సినిమా ‘మహర్షి’ అని ట్వీట్ చేశారు. ‘మహర్షి’కి బీజం వేసింది రచయిత హరి. నాతో పాటు హరి, అహిషోర్ సాల్మన్ రెండేళ్లు కష్టపడ్డారు’’ అన్నారు ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి. -
కంగనాకు ఆ పేరైతే సరిగ్గా సరిపోయేది
కంగనా రనౌత్ అసలు పేరు వార్తలమ్మ అని పెడితే సరిపోయేది. ఒకటీ ఆమె వార్త సృష్టిస్తుంది. లేదా ఆమే వార్త అవుతుంది. ఎప్పుడూ మీడియాలో ఉన్నవాళ్లకే మార్కెట్ అని ఆమె కనిపెట్టింది. పలుచగా ఉండే శరీర స్వభావంతో ఉండే ఈ నటి బొద్దుగా ఉండే జయలలిత పాత్రను పోషించడానికి శారీరకంగా ట్రాన్స్ఫామ్ కావడం, అందుకు శ్రమ పడటం ఆమె వృత్తిగత ప్రతిభను చాటుతుంది. ఆమెను ‘న్యూసెన్స్’ అని అనేవారు కూడా ఈ టాలెంట్‌ను అంగీకరిస్తారు. కంగనా నేడు (మార్చి 23) 35వ ఏట అడుగుపెట్టనుంది. రేపు ‘తలైవి’ ట్రైలర్ కంగనా పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. ‘ఈ పాత్ర కోసం 20 కేజీల బరువు పెరిగి కొద్ది నెలల్లో అంత బరువూ తగ్గాను. అయితే సినిమా కోసం ఇదొక్కటే నేను ఎదుర్కొన్న సవాలు కాదు’ అని కంగనా కొన్ని సినిమా స్టిల్స్‌ను పోస్ట్ చేస్తూ వ్యాఖ్యానించింది. ఆ ఫొటోల్లో సినిమా నటిగా జయలలిత చేసిన పాత్రల్లాంటి వాటిలో కంగనా గెటప్స్ ఉన్నాయి. అచ్చు జయలలితను పోలి ఉండటంతో అటు జయలలిత అభిమానులు, ఇటు కంగనా అభిమానులు సంతోషపడుతున్నారు. కంగనా ఎంత ప్రతిభావంతురాలో వివాదాల్లో కూడా అంతే ప్రముఖురాలు. ఏదో ఒక కారణం చేత ఆమె తరచూ వార్తల్లో ఉంటుంది. ‘తలైవి’లో కంగనా రనౌత్ హృతిక్ రోషన్‌తో ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత ఇతర హీరోయిన్లపై సూటిపోటి మాటలు, మహారాష్ట్ర ప్రభుత్వంతో పేచీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికే వ్యాఖ్యలు... ఇవన్నీ ఆమెను న్యూస్‌లో ఉంచుతున్నాయి. అయితే న్యూస్‌లో ఉంచాల్సింది ఆమె నటనా ప్రతిభే అని ఆమె మర్చిపోతున్నట్టుంది. ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’, ‘ఫ్యాషన్’, ‘తనూ వెడ్స్ మను’, ‘క్వీన్’, ‘మణికర్ణిక’ లాంటి మంచి సినిమాల్లో ఆమె పాత్రలు వెలిగాయి. వంద కోట్ల కలెక్షన్లు సాధించడానికి హీరో అక్కర్లేదు అని నిరూపించిందామె. మూడుసార్లు జాతీయ ఉత్తమనటిగా నిలవడం సామాన్య విషయం కాదు. ఇప్పుడు నాలుగో జాతీయ అవార్డును కూడా దక్కించుకుంది. ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాల్లోని నటన ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కేలా చేసింది. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పద్దెనిమిదేళ్ల వయసులో డెహ్రాడూన్ నుంచి ఒంటరిగా ఢిల్లీ చేరుకుని రకరకాలుగా స్ట్రగుల్ అయి, ముంబై చేరుకుని ఒకరి అండ లేకుండా స్టార్‌గా మారిందామె. ఆమెకు రాజకీయ అభిప్రాయాలు రాజకీయ జీవితం పట్ల ఆసక్తి ఉంటే దానికి ఇంకా టైమ్ ఉందని పరిశీలకులు అనుకోవచ్చు. ఇప్పుడైతే ఆమె నుంచి ఆశిస్తున్నది గొప్ప సినిమాలే. తనలోని గొప్ప నటికి ఆమె ఎక్కువ పని చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటే వారి కోరిక సబబైనదే అనుకోవచ్చు. ‘మణికర్ణిక’లో కంగనా రనౌత్ నా అవార్డు వాళ్లది కూడా! – కంగనా రనౌత్ ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, ‘పంగా’ సినిమాల్లో నా నటనకు నేషనల్ అవార్డు వచ్చిందని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. ‘మణికర్ణిక’ సినిమాను నేను డైరెక్ట్ కూడా చేశాను. జ్యూరీ మెంబర్స్‌తో పాటు చిత్రబృందం అందరికీ ధన్యవాదాలు. నా అవార్డు వీరిది కూడా. నా అభిమానులందరికీ ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ అవార్డ్స్ తాజాగా ఉత్తమ నటిగా ఎంపికైన కంగనా రనౌత్ గతంలో ఉత్తమ సహాయ నటిగా (చిత్రం ‘ఫ్యాషన్’) ఒకసారి, ఉత్తమ నటిగా రెండు సార్లు (‘క్వీన్’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’) అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఆమెకిది 4వ నేషనల్ అవార్డు. ధనుష్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రావడం ఇది 2వ సారి. గతంలో వచ్చిన ‘ఆడుకాలమ్’కూ, ఇప్పుడు అవార్డు తెచ్చిన ‘అసురన్’కూ – రెండింటికీ దర్శకుడు వెట్రిమారన్ కావడం విశేషం. ఇక, ఉత్తమ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌కి ఇది 3వ జాతీయ అవార్డు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరంకు ఇది 2వ నేషనల్ అవార్డు. గతంలో ‘జనతా గ్యారేజ్’ (‘ప్రణామం...’ పాటకు), ఇప్పుడు ‘మహర్షి’ – ఇలా ఆయనకు జాతీయ గౌరవం తెచ్చిన రెండు చిత్రాలూ తెలుగువే కావడం విశేషం. -
మరో బాలీవుడ్ చిత్రానికి బాహుబలి రచయిత స్క్రిప్ట్
‘భజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక’ వంటి బాలీవుడ్ హిట్ చిత్రాలకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ మరోసారి బాలీవుడ్లో ఒక బహుభాషా చిత్రానికి స్క్రిప్ట్ సమకూర్చుతున్నారు. ‘సీత... ది ఇన్కార్నేషన్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహించనున్నారు. హ్యూమన్ బీయింగ్ స్డూడియోస్ సంస్థ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదలైన ‘సీత... ది ఇన్కార్నేషన్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీతాదేవి గురించి ఎవరికీ తెలియని విషయాల్ని ఈ సినిమాలో చూపించనున్నారు. మనోజ్ ముంతాషీర్ మాటలు రాస్తున్న ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి పెద్ద ఎత్తున వీఎఫ్ఎక్స్ చేయనున్నారట. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఇంకా ప్రకటించలేదు. అందుకే సీత పాత్రలో ఎవరు నటించనున్నారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే విజయేంద్రప్రసాద్ కథ అందించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ అక్టోబర్ 13న విడుదల కానుంది. -
మరో పవర్ఫుల్ పాత్ర: ఇందిరాగాంధీగా కంగనా
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాలీవుడ్లో సత్తా చాటుతున్న నటి కంగనా రనౌత్. ఇప్పటికే పలు సినిమాలు చేసి హీరోలకు గట్టి పోటీనిచ్చిన కంగనా ఇప్పుడు మరో పవర్ఫుల్ పాత్రలో కనపించనుంది. దేశ తొలి మహిళా ప్రధానమంత్రి.. ఉక్కు మహిళ (ఐరన్ లేడీ)గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించనుంది. దానికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే కంగనాపై ఫొటోషూట్ చేశారు. ఇందిరాగాంధీ లుక్‌లో కంగనా మెరిశారు. ఇందిరాగాంధీ మాదిరి హెయిర్ స్టైల్, వస్త్రధారణ కంగనాకు సెట్టయ్యింది. ఆమె జీవితంలో ఉన్న ప్రధాన అంశం ఇతివృత్తంగా సినిమా రూపుదిద్దుకుంటుందని మీడియాలో వార్తలను నిజం చేస్తూ కంగనా ప్రకటించింది. తన స్నేహితుడు సాయి కబీర్‌తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని కంగనా సంతోషం వ్యక్తం చేసింది. మణికర్ణిక తీసిన బృందమే ఈ సినిమాకు పని చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇది జీవిత చరిత్ర కాదని.. ఇందిరాగాంధీ జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కథ సిద్ధమైందని.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించి ఫొటోషూట్ కూడా పూర్తయ్యింది. ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, లాల్‌బహదూర్ శాస్త్రిలు కూడా కనిపించనున్నారు. మరి వారి పాత్రల్లో ఎవరూ నటిస్తున్నారో ఇంకా తెలియదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించి మెప్పించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. జయలిలత పాత్రకు సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. అంతకుముందు ‘మణికర్ణిక’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా నటించి మెప్పించింది. Kangana will essay the role of former Prime Minister Indira Gandhi in an upcoming political drama. "The script is in final stages. It is not a biopic but it is a grand period film that will help my generation to understand (the) socio-political landscape of current India." pic.twitter.com/0Ln3Pwtwa0 — Kangana Ranaut Daily (@KanganaDaily) January 29, 2021 -
మణికర్ణిక రిటర్న్స్
ఝాన్సీ లక్ష్మీభాయ్గా కంగనా రనౌత్ బాక్సాఫీస్ మీద కత్తి దూసిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడు. అయితే కొంత భాగాన్ని డైరెక్ట్ చేశారు కంగన. తాజాగా ‘మణికర్ణిక’ చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటించారు. ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డ’ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ రూపొందనుంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌తో ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. కశ్మీరీ రాణి దిడ్డ కథతో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. కంగన టైటిల్ రోల్లో కనిపిస్తారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుంది. -
సోనూ ఉండుంటే ఆ సినిమా మరోస్థాయిలో ఉండేది
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సదాశివ్ పాత్రలో నటించేందుకు అంగీకరించగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక మధ్యలో సినిమా నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దర్శకుడు క్రిష్‌తో కలిసి తన సిక్స్ ప్యాక్‌తో కండల వీరుడిగా, గంభీరంగా నడుస్తున్న సోనూ గెటప్ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. దీనికి 'జీవితంలో మంచి కోసం నడవండి... ఏదో ఒక రోజు మీరు సాధిస్తారు' అనే క్యాప్షన్‌తో ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటో చూసిన ప్రేక్షకులు సోనూ సినిమాలో నటించి ఉంటే మణికర్ణిక మరో స్థాయిలో ఉండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అప్పట్లో కొన్ని రూమర్స్ వినిపించాయి. చిత్రంలో మార్పులు చేయాలని, సోనూసూద్ పాత్రను తగ్గించాలని కంగనా వాదించడంతో క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత కంగన స్క్రిప్టులో మార్పులు చేశారనే ప్రచారం జరిగింది. (సోనూసూద్‌కి ఐరాస అవార్డ్) View this post on Instagram Walk towards the good in life and one day you will arrive ❣️#throwback A post shared by Sonu Sood (@sonu_sood) on Oct 4, 2020 at 7:43am PDT -
నేను తప్పు చేశానా : కంగన ఫైర్!
ముంబై : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. తన అప్‌మింగ్ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనను విమర్శించాడంటూ అతడిపై ఫైర్ అయ్యారు. కంగనా- రాజ్‌కుమార్ రావు సినిమా జడ్జిమెంటల్ హై క్యా సినిమా సాంగ్ రిలీజ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే... కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మణికర్ణిక సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంగనా పూర్తిగా దేశభక్తురాలిగా మారి ఈ సినిమాను తెరకెక్కించిందని సదరు జర్నలిస్టు విమర్శించారు. అదే విధంగా పాకిస్తాన్లో షోలు నిర్వహించే భారతీయ ముస్లిం నటీమణులను వ్యతిరేకించే కంగనా... తన మణికర్ణిక సినిమాను మాత్రం అక్కడ రిలీజ్ చేయడం విశేషం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో తాజా మూవీ ప్రమోషన్‌కు వచ్చిన అతడిపై కంగన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ నా మణికర్ణిక సినిమా గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడావు. ఆ సినిమా తెరకెక్కించి తప్పు చేశానా? జాతీయవాదిగా నాపై ముద్ర వేశావు కదూ. గతంలో నీకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. అప్పుడు బాగా మెచ్చుకున్నావు. మరి తర్వాత ఏమైంది’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ పరిణామంతో కంగుతిన్న సదరు జర్నలిస్టు తను కంగన నటనను విమర్శించినందుకే తనపై ఇలా కక్ష గట్టిందని వాపోయాడు. Great to see journos standing up to #FarziNationalists like #Kangana. Questioning them or flop #Manikarnika makes you question Nationalism?🤨 Not only did @JustinJRao stand his ground - he shut the MC trying to silence him. Kudos to @ektaravikapoor for allowing journo to finish. pic.twitter.com/Vuf7ZbAXj9 — The DeshBhakt (@akashbanerjee) July 8, 2019 -
పబ్లిక్‌గా ముద్దిచ్చిన నటి.. వీడియో వైరల్
హిందీ టీవీ రంగంలో నటిగా పాపులరైన అంకిత లొకాండె.. మణికర్ణికతో సినీరంగంలోకి అడుగుపెట్టి, ఎంట్రీ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణికర్ణికలో కంగనాకు సపోర్టుగా జల్కరి బాయి పాత్రలో ఒదిగిపోయి మంచి మార్కులు కొట్టేసింది. పవిత్ర రిష్తా టీవీ షో చేసే సమయంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో చాలా కాలం రిలేషన్షిప్లో ఉన్న ఈ బ్యూటీ ఆ తర్వాత 2016లో అతడితో విడిపోయింది. సుశాంత్ టీవీ రంగం నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేసే క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే ఇటీవల అంకిత, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త విక్కీ జైన్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్టు, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ విషయమై అంకిత కొన్ని రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. 'విక్కీ చాలా మంచి వ్యక్తి. నేను అతనితో ప్రేమలో ఉన్నా. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఒక వేళ పెళ్లి చేసుకుంటే మీ అందరిని పిలిచే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతానికైతే అలాంటి ప్లాన్లేవీ లేవు. నా ఫోకస్ అంతా పని మీదే ఉంది' అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల అంకిత, విక్కీ జైన్ ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ఆడిపాడారు. ఈ జంట మ్యూజిక్‌ని ఆస్వాధిస్తుండగా ఒక్కసారిగా విక్కీని దగ్గరకు తీసుకుని అందరు చూస్తుండగానే అంకిత ముద్దు ఇచ్చింది. దీనికి సంబంధించి వీడియోను నటుడు అర్జున్ బిజ్లానీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
‘ఆమెతో నాకు పోటీ ఏంటి.. చిరాగ్గా?’
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు కంగనా. ముఖ్యంగా బాలీవుడ్లో ఉన్న బంధుప్రీతి గురించి విమర్శలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు కంగనా. తాజాగా ఈ ‘క్వీన్’ భామ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలియా భట్ ఓ సగటు హీరోయిన్ అని.. ఆమెతో తనకు పోటీ ఏంటని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మ్యాగజైన్ ఒకటి 2019లో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో ఉత్తమ హీరోయిన్ ఎవరనే అంశం గురించి ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో కంగనా మణికర్ణిక సినిమాతో పోటీపడగా.. అలియా భట్ గల్లీ బాయ్ సినిమాతో కంగనాకు పోటీగా నిలిచారు. అయితే ఈ ఓటింగ్‌లో కంగనానే ఉత్తమ హీరోయిన్గా గెలిచినట్లు సదరు మీడియా ప్రకటించింది. ఈ విషయాన్ని కంగనా దగ్గర ప్రస్తావించగా... ‘నాకు పోటీగా అలియా ఉందనే విషయం తల్చుకుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. గల్లీ బాయ్ చిత్రంలో ఆమె నటన సగటు హీరోయిన్ యాక్టింగ్లానే ఉంది. మిగతా సినిమాల్లో ఎలా నటించిందో ఈ చిత్రంలోనూ అలానే యాక్ట్ చేసింది. కానీ మణికర్ణిక చిత్రంలో నేను మహిళా సాధికారితను తెలిపేలా.. మంచి నటన కనబరిచాను. అలాంటిది నాతో అలియా పోటీపడటం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మీడియా ఇలాంటి సినీ స్టార్ల పిల్లలను ప్రోత్సాహించడం మానుకుంటే మంచిది. లేదంటే మన పరిశ్రమ ప్రమాణాలు ఎన్నటికి మెరుగవ్వవు’ అని తెలిపారు. -
‘అందుకే ఆ సినిమా వదులుకున్నా’
ముంబై : బాలీవుడ్ ‘క్వీన్’, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తనకు తొలి అవకాశం ఇచ్చిన అనురాగ్ బసుకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇమాలి మూవీ నుంచి తప్పుకొంటున్నట్లు పేర్కొన్న కంగన.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రకాశ్ కోవెలమూడి- ‘మెంటల్ హై క్యా’, అశ్వినీ అయ్యర్- పంగా సినిమాలతో పాటుగా జయలలిత బయెపిక్‌లో నటిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్ సినిమాతో తనను వెండితెరకు పరిచయం చేసిన..అనురాగ్ మూవీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు కంగన వెల్లడించారు. ‘గతేడాది పంగా, ఇమాలీ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాను. అనురాగ్ బసు రూపొందించాల్సిన ఇమాలీ 2018లోనే సెట్స్‌పైకి రావాల్సింది. కానీ అప్పుడు నేను మణికర్ణిక రీషూట్ కారణంగా దర్శకత్వ బాధ్యతల్లో మునిగిపోయాను. భవిష్యత్తులో కూడా డైరెక్టర్‌గా రాణించాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకొన్నా. ఈ నిర్ణయం కారణంగా ఎంతో బాధపడ్డాను. అయితే నా పరిస్థితిని.. నా మెంటార్ అనురాగ్ బసు అర్థం చేసుకున్నారు. మేము భవిష్యత్తులో కచ్చితంగా కలిసి పనిచేస్తాం’ అని కంగన చెప్పుకొచ్చారు. అదే విధంగా తన దర్శకత్వంలో తెరకెక్కిన మణికర్ణిక అద్భుత విజయం సాధించడంతో మహిళా సాధికారతపై మరిన్ని సినిమాలు తీయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక మణికర్ణిక సినిమా కారణంగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్, కంగనాల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. -
‘సల్మాన్ చాన్స్ ఇస్తా అన్నాడు’
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎక్కువగా వివాదాలతో ఎలా వార్తల్లో నిలుస్తుంటారో, అదే స్థాయిలో తన మంచి మనసును కూడా చాటుకుంటుంటాడు సల్లూభాయ్. గతంలో చాల మంది నటులకు సాయం చేసిన సల్మాన్ తాజాగా లెజెండరీ కొరియోగ్రాఫర్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. 2015లో రిలీజ్ అయిన తనూ వెడ్స్ మను తరువాత చాలా కాలం సినిమాలకు దూరమైన సరోజ్ ఖాన్ ఇటీవల మణికర్ణిక, కలంక్ సినిమాకు పని చేశారు. ప్రస్తుతం ఈ లెజెండరీ కొరియోగ్రాఫర్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇటీవల సల్మాన్ ను కలిసి సరోజ్ ఖాన్ ఇదే విషయాన్ని సల్మాన్‌తో ప్రస్థావించటంతో త్వరలో మనం కలిసి పని చేద్దాం అంటూ మాట ఇచ్చారట. ఈ విషయాన్ని సరోజ్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ‘చాలా కాలం తరువాత సల్మాన్‌ను కలవటం ఆనందంగా ఉంది. నీకు ఎప్పుడూ దేవుడి ఆశీస్సులు ఉంటాయి’ అంటూ కామెంట్ చేశారు సరోజ్ ఖాన్. View this post on Instagram It was a pleasure meeting you after so long @beingsalmankhan ! God bless you always my darling! ❣️ A post shared by Saroj Khan (@sarojkhanofficial) on Mar 28, 2019 at 4:35am PDT -
కలెక్షన్స్‌లో దూసుకుపోతున్న బాలీవుడ్ మూవీలు
ఈ ఏడాది బాలీవుడ్ మూవీలు ఫుల్ స్వింగ్ మీదున్నాయి. ఇండియన్ ఆర్మీ సాహసాలు, నాటి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ, గల్లీ నుంచి వచ్చిన కుర్రాడు సాధించిన విజయాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. నిలకడ వసూళ్లతో రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్‌స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కిన యూరీ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి.. 200కోట్లను కలెక్ట్ చేసి దాటేసి 250కోట్లకు పరుగెడుతోంది. వికాస్కౌశల్, యామీ గౌతమ్ లాంటి చిన్న నటులతో తెరకెక్కించిన ఈ మూవీ.. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక వివాదాల నడుమ భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ మూవీ వంద కోట్లను కలెక్ట్ చేసింది. గతేడాది చివర్లో ‘సింబా’గా వచ్చిన రణ్వీర్ సింగ్.. దాదాపు 250కోట్లు కొల్లగొట్టాడు. మళ్లీ చిన్న గ్యాప్‌తో.. ‘గల్లీబాయ్’గా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తున్నాడు. వారం రోజుల్లోనే ఈ సినిమా వందకోట్లను కలెక్ట్ చేసేస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. -
‘అలాంటి వారిని గాడిద మీద ఊరేగించాలి’
ఇక మీదట శాంతి, అహింస అని ఎవరైనా మాట్లాడితే వారిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి అంటున్నారు నటి కంగనా రనౌత్. గురువారం పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ అమానవీయ చర్యను ప్రపంచదేశాలన్ని ముక్తకంఠంతో ఖండించాయి. బాలీవుడ్ కూడా ఉగ్రచర్యలను తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఉగ్రదాడిని ఖండించారు. జవాన్ల మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘పాక్ మన దేశ భద్రతనే కాకుండా మన మర్యాదను కూడా గేళి చేసింది. మనకు హాని కలిగించడమే కాక అవమానించింది కూడా. ఇందుకు తగిన సమాధానం చెప్పాలి. ఈ పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండకూడదు. మన సహనాన్ని వారు చేతకానితనంగా భావిస్తున్నారు. ఫలితంగా ఈ రోజు దేశం రక్తమోడుతోంది. మన బిడ్డలను చంపి మనల్ని సవాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా శాంతి, అహింస అంటే అలాంటి వారి ముఖానికి నల్లరంగు పూసి.. గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి. నడి వీధిలో నిల్చోబెట్టి చెంప పగలకొట్టాలం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్ల మృతికి సంతాపంగా కంగనా మణికర్ణిక సక్సెస్ మీట్ కార్యక్రమాన్నికూడా వాయిదా వేశారు. -
‘తన బయోపిక్కు తానే డైరెక్టర్’
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మరో సంచలనానికి తెరతీసారు. ఇటీవల ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక సినిమాతో ఎన్నో వివాదాలకు కేంద్రబింధువైన కంగనా త్వరలో మరోసారి మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నారు. మణికర్ణిక సినిమాలోని కొంత భాగానికి దర్శకత్వం వహించిన అనుభవంతో తన బయోపిక్‌ను తానే డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు కంగనా. ఈ విషయాన్ని కంగనా స్వయంగా వెల్లడించారు. అంతేకాదు కంగనా బయోపిక్కు బాహుబలి, మణికర్ణిక సినిమాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ కథ అంధించనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో తన జీవితంలోని ఎత్తు పల్లాలను చూపించబోతున్నట్టుగా తెలిపారు కంగనా. బాలీవుడ్ తో ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో విజయాలు సాధించిన ఓ విజేత కథగా తన బయోపిక్ రూపొందించబోతున్నట్టుగా తెలిపారు. -
‘కంగనా ఓ రాక్‌స్టార్’
ప్రస్తుతం బాలీవుడ్లో మణికర్ణిక వివాదంతో పాటు.. తన సహ నటులపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నెపోటిజమ్ గురించి మాట్లాడినందునే ఇండస్ట్రీ అంతా తనకు వ్యతిరేకంగా ఉందని కంగనా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కంగనా నటనను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ట్విటర్ వేదికగా అనుపమ్ ఖేర్ నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనిథింగ్’ సెషన్లో ఒక నెటిజన్ ‘బాలీవుడ్లో కంగనా మణికర్ణిక సినిమాకు ఎవరు మద్దతు తెలపడం లేదు.. మీరు ఆమెకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేయండం’టూ అనుపమ్‌ను కోరాడు. #KanganaRanaut is a ROCKSTAR. She is brilliant. I applaud her courage and performances. She is also the real example of #WomenEmpowerment.:) https://t.co/WeFgWsdiSW — Anupam Kher (@AnupamPKher) February 9, 2019 దాంతో అనుపమ్ ‘కంగనా ఓ రాక్ స్టార్. తనకు చాలా ప్రతిభ ఉంది. నేను తన ధైర్యాన్ని, నటనను ప్రశంసిస్తున్నాను. మహిళా సాధికారితకు తను నిలువెత్తు నిదర్శనం’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అనుపమ్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఇదిలా ఉండగా బంధుప్రీతి గురించి మాట్లాడినందునే బాలీవుడ్ మొత్తం గ్యాంగ్‌లా మారి తనను వ్యతిరేకిస్తున్నారంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అలియా భట్, ఆమిర్ ఖాన్ చిత్రాలు ‘దంగల్’, ‘రాజీ’ మూవీ ప్రమోషన్లకు తాను హాజరయ్యానని.. కానీ నేడు ధీర వనిత లక్ష్మీబాయి కథతో ముందుకు వస్తే తనకు ఎవరూ సహకరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలపై ఆలియా స్పందించడం.. క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధపడటం వంటి సంఘటనలు తెలిసిందే. -
‘కంగనాకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధం’
ముంబై : బాలీవుడ్ మొత్తం గ్యాంగ్‌లా ఏర్పడి తనకు వ్యతిరేకంగా మారారంటూ హీరోయిన్ కంగనా రనౌత్ విమర్శించారు. ప్రణాళిక ప్రకారమే తన ‘మణికర్ణిక’ సినిమాకు మద్దతుగా నిలవలేందంటూ ‘క్వీన్’ చిందులు తొక్కారు. నెపోటిజమ్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినందు వల్లే ఇలా కక్ష గట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో అలియా భట్, ఆమిర్ ఖాన్ల పేర్లు ప్రస్తావించిన కంగనా.. ‘అలియా భట్ నాకు ‘రాజీ’ ట్రైలర్ పంపించారు. తనకు సపోర్ట్ చేయమన్నారు. అలాగే ఆమిర్ కూడా ‘దంగల్’ మూవీ ప్రమోషన్లో పాల్గొనమన్నారు. ఈ రెండు సినిమాలు సందేశాత్మకమైనవి గనుక వాటికి అండగా నిలిచాను. ప్రస్తుతం నేను ధీర వనిత లక్ష్మీబాయి కథతో ముందుకు వస్తే నాకు ఎవరూ సహకరించడం లేదు’ అంటూ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలపై స్పందించిన అలియా భట్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘ తను(కంగన) నన్ను ద్వేషిస్తున్నారని అనుకోవడం లేదు. తనను కావాలని అప్సెట్ చేయలేదు. కాస్త బిజీగా ఉన్నందు వల్లే ఇలా జరిగింది. ఈ విషయమై తనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. తనలా మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి. ఒక వ్యక్తిగా, గొప్ప నటిగా తన పట్ల నాకు ఆరాధనా భావం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించిన గల్లీ బాయ్ సినిమా ప్రమోషన్లతో అలియా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేస్తారా.?
ప్రస్తుతం సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో వివాదాస్పదంగా మారిన సినిమా మణికర్ణి. ఈ సినిమాకు ముందుగా క్రిష్ దర్శకత్వం వహించటం ప్రధా పాత్రధారి కంగనాతో వివాదం కారణంగా క్రిష్ తప్పుకోవటంతో కంగనానే దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో సినిమా టైటిల్స్‌లో దర్శకులుగా కంగనా, క్రిష్ పేర్లు కనిపించాయి. అయితే మేజర్ పార్ట్ డైరెక్ట్ చేసిన తనకే ఎక్కువ క్రెడిట్ దక్కాలంటూ సోషల్ మీడియా వేదిక గొడవపడుతున్నారు. అలాంటి పరిస్థితే ఓ సౌత్ సినిమాకు కూడా ఏర్పడింది. బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సౌత్ సినిమా దట్ ఈజ్ మహాలక్ష్మీ. ఈసినిమాకు ముందుకు షో ఫేం నీలకంఠ దర్శకత్వం వహించాడు. తరువాత లీడ్ యాక్టర్ తమన్నాతో వివాదం కారణంగా నీలకంఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో మిగతా భాగానికి అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో సినిమాకు దర్శకుడిగా క్రెడిట్ ఎవరికి ఇస్తారు. ఇద్దరికీ క్రెడిట్ ఇచ్చేట్టయితే ముందుగా ఎవరి పేరు వేస్తారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన దట్ ఈజ్ మహాలక్ష్మీ టీం పోస్టర్లు, టీజర్లను దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేసింది. మరి సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతారా లేక మరో వివాదానికి తెరతీస్తారా చూడాలి. -
‘క్రిష్ చేయని పనికి క్రెడిట్ అడుగుతున్నారు’
మణికర్ణిక సినిమా వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదిక క్రిష్, చిత్ర యూనిట్‌పై ముఖ్యంగా కంగనా రనౌత్‌పై ఆరోపణలు గుప్పిస్తుంటే, కంగనా కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. కొందరు కంగనాను తప్పు పడుతుండగా, మరికొందరు క్రిష్ తీరును విమర్శిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన చిత్ర నిర్మాత కమల్ జైన్.. క్రిష్ వాదనను తప్పు పట్టారు. దర్శకురాలిగా కంగనా పేరు ముందు వేయటం అనేది నిర్మాణ సంస్థ నిర్ణయం అన్నారు. అంతేకాదు.. క్రిష్, తన వాదన సరైనదే అని భావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చిన తెలిపారు. ఆయన, తను చేయని పనికి క్రెడిట్ కావాలని కోరటం సరైన పద్దతి కాదన్నారు. సినిమా సక్సెస్ సాధించిన తరువాత క్రిష్ తనకు క్రెడిట్ కావాలని వాదిస్తున్నారని విమర్శించారు. -
‘మణికర్ణిక’ వివాదంపై తమన్నా.!
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను కుదిపేస్తున్న వివాదం మణికర్ణిక. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాకు తరువాత కంగనా దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో వివాదం మొదలైంది. కంగనా తన పాత్రను ఎలివేట్ చేసుకునేందుకు ఇతర పాత్రలను తగ్గించిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వివాదంలో కొంతమంది క్రిష్‌కు మద్దతు తెలుపుతుండగా మరికొందరు కంగనానే కరెక్ట్ అంటున్నారు. తాజాగా ఈ వివాదంపై మిల్కీబ్యూటీ తమన్నా స్పదించారు. ‘నటనపరంగా కంగనాకు వంక పెట్టడానికి లేదు. ఆమె ఎంత గొప్ప నటో అందరికీ తెలిసి విషయమే. క్రియేటివ్ పీపుల్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అయితే ఎవరి ఆలోచన ఎలా ఉన్నా ఫైనల్‌గా అవి సినిమాకు మంచి చేసేవిగా ఉండాలి. ప్రతీ ఒక్కరు సినిమా సక్సెస్ కోసమే పనిచేయా’లన్నారు. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పన్న విషయాన్ని సూటిగా చెప్పేందుకు తమన్నా ఇష్టపడలేదు. -
నా పాత్రను తగ్గించేశారు
‘మణికర్ణిక’ చిత్రం మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటనను ప్రేక్షకులు అభినందిస్తున్నా, ఆమె ప్రవర్తనను మాత్రం తోటి టెక్నీషియన్స్ విమర్శిస్తున్నారు. దర్శకత్వం విషయంలో క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నా పాత్రను నిర్దాక్షిణ్యంగా తగ్గించేశారని అందులో నటించిన హీరోయిన్ మిస్తీ చక్రవర్తి ఆరోపించారు. ‘‘మణికర్ణిక’ సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని, మంచి సన్నివేశాలున్నాయని క్రిష్‌గారు నాతో చెప్పారు. అలానే అద్భుతమైన సన్నివేశాలు చిత్రీకరించారు కూడా. కానీ, అవన్నీ సినిమాలో కనిపించలేదు. సినిమా పూర్తయ్యాక మళ్లీ కొన్ని సన్నివేశాలు షూట్ చేయడానికి కంగనా నన్ను డేట్స్ అడిగారు. అప్పుడు తీసిన సన్నివేశాలను మొదట షూట్ చేసినవాటి స్థానంలో చేర్చారు. ఒకవేళ కంగనానే దర్శకురాలని ముందే తెలిసుంటే ఈ సినిమా చేసుండేదాన్ని కాదు’’ అని పేర్కొన్నారు మిస్తీ. -
‘కంగనా రియల్ డైరెక్టర్ కాదు’
మణికర్ణిక సినిమాపై విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్న చిత్ర నటీనటులు నుంచి మాత్రం విమర్శలే వినిపిస్తున్నాయి. దర్శకుడు క్రిష్.. కంగనా తీరుపై విరుచుకుపడ్డారు. సోనూ సూద్ పాత్రను తగ్గించాలన్న నిర్ణయం కంగనా తీసుకోవటం పాటు మరిన్ని మార్పులకు ఒత్తిడి చేయటంతోనే తాను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా క్రిష్ తెలిపారు. సోనూసూద్ కూడా తన పాత్రను ముందు చెప్పినట్టుగా తెరకెక్కించకపోవటంతోనే ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని తెలిపాడు. తాజా మణికర్ణిక సినిమాలో కీలక పాత్రలో నటించిన మిస్తీ చక్రవర్తి, కంగనా తీరుపై స్పందించారు. ‘క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తరువాత అబద్దాలు చెప్పి కంగనా, కమల్ జైన్‌ను నా డేట్స్ అడిగారు. సినిమాలో నీది కీలక పాత్ర సినిమా అంత నువ్ కనిపిస్తావు. అందుకే మరిన్ని డేట్స్ అవసరం పడ్డాయని చెప్పారు. కానీ క్రిష్ తీసిన సన్నివేశాలను కూడా కట్ చేసి, నా పాత్రను కొన్ని సీన్స్‌కే పరిమితం చేశార’ని తెలిపారు మిస్తీ. అంతేకాదు కంగనా తన పాత్రను మరింతగా ఎలివేట్ చేసేందుకు ఇతర పాత్రల నిడివిని తగ్గించారని ఆరోపించారు. అంతేకాదు కంగనా నిజమైన డైరెక్టర్ కాదని, డైరెక్టర్ తన సినిమాలో ప్రతీ పాత్రను ప్రేమిస్తారని.. కానీ కంగనా కేవలం తన పాత్రను మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాలో మార్పులు చేశారని తెలిపారు. -
ఈ సీన్ ‘మణికర్ణిక’లో ఉంటే.. అదిరిపోయేది!
మణికర్ణిక విడుదలై ఒకవైపు పాజిటివ్ టాక్‌ను సంపాదించి.. కలెక్షన్లలో పుంజుకుంటుంటే.. మరోవైపు వివాదాలు కూడా వస్తున్నాయి. సినిమాలో మణికర్ణిక పాత్రలో నటించిన కంగనాకు ప్రశంసలు వస్తున్నాయి కానీ డైరెక్షన్ క్రెడిట్ పూర్తిగా తన అకౌంట్లో వేసుకోవడం మాత్రం దర్శకుడు క్రిష్‌కు మింగుడు పడటం లేదు. ఈ వివాదంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మణికర్ణిక విడుదలైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ.. తాను తీసిన సినిమా బంగారంలా ఉంటే ప్రస్తుతం చూస్తున్న సినిమా వెండిలా ఉందని.. కంగనా, సోనూసూద్ నటించిన పాత్రను తగ్గించాలని పట్టుబట్టిందన్నారు. కానీ తాను వినిపించుకోలేదని, కథలో తనకు ఇష్టవచ్చిన మార్పులు చేసిందని కంగనాపై ఆరోపణలు చేశారు. తాను ఈ సినిమా కోసం ఎంతో పరిశోధించానని, చరిత్రను వక్రీకరించడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాక.. తన పాత్రను తగ్గిస్తామని చెప్పేసరికి సోనూసూద్ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుంటే.. సోనూసూద్‌పై షూట్ చేసిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సినిమా ఎండింగ్ వరకు ఆయన పాత్ర ఉంటుందని, సోనూసూద్‌పై తీసిన సన్నివేశాలు ఎంతో బాగుంటాయని క్రిష్ చెప్పడం.. ఒళ్లు గగుర్పొడిచే ఈ సీన్ లీక్ అవ్వడం చూస్తే.. కంగనా కావాలనే సోనూసూద్ పాత్రను తగ్గించినట్లుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోనూసూద్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాక.. మహ్మద్ జీషన్ తో రీ షూట్ చేసింది. ఆ పాత్రను పూర్తిగా మార్చేయడంతో పెద్దగా ప్రాముఖ్యత లేకుండాపోయింది. -
కంగనానే నా హీరో : నటి
సాధారణంగా ఇండస్ట్రీలో ఒక నటిని మరో నటి మెచ్చుకోవడం అరుదే. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారుతుంది. సహ నటి ఎవరైనా బాగా నటిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఇతర హీరోయిన్లు. ఈ విషయంలో సమంత ఎప్పడు ముందే ఉంటారు. హిందీ నటి కంగనా రనౌత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సమంత. ‘మణికర్ణిక’తో నటిగా మరోసారి నిరూపించుకున్నారు కంగనా. వీరనారీ ఝాన్సీలక్ష్మీబాయ్ పాత్రలో కంగనా సాహసోపేతమైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రంలో కంగనా నటనను మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సమంత. ‘కంగనానే నా హీరో.. ప్రస్తుత హీరోయిన్లు ఎవరూ నటించడానికి సాహసించని యాక్షన్ కథా పాత్రను ఎంచుకుని చాలా గొప్పగా నటించిందం’టూ ప్రశంసించారు సమంత. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. సమంత చేతిలో తెలుగులో రెండు, తమిళంలో ఒక చిత్రం ఉన్నాయి. -
సిమ్రాన్‌కి జరిగిందే మణికర్ణికకూ జరిగింది
‘‘దర్శకుడు క్రిష్ ‘మణికర్ణిక’ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో దర్శకత్వ బాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది’’ అని ఆ చిత్రం రిలీజ్ ముందు కంగనా రనౌత్ పేర్కొన్నారు. అయితే ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మణికర్ణిక’ సినిమాకు సంబంధించిన పలు విషయాలు పేర్కొన్నారు క్రిష్. ‘‘మణికర్ణిక’ సినిమాను జూన్‌లోనే పూర్తి చేశాను. అన్ని పాత్రలు డబ్బింగ్ కూడా చెప్పేసుకున్నారు. అప్పుడు ‘మెంటల్ హై క్యా’ షూటింగ్ నిమిత్తం లండన్‌లో ఉన్నారు కంగనా. ఇండియా వచ్చిన తర్వాత నేను చిత్రీకరించిన విధానం నచ్చలేదని నిర్మాణ సంస్థను నమ్మించారు. భోజ్‌పూరి సినిమాలా ఉందని వాళ్లతో పేర్కొన్నారు. సినిమా మొత్తం తన చుట్టూనే తిరగాలన్నట్టు కంగనా ప్రవర్తన ఉండేది. సోనూసూద్ పాత్ర సుమారు 100 నిమిషాలు ఉండేది. దాన్ని 60 నిమిషాలకు కుదించేయడంతో ఆయన తప్పుకున్నారు తప్పితే లేడీ డైరెక్టర్‌తో యాక్ట్ చేయను అనే కారణం కాదు. ఫస్ట్ హాఫ్‌లో ఓ 25 శాతం సెకండ్ హాఫ్‌లో 15 శాతం మాత్రమే కంగనా రనౌత్ డైరెక్ట్ చేశారు’’ అంటూ తెర వెనుక జరిగిన అసలు విషయాన్ని పంచుకున్నారు. క్రిష్ పేర్కొన్న విషయాలకు బాలీవుడ్ దర్శకుడు, స్క్రీన్ రైటర్ అపూర్వ అశ్రాని మద్దతు తెలిపారు. ‘‘నేను ‘సిమ్రాన్’ అనే సినిమాను ఎంతో ప్రేమతో రాశాను. అయితే కంగనా రనౌత్ మాత్రం మిగతా పాత్రల డైలాగ్స్, సీన్స్‌ను తగ్గించేశారు. ‘మణికర్ణిక’కు ఏం జరిగిందని క్రిష్ చెబుతున్నారో ‘సిమ్రాన్’ విషయంలోనూ అలానే జరిగింది. స్క్రిప్ట్ చాలా బావుందని చెప్పి, తర్వాత తన ఇష్టమొచ్చినట్టు మార్చేసిందామె. క్రిష్ ధైర్యానికి, నిజాయితీకి సెల్యూట్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు అపూర్వ. కంగనా రనౌత్ పై క్రిష్ చేస్తున్న ఆరోపణలకు కంగనా చెల్లెలు రంగోలి స్పందించారు. ‘‘క్రిష్‌గారు.. సినిమా మొత్తం మీరే డైరెక్ట్ చేశారు. కొంచెం కామ్‌గా ఉండండి. సినిమాకు హీరోయిన్ కంగనే కదా. ప్రస్తుతం తన సక్సెస్‌ను ఎంజాయ్ చేయనివ్వండి’’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ గురించి కంగనా ఎలా స్పందిస్తారో చూడాలి -
క్రిష్‌పై కంగనా సోదరి ఫైర్
వివాదాల నడుమ విడుదలైన మణికర్ణిక చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాపై ఇంత హైప్ క్రియెట్ కావడానికి వివాదాలు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. తొలుత ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం మణికర్ణిక వివాదంపై క్రిష్ స్పందించారు. హీరోయిన్ కంగనా రనౌత్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. తన పట్ల ఆమె చాలా దురుసుగా ప్రవర్తించిందని కూడా తెలిపారు క్రిష్. (‘మణికర్ణిక’ వివాదంపై స్పందించిన క్రిష్) అయితే క్రిష్ చేసిన వ్యాఖ్యలపై కంగన సోదరి రంగోలి స్పందించారు. క్రిష్‌ను ఉద్దేశిస్తూ.. ‘డైరెక్టర్‌గారు.. సినిమా మొత్తం మీరే తీశారు. మేం ఒప్పుకుంటా. కానీ తెర మీద మొత్తం కంగనానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విజయాన్ని, ప్రశంసల్ని ఆమె ఆస్వాదిస్తుంది. తనను ఒంటరిగా వదిలేయండి. దయచేసి మీరు ప్రశాంతంగా ఆసీనులుకండం’టూ రంగోలి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. పత్రికలుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా 70 శాతం సినిమాను తానే డైరెక్ట్ చేసినట్లు చెప్పారు. అయితే ఈ విషయాన్ని క్రిష్ ఖండించారు. కంగనా కేవలం 30 శాతం సినిమాను మాత్రమే తెరకెక్కించిందని తెలిపారు. ఒకరు చేసిన పనిని తనదిగా చెప్పుకుంటున్న ఆమెకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదని క్రిష్ వ్యాఖ్యానించారు. తాను తీసిన సన్నివేశాలనే మళ్లీ చిత్రీకరించి ఆమె పేరు వేసుకుందన్నారు. @DirKrish chalo man liya you directed the whole film now please calm down, still Kangana is the leading face of the film let her enjoy this moment of her success and great appreciation, please leave her alone, we all believe you now please take a seat 🙏 https://t.co/rInLkrHreO — Rangoli Chandel (@Rangoli_A) January 28, 2019 -
మణికర్ణిక మూడు రోజుల వసూళ్లు ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాల నడుమ విడుదలైన మణికర్ణిక చిత్రం విమర్శకుల ప్రశంసలతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా సాగుతోంది. తొలిరోజు ఆశించిన వసూళ్లు లేకున్నా మెల్లగా పుంజుకున్న మణికర్ణిక రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో ఝాన్సీ లక్ష్మీభాయిగా ప్రేక్షకులను అలరించడంతో వసూళ్లు జోరందుకున్నాయి. మరోవైపు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన థాకరే బయోపిక్ మహారాష్ట్రలో విజయవంతంగా నడుస్తున్నా థియేటర్ల వద్ద మణికర్ణిక జోరు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఢిల్లీ, ఎన్సీఆర్, యూపీ, పంజాబ్, రాజస్ధాన్‌లలో మణికర్ణిక భారీ వసూళ్లను రాబడుతోందని విడుదలైన మూడు రోజుల్లో హిందీ, తమిళ్, తెలుగు వెర్షన్లు కలిపి భారత్‌లో ఈ సినిమా మొత్తం 42.55 కోట్లను రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో నిర్మించిన మణికర్ణిక దేశవ్యాప్తంగా 3000 స్క్రీన్లపై ప్రదర్శింపబడుతోంది. ఈ మూవీ మున్ముందు బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
కలల రాణి
కన్నుల్లో వెన్నెల కురిపించే పాత్రలు, చూపులతో నిప్పులు రగిలించే పాత్రలు, సూటిగా మాట్లాడే పాత్రలు, సాహసమే శ్వాసగా చేసుకునే పాత్రలు...కంగనా రనౌత్‌ను గుర్తు తెస్తాయి. ‘ఏక్ నిరంజన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ‘మణికర్ణిక’ సినిమాతో శభాష్ అనిపించుకుంటున్న కంగనా అంతరంగ తరంగాలు ఇవి... సెన్స్ ఆఫ్ స్టైల్ నా మూడ్‌ని బట్టి ‘స్టైల్’ గురించి ఆలోచిస్తాను. కొన్నిసార్లు సా«ధారణంగా కనిపించడానికి ఇష్టపడతాను. కొన్నిసార్లు ఇతరుల కంటే భిన్నంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా సెన్స్ ఆఫ్ స్టైల్ అనేది నా మూడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఫ్యాషన్ ఫ్యాషన్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేంత ఆసక్తి లేదు. ప్రపంచమంతా తిరిగి లేటెస్ట్ ట్రెండ్స్‌ను తెలుసుకునేంత టైమ్ లేదు. నేను క్లిష్టమైన పాత్రలు ఎంచుకుంటాను. వాటికి న్యాయం చేయడానికే నా టైమ్ వెచ్చిస్తాను తప్ప ఇతర విషయాల గురించి పెద్దగా పట్టించుకోను. ఆన్లైన్ షాపింగ్ మీద ఆసక్తి లేదు. గౌను, శారీ లుక్‌తో మాత్రమే రెడ్ కార్పెట్ కార్యక్రమాల్లో కనిపించాలనుకోను. జీన్స్, జాకెట్‌తో కూడా వెళుతుంటాను. టైమ్ అంటే టైమే! సమయపాలనకు ప్రాధాన్యత ఇస్తాను. సెట్‌కి ఆలస్యంగా రావడం ఇష్టం ఉండదు. ‘నేను ప్రత్యేకం’ అనే భావనను దగ్గరకు రానివ్వను. అది వస్తే ‘నేను ఏది చేసినా కరెక్టే’ అనే అతివిశ్వాసం పెరిగిపోతుంది. పాత్రల ఎంపిక విషయానికి వస్తే... ‘ఇలాంటి పాత్రలే చేస్తాను’ అని మడిగట్టుకొని కూర్చోను. ఉదాహరణకు... ‘క్రిష్–3’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర(కెయా)లో నటించాను. అది నెగటివ్ క్యారెక్టరే అయినప్పటికీ అందం, ఆవేశం, అతీతశక్తులు మూర్తీభవించిన పాత్ర. కాబట్టి ఇలాంటి పాత్రలు చేయడానికి నాకు ఇబ్బంది లేదు. ఏడ్చాను! సినిమాల్లోకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన...‘గ్యాంగ్‌స్టర్’ సినిమాలో నటించిన తరువాత ఒక ఫిల్మ్మ్యాగజైన్ వాళ్లు కవర్‌పై నా ఫొటో అడిగారు. ‘‘ఎన్ని డబ్బులు ఇస్తారు?’’ అని అడిగాను. అంతే... అడిగిన జర్నలిస్ట్ బిగ్గరగా నవ్వాడు. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఆరోజు రాత్రి ఏడ్చాను. మ్యాగజైన్ షూట్, ఇంటర్వ్యూలకు డబ్బులు ఇస్తారని చెప్పిన జ్ఞాపకం ఉండటంతో అలా అడిగాను. నా తప్పేమిటో అర్థం కాలేద. -
‘మణికర్ణిక’ వివాదంపై స్పందించిన క్రిష్
‘మణికర్ణిక’ సినిమా నుంచి తప్పుకోవడంపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఎట్టకేలకు స్పందించారు. హీరోయిన్ కంగనా రనౌత్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించిందని చెప్పారు. ఆమె ప్రవర్తన ఎప్పుడూ ఇలాగే ఉంటుందని ‘సౌత్ బాయ్’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. (బడ్జెట్ 125 కోట్లు.. ఫస్ట్ కలెక్షన్..?) ‘మణికర్ణికలో నేను తెరకెక్కించిన సన్నివేశాలు నిర్మాతకు నచ్చలేదని, భోజ్‌పురి సినిమాలా ఉందని కంగనా నాకు ఫోన్ చేసి చెప్పింది. నేనేమీ మాట్లడకుండా నవ్వాను. నా సినిమాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ఇంతకుముందే తెలుసు. నేను ఎంత చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. నాతో ఫోన్లో చాలా దురుసుగా మాట్లాడింద’ని క్రిష్ తెలిపారు. దాదాపు సినిమా అంతా తానే తెరకెక్కించానని చెప్పారు. దర్శకత్వంలో తన కంటే కంగనా పేరు ప్రముఖంగా వేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒకరు చేసిన పనిని తనదిగా చెప్పుకుంటున్న ఆమెకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తాను తీసిన సన్నివేశాలనే మళ్లీ చిత్రీకరించి ఆమె పేరు వేసుకుందని తెలిపారు. ‘ఫస్టాఫ్‌లో 20-25 శాతం, సెకండాఫ్‌లో 10-15 శాతం వరకు కంగనా తెరకెక్కించారు. ఆమె ఎంట్రీ సీన్, పాట నేను చిత్రీకరించలేదు. సెకండాఫ్‌లో నేను తీసిన చాలా సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేశారు. అతుల్ కులకర్ణి, ప్రజాక్తమాలి పాత్రలను కూడా కుదిరించారు. సోనూ సూద్ పాత్రను మార్చమనడంతో కంగనాతో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఇంటర్వెల్‌కు ముందు సోనూ పాత్ర చనిపోవాలని ఆమె పట్టుబట్టింది. దానికి నేను ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. సహ-నిర్మాత కమల్ జైన్ కూడా ఆమె వైపు నిలిచాడు. తర్వాత నేను నిర్మాణ సంస్థ జీ-స్టూడియోస్‌తో మాట్లాడటం మానేశాను. ఒకసారి కంగనా నాకు ఫోన్ చేసింది. తనను డైరెక్షన్ చేయమని నిర్మాతలు కోరుతున్నారని చెప్పింది. తర్వాత కమల్ జైన్ ఫోన్ చేసి ముంబైకి రమ్మన్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ కంగనా ఉంది. సినిమాలో చిన్నచిన్న మార్పులు చేయాలని, అవన్నీ తాను చూసుకుంటానని చెప్పడంతో నేను హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సోనూ సూద్ నాకు ఫోన్ చేశాడు. ఇంటర్నెల్‌లోనే నీ పాత్ర ముగించమన్నారు. అలాయితే నేను తప్పుకుంటానని నిర్మాతతో చెప్పాను. కంగనా డైరెక్షన్ చేస్తుందని కమల్ జైన్ నుంచి సమాధానం వచ్చిందని సోనూతో చెప్పాను. నేను కొనసాగకపోతే తాను కూడా తప్పుకుంటానని నాతో చెప్పాడు. కంగనా దర్శకత్వంలో నటించడానికి ఇష్టంలేక అతడు సినిమా నుంచి బయటకెళ్లిపోయాడని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు. 100 నిమిషాలు ఉండాల్సిన అతడి పాత్రను 60 నిమిషాలకు కుదించారు. అతడి పాత్రను మార్చకుండా ఉండివుంటే అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తయ్యేది. సినిమాలో నా పేరు ఎక్కడో మూలన పడేశారు. నాకు ఇవ్వాల్సిన పారితోషికంలో 30 మాత్రమే ఇచ్చారు. ఏదోక రోజు మిగతా బాలెన్స్ వస్తుంద’ని క్రిష్ వివరించారు. అయితే 30 శాతం మాత్రమే క్రిష్ తీశారని, మిగతా సినిమా అంతానే తెరకెక్కించానని ‘ముంబై మిర్రర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ చెప్పుకోవడం విశేషం. మునిగిపోతున్న నావను కాపాడటానికి తాను ప్రయత్నించానని ఆమె చేసిన వ్యాఖ్యలపై క్రిష్ స్పందిస్తూ.. ‘ఓరి దేవుడా’ అంటూ తలపట్టుకున్నారు. -
కంగనా ఓ గొప్ప హీరో : వర్మ
సాక్షి, హైదరాబాద్ : యాక్షన్ హీరోలందరూ నటీమణులుగా కనిపిస్తున్న ఈ తరుణంలో, ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా తెరపై ఓ గొప్ప హీరోను చూశానని కంగనారనౌత్‌ను రామ్‌గోపాల్ వర్మ పొగడ్తలతో ముంచెత్తారు. మణికర్ణికలో కంగనా అద్భుతమైన నటనతో తనను ఎక్కడికో తీసుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఇలాంటి ఉగ్రరూపాన్ని చివరిసారిగా ఎంటర్‌ది న్యూడ్రాగన్ చిత్రంలో బ్రూస్లీలో చూశానని ట్విట్టర్లో పేర్కొన్నారు. క్రిష్ జాగర్లమూడితో కలిసి కంగనా రౌనత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ రచనా సహకారం అందించారు. అతుల్ కులకర్ణి, డానీ డెంజొప్ప, జిషు సేన్‌గుప్తా, రిచర్డ్ కీప్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. -
బడ్జెట్ 125 కోట్లు.. ఫస్ట్ కలెక్షన్..?
ముంబై: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘మణికర్ణిక’ సినిమా మొదటి రోజు సాధారణ వసూళ్లు మాత్రమే సాధించింది. దేశవ్యాప్తంగా తొలిరోజు కేవలం రూ.8.75 కోట్లు రాబట్టింది. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఈ సినిమాకు విమ్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారనే దానిపై వసూళ్లు ఆధారపడనున్నాయి. వారాంతంలో వసూళ్లు పెరిగే అవకశాముందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడితో కలిసి కంగనా రనౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయేంద్ర ప్రసాద్ రచనా సహకారం అందించారు. అతుల్ కులకర్ణి, డానీ డెంజొప్ప, జిషు సేన్‌గుప్తా, రిచర్డ్ కీప్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. (‘మణికర్ణిక’ మూవీ రివ్యూ) -
‘మణికర్ణిక’ మూవీ రివ్యూ
టైటిల్ : మణికర్ణిక జానర్ : హిస్టారికల్ మూవీ తారాగణం : కంగానా రనౌత్, అతుల్ కులకర్ణి, డానీ డెంజొప్ప, జిషు సేన్‌గుప్తా, రిచర్డ్ కీప్ సంగీతం : శంకర్ ఇషాన్ లాయ్ దర్శకత్వం : క్రిష్, కంగనా రనౌత్ నిర్మాత : కమల్ జైన్, నిశాంత్ పిట్టి, జీ స్టూడియోస్ ప్రస్తుతం అన్ని భాషల్లో బయోగ్రాఫికల్ సినిమాల సీజన్ నడుస్తోంది. కొందరు సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రీడా కారుల జీవితాలను తెరకెక్కిస్తుంటే మరికొందరు దర్శక నిర్మాతలు చారిత్రక పాత్రలను తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ హిస్టారికల్ మూవీ మణికర్ణిక. ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమాకు చాలా భాగం క్రిష్ దర్శకత్వం వహించటం, తరువాత దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న కంగనా రనౌత్ కథా కథనాలతో పాటు నటీనటులను కూడా మార్చటం వివాదాస్పదంగా మారింది. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించిటంతో టాలీవుడ్‌లోనూ మణికర్ణికపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. మరి ఆ అంచనాలు మణికర్ణిక అందుకుందా..? చారిత్రక పాత్రలో కంగనా ఏ మేరకు మెప్పించింది..? దర్శకురాలిగానూ కంగనా విజయం సాధించిందా..? కథ : భారతీయులకు చాలా బాగా తెలిసిన కథే ఝాన్సీ లక్ష్మీబాయి. అదే కథను సినిమాటిక్ ఫార్మాట్లో చెప్పే ప్రయత్నం చేశారు మణికర్ణిక యూనిట్. బితూర్‌లో పుట్టిన మణికర్ణిక (కంగనా రనౌత్) ఝాన్సీ రాజు గంగాధర్ రావు(జిషు సేన్‌గుప్తా) ను వివాహం చేసుకుంటుంది. పెళ్లి తరువాత మణికర్ణిక పేరును లక్ష్మీబాయిగా మారుస్తారు. లక్ష్మీ బాయి మహారాణిగా మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఈస్ట్ఇండియా కంపెనీ తన పరిధిని విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అదే సమయంలో లక్ష్మీబాయి జీవితంలోనూ కల్లోలం మొదలువుతుంది. భర్త మరణించటంతో కొంతమంది నమ్మకస్తుల సాయంతో రాజ్యాధికారాన్ని లక్ష్మీబాయి తీసుకుంటుంది. ఝాన్సీ రాణిగా మారిన లక్ష్మీబాయి ఆంగ్లేయులను ఎలా ఎదిరించింది..? ఎలాంటి ధైర్య సాహసాలను ప్రదర్శించింది..? చివరకు ఏమయ్యింది..? అన్నదే మిగత కథ. నటీనటులు : సినిమా అంతా లక్ష్మీబాయి చుట్టూనే తిరిగటంతో ఇతర పాత్రలకు పెద్దగా గుర్తింపు వచ్చే అవకాశమే లేదు. కంగనా కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకుడిని చూపు తిప్పుకోకుండా చేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. మణికర్ణికగా ఆనందంగా కాలం గడిపే అమ్మాయి నుంచి రాజ్య భారం మోసే రాణిగా హుందాగా కనిపించే వరకు ఎన్నో కోణాలను తెర మీద ఆవిష్కరించింది. రణరంగంలో వీరనారిగా కత్తి దూసే సన్నివేశాల్లో కంగనా నటవిశ్వరూపం చూపించింది. కీలక పాత్రల్లో నటించిన అతుల్ కులకర్ణి, జిషు సేన్‌గుప్తా, డానీ డెంజొప్ప, అంకితా లోఖండే బ్రిటీష్ పాలకుడిగా రిచర్డ్ కీప్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించిన దర్శకుడు అసలు కథను మొదలు పెట్టడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నాడు. దాదాపు ఫస్ట్ అంతా మణికర్ణిక పాత్రను ఎలివేట్ చేసేందుకు, ఆమెను స్వతంత్రభావాలు ఉన్న.. భయం లేని మహిళగా చూపించేందుకు కేటాయించారు. లక్ష్మీ బాయి ఝాన్సీ బాధ్యతలు తీసుకున్న తరువాత కథనం కాస్త స్పీడందుకున్న భావన కలిగినా.. భారీ డైలాగులు, పాటలు కథనానికి అడ్డుపడుతుంటాయి. గ్రాఫిక్స్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు. కొన్ని సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. పోరాట సన్నివేశాలు సహజంగా ఉన్నాయి. క్లైమాక్స్ సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి సినిమాకు ప్రధాన బలం. అప్పటి పరిస్థితులను వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. సంగీత త్రయం శంకర్ ఇసాన్ లాయ్‌లు నిరాశపరిచారనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్యం సంగీతంతో కూడా మెప్పించలేకపోయారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కంగనా రనౌత్ పోరాట సన్నివేశాలు మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ సంగీతం -
నటి కంగనా రనౌత్ ఇంటి వద్ద భద్రత
సాక్షి, ముంబై : మణికర్ణిక మూవీ విడుదల నేపథ్యంలో ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయిగా టైటిల్ రోల్ పోషించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయిను అగౌరవపరిచేలా సన్నివేశాలున్నాయంటూ హిందూ కర్ణిసేన ఆందోళనలకు దిగడంతో ముందు జాగ్రత్త చర్యగా కంగనా నివాసం ఎదుట పోలీసు బలగాలను నియోగించారు. కాగా,బ్రిటిష్ అధికారితో లక్ష్మీభాయ్‌కు సంబంధం ఉందనే రీతిలో ఈ సినిమాలో సన్నివేశాలు ఉండటం పట్ల కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ను కించపరిచేలా ఏ ఒక్క సీన్ ఉన్నా హిందూ సమాజం కంగనాను క్షమించబోదనిన. ఆమె తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని కర్ణిసేన హెచ్చరించింది. తమను కంగనా బెదిరించడం ఇలాగే కొనసాగిస్తే ఆమెను తాము స్వేచ్ఛగా మహారాష్ట్రలో తిరగనివ్వబోమని, ఆమె మూవీ సెట్స్‌ను తగులబెడతామని మహారాష్ట్ర కర్ణిసేన అధ్యక్షుడు అజయ్ సింగ్ సెంగార్ హెచ్చరించారు. -
మణికర్ణికకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై : వివాదాల్లో కూరుకుపోయిన మణికర్ణిక మూవీ టీమ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సమయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిత్ర నిర్మాత కమల్ జైన్ పక్షవాతానికి గురై ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో చేరేందుకు ఇది కచ్చితంగా సరైన సమయం కాదు..త్వరలోనే కోలుకుని చిత్ర విజయానికి మన సమిష్టి కృషిని గుర్తుచేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందామని అంతకుముందు జైన్ ట్వీట్ చేశారు. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించడంతో పాటు కొంత భాగానికి దర్శకత్వం వహించారు. కాగా జనవరి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సినిమాలో కొన్ని సన్నివేశాలపై హిందూ కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
‘ఆ వార్తలకు.. మాకు సంబంధం లేదు’
మణికర్ణిక చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ వస్తున్న వార్తలకు, తమకు సంబంధం లేదంటున్నారు రాజ్‌పుత్ కర్ణిసేన సభ్యులు. ఝాన్సీ లక్ష్మీబాయ్ బయోపిక్‌గా తెరకెక్కిన మణికర్ణికలో కొన్ని సన్నివేశాలపై హిందూ సంస్థ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై కర్ణిసేన సభ్యులు స్పందించారు. మనికర్ణిక సినిమాను తాము అడ్డుకోబోవడం లేదని స్పష్టం చేశారు కర్ణిసేన సభ్యుడు హిమాన్షు. ఈ సినిమా పట్ల తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. కర్ణిసేన పేరును కొందరు స్వంత ప్రయోజనాలకు వాడుతున్నారన్నారు. ఇలాంటి పనికి మాలిన చర్యల ద్వారా.. కర్ణిసేన పేరును, దాని చరిత్రను చెడగొడుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా కర్ణిసేన అభ్యంతరాల పట్ల కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజ్పుత్నేనంటూ.. అనవసరంగా తనను రెచ్చగొట్టవద్దంటూ హెచ్చరించారు. అయితే గతంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన పద్మావత్‌ను కూడా కర్ణిసేన వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలైన పద్మావత్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. -
వాళ్ల అంతు చూస్తా
‘మణికర్ణిక’ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఓ వివాదం నడుస్తోంది. దర్శకులు మారడం.. నటుడు సోనూసూద్ తప్పుకోవడం.. తాజాగా సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ను తప్పుగా చిత్రీకరించారంటూ కర్ణిసేన నిరసన తెలియజేస్తున్నారు. ఈ విషయంపై కంగనా రనౌత్ స్పందిస్తూ– ‘‘మా సినిమాను నలుగురు చరిత్రకారులు చూసి సర్టిఫై చేశారు. సెన్సార్ బృందం కూడా చూసింది. కర్ణిసేనకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. ఇంకా మా సినిమా మీద అనవసరమైన వివాదాన్ని సృష్టిస్తున్నారు వాళ్లు. ఆ పనులు ఆపకపోతే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నేనూ రాజ్‌పుత్‌నే.. వాళ్ల అంతు చూస్తాను’’ అని ఘాటుగా పేర్కొన్నారు. -
నేనూ రాజ్‌పుత్‌నే..
సాక్షి, ముంబై : ఝాన్సీ లక్ష్మీబాయ్ బయోపిక్‌గా తెరకెక్కిన మణికర్ణికను వివాదాలు వెంటాడుతున్నాయి. మణికర్ణికలో కొన్ని సన్నివేశాలపై హిందూ సంస్థ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఝాన్సీ లక్ష్మీభాయ్‌కు ఓ బ్రిటిష్ అధికారితో సంబంధం ఉన్నట్టు చూపే సన్నివేశంతో పాటు ఆమె నృత్యం చేసే సన్నివేశం పట్ల కర్ణిసేన ఆక్షేపిస్తోంది. కాగా, ఈ సినిమాలో టైటిల్ పాత్రలో నటించడంతో పాటు కొద్ది భాగానికి దర్శకత్వ బాధ్యతలూ చేపట్టిన కంగనా రనౌత్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మణికర్ణికపై వరుస వివాదాలు ముసురుకోవడం పట్ల ఆమె భగ్గుమన్నారు. ఈ సినిమాను నలుగురు చరిత్రకారులు చూసి ధ్రువీకరించారని, తాము సెన్సార్ సర్టిఫికెట్‌ను కూడా పొందామని కంగనా చెప్పుకొచ్చారు.ఈ దశలో సినిమాపై కర్ణిసేన అభ్యంతరంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణిసేనకు పరిస్థితిని తాము వివరించినా వారు తనను వేధించడం కొనసాగిస్తున్నారని, దీన్ని వారు విరమించకపోతే తానూ రాజ్‌పుత్‌నే అన్న విషయం వారు గుర్తెరగాలని, వారెవరినీ తాను విడిచిపెట్టనని హెచ్చరించారు. మణికర్ణిక మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రాష్ట్రపతి కోసం ‘మణికర్ణిక’ స్పెషల్ షో
వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం మణికర్ణిక. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంత భాగం కంగనా కూడా దర్శకత్వం వహించారు. అనేక వివాదాలు, మరెన్నో వాయిదాల తరువాత షూటింగ్ పూర్తి చేసుకున్న మణికర్ణిక ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌తోపాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కథగా తెరకెక్కుతున్న ఈసినిమాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీక్షించనున్నారు. ఆయన కోసం ఈ నెల 18న సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్రయూనిట్. ఈ ప్రదర్శనకు కంగనాతో పాటు చిత్రయూనిట్ అంతా హాజరు కానుంది. అయితే టీంతో పాటు దర్శకుడు క్రిష్ హాజరవుతారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. మణికర్ణిక సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. Shri Ram Nath Kovind, President of India, will watch a special screening of #Manikarnika: The Queen Of Jhansi in New Delhi tomorrow [18 Jan]... Kangana Ranaut and the team will be present... Screening organised by Zee Entertainment... #Manikarnika releases on 25 Jan 2019. pic.twitter.com/axuA0waqhb — taran adarsh (@taran_adarsh) 17 January 2019 -
ఝాన్సీ రాణి టైలర్
రెండు దశాబ్దాలుగా చారిత్రక చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు నీతా లుల్లా! ఖుదా గవా, చాందినీ, లమ్హే, దేవ్‌దాస్, జోధా అక్బర్.. ఇంకా ఎన్నో సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకున్నారు నీతా. 2016లో అషుతోష్ తీసిన ‘మొహెంజదారో’ చిత్రం తరవాత ఇప్పుడు ‘మణికర్ణిక’ చిత్రంలో ఝాన్సీరాణిగా నటిస్తున్న కంగనా రనౌత్‌కి డిజైనర్‌గా పని^ ó శారు. నీతా రూపొందించిన దుస్తులలో కంగనా ఝాన్సీరాణిలాగ ఎంతో సాహసోపేతంగా కనిపించడం ఇప్పటికే ట్రైలర్లలో, టీజర్లలో మీరు చూసే ఉంటారు. జనవరి 25న విడుదల కానున్న ఈ చిత్రానికి కంగనే డైరెక్టర్. నీతా తన టీమ్‌తో కలిసి ఝాన్సీరాణి వస్త్రాల మీద బాగా పరిశోధన చేశారు. నాలుగు మాసాల పాటు తయారు చేసిన వస్త్రాలు రాణి పాత్రకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని పరీక్షించారు. ‘‘అంతకు ముందే ఈ అంశం మీద చిత్రాలు తీద్దామనుకున్న కొందరు వ్యక్తులు నన్ను కలిశారు. అందువల్ల ఈ చిత్రం తీసే నాటికి నాకు ఈ పాత్రకు తగ్గ ఆహార్యం మీద అవగాహన కలిగింది. మణికర్ణిక కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఫ్రెష్ మైండ్‌తో పని ప్రారంభించాను’’ అంటారు నీతా లుల్లా. గ్రంథాలయాలు, మ్యూజియమ్లు గాలించి, మణికర్ణిక వస్త్రాలకు సంబంధించిన సమాచారం సేకరించారు నీతా. అంత లోతుగా పరిశీలించడం వల్ల ఝాన్సీలక్ష్మీబాయిని ఎంత శక్తిమంతంగా చూపాలో నీతాకి అర్థమైంది. ఎక్కడెక్కడివో పెయింటింగ్స్, ఇలస్ట్రేషన్స్, ఫ్యాబ్రిక్ శాంపుల్స్ కూడ పరిశీలించారు. దానితో రాజరికాన్ని ఏ విధంగా ప్రతిబింబించాలో తెలుసుకున్నారు. సందర్భానికో వస్త్రధారణ ‘‘యుద్ధవీరురాలికి వస్త్రాలు తయారు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ బాయి వేసిన రకరకాల వేషాలకు సంబంధించిన వస్త్రాలను డ్రామా కంపెనీల దగ్గరకు వెళ్లి తెలుసుకున్నాను. లక్ష్మీబాయి లేదా మణికర్ణిక.. యవ్వనంలో ఉండగా ఆమెను ఒక యోధురాలిగా, పెళ్లికూతురిగా, రాణిగా, విధవరాలిగా చూపాలి. చివరగా ఆమెను ఒక విప్లవ నాయకురాలిగా చూపాలి. ప్రతి దశలోను రకరకాల రంగులను ఉపయోగించాను. తొమ్మిది గజాల ఎమరాల్డ్ గ్రీన్ చీరలో రనౌత్‌ను చూస్తుంటే పోరాటయోధురాలు ఝాన్సీలక్ష్మీబాయి కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఆకుపచ్చ రంగు సిరిసంపదలకు, విశాల హృదయానికి ప్రతీక’’ అంటారు నీతా. కంగన కూడా ఆ వస్త్రాలకు దీటైన నటన కోసం శ్రమించారు. ‘‘ఈ పాత్రకు సంబంధించి రకరకాల భావాలు ప్రదర్శించడం చాలా కష్టంగా ఉందని, కాని ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నానని కంగనా అనేవారని’’ చెబుతున్నారు నీతా. యుద్ధంలో అంగ్రఖా కుర్తా రాచరికం ప్రతిబింబించేలా హ్యాండ్‌స్పన్ ఫ్యాబ్రిక్, ఖాదీ వస్త్రాల మీద సహజ రంగులతో డిజైన్ చేశారు నీతా. రాణిగా లక్ష్మీబాయి పాత్రకు రిచ్ రెడ్ కలర్, ఆరెంజ్, గ్రీన్ రంగులను ఉపయోగించారు. ఆమెలోని విషాదాన్ని చూపడానికి లేత రంగులను ఉపయోగించారు. యుద్ధరంగంలో ఉన్న సమయంలో రనౌత్ ‘అంగ్రఖా కుర్తా’ వేసుకున్నారు. మరాఠా వీరులకు సంబంధించిన బొమ్మలను, తెల్లటి వస్త్రాల మీద బంగారు, ఎరుపు రంగులలో చిత్రించారు. కవచాన్ని లెదర్‌తో రూపొందించారు. అది కూడా చేతితో చేయించారు. కాస్ట్యూమ్స్ కోసం నీతా ఇంత కృషి చేసిన విధంగానే నగల ఎంపికకు మరో విభాగం పెద్ద అధ్యయనమే చేసింది. మణికర్ణిక మరాఠా మహారాణి కావడంతో వివాహానికి ముందు ధరించే నగల విషయంలో ప్రత్యేకత చూపారు. ముక్కుకి నత్తు, కంఠానికి తుషీ చోకర్ తయారుచేశారు. వివాహం అయ్యాక ఆవిడ కుందన్స్, ముత్యాలు ధరించేలా నగలు తయారుచేశారు. పెద్ద పాపిడి బిళ్ల, చేతులకు కంకణాలు, నెక్లేస్.. ఉపయోగించారు. వీటన్నిటినీ త్వరలోనే మనం తెర మీద కళ్లారా చూడొచ్చు. – జయంతి ఇంతలా ఎప్పుడూ శ్రమించలేదు నేను 12 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. నాకు చరిత్ర గురించి అస్సలు తెలియదు. సంప్రదాయ చదువుల పట్ల నాకు ఆసక్తి లేదు. ఇప్పటికి 100 కు పైగా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశాను. నిరంతరం ఏదో ఒకటి కొత్తగా చే యడం మీద నాకు ఆసక్తి ఎక్కువ. మణికర్ణికలో నేను రనౌత్‌కి చేసిన కాస్ట్యూమ్స్‌కి ఎప్పుడూ లేనంతగా శ్రమించాన. ఆమె శిరస్సు కోసం చేసిన అలంకారాలు, రనౌత్‌కు కొత్త అందాలు తీసుకువచ్చాయి. ఆవిడ జీవితంలో ఆ మేకప్ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. – నీతా లుల్లా -
చెన్నైలో సందడి చేసిన కంగనా
బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ శుక్రవారం చెన్నైలో సందడి చేసింది. ఈ బ్యూటీ నటించిన మణికర్ణిక చిత్రం ఈ నెల 25న తెరపైకి రానుంది. ఝాన్సీరాణి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణతో కలిసి నటి కంగనారనౌత్ దర్శకత్వం వహించడం విశేషం. కథను తెలుగు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ అందించారు. మణికర్ణిక చిత్రాన్ని హిందీ తోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అనువదించి విడుదల చేయనున్నారు. జీ.స్టూడియోస్ సంస్థతో కలిసి కమల్ జైన్ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్ర తమిళ వెర్షన్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలోని సత్యం సినీ థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కమల్‌జైన్‌తో పాటు నటి కంగనారనౌత్ పాల్గొన్నారు. కంగనారనౌత్ మాట్లాడుతూ దేశానికి సంబంధించిన కథలో నటించలేదే అని 12 ఏళ్లుగా బాధపడుతున్నానంది. దేశ సినీపరిశ్రమలోనే ప్రముఖులైన విజయేంద్రప్రసాద్, డేనీ డెంజొప్ప, అతుల్ కులకర్ణి వంటి వారితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు నా బరువు 50 చాలా తక్కువని. సన్నగా ఉండడంతో యాక్షన్ సన్నివేశాల్లో నటించేటప్పుడు తన ఆంగీకం నప్పలేదని స్టంట్ దర్శకుడు కూడా చెప్పారని అంది. అదేవిధంగా రోజూ 10 నుంచి 12 గంటల వరకూ యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సిన పరిస్థితి అని చెప్పింది. అలా చాలా శ్రమపడి ఈ చిత్ర యాక్షన్ సన్నివేశాల్లో నటించానని చెప్పింది. ఆ తరువాతనే తాను ఈ చిత్రంలోని డ్రామా సన్నివేశాలకు దర్శకత్వం వహించానని తెలిపింది. అప్పుడు తాను చాలా సమయాన్ని రచయితతో గడిపానని చెప్పింది. అది దర్శకత్వం వహించడానికి చాలా దోహదపడిందని అంది. అయితే తాను నటించాల్సిన సన్నివేశాల చిత్రీకరణకు చాలా సవాల్ అనిపించిందని పేర్కొంది. రాణి లక్ష్మీబాయ్ పాత్రలో నటించడం సాధారణ విషయం కాదని ఈ పాత్రలో నటించడానికి తనకు చాలా నమ్మకం, అంకితభావం అవసరమైందని అంది. -
క్రిష్ అందుకే తప్పుకున్నారు : కంగనా
చిన్నప్పుడు తమ్ముడికి ఆడుకునే గన్ను తనకు బొమ్మ కొనిచ్చినప్పుడు ‘నేనెందుకు గన్నుతో ఆడుకోకూడదు. ఎందుకీ వివక్ష’.. ప్రశ్నించింది కంగనా రనౌత్. స్త్రీ ఎందులోనూ తక్కువ కాదని చిన్ని మనసులో నాటుకుపోయింది. పెరిగే కొద్దీ ఆ భావన పెరిగి పెద్దదైంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎలాంటి బ్యాగ్రౌండూ లేకుండా బాలీవుడ్‌కి వచ్చి స్టార్ అయింది. ‘తను వెడ్స్ మను, రజ్జో, క్వీన్’ చిత్రాలతో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు ‘మణికర్ణిక: ఝాన్సీ రాణి’గా రాబోతోంది. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసిన సందర్భంగా కంగనా ఇంటర్వ్యూ.. ► స్క్రిప్ట్ దశ నుంచి షూటింగ్లో, ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయిన నేపథ్యంలో సాగిన ‘మణికర్ణిక’ ప్రయాణం మీకెలా అనిపించింది? చాలా దశలు చూశాను. విజయేంద్రప్రసాద్గారైతే ఆ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఎన్నో పరీక్షలు ఎదుర్కొంది. ఇప్పుడు ఈ సినిమా కూడా నిన్ను చాలా పరీక్షలు పెడుతోందన్నారు. అది నిజమే. ఈ చిత్రం షూటింగ్లో గాయపడ్డాను. ఆ తర్వాత అనుకోకుండా డైరెక్టర్‌గా మారాల్సి వచ్చింది. సినిమాల్లో యుద్ధ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ప్రతి పరీక్షను దాటుకుంటూ వచ్చాను. ► కథ విన్నాక ఈ సినిమా కోసం మీరు ఏమేం నేర్చుకున్నారు? కత్తి సాము నేర్చుకున్నాను. ఒకే కరవాలంతో కాదు.. కొన్ని సన్నివేశాల్లో రెండు కత్తులు దూస్తాను. దానికోసం చాలా ప్రాక్టీస్ చేశాను. కత్తిసాము, గురప్రు స్వారీలో పర్ఫెక్షన్ తీసుకురావడానికి రెండు నెలలు కష్టపడ్డాను. ఝాన్సీ లక్ష్మీ బాయ్ శక్తివంతమైన స్త్రీ. నేను కూడా చూడ్డానికి అంతే పవర్‌ఫుల్‌గా కనిపించాలి. అందుకు తగ్గట్టుగా నా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను. ‘బాహుబలి’ తర్వాత వస్తున్న మంచి పీరియాడికల్ మూవీ ‘మణికర్ణిక’. ఫస్ట్ ఉమెన్ యాక్షన్ మూవీ. అందుకే రాజీపడలేదు. ► లక్ష్మీ బాయ్ వీర వనిత. బ్యాగ్రౌండ్ లేని స్థాయి నుంచి స్టార్‌గా ఎదిగే క్రమంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మహిళలందరూ ధైర్యంగా ఉండాలి కదా? కచ్చితంగా ఉండాలి. రాణీ లక్ష్మీ బాయ్‌లాంటి వాళ్లను సమాజం తయారు చేయడానికి ముందుకొస్తే కాదనేవారు ఎవరుంటారు? అయితే నువ్వు ధైర్యంగా ఉండాలి అని ఎవర్నీ ఒత్తిడి చేయకూడదు. ధైర్యవంతులను నిరుత్సాహపరచకూడదు. ► ఓకే.. ‘మణికర్ణిక’ని పూర్తి చేయడానికి డైరెక్షన్ సీట్లోకి రావాలన్నది మీ ఆలోచనా? అసలు ఏం జరిగింది? క్రిష్‌గారు ఓ తెలుగు సినిమా ఒప్పుకోవడం వల్ల ‘మణికర్ణిక’ వాయిదా పడే పరిస్థితి వచ్చింది. మేం ఎలాగైనా జనవరిలోనే విడుదల చేయాలనుకున్నాం. దాంతో నిర్మాత కమల్ జైన్, రచయిత విజయేంద్రప్రసాద్‌గారు నన్నే డైరెక్షన్ చేయమన్నారు. అయితే ఇది ఈజీ మూవీ కాదు. ఒక చరిత్ర. అందుకే వేరే ఇద్దరు డైరెక్టర్లు పెట్టమన్నాను. అలా చేసినా సింక్ అవ్వలేదు. ఫైనల్లీ నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే అప్పటికే క్రిష్ చేసి ఉండటంతో మిగతా నాకు కొంచెం సులువు అయింది. ► క్రిష్ అలా తప్పుకోవడం కరెక్టేనంటారా? పైగా ‘మణికర్ణిక’ గురించి ఆయన ఎక్కడా మాట్లాడటంలేదు కూడా? ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు కాబట్టే తప్పుకున్నారు. వాయిదా వేయడానికి ఇష్టం లేక మేం పూర్తి చేశాం. ఇక ఈ సినిమా గురించి ఆయన ఎందుకు మాట్లాడటంలేదు అంటే.. ఆయన చేస్తున్న ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టి ఉంటారు. ► మీరు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంవల్లే.. ఒక లేడీ డైరెక్టర్‌తో చేయడంతో ఇష్టం లేక సోనూ సూద్ తప్పుకున్నారట. కానీ ఆయనేమో గెటప్‌లో వచ్చిన మార్పు వల్లే అంటున్నారు? గెటప్ మారినది నిజమే. సోనూ సూద్ ‘సింబా’ సినిమా ఒప్పుకున్నారు. ఆ సినిమా గెటప్‌కీ, దీనికీ సింక్ అవ్వదు. ఇందులో గడ్డం ఉండాలి. కానీ గడ్డం పెంచలేనంటూ తప్పుకున్నారు. అయినా ఇవాళా రేపూ గడ్డం గెటప్ అంటే పెంచాల్సిన అవసరమే లేదు. కావాలంటే పెట్టుడు గడ్డంతో మ్యానేజ్ చేయొచ్చు. కానీ సోనూ సూద్ తప్పుకున్నారు. అయినా ఓకే. ► మరో సినిమాకి దర్శకత్వం వహించాలని అనుకుంటున్నారట? అవును. ఆ సినిమాకి విజయేంద్రప్రసాద్‌గారే కథ అందిస్తున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇది ఏలియన్స్‌కి సంబంధించిన కథ కాదు. -
‘మణికర్ణిక’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది!
ఎన్నో వివాదాలు, మరెన్నో వాయిదాలు మొత్తానికి విడుదలకు సిద్దంగా ఉంది మణికర్ణిక. బ్రిటీష్ వారితో యుద్దం చేయడానికి ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత కష్టపడిందో.. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి కంగనా రనౌత్ కూడా అంతే కష్టపడ్డారు. మణికర్ణిక తెలుగు ట్రైలర్‌ను ఇటీవలె విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ ట్రైలర్లో దేశభక్తిని రేకెత్తించేలా ప్రతీ సన్నివేశాన్ని చిత్రీకరించారు. మనం పోరాడుదాం..మన భావితరాలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాయి.. మీ పోరాటం రేపటి గురించి నేటి కోసం కాదు వంటి సంభాషణలు కూడా అంతే పదునుతో ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్లో కంగనా విజృంభించారు. పోరాట సన్నివేశాల్లో కూడా కంగనా తన దూకుడును ప్రదర్శించారు. ఈ చిత్రానికి క్రిష్, కంగనా రనౌత్‌లు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హల్వా కావాలా బాబూ!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఎక్కవమంది బాలీవుడ్ స్టార్స్ విదేశాలకు వెళ్లి మస్త్ మజా చేస్తే కంగనా రనౌత్ మాత్రం సొంతింట్లోనే వేడుక చేసుకున్నారు. గతేడాది కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఓ ఇల్లు కొనుక్కున్నారు. న్యూ ఇయర్‌కు ముందు రోజు కిచెన్‌లోకి వెళ్లి ఆమె గరిటె తిప్పి హల్వా ప్రిపేర్ చేశారు. కంగనా వంట చేస్తున్న ఫొటోను ఆమె సోదరి రంగోలి షేర్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. హల్వా కావాలా బాబు? అని అడిగేలా ఉంది కదా కంగనా స్మైల్. మరి.. టేస్ట్ ఎలా ఉందనే విషయం మైకుల ముందుకు వచ్చినప్పుడు కంగనానే అడిగి తెలుసుకుందాం. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేసిన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె అశ్వనీ అయ్యర్ తివారి దర్శకత్వంలో ‘పంగా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వీయదర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీని తెరకెక్కించాలని కంగనా అనుకుంటున్నారట. -
డైరెక్టర్ కంగనా
‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’.. కంగనా రనౌత్ నెక్ట్స్ రిలీజ్ ఇదే. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ‘పంగా’ అనే సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా నటించనున్నారు కంగనా రనౌత్. అశ్వనీ అయ్యర్ దర్శకురాలు. మరి.. ఆ తర్వాత కంగనా సినిమా ఏంటి? అంటే ఓ లవ్‌స్టోరీ అని బాలీవుడ్ తాజా టాక్. ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి విభిన్నమైన లవ్‌స్టోరీతో ఈ చిత్రం రూపొందనుందట. ఇక హైలైట్ పాయింట్ ఎంటంటే... ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహిస్తారట. ఇటీవల ‘మణికర్ణిక’ సినిమా ప్యాచ్ వర్క్ కోసం కంగనా మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. -
క్రిష్ పేరు కూడా ఎత్తలేదు..!
బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం మణికర్ణిక. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విశేషాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో వినిపించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా చర్చకు దారితీసింది. మణికర్ణిక మేజర్ పార్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించారు. అనివార్య కారణాల వల్ల క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో కంగనా స్వయంగా దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు. అయితే టీజర్ రిలీజ్ సమయంలో దర్శకుడిగా క్రెడిట్ అంతా క్రిష్‌కే ఇచ్చిన కంగనా తాజాగా ట్రైలర్ లాంచ్‌లో మాత్రం తానే అంతా చేసినట్టుగా మాట్లాడటం చర్చకు దారితీసింది. కనీసం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో క్రిష్ పేరు కూడా ప్రస్తావించని ఈ బ్యూటీ, దర్శకుడు అర్థాంతరంగా సినిమా వదిలేయంటంతో తానే మేజర్పార్ట్ను డైరెక్ట్ చేసినట్టుగా మాట్లాడి అందరికి షాక్ ఇచ్చారు. టీజర్లో దర్శకుడిగా క్రిష్ పేరు మాత్రమే వేసిన చిత్రయూనిట్, ట్రైలర్లో మాత్రం క్రిష్‌తో పాటు కంగనా పేరును కూడా వేశారు. ఇంత వరకు క్రిష్‌తో కంగనాకు వివాదాలు ఉన్నట్టుగా ఎలాంటి వార్తలు రాకపోయినా తాజాగా ట్రైలర్ లాంచ్‌తో వివాదం కారణంగా క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న విషయంపై క్లారిటీ వచ్చినట్టైంది. -
ఆకట్టుకుంటున్న ‘మణికర్ణిక’ ట్రైలర్
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం ‘మణికర్ణిక’. బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంత భాగం కంగనా కూడా దర్శకత్వం వహించడం విశేషం. కాగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మణికర్ణిక ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసింది చిత్రబృందం. లక్ష్మీబాయి జీవితంలోని అన్ని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన సన్నివేశాలతో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యుద్ధరంగంలో శత్రువులను చీల్చి చెండాడే యోధురాలిగా కంగన తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. -
‘మణికర్ణిక’ ట్రైలర్ విడుదల
-
మూడు భాషల్లో ‘మణికర్ణిక’
వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం మణికర్ణిక. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంత భాగం కంగనా కూడా దర్శకత్వం వహించారు. అనేక వివాదాలు, మరెన్నో వాయిదాల తరువాత షూటింగ్ పూర్తి చేసుకున్న మణికర్ణిక ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 18న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు తెలుగు వాడు కావటంతో పాటు చారిత్రక కథ కావటంతో ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. హిందీ పాటు ఇతర భాషల్లోనూ జనవరి 25నే మణికర్ణికను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 24న క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్ కానుంది. మరి ఒకే దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలు ఒక్క రోజు రిలీజ్ చేసే సాహసం చేస్తారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
హృతిక్ వెనక్కి తగ్గాడా..!
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. అయితే కొత్త ఏడాదిలో ఈ ఇద్దరు వెండితెర మీద తలపడేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. హృతిక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ 30, కంగనా లీడ్ రోల్లో నటించిన మణికర్ణిక సినిమాలు రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. అయితే సూపర్ 30 చిత్ర దర్శకుడు వికాస్‌పై మీటూ ఆరోపణల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దీంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కావటం కష్టమన్న టాక్ వినిపిస్తోంది. మణికర్ణిక నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకోవటంతో అనుకున్నట్టుగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రావటం కన్ఫామ్ అయ్యింది. దీంతో భారీ చర్చకు దారి తీసిన హృతిక్, కంగనా పోటి తెర మీద చూసే అవకాశాన్ని ప్రేక్షకుల మిస్ అయినట్టే అంటున్నారు విశ్లేషకులు. -
ఒక్క సినిమాకు 14 కోట్ల పారితోషికం
సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం బ్యూటీ చారిత్రక కథతో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథగా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్ డైరెక్షన్ చేయగా చివరి షెడ్యూల్‌కు కంగనా స్వయంగా దర్శకత్వం వహించారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ తో క్రిష్ బిజీగా కావటంతో మణికర్ణిక దర్శకత్వ బాధ్యతలు కంగన తీసుకున్నారు. ఒకే సినిమాలో నటిగా, దర్శకురాలిగా పనిచేస్తుండటంతో రెమ్యూరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నారట కంగనా. గతంలో ఒక్కో సినిమా 5 నుంచి 6 కోట్ల పారితోషికం తీసుకున్న ఈ భామ ఈ సినిమాకు డబుల్ కన్నా ఎక్కువగా తీసుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈసినిమాకు ఈ బ్యూటీ ఏకంగా 14 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టుగా బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తం పద్మావత్‌కు దీపిక తీసుకున్న రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువ కావటంతో బాలీవుడ్ ప్రముఖులు షాక్ అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాతో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకున్ననటిగా రికార్డ్ సృష్టించనుంది కంగనా. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న మణికర్ణిక జనవరి 25న రిలీజ్ కానుంది. -
యుద్ధం ముగిసింది
కంగనా రనౌత్ టైటిల్ రోల్లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ‘మణికర్ణిక’. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నందమూరి తారకరామారావు జీవితకథతో తెరకెక్కుతోన్న ‘యన్.టి.ఆర్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు క్రిష్. కొన్ని ప్యాచ్ వర్క్స్ కోసం కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముగిసిందని సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ నర్మద ఘాట్‌లో ఈ చిత్రంలోని ఆఖరి పాట షూటింగ్ జరిగింది. కంగనా యుద్ధ విన్యాసాలు ఈ చిత్రంలో హైలెట్ అట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ‘మణికర్ణిక’ సినిమాని విడుదల చేసేందుకు చిత్రవర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మణికర్ణిక’
ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు. అయితే క్రిష్.. యన్.టి.ఆర్ షూటింగ్లో బిజీ కావటంతో మణికర్ణిక చిత్రానికి కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆఖరి పాట చిత్రీకరణ మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ నర్మద ఘాట్‌లో జరుగుతోంది. ఈ దీంతో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అదరం.. బెదరం
అందంగా కనిపించాలి. ప్రేమలో పడాలి. పాటల్లో గ్లామరస్‌గా కనిపించాలి. టైమ్ వచ్చినప్పుడు డైలాగ్స్ చెప్పి సీన్ నుంచి మాయం అవ్వాలి... హీరోయిన్లంటే ఇంతేనా? ఊహూ.. ఆ కాలం పోయింది. ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కథా బలం ఉన్న స్క్రిప్ట్ దొరికి, మంచి క్యారెక్టర్ పడితే మేం ఎందులో తక్కవ? అనేలా నటిస్తున్నారు హీరోయిన్లు. అన్నమాటకు కట్టుబడేలా కష్టపడతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు బెదరడం లేదు. పైగా డూప్ లేకండా యాక్షన్ సన్నివేశాలను అదరగొడుతున్నారు. ఈ క్రమంలో దెబ్బలు తగిలితే భయపడటం లేదు. సరి కదా లొకేషన్లో షాట్ కంప్లీట్ చేసిన తర్వాతనే హాస్పిటల్‌కి పోదాం అంటున్నారు. ఇటీవల అలా గాయాలపాలైన కొందరు కథానాయికల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్లో కంగనా రనౌత్ ఎంతటి ప్రతిభాశాలో అంతే ధైర్యశాలి. ఇందుకు సినిమాల్లో ఆమె ఎంచుకుంటున్న పాత్రలు, ఏదైనా విషయం గురించి బాహాటంగా నిర్భయంగా మాట్లాడే తీరు నిదర్శనం. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మణికర్ణిక’ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు కంగనారనౌత్. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్లో రెండు సార్లు గాయపడ్డారామె. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా ఆమె కాలు విరగ్గొట్టుకున్నారు. ఒకసారి గాయపడ్డ తర్వాత కూడా యాక్షన్ సన్నివేశాలు చేయడానికి కంగనా బెదరలేదు. మళ్లీ కత్తి పట్టి, షూట్‌లోకి దూకారు. కాంప్రమైజ్ కాలేదు. మళ్లీ గాయపడ్డారు. ఈసారి కత్తి నుదుట మీద తగిలింది. 16 కుట్లు పడ్డాయి. అయినా కంగనా తగ్గడం లేదు. సేమ్ కమిట్మెంట్తో ఫైట్సీన్స్లో పాల్గొంటున్నారు. మరి.. కంగనానా? మజాకానా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఓ సెట్లో జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. ఇక, ఈ ఏడాది మార్చిలో 25వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆలియా భట్‌కు బర్త్‌డే ముగిసిన రెండు రోజుల్లోనే చేదు అనుభవం ఎదురైంది. బల్గేరియాలో ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ లొకేషన్లో గాయపడ్డారామె. ఓ యాక్షన్ సీన్ చేసే టైమ్‌లో అదుపు తప్పి చేయి విరగ్గొట్టుకున్నారు కానీ ముఖంపై చిరునవ్వును మాత్రం వదిలిపెట్టలేదు. ఆ రోజంతా షూటింగ్లో పాల్గొని, సాయంత్రమే లొకేషన్ని వదిలిపెట్టి వెళ్లారు. కమిట్మెంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదని చెప్పారు. రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ ముఖ్య తారలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. మరో బ్యూటీ శ్రద్ధా కపూర్ విషయానికి వద్దాం. ప్రస్తుతం వెండితెరపై సైనా నెహ్వాల్‌గా చేస్తున్న శ్రద్ధాకపూర్ ఏం చేస్తున్నారో తెలుసా? బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పుడిప్పుడే జ్వరం నుంచి కోలుకుంటున్నారు. ఇంతకీ శ్రద్ధాకు జ్వరం రావడానికి కారణం ఏంటంటే.. ‘సైనా’ చిత్రం కోసం శ్రద్ధా బ్యాడ్మింటన్ గేమ్‌కు స్ట్రాంగ్‌గా ప్రిపేర్ కావడమేనట. బాగా అలసిపోయి, జ్వరం తెచ్చుకున్నారు. హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో రూపొందుతున్న ‘సైనా’కు అమోల్ గుప్టే దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్లకన్నా ముందే గాయాల క్లబ్లో చేరారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘రేస్ 3’ సినిమా షూటింగ్ టైమ్‌లో ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అనే సామెతను హిందీలో గుర్తు చేసుకుని ఉండి ఉంటారు కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఎందుకంటే... ఆ సినిమా సెట్లో జాక్వెలిన్ కన్నుకి పెద్ద దెబ్బ తగిలింది. కంటికి ఏదైనా దెబ్బ తగిలితే ఇంకేమైనా ఉందా? కెరీర్ క్లోజ్ అయిపోదూ. కానీ ఇంత కష్టపడ్డ జాక్వెలిన్‌కు ఈ చిత్రం చేదు అనుభావాన్నే మిగిల్చింది. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ‘రేస్3’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. అలాగే ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భారత్’ సినిమాలో దిశా పాట్నీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో జిమ్నాస్టిక్స్ చేసే క్యారెక్టర్లో నటిస్తున్నారామె. ఈ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ టైమ్‌లో దిశా గాయపడ్డారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాది భామలేనా? మన దక్షిణాది భామలకు కూడా బోలెడంత ధైర్యం ఉంది. ఇప్పుడు ఒకసారి సౌత్‌కు వస్తే... యాక్షన్ సీన్స్‌లో నవ్వులపాలు కాకూడదని డిసైడ్ అయ్యారు అమలాపాల్. అందుకు ఎందాకైనా తెగించాలని డిసైడ్ అయ్యారు. తమిళ సినిమా ‘అదో అంద పరవై పోల’ కోసం అడవిలో నైట్ షూట్‌కి సై అన్నారు. నాలుగైదు రోజులు షూటింగ్ సజావుగానే సాగిందట. కానీ ఓ బ్యాడ్ డే ఓ ఫైట్ సీన్ కోసం ఆమె చేతిని విరగ్గొట్టుకున్నారు. లొకేషన్లో చాలా రక్తం పోయింది. కానీ వెంటనే అమలాపాల్ ఆసుపత్రికి పోలా. ఆ సీన్ షూట్‌ను కంప్లీట్ చేసి, డాక్టర్ రూమ్ డోర్ నాక్ చేశారు. ఈ గాయం గురించి అమలాపాల్ ఏమన్నారో తెలుసా. ‘‘శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోతే హీరో అనిపించుకోలేం’’ అన్నారు. ఇలా అమలాపాల్ రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ సినిమాలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ క్యారెక్టర్లో కనిపిస్తారామె. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అదా శర్మ అయితే పొరపాటున తన చేతివేలిని తానే చితక్కొట్టుకున్నారు. యాక్షన్ సీన్లో భాగంగా కారు డోర్‌ని విసురుగా వేసేటప్పుడు మరో చేతిని డోర్ మీద నుంచి తీయడం మరచిపోయారు. ఇది ‘కమాండో 3’ సెట్లో జరిగింది. పాపం.. అదాశర్మ నొప్పితో అల్లాడిపోయారు. అయినా టైమ్ వేస్ట్ కానివ్వకుండా షూటింగ్లో పాల్గొన్నారు. అదా ధైర్యం ఉన్న యువతి అని చిత్రబృందం మెచ్చుకుంది. ఇప్పుడు మాత్రం హ్యాపీగా షూట్లో పాల్గొంటున్నారు. విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్నారీ సినిమాలో .ఈ సినిమాకు విపుల్ షా డైరెక్టర్. అలాగే రాజమండ్రి షెడ్యూల్లో ‘రంగస్థలం’ సినిమా కోసం కంటిన్యూస్‌గా వర్క్ చేయడంతో ఓ రోజు చేతి నొప్పితో విలవిల్లాడిపోయారు ఆ సినిమా కథానాయిక రామలక్ష్మీ.. అదేనండీ మన సమంత. అంతేనా.. ఈ సినిమా షూట్ వేసవి టైమ్‌లో జరిగినప్పుడు వడదెబ్బ తగలడంతో స్పృహ తప్పి పడిపోయారట. మొన్నా మధ్య గౌతమ్ హీరోగా నటించిన చిత్రం ‘మను’. ఈ సినిమా సెట్‌ను హైదరాబాద్‌కు దూరంగా వేశారు. ఆ సెట్లో దోమలు ఎక్కువగా ఉండటంతో దాదాపు నెల రోజులు వైరల్ ఫీవర్‌తో షూట్‌కు దూరమైయ్యారు చాందినీ చౌదరి. అలాగే ‘నేల టిక్కెటు’్ట సినిమాతో తెలుగు తెరపై మెరిసిన మాళవికా శర్మ కూడా సెట్లో గాయపడ్డారు. కానీ ఇది చిన్న గాయమే కావడంతో వెంటనే కోలుకున్నారు. ఇలా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతటి రిస్క్‌కి అయినా∙రెడీ అంటున్నారు ఈ తరం హీరోయిన్లు. పాటలకే కాదు.. ఫైట్స్‌కి కూడా పనికొస్తామని నిరూపించుకుంటున్నారు. గాయాలను లెక్క చేయకుండా షూటింగ్ చేస్తున్నారు. మళ్లీ గాయం అయినా ఫర్వాలేదనుకుంటున్నారు. ‘డోంట్ కేర్’.. ఇది మన హీరోయిన్ల కొత్త నినాదం. అదా శర్మ, అమలా పాల్, కంగనా, జాక్వెలిన్, ఆలియా భట్ -
కంగనా విశ్వరూపం ‘మణికర్ణిక’
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లో ఉంటున్న ఈ సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. బిగ్ బి అమితాబ్ వాయిస్ ఓవర్‌తో రూపొందించిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఝాన్సీ లక్ష్మీ బాయ్ రాజనీతి, ధైర్య సాహసాలు ప్రతిబింభించేలా మణికర్ణిక సినిమాను రూపొందిస్తున్నారు. కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీ బాయ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. మేజర్ పార్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించగా చివర్లో కొన్ని సన్నివేశాలతో పాటు ప్యాచ్ వర్క్‌కు కంగనా దర్శకత్వం వహించారు. ఆ సమయంలో కంగన వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు దర్శకురాలిగా కంగనా పేరునే టైటిల్స్‌లో వేస్తారన్న ప్రచారం జరిగిన టీజర్లో దర్శకుడిగా క్రిష్ పేరే కనిపించింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను 2019 జనవరి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. &rel=0 -
టీజర్ సిద్ధం
దేశ స్వాతంత్య్రం రోజున (ఆగస్టు 15) ‘మణికర్ణిక’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసుకున్నారు ‘మణికర్ణిక’ టీమ్. ఇప్పుడు అక్టోబర్ 2 అంటే... గాంధీ జయంతి నాడు టీజర్‌ను రిలీజ్ చేసి మరింత మంది ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేశారు. ఇది దేశభక్తి చిత్రం కావడంతో ఇలా దేశభక్తికి రిలేట్ అయిన డేట్స్‌లో సినిమా ప్రమోషన్‌ను ప్లాన్ చేస్తే ప్లస్ అవుతుందని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లున్నారు. అందుకేనేమో సినిమా రిలీజ్‌ను కూడా వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి మార్చుకున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. కానీ క్రిష్ తెలుగులో ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌తో బిజీగా ఉండటం వల్ల కొంత షూట్ కోసం కంగనా డైరెక్షన్ చైర్లో కూర్చున్నారన్న సంగతి తెలిసిందే. సినిమా డైరెక్షన్ క్రెడిట్లో తనకు భాగస్వామ్యం వద్దని, అవుట్‌పుట్ రావడంలో ఒక భాగంగానే తాను డైరెక్షన్ సీట్లో కూర్చున్నానని ఆమె చెప్పారని బాలీవుడ్ టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మణికర్ణిక’ టీమ్ నుంచి తాజాగా నటి స్వాతి సెమ్వాల్ కూడా వైదొలిగినట్లు బీటౌన్ టాక్. ఈ సినిమాలో పార్వతి అనే పాత్రకు స్వాతిని తీసుకున్నారట. అయితే తన పాత్రకు ప్రాముఖ్యతను తగ్గించారనే కారణంగా స్వాతి ఈ చిత్రానికి గుడ్ బై చెప్పారట. రీసెంట్గా సోనూసూద్.. తాజాగా స్వాతి తప్పుకోవడంతో ‘మణికర్ణిక’ సినిమా మళ్లీ బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
‘మణికర్ణిక’ టీజర్ రెడీ..!
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లో ఉంటున్న ఈ సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీ బాయ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. మేజర్ పార్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించగా చివర్లో కొన్ని సన్నివేశాలతో పాటు ప్యాచ్ వర్క్‌కు కంగనా దర్శకత్వం వహించారు. ఆ సమయంలో కంగన వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు దర్శకురాలిగా కంగనా పేరునే టైటిల్స్ లో వేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ అనుమానాలన్నింటికి టీజర్‌తో సమాధానమివ్వనున్నారు చిత్రయూనిట్. -
‘మణికర్ణిక’కు మరో షాక్..!
క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం మణికర్ణిక. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా వివాదాలు మాత్రం ఎక్కువవుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ పనులతో బిజీగా ఉండటంతో దర్శకుడు క్రిష్ మణికర్ణిక దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆ బాధ్యతను హీరోయిన్ కంగనా రనౌత్ తీసుకున్నారు. అప్పటి నుంచే అసలు వివాదం మొదలైంది. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సోనూసూద్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే కంగనా రనౌత్ దర్శకత్వంలో నటించటం ఇష్టం లేకే సోనూసూద్ తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన సంజయ్ కుట్టి కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరిగిపోవటంతో సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. -
లంచ్ ఆల్సో.. వర్క్ ఆల్సో...
ఇక్కడ ఇన్సెట్లో ఉన్న ఫొటోలో కంగనా రనౌత్‌ను చూశారుగా! కంగనా ముఖం మీద కనిపించే రక్తం అంతా తనది కాదు. కొంచెం శత్రువులది కూడా. అవును.. కంగనా రనౌత్ ప్రస్తుతం యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. ఆమె టైటిల్ రోల్లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ప్యాచ్ వర్క్ నిమిత్తం ఈ సినిమాకు తాత్కాలిక దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు కంగనా రనౌత్. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ ఈ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల్లో కత్తి పట్టి శత్రువులు అంతు చూస్తున్నారట కంగనా. అలాగే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సోనూ సూద్ ప్లేస్‌లో మహ్మాద్ జీషన్ అయూబ్ రీప్లేస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుందని బాలీవుడ్ టాక్. సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... అశ్వనీ అయ్యర్ తివారి దర్శకత్వంలో కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో కబడ్డీ నేపథ్యంలో రూపొందనున్న ‘పంగ’ సినిమా పనులు కూడా మొదలయ్యాయి. రీసెంట్గా ఈ టీమ్ అంతా కంగనా ఇంట్లో లంచ్ చేశారు. ఓన్లీ లంచ్ మాత్రమే కాదు వర్క్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో..’లా ‘లంచ్ ఆల్సో.. వర్క్ ఆల్సో’ అన్నమాట. -
కేరాఫ్ కాంట్రవర్సీ
కె ఫర్ కంగనా. కె ఫర్ కాంట్రవర్సీ. కాంట్రవర్సీల్లోకి కంగనా వెళ్తారో లేక కాంట్రవర్సీలు ఆమె చుట్టూ చేరతాయో అర్థం కాదు. ఆఫ్ స్క్రీన్.. ఆన్ స్క్రీన్.. ఏదైనా ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనో లేదా వాటిని క్లియర్ చేస్తూనో వార్తల్లో ఉంటారామె. తాజాగా ‘మణికర్ణిక’ సినిమా. ఝాన్సీగా స్క్రీన్‌పై కంగనా చేసిన పోరాటాలకంటే బయటే ఎక్కువ పోరాటాలు చేస్తున్నట్టున్నారు. దర్శకుడు క్రిష్ ‘యన్టీఆర్’ బయోపిక్‌లో బిజీగా ఉండటంతో ప్యాచ్వర్క్కి ఆల్రెడీ తనే దర్శకత్వ బాధ్యతలను చేపడుతోంది. సోనూసూద్–కంగనా మధ్య డిఫరెన్సెస్ రావడంతో ‘మణికర్ణిక’ నుంచి ఆయన తప్పుకున్నారు. దాంతో ఆ పాత్రను మళ్లీ రీషూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ మరో 15కోట్లు పెరగనుందట. లేడీ ఓరియంటెడ్ íసినిమాల్లోనే భారీ ఖర్చుతో రూపొందిన ఈ చిత్రం రీషూట్ వల్ల బడ్జెట్ ఇంకా పెరగడం సినిమా రిజల్ట్‌పై ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి. ముందు అనుకున్నట్లుగా జనవరిలో ఈ సినిమా రిలీజ్ కాదని బాలీవుడ్ టాక్. -
‘అతనికవేం గుర్తుకు లేవు’
మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాకు ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన చిత్రం కాస్తా ఆలస్యమవుతూ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలని రీ షూట్ చేయాల్సి రావడం వల్ల ఆలస్యమవుతోంది. అయితే ప్రస్తుతం దర్శకుడు క్రిష్ ‘ఎన్టీఆర్’ సినిమాతో బిజీగా ఉండడంతో.. కంగనా అండ్ బ్యాచ్ రీ షూట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక కొత్త వార్త వినిపిస్తోంది. అది ఏంటంటే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సోను సూద్, కంగనా గొడవపడ్డారని.. దాంతో అతను ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమేనంటూ.. సోను సూద్ తప్పుకోవాడానికి గల కారణాన్ని బయటపెట్టారు కంగనా రనౌత్. దీని గురించి ఆమె ‘ప్రస్తుతం సోను సూద్ ‘మణికర్ణిక’ చిత్రంలో నటించడం లేదు. అతనిప్పుడు ‘సింబా’ సినిమాతో బిజీగా ఉన్నారు. మేము ఈ పాచ్ వర్క్ గురించి అతనికి చెప్పా, మాతో సహకరించమని కోరాం. కానీ అతను నన్ను కలవడానికి నిరాకరించాడు. నేను తనని నా స్నేహితునిగానే భావించాను. అతను నిర్మాతగా వ్యవహరించిన ఒక సినిమా పాటలను నేనే లాంచ్ చేశాను. కానీ అతనికి అవేం గుర్తుకు లేవు’ అంటూ విమర్శించారు. అంతేకాక తాను మహిళ అయినందున, తన డైరెక్షన్లో పనిచేయడానికి ఇష్టంలేకే సోను సూద్ షూటింగ్‌కి హాజరవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని కంగనా రనౌత్ తెలిపారు. అంతేకాక తన స్థానంలో మరొకరిని తీసుకొండని సలహ ఇచ్చాడన్నారు. దాంతో ప్రస్తుతం సోను సూద్‌కి సంబంధించిన సన్నివేశాలన్నింటిని మరో నటుడితో రీ షూట్ చేయాల్సి వస్తుందని తెలిపారు. ఇందుకోసం జీషన్ అయ్యూబ్ని సంప్రదించామని, అతను సెప్టెంబర్‌లో తమతో జాయిన్ అవుతాడని కంగనా తెలిపారు. కంగనా వ్యాఖ్యలపై సోను సూద్ ప్రతినిధి స్పందించారు. ‘సోను సూద్ ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటారో ఆయనతో పనిచేసిన వారందరికి తెలుసు. ఆయన మణికర్ణిక చిత్రం కోసం ముందు ఒప్పుకున్న ప్రకారం షూటింగ్‌కి హాజరయ్యారు. కానీ ఇప్పుడు రీ షూట్‌కి కూడా రావాలని కోరారు. అయితే ప్రస్తుతం సోను సూద్ వేరే చిత్రంతో బిజీగా ఉన్నారు. అందువల్ల మణికర్ణిక కోసం డేట్స్ కేటాయించలేకపోతున్నారు. అందువల్లే మణికర్ణిక నుంచి తప్పుకున్నారు తప్ప మరో కారణం ఏం లేదు’ అంటూ తెలిపారు. అంతేకాక ‘మణికర్ణిక చిత్ర బృందానికి సోను సూద్ ఆల్ ది బెస్ట్ కూడా తెలిపారు’ అని వివరించారు. -
అయ్యో అలాంటిదేమీ లేదు : కంగనా
ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత కథ ఆధారంగా మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో హీరోయిన్ కంగనా రనౌత్‌కి, క్రిష్‌కి మధ్య విభేదాలంటూ గతకొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. దీనికి తోడు చిత్రానికి సంబంధించిన క్లాప్ బోర్డ్‌పై డైరెక్టర్ పేరుండాల్సిన దగ్గర కంగనా రనౌత్ పేరు ఉండడంతో అభిమానుల్లో మరోసారి అనుమానం మొదలైంది. ఈ విషయంపై అభిమానులు దర్శకుడితో పాటు కంగనాని సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో కంగనా వెంటనే స్పందించింది. క్రిష్ తాను ఒప్పుకున్న వేరే సినిమాతో బిజీగా ఉండడం వల్లే మేము ప్యాచ్ వర్క్‌పూర్తి చేశాం. అంతే కాని పూర్తి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించలేదు. సెట్లో ఉన్న క్లాప్ బోర్డ్ ఇంత గందరగోళం సృష్టించింది. ప్రస్తుతం సినిమా వర్క్ అంతా సవ్యంగా జరుగుతుంది. అనుకున్న సమయానికే మూవీ రిలీజ్ అవుతుంది' అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బదులిచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రం జనవరి 25, 2019న విడుదల కానుందని కంగనా పేర్కొన్నారు. Krish Jagarlamudi is the director of #Manikarnika and will remain so. #KanganaRanaut has stepped in to shoot just the patchwork on his behalf while he fulfills his commitments in another movie, to make sure that #Manikarnika releases on 25th Jan 2019. The clapboard is merely to avoid on set confusion A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on Aug 29, 2018 at 1:01pm PDT -
కోచ్ కావలెను!
హెడ్డింగ్ చదవగానే కంగనా రనౌత్ కొత్త భాష ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారేమో? లేక ఏదైనా కొత్త ఆట మీద దృష్టి పెట్టారేమో అనుకుంటున్నారా? రెండోది నిజం. ఇప్పుడు కంగనా రనౌత్ తన ఫోకస్ అంతా కబడ్డీ ఆట మీద పెట్టారు. ఎందుకంటే ఓ సినిమాలో ఆమె కబడ్డీ ప్లేయర్‌గా నటించనున్నారు. ఓ పెళ్లైన అమ్మాయి జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్‌గా ఎలా సత్తా చాటింది? అనే బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందనుంది. ‘పంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ‘బరేలీ కీ బర్ఫీ ఫేమ్’ అశ్వనీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. నీనా గుప్తా, జెస్సీ గిల్ కీలక పాత్రలు చేయనున్నారు. ఈ సినిమాను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కంగనా రనౌత్ భర్తగా జెస్సీ గిల్ కనిపిస్తారట. అంతా బాగానే ఉంది. కంగనాకి కబడ్డీ ఆట తెలియదట. ఈ సినిమా షూటింగ్ ఆరంభించక ముందే నేర్చుకుంటేనే సెట్లో అంతా సవ్యంగా సాగుతుంది. అందుకే సులువుగా కబడ్డీ నేర్పించే కోచ్‌ను వెతుకుతున్నారట టీమ్. మరి.. కోచ్ దొరికేదెప్పుడు? ఆట నేర్చుకునేదెప్పుడు? -
ఓ లుక్ వేయండి
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సినిమా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ట్రీట్. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’తో మాస్ టీజర్ అందిస్తే, వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ ఎలా ఉండబోతుందో అని చిన్న శాంపిల్ చూపించారు. ‘కేరాఫ్ కంచర పాలెం’లో ఉన్న మనుషులు ఎలా ఉంటారో, రాజుగాడికి 50 ఏళ్లు వచ్చినా పెళ్లి అవుతుందో లేదో అనే టెన్షన్ పెట్టారు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ‘భారత్’ అంటూ బలమైన డైలాగ్ వినిపిస్తే, ‘మణికర్ణిక’గా కంగనా వీరనారి ప్రతాపం చూపించారు. తమిళంలో జ్యోతిక ‘మహిళలూ వినండి... మీకు కొన్ని సూచనలు ఉన్నాయి’ అన్నారు. ఏది ఏమైనా అన్ని ఇండస్ట్రీల మూవీ లవర్స్‌కు ఐ–ఫీస్ట్. ఓ లుక్ వేద్దాం. ఎంటబడ్డానా నరికేస్తా... ‘ఆది, సాంబ’ వంటి ఫ్యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా పాపులారిటీ సంపాదించారు ఎన్టీఆర్. మళ్లీ ఆ జానర్‌ని చాలా కాలంగా పూర్తి స్థాయిలో టచ్ చేయలేదు. కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో మళ్లీ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను టచ్ చేసినట్టు కనిపిస్తుంది. సీమలో వీర రాఘవ రెడ్డి వీర విహారం ఎలా ఉంటుందో టీజర్ ద్వారా చిన్న శాంపిల్‌ని కూడా చూపించారు త్రివిక్రమ్. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటదో తెలుసా? మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మట్టి తుపాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?’ అంటూ మూడు వాక్యాల్లో హీరో పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌ని జగపతిబాబు వాయిస్ ద్వారా మనకు పరిచయం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పట్టుకున్న కత్తికి తన కలంతో పదును పెట్టారు త్రివిక్రమ్. ‘కంటబడ్డావా కనికరిస్తానేమో.. ఎంటబడ్డానా నరికేస్తా ఓబా..’ అంటూ సీమ యాసలో ఎన్టీఆర్ పలికిన సంభాషణలు టీజర్‌కి హైలైట్ అని చెప్పొచ్చు. జగపతిబాబు, నాగబాబు, ఈషా రెబ్బా ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి యస్.యస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కంచరపాలెం ప్రేమ ఫస్ట్ లుక్, ట్రైలర్స్ లాంటివి ఏమీ రిలీజ్ కాకముందే న్యూయార్క్ ఇండియన్æ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అఫీషియల్ ఎంట్రీ అందుకొని అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఇండిపెండెంట్ సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. మొత్తం నూతన నటీనటులతోనే దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పరుచూరి విజయ ప్రవీణ నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కంచరపాలెం అనే ఊరిలోని ప్రజలనే పాత్రలుగా.. వాళ్లందరికీ నటనలో వర్క్‌షాప్ చేసి కంచరపాలెం ఊళ్లోనే మొత్తం చిత్రాన్ని షూటింగ్ చేశారు దర్శకుడు వెంకటేశ్. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఒక ఊరిలోనే నాలుగు భిన్న వయసుల వారి మధ్య ప్రేమకథగా తెరకెక్కిందీ చిత్రం. మా సూచనలు వినండి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొన్ని సూచనలు ఇస్తున్నారు జ్యోతిక. ఇదంతా తన లేటెస్ట్ సినిమా ‘కాట్రిన్ మొళి’ ఫస్ట్ లుక్‌లో భాగమే. రాధామోహన్ దర్శకత్వంలో జ్యోతిక ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం ‘కాట్రిన్ మొళి’. హిందీ హిట్ చిత్రం ‘తుమ్హారీ సులూ’కు రీమేక్ ఇది. ఇందులో జ్యోతిక రేడియో జాకీగా కనిపిస్తారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను బుధవారం హీరో సూర్య రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో ‘‘మనసుకి నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. ఆకలేస్తే భర్త కంటే ముందే తినొచ్చు. భర్త ఒక చెంప మీద కొట్టాడని మరో చెంప చూపించాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినది మనం చేయొచ్చు. కావాలనుకుంటే బొద్దుగా ఉండొచ్చు. ఇంట్లో రోజువారి పనులను షేర్ చేసుకొమ్మని భర్తను అడగొచ్చు. సంపాదించొచ్చు, ఇంట్లో కూడా ఇవ్వాలి, నచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు, మనసులో కాదు.. అనుకున్నదాన్ని బయటకు అవును అని అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. స్త్రీ, పురుషుడు ఒకటే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అంటూ పది రూల్స్ ఉన్న బోర్డ్‌ని పట్టుకున్న జ్యోతిక ఫొటోను ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు ‘కాట్రిన్ మొళి’ చిత్రబృందం. ఇందులో మంచు లక్ష్మీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 18న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని జి. ధనుంజయ్ నిర్మించారు. నాకు రెండూ ఉన్నాయి సుల్తాన్, టైగర్ జిందా హై తర్వాత సల్మాన్ ఖాన్ – అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘భారత్’. దేశభక్తి చిత్రంగా వస్తున్న ఈ చిత్రం డైలాగ్ టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ‘‘కొన్ని బంధాలు రక్తం వల్ల ఏర్పడతాయి.. మరికొన్ని మట్టి వల్ల ఏర్పడతాయి. నా దగ్గర అవి రెండూ ఉన్నాయి’’ అంటూ సల్మాన్ ఖాన్ డైలాగ్స్ పలికారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సర్కస్ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. పర్సనల్ కారణాలతో ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో నుంచి హీరోయిన్గా తప్పుకున్న తర్వాత కత్రినా కైఫ్ ఆ స్థానంలోకి వచ్చారు. మరో బ్యూటీ దిశా పాట్నీ కూడా ఇందులో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం మాల్టాలో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి ఐటమ్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్ కానుంది. వీరనారి ఝాన్సీ రణభూమిలో మణికర్ణిక ఎంత రౌద్రంగా, ఆవేశంగా ఉంటారో చిన్నప్పుడు ఎన్నో కథలు విన్నాం, చదువుకున్నాం. వెండి తెరపై చూపించదలిచారు దర్శకుడు క్రిష్, కంగనా రనౌత్. ఝాన్సీ పోరాట పటిమ ఏ విధంగా ఉంటుందో మనకు సరిగ్గా అంచనా లేదు. ఆ ఆవేశాన్ని ఫస్ట్ లుక్ ద్వారా కొంచెంగా చూపించారు ‘మణికర్ణిక’ చిత్రబృందం. కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘మణికర్ణిక’. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కమల్ జైన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. భుజాన బిడ్డ, మొహంలో మొండి ధైర్యంతో యుద్ధ భూమిలో కత్తి పట్టుకున్న కంగనా రనౌత్ ఫొటోను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్లా రిలీజ్ చేశారు. ‘బాహుబలి’ వంటి బ్లాక్బాస్టర్ చిత్రాన్ని రచించిన విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లే అందించారు. వచ్చే ఏడాది జనవరి 25 ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రవితేజ– శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్, తమిళంలో ‘జయం’ రవి ‘అడంగమారు’ ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశాయి. మరో ప్రపంచంలోకి... వరుణ్ తేజ్ ఆకాశానికి నిచ్చెన వేశారు. అంతరిక్ష వీధిలో తన విధి నిర్వహించడానికి ఎన్నో సాహసాలు చే శారట. మరి ఆ విశేషాలన్నీ చూడాలంటే డిసెంబర్ 21 వరకూ వేచి చూడాల్సిందే. వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న స్పేస్ మూవీ ‘అంతరిక్షం 9000కేయంపిహెచ్’. ఫస్ట్ తెలుగు స్పేస్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాయిబాబు, జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో అదితీ రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఏదో మిషన్‌లో నిమగ్నమై ఉన్న వరుణ్ తేజ్ లుక్‌ను ఫస్ట్ లుక్‌గా చిత్రబృందం రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం జీరో గ్రావిటీ సెట్‌ని డిజైన్ చేశారు. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నారు. దాని కోసం యూనిట్ అంతా జీరో గ్రావిటీలో శిక్షణ కూడా తీసుకున్నారు. ‘అంతరిక్షం 9000 కీమీ’ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘మీ అందరి కోసం అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాం’’ అని వరుణ్ తేజ్ అన్నారు.. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. కెమెరా: జ్ఞానశేఖర్. -
మణికర్ణిక ఫస్ట్ లుక్.. అదిరింది!
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్ పొస్టర్‌ను విడుదల చేసింది. యుద్ద సన్నివేశాల్లోని కంగనా గుర్రపు స్వారీ ఫోజ్ అచ్చం ఝాన్సీ లక్ష్మీ భాయ్లా ఉండటంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మిన్నంటాయి. పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చారు. మార్చిలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా 2019 జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. గతేడాది మేలో షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. ఈ ఏడాది సమ్మర్లో రీలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కీలక సన్నివేశాల అవుట్ పుట్‌పై అసంతృప్తితో ఉన్న క్రిష్. రీషూట్ చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే రిలీజ్ ఆలస్యం అయ్యింది. -
కంగనా వర్సెస్ హృతిక్!
స్వాతంత్య్ర సమరయోధుల్లో ఝాన్సీ లక్ష్మిభాయ్ ముఖ్యులు. ఆమె జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘మణికర్ణిక’. ‘ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ అనేది ట్యాగ్‌లైన్. కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేశారు. క్రిష్ దర్శకత్వం వహించారు. దేశభక్తికి సంబంధించిన చిత్రం కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ కానుందన్న వార్తలు వచ్చాయి. కానీ ‘మణికర్ణిక’ సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారన్నది తాజా ఖబర్. ఇదే రోజున హృతిక్ రోషన్ తొలిసారి నటిస్తోన్న బయోపిక్ ‘సూపర్ 30’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. వికాశ్ బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మరి.. ‘మణికర్ణిక, సూపర్ 30’ సినిమాలు ఒకే రోజున థియేటర్స్‌లోకి వస్తాయా? లేక ఏదో ఒక చిత్రం వాయిదా పడుతుందా అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. -
‘మణికర్ణిక’ ఆగమనం అప్పుడే..!
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చారు. మార్చిలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా 2019 జనవరి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయాల్సి రావటం, గ్రాఫిక్స్ వర్క్కూడా భారీగా ఉండటంతో నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయట. అందుకే సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సంబంధిత కథనాలు.. రీ-షూట్ కోసం ఐదు కోట్ల ఖర్చు...! గుమ్మడికాయ కొట్టేశారు మణికర్ణికలో కంగనా లుక్.. -
ఫస్ట్‌లుక్ 10th July 2018
-
రీ-షూట్ కోసం ఐదు కోట్ల ఖర్చు...!
టాప్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకటి బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కాగా, మరొకటి వీరనారి రాణీ లక్ష్మీ భాయ్ జీవితగాథ మణికర్ణిక. కంగనా రనౌత్ లీడ్ రోల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక ప్రస్తుతం రీషూట్ జరుపుకుంటోంది. గతేడాది మేలో షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. ఈ ఏడాది సమ్మర్లో రీలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కీలక సన్నివేశాల అవుట్ పుట్‌పై అసంతృప్తితో ఉన్న క్రిష్. రీషూట్ చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే రిలీజ్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం రీ షూట్ జరుపుకుంటుండగా, ఈ కారణంగా బడ్జెట్ మరో ఐదు కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, మణికర్ణికకు సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చిన విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరిపి మణికర్ణికను ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది కూడా. -
‘ఎన్టీఆర్’లో బెంగాలీ నటుడు
నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమా కోసం ఓ బెంగాలీ నటుడ్ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్ భర్తగా నటిస్తున్న జిష్షు సేన్‌గుప్తాను ఎన్టీఆర్‌లో కీలకపాత్రలకు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ నటుడిగా ఎదుగుతున్న రోజుల్లో ప్రొత్సహించిన ఎల్వీ ప్రసాద్ పాత్రలో జిష్షు కనిపించనున్నారు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ బాలీవుడ్ నటి విద్యాబాలన్, రానా దగ్గుబాటి, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్రలో నటించనున్నారు. -
విడాకులు తీసుకోనున్న డైరెక్టర్ క్రిష్..!
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లముడి రాధాకృష్ణ తన వివాహ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న క్రిష్ కొద్ది కాలంలోనే విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యారని తెలుస్తోంది. 2016 ఆగస్టులో వెలగ రమ్య అనే వైద్యురాలిని ఆయన వివాహం చేసుకున్నారు. అయితే క్రిష్, రమ్యలు పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. క్రిష్ దంపతులు విడాకులకు దరఖాస్తు చేయడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. క్రిష్ నిర్ణయంపై పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం క్రిష్ మణికర్ణిక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను కూడా క్రిష్ తెరకెక్కించనున్నారు. -
బోల్డ్ కథతో క్రిష్..?
గమ్యం, వేదం లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఘనవిజయం సాధించటంతో స్టార్ లీగ్‌లో చేరిపోయాడు. ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఝాన్సీ లక్ష్మీ భాయ్ కథతో మణికర్ణిక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత క్రిష్ ఓ బోల్డ్ కథతో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. కన్నడ రచయిత బైరప్ప రాసిన పర్వ అనే నవలను సినిమాగా రూపొందించేందుకు క్రిష్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రిష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మహాభారత గాథకు సంబంధించిన పాత్రల నేపథ్యంలో రాసిన పర్వలో పలు వివాదాస్పద విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే కథతో సినిమా రూపొందించే ఆలోచనలో ఉన్నాడట క్రిష్. అయితే క్రిష్ తన తదుపరి ప్రాజెక్ట్‌గానే పర్వను ఎంచుకుంటాడా..? లేక మరో సినిమాను తెర మీదకు తీసుకువస్తాడా చూడాలి. -
గుమ్మడికాయ కొట్టేశారు
ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు టీమ్ అందరూ ఒక ఫ్యామిలీలా ఉంటారు. లాస్ట్డే షూటింగ్ అంటే హ్యాపీగా సినిమా పూర్తయినందుకు ఒక్క పక్క ఆనందం, యూనిట్‌ని మిస్ అవుతున్నందుకు మరో పక్క బాధ. ప్రస్తుతం ఈ పరిస్థితులనే ఫేస్ చేస్తున్నారు ‘మణికర్ణిక’ టీమ్. కంగనా రనౌత్ టైటిల్ రోల్లో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఈ సినిమా షూటింగ్ జోథ్‌పూర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారంతో ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారట. ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెంటల్ హై క్యా’ చిత్రం కంగనా రనౌత్ నెక్ట్స్ మూవీ. ఆల్మోస్ట్ నాలుగేళ్ల తర్వాత రాజ్‌కుమార్ రావ్‌తో కలసి ఈ సినిమాలో నటిస్తున్నారు కంగనా. 2014లో వచ్చిన ‘క్వీన్’ మూవీలో కంగనా, రాజ్‌కుమార్ రావ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. -
నన్ను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు!
మంచివాడై , హ్యాండ్సమ్గా ఉండాలి. నవ్వుతూ, నవ్విస్తుండాలి. వంట వచ్చి ఉండాలి... ఇలా తమ కలల రాకుమారుడికి ఉండాల్సిన లక్షణాల గురించి అమ్మాయిలు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా తన బాయ్‌ఫ్రెండ్‌కు ఉండాల్సిన ఓ మేజర్ లక్షణం గురించి చెప్పారు. అదేమిటంటే.. తన బాయ్‌ఫ్రెండ్ కచ్చితంగా దేశభక్తుడై ఉండాలట. ‘‘నా దేశాన్ని నేనెంతగానో ప్రేమిస్తాను. ఒకవేళ నేను ప్రేమించే వ్యక్తి దేశభక్తుడు కాదని తెలిస్తే అతనికి బ్రేకప్ చెప్పేస్తా. కన్నభూమి పై అభిమానం లేనివాడు, నాతో విశ్వాసంగా ఉంటాడన్న నమ్మకం నాకు లేదు. నన్ను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. దేశాన్ని కూడా ప్రేమించాలి’’ అని చెప్పుకొచ్చారు కంగనా. అదండీ మేటర్. కంగనాకి ప్రపోజ్ చేయాలంటే దేశం మీద భక్తి ఉండాలి. సినిమాల సంగతి కొస్తే వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’, ప్రకాశ్ కొవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు కంగనా. -
రాణీగారు మళ్లీ బయటికొచ్చారు!
రాణి అంటే ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. అందంగా మాత్రమేనా? రాజసం ఉట్టిపడాలి. చూపులు చురకత్తుల్లా, నడక ఠీవీగా, మాటలు తెలివిగా ఉండాలి. అందుకే క్వీన్ పాత్రకు సాదాసీదా తారలను తీసుకోరు. కంగనా రనౌత్‌లా ఉండేవాళ్లనే తీసుకుంటారు. దర్శకుడు క్రిష్ తన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ కోసం ఆమెనే తీసుకున్నారు. ధీర వనిత ఝాన్సీలక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్ర చేస్తున్నారు కంగనా. ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరుగుతోందని సమాచారం. రాజదర్బార్ సీన్స్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు మళ్లీ బయటికొచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో భారీ ఆభరణాలతో కంగనా భలేగా ఉన్నారు కదూ. ఈ సంగతి ఇలా ఉంచితే ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. రాణీ లక్ష్మీభాయ్‌కు బ్రిటిష్ ఏజెంట్‌కు మధ్య అభ్యంతరకర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని మహారాష్ట్రకు చెందిన సర్వబ్రాహ్మణ సభ చేసిన ఫిర్యాదుకు మణికర్ణిక చిత్రబృందం స్పందించి, వివరణ ఇచ్చింది. దీంతో ఆ ఫిర్యాదు విరమించుకున్నారని బాలీవుడ్ టాక్. ‘‘రచయిత మిశ్రా నవల ఆధారంగా ‘మణికర్ణిక’ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు. చరిత్ర అంశాలను మార్చడం లేదు’’ అని చిత్రనిర్మాతల్లో ఒకరైన కమల్‌జైన్ తెలిపారు. -
మణికర్ణికలో కంగనా లుక్..
సాక్షి, న్యూఢిల్లీ : కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీపై అంచనాలు మిన్నంటాయి. దక్షిణాది సినీ విశ్లేషకులు రమేష్ బాల కంగనా మణికర్ణిక సెట్స్‌లో ఉన్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేయగా సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. ఝాన్సీ లక్ష్మీభాయ్గా ఆమె హుందాగా కనిపిస్తూ పాత్రలో ఒదిగిపోయారు. పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కధ సమకూర్చగా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. టీవీ నటి అంకితా లోఖండే తొలిసారిగా ఈ మూవీ ద్వారా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. సినిమాలో తమ పాత్రకు అనుగుణంగా వీరిద్దరూ గుర్రపు స్వారీలో శిక్షణ పొందారు. -
అహం బ్రహ్మస్మి
... అంటే నేనే బ్రహ్మ అని అర్థం. క్రిష్ ఇలానే అంటున్నారు. ‘అహం బ్రహ్మసి’ టైటిల్‌తో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరనారి రాణీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా ఆయన ‘మణికర్ణిక’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లక్ష్మీభాయ్గా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ హిస్టారికల్ మూవీని తెరకెక్కి స్తూనే తన నెక్ట్స్ సినిమా ‘అహం బ్రహ్మస్మి’కు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు క్రిష్. ఇదొక హై బడ్జెట్ కమర్షియల్ మూవీ అని సమాచారం. ఒక్క ‘వేదం’ మినహా క్రిష్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ‘గమ్యం’ నుంచి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వరకు అన్ని సినిమాలనూ నిర్మించిన సాయిబాబు జాగర్లముడి, రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో ఒక టాప్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు క్రిష్. ‘‘ఫుల్ టెక్నికల్ వేల్యూస్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. హీరో ఫైనలైజ్ అయిన తర్వాత మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం. ఆగస్టులో ఈ సినిమాను ప్రారంభించబోతున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
‘మణికర్ణిక’ పరిష్కారం క్రిష్ చేతిలోనే...
సాక్షి, సినిమా : టాలీవుడ్ టాలెండెట్ దర్శకుడు క్రిష్ జాగర్లముడి ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టు మణికర్ణికతో బిజీగా ఉన్నాడు. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా.. రాణి లక్ష్మీబాయి జీవితగాథగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తోంది. అయితే ఈ చిత్రానికి ఒప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్లో జాప్యం జరుగుతుండటంతో సమయానికి విడుదల కావటం అనుమానంగా మారింది. దీనికి తోడు వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉండటం.. ఈ పరిణామాల నేపథ్యంలో రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 27న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ చిత్రం విడుదల కాబోతోంది. ఒలంపిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావటంతో గోల్డ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో మణికర్ణిక-గోల్డ్ మధ్య గట్టి పోటీ తప్పదనే అనిపిస్తోంది. అయితే ఈ మధ్యే పద్మావత్ కోసం తన చిత్రాన్ని(ప్యాడ్ మ్యాన్) రిలీజ్‌ను వాయిదా వేసుకున్న అక్కీ.. మరోసారి ఆ పని చేయటమే అనుమానంగానే కనిపిస్తున్నప్పటికీ.. తనతో గబ్బర్ చిత్రానికి పని చేసిన క్రిష్.. మణికర్ణికకు దర్శకుడు కావటం.. వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఆ దిశగా చర్చలు జరిపితే వర్కవుట్ అవొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. -
సిస్టరాఫ్ పద్మావతి
రియల్‌గా కాదు లెండి. ఆ సంగతి మీకూ తెలుసు. పద్మావతికి మణికర్ణిక.. సిస్టర్ ఎందులోనంటే.. షూటింగ్ కష్టాలను ఈదడంలో! ఎడారిలో ఉండేది ఇసుక కదా, మరి ఈదడం ఏమిటి? రాజస్థానీలు అంతేలా ఉంది. చరిత్ర జోలికి వస్తే ఇసుకలో కూడా ఈత కొట్టించేసేయడం వారి ‘ఆచారం’ లా ఉంది! పద్మావతి షూటింగ్లో సెట్లూ అవీ పాడు చేశారు కదా. ఇప్పుడు ‘మణికర్ణిక’ సెట్లను అసలే వేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఝాన్సీరాణీ జీవిత కథనే ‘మణికర్ణిక’గా మన తెలుగు డైరెక్టర్ ‘క్రిష్’ హిందీలో తీస్తున్నారు. మణికర్ణికగా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం రాజస్థాన్ వచ్చి, ఎక్కడ సెట్టింగులు వేస్తారోనని అక్కడి ‘సర్వ బ్రాహ్మిన్ మహాసభ’ కార్యకర్తలు కర్రలు పట్టుకుని నిలుచుంటున్నారు. చరిత్రను వక్రీకరించే వారి ప్రయత్నాలను అడ్డుకోవాలని మహాసభ అధ్యక్షుడు రాజస్థాన్ ప్రభుత్వానికి ఇప్పటికే ఒక విజ్ఞప్తిని పంపారు. ఇవాళ (బుధవారం) కూడా ప్రభుత్వం స్పందించకపోతే రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్సింగ్నీ, హోమ్ మినిస్టర్ గులాబ్ చంద్ కటారియాను కలవాలని నిర్ణయించుకున్నారు. రాణీ లక్ష్మీబాయికి, ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ ఏజెంటుకు మధ్య లవ్ సీక్వెన్స్ లాంటిదేదో సినిమాలో ఉంటుందని వాళ్ల చెవిన పడిందట. అందుకే షూటింగ్‌ని జరగనివ్వకూడదని గట్టిగా డిసైడ్ అయినట్లున్నారు. పద్మావతి షూటింగ్ సమయంలో కూడా అక్కడి కర్ణిసేనవాళ్లకు ఇలాంటి డౌటే వచ్చింది.. పద్మావతి, ఖిల్జీల మధ్య దర్శకుడు భన్సాలీ తన క్రియేటివిటీతో లవ్‌ని రాజేస్తాడేమోనని! అలాంటిదేమీ లేదని పద్మావతి రిలీజ్ తర్వాత తేలింది కదా.. అంటే, ‘ముందే అభ్యంతరం చెప్పబట్టి.. భన్సాలీ ఆ సీన్‌ని పెట్టలేదు’ అని కర్ణిసేన వాదించింది. చూస్తుంటే.. మణికర్ణికకు కూడా కష్టాలు, బాలారిష్టాలు తప్పేలా ల